
లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నా లుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 44 చట్టా లను యథావిధిగా కొనసాగించాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి గణేశ్ డిమాండ్ చే శారు. జిల్లా కేంద్రంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఎర్రజి హరీశ్, నాయకులు అంకిత్, విక్రమ్ ఉన్నారు.
ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో గు రువారం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్య తిరేకంగా కార్మికులంతా పోరాడాలని పిలుపునిచ్చా రు. నాయకులు గౌరాల సుభాష్, మారుతి, నర్సింగ్, దేవిదాస్, రాజు, విక్రమ్ తదితరులున్నారు.
కార్పొరేట్లకు అనుగుణంగా 29 కార్మిక చట్టాలు, నాలుగు లేబర్ కోడ్‌లు తీసుకురావడం సమంజసం కాదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల ఉద్యోగ భద్రతను కేంద్రం దూరం చేస్తోందని ఆరోపించారు. కార్మికులంతా ఐకమత్యంతో పోరాడి సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తా త్రే, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్, నాయకులు రేసు సురేందర్, పండుగ పోచన్న, కే రమేశ్, ఆశన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నేళ్ల స్వామి, గంగారాం తదితరులు పాల్గొన్నారు.