Telangana
-
సీఎం రేవంత్ ఓఎస్డీనంటూ బెదిరింపులు.. మాజీ క్రికెటర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ఓఎస్డీ పేరుతో బెదిరింపులకు దిగుతున్న శ్రీకాకుళానికి చెందిన ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం యవ్వారిపేటకు చెందిన నాగరాజు ర్యాపిడో, కంట్రీ డిలైట్ ఎండీలకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తాను సీఎం ఓఎస్డీ అని చెప్పుకొంటూ పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ఛైర్మన్లకు వాట్సాప్ మెసేజ్‌లు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఓఎస్డీ పేరుతో నాగరాజు ఫేక్ ఈ మెయిల్ క్రియేట్ చేసినట్టు పోలీసులు నిర్థారించారు. నాగరాజును శ్రీకాకుళంలోఅదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ క్రికెటర్ నాగరాజుపై 30 కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళంలో నాగరాజును అరెస్ట్ చేసిన పోలీసులు.. హైదరాబాద్‌కు తరలించారు. -
కేసీఆర్‌కు కవిత లేఖ.. ఆది శ్రీనివాస్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో ముసలం తారాస్థాయికి చేరుకుందని.. కల్వకుంట్ల కవిత రాసిన లేఖతో లుకలుకలు బయటపడ్డాయంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందంటూ మేం చెబుతున్న మాటలను కవిత సమర్థించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్ సిద్దమతున్నారని కవిత చెప్పకనే చెప్పింది. బీజేపీపైన పల్లెతు మాట మాట్లాడకుండా.. కేసీఆర్ వ్యవహరించిన తీరును కవిత కడిగి పారేసింది’’ అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.‘‘భవిష్యత్తులో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయి. బీఆర్ఎస్ బలహీనపడటం వల్లనే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నట్లు కవిత అంగీకరించారు. కవిత పచ్చి నిజాలు మాట్లాడారు.. ఆ మాటలనే మేం చాలా కాలంగా చెబుతున్నాం. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నియంతృత్వ వైఖరిని కూడా కవిత నిలదీశారు. పార్టీ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ ఒక్కరే ప్రసంగించడాన్ని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ వైఖరిని ఆయన కూతురే తప్పుపడుతోంది. ఇక ప్రజలకు వాళ్లేమీ సమాధానం చెబుతారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని కవిత తేల్చి చెప్పింది’’ అని ఆది శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.‘‘పార్టీ నాయకులను కలవకుండా ఏకపక్ష పోకడలకు పోతున్నారని ఆమె ధ్వజమెత్తారు. కవిత లేఖ పైన బీఆర్ఎస్ నాయకత్వం స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలి. మా సీఎం రేవంత్ రెడ్డి మీద ఒంటి కాలిపైన లేస్తున్న కేటీఆర్ ముందు తన చెల్లికి సమాధానం చెప్పాలి. కవితకు సమాధానం చెప్పకుండా ఇతర పార్టీలను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదు. కల్వకుంట్ల కుటుంబంలో లుకలుకలు ఉన్నాయి. అలిగిన హరీష్ రావు ఇంటికి వెళ్లి కేటీఆర్ బతిమాలుకున్నాడు...కవిత లేఖతో బీఆర్ఎస్ పార్టీ ఇద్దరికి మాత్రమే పరిమితం అయిందని తేలింది. గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన దోపిడి గురించి కూడా కవిత ప్రశ్నిస్తే బాగుంటుంది. పంపకాలు, పదవుల్లో తేడా వచ్చి కుటుంబంలో లేఖలు రాసుకుంటున్నారు. బీఆర్ఎస్ పని ఇక అయిపోయింది. కేటీఆర్.. ముందు నీ ఇళ్లు సరిదిద్దుకో. అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్‌లోనే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యాడు. కేసీఆర్ తీరును ఆయన కూతురే తప్పుపడుతోంది.. ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలి.’’ అంటూ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. -
‘మై డియర్ డాడీ’ అంటూ.. కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. వరంగల్ సభ సక్సెస్ అయ్యిందంటూనే లేఖ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్‌కు ఆరు పేజీల లేఖలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మై డియర్ డాడీ అంటూ కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖలో వరంగల్ సభ సక్సెస్ అయ్యిందంటూనే.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని నిర్వహించింది. ఆ వేడుకలపై తన అభిప్రాయాలను తెలుపుతూ మే 2న కేసీఆర్‌కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారు. సభపై పాజిటీవ్, నెగిటీవ్ అంశాలను ఆ లేఖలో పేర్కొన్నారు. 👉పాజిటీవ్ అంశాలు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ విజయవంతం కావడంపై మీకు నా హృదయపూర్వక అభినందనలు. సిల్వర్ జూబ్లీ తర్వాత కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి, వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నానుసిల్వర్ జూబ్లీ వేడుకల్లో మీ ప్రసంగంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపించింది మీ ప్రసంగం మొదటి నుంచి చివరి వరకు అందరూ శ్రద్ధగా విన్నారు‘ఆపరేషన్ కగార్’ గురించి మీరు మాట్లాడిన విధానం అందరికి నచ్చింది మీరు చెప్పిన ‘కాంగ్రెస్ ఫెయిల్ ఫెయిల్’ అన్న మాట బాగా పాపులర్ అయిందిపహల్గాం బాధితుల కోసం మీరు మౌనం పాటించడంపై అభినందనలు వెల్లువెత్తాయిరేవంత్ రెడ్డిని మీరు పేరు పెట్టి విమర్శించకపోవడం అందరినీ ఆకట్టుకుంది. రేవంత్ రోజూ మిమ్మల్ని విమర్శిస్తున్నా మీరు గౌరవంగా స్పందించారన్న అభిప్రాయం అందరిలో నెలకొంది. తెలంగాణ అంటే బీఆర్ఎస్.. తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు మరింత బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారుతెలంగాణ తల్లి విగ్రహం మార్పు, రాష్ట్ర గీతంపై మాట్లాడుతారని ఆశించారుఅయినప్పటికీ నాయకులు, క్యాడర్ మాత్రం మీ సభ మీద సంతృప్తిగా ఉన్నారు పోలీసులను మీరు హెచ్చరించిన మాటలు బాగా గుర్తుండిపోయాయి.👉నెగిటీవ్ అంశాలు :ఉర్దూలో మాట్లాడకపోవడం.వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడంబీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావించలేదుఎస్సీ వర్గీకరణపై మాట్లాడలేదు.పాత ఇన్ఛార్జులకు బాధ్యతలు ఇచ్చిన కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో సరిగా ఏర్పాట్లు జరగలేకపోయాయి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కేడర్‌ను పట్టించుకోలేదు.పంచాయతీ ఎన్నికల బి-ఫారాల విషయంలో పాత ఇన్ఛార్జులకే బి-ఫారాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కొత్త ఆశావహుల మధ్య అసంతృప్తిని కలిగిస్తోంది.కింది స్థాయి నాయకులు మీతో ఫోటో తీసుకోవాలనే ఉత్సాహాన్ని చూపించారు. కానీ వారికీ ఆ అవకాశం లేకపోవడం మీ దగ్గరకు రాక మానేశారు. కొంతమందికే అనే ఫీలింగ్ ఉంది. దయచేసి అందరికి అవకాశం ఇవ్వండి.2001 నుండి మీతో ఉన్న సీనియర్ నాయకులకు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం ఉంది.‘ధూమ్ ధాం’ కార్యక్రమం క్యాడర్‌ను ఆకట్టుకోలేకపోయింది.బీజేపీపై మీరు రెండు నిమిషాలే మాట్లాడడం వల్ల.. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.కాంగ్రెస్ క్రింద స్థాయిలో ప్రజాభిమానం కోల్పోయింది. కానీ బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్న అభిప్రాయం క్యాడర్లో ఉంది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లే బీఆర్ఎస్.. బీజేపీకి సహకరించిందంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.👉అందరూ ఆశించిన విషయం:ప్రస్తుత రాజకీయాలపై మీరు శ్రేణులకు స్పష్టమైన కార్యక్రమాలు, దిశానిర్ధేశం ఇవ్వాలని అనుకున్నారు.👉సూచన:కనీసం ఇప్పటికైనా ఒక ప్లీనరీ నిర్వహించి ఒకటి,రెండు రోజులపాటు క్యాడర్ అభిప్రాయాలు వినాలి. వారికి భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇవ్వాలి. దయచేసి దీన్ని సీరియస్‌గా పరిగణించండి’ అని కేసీఆర్‌కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారంటూ ఆరు పేజీల లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ లేఖపై బీఆర్ఎస్ లేదంటే, ఎమ్మెల్సీ కవిత అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
కొత్త మెట్రో లైన్లు.. ఎన్వీఎస్రెడ్డి కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: కొత్త మెట్రో లైన్లపై మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి కీలక ప్రకటన చేశారు. మేడ్చల్, శామీర్ పేట్, ఫ్యూచర్ సిటీ మెట్రో రైల్ డీపీఆర్ సిద్ధమయ్యాయని.. ఫేజ్-2పై ఎటువంటి సందిగ్ధత లేదని స్పష్టంర చేశారు.మెట్రో రెండో దశ డీపీఆర్‌లు పూర్తి స్థాయిలో సిద్ధం. ప్రస్తుతం డీపీఆర్‌లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం వరకు గోప్యత ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వం ఈ డీపీఆర్‌లను ఆమోదించి, కేంద్రానికి సమర్పించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
‘సీఎం రేవంత్ పనైపోయింది.. అదొక లొట్టపీసు కేసు’
సాక్షి, తెలంగాణ భవన్: లొట్టపీసు కేసులతో సీఎం రేవంత్ చేసేది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణాలు, ఇతర అంశాలపై మాట్లాడారు. ‘తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బ్యారేజ్‌లో రెండు పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారు. టైమ్ పాస్ కోసమే కమిషన్ నోటీసులు పంపింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు అందాయో? లేదో? తెలియదు. కాళేశ్వరం విషయంలో నిజం నిలకడగా తేలుతుంది.మిస్ వరల్డ్ ప్లెక్సీలో రేవంత్ రెడ్డి ,బట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు ఫొటోలు ఉన్నాయి. వీరిలో ఎవరు మిస్ వరల్డో అర్థం కావడం లేదు. కమిషన్లు దండుకోవడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది.కేసీఆర్ వరంగల్‌కు కదలగానే ఈ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. అందుకే కమిషన్ నోటీసుల పేరుతో డైవర్ట్ పాలిటిక్స్ చేసేందుకు సిద్ధమయ్యారు.కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిజం నిలకడగా తెలుస్తుంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనైపోయింది. లొట్టపిసు కేసులతో ఏం కాదు. కోటిమంది మహిళలను కోటీశ్వరలను చేస్తామని అంటున్నారు. అవి అలవికాని హామీలు. ప్రతిపక్షంలో ఉంటూ రేవంత్ నిద్ర పట్టకుండా చేస్తున్నాం. ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని నిలదీస్తున్నాం’ అని అన్నారు. జూన్ ,జూలైలో బీఆర్ఎస్ నూతన మెంబర్షిప్ ప్రారంభమవుతుంది. ఆ తరువాత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. పార్టీ బలోపేతం కోసం అందరం కలిసి కట్టుగా చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశా నిర్ధేశం చేశారు. -
నోటీసులపై ఏం చేద్దాం?.. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో హరీష్‌రావు భేటీ
సాక్షి, సిద్ధిపేట జిల్లా: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన హరీష్‌రావు.. సుమారు మూడు గంటల పాటు కేసీఆర్‌తో మంతనాలు సాగించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై స్పందించాలా? వద్దా? అన్న దానిపై చర్చించినట్లు సమాచారం. కమిషన్ విచారణకు వెళ్లాలా? లేదా? అన్న దానిపై కూడా మంతనాలు జరిపినట్లు తెలిసింది.కాగా, ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు, ఇతరులను కమిషన్ విచారించింది. బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు నోటీసులు జారీ చేసింది. జూన్ 5వ తేదీన విచారణకు హాజరుకావాలని తెలిపింది.బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు సైతం నోటీసులు ఇచ్చింది. ముగ్గురికీ వేర్వేరుగా మూడు పేజీలున్న నోటీసులను మెసెంజర్ ద్వారా అలాగే రిజిస్టర్ పోస్టులోనూ పంపింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని సూచించింది. జూన్ 6న హాజరుకావాలని హరీశ్‌రావుకు, 9వ తేదీన రమ్మని ఈటల రాజేందర్‌కు తెలిపింది.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్న ప్రభుత్వం, సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు గత ఏడాది మార్చిలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. బరాజ్‌ల నాణ్యతపై కూడా విచారించాలని సూచించింది. దీనిపై దాదాపుగా విచారణ పూర్తి చేసిన కమిషన్, రెండుమూడు రోజుల్లో నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోందని భావిస్తున్న తరుణంలో.. కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
అంగరంగ వైభవంగా మానస వివాహం (ఫొటోలు)
పెద్దపల్లి రూరల్: కలెక్టరే పెళ్లి పెద్ద అయ్యారు. అధికారులే అయినవాళ్లయ్యారు. తమ ఇంటి ఆడపడుచులా అక్కున చేర్చుకున్నారు. అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. రామగుండం ప్రాంతానికి చెందిన తబితా ఆశ్రమంలో ఉంటున్న నక్క మానస వివాహం.. రాజేశ్‌తో కలెక్టరేట్లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయిన నక్క మానస, నక్క లక్ష్మి అక్కాచెల్లెళ్లు. వీరు 16 ఏళ్లుగా తబితా ఆశ్రమంలో ఉంటున్నారు. మానసకు వివాహం నిశ్చయం కావడంతో వివాహతంతు జరిపించేందుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్టరేట్ ఆవరణలోని శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని వివాహవేదిక చేశారు. అర్చకుల మంత్రోచ్ఛారణలు, బాజాభజంత్రీల మధ్య ఉదయం 11.05 గంటలకు వివాహం ఘనంగా జరిగింది. కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయరమణారావు, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్ కలెక్టర్ వేణు, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ సహా పలుశాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో సేకరించిన రూ.61,800 విలువైన చెక్కును కలెక్టర్ శ్రీహర్ష వధూవరులకు అందించారు. వరుడి బం««ధుమిత్రులతో పాటు మోచి సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, కార్యదర్శి రాజు, ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు.. మోచికుల ఆ«రాధ్య దైవమైన సంత్ రవిదాస్ హరలయ్య జ్ఞాపికను వధూవరులకు అందజేశారు. -
నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని గతంలో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రెండోసారి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో విచారణ నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కావడం గమనార్హం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బేగంబజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు హాజరయ్యారు. నల్గొండ టూ టౌన్ పీఎస్, బేగంబజార్ పీఎస్, మెదక్ జిల్లా కౌడిపల్లి పీఎస్ పరిధిలో నమోదైన మూడు కేసుల్లో వ్యక్తిగతంగా జడ్జి ముందు హాజరయ్యారు. సీఎం కోర్టుకు హాజరు కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు హాల్ దగ్గరకు ఇతరులను అనుమతించలేదు. రేవంత్ రెడ్డిపై ఈ కేసులు నమోదైన సమయంలో ఆయన పీసీసీ చీఫ్‌గా ఉన్నారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. పోలీసులు చెప్తున్నవి అన్నీ కూడా అవాస్తవాలు. తాను ఎక్కడ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కోర్టు నమోదు చేసుకుంది. ఈ మేరకు జూన్ 12వ తేదీన నాంపల్లి స్పెషల్ కోర్టు తీర్పు ప్రకటించనుంది. ఇక, విచారణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కోర్టు నుంచి తిరిగి వెళ్ళిపోయారు. -
Operation Kagar: మావోళ్లు ఎలా ఉన్నరో?
సాక్షి, పెద్దపల్లి: మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వారికి కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో నెత్తురోడుతోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా 2024 జనవరిలో కేంద్ర బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో చోటుచేసుకుంటున్న ఎదురుకాల్పుల్లో సుమారు 300మందికి పైగా మా వోయిస్టులు మృతిచెందారు. ప్రభుత్వ దూకుడు, పె రుగుతున్న నిర్బంధం, వరుస ఎన్కౌంటర్లతో ఎ ప్పుడు ఏం జరుగుతుందోనని అజ్ఞాత మావోయి స్టు కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మృతిచెందడంతో జిల్లా నేతల క్షేమసమాచారంపై బంధువుల్లో ఆందోళన నెలకొంది. భయపెడుతున్న ఘటనలు మావోయిస్టుల అంతమే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్‌లో దూ సుకుపోతున్న భద్రతాదళాలకు మనజిల్లాకు చెంది న నేతలు కొరకరాని కొయ్యలా మారారు. కేంద్ర కమిటీతోపాటు వివిధ కీలక స్థానాల్లో మన జిల్లావా సులు దండాకారణ్యంలో కార్యకలాపాలు కొనసాగి స్తున్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా జనతన స ర్కార్ను స్థాపించారు. అయితే, మావోయిస్టుల విస్తరణకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో 2009తో ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. అప్పటినుంచి దేశవ్యాప్తంగా ముమ్మరంగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ సాగిస్తోంది. తాజాగా ప్రభు త్వం ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించింది. సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, డీఆర్జీ, సీ–60, ఎస్‌వోజీ, స్పెషల్ టాస్‌్కఫోర్స్ పేరుతో అడవులను జల్లెడ పడుతున్నా యి. దీంతో ఏడాదిన్నర కాలంలోనే 300 మందికిపైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతిచెందా రు. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు ఉన్నట్లు ప్రచారం జరిగినా త్రుటిలో తప్పించుకుంటున్నారు. ఇటీవల జూలపల్లికి చెందిన పుల్లూరి ప్రసాద్‌రావు ఉరఫ్ చంద్రన్న మృతిచెందారని ప్రచారం జరిగినా ఇంకా నిర్ధారణ కాలేదు. జిల్లావాసులే కీలకం పెద్దపల్లి జిల్లాలకు చెందిన పలువురు మావోయిస్టులు కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. కిష్టంపేట గ్రామానికి చెందిన కంకణాల రాజిరెడ్డి, జాలపల్లి మండలం వడ్కా పూర్ గ్రామానికి చెందిన పుల్లూరి ప్రసాద్‌రావు ఉరఫ్ చంద్రన్న, పెద్దపల్లికి చెందిన మల్లోజుల వేణుగోపాలరావు ఉరఫ్ భూపతి, జూలపల్లి మండలం వెంకట్రాపుపల్లికి చెందిన దీకొండ శంకర్, పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన గంకిడి సత్యనారాయణరెడ్డి ఉరఫ్ విజయ్, పాలితం గ్రానికి చెందిన అలేటి రామలచ్చులు, రామగుండం మండలానికి చెందిన అప్పాసి నారాయణ ఉరఫ్ రమేశ్, గోపయ్యపల్లికి చెందిన దళ కమాండర్ దాతు ఐలయ్య, సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన జువ్వాడి వెంకటేశ్వర్రావు, మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన మల్ల రాజిరెడ్డి ఉరఫ్ మీసాల రాజన్న తదితరులు ఉన్నారు. ఎక్కడ, ఎప్పుడు ఎలాంటి ఎన్కౌంటర్ జరిగినా ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసుల్లో ఆందోళన నెలకొంటోంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ప్రభాకర్ రావుకు ప్రోక్లేయిమ్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో, జూన్ 28వ తేదీలోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించకుండా ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యూలర్, రెడ్ కార్నర్, పాస్ పోర్టు రద్దు సహా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పలు పిటిషన్లలో వెల్లడించారు. ఈ క్రమంలోనే నాన్ బెయిల్ వారెంట్ జారీ కావడంతో ప్రకటిత నేరస్థుడి(ప్రోక్లేయిమ్ అఫెండర్)గా ప్రకటించాలని కోరుతూ జనవరిలో పిటిషన్ దాఖలు చేశారు.తాజాగా ఈ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు ఆమోదించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జూన్ 28వ తేదీలోగా హాజరుకాకపోతే ఆయనకు సంబంధించిన ఆస్తులను కోర్టు తన అధీనంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఆస్తులను పోలీసులు జప్తు చేయనున్నారు. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. ఆ తర్వాత బహిరంగంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
హైడ్రా కూల్చివేతలు.. బోడుప్పల్లో కబ్జాలు..
సాక్షి, మేడ్చల్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం.. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్‌లో స్మశాన వాటికల్లోని కొంత భూమిని కొందరు ఆక్రమించారు. అక్కడ అక్రమ నిర్మాణాలను చేపట్టారు. సర్వే నంబర్లు 1, 12లోని స్మశాన వాటికల్లోని భూములను కబ్జా చేసి కబ్జాదారులు వాటని విక్రయిస్తున్నారు. గత రెండేళ్లుగా కబ్జాలు జరుగుతున్నాయి. దీంతో, స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అనంతరం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం మధ్యాహ్నం బోడుప్పల్, పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పర్యటించారు. అక్రమ నిర్మాణాలు, కబ్జాలు జరిగినట్టు గుర్తించారు.ఈ నేపథ్యంలో అక్కడ అక్రమ నిర్మాణాలను తొలగస్తామని రంగనాథ్.. స్థానికులకు హామీ ఇచ్చారు. గురువారం ఉదయమే హైడ్రా అధికారులు అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై హైడ్రా స్పందించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అంతకుముందు, బుధవారం ఉదయం మేడిపల్లిలోని సేజ్ స్కూల్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. -
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)
-
ఢిల్లీ అతలాకుతలం.. తెలంగాణలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: మండు వేసవిలో దేశవ్యాప్తంగా అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాకాలం నాటి పరిస్థితులు వేసవిలో కనిపిస్తున్నాయి. ఢిల్లీ, తెలుగు రాష్ట్రాలు సహా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, ఢిల్లీలో బలమైన గాలులు, వడగళ్ల వానతో నగరం మొత్తం అస్తవ్యస్తంగా మారింది. ఈదురు గాలులకు చెట్లు, హోర్డింగ్‌లు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు.. చెట్లు కూలడంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని ఏరియాల్లో మెట్రో సేవలు కూడా నిలిచిపోయాయి. ఇటు తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.ఢిల్లీలో బుధవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటకు 70కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో ఏకంగా గంటకు 80 కిలీమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. లోదీ రోడ్లో వడగళ్ల వాన పడింది. ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టు సహా పలు విమానయాన సంస్థలు ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. విమాన సర్వీసులపై ప్రభావం పడే అవకాశముందని ముందుగానే ప్రకటించాయి.Just now Delhi witnessed a massive dust storm followed by rain and hail. The power of nature is on full display #delhirain ⛈️"From dust storm to heavy rain and hail - #Delhi's weather is going to change dramatically tonight 🌪⚡️#delhirain #DelhiWeather pic.twitter.com/FLatYfSEap— Weatherman Uttam (@Gujarat_weather) May 21, 2025Thunderstorms and dust storms coupled with heavy rain wreak havoc across Delhi-NCR, uprooting trees and mangling sign boards.#delhirain #DelhiWeather pic.twitter.com/duY0nhOhIs— Mr. J (@LaughingDevil13) May 21, 2025ఇదిలా ఉండగా.. మరో మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళా తీరాన్ని తాకనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నిన్న తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పిడుగులు పడి మహబూబాబాద్ జిల్లాల్లో ఇద్దరు, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. సూర్యాపేట జిల్లాలో పిడుగుపాటుకు 39 మేకలు చనిపోయాయి. ఇక వీటితో పాటు.. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.#delhirain pic.twitter.com/1nxW0mxdVC— Suaib (@JournalistSuaib) May 21, 2025హైదరాబాద్‌లో వాన బీభత్సంహైదరాబాద్‌లో వాన బీభత్సం సృష్టించింది. రోడ్లన్ని నదులను తలపించాయి. దీంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో 4 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తం చేసింది. తెలంగాణలోని అన్నిజిల్లాలకు ఎల్లో అలర్ట్ విధించింది వాతావరణ శాఖ. బంగ్లగూడ, సైదాబాద్, మలక్‌పేట్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. #HyderabadRains Continue... 🌧️📸: Retratoooo [IG] pic.twitter.com/2LrjO7dxqT— Hi Hyderabad (@HiHyderabad) May 21, 2025It was a craziest downpour in Sikh Village Secunderabad. @balaji25_t #HyderabadRains pic.twitter.com/TzkHmGDfUA— The Food GlanZer (@JavedMohammeds) May 21, 2025Dramatic visuals from Hyderabad's Greenpark Colony: Two-wheeler almost swept away by rainwater.#Rain #Hyderabad #HyderabadRains #ViralVideo #Trending pic.twitter.com/mD3hRXFpLi— TIMES NOW (@TimesNow) May 22, 2025 -
కొత్త సభ్యులకు రేషన్ కోటా!
సాక్షి, హైదరాబాద్: తెల్లరేషన్ (ఆహార భద్రత) కార్డుల్లో కొత్త యూనిట్లకు కోటా కేటాయించేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. మే నెలలో కొన్ని కొత్త యూనిట్లకు బియ్యం కోటా విడుదల చేయగా.. తాజాగా మరికొన్ని యూనిట్లకు జూన్ కోటా కేటాయించి విడుదల చేయాలని నిర్ణయించింది. ఎనిమిదేళ్ల నిరీక్షణ అనంతరం కొత్త యూనిట్లకు ఆమోదం లభించిన విషయం విదితమే. అయితే.. రేషన్ కార్డు లబ్ధి కుటుంబాల్లో కొత్తగా సభ్యులుగా చేరిన ఏడేళ్ల వయసు దాటిన వారికి మాత్రమే రేషన్ కోటా కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతున్నా.. పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం వయసుతో నిమిత్తం లేకుండా కార్డుల్లోని ప్రతి యూనిట్‌కు బియ్యం కోటా విడుదల ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. 60 శాతం కొత్త సభ్యులకు ఆమోదం.. గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు 60 శాతం కొత్త సభ్యులకు ఆమోదం లభించినట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిరిగి జిల్లాల పౌరసరఫరాల పరిధిలో సుమారు మూడు లక్షల లబ్ధి కుటుంబాలు కొత్త సభ్యుల చేర్పుల కోసం దరఖాస్తులు చేసుకున్నాయి. ఇప్పటి వరకు సుమారు సగానికి పైగా ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. మిగిలిన దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పౌరసరఫరాల అధికారులు మాత్రం పాతరేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల ఆమోదం ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంటున్నారు. మీ సేవ కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా వచి్చన ప్రతి పెండింగ్ దరఖాస్తునూ పరిశీలించి అర్హులై సభ్యుల పేర్లను ఆమోదిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. -
హనుమాన్ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)
-
పది రోజులుగా టెంట్‌కిందనే..
పాలకుర్తి టౌన్: ఆయన యోగా గురువు. ఎంతోమందికి యోగా నేర్పాడు. ఏనాడూ డబ్బులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. అద్దె ఇల్లు. తనకంటూ ఏమీ సంపాదించుకోలేదు. చివరికి అనారోగ్యంతో చనిపోగా, ఇంటి యజమాని ఒప్పుకోకపోవడం, పది రోజుల కార్యక్రమాలయ్యే వరకు రావద్దని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఖాళీ ప్లాట్‌లో టెంట్‌వేసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పది రోజులుగా అదే టెంట్లో కాలం గడుపుతున్నారు. ఈ విషాద ఘటన జనగామ జిల్లా పాలకుర్తిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పాలకుర్తి మండల కేంద్రం, చుట్ట పక్కల గ్రామాల్లో ఒకప్పుడు ఎల్ఎన్ టైలర్‌గా దార్ల లక్ష్మీనారాయణ ఓ వెలుగు వెలిగాడు. డబ్బులకు ప్రాధాన్యం ఇవ్వకుండా యోగా గురువుగా ఎంతోమంది కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాడు. పది రోజులక్రితం అనారోగ్యం బారిన పడి చనిపోయాడు. మృతదేహం ఉంచేందుకు ఇంటి యజమాని ఒప్పుకోలేదు. దీంతో వారికున్న ఖాళీ స్థలంలో(ప్లాట్)లో టెంట్ వేసి దహనసంస్కారాలు నిర్వహించారు. పది రోజుల వరకు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. దీంతో ఆ టెంట్‌కు చుట్టూ పరదాలు కట్టుకొని కాలం వెళ్లదీస్తూ మిగతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఈదురుగాలులు, వర్షం పడుతున్నా టెంట్‌కిందనే జీవనం సాగిస్తున్న దైన్యం. దశదిన కర్మ కార్యక్రమానికి కూడా చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. ఎవరైనా ఆపన్నహస్తం అందిస్తారని ఆశగా చూస్తున్నట్లు కుమారుడు దార్ల ఉపేందర్ తెలిపాడు. -
సీఎం రేవంత్‌రెడ్డిది పర్సంటేజీ పాలన: కేటీఆర్
నల్లగొండ టూటౌన్: ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం కుట్ర పూరితంగా ఇచ్చే నోటీసులకు, విచారణలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. నల్లగొండ పట్టణంలో బుధవారం ఓ వివాహానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని, పర్సంటేజీల పాలన అని విమర్శించారు. కమీషన్లు ఇవ్వనిదే ఈ ప్రభుత్వంలో పనులు కావని స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలే బహిరంగ వేదికలపైనే చెబుతున్నారని అన్నారు. 20 శాతం, 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు రాష్ట్ర సచివాలయంలోనే ధర్నా చేశారని గుర్తుచేశారు. ఈ కమీషన్ల వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కమిషన్ల ఏర్పాటు, నోటీసులు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇది దద్దమ్మ ప్రభుత్వం: ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ విమర్శించారు. ‘ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయి గురువారానికి మూడు నెలలు పూర్తవుతుంది. అందులో చనిపోయినవారి శవాలను కూడా తీసుకురాలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటివరకు విచారణ లేదు. అందుకు కారణమైన సంస్థపై చర్యలు లేవు. కాంగ్రెస్ వచ్చాక వట్టెం పంపుహౌస్ మునిగింది. పెద్దవాగు రెండుసార్లు కొట్టుకుపోయినా చర్యలు లేవు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా ప్రచారం చేస్తున్నా ప్రజలకు వాస్తవాలు తెలుసు. దేశంలో చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద తమకు సంపూర్ణ నమ్మకం ఉంది. ఎన్ని నోటీసులు ఇచ్చినా న్యాయం, ధర్మమే గెలుస్తుంది. తెలంగాణకు మేలు చేసినవారిని ఆ దేవుడే కాపాడుతాడు. ఎన్ని నోటీసులు ఇచ్చినా హామీలు అమలు చేసేంతవరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు’అని తేల్చి చెప్పారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
అందాల భామలకు అగ్నిపరీక్ష
సాక్షి, హైదరాబాద్: పది రోజులుగా రాష్ట్రంలోని పలు దర్శనీయ స్థలాలను మండుటెండల్లో చుట్టేసి చెదరని చిరునవ్వు, అందం–అభినయంతో పరవశింపచేసిన సుందరీమణులు ఇప్పుడు చాలెంజ్ రౌండ్లలో దూసుకుపోతూ మిస్ వరల్డ్ పోటీలను రసవత్తరంగా మార్చారు. ఈనెల 10న ప్రారంభోత్సవం మొదలు వివిధ ప్రాంతాలను చుట్టేసిన అందాల భామలు.. ఆటవిడుపునకే పరిమితమయ్యారు. ఇప్పుడు అసలైన పోటీల్లో దిగి రెండు రోజులుగా మేధోసంపత్తితో అలరిస్తున్నారు. ఇప్పటిదాకా ఆటవిడుపుగా సాగిన పోటీలు అభిమానులకు రసవత్తరంగా మారగా, పోటీదారులకు అగి్నపరీక్షగా నిలిచాయి. దీంతో మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ కీలక అంకంలోకి చేరినట్టయింది. సత్తా చాటిన 24 మంది: టీ–హబ్‌లో రెండు రోజులపాటు జరిగిన హెడ్ టు హెడ్ చాలెంజ్ రౌండ్లో 24 మంది విజయం సాధించి తదుపరి 23న జరిగే కీలక టాలెంట్ పోటీకి ఎంపికయ్యారు. 107 దేశాలకు చెందిన పోటీదారులు ఇందులో పాల్గొనగా, 24 మందిని ఉన్నత ప్రతిభావంతులుగా న్యాయనిర్ణేతలు తేల్చారు. హెడ్ టు హెడ్ చాలెంజ్‌లో ఇండియా, అమెరికా, పోలండ్, నైజీరియా, ఫిలిప్పీన్స్, మాల్టా, ఇటలీ, ఇండోనేసియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఎస్టోని యా, జర్మనీ, బ్రెజిల్, కేమాన్ ఐలాండ్స్, నెదర్లాండ్స్, వేల్స్, చెక్ రిపబ్లిక్, జమైకా, అర్జెంటీనా, ఐర్లాండ్, ఆ్రస్టేలియా, శ్రీలంక, ఇథియోపియా, కామె రూన్, కెన్యా ముద్దుగుమ్మలు విజేతలుగా నిలిచారు. వీరు 23న జరిగే టాలెంట్ కాంపిటీషన్లో తలపడి తమ ఖండంలోని టాప్–10లో భాగమవుతారు. వారికి మళ్లీ సత్తా చాటే చాన్స్: హెడ్ టు హెడ్ చాలెంజ్‌లో 24 మంది విజేతలుగా నిలిచి సెమీఫైనల్ బెర్తుకు చేరువయ్యారు. ఈ రౌండ్లో ఓడిన వారు ఎలిమినేట్ కారు. వారు పోటీలో ఇతర విభాగాలైన మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్, టాప్ మోడల్–ఫ్యాషన్ ఫైనల్, జ్యువెలరీ–పెర్ల్ ఫ్యాషన్ షోల్లో పాల్గొనవచ్చు. వీటిల్లో మెరుగ్గా రాణిస్తే తదుపరి రౌండ్లకు అర్హత సాధిస్తారు. అయితే, ఆ 24 మందితో పోలిస్తే వీరికి ఎక్కువ సవాళ్లు ఉంటాయి. మిస్ వరల్డ్ పోటీల్లో హెడ్ టు హెడ్ చాలెంజ్‌ను ఫాస్ట్–ట్రాక్ ఈవెంట్‌గా పరిగణిస్తారు. ఇందులో విజేతలు నేరుగా క్వార్టర్–ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. ⇒ మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్: ఈ పోటీ మే 22న శిల్పకళా వేదికలో జరుగుతుంది. ఇందులో పాల్గొనే వారు సంగీతం, నృత్యం, కళలు ఇతర ప్రతిభలను ప్రదర్శిస్తారు. ⇒ టాప్ మోడల్–ఫ్యాషన్ ఫైనల్: ఇది మే 24న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఉంటుంది. ⇒ జ్యువెలరీ–పెర్ల్ ఫ్యాషన్ షో: మే 25న హైటెక్స్‌లో జరుగుతుంది, ఇందులో తెలంగాణలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు కూడా హాజరవుతారు. ⇒ ఈ అన్ని పోటీల్లో వడపోత కార్యక్రమం కొనసాగుతుంది. అమెరికా–కరేబియన్, ఆసియా–ఓషియానా, ఆఫ్రికా, యూరప్.. ఈ నాలుగు విభాగాల్లో తొలుత ఒక్కో ఖండం నుంచి 10 మంది ఎంపికవుతారు. తదుపరి రౌండ్లో ఆ సంఖ్య ఐదుకు పరిమితమవుతుంది. ఆ తర్వాత ఇద్దరు చొప్పున ఉంటారు. 31న జరిగే గ్రాండ్ ఫినాలేలో మొత్తం 8 మంది మిగులుతారు. వారిలో విజేత, రన్నరప్, రెండో రన్నరప్‌ను ఎంపిక చేస్తారు. విజేతకు మిస్‌వరల్డ్–2024 క్రిస్టీనా పిజ్కోవా రూ.6.21 కోట్ల విలువైన కిరీటాన్ని అలంకరింపజేస్తారు. ఈ గ్రాండ్ ఫినాలే ఈనెల 31న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతుంది. -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ రెస్పాన్స్ షీట్
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశానికి ఈ నెల 18న కాన్పూర్ ఐఐటీ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష(జేఈఈ అడ్వాన్స్డ్) రెస్పాన్స్ షీట్ గురువారం విడుదలయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కాన్పూర్ ఐఐటీ వర్గాలు తెలిపాయి. మే 26 లోపు కీ విడుదల చేసే వీలుంది. విద్యార్థుల అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత జూన్ 2న ఆన్లైన్ ద్వారా ఫలితాలు వెల్లడిస్తారు. జూన్ 3 నుంచి ఎన్ఐటీ, ఐఐటీ ఇతర జాతీయ సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన షెడ్యూల్‌ను జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) విడుదల చేస్తుంది. -
ఉన్న బోధకులకే ‘కొత్త’ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఎమర్జింగ్ కోర్సుల బోధనకు ఆధునిక మెళకువలు అవసరమని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సూచించింది. ప్రస్తుతం ఉన్న ఫ్యాకల్టీకే శిక్షణ ఇవ్వడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని తెలిపింది. ఈ మేరకు పలు మార్గదర్శకాలను జారీచేసింది. ఇంజనీరింగ్‌లో కొన్నేళ్లుగా కోర్ గ్రూపులకన్నా, కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి బ్రాంచీలకు డిమాండ్ ఎక్కువైంది. అయితే, ఈ కోర్సుల బోధనకు సరైన ఫ్యాకల్టీ ఉండటం లేదనే విమర్శలు పెరుగుతున్నాయి. ఇవి కొత్తగా వచ్చిన కోర్సులు కావడంతో ఇందులో మాస్టర్స్ డిగ్రీ చేసినవారు ఉండటం లేదు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బోధించే వారితోనే కొత్త కోర్సులూ చెప్పిస్తున్నారు. ఇంకో మూడేళ్లపాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న బోధకులకే శిక్షణ ఇచ్చి కొత్త కోర్సులు చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని ఏఐసీటీఈ సూచించింది. శిక్షణ తప్పనిసరి రాష్ట్రంలో 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఇందులో సగానికిపైగా కంప్యూటర్ సైన్స్ కోర్సులే ఉన్నాయి. సీఎస్ఈ కోర్ కాకుండా ఏఐ, ఏఐఎంఎల్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి సీట్లు 15 వేల వరకు ఉన్నాయి. ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక నిపుణుడైన బోధకుడు ఉండాలి. దీంతో ఫ్యాకల్టీ కొరత ఏర్పడింది. వాస్తవానికి కొత్త కోర్సులకు అదనంగా ఆరు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ఇందులో కూడా బేసిక్ చాప్టర్లు సీఎస్ఈ కోర్సులో ఉన్నవే. అదనపు చాప్టర్లు కొత్తగా వస్తున్న ఏఐ, డేటా అనాలిసిస్, సైబర్ లాంగ్వేజ్ సిస్టమ్‌కు సంబంధించినవి. ఐఐటీలు, ఎన్ఐటీల్లో కొత్త కోర్సులతోపాటు, ఆధునిక సాంకేతికతపై ఎప్పటికప్పుడు అంతర్జాతీయ సంస్థలతో ఓరియంటేషన్ నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడి ఫ్యాకల్టీ అప్డేట్ అయ్యింది. రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీఎస్ఈతోపాటు ఎలక్ట్రానిక్స్ బోధిస్తున్న అధ్యాపకులను ఎన్ఐటీ, ఐఐటీల్లో కొంతకాలం శిక్షణకు పంపడం లేదా ఆన్లైన్ శిక్షణ ఇప్పించాలని ఏఐసీటీఈ సూచించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులతోనూ శిక్షణ ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న ఐటీ ఉద్యోగులు కంపెనీల శిక్షణతో వృత్తిపరమైన ఉన్నతి పొందుతున్నారు. నాలుగేళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులకు సబ్జెక్టుపై మంచి అవగాహన ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐటీ ఉద్యోగులతో ఇంజనీరింగ్ కాలేజీ అధ్యాపకులకు శిక్షణ ఇప్పించాలని ఏఐసీటీఈ సూచించింది. ఐటీ ఉద్యోగులకు సాధారణంగా శని, ఆదివారాల్లో సెలవులు ఉంటాయి. ఈ రెండు రోజులు అధ్యాపకులకు క్లాసులు నిర్వహించవచ్చని తెలిపింది.దీంతోపాటు ఆన్లైన్లో నిర్వహించే ఏఐ కోర్సుల ద్వారా కూడా ఫ్యాకల్టీని అప్‌గ్రేడ్ చేయవచ్చని పేర్కొంది. ఇలా శిక్షణ పొందిన ఫ్యాకల్టీకి ప్రతి సంవత్సరం ఏఐసీటీఈ నేతృత్వంలో పరీక్ష నిర్వహించే ఆలోచనపై కూడా కసరత్తు జరుగుతోంది. దీంతో అధ్యాపకుడు ఆయా రంగంలో నిష్ణాతుడన్న ధ్రువీకరణ జరుగుతుంది. ఫ్యాకల్టీ లేని కారణంగా సీట్ల పెంపు ఆపేకన్నా, ఉన్నవారిని మెరుగుపర్చుకోవడం సులభమన్న విధానాన్ని ఏఐసీటీఈ రాష్ట్రాల ముందు ఉంచింది. -
ఆపద్బాంధవులకు అద్భుత శిక్షణ
గోదావరిఖని: ప్రకృతి వైపరీత్యాల సమయంలో అనుసరించాల్సిన విధానంపై స్టేట్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందాలకు సింగరేణి శిక్షణ ఇస్తోంది. జల, వాయు, అగ్ని ప్రమాదాలతోపాటు.. బహుళ అంతస్తుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు అనుసరించాల్సిన సహాయక చర్యలపై సింగరేణి సంస్థ.. 36 రోజుల పాటు 1,200 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి శిక్షణ ప్రారంభించింది. వంద మందికి ఒక బృందం చొప్పున, మూడురోజులపాటు పలు అంశాలపై శిక్షణతోపాటు ప్రాక్టికల్స్ కూడా నిర్వహిస్తోంది. ఇలా 36 రోజుల పాటు 12 బృందాలకు శిక్షణ ఇవ్వనుంది. నాలుగు నెలల క్రితమే రాష్ట్రంలో ఎస్డీఆర్ఎఫ్ విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిజర్వ్ పోలీసు విభాగం నుంచి ఆసక్తి ఉన్న 1,200 మందిని ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలోని 12 క్యాంప్‌ల్లో ఉన్నవారికి ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్పందించాల్సిన తీరు, ఆపత్కాలంలో తాము సురక్షితంగా ఉండి, ఆపదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం లక్ష్యంగా శిక్షణ కొనసాగుతోంది. ముందుగా ఇతర రాష్ట్రాల్లో కొన్ని బృందాలకు శిక్షణ ఇస్తున్నారు. కోయంబత్తూర్, విజయవాడ, పుణె, వడోధర, ఒడిశా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్డీఆర్ఎఫ్ ద్వారా పలు అంశాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. ఒక్కొక్క బృందానికి రెండు నెలల పాటు శిక్షణ కొనసాగుతుంది. దీంతోపాటు రాష్ట్రంలో పలు అంశాలపై స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బందికి శిక్షణ ప్రారంభమైంది. ముందుగా హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో బోట్లపై వెళ్లి.. నీటిలో చిక్కుకున్న వారిని కాపాడే అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత సింగరేణి రెస్క్యూ విభాగంతో శిక్షణ ఇస్తున్నారు. ఎస్ఎల్బీసీతో సింగరేణి రెస్క్యూపై నజర్ ఎస్ఎల్బీసీ ప్రమాదంతో.. సింగరేణి రెస్క్యూ ప్రాధాన్యం దేశవ్యాప్తంగా వెలుగులోకి వచి్చంది. సుమారు 40 రోజుల పాటు సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికితీసే పనుల్లో సహాయ బృందాలు అందించిన సేవలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఏర్పాటైన ఎస్డీఆర్ఎఫ్ విభాగానికి.. విపత్తుల సమయంలో స్పందించాల్సిన తీరుపై కఠోర శిక్షణ ఇస్తున్నారు. మొదటి బ్యాచ్‌లో డిచ్పల్లిలోని 7వ బెటాలియన్‌కు చెందిన వంద మందికి శిక్షణ కొనసాగుతోంది. మూడు రోజుల ప్రత్యేక శిక్షణ ప్రకృతికి విరుద్ధంగా భూగర్భ గనుల్లోకి వెళ్లి బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు వారిని కాపాడే విధానం, అగ్ని ప్రమాదాలు, విషవాయువులు ఏర్పడినప్పుడు ఎలాంటి పరికరాలు వినియోగించి.. ఎలా అదుపులోకి తీసుకురావాలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి ప్ర త్యక్షంగా చూపించారు. భవనం కూలిపోయినప్పుడు, అ గ్ని ప్రమాదాలకు గురైనప్పుడు సహాయక సిబ్బంది సురక్షితంగా ఉంటూ.. ప్రమాదంలో చిక్కుకున్న వారిని సు రక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా ఈ శిక్షణ ఇస్తున్నారు. బుధవారంతో మొదటిబ్యాచ్ శిక్షణ పూర్తయింది. సింగరేణి అందించిన శిక్షణ భవిష్యత్‌లో చాలా ఉపయోగపడుతుందని విపత్తుల విభాగం సిబ్బంది పేర్కొన్నారు.సంతోషంగా ఉంది అంతర్జాతీయ స్థాయి సామగ్రి సింగరేణి వద్ద ఉంది. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలో అన్ని విషయాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. – కె.రవీందర్, ఆర్ఎస్ఐ, డిచ్పల్లి 7వ బెటాలియన్ఎలా రక్షించాలో తెలుసుకున్నాం.. క్లిష్ట సమయాల్లో ప్రకృతి వైపరీత్యాల సహాయక బృందం ఎలా వ్యవహరించాలనే విషయాలను తెలుసుకున్నాం. సకాలంలో స్పందించడంతో పాటు సురక్షితంగా ఉండి ఆపదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా అందించిన శిక్షణ భవిష్యత్‌లో ఉపయోగ పడుతుంది. – బదావత్ రంజిత్‌కుమార్,హెడ్కానిస్టేబుల్కళ్లకు కట్టినట్టు..ఎత్తయిన భవనా ల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, ఏవిధమైన చర్యలు తీసుకోవాలనే తీరుపై కూలంకషంగా వివరించారు. ప్రమాదాల్లో చిక్కువారిని రక్షించడంతో పాటు.. మనం కూడా సురక్షితంగా బయటకు వచ్చే విధానం, మంటలను అదుపులోకి తెచ్చే తీరుతో పాటు పలు అంశాలపై కళ్లకు కట్టినట్లు వివరించారు. – కె.రవి, ఏఎస్ఐ, ఎస్డీఆర్ఎఫ్ అంతర్జాతీయ ప్రమాణాలతో.. ప్రకృతి వైపరీత్యాలతో పాటు భూగర్భ గనుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు అనుసరించాల్సిన తీరుపై అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ కేంద్రంగా నిలుపుతాం. ఇప్పటికే కోలిండియాలోని అనేక సంస్థలకు సహాయ చర్యలపై శిక్షణ ఇచ్చాం. రాబోయే రోజుల్లో మరిన్ని సంస్థలకు కూడా శిక్షణ ఇచ్చి.. సింగరేణి పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతాం. – ఎన్.బలరాం, సీఎండీ, సింగరేణి 4 నెలల క్రితమే చేరా.. నాలుగు నెలల క్రితం ఎస్డీఆర్ఎఫ్లో చేరాను. ముందుగా హుస్సేన్‌సాగర్‌లో నీటిలో పడిపోయిన వారిని రక్షించే అంశంపై శిక్షణ ఇచ్చారు. సింగరేణి రెస్క్యూ ద్వారా అందించిన శిక్షణ చాలా బాగుంది. – బీర్ల ఆనంద్, కానిస్టేబుల్, ఎస్డీఆర్ఎఫ్ -
మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించడం మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టమనే చెప్పాలి. ఆపరేషన్ కగార్ పేరిట తరుముతున్న సాయుధ పోలీసు బలగాలు..మరోవైపు ముంచుకొస్తున్న ఆనారోగ్య సమస్యలు.. కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీ కేడర్‌ను సతమతం చేస్తున్నాయి. ప్రధానంగా మావోయిస్టు సెంట్రల్ కమిటీలో ఉన్న నాయకులంతా ఐదుపదుల వయస్సు దాటినవారే కావడంతో ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్య వారిని వెంటాడుతూనే ఉంది. కొందరు కీలక నేతలను అనారోగ్యంతో కోల్పోతే, మరికొందరు ఎన్కౌంటర్లలో హతమవడం మావోయిస్టులను కలవర పెడుతోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సెంట్రల్ కమిటీ మెంబర్ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ జూన్ 2023లో మృతి చెందారు. అంతకుముందే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ కమిటీ మెంబర్ యాపా నారాయణ (హరిభూషణ్) కరోనాతో మృతి చెందారు.మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) సైతం కిడ్నీలు ఫెయిల్ అవడం ఇతర అనారోగ్యంతో బాధపడుతూ బస్తర్ అటవీ ప్రాంతంలో చనిపోయారు. ఇక సెంట్రల్ కమిటీలోని కొందరు నేతలు సొంతగా నడవలేని స్థితిలోనూ ఉన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర సాయుధ బలగాల నుంచి తప్పించుకుని తిరగడం వారికి కష్టమవుతోందనే వాదనలు ఉన్నాయి. కీలక నేతలే టార్గెట్‌గా ఆపరేషన్లు మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 డెడ్‌లైన్‌గా విధించడంతో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక బలగాలతో పాటు స్థానిక పోలీసులు మావోయిస్టు కీలక నేతలనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఓవైపు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూజ్‌మఢ్, బస్తర్, కర్రిగుట్టలు సహా కీలక ప్రాంతాలన్నింటిలోకి చొచ్చుకుని వెళుతూ దళాలు క్యాంపులు నిర్మిస్తున్నాయి. మరోవైపు మావోయిస్టు అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తేనే మావోయిస్టులను మూలాల నుంచి దెబ్బ కొట్టవచ్చన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నాయి. గతంలోనూ ఇదే తరహా వ్యూహాలను అమలు చేశాయి. ఈ ఏడాది జనవరి 16న ఛత్తీస్‌గఢ్ జాపూర్ జిల్లా పరిధిలో చేసిన ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌ను మట్టుపెట్టాయి. జనవరి 21న ఒడిశా మావోయిస్టు పార్టీ కార్యదర్శి చలపతి మరణించారు. 2024 డిసెంబర్లో ములుగు జిల్లా పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో కుర్సుం మంగు అనే కీలక నేత చనిపోయారు. దంతెవాడ–బీజాపూర్ జిల్లా పరిధిలో 2024 సెప్టెంబర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మాచర్ల ఏసోబు అలియాస్ రణ«దీర్ ఎన్కౌంటర్ అయ్యారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో అత్యంత చురుకైన, ప్రమాకరమైన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా కోసం వేలాది మందితో కూడిన భద్రత బలగాలు గాలిస్తున్నాయి. క్రమంగా కుచించుకుపోతున్న పార్టీ మావోయిస్టుల స్థావరాలు భద్రత బలగాల హస్తగతం అవుతుండడం..వరుస ఘటనల్లో అగ్ర నాయకత్వాన్ని కోల్పోతుండడంతో మావోయిస్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే పదుల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ప్రస్తుతం మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీలో వంద మంది లోపే సభ్యులు ఉన్నారని, వారిలోనూ 80 శాతానికి పైగా ఇతర రాష్ట్రాల వారే ఉన్నట్టు పోలీసులు అధికారికంగా వెల్లడించారు.ఇలా తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ మావోయిస్టు కమిటీల్లో కొత్తగా రిక్రూట్మెంట్లు లేకపోగా..ఉన్న వారు లొంగిపోతుండడంతో పార్టీ క్రమంగా కుచించుకుపోతోందని అంటున్నారు. తుడిచివేతే లక్ష్యంగా ‘కగార్’ దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతో 2009లో కేంద్రం ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను చేపట్టింది. గడిచిన పదహారేళ్లలో ఈ కార్యక్రమం ఆపరేషన్ సమాధాన్, ప్రహార్గా కొనసాగి ఇప్పుడు కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలను నలువైపుల నుంచి చుట్టుముట్టడం ద్వారా మావోయిస్టులను పూర్తిగా ఏరివేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా.. 1) ఆయా ప్రాంతాల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తారు. దీని కోసం సీఆర్పీఎఫ్, ఇండోటిబెటన్ పోలీస్, బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ, కోబ్రా ఇలా వివిధ పేర్లతో లక్ష మందికి పైగా జవాన్లను తయారు చేశారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి వంతున క్యాంపులు ఏరా>్పటు చేస్తున్నారు. 2) మావోయిస్టుల సమాచారం సేకరించడంలో భాగంగా డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్, ఆర్టిఫిíÙయల్ ఇంటిలిజెన్స్‌లను వాడుతున్నారు. 3) తమ ఆ«దీనంలోకి వచి్చన ప్రాంతాల్లో వెనువెంటనే పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్‌ను అమలు చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. 4) లొంగిపోవాలని భావించే మావోయిస్టులకు ఉదారంగా సరెండర్ పాలసీ అమలు. ఈ నాలుగు లక్ష్యాలతో ఆపరేషన్ కగార్ 2024 జనవరి 1న మొదలైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి క్యాంపులు రావడంతో నక్సలైట్ల కదలికలు పరిమితం అయ్యాయి. వారు దట్టమైన అడవుల్లో, షెల్టర్ జోన్లలో ఉండటాన్ని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి గుర్తిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్లు చేసే క్రమంలో ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. సరెండర్ పాలసీ కారణంగా లొంగుబాట్లు కూడా పెరిగాయి. -
45 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కాజీపేట అర్బన్: మావోయిస్టు పార్టీ తన ప్రస్థానంలో ఎన్నో ఎదురు దెబ్బలు కాసింది. కానీ.. ఆ పార్టీకి బుధవారం తగిలిన ఎదురుదెబ్బ మాత్రం అశనిపాతమే. పార్టీ సుప్రీం కమాండర్‌గా ఉన్న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (ఎన్కే) అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న ఎవరూ ఊహించని విధంగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసు తూటాలకు నేలకొరిగారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో దిట్టగా గుర్తింపు పొందిన నంబాల అనేక భారీ దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. విద్యార్థి దశ నుంచే.. కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని జియ్యన్నపేట. వాసుదేవరావు, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలోనే విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్ నౌపడ ఆర్‌ఎస్‌లోను, టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, టెక్కలి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుడిగా రాణించిన కేశవరావు విద్యార్థి దశలోనే విప్లవ భావజాలానికి ఆకర్షితుడయ్యారు. విద్యార్థి దశలో తన స్వగ్రామం వచ్చి తనకు రావాల్సిన వాటాను ఆస్తిగా ఇస్తే, పేదలకు పంపిణీ చేస్తానని తండ్రిని అడిగినట్టు సమాచారం. వరంగల్‌లోని రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో (ఇప్పటి నిట్) బీటెక్ చేశారు. ఆ సమయంలోనే విప్లవ పార్టీలతో పరిచయాలు ఏర్పడ్డాయి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) సభ్యుడిగా చేరిన ఆయనకు సీపీఐ (ఎంఎల్) అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. మలుపు తిప్పినఎంటెక్..ఎంటెక్ చదువుతుండగా కళాశాలలోని మెస్‌లో జరిగిన చిన్నపాటి వివాదం కేశవరావు జీవితాన్ని మలుపు తిప్పింది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్‌గా కేశవరావు ఉన్న సమయంలో మరో విద్యార్థి సంఘం ఏబీవీపీతో జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో ఆయన చిక్కుకున్నారు. అరెస్టు చేస్తారన్న సమాచారంతో.. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరావు 1982లో చింతపల్లి ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్టణం సెంట్రల్ జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు.ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు..కేశవరావు విప్లవ పార్టీలో చేరిన తరువాత ఒక్కసారి కూడా తన స్వగ్రామం జియ్యన్నపేటకు రాలేదు. 1980లో పీపుల్స్ వార్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తొలుత గంగన్న అనే పేరుతో పీపుల్స్ వార్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా చేశారు. 1987లో ఈస్ట్ డివిజన్‌ను విస్తరించి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య కమిటీ ఏర్పాటు ఆయన ఆలోచనే. ఆ కమిటీలో కేశవరావుతో పాటు మల్లోజుల కోటేశ్వరరావు, కటకం సుదర్శన్ కీలకపాత్ర పోషించారు.ఎల్టీటీఈ ద్వారా శిక్షణ1990లో కేశవరావు పీపుల్స్‌వార్ పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ తరువాత పీపుల్స్ వార్ పార్టీకి గుండెకాయ వంటి దండకారణ్య కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. కేశవరావు పేలుడు పదార్థాల తయారీ నిపుణుడిగా, మిలటరీ ఆపరేషన్ల వ్యూహ నిపుణుడిగా గుర్తింపు పొందారు. అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ కీలక నేతలు మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలసి 1987లో మధ్యప్రదేశ్‌లోని బస్తర్ అడవుల్లో పేలుడు పదార్థాల ప్రయోగం, గెరిల్లా దాడుల్లో శిక్షణ పొందారు. ఎల్టీటీఈ ద్వారా వీరు ఈ శిక్షణ తీసుకున్నారు. దేశవ్యాప్త మిలటరీ ఆపరేషన్లకు నేతృత్వం పీపుల్స్‌వార్ పార్టీలో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్స్ విభాగం ఏర్పాటు చేయాలని 1995లో గణపతి, కేశవరావు భావించారు. ఆ మిలటరీ ఆపరేషన్స్ విభాగానికి బసవరాజు, బీఆర్ పేర్లతో కేశవరావే నేతృత్వం వహించారు. 2001లో పీపుల్స్‌వార్ 7వ కాంగ్రెస్‌లో సెంట్రల్ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు. అప్పటివరకు దండకారణ్య ప్రాంతానికే పరిమితమైన ఆయన ఆ తర్వాత దేశవ్యాప్తంగా పీపుల్స్‌వార్ పార్టీ మిలటరీ ఆపరేషన్లను పర్యవేక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి బిహార్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశాలో వేలాదిమందికి గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చారు.2016లో సుప్రీం కమాండర్‌గా..పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సెంటర్(ఎంసీసీ)ను విలీనం చేయడంలో గణపతి, కేశవరావు జోడీ ప్రధాన పాత్ర పోషించింది. గణపతి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేయగా.. కేశవరావు మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2016లో వయోభారంతో గణపతి ఆ పదవి నుంచి వైదొలగడంతో ప్రధాన కార్యదర్శి హోదాలో కేశవరావు సుప్రీం కమాండర్‌గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో రెండు దశాబ్దాల పాటు పీపుల్స్‌వార్/మావోయిస్టు పార్టీ జరిపిన అన్ని ప్రధాన దాడుల వెనుక వ్యూహకర్త నంబాల కేశవరావే అని పోలీసులు చెబుతారు. గెరిల్లా వార్ఫేర్, ఆయుధాల తయారీ, మెరుపు దాడులు చేయడం వంటి అంశాల్లో నంబాల కేశవరావుకు దిట్టగా పేరుంది. స్వతహాగా ఇంజనీరింగ్ చదివి ఉండడంతో ఆ నైపుణ్యాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించినట్టు చెబుతారు. పీపుల్స్‌వార్ చరిత్రలో తొలిసారి 1987లో తూర్పుగోదావరి జిల్లా దారగడ్డలో పోలీసు బలగాలపై గెరిల్లా దళం దాడికి కేశవరావు నేతృత్వం వహించారు. ఆ దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. అలిపిరి ఘటనకు, ఇతర భారీ దాడులకు బాధ్యుడు 2003 అక్టోబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుపతిలోని అలిపిరిలో క్లెమోర్ మైన్ దాడి వ్యూహం కేశవరావుదే. 2008లో ఒడిశా నాయగఢ్‌లో పోలీసుల ఆయుధాగారంపై దాడిచేసి వెయ్యికి పైగా ఆధునిక ఆయుధాలను అపహరించుకుపోయిన దాడికి నేతృత్వం వహించారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను బలిగొన్న దాడికి వ్యూహకర్త నంబాల కేశవరావే. ఆ దాడికి హిడ్మా నేతృత్వం వహించాడు. 2013లో ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా జడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్ నేత నందకుమార్ మరో 27మందిని బలిగొన్న దాడికి కూడా కేశవరావే వ్యూహకర్త. విశాఖ జిల్లా అరకులో అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య ఘటనలోనూ కేశవరావు ప్రమేయం ఉందన్న వాదనలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయాగరా, చింతల్నార్, బలిమెల వంటి దాడులు కూడా ఆయన నేతృత్వంలోనే చోటుచేసుకున్నాయి. శత్రువులుగా భావించిన వారికి మాటల కంటే తూటాలతోనే ఎక్కువ బదులిస్తారనే పేరు మోశారు. కాగా బసవరాజు పేరు ఏపీ, తెలంగాణలో కంటే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.నీడను కూడా నమ్మని మావోయిస్టు పార్టీ గెరిల్లా పోరాట పంథానుఅనుసరిస్తుండటంతో మావోయిస్టు పార్టీ నీడను సైతం నమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. పార్టీలో ఏదైనా విభాగానికి నిర్దిష్టమైన పనులు తప్ప మొత్తం వ్యవహారంపై అవగాహన ఉండదు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్‌బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్, రాష్ట్ర కమిటీలు, వివిధ డివిజన్ కమిటీలను సమన్వయం చేయడం, ఆర్థిక, ఆయుధ వ్యవహారాలను చక్కదిద్దడం వంటి పనులు చూస్తుంటారు.ఎక్కడ నుంచి ఆయుధాలు వస్తుంటాయి, ఆర్థిక వనరుల ఆనుపానులు ఎక్కడ ఉంటాయి, పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎక్కడ షెల్టర్లలో ఉన్నారనే అంశాలు కూడా ఆయనకే ఎక్కువగా తెలుస్తాయి. ఇప్పటికే పెరిగిన నిర్బంధంతో ఆ పార్టీ విభాగాలు, కీలక నేతలు చెల్లాచెదురయ్యారు. ఇప్పుడు కేంద్ర కార్యదర్శే చనిపోవడంతో పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశముందని భావిస్తున్నారు. ఒక్కసారి చిక్కినా విదిలించుకుని.. నంబాల కేశవరావు విద్యార్థి సంఘాలు ఆర్ఎస్యూ, ఏబీవీపీ ఘర్షణల్లో ఒక్కసారి మాత్రమే అరెస్టయ్యారు. 1987లో విశాఖపటా్ననికి ఒంటరిగా వచ్చిన ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే కబడ్డీ క్రీడాకారుడు కావడంతో చాకచక్యంగా విదిలించుకుని పరారయ్యారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆయనపై రూ.10 లక్షలతో మొదలైన పోలీసు రివార్డు రూ.1.50 కోట్లకు చేరుకుంది. పోలీసు శాఖ మోస్ట్‌వాంటెడ్ లిస్టులో అత్యధిక రివార్డు కేశవరావుపైనే ఉందని సమాచారం. 45 ఏళ్ల క్రితం విద్యార్థిథగా ఇంటిని వదిలివెళ్లిన కేశవరావు మావోయిస్టు అగ్రనేతగా ఎదిగి అప్పట్నుంచీ అజ్ఞాతంలోనే జీవితాన్ని గడిపారు. చివరకు అడవిలోనే ప్రాణాలు విడిచారు. కేశవరావు కుటుంబం విశాఖపట్నంలోనే స్థిరపడింది. -
అయోమయం... గందరగోళం
సాక్షి, హైదరాబాద్: గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో ఆర్వో (రివర్స్ ఆస్మోసిస్) వాటర్ ప్లాంట్ల ఏర్పాటు టెండరు ప్రక్రియపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండరు నిబంధనల రూపకల్పన, దరఖాస్తుదారుల ఆర్థిక అంశాల ఎంపిక తికమకగా ఉన్నాయి. టెండర్లో పాల్గొనే వారు తయారీదారులై ఉండాలా? లేక పంపిణీ దారుడైతే సరిపోతుందా? అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తెలంగాణ గిరిజన గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో 398 ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు ఈనెల 7న గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం టెండర్లు పిలిచింది. 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికల్లా కాంట్రాక్టర్లను ఖరారు చేసి ఆర్వో ప్లాంట్లను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేలా గిరిజన సంక్షేమ శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. టెండరు ప్రక్రియలో లోపాలున్నాయని, ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు. టెండరు ప్రక్రియ ఇలా... రాష్ట్రంలో మూడు ఏజెన్సీ ప్రాంతాలున్నాయి. ఉట్నూరు, ఏటూరు నాగరం, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉన్న విద్యాసంస్థల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు మూడు టెండర్లు పిలిచారు. అదేవిధంగా మన్ననూరు ప్రాజెక్టుకుతోపాటు హైదరాబాద్ కేంద్రంగా నిర్దేశించిన విద్యాసంస్థల కోసం మరో టెండరు పిలిచారు. మొత్తం నాలుగు టెండర్ల ద్వారా 398 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. ఇందులో 244 ప్లాంట్లు 500 లీటర్/అవర్, మిగతా 154 ప్లాంట్లు వెయ్యి లీటర్/అవర్ సామర్థ్యం గలవి. వీటికి రూ.25 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈనెల 7 నుంచి 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లకు గడువు విధించారు. ఈనెల 16న సాయంత్రం 5 గంటలకు బిడ్లు తెరిచి కాంట్రాక్టరును ఖరారు చేసేలా షెడ్యూల్లో ప్రకటించారు. అయితే బిడ్ తెరవాల్సిన తేదీ ముగిసి వారమైనా కాంట్రాక్టరును ఖరారు చేయకపోవడం గమనార్హం. నిబంధనలపై అభ్యంతరాలివీ.. » టెండరు ప్రక్రియలో దరఖాస్తు గడువు కీలకం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం టెండరు ప్రక్రియలో మూడు వారాలపాటు అవకాశం కల్పించాలి. అత్యవసర సందర్భంలో గడువు పది రోజులు ఇవ్వొచ్చు. కానీ ఇక్కడ వారం మాత్రమే ఇచ్చారు. » టెండర్లలో పాల్గొనే వాళ్లు ప్లాంటు తయారీదారులై ఉండాలా? లేక నమోదైన పంపిణీదారుడై ఉండాలా? లేక చిన్నపాటి సరఫరాదారుడై ఉన్నా సరిపోతుందా? అనేదానిపై స్పష్టత లేదు. » ఆర్వో ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి నాణ్యత ప్రమాణాలతోపాటు టెక్నికల్ డ్రాయింగ్, డిజైన్ తప్పనిసరిగా ప్రకటించాలి. కానీ అలాంటిది లేదు. » సాధారణంగా మిషనరీ, ఇతర పరికరాల కొనుగోలు విషయంలో తప్పనిసరిగా ఆర్థిక నిబంధనలు ప్రస్తావించాలి. టెండరు నిబంధనల్లో సాల్వెన్సీ సర్టిఫికెట్ అంశం లేకపోవడం గమనార్హం. » ప్లాంటు ఏర్పాటుకు సంబంధించిన కాలపరిమితి, వారంటీ వివరాలపై స్పష్టత లేదు. » బిడ్డర్‌కు వార్షిక టర్నోవర్ రూ.10 కోట్లు లేదా సగటున రూ.7 కోట్ల ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు. కానీ కాంట్రాక్టు పరిమితి రూ.13.99 కోట్ల విలువ ఉండటంతో నిర్దేశించిన టర్నోవర్‌తో ఎలా సాధ్యమవుతుందనే సందేహం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు విలువకు కనీసం ఆరు రెట్లు అధికంగా టర్నోవర్ ఉండాలని నిబంధనలున్నాయి. -
రహదారులు రక్తసిక్తం
హయత్‌నగర్ (హైదరాబాద్)/గద్వాల క్రైం: బుధవారం హైదరాబాద్‌లోని హయత్‌నగర్, కర్ణాటకలోని విజయపుర జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 8 మంది మృతిచెందారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు యువకులు వారి కుటుంబాల్లో ఒక్కరే మగపిల్లలు కాగా, కర్ణాటకలో జరిగిన ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ కుటుంబంలో ఒక్కరు తప్ప అందరూ మృత్యుఒడికి చేరారు. విషాదం మిగిల్చిన అతివేగం.. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ప్రమాదంలో అతి వేగం నాలుగు కుటుంబాలలో పెను విషాదం మిగిల్చింది. వేగంగా వచ్చిన కారు ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు గాయాలపాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూర్‌కు చెందిన పిన్నింటి చంద్రసేనారెడ్డి (24), చుంచు త్రినాథ్‌రెడ్డి (24), చుంచు వర్షిత్‌రెడ్డి (23), ఎలిమేటి పవన్‌కల్యాణ్‌రెడ్డి చిన్నప్పటినుంచి స్నేహితులు. బుధవారం తెల్లవారుజామున వారంతా పస్మాముల వైపు నుంచి కుంట్లూర్‌కు స్కోడా కారులో వస్తున్నారు. ఉదయం 5:40 గంటల సమయంలో కుంట్లూర్‌లోని నారాయణ కళాశాల సమీపంలోని గ్యాస్ బంకు వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో కారులో ఉన్న చంద్రసేనారెడ్డి, త్రినాథ్‌రెడ్డి, వర్షిత్‌రెడ్డిలు అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడ్డ పవన్కల్యాణ్రెడ్డిని కారులో నుంచి బయటికి తీసిన పోలీసులు చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. కాగా, మంగళవారం రాత్రి ఓ రిసెప్షన్‌కు హాజరైన ఈ యువకులు మధ్యలో ఓ ఫాంహౌస్‌లో గడిపినట్లు తెలిసింది. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిన వారు కొద్దిసేపట్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా మృత్యుఒడిలోకి చేరుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులలో ముగ్గురు మృతి చెందగా, డ్రైవర్‌సీటు పక్కన కూర్చున్న పవన్‌కల్యాణ్‌రెడ్డి గాయాలతో బయటపడ్డాడు. అతను సీటు బెల్టు పెట్టుకోవడంతో బెలూన్ ఓపెన్ అయినట్లు పోలీసులు తెలిపారు. వారసులను కోల్పోయిన కుటుంబాలు... పిన్నింటి చంద్రసేనారెడ్డి, చుంచు త్రినాథ్‌రెడ్డి, చుంచు వర్షిత్‌రెడ్డి వారి కుటుంబాల్లో ఒకరే మగపిల్లలు. వీరిలో త్రినాథ్‌రెడ్డి, వర్షిత్‌రెడ్డిలు అన్నదమ్ముల కుమారులు. వారిద్దరూ ప్రమాదంలో మృతి చెందడంతో తమకు వారసులు లేకుండా పోయారని, చేతికి అందివచ్చిన కొడుకులు ఇలా మృతిచెందారని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గద్వాల పట్టణం బీసీ కాలనీకి చెందిన తెలుగు భాస్కర్ (41) మహారాష్ట్రలో కెనరా బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని భండారా జిల్లా వార్తి ప్రాంతం నుంచి హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. దీంతో బుధవారం భార్య పవిత్ర (38), కుమార్తె జ్యోత్స్న (10), కుమారులు అభిరాం (8), ప్రవీణ్‌తో పాటు కర్ణాటకకు చెందిన డ్రైవర్ శివప్ప (45)తో కలిసి కారులో బయల్దేరారు. ఈ క్రమంలో కర్ణాటకలోని విజయపుర జిల్లా మనగులి సమీపంలో సోలాపూర్– చిత్రదుర్గ హైవేపై వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో కారు డివైడర్‌ను ఢీకొని అవతలి లేన్‌లో ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో స్కార్పియో కారు తుక్కుతుక్కు కాగా అందులో ఉన్న భాస్కర్, పవిత్ర, జ్యోత్స్న, అభిరాం, డ్రైవర్ శివప్పలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయాలతో బయటపడిన ప్రవీణ్ కుటుంబసభ్యులను కోల్పోయి అనాథగా మిగిలాడు. -
ట్రాఫికింగ్ డాన్ హితేశ్ అరెస్ట్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విదేశాల్లో కొలువుల పేరిట వందలాది మంది భారతీయులను విదేశాల్లోని చైనా సైబర్ కేఫ్‌లకు విక్రయించిన మానవ అక్రమ రవాణా డాన్ హితేశ్ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. భారత విదేశాంగ శాఖ కోరిక మేరకు అతడిని మంగళవారం రాత్రి థాయ్‌లాండ్ ఇమిగ్రేషన్ అధికారులు ఇండియాకు డిపోర్ట్ చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన హితేశ్‌ను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని, విదేశాంగశాఖకు అప్పగించారు. మార్చిలో కరీంనగర్ పోలీసులు జారీచేసిన లుక్అవుట్ నోటీసుల ఫలితంగా హితేశ్ ఇండియా రాగానే అదుపులోకి తీసుకున్నారు. హితేశ్ ఇండియాకు వస్తున్నాడన్న సమాచారంతో మంగళవారం రాత్రి కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీసులు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, గుజరాత్‌కు చెందిన హితేశ్‌ను తెలంగాణ పోలీసుల కంటే ముందే ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రోజంతా జరిగిన హైడ్రామా తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలుగజేసుకోవటంతో ఎట్టకేలకు హితేశ్‌ను తెలంగాణ పోలీసులకు అప్పగించారు. దీంతో కరీంనగర్ పోలీసులు అతన్ని సాయంత్రానికి కరీంనగర్‌కు తరలించారు. దేశవ్యాప్త నెట్వర్క్ గుజరాత్‌లోని పోర్బందర్కు చెందిన హితేశ్ మానవ అక్రమ రవాణా సూత్రధారి. ఇతను థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్ దేశాల్లో సైబర్ నేరాలకు పాల్పడే కేఫ్‌లకు మనుషులను అక్రమంగా పంపిస్తాడు. విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలిప్పిస్తానని, నెలకు రూ.లక్ష జీతమని నమ్మబలికి ఒక్కో వ్యక్తిని 3,000 డాలర్లకు చైనీస్ సైబర్ కేఫ్‌లకు విక్రయించేవాడు. మనదేశంలో ఇతనికి ప్రతి రాష్ట్రంలో ఏజెంట్లు ఉన్నారు. ఇప్పటివరకు అతడు దాదాపు 300 మందికిపైగా భారతీయులను విక్రయించాడని సమాచారం. ఇతని ఏజెంట్లలో జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్యామారావు రాజశేఖర్ ఒకడు. వీరిద్దరు కలిసి గతేడాది డిసెంబర్లో కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన మధుకర్‌రెడ్డి అనే యువకుడిని మయన్మార్‌కు పంపారు. అక్కడ ఆ యువకుడు తిరగబడ్డాడు. ఈ విషయాన్ని ‘సాక్షి’వరుస కథనాలతో వెలికితీయడంతో స్పందించిన బండి సంజయ్.. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వివరించారు. దీంతో తొలుత అక్కడ సైబర్‌కేఫ్‌లో చిక్కుకున్న 540 మందిని మయన్మార్ సైన్యం సాయంతో కాపాడారు.తెలంగాణ సైబర్ పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానకొండూరు, ఖానాపూర్‌లో హితేశ్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లోనే కరీంనగర్ పోలీసులు హితేశ్‌పై లుక్అవుట్ నోటీసులు జారీచేశారు. మరో కీలక నిందితుడు రాజశేఖర్ లావోస్‌లో తలదాచుకుంటున్నాడని సమాచారం. భారతీయ యువతీ యువకులను చైనీయులకు విక్రయించిన హితేశ్.. వారు తిరగబడితే చిత్రహింసలు పెట్టి చీకటిగదుల్లో వేయించేవాడు. చైనీయుల కోసం వందల మంది భారతీయులను అంగడి సరుకుగా విక్రయించాడు. చివరికి ఆ చైనీయులే అతన్ని చితకబాది థాయ్‌లాండ్ ఇమిగ్రేషన్ అధికారులకు పట్టించడం కొసమెరుపు. -
పాక్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనకడుగు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పహల్గాం దాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని మోదీ వెనకడుగు వేశారని.. అదే ఇందిరమ్మ హయాంలో ఉగ్రవాదుల ముసుగులో భారత పౌరులపై దాడులకు తెగబడిన పాక్‌కు గట్టి గుణపాఠం చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సచివాలయం ముందు ఆయన విగ్రహానికి రేవంత్ పుష్పాంజలి ఘటించారు. రాజీవ్ వర్ధంతి రోజున ‘ఉగ్రవాద వ్యతిరేక దినం’గా పాటిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ.. ఉగ్రవాదంపై పోరాటం చేయడం ప్రతి భారతీయుడి దృఢ సంకల్పమన్నారు. దేశ భద్రత, సమగ్రతను కాపాడే విషయంలో రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి, భారత వీర జవాన్లకు ఎప్పుడూ అండగా నిలబడతామని చెప్పారు. కశ్మీర్లో పర్యాటకులపై కాల్పుల ఘటన, ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పోరాటం చేస్తున్న వీర సైనికులకు అండగా తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటగా సంఘీభావ ర్యాలీ నిర్వహించిందని గుర్తుచేశారు. నాడు ఇందిర అంగీకరించలేదు...: ఉగ్రవాదులను నిర్మూలించడంలో ఇందిరమ్మ ఆదర్శంగా నిలిచారని, నాడు యుద్ధం సందర్భంగా ఆమెరికా లేదా ఇతర దేశాల మధ్యవర్తిత్వాన్ని ఆమె అంగీకరించలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. భారత దేశ భద్రతను కాపాడుకోవడంలో ఎవరి సూచనలు, మధ్యవర్తిత్వం అక్కర్లేదని స్పష్టంగా చెప్పారన్నారు. ట్రంప్ చెబితే కాల్పుల విరమణ చేసిన పరిస్థితి ఇప్పటి కేంద్ర ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. కశ్మీర్ ఘటనలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు అందరం కేంద్రానికి, పోరాటం చేస్తున్న వీర జవానులకు అండగా నిలబడ్డామన్నారు. –చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రాహుల్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలకు తావివ్వకుండా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రతను కాపాడటంలో కృషిచేసిన మహాత్మాగాందీ, ఇందిరా గాందీ, రాజీవ్ గాందీ, బీఆర్ అంబేడ్కర్, పీవీ నరసింహారావు విగ్రహాలతో ఈ ప్రాంతం భారతీయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు. దేశాభివృద్ధిలో రాజీవ్ గాంధీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఓటు హక్కు కల్పించారని, ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో 21వ శతాబ్దంవైపు దేశాన్ని నడిపించారని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
TG: గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లుల చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లుల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం రూ.153 కోట్లు విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న 9990 బిల్లులు ఒకే రోజున ప్రభుత్వం క్లియర్ చేసింది. ఒకే విడతలో రూ.10 లక్షల లోపు బిల్లులను ప్రభుత్వం చెల్లించింది.2024 ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల నిధులకు ప్రాధాన్యం ఇచ్చింది. గత ప్రభుత్వం.. గ్రామ పంచాయతీలకు భారీ మొత్తంలో నిధులు పెండింగ్‌లో పెట్టింది. వీటితో పాటు ఎస్డీఎఫ్ (ప్రత్యేక అభివృద్ధి నిధి) కింద చేపట్టిన వివిధ పనులకు రూ.85 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. -
నాగం జనార్ధన్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ నాగం జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ బివి.నాగరత్నం, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ జరిపింది.నాగం జనార్ధన్‌రెడ్డి తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపిస్తూ.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పెద్ద ఫ్రాడ్ జరిగిందన్నారు. ప్రభుత్వ ఖజానాకు రూ.2426 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ప్రభుత్వం ఆమోదించిన ప్రకారం 65 శాతం పంపులు, మోటార్ల కోసం బీహెచ్ఈఎల్కు చెల్లింపులు చేయాలి. 35 శాతం సివిల్ వర్క్స్‌కు మేఘాకు చెల్లింపులు చేయాలి.. కానీ, అంతర్గత ఒప్పందం ప్రకారం బీహెచ్ఈఎల్కు 65 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు. మేఘాకు 80 శాతం చెల్లింపులు జరిగాయి. 65:35 నుంచి 20:80 కు ఎలా మారింది. ఇందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ వాదనలు వినిపించారు. న్యాయవాది ముకుల్ రోహతగి తన వాదనలు వినిపిస్తూ.. ‘‘తెలంగాణ హైకోర్టులో దీనికి సంబందించిన ఐదు పిటిషన్లు కొట్టివేశారు.. ఇందులో ఎలాంటి ఫ్రాడ్ లేదని స్పష్టం చేసింది. సివిసి కూడా ఇందులో ఏమి లేదని తేల్చింది. ఎస్టిమేషన్ పెంచడాన్ని తప్పు పడుతున్నారు. బీహెచ్ఈఎల్ కూడా ఇందులో ఫిర్యాదు చేయలేదు. ఏదో ఒక డాక్యుమెంట్ తెచ్చి కేసులు వేస్తున్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ బాగా పని చేస్తోంది’’ అని ముకుల్ రోహతగి తెలిపారు. -
కేసీఆర్‌కు నోటీసులపై కేటీఆర్ రియాక్షన్
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయోగంగా చూపించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని.. అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు(Notices To KCR) జారీ అయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(Kalvakuntla Rama Rao) అన్నారు. పాలన చేతకాక ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకమని మండిపడ్డారాయన. రేవంత్ సర్కార్(Revanth Sarkar)కు కమీషన్లు తప్ప.. పాలన చేత కాదు. ప్రజాపాలన కాస్త పర్సంటేజీల పాలనగా మారింది. 20 నుంచి 30 శాతం కమీషన్లు, పర్సంటేజీలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వంలో ఏ పని జరగదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే బహిరంగంగా చెపుతున్నారు. తమ అవినీతి కమిషన్ల నుంచి దృష్టి మరల్చేందుకే కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) నోటీసుల డ్రామా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోంది. అందులో భాగంగానే ఈ నోటీసులు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం ఓ చిల్లర ప్రయత్నం. ఇలా ఎన్నో నోటీసులు ఇచ్చినా దుదీ పించల్లా ఎగిరి పోతాయి. కమిటీల పేరుతో, కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తూ.. ఆరు గ్యారంటీల(Six Guarantees) అమలును పక్కనపెడదామనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలను చూస్తూ ఊరుకోబోం. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి’’ అని కేటీఆర్ అన్నారు. ఇదీ చదవండి: కేసీఆర్ చట్టానికేమైనా అతీతుడా? -
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం
హైదరాబాద్, సాక్షి: నగరంలో పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. సికింద్రాబాద్, బేగంపేట్, బోయిన్పల్లి, బంజారాహిల్స్, మోహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, కార్వాన్, మలక్‌పేట్, సైదాబాద్, చాదర్ ఘాట్, మారేడుపల్లి, షేక్‌పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, అత్తాపూర్, అంబర్పేట్, అత్తాపూర్, రాజేంద్రనగర్, నల్లకుంట, నాచారం, తార్నాక, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ఉప్పల్, రామంతాపూర్‌లో భారీ వర్షం కురుస్తోంది.ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని నగరం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నాం నుంచి ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ‘రెయిన్ అలర్ట్’ జారీ చేసింది.ఉపరితల ద్రోణి ఉదయం నుంచి హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలపై మేఘాలు కమ్ముకోగా.. మధ్యాహ్నాం నుంచి పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం(Hyderabad Rains) కురుస్తోంది. కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వాన పడుతోంది. మలక్ పేట్, నాంపల్లి, చార్మినార్, దిల్సుఖ్ నగర్, కోఠి, రామంతపూర్, అబిడ్స్, అంబర్పేట్.. తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, రాజ్ భవన్, ట్యాంక్ బండ్ సమీపంలో స్వల్ప వర్షంతో మొదలై.. జడి వానగా మారింది. నగర శివారు ప్రాంతాల్లో చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. మరికొన్ని గంటల్లో జంట నగరాల వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే.. రాత్రి సమయంలో హైదరాబాద్‌లో తీవ్రమైన తుఫాను(Cyclone) వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ(GHMC) అప్రమత్తం అయ్యింది. సాయంత్రం పనులు ముగించుకుని వెళ్లేవాళ్లను అప్రమత్తం చేస్తోంది. మ్యాన్ హోల్స్, కరెంట్ పోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు సూచించింది.ఇదిలా ఉంటే.. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాజధాని నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో(Telangana Rains) ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులపాటు ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వానలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఇక పంట చేతికొచ్చే సమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికార యంత్రాంగం సూచిస్తోంది. తెలంగాణకు రెయిన్ అలర్ట్వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్ అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉండడంతో.. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముందస్తు ప్రణాళికలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. అలాగే..ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లను సైతం అందుబాటులో ఉండాలని ఆదేశించింది.‘‘ఋతుపవనాలు ముందుగా రాబోతున్నాయి. అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలి. 2024లో కురిసిన భారీ వర్షాలకు NDRF అందుబాటులో లేకపోవడంతో గోల్డెన్ అవర్ కోల్పోయాం. 2024 సెప్టెంబర్ లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావొద్దు. జిల్లాల్లో కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు, సమన్వయం చేసుకోవాలి. సింగరేణి లో ప్రత్యేక శిక్షణ పొందిన రెస్క్యూ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి’’ అని సర్క్యులర్‌లో డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ కీలక ఆదేశాలుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సీఎస్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘‘ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలి. కలెక్టర్లు.. కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలి.హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలి. ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలి. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి’’ అని సీఎస్‌ను ఆదేశించారాయన. ఇదీ చదవండి: సూర్యుడిపైకి సాగర మేఘాలు -
తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు: మల్లు రవి వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయన్నారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇదే సమయంలో ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లారు.. కేసీఆర్ చట్టానికి అతీతులా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఎంపీ మల్లు రవి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నాయి. ముగ్గురు కలిసి ప్రజా ప్రభుత్వం మళ్ళీ రాకుండా కుట్ర చేస్తున్నారు. వీళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజా ప్రభుత్వమే వస్తుంది. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చట్టానికి అతీతులా?. ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళారు. బీహార్‌లో లాలు ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లలేదా?. కేసీఆర్, హరీష్, ఈటల.. కమిషన్ ముందు హాజరు కావాలి. నోటీసులు అందకపోవడానికి మనం ఏమైనా అమెరికాలో ఉన్నామా?. విద్యుత్ కమిషన్ విషయంలో కేసీఆర్ తప్పు చేశారు. ఇప్పుడైనా కాళేశ్వరం కమిషన్‌కు సహకరించాలి’ అని వ్యాఖ్యలు చేశారు. -
మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ప్రమాదం తప్పింది. ఉత్తమ్ హెలికాప్టర్ కోదాడలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు అత్యవసరంగా ల్యాండ్ అయినట్టు తెలిసింది.వివరాల ప్రకారం.. మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. హుజూర్నగర్ మండలం మేళ్లచెరువులో హెలికాఫ్టర్ ల్యాండ్ కావాల్సి ఉండగా.. వాతావరణశాఖ అధికారుల సూచన మేరకు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కమ్ముకున్న మబ్బులు, గాలివాన నేపథ్యంలో పైలట్ అప్రమత్తమయ్యారు. దీంతో, అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం, మంత్రి ఉత్తమ్ కుమార్.. కోదాడ నుంచి హుజూర్ నగర్‌కు రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు. -
తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
షాబాద్, పరిగి(వికారాబాద్ జిల్లా): రంగాపూర్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన ముత్యాల మల్లేశ్‌కు భార్య స్వప్న, ఇద్దరు కూతుళ్లు మాన్యశ్రీ, ఆర్యాధ్య, కూమారుడు ప్రనిల్ ఉన్నారు. మల్లేశ్ మండల పరిధిలోని నాగర్‌గూడలో కులవృతి అయిన కటింగ్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆయన మృతి చెందడంతో భార్యాపిల్లలు దిక్కులేనివారయ్యారు. సోలీపేట్కు చెందిన మంగలి బాలమ్మకు ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. అందరి వివాహాలయ్యాయి. చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన హేమలత తన ఇద్దరు పిల్లలను తీసుకుని పెళ్లికి వెళ్లింది. రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడిక్కడే మృతి చెందగా, మోక్షిత నీలోఫర్‌లో చికిత్స పొందుతోంది.అనాథలయ్యామురా.. ‘తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా.. నేను, నా పిల్లలు అనాథలయ్యామురా’.. అంటూ పెళ్లి కుమారుడి (సతీష్) అక్క స్వప్న తన తమ్ముడి పట్టుకుని విలపించింది. తండ్రి రామస్వామి రాగానే నా బతుకు ఆగమయ్యింది నాన్నా అంటూ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. న్యాయం జరిగేలా చూస్తాం.. రంగాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, సీనియర్ నాయకులు చేవెళ్ల స్వామి, డాక్టర్ రాజు, మాజీ ఎంపీటీసీ అశోక్, మాజీ సర్పంచ్‌లు జనార్దన్‌రెడ్డి, మహేందర్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, నరేందర్, రఫిక్, దయాకర్ తదితరులు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా కృషిచేస్తామని తెలిపారు. చదవండి: చిన్నవిందుకు హాజరై వస్తుండగా ప్రమాదం -
కమిషన్ నోటీసులకు భయపడేది లేదు: ఈటల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు పీసీ ఘోష్ కమిషన్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.తాజాగా ఈటల రాజేందర్ సాక్షితో మాట్లాడుతూ..‘నోటీసులకు భయపడేది లేదు. ఇంకా నోటీసులు అందలేదు. కాళేశ్వరం కమిషన్ విచారణకు సహకరిస్తాను. చట్టాలు, కోర్టులు, కమిషన్‌పై నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీలో కొంత మంది చిల్లర ఆరోపణలు చేస్తున్నారు. విచారణకు భయపడేది లేదు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. నేను ఆర్థిక శాఖమంత్రిగా పని చేసిన సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ప్రస్తుత రాష్ట్ర సీఎస్‌గా ఉన్నారని చెప్పారు. పీసీ కమిషన్‌ను ఎందుకు ఇన్నిసార్లు పొడిగించారో చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. తుమ్మల, కడియం, జూపల్లికి ఏం జరిగిందో తెలియదా? అని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా.. కాళేశ్వరంపై జూన్ ఐదో తేదీన విచారణకు రావాలని కేసీఆర్‌కు, జూన్ ఆరో తేదీన హరీష్ రావు, జూన్ తొమ్మిదో తేదీన ఈటల రాజేందర్‌ను విచారణకు రావాలని పీసీ కమిషన్ జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన వెంటనే మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అయితే, పీసీ ఘోష్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు అవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
కాళ్లకు పెట్టిన పారాణితోనే వరుడు పాడె ఎక్కాడు..
