సోయా రైతుల సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్: సోయా రైతుల సమస్యను పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే, బీజేపీఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ విన్నవించారు. హైదరాబాద్‌లో శుక్రవారం కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రస్తుత వానకాలం సీజన్‌లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో సుమారు 6,200 మంది రైతుల నుంచి కేవలం 1.64 లక్షల క్వింటాళ్ల సోయా మాత్రమే కొనుగోలు చేశారని పేర్కొన్నారు. కోత దశలో కురిసిన భారీ వర్షాలతో పంట రంగు మారిందన్నారు. ని బంధనల పేరిట రంగు మారిన సోయా కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రత్యేక సడలింపులు ఇచ్చి రైతులకు న్యాయం చేయాలని కోరారు.


