
బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీలొద్దు
ఆదిలాబాద్‌టౌన్: అనుమతి లేకుండా బహిరంగ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఏడాది జైలు, రూ.5వేల వరకు జరిమానా విధించే అవకాశముందని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం వన్‌టౌన్‌లో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ శాఖ తరఫున ఏర్పాటు చేసిన ప్రదేశంలో రుసుం చెల్లించి అనుమతి తీసుకున్నాకే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు మాట్లాడుతూ.. ప్రమాదాలకు కారణమయ్యే ప్లాస్టిక్ ఫ్లెక్సీల ఏర్పాటు నిషేధమని తెలిపారు. వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ పాల్గొన్నారు.