బయ్యారం(వరంగల్): మూడుముళ్లు.. ఏడు అడుగుల బంధంతో ఒక్కటైన ఆ జంటపై దేవుడు చిన్న చూపు చూశాడు. అప్పటి వరకు పెళ్లి బా జాలు మోగిన ఆ ఇంట.. చావు డప్పు మో గాల్సి వచ్చింది. కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభమై 48 గంటలు గడవకముందే న వవరుడు కన్నుమూశాడు. రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తుండగా విద్యుదాఘాతం సంభవించి మృతి చెందాడు. భర్త తన కళ్లెదుటే కానరానిలోకాలకు వెళ్లడంతో ఆ నవవధువు స్పృహ తప్పడంతో బంధువులు చికిత్స ని మిత్తం ఆస్పత్రికి తరలించారు. కాళ్లకు పెట్టి న పారాణితోనే ఆ వరుడు పాడె ఎక్కిన విషాదకరఘటన పలువురిని కన్నీటిపర్యంతం చేసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారం పంచాయతీ శివారు కోడిపుంజులతండాకు చెందిన ఇస్లావత్ బా ల, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. 14 సంవత్సరాల క్రితం బాల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో బతుకుదెరువు నిమిత్తం ఇద్దరు కుమారులు గణేశ్, నరేశ్(26)తో కలిసి తల్లి లక్ష్మి హైదరాబాద్‌లో ఉంటుండగా నరేశ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నరేశ్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంచికచర్ల గ్రామానికి చెందిన బానోత్ జాహ్నవితో వివాహం నిశ్చియం కాగా స్వగ్రామంలో రిసెప్షన్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా రిసెప్షన్ కోసం ఇటీవల రేకుల ఇల్లు నిర్మించుకున్నారు. ఆదివారం కంచికచర్లలో జాహ్నవితో వివాహం జరిపించారు.మోటారు రూపంలో బలితీసుకున్న కరెంట్..రిసెప్షన్ సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచే నరేశ్ ఇంటి వద్ద ఏర్పాట్లు మొదలు పెట్టారు. వంట చేసే వా రు భోజనాల తయారీలో నిమగ్నమయ్యా రు. వంట కోసం నీళ్లు అవసరం ఏర్పడడంతో నరేశ్‌ను మోటార్ ఆన్చేయని కోరారు. దీంతో నరేశ్ మోటర్ ఆన్ చేసే ప్రయత్నంలో విద్యుత్తీగలను సాకెట్లో పెడుతుండగా షాక్‌గురయ్యాడు. దీంతో కుటుంబీకు లు, స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దీంతో నరేశ్ మృతదేహం మీదపడి కుటుంబీకులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. మృత్యువు కరెంట్రూపంలో బలి తీసుకుందని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. చనిపోయే ముందు ఉప్మా అందించాడు..రిసెప్షన్ సందర్భంగా నరేశ్ ఉదయం తండాలోని పలువురు బంధువుల వద్దకు వెళ్లి ఉప్మా (అల్పాహారం) ఇచ్చి వచ్చాడు. ఆప్యాయంగా ఉప్మా అందించిన నరేశ్ ఇలా తమకు కన్నీటిని మిగిల్చి వెళ్తాడనుకోలేదని బంధువులు గుండెలవిసేలా రోదించారు. -
ఆశ్రమం నుంచి అత్తారింటికి నక్క మానస (ఫొటోలు)
-
ఒకరి ‘దూరం’.. ఇద్దరినీ ‘చేరువ’ చేసింది
కోనరావుపేట(వేములవాడ): చిన్న చిన్న భేదాలతో పలకరింపునకు దూరమైన సొంత అన్నదమ్ములను బంధువు మరణం కలిపింది. వివరాలు.. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన మామిండ్ల నాగయ్య, మామిండ్ల రామయ్య సొంత అన్నదమ్ములు. ఇద్దరికీ 64 ఏళ్లకు పైగా వయస్సు ఉంటుంది. ఒకే ఊరిలో ఉంటున్నా చిన్నచిన్న అభిప్రాయ భేదాలతో దశాబ్ద కాలంగా ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు. వృద్ధాప్యానికి చేరువైనా రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములు మాట్లాడుకోక పోవడం నాగయ్య కుమారుడు శ్రీనివాస్‌ను కలచివేసింది.ఎలాగైనా ఇద్దరినీ కలపాలని శ్రీనివాస్ కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ, సఫలం కాలేకపోయాడు. ఇదిలా ఉండగా నాగయ్య, రామయ్యల మేనల్లుడు కూన తిరుపతి నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ నెల 18న మూడో రోజు కార్యక్రమం (పిట్టకు పెట్టుడు) నిర్వహించగా, అన్నదమ్ములిద్దరూ హాజరయ్యారు. ఈక్రమంలో ఇద్దరినీ కలపాలని శ్రీనివాస్ భావించాడు. సోదరులు మామిండ్ల అంజయ్య, శ్రీనివాస్, రాజు, తిరుపతి, ఇతర బంధువులకు చెప్పడంతో వారు సహకారం అందించారు. నాగయ్య, రామయ్యకు బంధాల ప్రాధాన్యత వివరించారు. దీంతో ఇద్దరూ చెమర్చిన కళ్లతో ఆలింగనం చేసుకున్నారు. ఆత్మీయంగా పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ ఘటన కుటుంబాల ఐక్యతకు ప్రతీకగా సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది.సావుదలకు పట్టింపులెందుకు..మేము వృద్ధాప్యంలోకి వచ్చాం. కాటికి కాలుజాపిన మాకు పట్టింపులు ఎందుకు. గతంలో చిన్నచిన్న కారణాలతో దూరమయ్యాం. ఇక నుంచి ఇద్దరం కలిసే ఉంటాం.– మామిండ్ల నాగయ్యపొరపాట్లను వదిలిపెట్టాంమేము ఐదుగురం అన్నదమ్ములం. ముగ్గురు ఇదివరకే చనిపోయారు. మేమిద్దరం ఉన్నాం. ఉన్న ఇద్దరం కలిసుంటే బాగుంటుందని అనిపించింది. పదేళ్లుగా దూరంగా ఉంటున్న మేము చనిపోయేవరకు కలిసే ఉంటాం.– మామిండ్ల రామయ్య -
చిన్నవిందుకు హాజరై వస్తుండగా ప్రమాదం
పరిగి: హైదరాబాద్– బీజాపూర్ రహదారి రక్తసిక్తమైంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా 20 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లింట నిర్వహించిన చిన్నవిందుకు హాజరై వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పెళ్లికూతురు, పెళ్లికొడుకుకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుల్లో షాబాద్ మండలం సీతారాంపూర్‌కు చెందిన మల్లేశ్(35), ఇదే మండలం సోలిపేట్‌కు చెందిన బాలమ్మ (60), చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన హేమలత(32), ఫరూక్నగర్ మండలం కిషన్‌నగర్‌కు చెందిన సందీప్(28) ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ సంతోష్‌కుమార్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పరిగి ఆస్పత్రికి అక్కడి నుంచి తాండూరు, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పరిగి ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు.ఎలా జరిగిందంటే..వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన రామకృష్ణ, స్వప్న దంపతుల కూతురు మల్లేశ్వరిని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లికి చెందిన సతీష్‌కు ఇచ్చి ఈనెల 16న పరిగిలో వివాహం జరిపించారు. 19న చిన్నవిందు ఏర్పాటు చేయడంతో పెళ్లి కొడుకు బంధువులు సుమారు 50 మంది ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో రాత్రి 8:30 గంటలకు చందనవెళ్లి నుంచి పరిగికి చేరుకున్నారు. బస్సును పార్కింగ్ చేసి వస్తానని వెళ్లిన డ్రైవర్.. ఇదే ట్రావెల్స్‌కు చెందిన మరో బస్సు పాడవడంతో అందులో ఉన్నవారిని పరిగి నుంచి వారి గమ్యస్థానంలో వదిలేసి, తిరిగి అర్ధరాత్రి 1:20 గంటలకు పరిగికి చేరుకున్నాడు. పెళ్లికూతురు, పెళ్లికొడుకుతో పాటు బంధువులతో కలిసి చందనవెళ్లి బయలుదేరారు. పది నిమిషాలు కూడా గడవకముందే రంగాపూర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీకి సైడ్ ఇచ్చే క్రమంలో రోడ్డు పక్కన ఎడమ వైపు నిలిపి ఉన్న సిమెంట్ లోడ్ లారీని బలంగా ఢీకొట్టింది.తల్లి మృతి, ప్రాణాపాయంలో కూతురుప్రమాద స్థలంలో మృతిచెందిన హేమలత కూతురు మోక్షిత(5)కు తీవ్ర గాయాలు కావడంతో నగరంలోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. మిగిలిన వారిని వికారాబద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సుజాత, నీరజ, నిహారి, మహేశ్, అరుణ, సాహితికి కాళ్లు, చేతులు విరిగాయి. ప్రియాంక, కార్తీక్, రమేశ్, లక్ష్మి, రాములు, మంజుల, సుజాత, నవనీతకు స్వల్ప గాయాలయ్యాయి.పెళ్లి కొడుకు బావ మృతిపెళ్లికొడుకు సతీష్ బావ (అక్క భర్త) మల్లేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతని భార్య, ముగ్గురు పిల్లలు సైతం ఇదే బస్సులో ఉన్నారు. మృతుల్లో కిషన్‌నగర్‌కు చెందిన సందీప్‌కు ఆరు నెలల క్రితమే వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలం నాగుపల్లికి చెందిన మహేశ్వరితో వివాహం జరిగింది. పెళ్లికుమారుడికి మేనబావ కావడంతో ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఇతని తండ్రి గతంలోనే మృతిచెందగా ఒకేఒక్క కుమారుడైన సందీప్ అకాల మృతితో అతని కుటుంబం విలవిల్లాడుతోంది. -
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
రామగుండం(కరీంనగర్): స్థానిక తబితా ఆశ్రమంలో ఉంటున్న నక్క మానస ఆశ్రమం నుంచి అత్తారింటికి వెళ్లే సమయం సమీపిస్తోంది. పెళ్లి కూతురు ముఖంలో ఓ వైపు చిరునవ్వు, మరోవైపు ఆశ్రమ సంరక్షకులను, తోబుట్టువును విడిచి వెళ్తున్నాననే బాధ.. పెద్దపల్లి కలెక్టరేట్లోని దేవాలయంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష వివాహ వేడుక జరిపిస్తున్నారు. కాగా, 2021 మార్చి 15వ తేదీన ఆశ్రమంలో ఆశ్రయం పొందిన గుంజ విజయలక్ష్మి అనే యువతికి హైదరాబాద్‌లోని ఓ వ్యాపారితో వీరేందర్‌నాయక్ వివాహం జరిపించగా, నక్క మానస వివాహం రెండోది. 16ఏళ్ల క్రితమే ఆశ్రమంలో చేరిన అక్కాచెల్లెలు.. సుమారు 16ఏళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయిన అక్కాచెల్లెళ్లు నక్క మానస, నక్క లక్ష్మి సంరక్షణ కోసం ఇంటగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సరీ్వస్(ఐసీపీఎస్) అధికారులు స్పందించి రామగుండంలోని తబితా ఆశ్రమంలో చేరి్పంచారు. ఆనాటి నుంచి ఆశ్రమ నిర్వాహకుడు వీరేందర్‌నాయక్–విమల దంపతులు వారికి తల్లిదండ్రులుగా మారారు. నక్క మానస డిగ్రీ పూర్తి చేయగా, నక్క లక్ష్మి ఇంటర్మీడియట్ పూర్తిచేసింది. చిన్నప్పటి నుంచే చురుకైన పాత్ర.. ఆశ్రమంలో చేరిన సమయం నుంచి చదువులో, ఇంటిపనిలో చురుగా ఉంటోంది. ఇతరులతో మర్యాదగా వ్యవహరించడం తదితర గుణగణాలు కలిగిన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది మానస. ఐదో తరగతి వరకు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో విద్యనభ్యసించగా ఆరు నుంచి పదో తరగతి వరకు మేడారం గురుకుల విద్యాలయంలో చదివి టెన్త్9.8 జీపీఏ, ఎల్లంపల్లి కేజీబీవీలో ఇంటర్మీడియట్ చదివి ఎంపీసీ గ్రూపులో 895 మార్కులు, కరీంనగర్‌లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ(మ్యాథ్స్) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. ఎంత చెప్పినా తక్కువే చిన్నప్పటి నుంచి అమ్మానాన్న విమల, వీరేందర్‌నాయక్ అని తెలుసు. కానీ ఓ ఆశ్రమంలో సంరక్షకులుగా మాత్రం నాకు తెలియదు. చిన్నప్పటికీ నా బాధ్యతలు, కష్ట సుఖాలు అన్నీ వారితోనే పంచుకునే దాన్ని. ఇప్పుడు నాకు ఓ వ్యాపారితో వివాహం చేస్తుండడంతో నేను ఇల్లాలిగా మారుతున్నా. అప్పుడు నా చెల్లి నక్క లక్ష్మి, నాతోటి మిత్రులు, నా అమ్మనాన్నలు (సంరక్షకులు)విడిచి వెళ్లలేక పోతున్నా. నా వివాహం కలెక్టర్ జరిపిస్తుండడం మరీ విశేషం. – నక్క మానస, పెళ్లి కూతురు ఆనందమో.. బాధో తెలియడం లేదు పెళ్లీడుకొచ్చిన యువతికి వివాహం జరిపించడం నా కర్తవ్యం. అందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం ఊహకందని విషయం. బాల్యం నుంచే మమ్మల్నే తల్లిదండ్రులుగా భావిస్తూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నాం. ఇప్పుడు పెళ్లి చేసి కన్యాదానం చేయడం ద్వారా గుండెలు బరువెక్కుతున్నాయి. పెళ్లి కూతురు చెల్లి లక్ష్మి మరింత ఆవేదనకు లోనవుతుంది. ఆశ్రమంలో పెద్ద మనిగా వ్యవహరిస్తూ అన్ని విషయాల్లో ఎంతో చురుకుగా వ్యవహరించే కూతురు నక్క మానస. భవిష్యత్తులో ఆమె కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. – వీరేందర్‌నాయక్, తబితా ఆశ్రమ నిర్వాహకుడుఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు -
శంషాబాద్‌లో విమానానికి తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో లుప్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానానికి ప్రమాదం తప్పింది. విమానం రన్‌వే మీదకు వెళ్లిన వెంటనే విమానం ముందు టైరులో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఈ క్రమంలో పైలట్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది.వివరాల ప్రకారం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి ఫ్రాంక్ ఫోర్ట్ వెల్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. రన్‌వే మీదకు వెళ్లిన వెంటనే విమానం ముందు టైరులో సాంకేతిక సమస్య కనిపించింది. సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని తిరిగి మళ్లించారు. దీంతో, పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 190 మంది ప్రయాణీకులు ఉన్నారు. పైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. -
సరస్వతీ నది పుష్కర స్నానాలు..బారులు తీరిన భక్తజనం (ఫొటోలు)
-
HYD: డీసీఎంను ఢీకొన్నకారు.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, హయత్‌నగర్: హైదరాబాద్ నగర శివారు హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌లోని కుంట్లూరు వద్ద బుధవారం తెల్లవారుజామున అతి వేగంలో ఉన్న డీసీఎంను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను కుంట్లూరుకు చెందిన చంద్రసేనారెడ్డి, త్రినాద్ రెడ్డి, వర్షిత్ రెడ్డిగా గుర్తించారు. అయితే, ఇంటికి సరిగ్గా 100 మీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇంటికి చేరుకోవడానికి కొన్ని సెకన్ల ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. -
ఇంజనీరింగ్‌లో రెండు కొత్త కోర్సులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్‌లో మరో రెండు కొత్త కోర్సులు రాబో తున్నాయి. ఐఐటీ మద్రాస్ వీటిని అందుబాటులోకి తెస్తోంది. 2025–26 విద్యా సంవత్సరంలో జరిగే జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) కౌన్సెలింగ్‌లో ఇవి ఉంటాయని మద్రాస్ ఐఐటీ తెలిపింది. మద్రాస్ ఐఐటీలోని అప్లైడ్ మెకానిక్స్, బయో మెడికల్ విభాగాలు ఈ కోర్సును డిజైన్ చేశాయి. ఒక్కో విభాగంలో 40 సీట్లు ఉంటాయని ఐఐటీ అధికారులు తెలిపారు. ప్రస్తుత ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్సులను రూపొందించామని ప్రొఫెసర్ వి కామకోటి తెలిపారు. ఇవీ కోర్సులు ⇒ నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ రెండు కోర్సుల ప్రత్యేకతలను ఐఐటీ మద్రాస్ వెల్లడించింది. కంప్యుటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్ (సీఈఎం) కోర్సు ఏఐ టెక్నాలజీ ఆధారితంగా ఉంటుంది. సాధారణ ఇంజనీరింగ్ విద్య కు భిన్నంగా ఉండే ఈ కోర్సు వల్ల విద్యార్థి సరికొత్త మెకానికల్ టూల్స్‌పై పట్టు సాధిస్తాడు. సాలిడ్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ మెటీరియల్ సైన్స్, డైనమిక్స్‌లో అత్యాధునిక సాంకేతికతను అనుసంధానం చేశారు. ⇒ బయోమెడికల్ ఇంజనీరింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయో మెడికల్ ఇంజనీరింగ్ (ఐబీఎంఈ) ఉపయోగపడుతుంది. ఐవోటీ, ఏఐ, వెబ్ ఎనేబుల్డ్ మెడికల్ టెక్నాలజీని ఈ కోర్సు ద్వారా అందిస్తారు. మారుతున్న వైద్య రంగంలో మంచి ఉపాధికి ఇది తోడ్పడుతుందని చెబుతున్నారు. -
సామాజిక అంశాలపై స్ఫూర్తినిచ్చేలా..
సాక్షి, హైదరాబాద్: ‘ప్రపంచ సుందరి 2025’పోటీల్లో భాగంగా మంగళవారం ‘టీ హబ్’వేదికగా పోటీదారుల నడుమ ‘హెడ్ టు హెడ్ చాలెంజ్’నిర్వహించారు. అమెరికా, కరీబియన్, ఆఫ్రికా దేశాలకు చెందిన సుమారు 60 మంది పోటీదారులు ఇందులో పాల్గొన్నారు. వీరంతా ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’నినాదంతో వివిధ సామాజిక అంశాలపై తమ మనోగతాన్ని పంచుకున్నారు. మెరుగైన ప్రపంచం కోసం జరగాల్సిన కృషిపై తమ అభిప్రాయాలు వెల్లడించారు.బాలల విద్య, పర్యావరణం, పక్షవాతం, ప్రకృతి, యువతులకు మద్దతు, చిన్న సముదాయాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, యుక్త వయసులో ఆందోళన, మానసిక ఆరోగ్యం, ధ్రువీకరణ శక్తి, భాషా సంరక్షణ, బాలలపై హింస, సౌరశక్తి, ప్లాస్టిక్ కాలుష్యం, లింగ ఆధారిత హింస, బాలలపై లైంగిక వేధింపులు, ప్రత్యేక సముదాయాలకు విద్య, ఆర్థిక సంక్షోభాలు, ఆటిజం, మత్తు పదార్థాలు వంటి స్థానిక, అంతర్జాతీయ అంశాలు, సమస్యలపై పోటీదారులు ప్రసంగించారు. తాము ఎంచుకున్న అంశాలపై మాట్లాడుతూ సామాజిక మార్పు అవసరాన్ని నొక్కి చెప్పారు. అందులో తాము భాగస్వాములం అవుతామని ప్రకటించారు. స్ఫూర్తిని రేకెత్తించేలా.. విద్య, ఆరోగ్య సంరక్షణ, వాతావరణం, సామాజిక అభివృద్ధి వంటి అంశాల్లో పోటీదారుల ఆలోచనలను, వారిలో మానవతా విలువలు తదితరాలను ‘హెడ్ టు హెడ్ చాలెంజ్’లో మదింపు చేస్తారు. ఇది పోటీదారుల మధ్య ఒక పోటీ అనేకంటే వారిలోని ధైర్యం, కరుణ తదితరాలను ప్రదర్శించే ఒక కార్యక్రమం లేదా వేడుక లాంటిది. కాగా ఈ చాలెంజ్‌లో పోటీదారులు ప్రస్తావించిన అంశాలు ఎంతో స్ఫూర్తివంతంగా ఉన్నాయి. ‘తెలంగాణకు స్ఫూర్తి కేంద్రంగా పేర్కొనే టీ హబ్‌లో ఈ కార్యక్రమం జరగడం హర్షణీయం..’అని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్, సీఈఓ జూలియా మోర్లే అన్నారు. బుధవారం రెండోరోజు టీ హబ్‌లో జరిగే హెడ్ టు హెడ్ చాలెంజ్‌లో యూరప్, ఆసియా, ఓషియానియా దేశాలకు చెందిన పోటీదారులు పాల్గొంటారు. తప్పుకొన్న ఇంగ్లండ్ పోటీదారు మిల్లా మాగీ మిస్ వరల్డ్ పోటీల నుంచి ఇంగ్లండ్ ప్రతినిధి మిల్లా మాగీ అర్థంతరంగా తప్పుకున్నారు. ఆరంభంలో ఉత్సాహంగా పాల్గొన్న ఆమె.. వివిధ ప్రాంతాల సందర్శనకు వెళ్లిన సమయంలో తీవ్ర ఎండవేడిమి వల్ల వడదెబ్బకు గురైనట్టు తెలిసింది. రెండు రోజులుగా చికిత్స చేయించుకున్న ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిందని చెబుతున్నారు. ఆమె స్వదేశానికి పయనమవుతున్నట్టు సమాచారం. కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ సెంటర్ సందర్శన బ్రెస్ట్ కేన్సర్‌కు సంబంధించిన వైద్య సేవలను అందజేస్తున్న కిమ్స్ – ఉషాలక్ష్మి సెంటర్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు కొందరు మంగళవారం సందర్శించారు. సంస్థ చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు స్వాగతం పలికారు. మిస్ వరల్డ్ పోటీదారులు కిమ్స్‌ను సందర్శించడం సంతోషకరమని, బ్రెస్ట్ కేన్సర్ వైద్యసేవల్లో ఉషాలక్ష్మి ఫౌండేషన్ ద్వారా డాక్టర్ రఘురామ్ వందశాతం విజయాలను నమోదు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ జూలియా మోర్లే, నందిని గుప్తా (మిస్ ఇండియా 2025)తో పాటు ఇతర పోటీదారులు, రొమ్ము క్యాన్సర్ ప్రచారకర్త డాక్టర్ నియోమి మైల్న్ (మిస్ గౌడెలోప్ 2025– ఫ్రాన్స్), డాక్టర్ ఇదిల్ బిల్గెన్ (యూఎస్ఏ) తదితరులు పాల్గొని డాక్టర్ రఘురామ్ సేవలను కొనియాడారు. -
ఇద్దరూ దివ్యాంగులైనా.. ‘వివాహ కానుక’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రభుత్వం కానుక ప్రకటించింది. వికలాంగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నట్లుగా.. ‘వికలాంగుల వివాహ కానుక’పథకం నిబంధనల్లో మార్పులు చేసింది. ఇప్పటివరకు వివాహం చేసుకున్న జంటలో ఒకరు మాత్రమే దివ్యాంగులు ఉంటేనే ఈ పథకం వర్తిస్తుండగా, ఇకపై ఇద్దరూ దివ్యాంగులైనా పథ కం వర్తిస్తుంది. ఈ మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీచేశారు. ఎక్కువ మందికి ప్రయోజనం సాధారణ వ్యక్తులు దివ్యాంగులను వివాహం చేసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద అర్హులకు ప్రభుత్వం రూ.1 లక్ష అందజేస్తుంది. కానీ, చాలా సందర్భాల్లో వివాహం చేసుకునే అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ దివ్యాంగులు ఉంటున్నారు. వీరికి ఈ పథకం వర్తించటంలేదు. దీంతో నిబంధనలు మార్చి ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా ఆర్థికసాయం అందించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు పెద్ద ఎత్తున వినతులు అందాయి.దీంతో గతేడాది ఏప్రిల్ 18న ఈ శాఖ అధికారులు పథకం నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా నిబంధనలను సవరించింది. ఇకపై దివ్యాంగులను సాధారణ వ్యక్తులు వివాహం చేసుకున్నా, ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ జంటలోని మహిళ బ్యాంకు ఖాతాలో రూ.లక్ష ఆర్థిక సాయాన్ని జమ చేస్తుంది. ఈ నిబంధనలు తక్షణమే అమలు చేయాలని అనితా రామచంద్రన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.పదేళ్ల పోరాట ఫలితం: ముత్తినేని వీరయ్య వికలాంగుల వివాహ కానుక పథకం నిబంధనలు సడలించాలని పదేళ్లు పోరాటం చేశామని, ప్రస్తుత ప్రభు త్వం స్పందించి ఉత్తర్వులు జారీ చేయడం శుభపరిణామమని తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య మంగళవారం ఒక ప్రకటనలో హ ర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగులందరికీ న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నందుకు సీఎం ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఎవరి పనితీరు ఏంటో నివేదికల్లో ఉంది
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా మీ ఆలోచనలేంటో చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ఎమ్మెల్యేలకు ఉన్న ప్రజాసంబంధ అవసరాలు, బాధలు వినేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖిలో భాగంగా మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన నాగర్‌కర్నూల్, మెదక్, మల్కాజ్గిరి పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అయితే, గతంలో మాదిరి కాకుండా ఈసారి ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా భేటీ అయినట్టు తెలిసింది. ప్రతీ ఎమ్మెల్యేతో 10–15 నిమిషాలపాటు మాట్లాడిన రేవంత్.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను వినడంతోపాటు వారికి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం... ముఖాముఖి భేటీలో భాగంగా వారి పనితీరు గురించి రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. ఎవరి పనితీరు ఏంటో తన దగ్గర ఉన్న నివేదికలు చెబుతున్నాయని, ఎవరెవరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారో, ఎవరు ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తున్నారో తనకు తెలుసునని, పనితీరు మార్చుకోవాల్సిన వారు వెంటనే మారితే మంచిదని, లేదంటే తాను కూడా ఏమీ చేయలేనని హెచ్చరించినట్టు తెలిసింది. ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు వస్తాయని, ఆ నివేదికల ఆధారంగానే పార్టీ ముందుకెళ్తుందని కూడా చెప్పినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ తీర్చే బాధ్యత తనపై ఉందని, ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని ఎమ్మెల్యేలకు చెప్పారు. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసుకురావాలని, కాంగ్రెస్ నుంచి గెలిచిన ప్రతి ఎమ్మెల్యే తనకు సమానమేనని, అందరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. నల్లమల డిక్లరేషన్ సహా అన్నింటినీ అమలు చేస్తానని చెప్పారు. ఒక్కసారి గెలవడం గొప్ప కాదని, రెండోసారి, మూడోసారి గెలిచేలా ప్రజలను ఆకట్టుకోవడంలోనే ఎమ్మెల్యేల పనితీరు తెలుస్తుందని, రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు అసలు రాజకీయం ఏంటో అర్థమవుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు. సీఎంతో భేటీ అయిన వారిలో వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, గద్వాల ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఉన్నారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేశ్ అమెరికా పర్యటనలో ఉండటంతో భేటీలో పాల్గొనలేదు. -
సన్నాలకు బోనస్ ఎప్పుడు?
ఈ రైతు పేరు సుంకరి నరేష్. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం దత్తాపూర్ గ్రామం. 5 ఎకరాలకు పైగా పొలంలో సన్న వడ్లు సాగు చేశాడు. 140 క్వింటాళ్ల వరకు (350 బస్తాలు) దిగుబడి వచ్చింది. ధాన్యాన్ని కుద్వాన్పూర్ సొసైటీకి విక్రయించి నెల రోజులు దాటింది. పంట డబ్బులైతే వచ్చాయి. కానీ బోనస్ డబ్బులు మాత్రం ఇంతవరకు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. ప్రభుత్వం బోనస్ ఇస్తే తనకు రూ.70 వేల వరకు వస్తాయని, తదుపరి పంట పెట్టుబడికి పనికొస్తాయని చెబుతున్నాడు. సాక్షి, హైదరాబాద్: ఈ యాసంగి సీజన్లో సన్న ధాన్యం సాగు చేసిన రైతులు సర్కారు నుంచి రావలసిన బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచే యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాగా, ఇప్పటివరకు 55.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అయితే గతంలో ఏ యాసంగి సీజన్లోనూ లేనివిధంగా 18.47 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీల) సన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో రైతులు విక్రయించారు. పౌరసరఫరాల సంస్థ చరిత్రలోనే ఇది రికార్డు కాగా, ఈనెలాఖరు వరకు కొనుగోళ్లు సాగే అవకాశం ఉండటంతో 25 లక్షల నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల సంస్థ అంచనా వేస్తోంది. అయితే రైతులకు బోనస్ చెల్లింపులో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఇప్పటివరకు కొనుగోలు చేసిన 55.97 ఎల్ఎంటీ ధాన్యం విలువ రూ.12,974.10 కోట్లు కాగా, పౌరసరఫరాల సంస్థ రైతుల ఖాతాల్లో రూ.9,632.66 కోట్లు జమ చేసింది. అయితే ఆర్థిక శాఖ ద్వారా నేరుగా ప్రభుత్వమే విడుదల చేసే బోనస్ విషయంలో మాత్రం ఇప్పటివరకు ఉలుకూ పలుకూ లేకపోవడం గమనార్హం. బోనస్ ప్రకటనతో సన్న ధాన్యం సాగు తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగిలో సన్న ధాన్యాన్ని రైతులు ఎక్కువగా పండించరు. అయితే ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తుండటంతో రైతులు ఈసారి పెద్దయెత్తున సన్నాలు సాగు చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, అందులో ఏకంగా 7.15 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలే కావడం గమనార్హం. అలాగే నల్లగొండ, నారాయణపేట, జగిత్యాల, నిర్మల్, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున సన్న ధాన్యాన్ని పండించారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం బోనస్ ఇవ్వకపోవడంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ సీజన్లో రూపాయి ఇవ్వలే! యాసంగి సీజన్లో ఇప్పటివరకు 18.47 ఎల్ఎంటీల సన్న ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. క్వింటాల్‌కు రూ.500 బోనస్ చొప్పున 2,87,262 మంది రైతులకు రూ.923.40 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఆర్థిక శాఖ ఇప్పటి వరకు బోనస్ కింద రైతులకు రూపాయి కూడా విడుదల చేయలేదు. కొనుగోళ్లు మొదలై 45 రోజులు దాటినప్పటికీ, బోనస్ చెల్లించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కౌలు రైతులు సకాలంలో బోనస్ రాక, ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోవడం వల్లనే రైతులకు బోనస్ చెల్లించడంలో ఆలస్యం అవుతోందని ఓ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. మరో 15 రోజుల్లో వానాకాలం సీజన్ మొదలు కాబోతుండగా, ఇప్పటివరకు బోనస్ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై పౌరసరఫరాల శాఖకు చెందిన ఓ అధికారిని ప్రశ్నించగా, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. గత వానాకాలంలో రూ.1,200 కోట్లు చెల్లింపు గత వానకాలం సీజన్ నుంచే ప్రభుత్వం బోనస్‌ను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గత వానాకాలం సీజన్లో 24 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సన్న రకం ధాన్యం పండించిన సుమారు 4.50 లక్షల మంది రైతులకు రూ.1,200 కోట్లకు పైగా ప్రభుత్వం నేరుగా చెల్లించింది. ఆ సీజన్లో ధాన్యం కొనుగోళ్లతో పాటుగానే విడతల వారీగా బోనస్‌ను జమచేస్తూ వచ్చింది. యాసంగి ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యే నాటికి పూర్తిస్థాయిలో బోనస్‌ను చెల్లించింది. 180 క్వింటాళ్ల సన్న ధాన్యం అమ్మా నేను 8 ఎకరాలల్లో సన్న రకం వరి సాగు చేశా. 180 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మా. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు బోనస్ ఇవ్వలేదు. అలాగే రెండుసార్లు కాంటా పెడితే మొదటిసారి అమ్మిన ధాన్యానికి మాత్రమే డబ్బులు వచ్చాయి. రెండోసారి కాంటా పెట్టిన ధాన్యానికి ఇంకా రాలేదు. – గడ్డం పాలెం లింగారెడ్డి, రెంజర్ల, ముప్కాల్ మండలం, నిజామాబాద్ జిల్లా బోనస్ ఊసే లేదు.. వడ్లు కాంటా పెట్టి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం ఇస్తానన్న బోనస్ చెల్లించలేదు. బోనస్ ఇస్తానని ప్రభుత్వం ప్రకటించడం వల్లే వ్యాపారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లో అమ్మడం జరిగింది. ఇంటిల్లిపాదీ 15 రోజులు కష్టపడి వడ్లను ఆరబెట్టి కేంద్రాల్లో విక్రయిస్తే ఇప్పటివరకు బోనస్ ఊసే లేదు. – గుజ్జ రామకృష్ణ , తగిలేపల్లి, వర్ని మండలం, నిజామాబాద్ జిల్లా -
సూర్యుడిపైకి సాగర మేఘాలు
ఇది కూడా యుద్ధం వంటిదే! అయితే దేశాల మధ్య యుద్ధం కాదు. శాస్త్ర పరిశోధకులు సూర్యుడిని మసకబార్చి భూమిని చల్లబరిచేందుకు చేయబోతున్న మహా ప్రయోగ సంగ్రామం! ఈ జాజ్వల్యమాన జల వ్యూహంలో సముద్రతలం నుంచి నౌకలు, గగనతలం నుంచి విమానాలు ఉప్పు నీటి శతఘ్నులను సంధించి, తమ చెయ్యెత్తులో ఉన్న సాగర మేఘాలను చిక్కబరిచి వాటిని దట్టంగా మార్చేస్తాయి. ఆ బాహుబలి మేఘాలు, సూర్యుడి నుంచి వచ్చే తీక్షణమైన కిరణాలను అడ్డుకుని, వాటిని తిరిగి వెనక్కు అంతరిక్షంలోకి పంపిస్తాయి! వేడిమి నుంచి భూమిని కాపాడతాయి. మహోష్ణ గోళంతో మనిషి తలపడనున్న ఈ ఆపరేషనే ‘ఎంసీబీ’. మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్! -సాక్షి, స్పెషల్ డెస్క్మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ అనేది ఒక జియో ఇంజనీరింగ్ టెక్నిక్. భూతాపాన్ని అరికట్టే ప్రయత్నంలో, భూ వాతావరణాన్ని ప్రభావితం చేసే పర్యావరణ ప్రక్రియలను పెద్ద ఎత్తున మార్చడమే జియో ఇంజనీరింగ్. ప్రపంచవ్యాప్తంగా, మహా సముద్రాలపై సూర్యరశ్మిని వెనక్కు పంపించేలా వాతావరణంలోకి కృత్రిమ రసాయన వాయు కణాలను చొప్పించటం, భూతాప నియంత్రణకు సముద్రపు నీటిలో కరిగి ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చి పారేయటం వంటి అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టుల వంటి అన్నీ జియో ఇంజినీరింగ్ వ్యూహంలో భాగమే.ఎంసీబీ ప్రయోగాన్ని ఎలా చేస్తారు?వాతావరణంలోకి ఉప్పు నీటిని ‘ఎగచిమ్మటం’ ద్వారా సముద్ర మేఘాలను కృత్రిమంగా అత్యంత ప్రకాశవంతం చేయటమే మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్. దీనివల్ల ఏర్పడే ఉప్పు నీటి వాయు బిందువులు సముద్ర మేఘాల సాంద్రతను పెంచుతాయి. ఆ మేఘాలను ఢీకొని సూర్యరశ్మి వెనక్కు (పైకి) మళ్లుతుంది. దాంతో భూమి సంగ్రహించే ఉష్ణోగ్రత తగ్గి, భూతాప నివారణ జరుగుతుంది. సముద్రపు మేఘాలు సహజంగా మహాసముద్రాలపై ఏర్పడతాయి.అందుకు సముద్రపు ఉప్పు కీలకమైన పదార్థంగా పనిచేస్తుంది. సముద్రపు ఉప్పు కణాలు గాలి ద్వారా కదిలినప్పుడు అవి మేఘ బిందువులకు కేంద్రకాలుగా మారి, నీటి ఆవిరి వాటిపై ఘనీభవిస్తుంది. ఈ మేఘ బిందువుల సంఖ్య, పరిమాణం ఒక మేఘం ఎంత సూర్యరశ్మిని తిప్పి కొడుతుందో నిర్ణయిస్తాయి. ఇదంతా సహజ ప్రక్రియ. మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ విధానంలో సముద్ర మేఘాలకు మరిన్ని సముద్రపు ఉప్పు కణాలను జోడించడం ద్వారా ఈ సహజ ప్రక్రియను అనుకరించడం, మెరుగుపరచడం జరుగుతుంది. మెరైన్ స్నో మెషీన్లను, ప్రత్యేకమైన నాళాల వంటి పరికరాలను ఉపయోగించి సముద్రపు ఉప్పు నీటిని గాలిలోకి చల్లడం ద్వారా ఈ ప్రయోగం చేస్తారు.35 ఏళ్ల ప్రయత్నాలు.. 5ఏళ్లలో ప్రయోగాలు!1990లలో తొలిసారి బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త జాన్ లాథమ్‌కు ఈ ‘మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్’ ఆలోచన వచ్చింది. ప్రయోగాలకు అనుకూలమైన సముద్ర ప్రాంతాలపై మేఘాలను ప్రకాశవంతం చేయడం వల్ల భూతాపాన్ని పెరగకుండా చేయవచ్చని ఆయన తలపోశారు. ఎలాగంటే... ప్రత్యేక స్ప్రేయర్లతో వాతావరణంలోకి చిన్నపాటి సముద్రపు నీటి బిందువులను ఎగజిమ్ముతారు. ఇవి ఆవిరైపోయి ఉప్పు కణాలను మిగులుస్తాయి. ఆ కణాలు దట్టమైన, ప్రకాశవంతమైన మేఘాలను సృష్టిస్తాయి. అవి సూర్యరశ్మిని అడ్డుకుని భూమి మీద వాటి తీవ్రతను తగ్గిస్తాయి. ఇదీ జాన్ లాథమ్ ఆలోచన. ఇన్నేళ్లకు ఈ ఆలోచన ప్రయోగ దశకు చేరుకుంది. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రయోగం ఆచరణలోకి రావచ్చని ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తున్న ‘ఆరియా‘ అనే బ్రిటన్ సంస్థ అంచనా వేస్తోంది.రహస్య పరిశోధనా సంస్థ ‘ఆరియా’భూతాప వేగాన్ని నెమ్మదిపరిచే లక్ష్యంతో అనేకమైన జియో ఇంజనీరింగ్ ప్రాజెక్టు పనులు చేపట్టటానికి ‘అరియా’ అడ్వాన్డ్ రీసెర్చ్ ఇన్వెషన్ ఏజెన్సీ’ ఏర్పాటైంది. ఇందుకోసం ఈ ప్రభుత్వ రహస్య పరిశోధనా సంస్థ ఇంతవరకు ప్రజా పన్నుల నుంచి 800 మిలియన్ పౌండ్లను సమకూర్చుకుంది. ఇందులో ఒక్క మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ ప్రాజెక్టుకే 57 మిలియన్ పౌండ్లను బ్రిటన్ ప్రభుత్వం కేటాయించింది. అనధికారికంగా 2021 ఫిబ్రవరిలో, అధికారికంగా 2023 జనవరిలో ఈ సంస్థ ప్రారంభం అయింది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చే శాస్త్రీయ, సాంకేతిక పురోగతులను ఆవిష్కరించమే తన ధ్యేయం అని ఈ సంస్థ చెబుతోంది. ‘‘ఎంతో ఊహాజనితమైన, అతి కష్టతరమైన, వేరే చోట జరగటం అసంభవం అయిన పరిశోధనలను కొనసాగించడానికి మేము శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అధికారం ఇస్తాం’’ అని అరియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇలాన్ గుర్ అంటున్నారు.ఎంసీబీ ప్రయోజనాలు⇒ మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ భూమి గ్రహించే సూర్యరశ్మి పరిమాణాన్ని తగ్గించి భూతాపాన్ని నివారిస్తుంది. ⇒ భూగోళాన్ని చల్లబరిచి వేడిగాలులు లేకుండా, కరువు కాటకాలు రాకుండా చేయగలదు.⇒సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను తగ్గించి, పగడపు దిబ్బలు క్షీణించకుండా కాపాడుతుంది.ఎంసీబీ దుష్ప్రభావాలు⇒ వాతావరణ సమతౌల్యం, భూమికి నీటిని అందించే ‘అవపాత చక్రం’ (వర్షపు జల్లులు, మంచు, వడగళ్లు కురిసే కుదురైన వ్యవస్థ) దెబ్బతినే ప్రమాదం ఉంది.⇒ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను నియంత్రించే ‘ఎల్ నినో’ గతి తప్పవచ్చు.⇒ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలు నిష్ఫలం కావచ్చు. -
ఇంగ్లిష్ రాకనే గుమస్తాలయ్యాం
సాక్షి, హైదరాబాద్: ‘విద్య ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక స్థాయి నుంచే తెలుగుతోపాటు ఇంగ్లిష్ ను కూడా బోధించాలి’అని ప్రముఖ సినీ నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘తెలుగు వన్’యూట్యూబ్ చానల్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ‘ప్రపంచంలో తెలుగువాడు ముందుండాలి అన్న ఆలోచనతో తెలుగు వన్ను స్థాపించిన రవిశంకర్‌కు అభినందనలు. ఈ చానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నారు. నేను తెలుగువాణ్ణి అంటూ తెలుగు ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్. మనం తెలుగువాళ్లమే. మన మాతృభాష తెలుగు గురించి అందరూ చాలా గొప్పగా చెప్పారు. ఈరోజు ప్రపంచం గ్లోబలైజేషన్ అయిపోయింది. ఉద్యోగాలు కావాలంటే అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లిష్ కావాలి.. ఇంగ్లిష్ రావాలి. అమ్మ భాష మాతృ భాష తెలుగు అయితే, నడిపించే నాన్న భాష ఇంగ్లిష్. మేము పేదవాళ్లం. అందరికీ న్యూటన్ లాగానో, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాగానో ఐక్యూ చాలా గొప్పగా ఉండదు. అందరూ చదువుకోవాలి. మా ఊర్లో బీఏ చదివిన మొదటి వ్యక్తిని నేను. ఆ రోజుల్లో నాలాంటి పేదవాళ్లందరికీ ఇంగ్లిష్ రాక ఫెయిల్ అయ్యాం. ప్రాథమికస్థాయి నుంచి మాకు ఎప్పుడూ ఇంగ్లిష్ లేదు. మేం బీఏ, ఎంఏ, ఎంకామ్.. ఇలా అన్నీ పాస్ అయ్యాం. ఉద్యోగాల కోసం పరీక్ష రాసేందుకు వెళితే అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లిష్ లో ప్రశ్న పత్రాలు ఉండటం వల్ల మాకు అర్థం కాక ఫెయిల్ అయ్యాం. దీంతో గుమస్తాలు అయ్యాం.. ప్యూన్లు అయ్యాం.. అటెండర్లు అయ్యాం. ఈ దేశ సార్వ¿ౌమాధికారాన్ని కాపాడే జవాన్లు అయ్యాం. ఈ దేశంలో శాంతి భద్రతలు కాపాడే పోలీసులం అయ్యాం. కానీ ఇంగ్లిష్ మీడియం వచ్చిన వారు ఏమయ్యారు? కలెక్టర్లు, ఇంజినీర్లు, డాక్లర్లు అయ్యారు.. చాలా సంతోషంగా ఉంది. కానీ, విద్య ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తుందని అంబేద్కర్‌గారు చెప్పారో.. తెలుగు, ఇంగ్లిష్ అనే భేదం వల్ల ఇంగ్లిష్ వచ్చినవాళ్లు చాలా గొప్పవాళ్లు అయిపోయారు. తెలుగు వచి్చనవారు అథఃపాతాళానికి వెళ్లారు. అది కాకుండా ఉండాలంటే.. విద్య ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక స్థాయి నుంచే తెలుగుతో పాటు ఇంగ్లిష్ ని కూడా బోధించాలని నేను కోరుకుంటున్నాను’అని నారాయణమూర్తి తెలిపారు. -
బీటెక్‌లో ప్రమోషన్‌కు 20 క్రెడిట్స్..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఏకీకృత ప్రమోషన్ విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. కనీసం 20 క్రెడిట్స్ ఉంటే ప్రమోట్ చేయనున్నారు. సాంకేతిక విద్య అధికారులతో కూడిన కమిటీ ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీన్ని కేబినేట్ ఉప కమిటీ ఆమోదించినట్టు, 2025–26 విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుందని విశ్వసనీయంగా తెలిసింది. కొన్ని రోజుల క్రితం అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఏకీకృత విధానం అమలుపై ఇందులో ఏకాభిప్రాయం కుదిరింది. ఇంజనీరింగ్‌లో ఒక ఏడాది తర్వాత మరో ఏడాదికి వెళ్లేందుకు (ప్రమోట్ అయ్యేందుకు) ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో విధానం ఉంది. దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వర్సిటీల అధికారులు చెబుతున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కొంతమంది సభ్యులు సైతం ఈ అంశం సభ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. ఏకీకృత విధానం అమలుపై అధికారుల నుంచి నివేదిక కోరింది. ప్రస్తుతం హైదరాబాద్ జేఎన్టీయూహెచ్లో అనుసరిస్తున్న విధానాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని వర్సిటీల ఉప కులపతులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రధానంగా ఉస్మానియా, మహాత్మాగాం«దీ, జేఎన్టీయూహెచ్, కాకతీయ యూనివర్సిటీల పరిధుల్లో ఇంజనీరింగ్ విద్య కొనసాగుతోంది. ఒక్కో చోట ఒక్కో విధానం ఉస్మానియా, మహాత్మాగాంధీ వర్సిటీల్లో బీటెక్ మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదికి వెళ్లాలంటే విద్యార్థి ఫస్టియర్‌లో 50 శాతం క్రెడిట్స్ సాధించాలి. కానీ జేఎన్టీయూహెచ్, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో 25 శాతం క్రెడిట్స్ పొందితే సరిపోతుంది. ఆ తదుపరి సంవత్సరాల్లో ప్రమోట్ కావాలన్నా ఒక్కో వర్సిటీలో ఒక్కో క్రెడిట్ విధానం ఉంది. ఒక్కో సెమిస్టర్‌కు 20 చొప్పున ఏడాదికి 40 క్రెడిట్స్, నాలుగేళ్ళకు కలిపి మొత్తం 160 క్రెడిట్స్ ఉంటాయి. ఒక్కో వర్సిటీకి ఒక్కో విభిన్నమైన సిలబస్ ఉండటం వల్ల కూడా క్రెడిట్ విధానంలో తేడా ఉంటోంది. సిలబస్, పీరియడ్స్‌ను బట్టి 3 లేదా 4 చొప్పున క్రెడిట్స్ ఉంటాయి. జేఎన్టీయూహెచ్లో ఫస్టియర్ ఇంజనీరింగ్‌లో ఐదు థియరీ సబ్జెక్టులు, 3 ల్యాబ్‌లు ఉంటాయి. ఒక సబ్జెక్టు పాసయితే దానికి సంబంధించిన క్రెడిట్స్ విద్యార్థి ఖాతాలో పడతాయి. అయితే ఎక్కడ తేలికగా ప్రమోట్ అవుతారో ఆ యూనివర్సిటీలను విద్యార్థులు ఎంచుకుంటున్నారు. జేఎన్టీయూహెచ్ కన్నా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రమోట్ కావడం కష్టమని విద్యార్థులు భావిస్తున్నారు. 20 క్రెడిట్స్ ఉంటే ప్రమోట్ ప్రస్తుతం కనీసం 20 క్రెడిట్స్ ఉంటే తర్వాతసంవత్సరానికి ప్రమోట్ చేసే విధానంతెచ్చే యోచనలో ఉన్నారు. అంటే ఏటా ఆ ఏడాదికి సంబంధించిన సగం క్రెడిట్స్ విద్యార్థి సాధించాల్సి ఉంటుంది. దీంతోపాటే క్రెడిట్స్ విధానాన్ని మార్చాలని భావిస్తున్నారు. తొలి ఏడాది ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థికి రెండో సంవత్సరంలో సబ్జెక్టుపై కాస్త అవగాహన ఉంటుంది. కాబట్టి రెండో సంవత్సరంలో ఫస్టియర్ బ్యాక్‌లాగ్స్ లేకుండా చూసుకోవాలి. మూడో సంవత్సరం నుంచి 40% క్రెడిట్స్ సాధించాలి. ఇక ఆఖరి ఏడాదిలో పూర్తి క్రెడిట్స్ పొంది ఉండాలనే విధానం ఖరారు చేసినట్టు సమాచారం. నాలుగు వర్సిటీల అధికారులు ఇప్పటికే ఈ విధానంపై కసరత్తు పూర్తి చేశారు. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. విద్యాశాఖ అంగీకారం పొందాక దీన్ని అమల్లోకి తెస్తారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
అద్భుత శిల్పాల మ్యూజియం
అలంపూర్: అద్భుత శిల్పాల రమణీయం పురాతన శిల్ప సౌందర్యంలోనే కన్పిస్తుంది. పురాతన ఇతిహాసాలు, గాథలు, ప్రకృతి వింతలు, విశేషాలు, రాజరికపు గుర్తులు, సిరి సంపదలు, మనుషుల వేషధారణ, సంప్రదాయం వంటి అనేక అంశాలను శిల్పులు తమ శిల్ప కళ ద్వారా భావితరాలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. పురాతన చరిత్ర కలిగిన ప్రాంతాల్లో ఇలాంటి శిల్ప సంపదలు దర్శనమిస్తాయి. పురాతన ఇతిహాసాలకు, శిల్ప సౌందర్య కళకు అలంపూర్ పుట్టినిల్లుగా విరాజిల్లుతోంది. ఇక్కడ వెలసిన పురాతన ఆలయాల్లో శిల్పుల కళానైపుణ్యం పర్యాటకుల మనసులను రంజింపజేస్తాయి. అక్కడక్కడ కనిపించే శిల్పాలే పర్యాటకుల మనసులను ఆహ్లాదపరిస్తే.. అబ్బురపరిచే శిల్ప సమూహం ఒకే చోట కనిపిస్తే శిల్పాకళా ప్రేమికుల ఉల్లాసానికి అవధులుండవు. అలాంటి అద్భుత శిల్పాల సమూహం అలంపూర్ క్షేత్రం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ ప్రాంతంలో లభించిన పురాతన, అరుదైన శిల్పాలను పురావస్తు శాఖ ఒక చోట భద్రపరిచింది. అదే పురాతన శిల్పాల ప్రదర్శన క్షేత్రం. పురావస్తు మ్యూజియంగా ఏర్పాటుచేసి పర్యాటకుల సందర్శనకు అందుబాటులో ఉంచారు. 1952లో ప్రారంభం.. అలంపూర్‌లోని పురావస్తు ప్రదర్శనశాలను 1952లో ప్రారంభించారు. ఆలయాల పరిసర ప్రాంతాలతో పాటు సమీప గ్రామాల్లో లభించిన శిలా శాసనాలు, విగ్రహాలు అన్నింటినీ సేకరించి సిద్ధుల మఠంగా పిలవబడే మండపంలో మ్యూజియాన్ని ఏర్పాటుచేశారు. అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఇందులో 26 శిలా శాసనాలు, 188 శిలా విగ్రహాలు ఉన్నాయి. క్షేత్రానికి వచ్చే పర్యాటకులు మ్యూజియాన్ని సందర్శించే అవకాశం కల్పించారు. మ్యూజియంలో విశేషం ఇది.. ఉత్తరవాహిణి తుంగభద్ర నదీ తీరాన వెలసిన అలంపూర్ క్షేత్రం ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. దేశంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీజోగుళాంబ అమ్మవారి ఐదవ శక్తి పీఠం ఇక్కడ ఉంది. కోటి లింగాల క్షేత్రంగా అలంపూర్ ప్రసిద్ధిగాంచి.. దక్షిణకాశీగా పిలవబడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠంగల క్షేత్రంగా ఖ్యాతి దక్కించుకుంది. ఇక్కడ ఉన్న ఆలయాల్లో ప్రాచీన శిల్పకళకు అద్దంపట్టే శిల్పాలు పర్యాటకులను ఉల్లాసపరుస్తాయి. ఈ క్షేత్రంలో మరో అద్భుతమైన ప్రదేశం పురావస్తు ప్రదర్శనశాల. 6వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు రాజుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, వారిచే ఆరాధించబడిన దేవతా మూర్తుల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి. 6వ శతాబ్దంలోని బాదామి చాళుక్యుల కళాసంస్కృతికి ఇక్కడ వెలసిన శిల్పాలు నిదర్శనంగా ఉన్నాయి. 1500 ఏళ్ల క్రితం అలంకారానికి ఉపయోగించిన ఆభరణాలు, అప్పటి మహిళల వేషధారణ ఇక్కడి విగ్రహాలలో చూడవచ్చు. ఈ ప్రదర్శన శాలలో వీరాంగవీరులు (భర్త, భార్య ఇద్దరూ శత్రువులతో పోరాడి వీరమరణం పొందిన వారు), వీరుగల్లు, వీరశిలా విగ్రహాలు, వారి బల ప్రదర్శనలు నేటికీ స్పష్టంగా కనిపిస్తాయి. సతీ సహగమనానికి సంబంధించిన విగ్రహాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ ఖ్యాతి.. అలంపూర్‌లో లభ్యమై పురావస్తు మ్యూజియంలో భద్రపరిచిన శిల్పాలు దేశ విదేశాల్లో ఖ్యాతిని తెచి్చపెడుతున్నాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన శిల్పాలు కేవలం సందర్శనలకే గాక ప్రపంచ పురావస్తు శిల్పాల ప్రదర్శనలకు వెళ్లి అరుదైన గౌరవాలను దక్కించుకున్నాయి. 1977లో ఇక్కడి నటరాజ మూర్తి విగ్రహాన్ని లండన్‌లో ప్రదర్శించడం జరిగింది. అలాగే 1984లో సూర్య విగ్రహాన్ని జర్మనీలో, 2008లో సూర్య, నాగ, మహిషాసురమర్ధిని విగ్రహాలను బెల్జియంలో ప్రదర్శించగా ఖ్యాతి గడించాయి. మంత్రముగ్ధులను చేసే విగ్రహాలు.. శిల్పాచార్యులు స్థానికంగా లభించే నల్లరాతి శిలతో అందంగా నటరాజ విగ్రహాన్ని చెక్కారు. ఈ విగ్రహంలో కనిపించే శరీర సౌష్టవాలు నాట్యభంగిమలు నాట్యకళాకారులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అదే విధంగా 7–8 శతాబ్దాలకు చెందిన సూర్య విగ్రహం కూడా మెత్తటి ఎర్రఇసుక, రాతిని ఉపయోగించి తయారు చేశారు. ‘సప్తాస్వ రథసమారూఢం’అన్నట్టుగా ఏడు గుర్రాలతో ఒకే చక్రం కలిగిన రథం, ఉషా, ఛాయా సమేతంగా సూర్య విగ్రహాన్ని అందంగా మలిచి ఉన్న ఈ విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది. ఇక 6–7 శతాబ్దాలకు చెందిన నాగబంధ విగ్రహాన్ని పరిశీలిస్తే.. పద్మ బంధంలో ఏడు తలలు కలిగి మానవ ఆకృతిని పోలి ఉన్న నాగబంధ విగ్రహం కళాకారులను మనసు దోచుకుంటుంది. 7–8 శతాబ్దాలకు చెందిన మహిషాసురమర్దిని విగ్రహం కూడా అలనాటి దేవీభాగవతాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంది. అసుర సంహారం కోసం మహిషాసురిడిని సంహరించి మహిషి తలపై తాండవం చేస్తున్నట్టు ఆదిపరాశక్తి అభయముద్రలో దర్శనమిస్తుంది. అలాగే అలనాటి వైభవాన్ని చాటి చెప్పే స్తంభాలను నేటి తరాలవారిని అదరహో అనిపిస్తాయి. ఈ స్తంభంపై మలచబడిన శిల్పా ఆకృతులను పరిశీలిస్తే పట్టుచీరలపై ఉన్న బార్డర్ల డిజైన్లు తలపిస్తున్నాయి. నంది వాహనంపై శివపార్వతులు.. పరమశివుడి రూపం ఎక్కడ చూసినా లింగరూపంలోనే దర్శనమిస్తుంది. సతీ సమేతుడై ఉన్న పార్వతీ పరమేశ్వరుడు నంది వాహనంపై ఆశీనులై దర్శనమివ్వడం అనేది చాలా అరుదు. కానీ అలంపూర్‌లో మాత్రం దేవతా స్వరూపంలో, అది కూడా శివుడు పార్వతీ సమేతుడై నంది వాహనంపై కూర్చుని ఉండటం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. అలాంటి విగ్రహం చూడాలంటే అలంపూర్ మ్యూజియానికి రావాల్సిందే. శిలాశాసనం ద్వారా తెలిసేదేమిటంటే.. ఆలయాల మనుగడ కోసం ఆనాటి రాజులు ఎన్నో భూములను మాణ్యాలుగా సమర్పించారు. సూర్య, చంద్రులు ఉన్నంత వరకు ఈ మాణ్యాలు ఆలయాలకు చెందాల్సిందేనని.. అలాంటి మాణ్యాలను ఎవరైనా హస్తగతం చేసుకుంటే గోవధ చేసినంత పాపం వస్తుందని తెలియజేస్తూ ఆ శాసనంపై సూర్య, చంద్రులు, లింగం, ఆవు, ఖడ్గం వంటి బొమ్మలతో శిలాశాసనం చేశారు. అది హలగన్నడ లిపిలో కనిపిస్తుంది. -
అప్పు..రెండింతలు!
