
కేయూ తీరు.. విమర్శల పాలు
● నేటి నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ● ఒకరోజు ముందు హాల్‌టికెట్లు.. చివరి నిమిషంలో కేంద్రాల మార్పు ● మాది ఏ సెంటర్ అంటూ విద్యార్థుల్లో గందరగోళం
బోథ్: డిగ్రీపరీక్షల విషయంలో కాకతీయ యూని వర్సిటీ తీరు విమర్శలకు తావిస్తోంది. పరీక్షలు ప్రారంభమయ్యే ఒకరోజు ముందు హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో ఉంచడం, తీరా వాటిని విద్యార్థులకు పంపిణీ చేశాక.. కేంద్రాలు మార్చడంపై గందరగోళం నెలకొంది. కేయూ పరిధిలో బుధవారం నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు షురూ కానున్నా యి. జిల్లాలో బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ, బజా ర్‌హత్నూర్, గుడిహత్నూర్, ఉట్నూర్, ఆదిలా బాద్‌లో పరీక్ష కేంద్రాలను అధికారులు కేటా యించారు. ఆయాకేంద్రాల్లో పరీక్షలురాసే విద్యా ర్థుల హాల్‌టికెట్లను ఒకరోజు ముందు సంబంధిత కళాశాలలకు ఆన్‌లైన్‌లోఅందుబాటులో ఉం చారు. విద్యార్థులు ఉదయం కాలేజీకి వెళ్లి వాటి ని తీసకున్నారు. తీరా మధ్యాహ్నం 3.30గంటల ప్రాంతంలో వర్సిటీ అధికారులు దాదాపు అన్ని పరీక్ష కేంద్రాలను మార్చారు. దీంతో విద్యార్థులు తమది ఏ సెంటర్ అంటూ అయోమయానికి గు రవుతున్నారు.