విద్యతోనే మంచి భవిష్యత్తు
నేరడిగొండ: విద్యతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. రోటరీ క్లబ్ సౌజన్యంతో మండలంలోని కుంటాల బాలికల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సోమవారం స్వెట్టర్లు, షూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను సాధించుకోవాలని సూచించారు. పాఠశాల నుంచి ‘ఇన్‌స్పైర్ అవార్డు’కు ఎంపికై న విద్యార్థిని వి.చిట్టికి ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. పాఠశాలలో ‘మైండ్‌స్పార్క్’ కార్యక్రమాన్ని పరిశీలించి ప్రధానోపాధ్యాయుడు అంబారావు, ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ కృష్ణవేణిలను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ ప్రెసిడెంట్ కళ్యాణ్, కార్యదర్శి లక్ష్మి, మెంబర్ ఝాన్సీ, బీజీఆర్ మైనింగ్ డైరెక్టర్ బాల కోట్‌రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