ఆర్థిక లావాదేవీల విషయంలో భారతీయ కుటుంబాల్లో ఇటీవలి కాలంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పు తీసుకోవడానికి ఎవరూ వెనుకంజ వేయడం లేదు. దీంతో జీడీపీలో అప్పులు శాతం 2011–12తో పోలిస్తే 2023–24 నాటికి దాదాపు రెట్టింపునకు చేరింది. అలాగే కుటుంబాలు తమ వద్ద నగదు నిల్వలు అట్టిపెట్టుకోవడం తగ్గించి పెట్టుబడులవైపు దృష్టి సారిస్తున్నారు. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు 2019–20తో పోలిస్తే 2023–24 నాటికి దాదాపు నాలుగు రెట్లు దూసుకెళ్లాయని కేంద్ర గణాంకాల శాఖ తాజా నివేదిక చెబుతోంది. కుటుంబ అప్పుల్లో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల వాటా 98.8 శాతానికి ఎగసింది. షేర్లలో పెట్టుబడులు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్దేశంలో 2019 నుంచి ఈ అయిదేళ్ల కాలంలో బ్యాంకుల రుణాలు 284 శాతం పెరిగాయి. గృహాల్లో నగదు నిల్వలు 58 శాతానికి పైగా తగ్గాయి. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలలో (ఎన్బీఎఫ్సీ) డిపాజిట్లు 57 శాతం అధికం అయ్యాయి. దేశంలో మ్యూచువల్ ఫండ్లతో సహా షేర్ మార్కెట్లో పెట్టుబడులు 191 శాతం ఎగశాయి. ఐపీఓల ద్వారా మొత్తం నిధుల సమీకరణ 2024 ఏప్రిల్–డిసెంబర్ మధ్య రూ.11.1 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది 2023–24లో అందుకున్న మొత్తంతో పోలిస్తే 5 శాతం ఎక్కువ. డిజిటల్ లావాదేవీల రయ్ రయ్ దేశంలో ప్రజల ఆర్థిక కార్యకలాపాల్లో మార్పులకు ప్రధాన కారణం డిజిటల్ లావాదేవీల పెరుగుదల. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకారం 2023–24లో రిటైల్ చెల్లింపుల్లో డిజిటల్ పేమెంట్స్ వాటా 80 శాతంగా నమోదైంది. మొత్తం డిజిటల్ లావాదేవీల సంఖ్య 13,100 కోట్లకుపైమాటే. కానీ ఈ లావాదేవీల విలువ రికార్డు స్థాయిలో రూ.200 లక్షల కోట్లను దాటింది. వినియోగంలో సౌలభ్యం, విస్తరిస్తున్న నెట్‌వర్క్‌తో కోట్లాది మందికి రియల్–టైమ్ చెల్లింపుల వేదికగా యూపీఐ మారింది. బంగారంలా దాచుకుని.. సురక్షిత పొదుపు సాధనంగా బంగారం అవతరించింది. భారతీయ కుటుంబాలు పుత్తడి, బంగారు ఆభరణాలు, వెండి కొనుగోలుకు 2019–20లో రూ.43 వేల కోట్లు వెచి్చంచాయి. 2023–24 నాటికి ఇది 51 శాతం దూసుకెళ్లి రూ.65 వేల కోట్లకు చేరింది. బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.8.89 లక్షల కోట్ల నుంచి 57 శాతం అధికమై రూ.13.91 లక్షల కోట్లను తాకాయి. స్థిరాస్తులకు 71 శాతం అధికంగా రూ.38.44 లక్షల కోట్లు ఖర్చు చేశారు. అయితే బ్యాంకుల నుంచి అందుకున్న రుణాలు రూ.4.83 లక్షల కోట్ల నుంచి భారీగా పెరిగి రూ.18.56 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. -
గుట్టలతో గాలివాటానికి అవాంతరం
సాక్షి, హైదరాబాద్: వరంగల్ విమానాశ్రయంతోపాటే పనులు ప్రారంభిద్దామనుకున్న కొత్తగూడెం విమానాశ్రయ కసరత్తుకు అవాంతరం ఎదురైంది. విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని భావించి గుర్తించిన స్థలం పనికిరాదని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తేల్చిచెప్పింది. దీంతో కొత్తగూడెం విమానాశ్రయానికి మరో స్థలం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా దీని నిర్మాణ కసరత్తులో జాప్యం తప్పేలా కనిపించటం లేదు. ముచ్చటగా మూడో స్థలం కోసం.. రాష్ట్రంలో ప్రతిపాదించిన ఆరు విమానాశ్రయాల్లో కొత్తగూడెం కూడా ఒకటి. ఇందులో వరంగల్ శివారులోని మామునూరు పాత ఎయిర్‌స్ట్రిప్ ఉన్న స్థలంలో భారీ విమానాశ్రయ నిర్మాణానికి ఇప్పటికే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఓకే చెప్పిన విషయం తెలిసిందే. దాని తర్వాత రెండో విమానాశ్రయంగా కొత్తగూడెంను ముందుకు తెచ్చారు. ప్రతిపాదించిన సమయంలో తొలుత పాల్వంచ సమీపంలోని గుడిపాడు–బంగారుజాల మధ్య స్థలాన్ని గుర్తించారు. అది అనుకూలంగా లేదని ఏఏఐ తేల్చటంతో గతేడాది చివరలో కొత్తగూడెం మండలంలోని రామవరం, సుజాతనగర్ మండలం పరిధిలో సుజాతనగర్ గ్రామం, చుంచుపల్లి మండల పరిధిలోని చుంచుపల్లి గ్రామాల సరిహద్దులో 950 ఎకరాల భూమిని గుర్తించారు. ఈ ప్రాంతానికి సంబంధించిన పదేళ్ల వాతావరణ నివేదికలు, విండ్రోజ్ డయాగ్రామ్ తదితర నివేదికలను స్థానిక అధికారులు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి నివేదించారు. వీటితోపాటు ఆ స్థలాన్ని ఇటీవల పరిశీలించిన ఏఏఐ అధికారులు.. ఆ భూమి కూడా యోగ్యంగా లేదని తేల్చి ఉసూరుమనిపించారు. ప్రతిపాదిత స్థలంలో 2800 మీటర్ల రన్‌వేను నిర్మించాల్సి ఉంది. ఇది తూర్పు–పశ్చిమ దిశలో ఉంటుంది. ఈ రన్‌వేను 10/28 పద్ధతిలో ల్యాండింగ్, టేకాఫ్ రెండింటికీ ఉపయోగపడేలా నిర్మించాలని నిర్ణయించారు. కానీ, రన్‌వేకు ఉద్దేశించిన ప్రాంతానికి కొంత చేరువగా ఎత్తయిన గుట్టలున్నాయి. అవి గాలి వాటాన్ని అడ్డుకోవటం ద్వారా విమానాల టేకాఫ్, ల్యాండింగ్లపై ప్రభావాన్ని చూపుతాయని అథారిటీ తేల్చింది. తొలుత చిన్న విమానాలకు సరిపడే ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించాలని భావించినా, వరంగల్ తరహాలో వేయి ఎకరాల్లో ఎయిర్‌బస్ విమానం దిగగలిగే రన్‌వేతో పెద్ద విమానాశ్రయాన్నే నిర్మించాలని నిర్ణయించారు. కానీ, కొత్తగూడెం ప్రాంతం యావత్తు గుట్టలతో నిండి ఉన్నందున అంత పెద్ద విమానాశ్రయానికి అనువైన స్థలం లభించే విషయంలో ఇప్పుడు అనుమానాలు నెలకొన్నాయి. -
ఆరో రోజు..అదే రద్దీ
భూపాలపల్లి/కాళేశ్వరం: అష్టమి కావడంతో త్రివేణి సంగమ తీరానికి ఉదయం వేళ భక్తుల రద్దీ తక్కువగా ఉన్నా, క్రమక్రమంగా పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరానికి ఆరవ రోజైన మంగళవారం భక్తులు పుష్కర స్నానాలకు వచ్చారు. వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తజనం సరస్వతిçఘాట్‌కు చేరుకున్నారు. పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి, నదీమాతకు విశేష పూజలు చేశారు. నదీ తీరంలోనే సైకత లింగాలను తయారు చేసి శివుడిని ప్రత్యేకంగా పూజించారు. ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన 17 అడుగుల ఏకశిల సరస్వతీమాత, కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. 50 వేల మంది వరకు భక్తులు స్నానాలు ఆచరించినట్టు అధికారులు అంచనా వేశారు. గోదావరి నదిలోకి భక్తులు వెళ్లకుండా కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశాల మేరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఘాట్, ఆలయ పరిసరాల్లో పరిశుభ్రతను పాటించాలని చెప్పడంతో సిబ్బంది బ్లీచింగ్ చల్లారు. వర్షం పడితే రోడ్లు బురదమయం కాకుండా గ్రావెల్ చిప్స్ వేసి నీటిని చల్లుతున్నారు. ఎస్పీ కిరణ్‌ఖరే ట్రాఫిక్‌పై దృష్టి సారించారు. డివైడర్లు ఏర్పాటు చేసి పోలీసు ఫోర్స్‌తో వాహనాల నియంత్రణ చేపట్టారు. హైకోర్టు జడ్జి సృజన, ఎస్ఐబీ డైరెక్టర్ తరుణ్‌జోషి, ఇంటెలిజెన్స్ డీజీ శశిధర్‌రెడ్డిలు పుష్కర స్నానాలు చేసి శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. కాగా, ప్రతీరోజు సరస్వతి పుష్కరాల్లో రాత్రి 7.30 గంటలకు నిర్వహిస్తున్న నవరత్నమాలిక హారతిని ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నదీ హారతికి భారీ స్పందన రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. బుధవారం నుంచి హారతి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. కాగా, మంగళవారం రాత్రి నిర్వహించిన నవరత్నమాలిక హారతికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరయ్యారు. -
విద్యుదాఘాతంతో ఆరుగురు మృతి
బయ్యారం/మిరుదొడ్డి (దుబ్బాక)/జగదేవ్‌పూర్ (గజ్వేల్)/పిట్లం (జుక్కల్)/ తొగుట (దుబ్బాక): విద్యుత్ తీగలు ప్రాణాలు తీశాయి. వేర్వేరుచోట్ల కరెంట్ షాక్‌కు గురై ఆరుగురు మృతిచెందారు. పెళ్లయిన 48 గంటలకే.. పెళ్లి బాజాలు...డీజే మోతలు మోగిన ఆ ఇంట చావు డప్పు మోగింది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా య్యారం మండలం కోడిపుం జుల తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ఇస్లావత్ నరేశ్ (26)కు ఏపీలోని కృష్ణాజిల్లా కంచికచర్లకు చెందిన జాహ్నవితో ఆదివారం వివాహం జరిగింది. సోమవారం తండాకు దంపతులిద్దరూ వచ్చారు. మంగళవారం నరేశ్ ఇంటి వద్ద మోటార్‌ను ఆన్‌చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గుర య్యా డు. ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. విద్యుత్ సర్వీస్ వైరుపైపడి.. కౌలు రైతు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పీర్లపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. జగదేవ్‌పూర్‌కు చెందిన మహ్మద్ షాదుల్ (25) మామిడితోటను కౌలుకు తీసుకున్నాడు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో మామిడి చెట్టుకు ఇనుప స్టాండ్ వేసుకొని ఎక్కి వలను చుడుతున్నాడు. ఈ క్రమంలో స్టాండ్‌పై నుంచి జారి కిందున్న విద్యుత్ సర్వీస్ వైర్‌పై పడటంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదవశాత్తూ కరెంట్ తీగలు తగిలి.. విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతెలో చోటు చేసుకుంది. భూంపల్లి ఎస్ఐ హరీశ్ కథనం మేరకు.. మోతె గ్రామానికి చెందిన మంగోరి కృష్ణ హరి (60) తనకున్న ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. మంగళవారం పొలం వద్దకు వెళ్లాడు. అయితే సోమవారం రాత్రి వీచిన గాలి వానకు పొలంలో కరెంటు స్తంభం పడిపోయి ఉంది. ఇది గమనించని కృష్ణ హరి వ్యవసాయ పనులు చేస్తుండగా తీగలు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మోటారు తీస్తుండగా విద్యుత్ తీగలు తగిలి.. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కంబాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ శివారులోని పొలంలో బోరు మోటారు పని చేయకపోవడంతో మంగళవారం గ్రామానికి చెందిన రాములు (42), హన్మయ్య (59) బోరు మోటారును తీయడానికి వెళ్లారు. మోటారును పైకి తీస్తున్న క్రమంలో మోటార్‌కు ఉన్న ఇనుప పైప్ పైన ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్‌షాక్‌తో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మత్తులో ట్రాన్స్ఫార్మర్ను ముట్టుకుని.. సిద్దిపేట జిల్లా తొగుటకు చెందిన రామారపు రాజు (36) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. రోజూ మాదిరిగా మంగళవారం కూలి పనికి వెళ్లి.. సాయంత్రం మద్యం సేవించి ఇంటికొచ్చాడు. మత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ముట్టుకోగా కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. -
గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా భూగర్భ జలాలు
సాక్షి, హైదరాబాద్: భూగర్భ జలాల స్థాయిని గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్‌గా విభజించి ఆయా గ్రామాలు ఏ జోన్లలో ఉన్నాయో గ్రామ పంచాయతీ గోడల మీద రాయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వాల్టా అథారిటీలను నియమించాలన్నారు. నీరు, భూమి, చెట్ల చట్టం (వాల్టా) రాష్ట్ర ప్రాధికార కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మంగళవారం తొలిసారి నిర్వహించిన ఈ ప్రాధికార కమిటీ సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. వాల్టా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పా రు. భూగర్భజలాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. వాల్టా చట్టంపై వారం రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. నీటిని అధికంగా వినియోగిస్తున్నార ని కొన్ని ప్రాంతాలపై ఆంక్షలు పెడితే ఉపయో గం ఉండదని, కొత్తగా బోర్లు వేయవద్దని అధికారులు ఆంక్షలు పెట్టినా ప్రజలు అంగీకరించే పరిస్థితి ఉండదని మంత్రి పేర్కొ న్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు స్థానిక అధికారులతో కమిటీలు వేసి మూడు నెలలకోసారి విధిగా వాల్టా అథారిటీలు సమావేశమయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వాల్టా నిధిని ఏ ర్పాటు చేసి, తద్వారా పర్యావరణహితం ఈ నిధులను వినియోగిస్తామని మంత్రి చెప్పారు. నీటిని అధికంగా వాడడం వల్ల భూగర్భ జలా లు పడిపోతున్నాయని సమావేశంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమా వేశంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్లు రాజశేఖర్, పాండురంగారెడ్డి, ఉమాదేవి, జలసాధనా సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడు తీర్మానాలను ఆమోదించారు. -
అగ్ని ప్రమాదంపై ఉన్నతాధికారుల కమిటీ
సాక్షి, హైదరాబాద్: గుల్జార్ హౌస్ అగ్నిప్రమా దం ఘటనపై సమగ్ర విచారణ కోసం ఆరుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ నెల 18న ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించి 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనపై విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఫైర్ విభాగం డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ , టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్లతో కూడిన కమిటీని నియమించినట్లు మంత్రి తెలిపారు. ఘటనకు గల కారణాలు, ఘటన అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై సీఎంకు కమిటీ సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయి లో ప్రజలకు ఇవ్వాల్సిన సూచనలతో ప్రతిపాదనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం దాని ఆధారంగా సీఎం, డిప్యూటీ సీఎం, ఉన్నతాధికారులు సమీక్ష చేసి చర్యలు చేపడతారని తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం పరిశీలన చార్మినార్: అగ్ని ప్రమాదం సంభవించిన భవనాన్ని మంగళవారం క్లూస్, ఫోరెన్సిక్ నిపుణుల బృందం పరిశీలించింది. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత తొలిసారిగా భవనంలో ప్రవేశించిన అధికారుల బృందం.. భారీ స్థాయిలో అగ్నిప్రమాదం సంభవించడానికి గల కారణాలతో పాటు భవనంలోని ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసింది. భవనంలో దాదాపు 14 ఏసీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గాలి, వెలుతురు సక్రమంగా లేకుండా ఏసీలు పనిచేస్తుండడంతో అవి అధిక ఒత్తిడికి గురైనట్లు భావిస్తున్నారు. అధిక ఒత్తిడి కారణంగా ఏసీ కంప్రెషర్ ఏదైనా పేలిపోయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఫ్లోరింగ్ ధ్వంసం.. గోడలన్నీ బీటలు బయటకు వెళ్లేందుకు సొరంగం లాంటి ఇరుకు మెట్ల దారి ఉండడం వల్లే బాధితులు ప్రమాదం నుంచి బయట పడలేకపోయారని అధికారులు నిర్ధారించారు. తీవ్రమైన మంటలకు గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండంతస్తులు పూర్తిగా కాలిపోయాయి. గదుల గోడలన్నీ బీటలు వారాయి. షాబాద్ ఫ్లోరింగ్ పూర్తిగా ధ్వంసం అయింది. భవనం మొత్తం పనికిరాని విధంగా తయారయ్యింది. రాబోయే రోజుల్లో నివాసానికి పనికి రాదని ఫోరెన్సిక్ నిపుణుల బృందం నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలు 125 ఏళ్లకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్నట్లు విచారణలో తేలింది. కాగా భవనం వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. మృతులకు సంబంధించిన వారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. -
దొడ్డుగా సాగు..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఈ యాసంగిలోనూ రైతులు వరి సాగు విషయంలో దొడ్డు రకాల వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. సన్న రకాలకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500ల బోనస్ ప్రకటించినప్పటికీ..ఎప్పటిలా దొడ్డు రకాల కంటే తక్కువే సాగయ్యాయి. ఈ యాసంగిలో తెలంగాణ వ్యాప్తంగా 63,54,286 ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేయగా పంట విస్తీర్ణం ఏకంగా 79,99,834 (126 శాతం) ఎకరాలకు పెరిగింది. వరి 47,27,000 ఎకరాల్లో సాగవుతుందని అనుకుంటే.. ఏకంగా 59.86 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అయితే ఇందులో 65 శాతానికి పైగా దొడ్డురకాలే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే గతంతో పోల్చుకుంటే సన్నాల సాగు పెరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. కొనుగోలు కేంద్రాలకూ ఎక్కువగా దొడ్డురకాలే.. వరి సాగు విస్తీర్ణం పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం యాసంగిలో 71,03,283 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ 8,412 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించినా.. చివరకు 8,353 కేంద్రాలను తెరిచింది. వీటి ద్వారా ఈ నెల 20వ తేదీ నాటికి 55.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. ఇందులో 37.50 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకాలు కాగా, సన్న రకం కేవలం 18.47 లక్షల మెట్రిక్ టన్నులే కావడం గమనార్హం.సన్నాలకు ఎన్ని సమస్యలో.. సన్న రకం వడ్ల సాగుకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. నీటి వసతి ఎక్కువగా ఉండాలి. చీడపీడల బెడద అధికం. పంట కాలం సైతం నెల రోజులు ఎక్కువగా ఉంటుంది. అకాల వర్షాలతో నష్టపోయే అవకాశం ఉంటుంది. పైగా యాసంగిలో వాతావరణం దృష్ట్యా దిగుబడి తక్కువగా వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సన్న రకాల విత్తనాలను చూస్తే.. తెలంగాణ సోనా ఎకరాకు 20 నుంచి 23 క్వింటాళ్లు, బీపీటీ 20 క్వింటాళ్ల వరకు, జై శ్రీరాం 18 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అదే దొడ్డు రకం వరి అయితే 5 నుంచి 8 క్వింటాళ్ల వరకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే దొడ్డు సాగువైపు మొగ్గు చూపామని వివరిస్తున్నారు.యాసంగి సాగు, కొనుగోళ్ల లెక్కలివీ..71,03,283 మెట్రిక్ టన్నులు యాసంగి 2024–25 ధాన్యం కొనుగోలు లక్ష్యం..55.97 లక్షల మె.టన్నులు ఇప్పటి వరకు కొనుగోలు చేసినవి (20.05.2025) 37.50 లక్షల మె.టన్నులు ఇందులో దొడ్డు రకం ధాన్యం18.47 లక్షల మె.టన్నులు సన్న రకం ధాన్యం 8,412ప్రతిపాదించిన కొనుగోలు కేంద్రాలు8,353ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలురూ.12,974.10 కోట్లు కొనుగోలు చేసిన ధాన్యం విలువరూ.9,632.66 కోట్లు ఎంపీఎంఎస్ ద్వారా చేసిన చెల్లింపులుఎక్కువ దిగుబడి కోసమే దొడ్డు రకం.. సన్న రకం అయితే పంట కాలం ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతోనే దొడ్డు రకం వేసిన. పైగా దొడ్డు రకంతో ఎక్కువ దిగుబడి వస్తుంది. అందుకే తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ దిగుబడి వచ్చే దొడ్డు రకం (1010) సాగు చేశా. సన్నాలకు బోనస్ ఉన్నా.. దిగుబడి తగ్గితే లాభం ఉండదని అనుకున్నం. – కొండమీది భిక్షపతి, కమలాపూర్, హనుమకొండ జిల్లా సాగు నిబంధనలు ఏమీ లేవు.. వరి విషయంలో రైతులు పలాన రకాలే సాగు చేయాలనే నిబంధనలు ఏమీ లేవు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా రైతులు తమకు నచి్చన వెరైటీలను వేసుకున్నారు. వ్యవసాయశాఖ తరఫున పంటల సాగుకు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేశాం. తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో దొడ్డురకాలే నయమన్న ధోరణితో చాలామంది అటువైపు మొగ్గు చూపినట్లు ఉంది. – కేతిరి దామోదర్‌రెడ్డి, ఏడీఏ, వరంగల్ జిల్లా -
కేసీఆర్‌కు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న విచారణలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు, ఇతరులను కమిషన్ విచారించింది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు నోటీసులు జారీ చేసింది. జూన్ 5వ తేదీన విచారణకు హాజరుకావాలని తెలిపింది. బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు సైతం నోటీసులు ఇచి్చంది. ముగ్గురికీ వేర్వేరుగా మూడు పేజీలున్న నోటీసులను మెసెంజర్ ద్వారా అలాగే రిజిస్టర్ పోస్టులోనూ పంపింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని సూచించింది. జూన్ 6న హాజరుకావాలని హరీశ్‌రావుకు, 9వ తేదీన రమ్మని ఈటల రాజేందర్‌కు తెలిపింది. ఇప్పటికే పలువురి విచారణ పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్న ప్రభుత్వం, సమగ్ర విచారణ జరిపి నివేదిక సమరి్పంచేందుకు గత ఏడాది మార్చిలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. బరాజ్‌ల నాణ్యతపై కూడా విచారించాలని సూచించింది. దీనిపై దాదాపుగా విచారణ పూర్తి చేసిన కమిషన్, రెండుమూడు రోజుల్లో నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోందని భావిస్తున్న తరుణంలో.. కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సహజ న్యాయ సూత్రాల మేరకు ఈ ముగ్గురి వాదనలు సైతం వినాలని జస్టిస్ ఘోష్ నిర్ణయించినట్లు సమాచారం. కాళేశ్వరం నిర్మాణం సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌తో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌లను ప్రశ్నించి మరింత సమాచారం జోడిస్తే సమగ్ర నివేదిక ఇచ్చినట్లు అవుతుందని భావించిన కమిషన్ వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 సెక్షన్ 311ను అనుసరించి నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఇదివరకే పలువురు ఇంజనీర్లు, నిర్మాణదారులు, అప్పట్లో నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఐఏఎస్ అధికారులను విచారించిన సంగతి విదితమే. 2019లో బరాజ్‌ల నిర్మాణం పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడు బరాజ్‌ల నిర్మాణ పనులు 2016లో ప్రారంభించగా 2019 మేలో పూర్తయ్యాయి. అయితే 2023 సెపె్టంబర్లో మేడిగడ్డ బరాజ్‌లోని ఒక బ్లాక్ పిల్లర్లు కుంగిపోయాయి. దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే నివేదిక ఇచి్చంది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో మొదటి దఫాలో హరీశ్‌రావు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. రెండో దఫాలో కేసీఆర్ సీఎంగా, నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించగా.. హరీశ్‌రావు ఆర్థిక మంత్రిగా కొనసాగారు. ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణం తదితర అంశాల్లో వీరి నిర్ణయాలు కీలకంగా ఉన్నాయనే ఉద్దేశంతో, వారిని విచారించి వాదనలు రికార్డు చేయాలని కమిషన్ భావిస్తున్నట్టు సమాచారం. నోటీసుల ప్రకారం వారంతా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల్సి ఉండగా, ఒకవేళ వారు కోరితే వర్చువల్‌గా కూడా విచారణ కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు కమిషన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. కేసీఆర్‌తో హరీశ్‌రావు భేటీపీసీ ఘోష్ కమిషన్ నోటీసుల నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. నోటీసులు, తదుపరి పరిణామాలు, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగగా.. కేసీఆర్, హరీశ్‌రావు విచారణకు హాజరవుతారా? లేదా సమయం కోరతారా అన్న అంశంలో స్పష్టత రాలేదు. -
కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ సెంటర్‌ను సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులు
హైదరాబాద్: భారతదేశంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ, ఈ రంగంలో సేవలందిస్తున్న ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు కొందరు సందర్శించారు.వీరికి కిమ్స్ గ్రూప్ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ, “మా ఆస్పత్రిని సందర్శించిన మిస్ వరల్డ్ 2025 ప్రతినిధులందరికీ సాదర స్వాగతం. డాక్టర్ రఘు రామ్ చేపట్టిన ప్రతి పని 100% విజయాల రేటుతో చేస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా ఆయన్ను నేను దగ్గరగా చూస్తున్నాను. మాతృ ప్రేమ, మాతృభూమి పట్ల ప్రేమ అతనిని యూకే నుంచి భారత్‌కు తిరిగి తీసుకొచ్చింది, అక్కడ ఆయన అనేక ఆవిష్కరణాత్మక కార్యక్రమాల ద్వారా క్యాన్సర్ చికిత్స తీరును సమూలంగా మార్చాలన్న లక్ష్యంతో కృషిచేస్తున్నారు. ఆయనకు శుభాకాంక్షలు. దేశానికి ఆయన చేసిన అందమైన సేవలకు మరిన్ని విజయాలు దక్కుతాయి” అని ఆకాంక్షించారు.మిస్ వరల్డ్ 2025 బృందానికి మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్మన్, సీఈఓ మిస్ జూలియా మోర్బీ నేతృత్వం వహించారు. గత 18 సంవత్సరాలలో ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజ్ సెంటర్ కిమ్స్ ఆస్పత్రుల ద్వారా చేసిన సేవలను కొనియాడారు. ఇక్కడకు హాజరైన పలువురు వైద్యనిపుణులను ఉద్దేశించి మిస్ జూలియా మోర్బీ మాట్లాడుతూ, “డాక్టర్ రఘు రామ్ హైదరాబాద్‌లో దక్షిణ ఆసియాలోనే మొదటిసారిగా ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో తన సొంత ఆలోచనలతో రూపొందించిన ఈ అసాధారణ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం ద్వారా అద్భుతమైన నాయకత్వ పటిమను చాటి చూపించారు. త్వరగా గుర్తించడం ద్వారా 18 ఏళ్లు దాటిన అనేక మంది మహిళల ప్రాణాలను కాపాడేందుకు గణనీయమైన కృషిని ఆయన చేశారు. భారతదేశం, బ్రిటన్ల మధ్య సజీవ వంతెనగా అనేక మార్గాల్లో ఆయన నిలిచారు. భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ చికిత్సకు అపారమైన సేవలు అందిస్తున్నారు” అని తెలిపారు.నందిని గుప్తా (మిస్ ఇండియా 2025), హన్నా జాన్స్ (మిస్ నార్తరన్ ఐర్లండ్ 2025) ఇస్సీ ప్రిన్సెస్ (మిస్ కామెరూన్- మధ్య ఆఫ్రికా), రొమ్ము క్యాన్సర ప్రచారకర్త డాక్టర్ నియోమి మైల్న్ (మిస్ గౌడెలోప్ 2025- ఫ్రాన్స్),డాక్టర్ ఇదిల్ బిల్గెన్ (యూఎస్ఏ) తదితరులంతా డాక్టర్ రఘురామ్ సేవలను ప్రశంసించారు. తన తల్లి డాక్టర్ ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ప్రయాణంతో స్ఫూర్తి పొందిన ఆయన.. ఇలా దేశంలో చాలామందికి అసవరమైన రొమ్ము క్యానన్సర్ అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. తమ తమ దేశాల్లో రొమ్ము క్యాన్సర్ అవగాహనకు చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పారు. డాక్టర్ రఘురామ్ అద్భుతంగా ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ నుంచి తాము చాలా తెలుసుకున్నామని, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ అమలు చేసిన ప్రయత్నాలను తమ స్వదేశంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.ఈ సదర్భంగా కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ, “కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ బ్రెస్ట్ డిసీజెస్ కేంద్రంలో నాణ్యమైన సమయం గడిపేందుకు ముందుకొచ్చిన మిస్ ఇండియా పోటీదారుఉల, మిస్ జూలియా మార్లీలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా పవర్ పాయింట్ ప్రజంటేషన్ గురించి గుండెలకు హత్తుకునేలా చెప్పారు.గత 18 ఏళ్లుగా నేను చేస్తున్న కృషి అందులో ఉంది. మా అమ్మ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రయాణమే నాకు స్ఫూర్తినిచ్చింది. నా సహోద్యోగులు, స్నేహితులు, ప్రభుత్వం అంతా నాకు ఇంతకాలం కావాల్సిన మద్దతు, మార్గదర్శకత్వం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. రొమ్ము క్యాన్సర్‌ను త్వరగా గుర్తిస్తే చాలా జీవితాలను కాపాడవచ్చు. నా మాతృభూమిలో రొమ్ము క్యాన్సర్ చికిత్సలను మెరుగుపచాలన్న నా లక్ష్యానికి జీవితాన్ని అంకితం చేస్తున్నాను” అని తెలిపారు.ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి, క్యాన్సర్ విజేత డాక్టర్ ఆనంద్ శంకర్ జయంత్ మాట్లాడుతూ, “డాక్టర్ రఘురామ్ వద్ద చికిత్స పొందడం నా అదృష్టం. నాకు అందిన అసాధారణ నాణ్యత గల చికిత్స, సానుభూతితో కూడిన సంరక్షణ, చికిత్స కొనసాగినన్నాళ్లు ఆయన నాకు చేసిన కౌన్సెలింగ్ వల్లనే నేను క్యాన్సర్ విజేతగా నిలిచాను. నా ఈ పయనంలో డాక్టర్ రఘురామ్ నాకు స్ఫూర్తినిచ్చి, సానుకూలంగా ఉండేలా చేయడం నాకెంతో సంతృప్తినిచ్చింది. క్యాన్సర్ రోగుల్లో ఒక ఆశను పాదుకొల్పి, త్వరగా గుర్తించాల్సిన అవసరం గురించి అవగాహన నెలకొల్పి, దాదాపు రెండు దశాబ్దాలుగా కృషిచేస్తున్న డాక్టర్ రఘురామ్ సేవలను ప్రశంసిస్తున్నాను”అని చెప్పారు. -
KCR: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు మంగళవారం (మే 20) నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో జూన్ 5న కేసీఆర్, 6న హరీశ్ రావు, 9వ తేదీన ఈటల రాజేందర్ విచారణకు రావాలని ఆదేశించింది. తాము పంపించిన నోటీసులకు 15 రోజుల్లో రిప్లై ఇవ్వాలని సూచించింది. కాగా, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ హయాంలో హరీష్‌రావు నిటి పారుదల వ్యవసాయ శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్ధిక శాఖ మంత్రిగా పని చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ గడువు పొడిగింపు కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Kaleshwaram commission) విచారణ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మరో రెండు నెలలపాటు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్,హరీష్‌రావు,ఈటల రాజేందర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించింది. -
Hyderabad: ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
ఇబ్రహీంపట్నం రూరల్(హైదరాబాద్): ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రాష్ బారియర్‌ను ఢీకొట్టడంతో కారులోకి పది మీటర్ల మేర దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ బాలరాజు కథనం ప్రకారం.. బెంగాల్ రాష్ట్రానికి చెందిన కితాబ్‌అలీ అలియాస్ హిలాల్ (35) ఘట్కేసర్ మండలం, నాగారంలోని శిల్పానగర్, విశ్వసాయి బృందావనం అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. తుక్కుగూడ సమీపంలోని వివిధ కంపెనీలకు మ్యాన్‌పవర్ సప్లయ్ చేసేవాడు. సోమవారం ఉదయం తుక్కుగూడకు వచ్చి తిరిగి నాగారం వైపు కారులో వెళ్తున్నాడు. బొంగ్లూర్ ఎగ్జిట్ 12 వద్దకు రాగానే అతివేగం కారణంగా కారు అదుపుతప్పి క్రాష్ బారియర్‌ను ఢీకొంది. దీంతో కారు అద్దంలో నుంచి క్రాష్ బారియర్ పది మీటర్ల వరకు దూసుకెళ్లడంతో కితాబ్‌అలీ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో క్రాష్‌బారియర్ ఇరక్కుపోవడంతో మృతదేహం బయటకు తీయడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఔటర్‌రింగ్ రోడ్డు సిబ్బంది సహాయంతో కారు పైభాగం కట్ చేయించి గంటల తరబడి శ్రమించి మృతదేహాన్ని బయటికి తీశారు. సీఐ రాఘవేందర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మంచి మాటలు చెప్పినందుకు...
మేడ్చల్: మద్యానికి బానిసై సంసారాన్ని ఎందుకు చెడగొట్టుకుంటున్నావ్ మంచిగా ఉంటూ భార్యా పిల్లలను బాగా చూసుకో అంటూ నాలుగు మంచి మాటలు చెప్పినందుకు ఓ వ్యక్తి తన బావ వరుసైన వ్యక్తిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానిక సరస్వతీనగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుజరాత్‌కు చెందిన సోలంకి మోతీలాల్(43), అతడి మేనత్త కుమారుడు శంకర్(35) కుటుంబాలతో కలిసి రైల్వె స్టేషన్ సమీపంలోని సరస్వతీ నగర్లో ఉంటూ భవన నిర్మాణ కారి్మకులుగా పని చేస్తున్నారు. కాగా మద్యానికి బానిసైన శంకర్ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం కూడా మద్యం తాగి వచి్చన అతను కుటుంబ సభ్యులతో గొడవ పడి సమీపంలోని రైల్వే ప్లాట్ ఫారంపై పడుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మోతీలాల్ అక్కడికి వెళ్లి శంకర్‌కు నచ్చజెప్పేందుకు యతి్నంచాడు. అయితే మద్యం మత్తులో ఉన్న శంకర్ అతడిని దుర్బాషలాడాడు. అనవసరంగా భార్యా పిల్లలతో గొడవలు ఎందుకని అతడికి సర్దిచెప్పిన మోతీలాల్ శంకర్‌ను ఇంట్లో దిగబెట్టి తన ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం పనికి వెళ్లేందుకు సిద్ధమైన మోతీలాల్ తన బంధువుల ఇంటి వద్దకు వెళుతుండగా అతడిని అడ్డుకున్న శంకర్ తన కుటుంబ విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావంటూ అతడిని తిడుతూ దాడి చేసేందుకు వెళ్లాడు. దీంతో మోతీలాల్ ఈ విషయాన్ని శంకర్ తల్లికి చెప్పేందుకు వెళుతుండగా ఆగ్రహానికి లోనైన శంకర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో మోతీలాల్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతను అక్కడే కుప్పకూలడంతో శంకర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు మోతీలాల్‌ను 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. -
ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)
-
తెలంగాణ రాజ్‌భవన్ హార్డ్ డిస్క్ చోరీ కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజ్‌భవన్ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సస్పెండైన ఉద్యోగి శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌భవన్ చోరీ కేసు నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయడం ఇది రెండోసారి. తోటి మహిళా ఉద్యోగిని ఫోటోలు మార్ఫింగ్ చేసి భయభ్రాంతులకు గురి చేయగా.. ఆ కేసులో మొదటిసారి అరెస్ట్ చేశారు. కాగా.. హార్డ్ డిస్క్‌ల చోరీ కేసులో రెండోసారి చేశారు. ఆ ఉద్యోగి వారంలో రెండుసార్లు అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది. సస్పెండ్ అయినా కానీ.. సెక్యూరిటీని మాయ చేసి రాత్రి సమయంలో రాజ్‌భవన్‌లోకి ప్రవేశించాడు. రాజ్ భవన్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో శ్రీనివాస్.. ఓ మహిళకు కొన్ని మార్ఫింగ్ ఫొటోలను చూపించాడు. ఎవరో తనకు ఈ ఫోటోలు పంపిస్తున్నారు జాగ్రత్త అంటూ భయపెట్టాడు. దీంతో కలవరపాటుకు గురైన ఆ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మార్ఫింగ్ ఫోటోలను సృష్టించింది.. శ్రీనివాసేనని తేల్చారు. శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు పంపారు. రాజభవన్ అధికారులు శ్రీనివాస్ సస్పెండ్ చేశారు.జైలకు వెళ్లిన శ్రీనివాస్.. రెండు రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుండి వచ్చిన శ్రీనివాస్ రాత్రి సమయంలో సెక్యూరిటీని మభ్యపెట్టి లోపలికి వెళ్ళాడు. తన కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్క్‌ను చోరీ చేసుకుని వెళ్లిపోయాడు. ఈ సంఘటనపై రాజభవన్ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు సీసీ కెమెరాల ద్వారా శ్రీనివాస్ చోరీని గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసి.. హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్ డిస్క్‌లో మహిళకు సంబంధించిన ఫోటోలు ఉండడంతో ఆ సాక్ష్యాలను డిలీట్ చేసే ప్రయత్నంలో చోరీకి పాల్పడాడ్డని తెలిసింది. -
నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి,హైదరాబాద్: పాతబస్తీ గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద ఘటన మరువక ముందే మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. భారీగా ఎగిసిపడుతున్న మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. -
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
రామగుండం(కరీంనగర్): పట్టణంలోని తబితా ఆశ్రమంలో 16ఏళ్లుగా ఆశ్రయం పొందుతున్న నక్క మానస వివాహ వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం హల్దీవేడుకలు ఘనంగా నిర్వహించింది. యువతి పెళ్లి పెద్దగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష.. ఈనెల 21వ తేదీన కలెక్టరేట్లోని ఆలయంలో వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. తొలిరోజు వేడుకల కోసం సింగరేణి ఆర్జీ–1 జీఎం సతీమణి అనిత, ఆర్తి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భీమనాథి విజయ పుస్తె, మట్టెలు, చీర, సారె, అంతర్గాం అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు రూ.ఐదు వేల నగదు, ఎనీ్టపీసీ శ్రీసీతారామ సేవాసమితి నిర్వాహకులు గోలివాడ చంద్రకళ, కంది సుజాత, బిల్లా శ్రీదేవి, కొండు రమాదేవి పెళ్లి బట్టలు అందజేశారు.ఫైట్‌ఫర్ బెటర్ సొసైటీ నిర్వాహకుడు మద్దెల దినేశ్, లెనిన్ జయహో సంస్థ ప్రతినిధి చక్కెన శ్రీలత పెళ్లి కుమార్తెను తయారు చేశారు. జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్‌రావు, అంతర్గాం తహసీల్దార్ రవీందర్‌పటేల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. హార్డ్ డిస్క్‌లు మాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజ్ భవన్లో చోరీ కలకలం రేపింది. చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుధర్మ భవన్లో నాలుగు హార్డ్ డిస్క్‌లు చోరీ అయినట్లు అధికారులు నిర్థారించారు. మొదటి అంతస్తులోని రూమ్ నుంచి హార్డ్ డిస్క్‌లను అపహరించారు.14వ తేదీన హెల్మెట్ ధరించిన వ్యక్తి.. నాలుగు హార్డ్ డిస్క్‌లను చోరీ చేశాడు. హార్డ్ డిస్క్‌లో కీలకమైన సమాచారం, ఫైల్స్ ఉన్నట్లుగా రాజ్ భవన్ అధికారులు తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా చోరీ ఘటన బయటపడింది. పంజాగుట్ట పోలీసులకు రాజ్‌భవన్ అధికారలు ఫిర్యాదు చేశారు. -
వికారాబాద్: లారీని ఢీకొన్న పెళ్లి బస్సు.. నలుగురి మృతి
సాక్షి, వికారాబాద్ జిల్లా: పరిగి మండలం రంగాపూర్ సమీపంలోని బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టూరిస్టు బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చందనవెళ్లి గ్రామానికి చెందిన పలువురు టూరిస్టు బస్సులో పరిగిలో జరిగిన విందుకు హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
గజ రాజులకూ పేర్లుంటాయ్
సాక్షి, అమరావతి: మనం ఒకరినొకరు పేర్లతో పిలుచుకోవడం సహజం. ఇలా పేర్లు పెట్టుకుని సంబోధించుకోవడానికి మాట్లాడటం రావాలి. అందుకు ఓ భాష కూడా కావాలి. అది మనుషులకు మాత్రమే సాధ్యమనే భావన నిన్నమొన్నటి వరకు భావించేవారు. కానీ.. కొన్ని రకాల వన్యప్రాణులు కూడా మాట్లాడుకుంటాయని.. వాటికి కూడా భాష ఉంటుందని వివిధ పరిశోధనల్లో తేలింది. ఇప్పుడు అలా మాట్లాడుకునే వన్య ప్రాణుల్లో ఏనుగులు కూడా ఉన్నాయని తాజాగా గుర్తించారు. అడవుల్లో జీవించే ఏనుగులు పేర్లతో పిలుచుకుంటాయని తేలింది. అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్ మైకేల్ బార్టో నేతృత్వంలోని బృందం కెన్యాలోని ఆఫ్రికన్ ఏనుగులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఏనుగులు చేసే రకరకాల శబ్దాలను శాస్త్రవేత్తలు రికార్డు చేసి వాటి ప్రవర్తనను గమనించారు. అవి తమ గుంపులోని ఇతర ఏనుగులను గుర్తించడానికి ప్రత్యేకమైన, తక్కువ ఫ్రీక్వెన్సీ గల శబ్దాలను (ఇన్ఫ్రా సౌండ్) ఉపయోగిస్తాయని కనుగొన్నారు. ఈ శబ్దాలు మనం పేర్లుగా భావించే వాటితో సమానమని తేలింది. ఒక ఏనుగు తన సమూహంలోని మరో ఏనుగును పిలవాలనుకుంటే ఒక నిర్దిష్టమైన శబ్దాన్ని చేస్తుంది. అది ఆ ఏనుగు మాట్లాడాలనుకున్న మరో ఏనుగుకు మాత్రమే సంబంధించిన శబ్దం అని స్పష్టమైంది. ఒక్కో ఏనుగుకు ఒక్కో ప్రత్యేకమైన శబ్దం ఉంది. ఈ శబ్దాలు కామన్‌గా ఇతర అన్ని జంతువులు ఒకే రకంగా చేసేలా లేకపోవడం ఈ పరిశోధనలో గుర్తించిన కీలకమైన అంశం.ఏఐ టెక్నాలజీతో శబ్దాల విశ్లేషణ శాస్త్రవేత్తలు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఏనుగుల శబ్దాలను విశ్లేషించారు. పరిశోధకులు ఒక గుంపులోని ఏనుగులను గుర్తించేందుకు పేర్లు పెట్టారు. అందులో ఒక ఏనుగుకు ’మాంబా’ అని పేరు పెట్టి దాన్ని నిరంతరం గమనించారు. ’మాంబా’ ఒక నది దగ్గర నీళ్లు తాగుతుండగా, గుంపులోని మరో ఏనుగు దాన్ని పిలవడానికి ఒక ప్రత్యేకమైన గుండ్రని శబ్దాన్ని చేసింది. ఆశ్చర్యకరంగా ’మాంబా’ మాత్రమే ఆ శబ్దానికి స్పందించి తల ఎత్తి ఆ దిశగా చూసింది. మిగతా ఏనుగులు ఆ శబ్దాన్ని పట్టించుకోలేదు. దీనిద్వారా ఏనుగులు వ్యక్తిగత పేర్లను ఉపయో గిస్తాయని నిర్థారణ అయింది.అసాధారణ మేధస్సు గజరాజుల సొంతంసాధారణంగా అడవి జంతువులు ఒకే రకమైన అరుపులు, శబ్దాల ద్వారా సంభాషించుకుంటాయి. ఈ శబ్దాలన్నీ కామన్‌గా ఉంటాయి. ప్రత్యేకంగా ఒక్కో దానికి ఒక్కో రకమైన శబ్దాలు ఉండవు. కానీ.. ఏనుగులు ప్రత్యేకంగా మనుషుల మాదిరిగానే సంభాషించుకునేలా శబ్దాలు చేసుకోవడం కొత్త విషయం. అవి ఒక శబ్దాన్ని చేయడంతోపాటు అది ఎవరు చేశారో, ఎవరి కోసం చేశాయో కూడా గుర్తించగలుగుతున్నాయి. అంటే వాటికి బుద్ధితో ఆలోచించే సామర్థ్యం ఉన్నట్టు స్పష్టమైంది. ఏనుగులు బలమైనవే కాదు.. అసాధారణమైన మేధస్సు కలిగిన సామాజిక జీవులని తాజా అధ్యయనంలో వెల్లడైంది.డాల్ఫిన్లు, చిలుకలకు ప్రత్యేక భాషఇప్పటివరకు డాల్ఫిన్లు, చిలుకలు ఒకదాన్ని ఒకటి గుర్తించడానికి శబ్దాలను చేస్తాయని భావించేవారు. ఒక డాల్ఫిన్ తన సమూహంలోని మరో డాల్ఫిన్ చేసే స్వరాన్ని అనుకరించి దాన్ని పిలుస్తుంది. కానీ.. ఏనుగులు ప్రత్యేకమైన శబ్దాలను ఉపయోగిస్తుండటం.. అవి మనుషుల సంభాషణ పద్ధతికి చాలా దగ్గరగా ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఏనుగులు తమ సమూహంలో ఉన్న ఇతర ఏనుగులతో బలమైన బంధాలను ఏర్పర్చుకుంటాయి.కలిసి ప్రయాణించడం, కలిసి ఆహారం సేకరించడం, శత్రువుల నుండి ఒకదానిని మరొకటి రక్షించుకోవడం ద్వారా తమ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకుంటాయి. అయితే వాటికి ఒక శబ్దాల భాష ఉన్నట్టు తాజాగా బయటపడటంతో అవి మనుషులతో చాలా దగ్గరగా ఉన్నట్టు తేలింది. ‘ఏనుగులు మనం ఊహించిన దానికంటే ఎక్కువ సంక్లిష్టతను కలిగి ఉన్నాయి. వాటి సామాజిక నిర్మాణం, సంభాషణ పద్ధతులు మనుషులతో సమానంగా ఉన్నాయి’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఒక శాస్త్రవేత్త తెలిపారు. -
మా పాలన దేశానికే రోల్ మోడల్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, నాగర్‌కర్నూల్‘మా పాలన దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తోంది. శాంతిభద్రతల నిర్వహణ, నిరుద్యోగం నిర్మూలన, నిత్యావసర సరుకుల ధరల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సైతం మా పాలనను అభినందించక తప్పని పరిస్థితి నెలకొంది. మా పాలనలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపాం. గత 16 నెలల్లో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చాం. 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఆదర్శంగా నిలిచాం. మరో 1.50 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు కూడా కల్పించాం. గత ప్రభుత్వ పాలనలో నోటిఫికేషన్ల కోసం ధర్నాలు జరిగేవి.మా పాలనలో మాత్రం నోటిఫికేషన్లు వాయిదా వేయాలని ధర్నాలు జరుగుతున్నాయి. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే కుటుంబం బాగుపడుతుంది. రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటీశ్వరుల్ని చేసేలా ప్రణాళిక రూపొందించాం..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర జలవికాసం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకం పైలట్ ప్రాజెక్ట్ కింద మాచారంలోని 29 మంది చెంచు రైతులకు చెందిన 45 ఎకరాల పోడు భూముల్ని ప్రభుత్వం ఎంపిక చేసింది.వాటిల్లో బోర్లు, సోలార్ పంప్ సెట్‌తో పాటు మామిడి, ఉద్యాన మొక్కలు నాటారు. కాగా ఆయా భూముల్లోని సోలార్ పంప్‌సెట్‌ను ముఖ్యమంత్రి ఆన్ చేశారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభ వేదికగా నల్లమల డిక్లరేషన్‌ను ప్రకటించి మాట్లాడారు. వాళ్లు భూములు గుంజుకున్నారు.. మేం పంటలు ప్రోత్సహిస్తున్నాం ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం పోడు రైతుల భూములను గుంజుకుని వారికి బేడీలు వేసి జైలుకు పంపింది. ములుగు, తాడ్వాయి అడవుల్లో ఆడబిడ్డలను చెట్టుకు కట్టేసి కొడితే మేం వెళ్లి అండగా నిలబడ్డాం. కాంగ్రెస్ వచ్చాక గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా ఇందిరా సౌర జలవికాసం అమలు చేస్తున్నాం. గిరిజనుల పోడు భూముల్లో సోలార్ విద్యుత్, బోర్లు ఏర్పాటు చేసి వారు పంటలను పండించేలా ప్రోత్సహిస్తున్నాం. అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం నేను ఇక్కడి నల్లమల ప్రాంతానికి చెందిన వాడినని చెప్పుకునేందుకు నా గుండె ఉప్పొంగుతోంది. అచ్చంపేట నియోజకవర్గంలోని రైతులందరికీ రానున్న వంద రోజుల్లో ఉచితంగా సోలార్ బోర్లను ఏర్పాటు చేస్తాం. సోలార్ విద్యుత్ వినియోగంతో పాటు ఉత్పత్తి చేసి నెలనెలా రూ.ఐదారు వేల ఆదాయం కల్పించేలా చూస్తాం. నియోజకవర్గంలో ఎన్ని సోలార్ పంప్సెట్లైనా ఉచితంగా ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. సన్న బియ్యంతో పేదల ఆత్మగౌరవం పెంచాం.. గతంలో రైతులు వరి వేస్తే ఉరి అని చెప్పి కేసీఆర్ తన ఫాంహౌస్‌లో 150 ఎకరాల్లో వరి వేసుకున్నడు. మేం వచ్చాక సన్నాలు పండించాలని చెప్పి రూ. 500 బోనస్ అందించాం. ఏడాదిలో 2.80 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండించి దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపాం. రేషన్ బియ్యంగా సన్న బియ్యాన్ని అందించి పేదల ఆత్మగౌరవాన్ని పెంచాం.’ అని సీఎం చెప్పారు. ప్రధాని అంటే ఇందిరా గాందీలా ఉండాలి.. ‘భారత్–పాకిస్తాన్ యుద్ధం సమయంలో ప్రధాని ఇందిరాగాంధీ ఒక్క దెబ్బతో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ను రెండు ముక్కలు చేశారు. ఇప్పటికి 50 ఏళ్లైనా ప్రధాని అంటే ఇందిరాగాం«దీలా ఉండాలని అంటారు. అలాంటి ఇందిరమ్మ రాజ్యంలో మేం ప్రజల కళ్లల్లో వెలుగులు నింపేలా పని చేస్తున్నాం. అక్రమ సంపాదనతో ఎవరెన్ని కుట్రలు చేసినా, మా ఆడబిడ్డలకు అన్నీ తెలుసు. సన్నాసులంతా కలసి సోషల్ మీడియాలో ఎంత ప్రచారం చేసినా, మహిళలకు నిజం తెలుసు. కడుపు నిండా విషం కక్కుతూ మా ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. మేం వారి దిక్కు చూడం, పట్టించుకోం..’ అని రేవంత్ అన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేదు: భట్టి విక్రమార్క భూమి కోసం దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్న గిరిజనులకు హక్కులు కల్పించి నీటి సౌకర్యం కలి్పంచిన ఉదంతాలు దేశంలో ఎక్కడా లేవని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నల్లమల డిక్లరేషన్ ద్వారా రాష్ట్రంలోని గిరిజనుల కోసం సంకల్పం తీసుకోవడంతో తన జన్మ ధన్యమైందని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, శ్రీహరి, మేఘారెడ్డి, అనిరు««ద్‌రెడ్డి పాల్గొన్నారు. స్వగ్రామం కొండారెడ్డిపల్లెలో రేవంత్ పర్యటన సీఎం రేవంత్‌రెడ్డి తన స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గజమాల, పూలతో ఊరేగింపుగా వచ్చి ఘన స్వాగతం పలికారం. కాగా ముఖ్యమంత్రి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో కుటుంబసభ్యులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి తన సొంత ఇంట్లో భోజనం చేశారు. ఏమ్మా.. నీళ్లు పడ్డాయా?చెంచు మహిళలతో సీఎం సంభాషణ సాక్షి, నాగర్‌కర్నూల్: ఇందిరా సౌర జలవికాసం పథకం ప్రారంబోత్సవం సందర్భంగా మాచారంలోని చెంచుల పోడు భూములను సందర్శించిన ముఖ్యమంత్రి.. అక్కడే ఉన్న చెంచు మహిళలు ఉడుతనూరి అలివేలు, లక్షమ్మలను పలకరించారు. వారితో కాసేపు ఆప్యాయంగా ముచ్చటించారు. సీఎం: ఏమ్మా.. మీ బోరులో నీళ్లు పడ్డాయా? అలివేలు: మా భూమిలో వేసిన బోరులో నీళ్లు మంచిగా పడ్డాయి సర్. సంతోషంగా ఉంది. సీఎం: ఏం మొక్కలు నాటారు, వాటిని బతికించుకుంటారా? అలివేలు: మామిడి, ఆవకాడో, బత్తాయి మొక్కలు నాటాం. బాగా కాపాడుకుంటాం సర్. ఇన్నాళ్లు మా భూమి బీడుగానే ఉంది. ఇప్పుడు పంటలు పండించుకుంటాం. సీఎం: ఈ పథకంపై ఇతర మహిళలకు శిక్షణ ఇస్తావా? అలివేలు: నేను డిగ్రీ పూర్తి చేశాను సర్. తప్పకుండా మా తోటి మహిళలకు, చెంచులకు ఈ పథకంపై అవగాహన కల్పిస్తా. మీరు మా కోసం ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది ‘పోడు’కు నిధుల తోడు గిరిజన సంక్షేమం లక్ష్యంగా నల్లమల డిక్లరేషన్ నల్లమల డిక్లరేషన్‌లో రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు అంశాలను పొందుపర్చింది. రాష్ట్రంలోని 2,30,735 మంది గిరిజనులకు 2006 ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం సంక్రమించిన సుమారు 6.69 లక్షల ఎకరాల భూములపై పూర్తి హక్కులను గుర్తించింది. ⇒ రాష్ట్రవ్యాప్తంగా గిరిజనుల పోడు భూముల్లో నూరు శాతం ఉచితంగా బోరుబావులు, సోలార్ విద్యుత్ సౌకర్యంతో పాటు ఉద్యాన పంటల ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తారు. పోడు భూముల్లో నీటి సౌకర్యం కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధుల కేటాయిస్తారు. ⇒ ఇందిరా సౌర గిరి జలవికాసం పథకం కింద గిరిజనులకు జీవనోపాధి కల్పించడంతో పాటు వారి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటారు ⇒ తొలుత మాచారంలో పైలట్ ప్రాజెక్ట్. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు ⇒ఈ పథకం పకడ్బందీగా అమలయ్యేందుకు ఐదేళ్ల పాటు లబి్ధదారులతో సర్కారు సమన్వయం. ఎప్పటికప్పుడు అటవీ, విద్యుత్, భూగర్భ జలవనరులు, ఉద్యాన శాఖల పర్యవేక్షణ ⇒ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెంచులు, ఆదిమ జాతుల కుటుంబాలు అందరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ⇒ రాజీవ్ యువవికాసం కింద ప్రత్యేకంగా గిరిజన యువతకు రూ.1,000 కోట్ల నిధులతో ఒక్కొక్కరికీ రూ.లక్ష వరకు సబ్సిడీ రుణాలు. -
‘మోదీ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉండటం నా అదృష్టం’
కరీంనగర్: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా తిరంగా ర్యాలీలో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు(సోమవారం) కరీంనగర్ తెలంగాణ చౌక్ నుంచి రామ్ నగర్ వరకూ తిరంగా ర్యాలీని బీజేపీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడారు.‘యుద్దానికి విరామమే తప్ప ముగియలేదు. దేశానికి ఆపదొస్తే అంతు చూసేందుకు మన సైన్యం రెడీగా ఉంది. ఆపరేషన్ సింధూర్ తో మన సైనిక సత్తా యావత్ ప్రపంచానికి తెలిసింది. పాకిస్తాన్ ప్రజల ప్రాణాలకు నష్టం లేకుండా ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టినం. మోదీ నాయకత్వానికి, భారత సైన్యానికి సంఘీభావంగా ‘తిరంగా ర్యాలీ. మోదీ మంత్రివర్గంలో సభ్యుడిగా కొనసాగడం నా అదృష్టం. కంట్రోల్ రూం బాధ్యతలు నిర్వర్తిస్తూ సైన్యం సాహసాలను కళ్లారా చూసే భాగ్యం కలిగింది’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. -
Telangana Police: తెలంగాణలో భారీ ఎత్తున డీఎస్పీల బదిలీలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. సోమవారం డీజీపీ జితేందర్ రాష్ట్ర వ్యాప్తంగా 77 మంది డీఎస్పీలు, ఏసీపీలను బదిలీ చేశారు. అలాగే మరికొంతమందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ మేరకు డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.బాలానగర్ ఏసీపీగా పి నరేష్ రెడ్డి, శంషాబాద్ ఏసీపీగా శ్రీకాంత్ గౌడ్, చిక్కడపల్లి ఏసీపీగా సీహెచ్ శ్రీకాంత్, మాదాపూర్ ఏసీపీగా సీహెచ్ శ్రీధర్,మేడ్చల్ ఏసీపీగా సీహెచ్ శంకర్ రెడ్డి,సంతోష్ నగర్ ఏసీపీగా సుక్ దేవ్ సింగ్, మలక్ పేట్ ఏసీపీగా సుబ్బరామిరెడ్డి, గాంధీనగర్ ఏసీపీగా ఏ యాదగిరి, ఎస్ఆర్ నగర్ ఏసీపీగా ఎస్వీ రాఘవేంద్రరావు, కాచిగూడ ఏసీపీగా వై హరీష్ కుమార్, చాంద్రాయణగుట్ట ఏసీపీగా ఏ సుధాకర్, కూకట్పల్లి ఏసీపీగా ఈ రవి కిరణ్ రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీగా ఏసీ బాల గంగిరెడ్డి, పంజాగుట్ట ఏసీపీగా పి మురళీకృష్ణ, మహేశ్వరం ఏసీపీగా ఎస్ జానకి రెడ్డి, షాద్ నగర్ ఏసీపీగా ఎస్ లక్ష్మీనారాయణ,సైదాబాద్ ఏసీపీగా సోమ వెంకటరెడ్డి, గోషామహల్ ఏసీపీగా ఎస్ సుదర్శన్, కాచిగూడ ఏసీపీగా వై వెంకట్ రెడ్డి, చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి, మహంకాళి ఏసీపీగా ఎస్ సైదయ్య, అబిడ్స్ ఏసీపీగా పి ప్రవీణ్ కుమార్‌లను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు. -
గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇదే.. తేల్చేసిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని విచారణ అధికారులు నిర్దారించారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏసీలోని కంప్రెషర్లు పేలడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కొన్ని రోజులుగా నిరంతరాయంగా ఏసీలను వినియోగించడంతో ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గుల్జార్‌హౌస్ ప్రమాదానికి గల కారణాల్ని వెల్లడించారు. అధికారుల తెలిపిన వివరాల మేరకు.. గుల్జార్‌హౌస్ ప్రమాదానికి కారణంగా ఏసీ కంప్రెషర్లే. ఏసీ కంప్రెషర్లు పేలి పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ మీటర్లకు మంటలు వ్యాపించాయి. ఫలితంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పలు ఏసీల్లో ప్రమాదం జరగడంతో దట్టంగా పొగకమ్ముకుంది. ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లో దట్టంగా పొగకమ్ముకోవడంతో కుటుంసభ్యులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. టెర్రస్ నుంచి బయటకు రాలేక కిందకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భాగంగా మెట్ల మార్గం వైపు రావడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో ప్రాణభయంతో లోపలే ఉండిపోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చే సరికే అపస్మారస్థితిలోకి వెళ్లారు’ అని చెప్పారు. కాగా, గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. -
గుల్జార్ హౌస్ ఘోర అగ్ని ప్రమాదంపై హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి,హైదరాబాద్: పాతబస్తీలో గుల్జార్ హౌస్ ఘోర అగ్ని ప్రమాదంపై హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. ఈ ప్రమాద ఘటనపై సుమోటోగా కేసు విచారణకు కమీషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశించారు. భవన భద్రత , విద్యుత్ నిర్వహణ, అగ్నిప్రమాద నివారణ పరమైన నిబంధనలు పాటించలేదంటూ మీడియాలో వస్తున్న పలు కథనాలపై హెచ్ఆర్సీ స్పందించింది. ఘటనలో 17 మంది దుర్మరణం కారణాలపై జూన్ 30లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ , అగ్నిమాపక శాఖ డీజీ , టీఎస్ఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్లకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. -
‘కోటిమంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం’
నాగర్ కర్నూల్: మాచారం, పాలమూరు ప్రాంతాలంటే తనకు ఎంతో ఇష్టమే కాకుండా ఎంతో గౌరవం కూడా అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్.. ఆపై ప్రసంగించారు.‘ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలబెడతాం. పాలమూరు బిడ్డల చెమటతోనే ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. గిరిజనుల కోసం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌ది. అచ్చంపేటలో ప్రతిరైతుకు సోలార్ విద్యుత్ అందించి తీరుతాం. సోలార్ విద్యుత్ అందించడమే కాదు.. ఆదాయం వచ్చేలా చేస్తాం. రుణమాఫీ చేశాం.. వడ్లకు బోనస్ ఇస్తున్నాం. వరి వేసుకుంటే ఉరేనన్న దొర మాత్రం వరి వేసి అమ్ముకున్నారు. ైరైతుల కోసం ఇప్పటివరకూ రూ. 60 వేల కోట్లు ఖర్చు చేశాం. 50 లక్షల పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మహిళలే ఆర్టీసీ బస్సులు అద్దెకు తిప్పుకునేలా చేశాం.మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులకు యజమానులను చేశాం. 2029లోపు కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
మరోసారి కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు పొడిగింపు
హైదరాబాద్: తెలంగాణ సర్కార్ మరోసారి కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును పొడిగించింది. ఈనెల 31వ తేదీతో కమిసన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో దానిని జూలై 31వ తేదీ వరకూ పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల బ్యారేజీల్లో అవకతవకలపై ఉమ్మడి ఏపీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును మరోసారి పొడిగించింది. తొలుత ఈనెల(మే నెల)లోనే తుది రిపోర్ట్ ఇస్తామని కమిషన్ లీక్ ఇచ్చినప్పటికీ.. జూలై 31వ తేదీ వరకూ పొడిగించడంతో విచారణపై ఉత్కంఠ నెలకొంది. ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారనే చర్చ నడుస్తోంది. -
‘అందాల పోటీల మీదే కాదు అగ్ని ప్రమాదాల మీద కూడా ఫోకస్ పెట్టండి’
సాక్షి,హైదరాబాద్: అందాల పోటీల మీదే కాదు అగ్ని ప్రమాదాల మీద కూడా ఫోకస్ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి హితువు పలికారు. ఆదివారం ఉదయం చోటు చేసుకున్న పాతబస్తీ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు.అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..‘అగ్ని ప్రమాదంలో మరో ప్రాణం పోకుండా చూడండి. రాజకీయంగా మాట్లాడడానికి రాలేదు. ప్రభుత్వాలు ప్రజలకు ప్రాణాలు కాపాడాలి. రూ.5 లక్షల పరిహారం ఇవ్వడం కాదు ప్రాణాలపై దృష్టి పెట్టాలి. రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.ముఖ్యమంత్రే హోమ్ మినిస్టర్‌గా ఉన్నారు కాబట్టి ఘటన స్థలానికి వచ్చి ఉంటే అధికారులు ఇంకా బాగా పనిచేసేవారు.సమ్మర్ వచ్చే ముందు అగ్నిమాపక సిబ్బందితో ప్రభుత్వం సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. ఫైర్ ఇంజన్లు వచ్చాయి కానీ వాటర్ లేవు. సిబ్బందికి సరైన మాస్కులు లేవు. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్లు లేకపోవడం దురదృష్టకరం.హైదరాబాదులో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదం.నిన్నటి రోజు దుర్భరమైన రోజుగా ప్రమాద ఘటనపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని’ అన్నారు. -
పాతబస్తీ ప్రమాదంపై విస్తుపోయే విషయాలు.. అక్రమ కనెక్షన్ కారణమా?
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం వెనుక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అగ్నిప్రమాదం వెనక అక్రమ కరెంట్ కనెక్షన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అక్రమ కరెంట్‌పై పోలీసులు, ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.వివరాల ప్రకారం.. గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం కారణంగా 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబానికి చెందిన 17 మంది మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన నగరాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ కరెంట్ కనెక్షన్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు, ఫైర్ సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.నగల దుకాణం మూసేయగానే హైటెన్షన్ వైర్ నుంచి.. కొక్కేల ద్వారా స్థానికులు కరెంట్ కనెక్షన్ తీసుకున్నారు. ఈ అక్రమ కరెంట్‌తో బాధిత కుటుంబం కరెంట్ మీటర్‌పై లోడ్ పడింది. ఆ కరెంట్ లోడ్‌తో బాధిత కుటుంబం మీటర్ బాక్స్‌లో మంటలు చెలరేగాయి. మీటర్ బాక్స్ పక్కన ఉన్న ఉడెన్ షోకేజ్‌కు మంటలు అంటుకున్నాయి. ఉడెన్ షోకేజ్ నుంచి ఏసీ కంప్రెషర్‌ను మంటలు తాకాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్రమ కరెంట్‌పై పోలీసులు, ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా. గుల్జార్‌హౌజ్ అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు, నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులున్నారు. అపస్మారకస్థితికి చేరిన నలుగురు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ పెనువిషాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, డీజీపీ జితేందర్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్రం రూ.2 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాయి. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని అగ్నిమాపక శాఖ అధికారులు ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశించారు. -
అంతా నా ఇష్టం..
నంగునూరు(సిద్దిపేట): ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తుండటంతో పోలీసులకు సైతం తలనొప్పులను తెస్తోంది. ఇటీవల ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధితుల ఎదుటే సిబ్బందిపై చిందులు తొక్కడంతో అక్కడే ఉన్న ఎస్ఐ, పోలీసులు అవాక్కయ్యారు. ఇంత జరుగుతున్నా ఆమెపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో సివిల్ వివాదాల్లో సహితం జోక్యం చేసుకుంటున్నారు. రెండు రోజుల కిందట ఏకంగా మండల మెజి్రస్టేట్, తహసీల్దార్‌కు ఫోన్ చేసి రిజి్రస్టేషన్ ఆపాలని చెప్పడంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్.. రిసెప్షన్ గదిలో విధులు నిర్వహిస్తున్నారు. ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుగా ఆమెనే కలవాల్సిరావడం అనుకూలంగా మార్చుకున్నారు. కేసులకు సంబంధించిన ఫిర్యాదులో జోక్యం చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారం రోజుల కిందట తనపై అధికారిపై ఎస్ఐ, సిబ్బంది, బాధితుల ఎదుటే వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్ ఆపాలంటూ తహసీల్దార్‌కు ఫోన్.. నంగునూరుకు చెందిన ఓ వ్యక్తి తన కూతురు పేరిట రెండెకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు శనివారం స్లాట్ బుక్ చేసుకున్నాడు. రిజి్రస్టేషన్ చేయొద్దని అతని కుమారుడు అడ్డు చెప్పడంతో వివాదం రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. ఈ విషయంపై మహిళా హెడ్‌కానిస్టేబుల్ రిజి్రస్టేషన్ ఆపాలని తహసీల్దార్‌కు ఫోన్ చేయడంతో ఆశ్చర్యానికి గురైన సదురు అధికారి.. ఎస్ఐకి, మరో ఉన్నతాధికారికి ఫోన్ చేసిన ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రిసెప్షనిస్ట్ విధుల నుంచి తొలగించాం ఈ విషయమై రాజగోపాల్‌పేట ఎస్ఐ ఎండీ అసీఫ్ను వివరణ కోరగా.. మహిళా హెడ్ కానిస్టేబుల్ తహసీల్దార్‌కు ఫోన్ చేయడం నిజమేనన్నారు. దీంతో తహసీల్దార్ సరిత తనతో పాటు ఏసీపీతో ఫోన్లో మట్లాడారన్నారు. ఆమెను రిసెప్షనిస్ట్ విధుల నుంచి తొలగించి సాధారణ విధులు అప్పగించామన్నారు. -
మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. 70 ప్లాట్ల యజమానులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మియాపూర్‌లో హైడ్రా (Hydra) కూల్చివేతలు చేపట్టింది. హెచ్ఎండీఏ లేఅవుట్లోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి.వివరాల ప్రకారం.. మియాపూర్‌లోని హైదర్‌నగర్‌లో సోమవారం ఉదయం నుంచి హైడ్రా (Hydra) కూల్చివేతలు చేపట్టింది. తప్పుడు పత్రాలతో తమ భూమి కబ్జా చేశారని ఇటీవల 70 మంది ప్లాట్ల యజమానులు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. హెచ్ఎండీఏ లేఅవుట్లోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. హైకోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు. ఇక, కబ్జాదారుల నుంచి భూములు విడిపించడంపై ప్లాట్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు. -
పిల్లలను తీసుకుని ఇంటికి రా తల్లీ.. సరదాగా వెళ్లారు..
రాజేంద్రనగర్/మణికొండ/బంజారాహిల్స్: ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంలో మృతిచెందిన 17 మందిలో 10 మృతదేహాలకు ఆదివారం సాయంత్రం ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ పెద్ద ప్రహ్లాద్ మోదీ, ఆయన భార్య మున్నీ, కుమారుడు పంకజ్, కోడలు వర్ష, తమ్ముడు రాజేందర్ మోదీ, మరదలు సుమిత్ర, తమ్ముని కుమారుడు అభిషేక్, మనుమలు, మనమరాళ్లు అనుయాన్, ఇదిక, ఐరాజ్‌ల మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం పురానాపూల్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఈ ప్రమాదంలో బంజారాహిల్స్ రోడ్ నెం.3లో నివసించే ఏడేళ్ల బాలిక హర్షాలి గుప్తా కన్నుమూశారు. ఆమె శరీరం పూర్తిగా కాలిపోవటంతో కుటుంబ సభ్యులు అస్తికలకు ఆదివారం మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.పుట్టింటికి వెళ్లి మృత్యువాతసనత్‌నగర్: వేసవి సెలవులు కదా..? పిల్లలను తీసుకుని ఇంటికి రా.. తల్లీ! అని ఆ తండ్రి ఆశగా అడగడంతో కొడుకును తీసుకుని తన పుట్టిల్లు అయిన గుల్జార్‌హౌస్‌కు వెళ్లింది. అదృష్టవశాత్తూ తండ్రి పిలుపు మేరకు కొడుకు ముందు రోజు రాత్రే వెళ్లిపోగా, తల్లి అగ్ని ప్రమాదంలో మృత్యువాత పడింది. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వస్త్ర వ్యాపారి వినోద్‌కుమార్ అగర్వాల్ తన భార్య రజనీ అగర్వాల్ (45), కొడుకు కుషాల్ అగర్వాల్, కుమార్తె తనూలతో కలిసి సనత్‌నగర్‌లో ఉంటున్నాడు. కుమార్తె ముంబైలో ఎంబీఏ చదువుతుండగా, కుమారుడు కుషాల్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. ఈ క్రమంలో కుమారుడు కుషాల్‌ను తీసుకుని రజని గుల్జార్ హౌస్‌కు వెళ్లింది. అయితే కుషాల్ ముందు రోజు రాత్రి ఇంటికి వచ్చేశాడు. అక్కడే ఉన్న రజని మాత్రం ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించింది.సరదాగా వెళ్లారు.. శవాలై వచ్చారురహమత్‌నగర్: బంధువులతో సరదాగా గడపాలని వెళ్లారు. శవాలుగా తిరిగొచ్చారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడటం ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్‌నగర్ బస్తీ వాసులను కలచి వేసింది. గుల్జార్ హౌస్ ఆగ్ని ప్రమాదంలో రాజీవ్‌నగర్‌కు చెందిన తల్లి, కొడుకు, కుమార్తె మృతి చెందారు. ఆటో మొబైల్స్ వ్యాపారం చేసే రాజేష్ జైన్ రాజీవ్‌నగర్‌లో ఉంటున్నారు. ఆయనకు భార్య శీతల్ (35), ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా శనివారం ఉదయం శీతల్ తన తండ్రి ఇంటికి పిల్లల్ని తీసుకుని వెళ్లింది. అయితే పెద్ద కుమార్తె రాశి తాను చదువుకోవాలంటూ శనివారం సాయంత్రమే రాజీవ్‌నగర్ లోని తమ నివాసానికి తిరిగి వచ్చింది. అక్కడే ఉండిపోయిన శీతల్, అరుషి, రిషబ్ మాత్రం ప్రమాదంలో చనిపోయారు. -
వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)
-
హైదరాబాద్ చరిత్రలో అతిపెద్ద ప్రమాదాలు ఇవే.. 2002 తర్వాత..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని దుకాణాలు, కంపెనీలు, గోదాముల్లో ఏటా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే, భారీ ప్రాణనష్టాలతో కూడిన వి మాత్రం తక్కువే. 2002లో ఉస్మాన్‌గంజ్‌లోని శాంతి ఫైర్ వర్క్స్‌లో జరిగిన అగ్నిప్రమాదం ప్రాణ నష్టం పరంగా ఇప్పటివరకు ప్రథమ స్థానంలో ఉండేది. ఆదివారం పాత బస్తీలోని గుల్జార్‌హౌస్ వద్ద ‘మోదీ ఇంట్లో’జరిగిన ప్రమా దం దాన్ని దాటేసింది. ఒకే ప్రమాదంలో 17 మంది మృతిచెందటంతో నగర చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదంగా రికార్డుల్లోకి ఎక్కింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం కూడా ఇదే తొలిసారి. గతంలో నగరంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదాల్లో కొన్ని ఇవీ...23.10.2002:ఉస్మాన్‌గంజ్‌లోని శాంతి ఫైర్ వర్క్స్‌లో చోరీ చేయడానికి వచ్చిన దొంగ మారుతి నయీం.. అందులో నగదు లభించకపోవడంతో నిప్పు పెట్టాడు. ఈ ఉదంతంలో ఫైర్వర్క్స్ పై అంతస్తులో ఉన్న కార్తికేయ లాడ్జిలో బస చేసిన కస్టమర్లు, సిబ్బంది మొత్తం 12 మంది చనిపోయారు.21.10.2006:సోమాజిగూడలోని మీనా జ్యువెలర్స్ నిర్మాణ పనులు జరుగుతుండగా, పెయింటింగ్ పని చేయడానికి వచ్చిన వలస కార్మికులు పై అంతస్తులో నిద్రించారు. కింది ఫ్లోర్లో జరిగిన అగ్నిప్రమాదంతో పెయింట్లకు నిప్పంటుకొని విడుదలైన విషవాయువుల ప్రభావానికి ముగ్గురు చనిపోయారు. 24.11.2012:పుప్పాలగూడలోని బాబానివాస్ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. వాచ్‌మన్‌తో పాటు స్థానికుల అప్రమత్తత కారణంగా మరో పదిమంది ప్రాణాలతో బయటపడ్డారు. 22.02.2017:అత్తాపూర్‌లోని ఒక చిన్నతరహా పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. కూలర్లు తయారుచేసే ఈ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో ఒడిశాకు చెందిన ఆరుగురు వలస కార్మికులు చనిపోయారు. 23.02.2022:న్యూ బోయగూడ వద్ద శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో ఉన్న స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో బిహార్ నుంచి వచ్చిన వలస కార్మికులు 11 మంది చనిపోయారు. 16.05.2023:సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో క్యూ నెట్ అనుబంధ సంస్థ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్‌లో పని చేసే ఆరుగురు మరణించారు. 13.11.2023:నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో ఉన్న నాలుగంతస్తుల భవనం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. భవనం కింది అంతస్తులో ఉన్న కార్ఖానాలో మంటలు చెలరేగి భవనం మొత్తం కాలిపోయింది.ఆ భవనాల్లో మరిన్ని జాగ్రత్తలు అవసరంఫైర్ సేఫ్టీ విషయంలో వాణిజ్య భవనాలకు ఇచ్చిన ప్రాధాన్యం నివాస భవనాలకు ఇవ్వట్లేదు. వ్యాపార సంస్థలు, గృహాలు కలిసి ఉన్న భవనాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరకే ఫైర్ అలారమ్స్, అగ్నిమాపక పరికరాలు లభిస్తున్నాయి. వీటిని ఇళ్లలోనూ ఏర్పాటు చేసుకుంటే దుర్ఘటనలు తగ్గుతాయి. ప్రమాదం జరిగినా ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.– వై.నాగిరెడ్డి, రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీ -
ఉగ్రకుట్ర భగ్నం
సాక్షి,హైదరాబాద్/విజయనగరం/విజయనగరం క్రైమ్: తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఏపీ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌తో ఉగ్రకుట్రను భగ్నం చేశారు. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాండ్లర్ నెట్వర్క్ గుట్టురట్టు చేశారు. బాంబు పేలుళ్ల ప్రయోగాల కోసం పేలుడు పదార్థాలు సేకరిస్తున్న ఇద్దరిని వేర్వేరు చోట్ల అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసుల సమాచారంతో తొలుత ఏపీలో విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్(29)ను పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత సిరాజ్ విచారణలో చెప్పిన సమాచారాన్ని ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులతో పంచుకున్నారు. దీంతో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు (సీఐ సెల్) హైదరాబాద్ బోయగూడలో ఉంటున్న సయ్యద్ సమీర్(28)ను అరెస్ట్ చేశారు. అనంతరం సమీర్‌ను విజయనగరం తరలించారు. డమ్మీ బ్లాస్ట్‌లకు కుట్ర విజయనగరానికి చెందిన సిరాజ్.. సయ్యద్ సమీర్ కలిసి ‘అల్ హింద్ ఇత్తెహబుల్ మిసిలెన’ (ఏహెచ్‌ఐఎమ్) పేరుతో పలు కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులకు కీలక అధారాలు లభించాయి. సౌదీ అరేబియాలోని ఓహ్యాండ్లర్ నుంచి హైదరాబాద్, ఏపీలోని సానుభూతిపరులకు ఆదేశాలు వస్తున్నట్లు గుర్తించారు. పేలుళ్ల కోసం ప్రయోగాలు చేసేందుకు సంబంధిత కెమికల్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో డమ్మీ బ్లాస్ట్‌లు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఇందుకోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు సీఐ సెల్‌కు సమాచారం అందింది.దీంతో తెలంగాణ సీఐ సెల్ అధికారులు విజయనగరం పోలీసులను అప్రమత్తం చేశారు. సిరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని ఇంట్లో పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతోనే విజయనగరంలో పేలుడు పదార్థాల కొనుగోలుకు పూనుకున్నట్టు సమాచారం. వీరి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లో చదువుకున్నప్పుడే... సిరాజ్ 2018 సంవత్సరంలో హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్న సమయంలో సమీర్‌తో పరిచయం ఏర్పడినట్టు నిఘా వర్గాల సమాచారం. వీరిద్దరూ ఐసిస్‌తో సంబంధాలు పెంచుకున్నట్టు తెలంగాణ ఇంటెలిజెన్స్ గుర్తించింది. తండ్రి, సోదరుడు పోలీస్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తుండగా, సిరాజ్ మాత్రం ఉగ్రవాద భావజాలానికి ప్రేరేపితం కావడం పోలీసులను విస్మయపరుస్తోంది. వీరు రసాయనాలను ఎక్కడెక్కడ కొనుగోలుచేశారు, ఇంకా ఎక్కడ నిల్వ చేశారు, దీనితో ఎవరెవరికి సంబంధం ఉందన్న కోణంలో ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తున్నట్లు విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. నిందితులిద్దరినీ విజయనగరం కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు. -
ఘోర అగ్నిప్రమాదం 17మంది బలి
సాక్షి, హైదరాబాద్/చార్మీనార్/దూద్‌బౌలి: అది హైదరాబాద్ పాతబస్తీలోని ఓ భవనం. ముందు దుకాణాలు ఉంటే, వెనుక అంతస్తుల్లో ఇళ్లు ఉన్నాయి. తెల్లవారుజామున అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. దీంతో మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి, రెండో అంతస్తుల్లోకి దట్టమైన పొగ, మంటలు విస్తరించాయి. గ్రౌండ్, మొదటి, రెండో అంతస్తులో నిద్రిస్తున్న 23 మందిని చుట్టుముట్టాయి. మంటల తీవ్రతతో పాటు పొగ పీల్చడంతో అపస్మారక స్థితికి చేరుకున్న నాలుగు కుటుంబాలకు చెందిన 8 మంది చిన్నారులు సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు.నలుగుర్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడగా.. మంటల్ని తొలుత గమనించిన ఇద్దరు మహిళలు బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. మృతుల్లో కొందరికి కాలిన గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం 5.30–6.00 గంటల సమయంలో చార్మీనార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో ఈ ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగర చరిత్రలో ఒకే అగ్ని ప్రమాదంలో ఇంత మంది చనిపోవడం, అంతా బంంధువులే కావడం ఇదే తొలిసారి. అంతా బంధువులే... రాజస్తాన్‌కు చెందిన అన్నదమ్ములు ప్రహ్లాద్ మోడీ, రాజేందర్ మోడీ, బంకట్ మోడీ, దేవనాథ్ మోడీ, సునీల్ మోడీ ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి బంగారం, వెండి, ముత్యాల వ్యాపారం చేస్తున్నారు. ప్రహ్లాద్ మోడీ, రాజేందర్ మోడీ, బంకట్ మోడీ తమ కుటుంబాలతో గుల్జార్ హౌస్‌లోని చార్మీనార్ రోడ్డులో ఉన్న భవనంలో నివసిస్తున్నారు. దీని ముందు భాగంలో శ్రీకృష్ణ పెరల్స్, మోడీ పెరల్స్ పేరుతో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. సునీల్ మోడీ అత్తాపూర్, దేవనాథ్ మోడీ హిమాయత్ నగర్లో ఉంటున్నారు.గుల్జార్ హౌస్‌లోని దుకాణాల (జీ ప్లస్ వన్) వెనుక ఉన్న రెండు అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్లో గోదాములు, షాపులు, కార్ఖానాలు ఉండగా..మొదటి, రెండో అంతస్తుల్లో ప్రహ్లాద్, రాజేందర్, బంకట్ కుటుంబాలు ఉంటున్నాయి. రాజస్తాన్‌లో ఉండే సునీల్ బంధువులు వేసవి సెలవులు కావడంతో అత్తాపూర్‌కు వచ్చారు. వారాంతం నేపథ్యంలో శనివారం కొందరు బంధువులు గుల్జార్ హౌస్‌లోని ముగ్గురు అన్నదమ్ముల ఇళ్లకు వచ్చారు. ఇలా మొత్తం 23 మంది ఆ భవనంలో శనివారం రాత్రి నిద్రపోయారు. మీటర్ వద్ద మొదలైన మంటలు ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కరెంట్ మీటర్లతో పాటు సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద కూడా కొన్ని రోజులుగా నిప్పు రవ్వలు ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కరెంట్ మీటర్ల వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో అక్కడ మొదలైన మంటలు మొదటి, రెండో అంతస్తులకు విస్తరించాయి. మంటలకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఏసీ కంప్రెషర్ పేలడంతో అగ్ని కీలలు మరింత ఎగిశాయి. ఉదయం సుమారు 6.15 గంటల సమయంలో వీటిని గుర్తించిన గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఇద్దరు మహిళలు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు.మంటలు అంటుకున్న విషయాన్ని అక్కడి వారికి చెప్పారు. ఉదయం 6.16 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. 6.20 గంటలకు మొఘల్‌పుర నుంచి మొదటి ఫైర్ ఇంజన్ ఆ ప్రాంతానికి చేరుకుంది. అదే సమయంలో మక్కా మసీదులో ప్రార్థనలు ముగించుకుని బయటకు వచి్చన ఐదుగురు యువకులు ఈ భవనం వద్దకు చేరుకురు. అప్పటికే మంటలు, దట్టమైన పొగ ఆ భవనాన్ని చుట్టేశాయి. రోడ్డు పైన ఉన్న ఇద్దరు మహిళలు భవనంలో తమ కుటుంబీకులు ఉన్నారని, వారిని కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. దీంతో అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు ఐదుగురు యువకులూ ఇంట్లోకి వెళ్లే మార్గాల కోసం అన్వేíÙంచారు. భవనానికి 3 అడుగులు, 1 అడుగు మార్గాలే.. మోడీ కుటుంబాలు నివసించే ఈ భవనం ముందు రోడ్డు వైపు శ్రీకృష్ణ, మోడీ పెరల్స్‌తో పాటు ఇతర దుకాణాలు ఉన్నాయి. వెనుక వైపు ఉన్న నివాస భవనంలోకి వెళ్లడానికి ఓ చోట మూడు అడుగులు, మరోచోట అడుగు వెడల్పుతో ఉన్న మార్గాలే ఉన్నాయి. భవనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి, రెండో అంతస్తులకు వెళ్లడానికి కేవలం రెండున్నర అడుగుల వెడల్పుతో ఉన్న ఒకే ఒక్క మెట్లగది (స్టెయిర్ కేస్) ఉంది. మూడు అడుగుల వెడల్పు మార్గం ఉత్తర దిక్కున ఉండగా.. ఈ మెట్లు దక్షిణ దిక్కున ఉన్నాయి. దీంతో వ్యాపించిన మంటలు, పొగలో ఆ మెట్ల వద్దకు చేరుకోవడం సాధ్యం కాలేదు. భవనంలో ఎక్కువగా వుడ్ (చెక్క) పార్టీషన్‌తో ఉన్న గదులు ఎక్కువగా ఉండటం మంటలు త్వరగా వ్యాపించడానికి కారణమైంది. గోడలకు రంధ్రాలు చేసి లోపలకు.. పక్కన ఉన్న మరో భవనం మొదటి అంతస్తుకు చేరిన యువకులు, అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడ ఉన్న, ఈ భవనంలోని మరో గోడకు రంధ్రాలు చేసి ఇంట్లోకి నీళ్లు చిమ్మారు. మంటలు కొద్దిగా అదుపులోకి వచ్చాక మొదటి అంతస్తులోకి వెళ్లిన అధికారులు, యువకులు అక్కడ దాదాపుగా అపస్మారక స్థితిలో ఉన్న 17 మందితో పాటు రెండో అంతస్తు నుంచి టెర్రస్ పైకి వెళ్లి పొగతో ఉక్కిరిబిక్కిరైన నలుగురిని బయటకు తీసుకువచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న 17 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించగా వారు చనిపోయినట్లు వైద్యవర్గాలు ప్రకటించాయి. అపస్మారక స్థితిలో..సెల్‌ఫోన్ లైట్ వెలుగుతూ.. సహాయ చర్యల సందర్భంగా భవనం మొదటి అంతస్తులోని గదుల్లో అత్యంత హృదయ విదారక దృశ్యాలు కన్పించినట్లు అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. లోపల నుంచి గడియ పెట్టి ఉన్న ఓ గదిలో ఓ మహిళతో పాటు నలుగురు చిన్నారులు ఒకేచోట పడిపోయి ఉన్నారు. ఇంకో గదిలో మరో నలుగురు చిన్నారులతో పాటు ఉన్న మహిళ ఓ మూలన అపస్మారక స్థితిలో కూర్చుని ఉంది. అయితే ఆమె చేతిలో ఉన్న సెల్‌ఫోన్ లైట్ వెలుగుతూ కన్పించింది. చిన్నారులు కూడా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. దొంగల భయంతో భవనం టెర్రస్ పైకి వెళ్లే స్టెయిర్ కేస్‌కు గేటు ఏర్పాటు చేసుకున్న మోడీ కుటుంబీకులు దానికి తాళం వేశారు. మొదటి అంతస్తుకు, రెండో అంతస్తుకు మధ్య ఉన్న గేటుకు తాళం వేయడంతో పొగలో రెండో అంతస్తులో ఉన్న వాళ్లు పైకిగానీ, కిందికి గానీ వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. భార్య, పిల్లల కోసం లోపలికి వెళ్లి.. ప్రహ్లాద్ మోడీ పెద్ద కుమారుడైన పంకజ్ మోడీ అగ్ని ప్రమాదాన్ని గుర్తించి మొదటి అంతస్తులోని గదిలోంచి బయటికి వచ్చి పోలీసు, ఫైర్ విభాగాలకు సమాచారం ఇచ్చారు. ఆపై తన భార్య, పిల్లల్ని రక్షించడం కోసం మళ్లీ గదిలోకి వెళ్లారు. ఇంతలో దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. భార్య పిల్లలతో సహా పంకజ్ మోడీ కూడా వాటిల్లో చిక్కుకుని బయటకు రాలేకపోయారు. తాను తప్పించుకునే అవకాశం వచి్చనా కుటుంబ సభ్యులను కాపాడాలని ప్రయత్నించిన పంకజ్ మోడీ చనిపోవడం స్థానికుల హృదయాలను కలచివేసింది. ప్రహ్లాద్ కుటుంబం అంతా మృత్యువాత ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోడీ కుటుంబంలోని అంతా చనిపోయారు. ప్రహ్లాద్ మోడీకి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. వేసవి సెలవులకు తన తండ్రి ప్రహ్లాద్ మోడీ ఇంటికి వచి్చన కుమార్తెలు వారి చిన్నారులు మృతి చెందారు. ప్రహ్లాద్ మోడీ మరో సోదరుడైన బంకట్ మోడీ టెర్రస్ పైకి వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నారు. అయితే ఆయన కుమారుడు అభిషేక్ మోడీ, ఆయన భార్య మృతి చెందారు. బంకట్ మోడీతో పాటు రాజేందర్ మోడీతో పాటు ఆయన భార్య, మరో వ్యక్తి టెర్రస్ పైకి వెళ్లడంతో బతికిపోయారు. గోవింద్ మోడీ కుటుంబ సభ్యులు అత్తాపూర్‌లో నివసిస్తుండడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రహ్లాద్ మోడీ కుటుంబ సభ్యులతో పాటు షోరూంల్లో పనిచేసే సిబ్బంది సైతం ఇదే భవనంలో నివసిస్తుంటారు. వేసవి కాలం కావడంతో ఆ పని వారంతా టెర్రస్ పైన పడుకోవడంతో మృత్యువు నుంచి తప్పించుకున్నారు. కిషన్‌రెడ్డి, పొన్నం, డీజీపీ సందర్శన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ జితేందర్, నగర సీపీ సీవీ ఆనంద్, అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, మేయర్ విజయలక్ష్మి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు మీర్ జుల్పికర్ అలీ, అహ్మద్ బలాల, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. అగ్నిమాపక శాఖపై కిషన్‌రెడ్డి ఫైర్ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అగ్నిమాపక శాఖపై ఆరోపణలు చేశారు. ఫైర్ ఇంజన్లు అర్ధగంట ఆలస్యంగా వచ్చాయన్నారు. అధికారుల వద్ద ప్రత్యేక, ఆధునిక అగ్నిమాపక ఉపకరణాలు లేవని మండిపడ్డారు. దీనివల్లే రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమై ప్రాణ నష్టం పెరిగిందని అన్నారు. ఈ ఆరోపణల్ని అగ్నిమాపక శాఖ డీజీ ఖండించారు. తమకు ఉదయం 6.16 గంటలకు కాల్ వచి్చందని, మొఘల్‌పుర నుంచి 6.17కు బయలుదేరిన మొదటి ఫైరింజన్ 6.20 గంటలకు ప్రమాద స్థలికి చేరిందని స్పష్టం చేశారు. వెంటనే తీవ్రతను అంచనా వేసి మరో పది ఫైరింజన్లు, 70 మంది సిబ్బందిని మోహరించామని వివరించారు. ఆ భవనానికి ఒకే ఒక స్టెయిర్ కేస్ ఉండటం, అదీ ఇరుకైనది కావడంతో పాటు ఇతర కారణాలు ప్రమాద తీవ్రతను పెంచాయని అన్నారు. కాగా అగ్ని ప్రమాదంపై చార్మీనార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. మృతులు వీరే: ప్రహ్లాద్ మోడీ (70), మున్ని (70), రాజేందర్ మోడీ (25), సుమిత్ర (60) హామీ (7), అభిషేక్ (31), శీతల్ (35), ప్రియాంచ్ (4), ఇరాజ్ (2), అరుషి (3), రిషబ్ (4), ప్రథం (ఒకటిన్నర ఏళ్లు), అనియాన్ (3), వర్ష (35), పంకజ్ (36), రజిని (32) ఇద్దూ (4). మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి చూపించాడు.. ప్రతిరోజూ తెల్లవారుజామున ప్రార్థనల కోసం మక్కా మసీదుకు వస్తుంటాం. ఆదివారం ఉదయం ప్రార్థనలు ముగించుకుని బయటకు వచ్చా. ఆ సమయంలో మసీదు గేటు వద్ద నిలుచుని ఉన్న మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి డబ్బు అడగటంతో రూ.10 ఇచ్చా. అతడే గుల్జార్‌హౌస్ వద్ద పొగలు వస్తున్న భవనాన్ని చూపించాడు. నేను వెంటనే మరో నలుగురితో కలిసి అక్కడకు పరిగెత్తుకుంటూ వెళ్లా. గోడలకు రంధ్రాలు చేసి అగ్నిమాపక సిబ్బందితో కలిసి లోపలకు వెళ్లాం. అయినా 17 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధ కలిస్తోంది. – మీర్ జాహెద్, గుల్జార్ హౌస్ వద్ద గాజుల వ్యాపారి -
