రోడ్డెక్కిన రైతులు
కై లాస్‌నగర్: సోయా కొనుగోళ్లు చేపట్టాలనే డిమాండ్‌తో బేలలో రైతులు సోమవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. అన్ని వర్గాలు స్వచ్ఛందంగా మద్దతు తెలపగా.. వ్యాపార, వాణిజ్య సముదా యాలు తెరుచుకోలేదు. రైతుల నిరసనకు సంఘీభావం ప్రకటించారు. దీంతో మండల కేంద్రం నిర్మానుష్యంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును వ్యతిరేకిస్తూ రైతులు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. రెండు గంటల పాటు రహదారిని దిగ్బంధనం చేశారు. రాకపోకలు స్తంభించి కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జిల్లాలో వానాకాలం సీజన్‌లో దాదాపు 70వేల ఎకరాల్లో సోయా సాగు కాగా, 7లక్షల క్వింటాళ్ల మేర దిగుబడులు వచ్చాయని జెడ్పీ మాజీ చైర్ పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. మార్క్‌ఫెడ్ లక్ష 20వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి చేతులెత్తేసిందన్నారు. అధిక వర్షాలతో రంగు మారిన పంటను కొనుగోలు చేసి రైతుకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు రావుత్ మనోహర్, గంభీర్ ఠాక్రే, సతీశ్ పవార్, రాందాస్ నాక్లే, తేజ్‌రావ్ మస్కే, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డెక్కిన రైతులు


