
ట్రాక్టర్ల కొను‘గోల్‌మాల్’
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ట్రాక్ట ర్ల కొనుగోలుమాల్ చోటుచేసుకుంది. వాటిని సరఫ రా చేసిన కాంట్రాక్టర్‌కు బల్దియా అధికారులు బహిరంగ మార్కెట్ కంటే అధిక ధర చెల్లించడం ఇందు కు బలాన్ని చేకూరుస్తుంది. ఏదైన పనిచేసిన కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించేందుకు నెలల తరబడి తి ప్పుకునే అధికారులు ట్రాక్టర్లను సరఫరా చేసిన కాంట్రాక్టర్‌కు మాత్రం ట్రాలీలు అందించకుండానే అ డ్వాన్స్‌గా బిల్లులు పూర్తిగా చెల్లించడం అనుమానా లకు తావిస్తోంది. బల్దియాలోని ఓ కీలక అధికారి వెనుకుండి ఈ వ్యవహారాన్ని నడిపించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని పలు వార్డు ల నుంచి చెత్త సేకరణ కోసం మూడు కొత్త ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని బల్దియా అధికారులు నిర్ణయించారు. వాటి సరఫరా కోసం గతేడాది డిసెంబ ర్‌లో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆదిలాబా ద్‌కు చెందిన ఇద్దరు టెండర్లు దాఖలుచేశారు.ఇందు లో చింతామణి ఏజెన్సీకి చెందిన కాంట్రాక్టర్‌కు టెండర్ కట్టబెట్టారు. సదరు కాంట్రాక్టర్ సోనాలిక కంపెనీకి చెందిన డిఐ35ఆర్‌ఎక్స్ 40హెచ్‌పీ సామర్థ్యంతో కూడిన మూడు ట్రాక్టర్లను ఈ ఏడాది జనవరిలో మున్సిపాలిటీకి అప్పగించారు. కేవలం ఇంజన్లను మాత్రమే అందించారు. చెత్తసేకరణలో కీలకమైన ట్రాలీలను సరఫరా చేయకపోవడంతో మూడు నెలలుగా బల్దియా కార్యాలయ సమీపంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో వృథాగా దర్శనమిస్తున్నాయి.
షోరూం కంటే అధిక ధరకు ...
సోనాలిక కంపెనీ ట్రాక్టర్ ఇంజన్, ట్రాలీతో కలిపి షోరూం ధర రూ.9లక్షలుగా ఉంది. ఓ రైతు సంబంధిత ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు వెళ్లగా షోరూం ప్రతినిధులు ఆ ధరతో ట్రాక్టర్ డెలివరీ చేసేందుకు కొటేషన్ అందించారు. ఇందులో డీఐ 35 ఆర్‌ఎక్స్–హెచ్‌పీ 40 సామర్థ్యంతో కూడిన ఇంజన్‌తో పాటు టెంపరరీ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ కలిపి రూ. 6,70,000, ట్రాలీకి రూ.2,30,000కి గా అందులో పేర్కొన్నారు. బేరమాడితే ఇందులో నుంచి రూ. 50వేలు తగ్గించే అవకాశమున్నట్లు షోరూం ప్రతి నిధులు సదరు రైతుకు వెల్లడించారు. ఇదిలా ఉంటే బల్దియా అధికారులు కేవలం ఒక్కో ట్రాక్టర్ ఇంజన్‌కే రూ.8.70లక్షల చొప్పున మూడింటికి కలిపి రూ.26,10,000లను సదరు కాంట్రాక్టర్‌కు చెల్లించారు. జీఎస్టీతో కలిపి రూ.31,10,598లను బిల్లుగా అందజేశారు. వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ను బల్దియా నుంచే చెల్లించాల్సి ఉంటుందని ము న్సిపల్ అధికారులు చెబుతున్నారు. ట్రాలీ అందజే స్తే దానికి అందనంగా మరో సుమారు రూ.2.30లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈలెక్కన ఒక్కో ట్రాక్టర్‌కు రూ.11లక్షలను చెల్లించాల్సి వస్తోంది. ఇన్సూరెన్స్‌తో కలిపితే ఆ నిధులు మరింత అధికమమయ్యే అవకాశముంది. కంపెనీ షోరూం ధరతో పోల్చితే ఒక్కో ట్రాక్టర్‌కు సుమారు రూ.2.20లక్షలు అధికంగా చెల్లించినట్‌లైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిబంధనల ప్రకారం టెండర్ దాఖలు చేసే కాంట్రాక్టర్ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇస్తేనే తీసుకోవాల్సి ఉంటుంది. పైగా పలు కంపెనీలకు సంబంధించిన ధరలను పరిశీలించాకే టెండర్‌లో వాటి ధరను నమోదు చేసి టెండర్ దాఖలు చేయాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
బినామీగా.. ఆ అధికారి?
నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఈ కోనుగోల్‌మాల్‌లో బల్దియాకు సంబంధించిన ఓ అధికారి చక్రం తిప్పినట్లుగా ఆరోపణలున్నాయి. సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ పేరిట సదరు అధికారే బినామీగా టెండర్ దాఖలు చేసి ఈ వ్యవహారాన్ని నడిపించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే షోరూం కంటే అధిక ధరకు వాటిని కొనుగోలు చేయడంతో పాటు ట్రాలీలు సరఫరా చేయకుండానే అడ్వాన్స్‌గా కాంట్రాక్టర్‌కు బిల్లులు పూర్తిగా చెల్లించారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి ప్రజాధనం వృథా కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
షోరూం ధర కంటే అధికంగా చెల్లింపు
చక్రం తిప్పిన ఓ బల్దియా అధికారి?
ట్రాలీలు లేకుండానే అడ్వాన్స్‌గా బిల్లుల చెల్లింపు
ఆదిలాబాద్ బల్దియాలోని పరిస్థితి
నిబంధనలకు అనుగుణంగానే ..
ట్రాక్టర్ల కొనుగోలు కోసం నిబంధనల ప్రకారమే టెండర్ల ప్రక్రియ నిర్వహించాం. తక్కవ ధరకు కోడ్ చేసిన కాంట్రాక్టర్‌కే వాటి సరఫరా బాధ్యతలు అప్పగించాం. ఇంజన్లు మాత్రమే సరఫరా చేశారు. ట్రాలీలు రెండు మూడు రోజుల్లో రానున్నాయి. బహిరంగ మార్కెట్ ధర కంటే ఎక్కువకు కొనుగోలు చేశారనే దాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. – సీవీఎన్ రాజు,
మున్సిపల్ కమిషనర్, ఆదిలాబాద్

ట్రాక్టర్ల కొను‘గోల్‌మాల్’