హరిత హైడ్రోజన్.. కాలుష్యానికి సొల్యూషన్
వేగంగా జరుగుతున్న పట్టణీకరణ కారణంగా 2050 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి 10 మందిలో ఏడుగురు నగరాల్లో నివసిస్తారని అంచనా. పట్టణాలు వృద్ధి చెందడం ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యం వంటి సవాళ్లూ వస్తాయి. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రస్తుతం విద్యుత్ వాహనాల వినియోగం కనిపిస్తోంది. భవిష్యత్తులో హైడ్రోజన్ ఇంధనం తోడవ్వనుంది. ఇది కాలుష్యాన్ని మరింత తగ్గించి, స్వచ్ఛ భారత్ సాధనకు కారకమవుతుందని ఇంధన, వాహన రంగ తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 2050 నాటికి ప్రపంచంలో నడిచే వాహనాల్లో 16 శాతం హైడ్రోజన్‌తోనే ఉంటాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) అంచనా వేస్తోంది.ప్రపంచంలో అత్యధిక కాలుష్యం గల టాప్–5 దేశాల్లో ఇండియా ఉంది. మన దేశంలో 2008 నుంచి 2019 వరకూ, గాలిలో ఉండే పీఎం 2.5 కణాలు 10 ప్రధాన నగరాల్లో ఏటా దాదాపు 30 వేల మరణాలకు కారణమయ్యాయి. ఇది మొత్తం మరణాలలో 7.2 శాతమని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. ఇందులో ఏటా ముంబైలో మరణించినవారు 5,100, కోల్‌కతాలో 4,678, చెన్నైలో 2,870 మంది. తర్వాతి స్థానాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, పుణే, వారణాసి, సిమ్లా, ఢిల్లీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్ వాహనాల (ఈవీ)కు డిమాండ్ పెరిగింది.దూసుకొస్తున్న హైడ్రోజన్2023 నాటికి, ప్రపంచ రోడ్లపై 4 కోట్ల ఈవీలు ఉన్నాయి. ఇది 2022లో సంఖ్య కంటే 35 శాతం ఎక్కువ. మనదేశంలో 2024లో ఏకంగా 20.22 లక్షల ఈవీల అమ్మకాలు జరిగాయి. ఇప్పుడు వీటికి ప్రత్యామ్నాయంగా వస్తున్నవే ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలు (ఎఫ్‌సీఈవీ). ఇవి హైడ్రోజన్ సాయంతో నడుస్తాయి. ఐఈఏ గణాంకాల ప్రకారం 2023 నాటికి ప్రపంచంలో హైడ్రోజన్ డిమాండ్ 9.7 కోట్ల టన్నులకు చేరింది. 2022తో పోలిస్తే ఇది 2.5 శాతం ఎక్కువ. నీటిని విద్యుత్ విశ్లేషణ (ఎలక్ట్రాలసిస్) ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొట్టవచ్చు.సౌరశక్తి వంటి పునరుత్పాదక వనరులతో ఉత్పన్నమయ్యే విద్యుచ్ఛక్తితో నీటిని విభజిస్తే గ్రీన్ హైడ్రోజన్ వస్తుంది. అలా కాకుండా బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి వాటితో ఉత్పన్నమయ్యే విద్యుత్తుతో నీటిని విభజిస్తే బ్లూ, గ్రే హైడ్రోజన్లు ఉత్పన్నమవుతాయి. ఈ ప్రక్రియలోనూ కర్బన ఉద్గారాలు వెలువడతాయి. గ్రీన్ హైడ్రోజన్ అలా కాదు, స్వచ్ఛమైన ఇంధనం. ముఖ్యంగా ఎరువులు, చమురు శుద్ధి, ఉక్కు, రవాణా వంటి రంగాల్లో అత్యధిక కర్బన ఉద్గారాలు వెలువడతాయి. ఈ రంగాల్లో గ్రీన్ హైడ్రోజన్ వాడితే ఆ మేరకు అవి తగ్గుతాయి.అధిక ధర, నిర్వహణ ఖర్చులుహైడ్రోజన్ వాహనాలు తేలిగ్గా ఉంటాయి. తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించగలవు. కేవలం 5 నుంచి 15 నిమిషాల్లో ఇంధనం నింపుకోగలవు. ముఖ్యంగా దూర ప్రయాణం, వర్షం, తీవ్రమైన చలిలోనూ దూసుకుపోగలవు. అయితే, ప్రస్తుతం ఈ వాహనాలు చాలా తక్కువగా.. ప్రపంచవ్యాప్తంగా 93 వేలే ఉన్నాయి. దీనికి కారణం వాటి అధిక ధర, నిర్వహణ ఖర్చులు. డీజిల్ బస్సులకు కిలోమీటర్‌కు నిర్వహణ ఖర్చు దాదాపు రూ.23.06 అవుతుంది. ఎలక్ట్రిక్ బస్సులకు రూ.14.52 ఖర్చవుతుంది. విద్యుత్ వాహనాల కొనుగోలు ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ మేరకు నిర్వహణ భారం తగ్గుతుంది. కానీ హైడ్రోజన్ బస్సులు నడపడానికి చాలా ఖర్చవుతుంది. సహజ వాయువు నుంచి ఉత్పత్తి చేసిన బ్లూ హైడ్రోజన్ వాహనానికి కిలోమీటర్‌కి రూ.71.73 ఖర్చవుతుంది. గ్రీన్ హైడ్రోజన్ అయితే కిలోమీటర్‌కు రూ.77.69 ఖర్చవుతుంది. సాంకేతికత మెరుగుపడటంతో రెండింటి ధరలు 2030 నాటికి సమానమవుతాయని నిపుణులు భావిస్తున్నారు.స్టీల్, వాహన రంగాల్లో..స్టీల్ ఉత్పత్తిని గ్రీన్ హైడ్రోజన్‌తో చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం 7 పైలట్ ప్రాజెక్టులు మంజూరు చేశారు. 2029–30 వరకు గ్రీన్ హైడ్రోజన్ ద్వారా స్టీల్ ఉత్పత్తి చేసేందుకు రూ.455 కోట్లతో పైలట్ ప్రాజెక్టులను కేంద్ర స్టీల్ శాఖ అమలుచేస్తోంది. రవాణా రంగంలో 5 పైలట్ ప్రాజెక్టులు మంజూరు చేశారు.గ్రీన్ హైడ్రోజన్ మిషన్గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వాడకం, ఎగుమతుల్లో మనదేశాన్ని గ్లోబల్ హబ్‌గా రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ మిషన్ (జీహెచ్ఎమ్) అమలు చేస్తోంది. దీని ప్రకారం ఏటా 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయగలిగితే శిలాజ ఇంధనాల దిగుమతులను భారీగా తగ్గించుకోవచ్చు. ఫలితంగా 2030 నాటికి రూ.లక్ష కోట్లు ఆదా చేయొచ్చు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం వల్ల ఏటా 5 కోట్ల టన్నుల కార్బన్డయాక్సైడ్ ఉద్గారాలనూ తగ్గించుకోవచ్చు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే కంపెనీలకు కేంద్రం ప్రోత్సాహకాలూ ఇస్తోంది.వైఎస్ జగన్ హయాంలో...ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్‌లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఏర్పాటుచేసిన మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఈ ఏడాది మార్చిలోనే ఉత్పత్తి ప్రారంభించింది. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో భాగంగా అప్పటి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఏపీలో హరిత ఇంధన రంగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీనిద్వారా తొలి విడతలో 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. రానున్న కాలంలో 54 టన్నులకు పెంచనున్నారు. దీని ద్వారా ఏడాదికి 206 టన్నుల కార్బన్డయాక్సైడ్ ఉద్గారాల తగ్గింపుతోపాటు వాతావరణంలోకి ఏడాదికి సుమారు 195 టన్నుల ఆక్సిజన్ విడుదల అవుతుంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లోనే.. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీతో ఏపీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. సుమారు రూ.లక్ష కోట్లతో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు తొలి విడత పనులు 2026 నాటికి, మొత్తం 2030 నాటికి పూర్తవుతాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలోనే హెచ్‌పీసీఎల్, ఓఎన్జీసీ వంటి సంస్థలు కూడా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి.గ్రీన్ హైడ్రోజన్ రైలుపూర్తి దేశీయ పరిజ్ఞానంతో హైడ్రోజన్‌తో నడిచే రైలును రైల్వే శాఖ తయారుచేసింది. మిగతా దేశాలు 500 నుంచి 600 హార్స్ పవర్ ఇంజిన్ మాత్రమే రూపొందిస్తే.. మనదేశం ఏకంగా 1,200 హెచ్‌పీ ఇంజిన్ తయారుచేయగలిగింది. ప్రపంచంలో జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనా మాత్రమే ఇలాంటి ఇంజిన్లు తయారుచేశాయి. ప్రపంచంలో అత్యంత పొడవైన (10 కోచ్‌లు) రైలు ఇదే. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం (2,400 కిలోవాట్లు) ఉన్న రైలు కూడా ఇదే. హరియాణాలోని జింద్ – సోనిపట్ మధ్య ఈ రైలు నడవనుంది.ఉత్పత్తి వ్యయం ఎక్కువే..: ఒక కేజీ బ్లూ లేదా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి గరిష్ఠంగా 2.4 డాలర్ల వరకు ఖర్చవుతుంది. అదే కేజీ గ్రీన్ హైడ్రోజన్ తయారీకి దాదాపు 5.5 డాలర్లు వెచ్చించాలి. గ్రే హైడ్రోజన్ ఉత్పత్తితో పోలిస్తే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వల్ల.. ప్రతి కేజీకి 10 కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయి.గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా చేపట్టే ప్రాజెక్టుల ద్వారా రూ.8 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు, 6 లక్షలకుపైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా.తెలంగాణలోనూ..తెలంగాణ కూడా 2029–30 నాటికి 418 కిలోటన్నులు, 2034–35 నాటికి 554 కిలోటన్నుల వార్షిక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ – 2025లో వెల్లడించింది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే కంపెనీలకు ప్రోత్సాహకాలూ ప్రకటించింది. -
పుష్కర సరస్వతికి ప్రణామం
ప్రతి నదికి ఏడాదికి ఒక్కసారి పుష్కరాలు జరుగుతాయి. బృహస్పతిలో ఆయా రాశులు ప్రవేశించడంతో ఆ నదికి పుష్కరాలు జరుగుతాయి. ఈనెల 15న గురువారం బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో ఉదయం 5.44 గంటలకు సరస్వతినదికి పుష్కరాలు ఆరంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం...సరస్వతీ నది పుష్కరాలు (Saraswati River Pushkaralu) ఉత్తరాదిలో నాలుగుచోట్ల, దక్షిణాది లో తెలంగాణలోని కాళేశ్వరంలో మాత్రమే జరుగుతున్నాయి. నది పుట్టినచోటుగా గుర్తించిన ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గంగా, యమున, సరస్వతి (అంతర్వాహిని)నదులుగా భావించే ప్రయాగ్‌రాజ్, గుజరాత్‌లోని సోమనాథ్, రాజస్థాన్‌లోని పుష్కర్ వద్ద సరస్వతీనదికి పుష్కరాలు జరుగుతున్నాయి. పుష్కర స్నానం..పుణ్యఫలం..పుష్కర స్నానం... ఎంతో పుణ్య ఫలం. నది స్నానాలు చేస్తే మానవ జీవన గమనంలో తెలిసో, తెలియకో చేసిన పాపాలు తొలగుతాయని పురాణాల్లో పేర్కొన్నారు..తర్పణలు, పిండప్రదానాలు..సాధారణంగా నదీస్నానాల్లో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధకర్మ పిండప్రదాన కర్మలు చేసి పితృదేవతలను తృప్తిపరిచి వారి ఆశీస్సులు అందుకోవడం శుభప్రదమని విశ్వసిస్తారు. మొదటిరోజు హిరణ్య శ్రాద్ధం తొమ్మిదోరోజు అన్నశ్రాద్ధం. పన్నెండో రోజు ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని పురాణాల్లో పేర్కొన్నారు. పుష్కరకాల స్నానం..నీరు నారాయణ స్వరూపం. అందుకే ఆయన స్పర్శతో పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. తీర్థ, నదీస్నానాలు ఉత్తమం. దానికన్నా పుష్కరస్నానం ఉత్తమోత్తమం. ఆ సమయంలో దేవతలంతా వుష్కరుడితో నదిలో ప్రవేశిస్తారని విశ్వాసం. పుష్కరకాలంలో స్నానమాచరిస్తే 12 సంవత్సరాల కాలం 12 నదుల్లో స్నానాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాల్లో లిఖించబడింది.నదికి వాయినాలు..సుమంగళిగా జీవితాంతం ఉండాలని కోరుకుంటూ ఆడపడచులు పుష్కరాల సందర్భంగా నదీమతల్లికి వాయనాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే విఘ్నాలు తొలగి శుభాలు కలుగుతాయని విశ్వాసం, చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ, పుస్తె, మెట్టెలను పూజించి నదిలోకి జారవిడుస్తారు. ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీస్సులు అందుకుంటారు.12 రోజులు హోమాలు..మే 15 గురువారం శ్రీ దత్తా త్రేయ, శ్రీ కార్తవీర్యార్జున హోమం, 16న శుక్రవారం సంకష్ట హర గణపతి హోమం, 17న శనివారం శ్రీ హయగ్రీవ, శ్రీ స్వయంవర పార్వతి హోమం, 18న ఆదివారం శ్రీ పుత్ర కామేష్టి హోమం జరిగాయి. నేడు మేధా దక్షిణామూర్తి మహా అమృత మృత్యుంజయ హోమం, మంగళవారం కాలభైరవ హోమం, బుధవారం సుదర్శన హోమం, గురువారం శ్రీ సూక్త హోమం, శుక్ర వారం పురుష సూక్త హోమం, శనివారం నవగ్రహ, శ్రీ మత్స్య హోమం, ఆదివారం శ్రీ రుద్రహోమం, 26, సోమవారం చండి హోమాలు నిర్వహించనున్నట్లు ఈఓ పేర్కొన్నారు. 12 రోజులు హారతి..12 రోజులపాటు సరస్వతిఘాట్ వద్ద కాశీకి చెందిన ఏడుగురు పండితులచే తొమ్మిది నవ రత్నమాలిక హారతులను ఇస్తున్నారు. హారతి వీక్షణకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. హారతి ఇవ్వడానికి ఏడు గద్దెలు ఏర్పాటు చేసి ఏడు జీవనదులు గంగా, యమున, గోదావరి, నర్మద, సింధు, సరస్వతి, కావేరి పేర్లు ఏర్పాటు చేశారు. పీఠాధిపతుల పుష్కర స్నానాలు..పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ ఒక పీఠాధిపతి పుష్కర స్నానం చేస్తున్నారు. పుష్కర ప్రారంభం మే 15న మొదటి రోజు శ్రీ గురుమద నానంద సరస్వతి పీఠం, రంగంపేట, మెదక్‌కు చెందిన మాధవానంద సరస్వతి స్వామి పాల్గొని సరస్వతి పుష్కరాలను ప్రారంభించారు. మూడవ రోజు మే 17న తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, మే 18న పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్యా శంకరభారతీ మహాస్వామి, నేడు నాసిక్ త్రయంబకేశ్వర్ మహామండలేశ్వర్ ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్, మే 23న హంపి విరుపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామివార్లు పుష్కర స్నానం ఆచరిస్తారు.17 అడుగుల ఏకశిల సరస్వతిమాత విగ్రహంసరస్వతి ఘాటులో 17 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని తమిళనాడులోని మహాబలిపురంలో శిల్పులు ప్రత్యేకంగా రూపు దిద్దారు. ఆ విగ్రహం చుట్టూరా నాలుగు వేదమూర్తులయిన రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వవేదం విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని సరస్వతినది పుష్కరాల సందర్భంగా 15న సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. – షేక్ వలీ హైదర్, సాక్షి, కాళేశ్వరం (భూపాలపల్లి జిల్లా) -
పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు
-
గుల్జార్‌హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రమాద కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమని రేవంత్ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం ప్రకటించారు.ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించటంతో భారీ ప్రాణనష్టం తప్పిందని.. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 మందిని ప్రాణాపాయ స్థితి నుండి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారని సీఎం రేవంత్ అన్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక బృందం తమ శక్తియుక్తులు ప్రయత్నించిందన్నారు. కాగా, చార్మినార్ గుల్జార్‌హౌస్‌లో ఇవాళ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా 17మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు.మృతి చెందిన వారిలో రాజేంద్రకుమార్ (67),అభిషేక్ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్ (17), శీతల్ జైన్ (37), ఇరాజ్ (2), హర్షాలీ గుప్తా (7), రజని అగర్వాల్, అన్య మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్, ప్రథమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్ ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్ చిన్నదే అయినా భవనంలో 30 మంది ఉండటంలో భారీ ప్రాణనష్టం జరిగింది. -
తెలంగాణ సచివాలయంలో ప్రపంచ సుందరీమణుల సందడి
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల నిమిత్తం హైదరాబాద్‌కు విచ్చేసిన ప్రపంచ దేశాల అందాల భామలు.. ఇవాళ తెలంగాణ సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయం బ్యాక్ డ్రాప్లో గ్రూప్ ఫోటో దిగిన సుందరీమణులు.. తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరించారు. అత్యంత విశాలంగా.. అద్భుతమైన సెక్రటేరియట్‌ను చూసి ఆశ్చర్య వ్యక్తం చేసిన కంటెస్టెంట్లు.. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. తెలంగాణ తల్లి ముందు ర్యాంప్ వాక్ చేశారు.సెక్రటేరియట్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు ఏర్పాట్లు చేసిన హైటీలో సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అభివృద్ధి, సెక్రటేరియట్ నిర్మాణం, పథకాలను ఉద్దేశించి సీఎస్ ప్రసంగించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ పోటీలు అంటే కేవలం క్రీడ కాదన్నారు. మిస్ వరల్డ్ పోటీల వల్ల తెలంగాణ టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గత నాలుగు రోజులుగా ప్రపంచ అందగత్తెలు తిలకించారు. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణకు తెచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని జూపల్లి కృష్ణారావు అన్నారు.కాగా, కంటెస్టెంట్లు ప్రయాణించే రహదారులన్నీ రంగురంగుల విద్యుద్దీపాలతో అలకరించారు. స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా అందాల భామలు సందర్శించారు. ఎన్టీఆర్ మార్గ్‌లో, బడా గణేష్ నిమజ్జనం జరిగే చోట తెలంగాణ చరిత్రకు అద్దంపట్టే సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా ఎన్టీఆర్ మార్గ్‌లో రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు కృష్ణజింకతో ఏర్పాటు చేసిన ఆర్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
సంగారెడ్డిలో ఉగ్రమూలాల కలకలం.. పాక్‌కు సమాచారం చేరవేత?
సంగారెడ్డి: జిల్లాలో ఉగ్రమూలాల కలకలం రేగింది. కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఇస్లాం(19) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే క్రమంలో షాకింగ్ విషయాలు బయడపడినట్లు తెలుస్తోంది. అస్సాం పోలీసుల ఆపరేషన్ ఘోస్ట్ సిమ్ లో భాగంగా ఇస్లాం బాగోతం వెలుగులోకి వచ్చింది.అస్సాంలో గుర్తింపు కార్డులు లేకుండా సిమ్ కార్డులు తీసుకుని సంగారెడ్డి జిల్లాలో పలువురికి విక్రయిస్తున్నట్లు తెలిసింది. గతంలో అస్సాంలో మొబైల్ షాపులో పని చేసిన ఇస్లాం.. అక్కడే కొందరి గుర్తింపు కార్డులతో నకిలీ సిమ్ లు తీసుకుని అధిక ధరకు విక్రయించాడు.ప్రస్తుతం గొల్లపల్లిలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. అదే సమయంలో తన వద్ద ఉన్న నకిలీ సిమ్ కార్డులను పాకిస్తానీయులకు అమ్మినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భారత్ ఫోన్ నెంబర్లతో పాకిస్తాన్ లో వాట్పాప్ అకౌంట్ లు క్రియేట్ కావడంతో ఈ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు.ఇటీవల జరిగిన భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధంలో భాగంగా మీడియాలో వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నట్లు సమాచారం.దేశ వ్యాప్తంగా ఏడుగురు అరెస్ట్.. అంతా అస్సాం వారేఆపరేషన్ ఘోస్ట్ సిమ్ లో భాగంగా దేశ వ్యాప్తంగా ఏడుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, అంతా అస్సాం రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఏడుగురు అనుమానితులువివిధ రాష్ట్రాల్లో ఉంటూ దేశ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ లోని తమ మిత్రులకు సమాచారం చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సంగారెడ్డిలో మకాం వేసిన అస్సాం పోలీసులు తమ దర్యాప్తును అత్యంత గోప్యంగా సాగిస్తున్నట్లు సమాచారం.#OperationGhostSIMAssam police has arrested 7 people for helping people from Pakistan to use WhatsApp from Indian numbers by sharing OTPs.7 arrested, 948 SIMs seized.These SIMs were being used for cyber crimes and anti-national operations. pic.twitter.com/crLN5LMmpO— Incognito (@Incognito_qfs) May 18, 2025 Assam Police busts major fake SIM racket in ‘Operation GHOST SIM’; 7 arrested, 948 SIMs seized; WhatsApp OTPs linked to Pakistan. The public is urged to stay alert.Read Full Story: https://t.co/zhwxJLa7Cm#AssamPolice #OperationGhostSim #Crime #SimCardRacket pic.twitter.com/BU94CVK9o1— Pratidin Time (@pratidintime) May 17, 2025 -
మందు బాబులకు బిగ్‌షాక్.. తెలంగాణలో మద్యం ధరలు పెంపు
హైదరాబాద్: తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. మద్యం ధరలను ప్రభుత్వం భారీగా పెంచేసింది. మద్యం ధరలను పెంచుతున్నట్లు దుకాణాలకు ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. క్వార్టర్ మద్యం బాటిల్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్‌బాటిల్‌పై రూ.40 పెంచింది.కాగా, ఇటీవలే బీర్ల ధరలు పెంచేసిన తెలంగాణ సర్కార్.. ఇప్పుడు ఇతర లిక్కర్ ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే. కొన్ని బ్రాండ్ల మీదనే ప్రభుత్వం ధరలు పెంచింది. పెరిగిన ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి రానున్నాయి. 2020లో అప్పటి ప్రభుత్వం.. తెలంగాణ స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ను ప్రవేశపెట్టింది. మళ్లీ స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ను ప్రవేశపెట్టిన క్సైజ్ శాఖ.. మద్యం బాటిళ్లపై సెస్‌ను పెంచింది. స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ను ఎక్సైజ్ శాఖ మళ్లీ పునరుద్దరించింది. -
పాతబస్తీ అగ్నిప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: పాతబస్తీ అగ్నిప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన అత్యంత బాధాకారం. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.Shocked to hear about the fire incident at Gulzar House, Hyderabad. My heart felt condolences to the bereaved families who have lost their loved ones. Praying for healing and speedy recovery of those injured in this unfortunate incident.#GulzarHouse#Hyderabad— YS Jagan Mohan Reddy (@ysjagan) May 18, 2025చార్మినార్ గుల్జార్‌హౌస్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 6.15గంటలకు షార్ట్ సర్క్యూట్ జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎనిమిది మంది చిన్నారులతో సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు వేసవి సెలవుల కోసం ఇక్కడికి వచ్చినట్లు సమాచారంమరోవైపు, ప్రమాదంపై అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాల్ని వివరించారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్ ఎంట్రన్స్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. ఇటీవల ఇంటిని చెక్క ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. షార్ట్‌సర్క్యూట్ వల్ల చెలరేగిన మంటలకు చెక్క మొత్తం కాలి మంటలు వ్యాపించాయి. భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగిందని నాగిరెడ్డి తెలిపారు. -
పాతబస్తీ ప్రమాదంపై మోదీ ఆరా.. బాధితులకు రెండు లక్షల పరిహారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చార్మినార్‌కు సమీపంలోని గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతిచెందిన వారికి మోదీ సంతాపం తెలిపారు. ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపాన్ని ప్రకటించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల పరిహారం మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి యాభై వేల రూపాయల సాయాన్ని అందించనున్నట్టు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. మృతుల కుటుంబాలు ఈ ఘటన నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించిందని పీఎంవో ట్విట్టర్ వేదికగా పేర్కొంది.Deeply anguished by the loss of lives due to a fire tragedy in Hyderabad, Telangana. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be…— PMO India (@PMOIndia) May 18, 2025సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ఇదిలా ఉండగా.. పాతబస్తీలో అగ్ని ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు 17 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. కొందరు ఘటనాస్థలంలో.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు.మృతుల వివరాలు..రాజేంద్రకుమార్ (67)అభిషేక్ మోదీ (30)సుమిత్ర (65)మున్నీబాయి (72)ఆరుషి జైన్ (17)శీతల్ జైన్ (37)ఇరాజ్ (2)హర్షాలీ గుప్తా (7)రజని అగర్వాల్‌అన్య మోదీపంకజ్ మోదీవర్ష మోదీఇద్దిక్కి మోదీరిషభ్‌ప్రథమ్ అగర్వాల్‌ప్రాంశు అగర్వాల్. -
తెలంగాణ పోలీసుల ఆపరేషన్.. భారీ పేలుళ్ల కుట్ర భగ్నం
సాక్షి, హైదరాబాద్/విజయనగరం: తెలంగాణ పోలీసుల సంచలన ఆపరేషన్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్ కారణంగా నగరంలో పేలుళ్లకు సంబంధించిన ప్లాన్ భగ్నమైంది. ఈ క్రమంలో ఇందుకు ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. హైదరాబాదులో పేలుళ్లకు ప్లాన్ చేసిన వ్యక్తులను తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్(29), హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్(28) ఇద్దరూ కలిసి.. విజయనగరంలో పేలుడు పదార్థాలను కొనుగోలు చేశారు. వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌లో పేలుళ్లకు పక్కా ప్లాన్ చేసుకున్నారు. సౌదీ అరేబియా నుంచి ఐసీసీ మాడ్యుల్ ద్వారా వీరికి ఆదేశాలు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, పోలీసులు.. ఒక ఇంటిలో తనిఖీలు నిర్వహించగా పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేశారు. ఇరువురిని కోర్టులో హాజరుపర్చనున్నట్లుగా తెలిపారు. -
టీచర్ పెళ్లిలో ట్విస్ట్.. నేను ప్రేమిస్తున్నా అంటూ ఉపాధ్యాయుడు..
సాక్షి, పాల్వంచ: వారిద్దరూ టీచర్లుగా పనిచేస్తున్నారు.. ఆమె భర్తకు దూరమైంది. అతడికి భార్య లేదు. దీంతో, రెండు కుటుంబాల పెద్దలు వారిద్దిరికీ పెళ్లి కుదిర్చారు. జీవితంలో రెండో అధ్యాయాన్ని ప్రారంభించాలనుకున్న ఈ జంటకు ఊహించని పరిణామం ఎదురైంది. పెళ్లి వేడుకకు వచ్చిన మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ‘ఆపండి... నేను ఆమెను ఇష్టపడ్డాను.. నేనే పెళ్లి చేసుకుంటాను’ అంటూ గందరగోళం సృష్టించడంతో పెళ్లి ఆగిపోయింది. ఈ వింత ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. పాల్వంచకు చెందిన 29 ఏళ్ల మహిళ స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఆమెకు వివాహం జరిగింది. ఆమెకు ఓ పాప కూడా ఉంది. అయితే, కొన్నాళ్లకు భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం స్థానిక ప్రైవేటు స్కూల్లో పనిచేస్తోంది. మరోవైపు, ఖమ్మంలో పనిచేస్తున్న 33 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయుడితో ఆమెకు రెండో వివాహం నిశ్చయించారు. పెళ్లయిన కొన్నాళ్లకే అతని భార్య చనిపోయింది. ఆయనకు కూడా ఇది రెండో వివాహం. ఇరు కుటుంబాల పెద్దలు వీరిద్దరికీ వివాహం జరిపించాలని నిశ్చయించారు. శనివారం సాయంత్రం పాల్వంచలోని ఓ ప్రార్థనా మందిరంలో పెళ్లి వేడుకకు అన్ని ఏర్పాట్లు చేశారు.కాసేపట్లో పెళ్లి అయిపోతుందన్న సమయంలో మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కసారిగా.. నాకు వధువు అంటే ఇష్టం. ప్రైవేటు స్కూల్లో పనిచేసేటప్పుడు వధువుతో పరిచయం ఏర్పడింది. నాకు పెళ్లయినా పిల్లలు పుట్టలేదు. నా భార్యకు విడాకులిచ్చి ఈమెను పెళ్లాడతా అంటూ రచ్చ చేశాడు. ఈ సందర్భంగా వధువు మాట్లాడుతూ.. అతడు గతంలో బతిమిలాడగా తల్లిదండ్రులు చూసిన సంబంధమే చేసుకుంటానని చెప్పాను. దాన్ని మనసులో పెట్టుకుని ఇలా చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. అలాగే, ఆమెతో వివాహేతర సంబంధమున్నట్లు వరుడికి సైతం ఒకసారి ఫోన్ చేయడం గమనార్హం. ఈ క్రమంలో అతడిని పట్టుకునేలోపే అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు. ఈ రచ్చ కారణంగా వరుడితోపాటు అతడి బంధువులు వెళ్లిపోవడంతో వివాహం ఆగిపోయింది. అనంతరం, యువతి, ఆమె కుటుంబ పోలీసులను ఆశ్రయించారు. అతడితో ఫిర్యాదు చేశారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 18-25)
-
హలో వరల్డ్.. మిస్ కావొద్దు!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీల ద్వారా తెలంగాణకు, హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం లభిస్తోంది. పోటీలకు వచ్చిన ప్రతినిధులు వివిధ మీడియా సంస్థలకు, మిస్ వరల్డ్ సంస్థ ఏర్పాటు చేసిన సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో హైదరాబాద్, తెలంగాణ గురించి గొప్పగా వర్ణిస్తున్నారు. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిన ఆధునిక నగరమని, తెలంగాణ తనదైన సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆకట్టుకుంటోందని ప్రశంసిస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారమవుతున్నాయి. ఒక్కో ప్రపంచ సుందరి పోటీదారుకు సోషల్‌మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. వీరి వీడియోలు నిత్యం వైరల్ అవుతున్నాయి. అలా హైదరాబాద్, తెలంగాణకు మంచి ప్రచారం లభిస్తోంది.3,300 విదేశీ ఛానల్స్‌కు సమాచారం..మిస్ వరల్డ్ పోటీలను కవర్ చేసేందుకు 150 దేశాలకు చెందిన మీడియా సంస్థల ప్రతినిధులు హైదరాబాద్‌కు వస్తున్నారని, దాదాపు మూడున్నర వేల మంది విదేశీ జర్నలిస్టులు పోటీలయ్యేవరకు హైదరాబాద్‌లో ఉండి ఆయా దేశాలకు ఇక్కడి పరిస్థితులపై సానుకూల సంకేతాలను పంపుతారని ప్రభుత్వం పలు సందర్భాల్లో తెలిపింది. కానీ, ఈ పోటీల కవరేజీకి వచ్చిన విదేశీ మీడియా ప్రతినిధులు 20 మంది వరకు మాత్రమే. దీంతో ప్రభుత్వ అంచనా తప్పిందన్న భావన వ్యక్తమైంది.అయితే, మిస్ వరల్డ్ లిమిటెడ్ ఈ పోటీల ప్రచారం కోసం బ్రిటన్‌కు చెందిన ఓ మీడియా సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌లో మకాం వేసి, పోటీలకు సంబంధించి సమగ్ర వివరాలను 3,300 విదేశీ టీవీ ఛానల్స్‌కు అందిస్తున్నారు. పోటీలో ఉన్న 113 దేశాలకే కాకుండా, పోటీల్లో లేని దేశాలకు చెందిన టీవీ ఛానల్స్ కూడా ఆ జాబితాలో ఉన్నాయని మిస్ వరల్డ్ ప్రతినిధులు తెలిపారు. దీంతో తెలంగాణకు ప్రపంచం నలుమూలలా ప్రచారం లభిస్తోంది.భిన్న సంస్కృతుల కేంద్రం ఆశ్చర్యపరిచే భిన్న సంస్కృతులకు కేంద్రం తెలంగాణ. విద్య, వైద్య పరంగా ఇక్కడ గొప్ప వసతున్నాయి. మా దేశం నుంచి ఎంతోమంది ఇక్కడ చదువుకునేందుకు వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడి వసతులను ప్రత్యక్షంగా చూస్తున్నాను –అయోమ్ టీటో మటీస్, సౌత్ సూడాన్.సొంత ప్రాంతంలో ఉన్నట్లుంది ఆఫ్రికా ఖండంలో సంస్కృతికి గొప్పగా ఉంటుంది. తెలంగాణను చూసిన తర్వాత మాలాగే ఇక్కడి ప్రజలు సంస్కృతిని కాపాడుకుంటూ కొనసాగిస్తున్న తీరు అబ్బురపరిచింది. నాకు సొంత ప్రాంతంలో ఉన్న అనుభూతి కలుగుతోంది. –జైనబ్, సొమాలియాఇక్కడి అభివృద్ధి ఆశ్చర్యకరం మా దేశంలో చాలా మందిలో ఇండియా అభివృద్ధి చెందని దేశం అన్న భావన ఉంది. కానీ, హైదరాబాద్‌ను చూసిన తర్వాత ఇక్కడి ఆధునిక పోకడలు, తక్కువ సమయంలో అభివృద్ధి చెందిన తీరు తెలుసుకుని ఆశ్చర్యపోయాను. – అతెన్నా క్రోస్బీ, అమెరికాఇదెంతో సురక్షిత ప్రాంతం ఇక్కడికి రావటం సురక్షితం కాదని, విదేశీ యువతులను రేప్ చేసి చంపేస్తారని నేను ఇక్కడికి వచ్చేముందు కొందరు సలహా ఇచ్చారు. కానీ, ఇక్కడికి వచ్చాక తెలిసింది.. ఈ ప్రాంతం చాలా సురక్షితమని. ఇప్పుడు హైదరాబాద్ విషయంలో నా ధృక్కోణం పూర్తిగా మారింది. –నటాషా న్యోన్యోజీ, ఉగాండా. ఇక్కడ బౌద్ధానికిస్తున్న ప్రాధాన్యం ఆశ్చర్యపరిచింది భారతీయ సంప్రదాయాలంటే జపనీయులకు ఎంతో ఇష్టం. వాటిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూసి పులకిస్తున్నాను. ఈ ప్రాంతంలో బౌద్ధానికి ప్రాధాన్యం ఇస్తున్న తీరు చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. నాకు ఇండియా సినిమాలంటే చాలా ఇష్టం. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు మా దేశంలో యువత రీల్స్ రూపొందించారు. ఆ పాటలో నటించిన తెలుగు నటుల సొంత ప్రాంతంలో ఇప్పుడు నేనున్నానన్న అనుభూతి గొప్పగా ఉంది. –కియానా తుమీత, జపాన్. -
పాతబస్తీ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి.. కిషన్‌రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించిన ఫైర్ డీజీ
Meer Chowk Fire Accident Live Updates:సాక్షి,హైదరాబాద్: పాతబస్తీ మీర్చౌక్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్ సమీపంలోని ఓ భవనం మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ ఫైర్ డీజీ నాగిరెడ్డి ఖండించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని అన్నారు. మరోవైపు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 👉అగ్ని ప్రమాదంపై విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశంమృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎంఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించటంతో భారీ ప్రాణనష్టం తప్పింది.అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 మందిని ప్రాణాపాచస్థితి నుండి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారన్న సీఎం 👉మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారంపాతబస్తీ అగ్ని ప్రమాద ఘటన బాధాకరం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందిబాధిత కుటుంబసభ్యులతో సీఎం మాట్లాడారు.అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించాం👉సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్న ఖర్గేఘటన వివరాలను ఖర్గేకు వివరించిన సీఎంఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు ఖర్గేకు తెలిపిన సీఎంమంత్రులు ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ఖర్గేకు వివరించిన సీఎం 👉మృతులకు ప్రధాని మోదీ సంతాపంపాత బస్తీ అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిమృతులకు ప్రధాని మోదీ సంతాపంపీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి అగ్ని ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియామృతులకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్ గ్రేషియాDeeply anguished by the loss of lives due to a fire tragedy in Hyderabad, Telangana. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be…— PMO India (@PMOIndia) May 18, 2025 👉కిషన్‌రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నా.. ప్రమాదంపై ఫైర్ డీజీ నాగిరెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలను కండిస్తున్నసరైన సమయం లో ఫైర్ సిబ్బంది రాలేదు అనడం అవాస్తవం నేను దగ్గర ఉంది ఘటనను పరిశిలించాను మా దగ్గర అత్యాధునిక పరికరాలు లేవు అనేది అవాస్తవం అయన మాటలను అయన విజ్ఞతకే వదిలేస్తున్న👉ప్రమాదంపై ఫైర్ డీజీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారుఉదయం 6.16నిమిషాలకు ఫైర్ కాల్ వచ్చిందిసమాచారం వచ్చిన వెంటనే మొఘల్‌పూరా ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారుఆ తర్వాత 11 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయిప్రమాదానికి కారణం భవనంలోకి వెళ్లే దారికి షార్ట్ సర్క్యూట్ జరిగిందిభవనంలో ఉన్న కృష్ణ పర్ల్స్,మోదీ పర్ల్స్ షాపులు అగ్నికి ఆహుతయ్యాయిఅగ్నిప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండటానికి కారణం ఆ భవనాన్ని ఇటీవల ఉడెన్ ప్యానల్‌తో డిజైన్ చేశారుషార్ట్ సర్క్యూట్‌తో ఉడెన్ ప్యానల్ మొత్తం కాలి మంటలు వ్యాప్తి చెందాయిప్రమాదంతో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 17 మందిని రెస్క్యూ చేసి వివిధ ఆస్పత్రులకు తరలించాంఒక నలుగురు ల్యాడర్ మీద నుంచి కిందకు వచ్చారు17మందిలో అందరూ చనిపోయినట్లు తెలుస్తోందిప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఎంట్రన్స్‌లో షార్ట్ సర్క్యూట్‌స్థానికంగా పని చేసేవారిని అడిగాను రెగ్యులర్‌గా షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని చెప్పారుఇంటి లోపల ఫైర్ నిబంధనలు లేవుఈ బిల్డింగ్ జీప్లస్ 2,బయటకు జీప్లస్ వన్‌లాగా కనిపిస్తోందిఫస్ట్ ఫోర్ల్,సెకండ్ కంప్లీట్‌గా రెసిడెన్షియల్ ఏరియాగ్రౌండ్‌ఫ్లోర్‌లో అన్నీ షాప్స్ ఉన్నాయిఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ఈ ప్రమాదం ఎసీ కంప్రెసర్ పేలడం వల్ల జరిగింది కాదు షార్ట్స్ సర్క్యూటే కారణం ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్లో ఒక మీటరు వెడల్పుతో మెట్లను నిర్మించారుదీంతో ప్రమాదం నుంచి బాధితులు బయటపడేందుకు మరో మార్గం లేదుప్రమాదం జరిగిన బిల్డింగ్ చాలా పాత బిల్డింగ్‌నాటి నిబంధనల ప్రకారం నిర్మించారుఫైర్ సేఫ్టీ నిబంధనలు లేకపోవడం భారీ అగ్నిప్రమాదం జరిగిందిఅగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి ఆలస్యం రావడం, ఎక్విప్మెంట్ లేకపోవడంలో సరైన సహాచర్యలు చేపట్టలేదన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాంఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాంప్రమాదం జరిగిన వెంటనే 11 ఫైరింజన్లు, 70 మంది ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారుబయట నుంచి చూస్తే 2మీటర్ల ఎంట్రన్స్ పూర్తిగా పొగకమ్ముకుందిఫస్ట్‌ఫ్లోర్‌కి వెళ్లే దారి వెడల్పు ఒక మీటరు మాత్రమే ఉంది6.16కి ప్రమాదంపై సమాచారం అందిందిప్రమాదం జరిగే సమయంలో చనిపోయిన 17 మంది కాకుండా మరో నలుగురు ఉన్నారని చెబుతున్నారువారిలో నలుగురు రెండవ ఫ్లోర్లో ఉన్నారు. అక్కడి నుంచి తప్పించుకున్నారుమంటల్ని ఎప్పుడో ఆర్పేశాంప్రమాదం జరిగిన సమయంలో అందరూ నిద్రలో ఉన్నారుఈ ప్రమాద బాధితుల్లో కొందరు వేసవి సెలవులు నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు👉తెలంగాణ ఫైట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీంఅగ్నిమాపక కేంద్రాల నుండి 12 ఫైర్ పరికరాలతో రెస్క్యూ నిర్వహించాం.మొత్తం 11 వాహనాలు, 01 అగ్నిమాపక రోబో, 17 అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది మంటలను ఆర్పడంలో,చిక్కుకున్న వారిని రక్షించడంలో పాల్గొన్నారు.మంటలను ఆర్పడానికి మొత్తం 02 గంటలు పట్టింది చిక్కుకున్న వ్యక్తులను రక్షించడానికి, మంటలను ఆర్పడానికి, వ్యాపించకుండా నిరోధించడానికి అధికారులు, సిబ్బంది తీవ్రంగా కృషి చేశాంఅడ్వాన్స్‌డ్ ఫైర్ రోబోట్, బ్రోటో స్కైలిఫ్ట్ హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్‌ను ఆపరేషన్లలో ఉపయోగించాము.అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది,దర్యాప్తు చేస్తున్నాం..దెబ్బతిన్న ఆస్తి విలువ ఇంకా అంచనకు రాలేదు 👉కేటీఆర్ దిగ్భ్రాంతిఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్..అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టం..చాలా బాధను గురిచేసింది..బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన కేటీఆర్..గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.మంటలు త్వరగా అదుపులోకి రావాలని ఆశిస్తున్నాను..సహాయక చర్యలకు BRS బృందం అందుబాటులో ఉంటుంది.Extremely shocked and pained!! Details emerging out of Gulzar House fire tragedy in Old City are very sadMy heartfelt condolences to the families of the victims of the tragedy. Wishing a speedy recovery to those injuredHoping and praying that this fire will be contained very…— KTR (@KTRBRS) May 18, 2025👉సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిఅగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. సహాయక చర్యలకు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. ప్రమాద ఘటన గురించి ఆరా తీసిన ముఖ్యమంత్రి ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి పొన్నం వివరాలు అడిగి తెలుసుకుంటున్న పొన్నం ప్రభాకర్‌ఆదివారం ఉదయం 6గంటలకు ప్రమాదం జరిగింది6.15కి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుందిప్రమాదంలో ఎలాంటి కుట్ర కోణం లేదు👉కిషన్‌రెడ్డి పరామర్శఅగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరం.ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించి ఉంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండేదిసమయానికి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి రీచ్ కాలేదుబాధాకరమైన విషయం ఇదికేంద్రం తరఫున బాధిత కుటుంబానికి అండగా ఉంటాంఫైర్ శాఖ వద్ద సరైన ఫైర్ పరికరాలు లేకపోవడంతో తీవ్రత పెరిగిందిఫైర్ టెక్నాలజీని పెరుగుపరుచుకోవాలి.ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఒకే కుటుంబానికి చెందినవారు ఎంతో కాలం ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. గుల్జార్‌హౌస్‌లో ఘోర అగ్ని ప్రమాదం..17మంది మృతిచార్మినార్ గుల్జార్‌హౌస్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 6.గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా 17మంది మృతి చెందారు. షార్ట్స్ సర్క్యూట్ జరిగిన ప్రమాదంలో మొత్తం 17మందిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. మంటల్లో చిక్కుకున్న మరికొంత మందిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నారు. బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు 14 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదంతో పాతబస్తీలో ట్రాఫిక్ విభాగం ఆంక్షలు విధించింది. ట్రాఫిక్‌ను డైవర్ట్ చేస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే, మేయర్ విజయలక్ష్మి, అగ్నిపమాక డీజీ నాగిరెడ్డి, సౌత్‌జోన్ డీసీపీ స్నేహా మిశ్రా,హైడ్రా కమిషనర్ రంగనాథ్‌లు పరిశీలించారు. మృతుల వివరాలురాజేంద్రకుమార్ (67),అభిషేక్ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్ (17), శీతల్ జైన్ (37), ఇరాజ్ (2), హర్షాలీ గుప్తా (7), రజని అగర్వాల్, అన్య మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్, ప్రథమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్ ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్ చిన్నదే అయినా భవనంలో 30 మంది ఉండడంలో ప్రాణనష్టం భారీ ఎత్తున జరిగింది. -
పాక్, తుర్కియేపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్.. ఇస్లాం పేరుతో చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తుర్కియే దేశానికి విజ్ఞప్తి చేశారు. పాక్ వ్యవహరిస్తున్న తీరుకు ఇస్లాంకు ఎటువంటి సంబంధం లేదన్నారు. శనివారం హైదరాబాద్ దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాక్ కంటే భారత్‌లోనే ముస్లింల సంఖ్య ఎక్కువ అని, భారత్‌లోనూ గౌరవప్రదంగా జీవిస్తున్న విషయం మరిచిపోవొద్దని వ్యాఖ్యానించారు.తుర్కియే, భారత్‌ల మధ్య చారిత్రక సంబంధాలున్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో తుర్కియే అభివృద్ధికి భారత్ తోడ్పాటును అందించిందని పేర్కొన్నారు. పాక్ వైపు మొగ్గుచూపుతున్న తుర్కియే తమ విధానాన్ని పునరాలోచించుకోవాలని హితవు పలికారు. తనను పాక్ జాతీయులు విమర్శిస్తుండటంపైనా ఒవైసీ దీటుగా బదులిచ్చారు. ‘నా లాగా నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వారిని పాకిస్తానీలు ఇప్పటివరకూ ఎప్పుడూ చూడలేదు. నాలాంటి వారు ఇండియాలో మాత్రమే ఉంటారు. వాళ్లు నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి. అప్పుడే వారికి అవగాహన పెరిగి అజ్ఞానం తొలగిపోతుంది’ అని అన్నారు.మానవాళికి ముప్పు పాక్..పాకిస్తాన్ నిరంతరం ఉగ్రవాదానికి చేయూతనిస్తూ మానవాళికే ముప్పుగా పరిణమించిందని అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి భారత్ బాధిత దేశంగా మారిందన్నారు. పాక్ తనని తాను ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకోవడాన్ని ఒవైసీ కొట్టి పారేశారు. దీర్ఘకాలిక ఎజెండా ప్రకారం, పాకిస్తానీ మిలిటరీ భారత్‌లో అస్థిరతను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. భారత్, పాక్ కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్నీ ఆయన విమర్శించారు. మతపరమైన విభజనలు సృష్టించడం, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం పాకిస్తాన్ అప్రకటిత సిద్ధాంతమని ఒవైసీ ఆరోపించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ వేదికల దృష్టికి భారత్ తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. విదేశాలకు పంపించే అఖిల పక్ష ప్రతినిధుల బృందంలో తాను ఉండే విషయం కానీ, చైర్పర్సన్ ఎవరనేది కానీ తనకు తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఒవైసీ చెప్పారు. -
సీఎం గారూ.. యుద్ధంలో ఉన్నా.. రాలేకపోతన్న..
