అడవుల సంరక్షణ అందరి బాధ్యత
బోథ్: అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శరవణన్ అన్నారు. జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్‌తో కలిసి బోథ్ రేంజ్ పరిధిలో శుక్రవారం పర్యటించారు. అటవీశాఖ చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జీడిపల్లె రోడ్డులో ఈ ఏడాది నాటిన అవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించి మొక్కల సంరక్షణలో సిబ్బంది తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. చింతలబోరి వద్ద ఇటీవల పులి సంచరిస్తున్నట్లు గుర్తించిన ప్రాంతాలను పర్యవేక్షించారు. వన్యప్రాణుల కదలికలు, వాటి రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అటవీ సంరక్షణతో పాటు వన్యప్రాణుల రక్షణ విషయంలో శ్రద్ధ చూపాలన్నారు. వారి వెంట ఎఫ్‌ఆర్‌వో ప్రణయ్, అధికారులున్నారు.


