మేజర్.. పల్స్
తెల్లారిన కూలీల బతుకులు..!
మంచిర్యాల జిల్లా ఇందారం క్రాస్ రోడ్డు సమీపంలో బొలేరో వాహనాన్ని బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృత్యువాత పడ్డారు.
పాన్ ఇండియా ప్రస్థానం!
సింగరేణి ప్రస్థానం పాన్ ఇండియా స్థాయికి చేరింది. నవరత్న కంపెనీలకు దీటుగా నిలుస్తోంది. నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం.
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
కై లాస్‌నగర్: ఎట్టకేలకు పల్లెకు కళ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఆయా జీపీల్లో నూతన పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డుమెంబర్లుగా గెలుపొందిన వారిలో ఒక సర్పంచ్, కొందరు వార్డు సభ్యులు మినహా మిగిలిన వారంతా సోమవారం ప్రత్యేక అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. కుటుంబీకులు, అభిమానులు, బంధువులతో కలిసి నిర్ణీత సమయానికి వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారిని అధికారులు పూలమాల, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. నూతన పాలకవర్గాలు కొలువుదీరడంతో 22 నెలల పాటు పంచాయతీల్లో కొనసాగిన స్పెషలాఫీసర్ల పాలనకు తెరపడింది. బాధ్యతల స్వీకరణకు ముందు గ్రామాల్లో పలువురు సర్పంచ్‌లు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. పండుగలా సాగిన పాలకవర్గాల ప్రమాణ స్వీకారంతో పల్లెల్లో సందడి వాతావరణం కనిపించింది. కాగా సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, మెజార్టీ వార్డు సభ్యులు వేర్వేరు పార్టీల మద్దతుదారులు గెలుపొందిన చోట్ల ప్రమాణ స్వీకార ప్రక్రియ ఆలస్యంగా సాగింది. సర్పంచ్‌లు తొలుత ప్రమాణ స్వీకారం చేయగా, ఆలస్యంగా వచ్చిన సభ్యులతో అధికారులు అనంతరం ప్రమాణం చేయించారు. కాగా కొన్ని చోట్ల సర్పంచ్‌లుగా గెలుపొందిన తల్లుల స్థానంలో కొడుకులు, భార్యల స్థానంలో భర్తలు ప్రమాణ స్వీకారం చేసినట్లుగా తెలిసింది. వారి స్థానాల్లో ప్రజాప్రతినిధుల్లా కుటుంబీకులు కూర్చున్నట్లుగా సమాచారం.
ప్రమాణ స్వీకారానికి దూరంగా ఓ సర్పంచ్.. 32 మంది వార్డు సభ్యులు
జిల్లాలో 473 గ్రామ పంచాయతీలు ఉండగా తలమడుగు మండలం రుయ్యాడి పంచాయతీ సర్పంచ్ ఎన్నిక జరగలేదు. గుడిహత్నూర్ మండలం శాంతా పూర్ సర్పంచ్‌గా గెలిచిన వ్యక్తితో పాటు 2,6,7,8 వార్డుమెంబర్లు కాశీ తీర్థయాత్రకు వెళ్లడంతో ప్రమాణ స్వీకారం చేయలేదు. జిల్లాలో మొత్తం 3,870 వార్డు స్థానాలకు గాను 3,857 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఇందులో 3,825 మంది ప్రమాణ స్వీకారం చేయగా మరో 32 మంది వివిధ కారణాలతో ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. రుయ్యాడిలో ఐదు వార్డు స్థానాలకు, జైనథ్ మండలం కూర గ్రామంలో 3 వార్డులకు, ఉట్నూర్ మండలం నర్సాపూర్ పంచాయతీలోని 7,8,9 వార్డులకు, బేల మండలం సదల్‌పూర్‌లో ఒక స్థానానికి నామినేషన్ రాలేదు. బజార్‌హత్నూర్ మండలం గేర్జాయిలో ఒకరు, దహెగాంలో ఒకరు, బోథ్ మండలం కుచులాపూర్‌లో 1,2 వార్డుమెంబర్లు వ్యక్తిగత కారణాలతో ప్రమాణం చేయలేదు. కరత్వాడలో ఇద్దరు, బాబెరతండాలో ఐదుగురు ఆసుపత్రులకు వెళ్లడం ద్వారా ప్రమాణ స్వీకారం చేయలేదు. గుడిహత్నూర్ మండలం మన్నూర్‌లో 2వవార్డు, ఉమ్రిలో 3,6 వార్డులు, డొంగర్‌గావ్‌లో 7వ వార్డు, కమలాపూర్‌లో 1,5,6,8 వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయలేదు. నార్నూర్ మండలం చోర్‌గావ్‌లో 2,3 వార్డులు, ఖైర్‌దట్వాలో 2వ వార్డు మెంబర్ అందుబాటులో లేరు. సాత్నాల మండలం పార్డి–కేలో 2,3, పార్డి–బిలో ఒకరు, సాంగ్విలో ఐదుగురు చొప్పున వార్డు సభ్యులు వ్యక్తిగత కారణాలతో ప్రమాణ స్వీకారం చేయలేదు. ఉట్నూర్ మండలంలో బాబాపూర్‌లో 4వ వార్డు, జైత్రాం తండాలో 8వవార్డు సభ్యులు అనారోగ్య కారణాలతో ప్రమాణ స్వీకారం చేయలేదు.
ఎన్నికల్లో అనేక హామీలిచ్చి ఓటరు దేవుళ్ల ఆశీర్వాదంతో గెలుపొందిన సర్పంచ్‌లు సోమవారం పల్లె పగ్గాలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఆయా మేజర్ జీపీల్లో గ్రామ ప్రథమ పౌరులుగా కొలువుదీరిన వారు పంచాయతీల అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తారో ‘సాక్షి’తో వెల్లడించారు ఇలా..
ప్రమాణ స్వీకారం చేసిన వార్డు సభ్యులు : 3,825
మేజర్.. పల్స్