దుబ్బాక: ‘దేశ సరిహద్దుల్లో శత్రువులతో నేను పోరాడుతుంటే.. సొంతూరులో భూమిని కబ్జా చేసిన అక్రమార్కులతో నా తల్లిదండ్రులు పోరాడాల్సి వస్తోంది’ అని సిద్దిపేట జిల్లాకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ బూర రామస్వామి వాపోయాడు. తన భూమిని కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జమ్మూకశ్మీర్ నుంచి శనివారం ఓ సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా భూంపల్లి–అక్బర్పేట మండలం చౌదర్‌పల్లికి చెందిన రామస్వామి తన భూమి కబ్జా అయిన తీరును ఆ వీడియోలో వివరించాడు. ‘1992లో ధర్మాజీపేట శివారులోని 406 సర్వే నంబర్లో నా తల్లిదండ్రులు 1.16 ఎకరాల భూమిని సాదాబైనామా కింద కొనుగోలు చేశారు. ఆ భూమిని నా గ్రామానికే చెందిన వీఆర్వో రమేష్.. తన సోదరుల పేరిట రికార్డుల్లోకి ఎక్కించుకున్నాడు. భూమి గురించి అడిగితే వీఆర్వో బంధువులు నా తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి మా భూమిని మాకు దక్కేలా చేయాలి’అని వేడుకున్నాడు. ఈ వీడియోపై స్పందించిన బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు.. వెంటనే జిల్లా కలెక్టర్ మనుచౌదరికి ఫోన్ చేసి జవాన్ భూ సమస్యను పరిష్కరించాలని కోరారు. తన ఎక్స్ ఖాతాలో కూడా ఆ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో రెవెన్యూ యంత్రాంగంలో వెంటనే స్పందించింది. శనివారం సాయంత్రం భూంపల్లి తహసీల్దార్ మల్లిఖార్జున్, ఆర్ఐ తదితరులు పంచనామా నిర్వహించి కలెక్టర్‌కు నివేదించారు.భారత జవాన్ భూమిని కబ్జా చేసిన వీఆర్వో సోదరుడు నేను దేశ సరిహద్దుల్లో పోరాడుతుంటే, సొంత ఊరిలో నా భూమి కబ్జా చేశారని వాపోతున్న జవాన్ సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం చౌదర్‌పల్లె గ్రామానికి చెందిన రామస్వామి అనే భారత సైనికుడి భూమిని కబ్జా చేసిన వీఆర్వో సోదరుడు, ఎన్ని… pic.twitter.com/CLXGNhl4La— Telugu Scribe (@TeluguScribe) May 17, 2025Video Credit: Telugu Scribe -
రేపటి నుంచే భూముల రీసర్వే.. రెవెన్యూ వర్గాల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని పైలట్ పద్ధతిలో భూముల రీసర్వేకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడ్రనైజేషన్ ప్రోగ్రామ్ (డీఐఎల్ఆర్ఎంపీ) మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రోన్లు లేదా ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ పద్ధతి ద్వారా ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లో ఈ సర్వే సోమవారం నుంచి నిర్వహించనుంది.ఇందుకోసం ఆయా గ్రామాల్లో 4–5 రోజులుగా భూముల సరిహద్దుల నిర్ధారణ జరుగుతుండగా రేపట్నుంచి సర్వే బృందాలు అక్కడకు వెళ్లనున్నాయి. ముందుగా మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్, జగిత్యాల జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి (కొత్త), ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ గ్రామాల్లోనే సర్వే నిర్వహించాలనుకున్నా ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం సాహెబ్‌నగర్, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు గ్రామాలను కూడా కలిపారు. ఈ ఐదు గ్రామాల్లో పైలట్ సర్వే నిర్వహించేందుకు మూడు ఏజెన్సీలను ఎంపిక చేశారు. భూముల రీసర్వేను సర్వే, సెటిల్మెంట్ శాఖ పర్యవేక్షించనుంది.గ్రామ పటాలు, కమతాల పటాల తయారీ.. భూముల రీసర్వేకు ప్రస్తుతం ఎంపిక చేసిన ఐదు గ్రామాల పటాలతోపాటు ప్రతి కమతానికి సరిహద్దులు నిర్ధారించి ఆయా కమతాల పటాలు కూడా రూపొందించనున్నారు. ఇందుకోసం ఆ గ్రామంలో ఎంత భూమి ఉంది.. ఎన్ని సర్వే నంబర్లున్నాయనే వివరాల ఆధారంగా సర్వేయర్లను మోహరించి ప్రతి సర్వే, బైసర్వే నంబర్లలోని కమతాలకు విడివిడిగా పటాలను తయారు చేయనున్నారు. ఇప్పటికే గ్రామాల్లో అందుబాటులో ఉన్న ఛెస్సలా, ఖాస్రా పహాణీ రికార్డులతో వాటిని సరిపోల్చి వివాదాల్లేని కొత్త పటాలను రెవెన్యూ రికార్డుల్లో చేర్చనున్నారు. ఈ గ్రామాల్లో ఎదురయ్యే అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే మార్గదర్శకాలు తయారవుతాయని సర్వే శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ గ్రామానికి నక్ష లేదు! భూముల రీసర్వే కోసం ప్రభుత్వం ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లోని రెండు గ్రామాల స్థితిగతులపై ‘సాక్షి’క్షేత్రస్థాయి సమాచారం సేకరించింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ, మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్ గ్రామాల్లో పరిస్థితుల గురించి స్థానిక రెవెన్యూ యంత్రాంగాన్ని అడిగి తెలుసుకుంది. ములుగుమడ గ్రామం తొలుత బ్రిటిష్ పాలన అమలైన నాటి ఆంధ్ర ప్రాంతంలో ఉండేది. అలాగే నిజాం పాలించిన తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుత కంచికర్ల మండలంలో ఉన్న పరిటాల అనే గ్రామం ఉండేది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సరిహద్దుల మార్పుల్లో భాగంగా పరిటాలను గుంటూరు జిల్లాలో చేర్చి ములుగుమడను ఖమ్మం జిల్లాలో చేర్చారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించాక కూడా ములుగుమడ తెలంగాణకే వచ్చింది.అయితే, భూరికార్డుల ప్రక్షాళన జరిగే వరకు ఆ గ్రామంలో భూముల రికార్డులు సెంట్ల రూపంలోనే ఉండేవి. గుంటలు, ఎకరాలుగా ఉండేవి కావు. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత దాన్ని గుంటల్లోకి మార్చారు. కానీ ఆ గ్రామ నక్షను అప్పటి నుంచి ఇప్పటిదాకా తయారు చేయలేదు. దీంతో ములుగుమడ గ్రామానికి అధికారికంగా గ్రామ సరిహద్దులే లేకుండా పోయాయి. ఇప్పుడు ఈ గ్రామాన్ని పైలట్ సర్వే కింద ప్రభుత్వం ఎంపిక చేసింది. మొదటగా స్థానిక రెవెన్యూ యంత్రాంగం గ్రామ సరిహద్దులను నిర్ధారించింది. ఈ మేరకు గ్రామ నక్షను కూడా తయారు చేయనున్నాయి. ఈ గ్రామంలో మొత్తం 103 సర్వే నంబర్లకు 845 ఎకరాల వరకు భూమి ఉంది.ఈ భూమిలోని ప్రతి కమతాన్ని సర్వే, బైసర్వే నంబర్లవారీగా రీసర్వే నిర్వహించి ఆయా కమతాల హద్దులు నిర్ధారించి పటాలు తయారు చేయనున్నారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్ అనే గ్రామానిక నక్షతోపాటు ఇతర రెవెన్యూ రికార్డులన్నీ ఉన్నాయి. ఈ గ్రామంలోనూ ఇతర గ్రామాలతో సరిహద్దులను గుర్తించారు. ఈ గ్రామంలో 122 సర్వే నంబర్లలో 422 ఎకరాల భూమి ఉంది. సోమవారం నుంచి ఈ భూమిని కమతాల వారీగా సర్వే నిర్వహించి హద్దుల నిర్ధారణ ద్వారా కమతాలవారీగా పటాలు రూపొందించనున్నారు. ఏమవుతుందో... ఏమో? భూముల రీసర్వే విషయంలో రెవెన్యూ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తెలంగాణలో నెలకొన్న భౌగోళిక పరిస్థితులు, రెవెన్యూ రికార్డులను బట్టి సర్వే జరిపితే ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో సమస్యలు వస్తాయని అంటున్నారు. ఈ విషయమై ఓ తహసీల్దార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘ఓ గ్రామంలోని 311 సర్వే నంబర్లో 200 ఎకరాలకు రికార్డు ఉంది. కానీ ఆ సర్వే నంబర్లో 300 ఎకరాల భూమి ఉంది. ఆ మేరకు రైతులకు 300 ఎకరాలకు పాసుపుస్తకాలున్నాయి.కానీ, రెవెన్యూ రికార్డును మార్చలేకపోతున్నాం’అని అన్నారు. మరోవైపు భూకబ్జా ఓ సర్వే నంబర్లో ఉంటే రికార్డు మరో సర్వే నంబర్లో ఉంటుందని.. రాష్ట్రంలోని మొత్తం భూముల్లో 35–40 శాతం భూములకు ఇదే సమస్య వస్తుందన్నారు. రీసర్వేలో ఇదే విషయం తేలితే ఆయా గ్రామాల్లోని రికార్డులు, రైతుల పాసుపుస్తకాలన్నింటినీ మార్చాల్సి వస్తుందని చెప్పారు. రీసర్వే సులభమైనప్పటికీ అనంతరం ఎదురయ్యే సమస్యల పరిష్కారమే పెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు. -
Telangana: రైతును నదిలోకి లాక్కెళ్లిన మొసలి
కృష్ణా: తెలంగాణలోని నారాయణపేట జిల్లా కృష్ణా మండలం కూసుమర్తి గ్రామీ సమీపంలోని భీమా నదిలో శనివారం మధ్యాహ్నం మొసలి ఒక రైతుపై దాడి చేసి నీటి మడుగులోకి లాక్కెళ్లింది.వివరాలివి.. కూసుమూర్తికి చెందిన రైతు జింకల తిప్పన్న(55), శివప్ప గౌడకలిసి తిప్పన్న వరి నారుమడి పోవడానికి .. తన పొలం పక్కన ఉన్న భీమా నదిలో మోటారు బిగించడానికి వెళ్లాడు. ఈ క్రమంలో నీటి మడుగులో మోటార్ వద్ద చెత్త ఉండటంతో.. దానిని తొలగించడానికి నీటిలోకి వెళ్లాడు. అదే సమయంలో అక్కడే ఉన్న మొసలి తప్పణ్ణపై దాడి చేసింది.ఆయన కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు వచ్చి రక్షించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే మొసలి తిప్పణ్ణను పూర్తిగా నీటిలోకి లాక్కెళ్లింది. ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. -
కోటి మంది స్త్రీలను కోటీశ్వరుల్ని చేస్తాం
సాక్షి, హైదరాబాద్/రాయదుర్గం: ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఆర్థిక క్రమశిక్షణ తెలంగాణ ఆడబిడ్డల సొంతమని, రూపాయి కూడా ఎగవేయకుండా వడ్డీతో సహా అప్పులు చెల్లిస్తున్నారని కితాబునిచ్చారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.రాష్ట్రంలో స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)ల్లో సభ్యుల సంఖ్య కోటికి పెరగాల్సిన అవసరముందని, పట్టణ ప్రాంత మహిళలను వాటిలో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ‘వి హబ్’(విమెన్ ఆంట్రప్రెన్యూర్స్ హబ్) చేపట్టిన ‘విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్’, ‘గ్రాస్‌రూట్ యూత్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్’ను శనివారం రేవంత్‌రెడ్డి ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. ‘ఆడబిడ్డలను ప్రోత్సహించడమే మా ప్రభుత్వ విధానం. ఇప్పటికే వేయి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను మహిళలకు అప్పగించాం. సమర్థవంతంగా నిర్వహిస్తే మరో వేయి మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని అప్పగించేందుకు సిద్దంగా ఉన్నాం’అని సీఎం ప్రకటించారు.‘మహిళా శక్తిని కాంగ్రెస్ ఎన్నడూ తక్కువగా అంచనా వేయలేదు. మహిళా శక్తికి చేయూత ఇచ్చేందుకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కలి్పంచాం, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలు అప్పగించాం, విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టడం, పెట్రోలు బంకులు, సోలార్ విద్యుత్ తదితరాల వ్యాపారాలు అప్పగించాం. అదానీ, అంబానీలకు పరిమితమైన వ్యాపారాల్లో మహిళలను ప్రోత్సాహిస్తూ, శిల్పారామంలో ఎస్‌హెచ్‌జీల ఉత్పత్తుల ప్రదర్శనకు స్టాల్స్‌ను కేటాయించాం’అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ వి హబ్ ‘వి హబ్ గత ఏడేళ్లుగా మహిళా పారిశ్రామికవేత్తల సాధికారత కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వి హబ్ కార్యకలాపాలు సాగుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరా మిషన్ మహిళా శక్తి –2025’విధానానికి అనుగుణంగా ‘విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్’ను వి హబ్ తెచి్చంది. దీనిద్వారా మహిళలు ఉద్యోగ కల్పన, సంపద సృష్టి, కొత్త తరం పారిశ్రామికవేత్తలకు ప్రేరణ దిశగా అడుగులు వేస్తున్నారు. వి హబ్ ద్వారా త్వరలో జిల్లాల్లో ‘విమెన్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’, ‘స్కిల్ డెవలప్మెంట్, మినీ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌లు ఏర్పాటవుతాయి.పెద్దపల్లి, పరకాల, నల్లగొండ, వికారాబాద్‌లో త్వరలో ఈ సెంటర్లు ప్రారంభమవుతాయి. వీటిలో మహిళలకు స్థానికంగా నైపుణ్య శిక్షణ, ఉత్పత్తి సదుపాయాలు, మార్కెట్‌తో అనుసంధానం వంటి అనేక వసతులు సమకూరుతాయి’అని రేవంత్ చెప్పారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ శర్మ, వి హబ్ సీఈఓ సీత పల్లచొల్లా, అసోసియేట్ డైరక్టర్ ఊహ సజ్జా తదితరులు పాల్గొన్నారు. 17 అవగాహన ఒప్పందాలు విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ ప్రారంభం సందర్భంగా వి హబ్ 17 కీలకమైన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (హైదరాబాద్), ట్రిపుల్ ఐటీ బాసర, గీతమ్ యూనివర్సిటీ, గోదావరి, పెద్దపల్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, తారా డిగ్రీ కాలేజీ (సంగారెడ్డి), మథర్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీ, అగ్రి హబ్, హెచ్‌పీ ఇండియా సేల్స్, హైసియా, ఐకోనియా, టీఆర్డీ స్డూడియోస్, 1ఎం1ఎంబీ, నిర్మాణ్ ఫౌండేషన్ వంటి సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల జాబితాలో ఉన్నాయి. ‘విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్’కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, వరల్డ్ బ్యాంక్ సహకారంతో నడుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే రెండేళ్లలో తెలంగాణలోని 140 మంది మహిళల నేతృత్వంలోని ఎంఎస్ఎంఈలు వ్యాపార అభివృద్ధిని వేగవంతం చేస్తాయి. ‘గ్రాస్ రూట్ యూత్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్’ద్వారా గ్రామీణ యువతలో సృజనాత్మకత, సార్టప్ దృక్పథాన్ని పెంపొందిస్తారు. 6 వేలమందికి పైగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
కొలువుదీరేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: టీజీపీఎస్సీ గ్రూప్స్ ఉద్యోగాల భర్తీకి మరికొంత కాలం వేచిచూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించినప్పటికీ నియామక పత్రాల జారీకి నిరీక్షణ తప్పేలా లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పరుగులు పెట్టింది. అర్హత పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటన, అర్హుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా సాగింది. అయితే, ఇతర కేటగిరీల్లో కొలువుల భర్తీ పూర్తయినప్పటికీ.. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల భర్తీ మాత్రం నెమ్మదించింది. న్యాయపరమై న అంశాలు పెండింగ్‌లో ఉండడంతో నియామక ప్రక్రియలో వేగం తగ్గింది. మార్చి నెలాఖరులో గ్రూప్–1 తుది ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్–2, గ్రూప్–3 అర్హత పరీక్షల ఫలితాలు సైతం ఇప్పటికే విడుదలైనా నియామక ప్రక్రియ మాత్రం ఆగిపోయింది. తుది తీర్పు తర్వాతే ముందుకు... గ్రూప్–1 ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే తుది జాబితా విడుదలైంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ సైతం దాదాపు పూర్తయింది. ఇంతలో గ్రూప్–1పై దాఖలైన కేసుల విచారణలో భాగంగా తుది తీర్పు వెలువడే వరకు నియామకాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించటంతో టీజీపీఎస్సీ ఈ ప్రక్రియను నిలిపేసింది. గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ, గ్రూప్–1 నియామకాలు పూర్తి చేసిన తర్వాతే గ్రూప్–2, ఆ తర్వాత గ్రూప్–3 ఉద్యోగాల భర్తీ చేపట్టాలని భావిస్తోంది.ఎగువ నుంచి దిగువ కేడర్ ఉద్యోగాల భర్తీతో పూర్తిస్థాయిలో ఉద్యోగాలు భర్తీ అవుతాయనే ఆలోచనతో టీజీపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కోర్టులకు వేసవి సెలవులు నడుస్తున్నాయి. వచ్చే నెలలో సెలవులు ముగిసిన తర్వాత గ్రూప్–1పై విచారణ ప్రక్రియ వేగం అందుకోనుంది. తుది తీర్పు వచి్చన తర్వాత ఉద్యోగాల నియామకాల్లో కదలిక వస్తుంది. అప్పటివరకు వేచి చూడక తప్పదని అధికారవర్గాలు అంటున్నాయి. కోర్టు కేసులతో.. గ్రూప్–1 కేటగిరీలో 503 ఉద్యోగాల భర్తీకి 2022 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ వెలువడింది. రెండుసార్లు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించినప్పటికీ ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో లోపాలతో వాటిని ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టుల సంఖ్యను 563కు పెంచి టీజీపీఎస్సీ ద్వారా 2024 ఫిబ్రవరిలో కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది జూన్‌లో ప్రిలిమినరీ పరీక్షలు, అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. ఈ ఏడాది మార్చిలో టీజీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ ఫలితాలు విడుదలతోపాటు తుది జాబితాను ప్రకటించింది.అయితే, మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఎంపిక ప్రక్రియలో తప్పులు జరిగాయని పలువురు అభ్యర్థులు కోర్టుకు వెళ్లటంతో భర్తీ ప్రక్రియను నిలిపేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో నియామక ప్రక్రియ ఆగింది. ⇒ గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులు భర్తీ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. అలా అయితేనే కిందిస్థాయి పోస్టులు ఖాళీ కాకుండా ఉంటాయని భావిస్తోంది. ⇒ గతేడాది డిసెంబర్లో గ్రూప్–4 కేటగిరీలో 8,180 ఉద్యోగాలను కమిషన్ భర్తీ చేసింది. వాళ్లంతా విధుల్లో చేరారు. ఆ సమయంలో అవరోహణ పద్ధతిని పాటించకపోవడంతో తదుపరి ఎగువస్థాయి పోస్టులు భర్తీ చేసే సమయంలో ఖాళీలు తప్పవని అధికారులు చెబుతున్నారు. ⇒ ఈ నేపథ్యంలో గ్రూప్–1 తుది జాబితాను వేగంగా విడుదల చేసినప్పటికీ నియామకాల ప్రక్రియ చివరి నిమిషంలో కోర్టు ఆదేశాలతో నిలిచింది. తుది తీర్పు వచ్చే వరకు ఈ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం లేదు. ⇒ గ్రూప్–1 నియామకాలు పూర్తయ్యే వరకు గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులు భర్తీ ముందుకు సాగే పరిస్థితి లేదు. -
Hyd: భారత సైన్యానికి సంఘీభావంగా తిరంగా ర్యాలీ
హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో ట్యాంక్ బండ్ రోడ్డులో శనివారం(మే 17వతేదీ) సాయంత్రం సమయంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు యువత, మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు భారత్ మాతా కీ జై అంటూ నినాదాలతో హోరెత్తాయి.దీనిలో భాగంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ‘వీరోచిత పోరాటం చేసిన సైనికులందరికీ జై జైలు కొట్టాలి. ఒకప్పుడు ప్రపంచానికి విశ్వ గురువు, ఆర్థిక శక్తి భారతదేశం. గొప్ప శక్తి ఉన్నప్పటికీ ఏ దేశం పై యుద్ధానికి కాలు తీయలేదు. మన దేశాన్ని కాపాడకోవడానికి ఎదురు దాడికి దిగాం. ప్రధాని నరేంద్ర మోదీ విలక్షణమైనటువంటి వ్యూహంతో వ్యవహరించారు. భిన్నత్వంలో ఏకత్వంగా ఇండియా ఉంది. దేశ ఐకమత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. టెర్రరిజాన్ని అణిచివేయాల్సిన అవసరం ఉంది. కశ్మీర్ సమస్య కాదు...కశ్మీర్ ఇండియాలో పార్ట్. పీవోకేపై మాత్రమే ఇప్పుడు చర్చ. మధ్యవర్తిత్వం వర్తించడానికి అమెరికా జోక్యం అవసరం లేదు. మన సమస్యను మనం పరిష్కరించుకోగలం’ అని ఆయన స్పష్టం చేశారు. -
మంత్రి శ్రీధర్‌బాబుపై నమోదైన కేసు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం భూ సేకరణ అంశంలో మంత్రి శ్రీధర్‌బాబుపై నమోదైన కేసును నాంపల్లి కోర్టు కొట్టేసింది. 2017లో పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీధర్‌బాబు సహా 13 మందిపై నమోదైన కేసులను నాంపల్లి కోర్టు కొట్టేసింది.శాంతియుతంగా ఆందోళన చేసినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఐపీసీ 147, 353, 427 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసులు పెట్టిందని శ్రీధర్ బాబు తరపు అడ్వకేట్ వాదించారు. వాదనలకు ఏకీభవించి నాంపల్లి కోర్టు.. కేసు కొట్టివేసింది. -
స్వప్నలోక్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల ఛార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: స్వప్నలోక్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల ఛార్జిషీట్ దాఖలు చేశారు. 13 మందిని నిందితులుగా తేల్చారు. ఈ ఘటనకు కారణమైన 13 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 2023 మార్చి 16న సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదంజరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో కొద్ది రోజుల క్రితం పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.క్యూనెట్కు చెందిన ఇద్దరితో పాటు, స్వప్నలోక్ కాంప్లెక్స్ బిల్డర్లు, అసోసియేషన్‌కు చెందిన వ్యక్తులను నిందితులుగా పోలీసులు చేర్చారు. ఫైర్ సేఫ్టీని గాలికి వదిలేసిన స్వప్నలోక్ బిల్డర్లే ప్రధాన నిందితులుగా పోలీసులు తెలిపారు. ఎగ్జిట్ పాయింట్ వద్ద వేస్ట్ మెటీరియల్ డంపు చేసి పెట్టడం వల్లే ఆరుగురు ప్రాణాలు రక్షించుకోలేకపోయారని పోలీసులు తెలిపారు. వేస్ట్ మెటీరియల్ లేకుండా ఉంటే, ఆరుగురు ప్రాణాలు పోకుండా ఉండేవని పోలీసులు అన్నారు. -
ఆ రకమైన కులగణన జరపాలి!
కుల గణన డిమాండును మొదటి నుండీ చాలా తీవ్రంగా నిరాకరిస్తూ వస్తున్న బీజేపీ ఇప్పుడు తానే ఆ పని చేస్తాను అంటోంది. ఒకవేళ ఎన్ని కల్లో లబ్ధి కోసమే తన విధా నాన్ని మార్చుకుందను కున్నా సరే ఇది గొప్ప నిర్ణయం. దీనిని అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజం తప్పక మెచ్చుకోవాలి. అయితే, సామా జిక న్యాయం దిశగా చేసే ప్రయాణంలో కులగణన అనేది తొలి అడుగు మాత్రమే. ఇది ఒక పరికరమే కానీ పరిష్కారం కాదు; సాధనమే కానీ సమా ధానం కాదు. వర్తమాన భారతదేశం ఎదుర్కొంటున్న సామాజిక సంక్షోభాన్ని కొలవడానికీ,అందులోని అపార వైవిధ్యాన్నీ, సంక్లిష్టతను అర్థం చేసుకోవడానికీ కులగణన ఒక్కటే సరిపోదు. రాజకీయ ఆర్థిక, సామాజిక, కుల మత గణన జరగాలి. కులగణన వల్ల దేశంలో ఏ కులస్థులు ఎంత మంది ఉన్నారో తెలుస్తుంది. ప్రభుత్వంలోనో, ప్రభుత్వరంగ సంస్థల్లోనో ఈ కులాలన్నింటికీ ఎంతెంత శాతం రిజర్వేషన్లు కల్పించాలి అన డానికి ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది. ప్రభుత్వా నికి నిజాయితీ ఉంటే ఈ కేటాయింపుల్ని వెంటనే అమలు చేయనూవచ్చు.ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్న కులాలే రిజర్వేషన్ అవకాశాలను దక్కించుకోగలుగు తాయనేది అందరికీ తెలిసిన సత్యం. ఇది హిందూ సమాజానికే కాక ముస్లిం సమాజానికి కూడ వర్తిస్తుంది. ఇక ముందు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల వంటి అమూర్త, సామూహిక ఉను కులు ఉండవు. చాకలి, సాలె, వడ్రంగి, లద్దాఫ్. నూర్ బాషా, సంబన్, రెల్లి వంటి నిర్దిష్ట కులాలు మాత్రమే ఉంటాయి. ఇటీవల ఎస్సీలను మూడు విభాగాలుగా వర్గీకరించారు. ఇక ముందు ఈ వర్గీకరణ కూడా ఉండదు. ప్రతి కులానికీ వాళ్ళ జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్ ఇవ్వాల్సిఉంటుంది.దేశంలో ముస్లిం సమాజం మీద సాగుతున్న వివక్ష మరీ క్రూరంగా తయారయ్యింది. ముస్లిం సమాజాన్ని రాజకీయ, ఆర్థిక, సాంస్కృతికరంగాల్లో నయా అస్పృశ్యులుగా మార్చేశారు. కొన్ని కీలకమైన ఉద్యోగాలను వారికి నిషే«ధితమైన విగా మార్చారు. వాళ్ళ చేతివృత్తుల్నీ, వ్యాపారా లనూ; ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటోలు వంటి వాటిలో చిరు ఉద్యోగాలను సహితం బహిష్కరించాలంటూ ఏలినవారి కాల్బలం ప్రకటనలు చేస్తు న్నది. రోడ్డు పక్కన జీవనాధారాన్ని ఎంచుకున్న చిరువ్యాపారుల్ని హింసిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం మనం చూస్తున్నాం. ఉపాధి కల్పనలో ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి సంఖ్య రీత్యా చాలా పరిమితమైనవి. ప్రభుత్వరంగ సంస్థలు క్రమంగా ప్రైవేటుపరం అయిపోతు న్నాయి. అంటే, అక్కడా అవకాశాలు తగ్గిపోతు న్నాయి. అప్పుడు ప్రైవేటు రంగంలోనూ రిజర్వే షన్లు కల్పించాలి అనే డిమాండు సహజంగానే ముందుకు వస్తుంది. దానికి ప్రభుత్వం సిద్ధమా? కార్పొరేట్లను ప్రభుత్వం ఒప్పించ గలుగుతుందా?దేశ సంపద ఏ సమూహాల్లో తగ్గిపోతున్నది, ఏ సమూహాల్లో పోగవుతున్నది అనేది ప్రాణప్రద మైన అంశం. టెలీకమ్యూనికేషన్స్, ఐటీ, రెన్యూవ బుల్ ఎనర్జీ, మౌలికరంగ నిర్మాణాలు, ఇ–కామర్స్, డిజిటల్ ఎకానమీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా స్యూటికల్, హెల్త్ కేర్, ఆయిల్– గ్యాస్, పెట్రో కెమి కల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, గనులు, సహజ వన రులు, కార్పొరేట్ విద్యా సంస్థలు తదితర రంగాల్లో ఇప్పుడు సంపద సృష్టి అవుతున్నది. వీటి యాజ మాన్యంలో సమస్త కులాలకు స్థానం కల్పిస్తారా? అణగారిన సమూహాలను ఎప్పటిలానే సేవకులుగా కొనసాగించి ప్రాతినిధ్యం కల్పించాం అంటారా? వర్తమాన భారత దేశంలో రెండు పరస్పర విరుద్ధ పరిణామాలు ఒకే సందర్భంలో సాగు తున్నాయి. ఒకవైపు సంపద వేగంగా పెరుగుతోంది; మరోవైపు పేదరికం అంతకన్నా వేగంగా పెరుగుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా ప్రకారం 2025లో భారత స్థూల జాతీయోత్పత్తి నాలుగున్నర ట్రిలియన్ డాలర్లను మించుతోంది. త్వరలో జర్మనీని అధిగమిస్తుందనే అంచనా ఉంది. ‘ఆక్స్ ఫామ్ సంస్థ ఇటీవల ప్రకటించిన‘ఇండియా రిపోర్టు – 2024’లో దిగ్భ్రాంతి కలిగించే అనేక అంశాలున్నాయి. మొత్తం జాతీయ సంపదలో 77 శాతం ఓ పది శాతం ధనికుల చేతుల్లో ఉందట. 40 శాతం జాతీయ సంపద కేవలం ఒక్క శాతం ధనికుల చేతుల్లో ఉందట. 50 శాతం జనాభాకు జాతీయ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే దక్కుతున్నదట. అంటే పేద రికం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయవచ్చు.సంపద పంపిణీలో అసమానత్వం అత్యధికంగా ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. విచిత్రం ఏమిటంటే, మన రాజ్యాంగ ఆదర్శాల్లో సామ్య వాదం కూడా ఉంది. 39వఅధికరణం భౌతిక వనరుల పంపిణీలో సమానత్వాన్ని పాటించాలని ఆదేశిస్తుంది. ఉమ్మడి పౌరస్మృతిని అమలుపరచా లని రాజ్యాంగం అదేశిస్తున్నదంటూ రెండేళ్ళ క్రితం బీజేపీ చాలా హంగామా చేసింది. అటు ఆదే శిక సూత్రాల్లోనేగాక, ప్రధాన ఆదర్శాల్లోనూ ఉన్న సామ్యవాదం గురించి మాత్రం ఆ పార్టీ మాట్లాడడం లేదు.-డానీవ్యాసకర్త సమాజ విశ్లేషకులు -
138 దేశాలతో పోటీ పడి తెలంగాణ పోలీసులు నెంబర్ వన్.. సీఎం ప్రశంస
సాక్షి, హైదరాబాద్: మాదకద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీ పడి ఈరోజు తెలంగాణ పోలీస్ శాఖ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ఘనతను సాధించిన హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ సీవీ ఆనంద్‌కు, ఆయన బృందానికి సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెట్టి ట్విట్టర్ వేదికగా.. వివిధ రంగాల్లో… ప్రపంచానికి తెలంగాణ రోల్ మోడల్ గాఉండాలన్నది నా ఆకాంక్ష.మాదకద్రవ్యాల నియంత్రణలో… 138 దేశాలతో పోటీ పడి…ఈ రోజు తెలంగాణ పోలీస్… ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉంది.ఈ ఘనతను సాధించిన… హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ చీఫ్ సీవీ ఆనంద్ కు, ఆయన బృందానికినా ప్రత్యేక అభినందనలు.డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం… నేను కంటున్న కలలను సాకారం చేయడానికి…కృషి చేస్తున్న ప్రతి పోలీస్ కు… నేను మద్దతుగా ఉంటాను’ అని చెప్పుకొచ్చారు.వివిధ రంగాల్లో… ప్రపంచానికి తెలంగాణ రోల్ మోడల్ గాఉండాలన్నది నా ఆకాంక్ష. మాదకద్రవ్యాల నియంత్రణలో… 138 దేశాలతో పోటీ పడి…ఈ రోజు తెలంగాణ పోలీస్… ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉంది. ఈ ఘనతను సాధించిన… హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ చీఫ్ సీవీ… pic.twitter.com/CLKSzX75jc— Revanth Reddy (@revanth_anumula) May 17, 2025 -
పవర్‌ఫుల్‌గా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐటీ, పారిశ్రామిక అభివృద్ధితోపాటు గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో విద్యుత్‌కు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని ఇంధన శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా తరలి వస్తున్నాయని, భవిష్యత్‌లో పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు తయారు చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. సీఎం శుక్రవారం తన నివాసంలో ఇంధన శాఖపై డిప్యూటీ సీఎం భట్టితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, ప్రజా రవాణా (మెట్రో, ఎలక్ట్రికల్ వెహికిల్స్) పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టాలని సూచించారు.9.8 శాతం పెరిగిన విద్యుత్ డిమాండ్.. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందని సీఎం తెలిపారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో వినియోగం పెరగలేదని, అయినా అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ⇒ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఈ ఏడాది అత్యధిక విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి అది 18,138 మెగావాట్లకు, 2034–35 నాటికి 31,808 మెగావాట్లకు పెరుగుతుందని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలని సీఎం సూచించారు. ప్రధానంగా క్లీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అన్ని అవకాశాలను⇒ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కొత్తగా అమల్లోకి తెచి్చన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై దృష్టి సారించాలని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో దిగ్గజ సంస్థలకు రాష్ట్రంలో అవకాశం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని.. మెట్రో విస్తరణ, రైల్వే లైన్లు, ఇతర మాస్ ట్రాన్స్‌పోర్ట్‌లకు విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు ఇతర కార్పొరేషన్లు, కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.హెచ్ఎండీఏతో సమన్వయం..ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నుంచి రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) వరకు రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్‌లకు విద్యుత్ అవసరాలపై హెచ్ఎండీఏతో సమన్వయం చేసుకోవాలని విద్యుత్తు శాఖ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. క్షేత్రస్థాయిలో డిమాండ్‌కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేసుకోవాలని, విద్యుత్ లైన్ల ఆధునీకరణపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని కోరారు.ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్లు బహిరంగంగా కనిపించడానికి వీల్లేదని, హై టెన్షన్ లైన్లను కూడా అక్కడి నుంచి తరలించాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. సచివాలయం, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో ముందుగా వీటిని ఏర్పాటుచేయాలని ఆదేశించారు. 160 కిలోమీటర్ల ఓఆర్ఆర్ పొడవునా సోలార్ విద్యుత్ లైటింగ్‌ను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పుట్‌పాత్‌లు, నాలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. -
సారీ.. నో లారీ!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: ఓవైపు నైరుతి రుతుపవనాలు ముంచుకొస్తున్నాయి. మరోవైపు యాసంగి సీజన్లో వచ్చిన అధిక దిగుబడితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాలు ధాన్యం రాశులతో నిండిపోయాయి. నెల రోజులుగా కొనుగోళ్లు సాగుతున్నప్పటికీ.. ఇప్పటికీ చాలా జిల్లా ల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు దర్శనమిస్తున్నాయి. 10 నుంచి 20 రోజుల పాటు ఎదురు చూసినా వడ్ల బస్తాలను కాంటా వేయడం లేదని రైతులు వాపోతున్నారు.కొన్న ధాన్యం తరలించేందుకు లారీలు లేవని, రైతులు సొంతంగా ట్రాక్టర్లో తీసుకెళ్తామంటే హమాలీలు లేరని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ధాన్యం రాశుల వద్ద రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. మరిపెడ మండలంలోని ఓ రైతు 600 బస్తాలకు కాంటా వేయించిన తర్వాత లారీలు లేవనే సాకుతో కేంద్రంలోనే వదిలేశారు. ఇప్పటికే అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచగా.. మరోవైపు ముంచుకొస్తున్న వానాకాలం అన్నదాతలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం సుమారు 10 ఎల్ఎంటీల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పడి ఉన్నట్లు అంచనా. ఇప్పటివరకు 51.39 ఎల్ఎంటీల కొనుగోలు రాష్ట్రంలో ఈసారి యాసంగి సీజన్లో 60.14 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. దాదాపుగా 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఇందులో 70.13 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. కాగా శుక్రవారం వరకు తెరిచిన రాష్ట్రంలోని 8,353 కొనుగోలు కేంద్రాలకు 55.73 ఎల్ఎంటీలధాన్యం వచ్చిందని, 51.39 ఎల్ఎంటీల ధాన్యాన్ని సేకరించామని, 49.87 ఎల్ఎంటీల ధాన్యాన్ని మిల్లులకు తరలించామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆలస్యంగా వరి సాగు చేసిన ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ మొదలైన జిల్లాల్లో మినహా దాదాపు అన్ని జిల్లాల్లో కోతలు పూర్తి అయినప్పటికీ ఆయా జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదని కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్న రైతుల్ని చూస్తే అర్ధమవుతుంది. ఎందుకు ఆలస్యం? కొన్ని కొనుగోలు కేంద్రాల్లో 20 రోజులుగా రైతులు పడిగాపులు పడుతున్నా వడ్ల బస్తాలకు నిర్వాహకులు కాంటా వేయడం లేదు. ఎందుకంటే.. లారీలు లేవు, హమాలీల కొరత ఉందని నిర్వాహకులు చెపుతున్నారు. లారీలు లేకపోతే ట్రాక్టర్‌తో రైతులే సొంతంగా ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్తామన్నా కూడా హమాలీల కొరత పేరు చెపుతూ కాంటా వేయడం లేదు. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, మహబూబాబాద్, నాగర్‌కర్నూలు, వనపర్తి, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, భూపాలపల్లి, జనగాం తదితర జిల్లాల్లోని అనేక మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ఇంకా ధాన్యం కుప్పలు నిండుగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇంకా సుమారు 20 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది.వాస్తవానికి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించడానికి ముందే లారీల సరఫరా కాంట్రాక్టును జిల్లా అధికార యంత్రాంగం ఖరారు చేసి, ప్రణాళికాబద్ధంగా కేంద్రాల నుంచి మిల్లులకు వడ్ల బస్తాలను తరలించాల్సి ఉంది. కానీ ఈసారి ప్రణాళిక తప్పిందని అధికారులే అంగీకరిస్తున్నారు. హమాలీల విషయంలోనూ ఇదే జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ధాన్యం దిగుబడి, కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం రావొచ్చనే అంచనాను బట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాలో జాయింట్ కలెక్టర్, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి లారీలు, ఇతర ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే కొనుగోలు కేంద్రాల్లో పెద్ద మొత్తంలో ధాన్యం నిల్వ ఉండటాన్ని బట్టి చూస్తే లారీల కొరత ఉందనే విషయం స్పష్టమవుతోంది. ఇక హమాలీలు ఎక్కువ కూలీ లభించే మక్కజొన్న, ఇతర పంటల కొనుగోళ్ల వద్దకు వెళ్లడం, ఉపాధి హామీ పనులకు వెళుతుండడం వల్ల ధాన్యం కేంద్రాలకు రావడం లేదని తెలుస్తోంది. కాంటా వేసిన తర్వాత రైతు బాధ్యత ఎలా? ⇒ ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన తర్వాత కాంటా వేసేంత వరకే రైతు బాధ్యత. కాంటా వేసిన తర్వాత రైతుకు ఆ ధాన్యంతో సంబంధం ఉండకూడదు. ప్రభుత్వం కూడా అదే చెబుతుంది. కానీ మిల్లరు ధాన్యం బస్తాలను దించుకునేంత వరకు రైతుదే బాధ్యత అన్నట్టుగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. అమాయక రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.భయపెడుతున్న ముందస్తు రుతు పవనాలు ⇒ గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ధాన్యం కొనుగోళ్లు ఎన్నో రెట్లు ఎక్కువని ప్రభుత్వం చెపుతోంది. అదే సమయంలో ఈసారి గతంలో కన్నా కొంత ముందుగా నాట్లు వేయడం, సన్న రకాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో కోతలు ముందే వచ్చాయి. రైతుల అదృష్టం కొద్దీ ఈసారి దిగుబడి కూడా బాగుంది. ఈ పరిస్థితుల్లో కొనుగోళ్లు ముందుగానే ప్రారంభం కావడంతో ఇప్పటివరకు 51.39 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు చేశారు. కేంద్రాల్లో ఇంకా 4.34 ఎల్ఎంటీల ధాన్యం కాంటా వేయకుండా ఉందని పౌరసరఫరాల శాఖే చెబుతోంది. అలాగే కొనుగోలు చేసిన ధాన్యంలోనూ ఇంకా సుమారు లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించ లేదని స్పష్టం చేస్తోంది.అయితే మొత్తంగా సుమారు 10 ఎల్ఎంటీల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉందని అంచనా. కాగా అకాల వర్షాలు రైతులను ప్రతిరోజూ భయపెడుతున్నాయి. భారీ వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల తడిచిన ధాన్యం ఆరితే కానీ రైతులు అమ్ముకోలేని పరిస్థితి ఉంది. తాజాగా.. రుతు పవనాలు ఈసారి ముందుగానే రాష్ట్రంలో ప్రవేశిస్తాయనే వార్తలతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. లారీలు, హమాలీలను అందుబాటు ఉంచడం ద్వారా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దొడ్డు ధాన్యమే ఎక్కువ..సన్న బియ్యం ఎలా? రాష్ట్రంలో 6,58,486 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 51.39 ఎల్ఎంటీల ధాన్యంలో దొడ్డు రకం 34.02 ఎల్ఎంటీలు కాగా, సన్నాలు 17.37 ఎల్ఎంటీలు ఉన్నాయి. సన్నాలు 30 ఎల్ఎంటీల వరకు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేయగా, ప్రస్తుత పరిస్థితిని చూస్తే సాధ్యమయ్యే అవకాశం లేదని అధికారులు చెపుతున్నారు. నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, కామారెడ్డి, నారాయణపేట , వనపర్తి మొదలైన జిల్లాల్లో పండించిన మేలు రకం సన్న ధాన్యాన్ని రైతులు అధిక ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు సన్నాలు ఆశించిన స్థాయిలో రాలేదు. మరో 5 లక్షల నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే తప్ప రేషన్ దుకాణాలకు ఇవ్వాల్సిన సన్న బియ్యానికి సరిపోవని అధికారులు చెబుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపుల వివరాలు.. యాసంగిలో ధాన్యం సేకరణ అంచనా : 70.13 ఎల్ఎంటీ ఇప్పటివరకు సేకరించిన ధాన్యం : 51.39 ఎల్ఎంటీ ఇందులో దొడ్డు రకం (5,44,543 రైతులు) : 34.02 ఎల్ఎంటీ సన్న రకం (2,25,215 రైతులు) : 17.37 ఎల్ఎంటీ కొనుగోలు చేసిన ధాన్యం విలువ : రూ.11,913.05 కోట్లు రైతులకు చెల్లించిన మొత్తం : రూ.8,511.42 కోట్లు సన్న రకం ధాన్యానికి చెల్లించాల్సిన బోనస్ : రూ.868.61 కోట్లు వర్షం వస్తే ఎట్లా..? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. అయితే లారీలు, హమాలీల కొరత, స్థానిక మిల్లుల ట్యాగింగ్‌లో జాప్యంతో పలు కేంద్రాల్లో వేలాది క్వింటాళ్ల ధాన్యం కుప్పలుగా పడి ఉంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్‌కు చెందిన గంగవ్వ నాలుగెకరాల్లో పండిన ధాన్యాన్ని స్థానిక కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి 20 రోజులవుతున్నా వడ్లు కాంటా కాలేదు. వర్షాల భయంతో ధాన్యంపై కవర్లు కప్పి పడిగాపులు పడుతోంది. జైపూర్ మండలం పౌనూరుకు చెందిన జాడి బాపు నాలుగెకరాల్లో పండించిన ధాన్యాన్ని కేంద్రానికి తీసుకొచ్చి పది రోజులు గడుస్తున్నా కాంటా వేయడం లేదు. దీంతో వర్షం వస్తే నష్టపోతానని ఆందోళన చెందుతున్నాడు. మరోవైపు మిల్లర్లు తరుగు పేరుతో 2 నుంచి 5 కిలోలకు పైగా కోత పెడుతున్నారని చెన్నూరు మండలం కిష్టంపేట, ఎల్లక్కపేట తదితర చోట్ల రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తూకం వేసినా.. లారీలు లేక..మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పైతర కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేసినా, లారీలు రాకపోవడంతో వారం రోజులుగా రవాణాకు నోచుకోలేదు. అకాల వర్షాలకు దాదాపు 800 బస్తాల ధాన్యం తడిసింది. దీంతో సంచుల్లోంచి మొలకలు ఇలా బయటకు వచ్చాయి. 20 రోజులైనా కాంటా కాలేదు.. నాకు ఉన్న 3 ఎకరాల్లో వరి పంట సాగు చేశా. కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చి 20 రోజులు అవుతుంది. ఇప్పటివరకు కాంటా పెట్టలేదు. అదేమంటే లారీల కొరత ఉందని చెబుతున్నారు. రోజూ కేంద్రానికి వచ్చి ఎప్పుడు కాంటా పెడతారా అని ఎదురుచూస్తున్నా. రైతులం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం తొందరగా వడ్లు కొనాలి. – కొల్లి తిప్పారెడ్డి, రైతు, జటప్రోలు, పెంట్లవెల్లి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా -
ఏంట్రీ.. 700 ఏళ్లా..?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/సాక్షి, హైదరాబాద్/శంకర్పల్లి: రాష్ట్రంలో ప్రపంచ సుందరి పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. పోటీదారులు శుక్రవారం పలు పర్యాటక, వైజ్ఞానిక ప్రాంతాలను సందర్శించి సందడి చేశారు. పోటీదారుల్లోని ఒక బృందం శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రఖ్యాత పిల్లల మర్రిని సందర్శించింది. మరికొందరు హైదరాబాద్ శివార్లలోని ఎక్స్పీరియం ఎకో పార్క్‌తోపాటు ఏఐజీ ఆసుపత్రిని సందర్శించారు. పిల్లల మర్రికి ఫిదా: పాలమూరులోని ప్రఖ్యాత పిల్లలమర్రి వృక్షాన్ని చూసి మిస్ వరల్డ్ పోటీదారులు ఫిదా అ య్యారు. మహా వృక్ష చరిత్ర, పునరుజ్జీవం గురించి తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోటీదారుల్లో గ్రూప్–2లో ని 23 మంది శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లాలోని చారిత్రక పిల్లలమర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. వీరికి బంజారాల నృత్యాలు, డోలు వాయిద్యాల మధ్య కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి ఘన స్వా గతం పలికారు. ఈ సందర్భంగా నమస్కారం తెలంగాణ, తెలంగాణ.. జరూర్ ఆనా అంటూ సుందరీమణులు నినాదా లు చేశారు. ముందుగా 16వ శతాబ్దానికి చెందిన శ్రీ రాజరాజేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం పురావస్తు ప్రదర్శనశాలకు చేరుకుని చారిత్రక శిల్పాలు, పురాతన కళాఖండాలను తిలకించారు.ప్రత్యేక గైడ్ శివనాగిరెడ్డి వాటి విశిష్టతను వివరించారు. ఆ తర్వాత పిల్లల మర్రి మహావృక్షాన్ని సందర్శించారు. దాదాపు మూడున్నర ఎకరాల్లో విస్తరించిన 700 సంవత్సరాల వయసు కలిగిన మహావృక్షం మానులు, ప్రకృతి అందాలను చూసి మైమరచిపోయారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన బోనాలు, బతుకమ్మ ఆటపాటలు విదేశీ వనితలను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోటీదారులు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం గురుకుల విద్యార్థులతో ముచ్చటించారు. పోటీదారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు చేనేత కారి్మకులు తయారు చేసిన చేనేత పట్టు వ్రస్తాలు అందజేశారు. మనసు దోచుకున్న ఎక్స్పీరియం.. హైదరాబాద్ శివారులోని ఎక్స్పీరియం ఎకో పార్క్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించి సందడి చేశారు. మిస్ వరల్డ్ –2024 విజేత క్రిస్టినా పిషో్కవాతోపాటు అమెరికా ఖండ ఓషియానా విభాగంలోని దేశాలకు చెందిన 23 మంది ఇందులో పాల్గొన్నారు. డోలు వాయిద్యాలకు అనుగుణంగా పోటీదారులు ఉత్సాహంగా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. అనంతరం ఎక్స్పీరియం ఎకో పార్క్‌లో గ్రీన్ టెక్నాలజీ, పర్యావరణ పరిరక్షణ, స్థానిక జీవవైవిధ్యం, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి అధికారులు వారికి వివరించారు. చిన్నారులతో కలిసి పోటీదారులు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మిస్ కెనడా ఎమ్మా మోరిసన్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రదేశం అద్భుతంగా ఉంది. నా తల్లిదండ్రులను త్వరలో హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఈ అందాలను చూపిస్తా’అని తెలిపారు. మిస్ యూఎస్ అథెనా క్రాస్బీ.. ‘భూమిని రక్షించడం మన బాధ్యత. ఎక్స్పీరియం, సృజనాత్మక డిజైన్‌తో ప్రకృతితో ఎలా సామరస్యంగా జీవించవచ్చో చూపిస్తుంది’అని పేర్కొన్నారు. ‘మా దేశంలో కూడా ఇలాంటి పర్యావరణ అద్భుతాలను సృష్టించాలని ఉంది’అని మిస్ బ్రెజిల్ జెస్సికా పెడ్రోసో తెలిపారు. కుటుంబ ఆరోగ్యం మహిళ చేతిలోనే.. తల్లిగా, సోదరిగా, కుమార్తెగా, ఆరోగ్య సంరక్షణ కార్మికురాలిగా, వృత్తి నిపుణురాలిగా, నాయకురాలిగా మహిళలు ప్రపంచంలో అనేక పాత్రలు పోషిస్తున్నారని ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా అన్నారు. శుక్రవారం మిస్ వరల్డ్ పోటీదారులు ఏఐజీ ఆసుపత్రిని సందర్శించి, అక్కడ అందిస్తున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఫలితంగా కుటుంబం, సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డా.నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. గొప్ప వైద్యులు, శాస్త్రవేత్తలు గుండె, మెదడు, మూత్రపిండాలు వంటి ప్రధాన అవయవాలపై మాత్రమే దృష్టి సారించేవారని.. ఇప్పుడు ఆ కోణం మారిందని అన్నారు. -
జరిమానా విధిస్తాం జాగ్రత్త
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీ ఇష్టం వచ్చినట్లు ఒకే విషయంపై పదే పదే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుంది జాగ్రత్త..’అని గ్రూప్–1 అభ్యర్థులను సుప్రీంకోర్టు హెచ్చరించింది. ‘ఈ విషయమై గతంలోనూ కొందరు కోర్టును ఆశ్రయించారు. పరీక్షలు అయ్యాక దీనిపై వాదనలు అవసరమా అని అప్పుడే మేం ప్రశ్నించాం. ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేశాం. ఇప్పుడు మళ్లీ మీరెందుకు వచ్చారు? మేం డిస్మిస్ చేసిన విషయం మీకు తెలియదా?’అంటూ నిలదీసింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. అభ్యర్థులు పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు, ఆ పిటిషన్ విత్‌డ్రాకు ధర్మాసనం అనుమతి ఇచి్చంది.గ్రూప్–1,2,3 నోటిఫికేషన్లకు సంబంధించిన జీవో 29, జీవో 33ను, పీహెచ్సీ రిజర్వేషన్లు వర్టీకల్గా అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ కుమ్మరి ప్రవీణ, మరో 12 మంది 370 పేజీలతో కూడిన రిట్ పిటిషన్‌ను ఏప్రిల్ 30న సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జోమాల్య బగి్చలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎస్.నిరంజన్ రెడ్డి, పిటిషనర్ల తరపున రానా ముఖర్జీ వాదనలు వినిపించారు.గ్రూప్–1 నోటిఫికేషన్ వ్యవహారంలో జీవో 29 రద్దు అంశంపై సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణ జరిపి, కొట్టివేసిందని నిరంజన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం అభ్యర్థులపై సీరియస్ అయ్యింది. ‘పిటిషన్లో కొత్తగా ఏం ఉంది? ఒకే అంశంపై ఇంతమంది ఇన్నిసార్లు ఎందుకు? ఇలా చేస్తే జరిమానా విధిస్తాం..’అని హెచ్చరించింది. దీంతో పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని రానా ముఖర్జీ అభ్యర్థించగా ధర్మాసనం అంగీకరించింది. -
28న పోలవరంపై ప్రధాని మోదీ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులపై ఈనెల 28న ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన, పనుల పురోగతిని సమీక్షించి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ఒడిశాల్లో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ హియరింగ్(బహిరంగ విచారణ) నిర్వహించడంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేయనున్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టిన ప్రాజెక్టులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను గైడ్ చేసేందుకు పీఎం ప్రగతి కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేపట్టారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేయడానికి వీలుగా 15,227.84 ఎకరాల భూమిని ఇంకా సేకరించాలి. పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయాలంటే 53,393.89 ఎకరాల భూమిని ఇంకా సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకూ 60.78 శాతం పూర్తయ్యాయి.రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేయాలంటే.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతో కలిసి పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలి. ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన పనుల్లో పురోగతిని సమీక్షించి, గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్ సీఎస్‌కు దిశానిర్దేశం చేయనున్నారు.పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల తమ ప్రాంతాలు ముంపునకు గురవుతాయని ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలంటే ఆ మూడు రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంది. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలి. బ్యాక్ వాటర్ ప్రభావంపై నాలుగు రాష్ట్రాల సీఎస్‌లతో చర్చించి.. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించడంపై ప్రధాని మోదీ మార్గనిర్దేశం చేయనున్నారు. -
అందాల పోటీలు.. అధికారుల సిగపట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీలను ఘనంగా నిర్వహించి చూపాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంటే, ఆ పనిని సక్రమంగా నిర్వహించాల్సిన అధికారులు మాత్రం కీచులాటలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల మధ్య సమన్వయం కొరవడి చివరకు ప్రభుత్వానికే తలవంపులు తెచ్చేలా మారింది. ఈ పోటీల నిర్వహణలో ప్రధాన భూమిక పర్యాటక శాఖదే. అందులో అంతర్భాగమైన తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థలో ఈడీ స్థాయి అధికారిని పోటీలు కొనసాగుతుండగానే మాతృ సంస్థకు పంపటం వెనుక అధికారుల మధ్య వివాదాలే కారణమన్న చర్చ జరుగుతోంది. స్పాన్సర్ల విషయంలో ప్రభుత్వం సీరియస్.. పోటీల నిర్వహణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం–మిస్ వరల్డ్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా చెరిసగం భరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్వహణ ఖర్చుల అంచనా రూ.57 కోట్లని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. దాదాపు రూ.25 కోట్లను మించి స్పాన్సర్షిప్ మొత్తం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, ఆ అంచనాలు తలకిందులయ్యాయని సమాచారం. పోటీలు ప్రారంభం కాకముందే స్పాన్సర్‌గా ఉండేందుకు ఓ పెద్ద బ్యాంకు ముందుకొచి్చ, ప్రభుత్వం ఆశించిన మొత్తం చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే, ఒక్క బ్యాంకుకే మొత్తం స్పాన్సర్షిప్ ఇవ్వలేమని, మరికొన్ని సంస్థలతో కలిపి ఇస్తామని ఓ ఉన్నతాధికారి ఆ బ్యాంకు ప్రతినిధులతో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ బ్యాంకు వెనక్కు వెళ్లిపోయినట్లు సమాచారం.ఆ తర్వాత కొన్ని సంస్థలు ముందుకొచి్చనా.. వాటితో ఓ ఉన్నతాధికారి సరిగా వ్యవహరించకపోవటంతో అవి కూడా వెనుదిరిగాయని చెబుతున్నారు. సదరు సంస్థలతో అధికారులు సరిగా డీల్ చేసి ఉంటే ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన మొత్తానికి మించి ఆదాయం సమకూరి ఉండేదని అంటున్నారు. మరోవైపు ఒకరిద్దరు అధికారులు ఈ స్పాన్సర్షిప్ వ్యవహారాన్ని సొంత లబి్ధకి వాడే ప్రయత్నం చేశారని, దానిపై విజిలెన్స్ విచారణ కూడా జరుగుతోందన్న ప్రచారం సాగుతోంది. వెరసి కీలక స్పాన్సర్షిప్స్ వ్యవహారంలో యంత్రాంగం వైఫల్యాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారుల మధ్య కీచులాటలు.. ప్రపంచ సుందరి పోటీల ఏర్పాట్లను ప్రారంభంలో అప్పటి పర్యాటకశాఖ కార్యదర్శి స్మితాసబర్వాల్ పర్యవేక్షించారు. ప్రభుత్వం ఆమెను బదిలీ చేసి ఈ బాధ్యతను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌కు అప్పగించింది. ఆ సమయంలో సీఎంతో జరిగిన ఓ సమావేశంలోనే ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వివాదం మొదలైనట్లు తెలిసింది. ఈ పోటీల్లోని కొన్ని కార్యక్రమాలకు సాధారణ ప్రజలను కూడా అనుమతించాలని ఆ సమావేశంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్‌రెడ్డి ప్రతిపాదించారు. అప్పుడే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జయేశ్‌రంజన్‌కు దీనిపై సమాచారం లేదు.చివరకు కొన్ని కార్యక్రమాలకు సాధారణ ప్రజలను అనుమతించాలని సీఎం ఆదేశించారు. ఇంతటి కీలక నిర్ణయం తనకు తెలియకుండా తీసుకోవటమేంటని ప్రకాశ్‌రెడ్డిని జయేశ్‌రంజన్ ప్రశ్నించినట్టు సమాచారం. ఈ ఘటన ఆ ఇద్దరు అధికారుల మధ్య కొంత అగాధానికి కారణమైందని పర్యాటక శాఖలో ప్రచారం జరుగుతోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్‌రెడ్డి, ఈడీ విజయ్ మధ్య కూడా అభిప్రాయ భేదాలు వచ్చాయని, అందుకే విజయ్‌ని ఉన్నఫలంగా మాతృసంస్థకు పంపారని అంటున్నారు. కాళ్లు కడిగించారనే అపవాదు.. ఇటీవల వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయ సందర్శనకు వెళ్లినప్పుడు ఆలయాల్లోకి వెళ్లేముందు మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగిన ఘట్టం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. అక్కడ సాధారణ భక్తులు కాళ్లు కడుక్కున్నట్టుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉంటే సరిపోయేది. కానీ, పోటీదారులను కుర్చిల్లో కూర్చోబెట్టి కాళ్ల కింద కొత్త పళ్లాలు ఉంచి, చెంబులతో నీళ్లు పోసి సిబ్బందితో కాళ్లు కడిగించారు. కొందరు సిబ్బంది టవల్‌తో కాళ్లను తుడిచారు. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది. అసలు ఇలా పళ్లాల్లో కాళ్లుంచి కడిగించే ఆలోచన ఎవరు చేశారంటూ తర్వాత పర్యాటక శాఖ మంత్రి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
తిరంగా ర్యాలీ.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా రేపు హైదరాబాద్‌లో తిరంగా ర్యాలీని నిర్వహించనున్నారు..రేపు(శనివారం, మే 17వ తేదీ) హైదరాబాద్ లో తిరంగా ర్యాలీని నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి, శనివారం సాయంత్రం గం. 5.30ని.ల నుంచి రాత్రి గం. 7.30 ని.ల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధానంగా అంబేద్కర్ విగ్రహం, సచివాలయం జంక్షన్, సెల్లింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో వాహనాలు దారి మళ్లింపు ఉంటుంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. -
‘హరీష్ పై కేటీఆర్‌కు ఎందుకంత ప్రేమో..’
