ఆ నిధులతో నార్నూర్‌ సమగ్రాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ఆ నిధులతో నార్నూర్‌ సమగ్రాభివృద్ధి

Jan 3 2026 7:01 AM | Updated on Jan 3 2026 7:01 AM

ఆ నిధులతో నార్నూర్‌ సమగ్రాభివృద్ధి

ఆ నిధులతో నార్నూర్‌ సమగ్రాభివృద్ధి

● కలెక్టర్‌ రాజర్షి షా

కైలాస్‌నగర్‌: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.5 కోట్ల రివార్డు నిధులను నార్నూర్‌ సమగ్రాభివృద్ధికి వినియోగించాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. నిధుల వినియోగంపై శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, నీతి ఆయోగ్‌ డేటా ర్యాంకింగ్స్‌లో దేశవ్యాప్తంగా నాలుగో స్థానం, దక్షిణాదిన తొలి స్థానం సాధించినందుకు గాను నార్నూర్‌కు కేంద్రం ఈ నిధులను విడుదల చేసిందన్నారు. ఈ విజయం జిల్లాకు గర్వకారణమన్నారు. తాత్కాలిక పనులకు కాకుండా గ్రామానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చేలా ఎంపిక చేయాలన్నారు. విద్య, ఆరోగ్యం, తాగునీటి సరఫరా వంటి రంగాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అన్ని శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించి, ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభించి, గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో ఐటీడీఏ పీవో యువరాజ్‌ మార్మట్‌, అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, డిప్యూటీ కలెక్టర్‌ వంశీకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

గురుకులాల విద్యార్థులకు క్రీడా,

సాంస్కృతిక పోటీలు

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల వి ద్యార్థులకు ఈ నెల 28, 29, 30 తేదీల్లో క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రాజర్షి షా తెలిపారు. కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్‌ సమావేశ మందిరంలో సంబంధిత అధికా రులతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బోథ్‌ సాంఘిక సంక్షేమ బాలి కల పాఠశాలలో నిర్వహించనున్న ఈపోటీల కోసం ప్రభుత్వం రూ.25లక్షలు మంజూరు చేసిందన్నారు. అండర్‌–17 విభాగంలో కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో అంశాల్లో పోటీలు ఉంటా యని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన క్రీడా దుస్తులు, షూ, క్యాప్స్‌, టీమ్‌ లోగోలు సిద్ధం చేయాలని, కార్యక్రమ నిర్వహణ ప్రదేశంలో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్లను ఏర్పాటు చే యాలని ఆదేశించారు. పోటీలపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజ యవంతం చేయాలన్నారు. ఇందులో ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈవో రాజేశ్వర్‌, డిప్యూటీ కలెక్టర్‌ వంశీకృష్ణ, జిల్లా ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు సునీత కు మారి, రాజలింగం, ఈడీ ఎస్సీ కార్పొరేషన్‌ మ నోహర్‌, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, గిరిజన సంక్షేమ శాఖ డీడీ అంబాజీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement