వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రి వేళలో చలి తీవ్రతతో పాటు గాలిలో తేమశాతం పెరగనుంది.
మౌలిక వసతుల కల్పనకు కృషి
ఇంద్రవెల్లి: గ్రామంలో మౌలి క వసతుల కల్పనతో పాటు పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా. మండలకేంద్రంలో అసంపూర్తిగా ఉన్న డ్రెయినేజీ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తా. అలాగే గ్రామ మధ్యలో ఉన్న వాగు వరద ఇళ్లలోకి రాకుండా తగు చర్యలు చేపడతా.
– రాథోడ్ మోహన్‌సింగ్, సర్పంచ్, ఇంద్రవెల్లి
ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా
నేరడిగొండ: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సహకారంతో జిల్లాలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా. అలాగే మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న సర్వీసు రోడ్ల పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తా. వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ వద్ద మరుగుదొడ్లు నిర్మిస్తాం. – ఏలేటి నీలిమ రవీందర్‌రెడ్డి,
సర్పంచ్, నేరడిగొండ
హామీలన్నీ నెరవేరుస్తా..
ఉట్నూర్‌రూరల్: అందరి సహకారంతో గ్రామంలోని ఆయా సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా. అలాగే ఎన్నికల
సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ ప్రాధాన్యత ప్రకారం నెరవే రుస్తా. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ పంచాయతీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో పాటుపడతా.
– అనిత, సర్పంచ్, ఉట్నూర్
వాతావరణం
వాతావరణం


