● కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ● జాత
రెబ్బెన(ఆసిఫాబాద్): ‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన జిల్లా, ఈ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉంది. ఇక్కడ నివసించే ఆది వాసీలు భూమి కోసం, భుక్తి కోసం ఎన్నో పోరాటా లు చేశారు. అలాంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం’ అని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కుమురంభీం జిల్లా రెబ్బెన మండలంలోని కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన ఎన్‌హెచ్– 363 ప్రారంభోత్సవ సభ విజయవంతమైంది. కుమురంభీం జిల్లాతోపాటు మంచిర్యాల, ఆది లాబాద్ జిల్లాల నుంచి బీజేపీ కార్యకర్తలు, ప్రజలు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. ‘అందరికీ నమస్కారం.. బాగున్నారా’ అంటూ కేంద్ర మంత్రి ప్రజ లను ఆత్మీయంగా తెలుగులో పలకరించారు. మంచిర్యాల జిల్లా నుంచి మహారాష్ట్ర సరిహద్దులోని కు మురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి వరకు నిర్మించిన నాలుగు వరుసల జాతీయ రహదారితోపాటు పలు సెక్షన్లలో చేపట్టిన పనులను కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించి జాతికి అంకితం చేశారు.అంతకుముందు ఉదయం 10.48 గంటలకు నాగ్‌పూర్ నుంచి హెలికాప్టర్ ద్వారా కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్దకు చేరుకున్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, అధికారులు ఘన స్వాగతం పలికారు. పోలీస్ సిబ్బంది గౌర వ వందనం స్వీకరించిన అనంతరం సభాస్థలికి చేరుకుని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఉదయం 11.47 గంటలకు రూ.3,900 కోట్లతో చేపట్టిన జాతీయ రహదారుల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ రాను న్న మూడేళ్లలో రూ.2లక్షల కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. గడిచిన పదేళ్లలో దేశంలో జరిగిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని, అసలైన సి నిమా ముందుందన్నారు. జాతీయ రహదారుల వి స్తరణతో అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. అన్ని రాష్ట్రాలను జాతీయ రహదారులతో అనుసంధా నం చేస్తామని, తెలంగాణలో రహదారులను మరింత అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్రంలో రూ.లక్ష కోట్లతో గ్రీన్‌వే నిర్మాణానికి కృషి చేస్తున్నామని, నాగ్‌పూర్ టు విజయవాడ వరకు చేపట్టే రహదారితో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, విజయవాడ మీదుగా రహదారి నిర్మిస్తున్నామన్నారు. నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు ఆరు వరుసల రహదారికి కృషిచేస్తున్నామని తెలిపారు. 2014 తర్వాత రాష్ట్రంలో రూ.వేల కోట్లతో రహదారులను అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదన్నారు. మధ్యాహ్నం 12.20 గంటల వరకు ప్రసంగించి, 12.30 గంటలకు కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ నుంచి కేంద్ర మంత్రి బయలుదేరి వెళ్లిపోయారు. కార్యక్రమాల్లో ఎంపీలు గోడం నగేశ్, గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు దండె విఠల్, మల్క కొమురయ్య, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్‌బాబు, పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, రామారావు పటేల్, ప్రేంసాగర్‌రావు, రోడ్డు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రావు, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, ఏఎస్పీ చిత్తరంజన్ తదితరులు పాల్గొన్నారు.


