అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు
కై లాస్‌నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా సత్వరం పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌తో కలిసి ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ వాటిని త్వరితగతిన పరిష్కరించేలా శ్రద్ధ వహించాలన్నా రు. అలాగే మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సమీక్షించి పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, ఉపాధి, భూభారతి సహా వివిధ విభాగాలకు సంబంధించి ఈ వారం మొత్తం 68 అర్జీలు అందినట్లుగా అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


