నిబంధనలకు విరుద్ధంగా ప్రమాణ స్వీకారం
కై లాస్‌నగర్: నిబంధనలకు విరుద్ధంగా ప్రమాణ స్వీకారం చేయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సాత్నాల మండలంలోని తోయగూడ గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవా రం జిల్లా పంచాయతీ అధికారి రమేశ్‌ను కలిసి ఫి ర్యాదు చేశారు. సర్పంచ్ చౌహాన్ అనసూయకు బ దులుగా వార్డుమెంబర్ అయిన ఆమె కుమారుడు చౌహాన్ చరణ్‌సింగ్ ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. అలాగే 5వ నంబర్ వార్డుమెంబర్ ఈర్వే వందనకు బదులు ఆమె భర్త రవీందర్ ప్ర మాణ స్వీకారం చేశారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించిన సదరు వ్యక్తులతో పాటు అందుకు సహకరించిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేశ్‌రెడ్డి, గ్రామస్తులు ఆర్.దినేష్, సీహెచ్.ప్రవీణ్, ఉపేందర్ కుమార్ తదితరులున్నారు.
ప్రమాణ స్వీకారం వివాదాస్పదం
సాత్నాల: తోయగూడ సర్పంచ్ చౌహాన్ అనసూ య ప్రమాణ స్వీకారం వివాదాస్పదంగా మారింది. సర్పంచ్ ప్రమాణస్వీకారం చేస్తుండగా ఉచ్ఛరణలో తడబాటుకు గురికావడంతో ఇదే పాలకవర్గంలో వార్డు సభ్యుడిగా ఉన్న ఆమె తనయుడు ఆ మాటలను ఉచ్ఛరించడంపై గ్రామస్తులు ఆక్షేపణ వ్యక్తం చేశారు. డీపీవోకు ఫిర్యాదు చేశారు.