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందంటూ ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని స్పష్టం చేసిన రామచంద్రనాయక్.. ఎప్పుడూ లేని విధంగా హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లడమే ఉదాహరణగా చెప్పుకొచ్చారు.‘పార్టీ ప్లీనరీ సమయంలో హరీష్ రావు కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయనకు అంత సీను లేదని చెప్పారు. రెండు గంటలకు పైగా హరీష్ రావుతో చర్చలు జరిపారు. గతంలో ఎప్పుడూ హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లలేదు.హరీష్ రావు ఇంట్లో గతంలో పంక్షన్ జరిగినా కేటీఆర్, ఆయన కుటుంబం దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు సడన్‌గా హరీష్ రావు పైన కేటీఆర్‌కు ఎందుకంత ప్రేమ వచ్చిందో చెప్పాలి. హరీష్ రావు కొత్త పార్టీ పెడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. కల్వకుంట్ల కవిత ఇప్పటికే పార్టీ కి వ్యతిరేకంగా బహిరంగంగా విమర్శలు చేస్తున్నాడు. తన మీద దుష్పచారం జరుగుతోందని, దాని వెనుక ఎవరున్నారో తనకు తెలుసునని కవిత అంటోంది. మొత్తంగా కల్వకుంట్ల కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్యపోరు జరుగుతోంది. రాజకీయ ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటున్నారు. హరీష్ రావు తో చర్చల మతలబు ఏమిటో ప్రజలకు కేటీఆర్ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.హరీష్‌రావు నివాసానికి కేటీఆర్హరీష్రావు నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు హరీష్‌తో భేటీ అయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన హరీష్ రావు తండ్రి ఆరోగ్య వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. కోకాపేట హరీష్‌రావు నివాసంలో సమావేశమైన ఇరువురు నేతలు.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.హరీష్ రావు పార్టీ మారతారన్న ప్రచారంపై సైబర్ సెల్‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాను పార్టీ లైన్ దాటనని ఇటీవల హరీష్‌రావు ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీష్‌రావు మరోసారి స్పష్టం చేశారు. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించిన కానీ.. పని చేస్తానని హరీష్‌రావు తెలిపారు. వరంగల్ సభ తర్వాత పార్టీలో హరీష్‌రావు ప్రాముఖ్యత తగ్గిందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మండిపడుతోంది. దీంతో నేరుగా హరీష్ రావుతో మాట్లాడి సమస్యకు పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కేటీఆర్ సమావేశమైనట్లు సమాచారం. -
కంబాలపల్లి C/O ప్రభుత్వోద్యోగులు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామం.. ప్రభుత్వ ఉద్యోగుల గ్రామంగా విలసిల్లుతోంది. గ్రామం నుంచి ఆర్మీ, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్టిలరీ, బీఎస్ఎఫ్, ఎస్పీఎఫ్, మద్రాస్ రెజిమెంట్, టీఎస్ఎస్పీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఏఆర్, పోలీసు విభాగాలతో పాటు ఉపాధ్యాయులు 79 మంది వరకు సేవలు అందిస్తున్నారు. కాగా ఇక్కడి నుంచి ఎక్కువగా సైనికులు దేశానికి సేవలందిస్తున్నారు. గ్రామానికి చెందిన మల్లికంటి కృష్ణయ్య మొట్టమొదటిసారిగా సీఆర్పీఎఫ్ జవాన్‌గా చేరారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని గ్రామ యువత వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ.. కంబాలపల్లి గ్రామం (Kambalapally Village) ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తున్నారు. సేవలందిస్తున్న 79 మందిలో...కంబాలపల్లి గ్రామం నుంచి 79 మంది ప్రభుత్వ ఉద్యోగాలు (Govt Jobs) చేస్తున్నారు. ఇందులో 38 మంది ఆర్మీలో, 10 మంది కానిస్టేబుళ్లు, 15 మంది ఉపాధ్యాయులు, ఆరుగురు టీఎస్ఎస్పీ, ఇద్దరు నేవీ, ముగ్గురు ఎయిర్ ఫోర్సు, ఐదుగురు గన్మన్లు, ఇద్దరు ఎస్పీఎఫ్ (SPF) విభాగాల్లో పనిచేస్తున్నారు.తొలిసారిగా ఎయిర్‌ఫోర్స్‌లో..కంబాలపల్లి గ్రామం నుంచి ఎంపికైన మొట్టమొదటి ఎయిర్‌ఫోర్స్ (Air Force) ఉద్యోగిగా నూకల నరేందర్ రెడ్డి పేరుపొందారు. ఎయిర్‌ఫోర్స్ విమాన కమాండర్ (ఆర్మీలో బ్రిగేడియర్ హోదా)గా 36 ఏళ్లపాటు పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం నరేందర్ రెడ్డి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో హెలికాప్టర్ పైలట్ విధులు నిర్వర్తిస్తున్నారు. తమ గ్రామం నుంచి దేశ రక్షణ, ఇతర విభాగాల్లో యువకులు పనిచేస్తూ ఆదర్శంగా నిలవడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. – నూకల నరేందర్‌రెడ్డి, మొట్టమొదటి ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగిగ్రేడ్ హవల్దార్‌గా విధులు..గ్రామానికి చెందిన కొలిశెట్టి సుధాకర్ ఆర్మీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం గ్రేడ్ హవల్దార్ హోదాలో కొనసాగుతున్నారు. దేశ సేవ చేయాలనే లక్ష్యంతో 2001లో మొదటి ప్రయత్నంలోనే ఆర్మీలో సిపాయిగా ఉద్యోగంలో చేరారు. తర్వాత లాంచ్ నాయక్, నాయక్, హవల్దార్ హోదాల అనంతరం ప్రస్తుతం గ్రేడ్ హవల్దార్‌గా పనిచేస్తున్నారు. – కొలిశెట్టి సుధాకర్, ఆర్మీ గ్రేడ్ హవల్దార్ 22 ఏళ్లుగా ఆర్మీలో .. గ్రామానికి చెందిన సంద భాస్కర్ 22 ఏళ్ల క్రితం ఆర్మీలో చేరి విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామానికి చెందిన మల్లికంటి కృష్ణయ్య ఆర్మీలో చేరిన మొ దటి వ్యక్తి కాగా.. భాస్కర్ రెండోవారు. ఆర్మీలో జూనియర్ కమాండెంట్ ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు. – సంద భాస్కర్, జూనియర్ కమాండెంట్ ఆఫీసర్తండ్రిని ఆదర్శంగా తీసుకొని.. గ్రామానికి చెందిన మల్లికంటి కృష్ణయ్య, సైదమ్మ దంపతుల చిన్న కుమారుడు అవినాశ్ తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని ఆర్మీలో చేరాడు. ఆయన ప్రస్తుతం జమ్మూలో ఆర్టిలరీ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు.– మల్లికంటి అవినాశ్, ఆర్మీ ఆర్టిలరీ ఉద్యోగిప్రభుత్వ ఉపాధ్యాయునిగా..గ్రామానికి చెందిన మల్లికంటి రమేశ్ ఆర్మీలో 16 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉద్యోగ విరమణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్సీ రాసి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం గంగారం మండలంలో స్కూల్ అసిస్టెంట్‌గా కొనసాగుతున్నారు. – మల్లికంటి రమేశ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడుచదవండి: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి -
‘సీఎంకు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు’
హైదరాబాద్: రాష్ట్రం దివాలా తీసిందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి వర్గం అసంతృప్తిగా ఉందన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఈ రోజు(శుక్రవారం) మీడియాతో చిట్ చాట్ లో భాగంగా మాట్టాడుతూ.. ‘ సీఎం రేవంత్ కు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు ఉన్నాయి. అందుకే సీఎం కామెంట్స్ ను మంత్రులు ఎవరూ సమర్థించలేదు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ రెండుగా చీలిపోయింది. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు బాధపడుతున్నారు. మంత్రి వర్గ విస్తరణను సీఎం రేవంత్ అడ్డుకుంటున్నారు. కొత్తగా వచ్చేవారు సైతం వ్యతిరేకంగా ఉంటారని సీఎం రేవంత్ భావన. అందుకే గందరగోళ నివేదికలు హైకమాండ్ కి పంపి అడ్డుకుంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎక్కడ బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సి వస్తుందోనని జగన్నాటకం ఆడుతున్నారు. రేవంత్ లోపాలు, తప్పిదాలు అన్ని హైకమాండ్ దగ్గర ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే సీఎంను మార్చాలని హైకమాండ్ ఎదురుచూస్తోంది’ అని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
లక్ష్మికి ఇందిరమ్మ ఇల్లు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: జోడో యాత్రలో భాగంగా 2023 మార్చి 18న కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామం మీదుగా వెళుతూ కూలిపోయిన ఇంటిని చూసిన అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. తాము అధికారంలోకి రాగానే ఇల్లు కట్టిస్తామని భిక్కనూరు లక్ష్మికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే విషయంపై ‘రేవంతన్నా.. నన్ను యాది మరువకు’ శీర్షికన ‘సాక్షి’ మెయిన్ ఎడిషన్‌లో ప్రచురించిన కథనంపై సీఎం స్పందించారు.ఉన్నతాధికారులను ఆదేశించడంతో రెవెన్యూ అధికారులు అదే రోజు లక్ష్మి ఇంటికి వెళ్లి ఇల్లు మంజూరుకు ప్రతిపాదనలు పంపుతున్నట్టు చెప్పారు. అయితే ఎన్నికల కోడ్ రావడంతో లక్ష్మికి ఇల్లు మంజూరు కాలేదు. ఇందిరమ్మ ఇళ్ల పథకం రూపుదిద్దుకోవడంతో భిక్కనూరు లక్ష్మితోపాటు చిట్యాల రాజమణి, భిక్కనూరు రేణుకలకు కూడా ప్రత్యేక కేసు కింద ఈ ఏడాది జనవరి 28న ఇళ్లు మంజూరయ్యాయి. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పథకం ద్వారా మంజూరైన పత్రాలను గురువారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ లక్ష్మితోపాటు మరో ఇద్దరికి అందజేశారు. ఇంటి నిర్మాణం కోసం కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. ‘సాక్షి పేపర్ల నాకు సీఎం సారు ఇచ్చిన హామీ గురించి రాసిండ్రు. ఇచ్చిన మాట నిలుపుకున్న రేవంత్‌రెడ్డి సారుకు కృతజ్ఞతలు’ అంటూ భిక్కనూరు లక్ష్మి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. చదవండి: మంత్రి కొండా సురేఖకు అభినందనలు తెలిపిన కేటీఆర్ -
‘హైదరాబాద్‌లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నాం’
హైదరాబాద్: వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈరోజు(శుక్రవారం) విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా ఈ ఏడాది అత్యధికంగా 17, 162 మెగా వాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుందని సీఎం రేవంత్ కు అధికారులు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందన్నారు.2025- 26 లో 18,138 మెగావాట్లకు డిమాండ్ పెరుగుతుందని, 2034..35 నాటికి 31,808 మెగావాట్ల కు విద్యుత్ డిమాండ్ చేరుకుంటుందన్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నట్లు సీఎం రేవంత్ కు అధికారులు వివరించారు.ఈ మేరకు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలి. రైల్వే లైన్లు, మెట్రో , ఇతర మాస్ ట్రాన్స్ పోర్ట్ ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. కొత్త గా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలి. భవిష్యత్తులో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్‌గా మారబోతోంది.హైదరాబాద్ లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్ లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపైన హెచ్ఎండీఎ తో సమన్వయం చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేసుకోవాలి. విద్యుత్ లైన్ల ఆధునీకరణ పైన దృష్టి సారించాలి. ఫ్యూచర్ సీటీ లో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలి. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కనిపించడానికి వీలులేదు..హై టెన్షన్ లైన్ల ను కూడా అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలి. సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ను తీసుకురావాలి. 160 కిలో మీటర్ల అవుటర్ రింగ్ రోడ్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేయాలి. జీహెచ్ఎంసీ పరిధిలోని పుట్ పాత్ లు, నాలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలి’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
హరీష్‌రావు నివాసానికి వెళ్లిన కేటీఆర్.. కారణం ఇదే!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్‌రావు నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు హరీష్‌తో భేటీ అయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన హరీష్ రావు తండ్రి ఆరోగ్య వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. కోకాపేట హరీష్‌రావు నివాసంలో సమావేశమైన ఇరువురు నేతలు.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.హరీష్ రావు పార్టీ మారతారన్న ప్రచారంపై సైబర్ సెల్‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాను పార్టీ లైన్ దాటనని ఇటీవల హరీష్‌రావు ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీష్‌రావు మరోసారి స్పష్టం చేశారు. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించిన కానీ.. పని చేస్తానని హరీష్‌రావు తెలిపారు. వరంగల్ సభ తర్వాత పార్టీలో హరీష్‌రావు ప్రాముఖ్యత తగ్గిందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మండిపడుతోంది. దీంతో నేరుగా హరీష్ రావుతో మాట్లాడి సమస్యకు పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కేటీఆర్ సమావేశమైనట్లు సమాచారం. -
కాళేశ్వరం కమిషన్ నిర్ణయం.. వారిని బహిరంగ విచారణకు పిలవొద్దు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. బహిరంగ విచారణకు పొలిటికల్ లీడర్లను విచారణకు పిలువొద్దని కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో కేసీఆర్, హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు ఊరట లభించినట్లైంది. లీగల్ సమస్యలు రాకూడదనే ఉద్దేశ్యంతో వారిని విచారణకు పిలవకూడదని నిర్ణయం తీసుకుంది. డాక్యుమెంట్ ఆధారాలతో కమిషన్ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది. దాదాపు 4వందల పేజీల రిపోర్ట్‌ను కమిషన్ తయారు చేసింది. ఈ నెల 20వ తేదీ తర్వాత ప్రభుత్వానికి కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ రిపోర్ట్ ఇవ్వనుంది.కాగా, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం కమిషన్ గడువును ఈ నెల 31 వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో లోపాలపై విచారణ కోసం ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కమిషన్‌ను నియమించగా, 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. ఆ తర్వాత క్రమంగా కమిషన్ గడువును పొడిగిస్తూ వచ్చింది. రిపోర్ట్ రెడీ కాకపోవడంతో గడువును మే 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. -
‘సురేఖ వ్యాఖ్యల ఎఫెక్ట్.. రేవంత్ కమీషన్ల సంగతేంటి?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రులు కమీషన్లు తీసుకోకుండా సంతకాలు చేయరు అని మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. దీంతో, ఆమె వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. ఏయే మంత్రి ఎంత కమీషన్లు తీసుకున్నారో దర్యాప్తు చేపట్టాలని రేవంత్ సర్కార్‌ను డిమాండ్ చేశారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కొండా సురేఖ మంత్రులు కమిషన్లు తీసుకోవడం కామన్ అనడం బాధాకరం. అంటే రాష్ట్రంలో మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని ఒప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఇదే డిమాండ్ చేస్తున్నాం. ఏయే శాఖ మంత్రి ఎంత తీసుకున్నారో దర్యాప్తునకు ఆదేశించాలి. మంత్రులు తీసుకున్న కమీషన్లు బయట పెట్టాలి అని వ్యాఖ్యలు చేశారు.రాజకీయాలకు అతీతంగా తిరంగా యాత్ర..ఇదే సమయంలో తిరంగా యాత్రపై మాట్లాడుతూ.. పహల్గాం ఘటనలో 26 మందిని ఉగ్రమూకలు హతమార్చారు. మానవత్వం లేకుండా పిల్లల ముందు తండ్రిని, భార్య ముందు భర్తను పేర్లు అడిగి హతమార్చారు. మానవ సమాజానికే సవాల్ గా మారిన ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పాకిస్తాన్లో 9 ఉగ్రవాద స్థావరాలను పేల్చివేశాం. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేయడం జరిగింది. ఉగ్రవాద చర్యలతో మనదేశం బలవుతూనే ఉంది. జమ్ముకశ్మీర్‌లోనే 46 వేల మందిని ఉగ్రమూకలు బలితీసుకున్నాయి. మన సైనికులు నూతన చరిత్రను ప్రారంభించారు.గతంలో ఉగ్రమూకలు దాడి చేసినప్పుడు.. మరణించినవారి ఫోటో దగ్గర గులాబీ పువ్వు పెట్టడం వరకే పరిమితం అయ్యే వాళ్ళం. 2009లో 40 మందిని ఊచకోత కోశారు. భారత్‌పై దాడి చేస్తే ప్రతీకారం ఎలా ఉంటుందో చూపించాం. ఉగ్రవాదుల శిక్షణ కార్యక్రమాలు, ఉగ్రవాదుల నివాసాలను ధ్వంసం చేశాం. కరడుకట్టిన ఉగ్రవాదులను అంతం చేశాం. పాకిస్తాన్ పిల్ల చేష్టలతో దాడికి ఒడిగట్టింది.. భారత సైన్యం తిప్పికొట్టింది. ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. ఇంకా కొనసాగుతోంది. రక్షణ రంగంలో ప్రతి సైనికుడు రాణించారు. S-400, బ్రహ్మాస్త్రం పనితీరు దేశ ప్రజలు గమనించారు. భారత ఆర్మీకి అన్ని రకాలుగా సమకూర్చడం జరిగింది.ఆర్మీకి అవసరమైన వాటిలో 35 శాతం మనమే సమకూర్చుకున్నాం. మిథానీ, DRDAలో వసతులు మెరుగు పరుస్తున్నాం. ఆర్డినెన్సు ఫ్యాక్టరీలను మరింత సంసిద్ధం చేసుకున్నాం. పాకిస్తాన్‌ను ప్రపంచం ముందు దోషిగా నిలబెడతాం. భారత సైనికులు అనుసరించిన స్ట్రాటజీని ప్రపంచం మొత్తం చూసింది. రాజకీయాలకు అతీతంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఆహ్వానిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. -
‘కొండా సురేఖకు నా అభినందనలు’: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. మంత్రులు కమిషన్లు తీసుకోకుండా ఏ పనిచేయరంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ‘కనీసం ఇప్పటికైనా కొన్ని నిజాలు బయట పెట్టినందుకు మంత్రి కొండా సురేఖకు నా హృదయపూర్వక అభినందనలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘కమీషన్ సర్కార్’గా మారిపోయింది. ఇది రహస్యమే కాదు. ఓపెన్ సీక్రెట్. అంతేకాదు, ఈ ప్రభుత్వంలో ఫైల్స్‌పై సంతకం చేసేందుకు మంత్రులు, వారి సహచర మంత్రులు 30శాతం కమిషన్ తీసుకుంటున్నారు. ఇదే కమిషన్ల వ్యవహరంలో సచివాలయంలో పలువురు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన విషయం గుర్తుందా? అని ప్రశ్నించారు. ఆ ఘటనే ఈ ప్రభుత్వంలో మంత్రుల కమిషన్ల భాగోతాన్ని బహిర్గతం చేసింది. ఈ సందర్భంగా కొండా సురేఖని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కమిషన్లు తీసుకుంటున్న మంత్రుల వివరాల్ని బయటపెట్టాలి. ప్రజల ముందు బహిర్ఘతం చేయాలని అన్నారు. ఇదే అంశంపై రాహుల్ గాంధీ,రేవంత్‌రెడ్డిలు వారి సొంత కేబినెట్ మంత్రి చేసిన ఆరోపణలపై మీరు దర్యాప్తుకు ఆదేశించగలరా?’అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. Many congratulations to Minister Konda Surekha garu for finally speaking some truths!Congress in Telangana runs a “commission sarkaar”, and it's unfortunate this has become an open secret in TelanganaIn this 30% commission government, ministers, according to their own… https://t.co/3dMd2yDfb5— KTR (@KTRBRS) May 16, 2025 -
మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పనిచేయరూ అంటూ ఆమె చేసిన బహిరంగ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. వరంగల్‌లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో రూ.5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.‘నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైల్స్ వస్తుంటాయి. మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేస్తుంటారు. నేను అలా చేయను.. సమాజ సేవే చేయమంటాను. నాకు నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పా. స్కూల్ డెవలప్మెంట్ చేయమని కోరా’ అని వ్యాఖ్యానించారు. అయితే, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. నేను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ.. అయితే, తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం కావడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. ‘నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. నేను వరంగల్‌లో చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. ప్రతి ఫైలుకు డబ్బులు తీసుకున్నారో లేదో గత ప్రభుత్వంలోని మంత్రులకు తెలుసు. నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారు. నేను మాట్లాడిన దాంట్లో ముందు వెనక కట్ చేసి చిన్న క్లిప్‌లను కావాలని ట్రోల్ చేస్తున్నారు. మా కేబినెట్ మంత్రుల మధ్య గొడవలు పెట్టాలని కొందరు కుట్ర చేస్తున్నారు. పని చేస్తున్న మంత్రులపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక్కో మెట్టు ఎక్కి మంత్రినయ్యాను నాపై తప్పుడు ప్రచారాలు చేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టను. గత ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్ధమా? ఎక్కడికి వస్తారో రండి’ అంటూ సవాల్ విసిరారు. -
కోటి ఇస్తావా.. ఫొటోలు అప్లోడ్ చేయమంటావా?
సాక్షి, బంజారాహిల్స్: నీ భార్య ఫొటోలు డిలీట్ చేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలి. ఓ డ్రైవర్ తన యజమానిని బ్లాక్మెయిల్ చేసిన సంచలన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.బంజారాహిల్స్ పోలీసుల కథనం మేరకు.. ఆసిఫ్‌నగర్ అహ్మద్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఇప్తేకర్ అహ్మద్ జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త వద్ద డ్రైవర్‌గా పని చేసేవాడు. సదరు యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇప్తేకర్ అహ్మద్ ఆమెతో కలిసి ఉన్నప్పుడు ఫొటోలు తీసుకున్నాడు. ఆమె నగ్న చిత్రాలు, వీడియోలను తీసి తన ఫోన్లో సేవ్ చేసుకున్నాడు. ఆ ఫొటోలను తన యజమానికి పంపించి మీ భార్య నగ్న చిత్రాలు, వీడియోలతో పాటు తనతో కలిసి ఉన్నప్పుడు దిగిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో, ఇతర వెబ్సైట్లలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. అంతేగాక గతంలో యజమాని ఇంటికి వచ్చి బెదిరించగా ఆయన డయల్ 100కు ఫోన్ చేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.కొన్నాళ్లుగా వేధింపులు తీవ్రతరం చేసిన ఇప్తెకార్ ఆహ్మద్ యజమానికి వాట్సాప్‌లో భార్య ఫొటోలు, నగ్న చిత్రాలు పంపుతూ, వెంటనే వాటిని తొలగిస్తుండటం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సదరు వ్యాపారవేత్త గత నెలలో తన న్యాయవాది ద్వారా ఇప్తేకర్ అహ్మద్‌కు ఫోన్ చేయించి వేధింపుల విషయమై అడిగించాడు. బంజారాహిల్స్‌లోని ఓ కేఫ్‌కు రావాలని యజమానికి సూచించాడు. అక్కడికి వెళ్లిన యజమానిని మీ భార్యకు విడాకులు ఇవ్వాలని, లేదా ఖులా (భర్త నుంచి విడాకులు) అడగాలని బెదిరించాడు. అలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడవద్దని, బ్లాక్మెయిల్ చేయవద్దని అతను కోరినా పట్టించుకోకుండా అసభ్యంగా దూషించాడు. ముగ్గురు పిల్లలను చంపి భవిష్యత్తు లేకుండా చేస్తానని బెదిరించాడు. ఫోన్లో సేవ్ చేసిన ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయాలంటే రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మహ్మద్ ఇఫ్తేకర్ అహ్మద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘సరస్వతి’ పునాదిగా పుష్కర వేడుకలు
కాళేశ్వరం నుంచి సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘సరస్వతి పుష్కరాలు పునాదిగా త్వరలో వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. మేడారం సమ్మక్క సారలక్క జాతరను ఘనంగా జరిపిస్తాం. తెలంగాణ ప్రభుత్వం నా హయాంలో ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నదులను పూజించడం మన సంస్కృతి, సంప్రదాయమని, అందుకే నదులను దేవతలు, దేవుళ్లుగా పూజిస్తున్నామని చెప్పారు. జేఎస్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో గురువారం ప్రారంభించిన సరస్వతి పుష్కర వేడుకల్లో రేవంత్ పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సాయంత్రం 4.12 గంటలకు కాళేశ్వరం చేరుకున్న రేవంత్ రెడ్డికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ సరస్వతి ఘాట్‌ను ప్రజలకు అంకితం చేశారు. ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన వేదికపై నుంచి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. మెదక్ జిల్లా రంగంపేటకు చెందిన మాధవానంద సరస్వతిస్వామిజీ ప్రారంభించిన పుష్కరాలు ఈ నెల 26 వరకు కొనసాగుతాయి. కాళేశ్వరం అభివృద్ధికి రూ.200 కోట్లు మంథని నియోజకవర్గానికి పెద్ద చరిత్ర ఉందని, దేశ ఆర్థికాభివృద్ధికి ఆద్యుడైన పీవీ నరసింహారావు మంథని నుంచి గెలిపొందారని రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రపంచంలో మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేసిన ఆయన మంథని ప్రాంతానికి ఎంతో చేశారన్నారు. రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులను తేవడంలో మంత్రి శ్రీధర్‌బాబు కృషి చాలా గొప్పదని కొనియాడారు. మంథని నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కష్టపడే శ్రీధర్ బాబును ప్రజలే కాపాడుకోవాలన్నారు. ఆయన సేవలు రాష్ట్రం యావత్తు అవసరమని, ఆయన నియోజకవర్గ అభివృద్ధికి తక్కువ సమయం కేటాయించి, రాష్ట్ర అభివృద్ధికి ఎక్కువ సమయం కేటాయించాలని సూచించారు. కాళేశ్వరాన్ని గొప్పగా అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్లు కావాలని శ్రీధర్‌బాబు అడిగారని, కానీ తాము రూ.200 కోట్లయినా వెచి్చస్తామని రేవంత్ చెప్పారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని హమీ ఇచ్చారు. కాళేశ్వరం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని మంత్రి సురేఖ, ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్‌లను కోరుతున్నానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి గ్రీన్ చానల్లో నిధులు విడుదల చేస్తామని చెప్పారు. టెంట్ సిటీ వద్ద గంటసేపు.. హెలిప్యాడ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి వీఐపీ ఘాట్ సమీపంలో భక్తులకోసం ఏర్పాటు చేసిన టెంట్ సిటీకి చేరుకున్నారు. రేవంత్ సుమారు గంటపాటు టెంట్ సిటీలో గడిపారు. పుష్కరాల ఏర్పాట్లు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులతో పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. పుష్కర ఘాట్ త్రివేణి సంగమం ఒడ్డున ఏర్పాటు చేసిన 17 అడుగుల సరస్వతీ మాత విగ్రహం, రెండు వైపుల చతుర్వేద మూర్తుల విగ్రహాలను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం త్రివేణి సంగమంలో మంత్రులతో కలిసి పుష్కర పుణ్యస్నానం ఆచరించారు.తర్వాత శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి, శుభానందదేవిని, ప్రౌడ సరస్వతి మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఎం, మంత్రులు, వారణాసి నుంచి వచ్చిన అషుతోష్ పాండే, 8 మంది వేద పండితుల బృందం ఆధ్వర్యంలో మహా సరస్వతి నవరత్న మాలిక హారతి ఇచ్చారు. శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎంపీని ఆహ్వనించలేదని నిరసన భూపాలపల్లి: సరస్వతి పుష్కరాలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వనించలేదంటూ అతడి వర్గీయులు నిరసన చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి పుష్కర ఘాట్ వద్ద సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సమయంలోనే చెన్నూరు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు సభాస్థలి ఎదుట నిలబడి ఫ్లెక్సీలతో నిరసన చేపట్టారు. ఈ క్రమంలో సీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక నాయకుడిపై చేయి చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపం భక్తులు, మీడియా, వీఐపీలకు ఇబ్బందికరంగా మారింది. -
‘కంచ’ను రిజర్వు ఫారెస్టుగా ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను వన్యప్రాణుల రక్షణ చట్టం–1972 నిబంధనల మేరకు రిజర్వు ఫారెస్టుగా ప్రకటించేలా కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) సిఫార్సు చేసింది. భూమి నిర్వహణను కూడా అటవీ శాఖకు అప్పగించాలని అభిప్రాయపడింది. కంచ గచ్చిబౌలి భూ వివాదంపై సుప్రీంకోర్టు సిద్ధాంత దాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార కమిటీ గురువారం సుప్రీంకోర్టుకు మరో నివేదికను అందజేసింది. ‘400 ఎకరాలపై ఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనాన్ని పరిశీలించగా.. 56 శాతం అటవీ ప్రాంతమేనని తేలింది.ఇందులో కూడా 7.08 శాతం దట్టమైన అడవి (70 లేదా అంతకంటే ఎక్కువ శాతం చెట్లు), 31.89 శాతం మధ్యస్థ అడవి (70శాతం కంటే తక్కువ 40 శాతం కంటే ఎక్కువ చెట్లు), 17.17 శాతం బహిరంగ అడవి (10–40 శాతం చెట్లు) ఉన్నాయి. ఇదంతా చెట్ల నరికివేతకు ముందు. ఈ గణాంకాలు తెలంగాణ సర్కార్ చెప్పిన దానికంటే చాలా ఎక్కువ. 1.44 శాతం దట్టమైన అడవి, 7.99 శాతం మధ్యస్థ అడవి, 9.5 శాతం బహిరంగ అడవి.. అని సర్కార్ పేర్కొంది. చెట్ల నరికివేత తర్వాత.. ఈ గణాంకాలు 0.002 శాతం దట్టమైన, 0.61శాతం మధ్యస్థ, 7.92 శాతం బహిరంగ అడవిగా ఉన్నాయని పేర్కొంది.ఆకుపచ్చ జీవవైవిధ్యానికి ప్రాముఖ్యత‘2,300 ఎకరాల భూమిలో గొప్ప జీవవైవిధ్యం దాగిఉంది. ఇది పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుంది. ఈ భూమిని కన్జర్వేషన్ రిజర్వ్‌గా లేదా డీమ్డ్ ఫారెస్ట్‌గా ప్రకటించి, అత్యున్నత స్థాయి రక్షణ కల్పించడంపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక పార్కు కోసం పాక్షికంగా తొలగించిన చెట్లను నాటి పునరుద్ధరణ పనులు చేపట్టాలి. ఎలాగూ వర్షాకాలం వస్తోంది కనుక స్థానికంగా ఎదిగే చెట్లు, పొద జాతులను దట్టంగా నాటాలి. నేలతోపాటు తేమ పరిరక్షణ కార్యకలాపాలను చేపట్టాలి. రాష్ట్రంలోని అటవీ భూముల పరిశీలన కోసం క్షేత్రస్థాయి అటవీ అధికారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు, ఐటీ, రిమోట్ సెన్సింగ్ నిపుణులు, సర్వే ఏజెన్సీలతో కమిటీని పునర్నియమించాలి.అటవీ ప్రధాన సంరక్షణాధికారి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్, భూ యాజమాన్య విభాగాల సీనియర్ అధికారులు, న్యాయ నిపుణులు, పర్యావరణ శాస్త్రవేత్తలతో కూడిన ఉన్నతస్థాయి సమన్వయ కమిటీని వేసి ప్రభుత్వ, సంస్థాగత భూములను గుర్తించాలి. తడి భూములు (సంరక్షణ–నిర్వహణ) నియమాలు–2017 ప్రకారం.. ఈ ప్రాంతంలోని అన్ని నీటి వనరులను తడి భూములుగా రక్షించేందుకు, హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి ప్రవహించే అన్ని మురుగునీటి అవుట్లెట్ల మూసివేతకు వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లేదా మరో ప్రముఖ సంస్థ ద్వారా కంచ భూముల సమగ్ర పర్యావరణ అంచనా వేయించాలి’ అని నివేదికలో సీఈసీ సిఫార్సు చేసింది. -
నిజాయితీపరులైతే సెలవు చూసి ఎందుకు చేశారు?
సాక్షి, న్యూఢిల్లీ: ‘లాంగ్ వీకెండ్.. అదీ కోర్టుకు సెలవులున్నవి చూసుకుని ప్రీప్లాన్తోనే అక్కడ చెట్లన్నీ ధ్వంసం చేశారా? ఉద్దేశపూర్వకంగా విధ్వంసం చేసే ఆలోచన లేకపోతే పనిదినాలైన సోమవారం నుంచి ఆ పనులు చేసుకోవచ్చు కదా? మీరు చేసింది చూస్తుంటే పక్కా ప్లాన్ ప్రకారమే చేసినట్లు ఉంది’ అంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మిస్టర్ సింఘ్వీ మీరు బుల్డోజర్ల ఫొటోలు చూశారా? డజన్ బుల్డోజర్లను అంత తక్కువ టైంలో మోహరించగలరా? ధ్వంసం చేసిన ప్రాంతంలో పునరుద్ధరణ చర్యలు చేపడతారా? లేక జైలుకు వెళతారా’ అంటూ ప్రశ్నలు సంధించింది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కంచ గచ్చిబౌలి కేసు విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి; బీ ద ఛేంజ్ వెల్ఫేర్ సొసైటీ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్‌రావు; మరొకరి తరఫున న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి, వరుణ్ ఠాకూర్ వాదనలు వినిపించారు. ఎలాంటి కార్యక్రమాలు జరపట్లేదు ‘ప్రస్తుతం ఆ ప్రాంతంలో పనులన్నీ ఆపేశాం. ఆ భూముల్లో మేము ఎలాంటి కార్యక్రమాలు జరపట్లేదు’ అని ప్రభుత్వం తరపున హాజరైన సింఘ్వీ సుప్రీంకోర్టుకు తెలిపారు. అటవీ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి ఫొటోలతో కూడిన సమగ్ర నివేదికను కోర్టుకు అందజేస్తామన్నారు. చెట్లు నరికిన ప్రాంతంలోనే మొక్కలు నాటుతున్నారా అని ధర్మాసనం ప్రశ్నించగా, అక్కడ నాటడం లేదని, మరోచోట నాటుతున్న విషయాన్ని పిటిషనర్లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు.104 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిలో దాదాపు 60శాతం చెట్లు నరికివేశారని అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది కె.పరమేశ్వర్ చెప్పారు. అక్కడ చదును చేసిన ఫొటోలను సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ)కి ఇచ్చిందన్నారు. సీఈసీ అవన్నీ ధర్మాసనానికి ఇచి్చందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రిప్లై ఇస్తామంటే తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. అక్కడ చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా అని సింఘ్వీని ప్రశ్నించగా.. సెల్ఫ్ సర్టీఫికెట్ తీసుకున్నామని బదులిచ్చారు. 50 హెక్టార్లకు పైగా ఉంటేనే ఈసీ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాత్రికి రాత్రే ఎందుకు చేశారు? డజన్ల కొద్దీ బుల్డోజర్లను రాత్రికి రాత్రే అక్కడికి తరలించి వేలాది చెట్లు నరికివేయాల్సిన అవసరం ఏం వచి్చందని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పారిశ్రామిక పార్క్ నిర్మిస్తామని చెబుతూ ప్రభుత్వం అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసిందని ఎస్.నిరంజన్ రెడ్డి ధర్మాసనానికి చెప్పారు. ‘మీరు అక్కడ పారిశ్రామిక పార్క్ నిర్మిస్తారా? లేక మరే ఇతర నిర్మాణం చేస్తారా? అనేది మాకు అప్రస్తుతం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా అని మరోసారి ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘వేలాది చెట్లను నరికివేసిన వీడియోలు చూసి మేం చలించాం.బుల్డోజర్ల శబ్దాలకు జంతువులు ప్రాణభయంతో పరుగులు తీశాయి. ఆ ప్రాంతంలో పర్యావరణాన్ని పునరుద్ధరించే ఆలోచన ఉందా? లేక అక్కడే నిర్మించే తాత్కాలిక జైలుకు మీ చీఫ్ సెక్రటరీ, సంబంధిత అధికారులు జైలుకు వెళతారా? అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి’ అని చీఫ్ జస్టిస్ గవాయి హెచ్చరించారు. కంచ గచ్చిబౌలిలో అటవీ పునరుద్ధరణకు రాబోయే వర్షాకాలమే సరైన సమయమని నిరంజన్ రెడ్డి వాదించారు. హైదరాబాద్‌లో రుతుపవనాల సీజన్ జూన్ మొదటి వారం నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. అటవీ పునరుద్ధరణకు ప్రభుత్వం దగ్గర ఎటువంటి ప్రణాళిక లేదని, కావాలనే, జూలైలో వాయిదాకు కోరుతున్నారన్నారు. విచారణను జూలై 23కు వాయిదా వేసిన ధర్మాసనం.. వంద ఎకరాల పునరుద్ధరణపై ప్రణాళికను సమరి్పంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు స్కూళ్లను కూల్చివేశారు.. చెట్ల నరికివేతపై పోరాడిన 200 మంది యూనివర్సిటీ విద్యార్థులపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, కొందరిని జైలుకు పంపారని విజిల్ బ్లోయర్స్ తరపున వరుణ్ ఠాకూర్ వాదనలు వినిపించారు. అయితే ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయని, పలువురు విద్యార్థులు జైల్లో ఉన్నారని చెప్పారు. అలాగే ఈ ప్రాంతంలో మూడు స్కూళ్లను కూల్చివేశారని ఆరోపించారు. విద్యార్థులపై కేసుల్ని కొట్టివేయాలని కోరారు. అయితే స్కూళ్లను బుల్డోజ్ చేశారన్న వాదనపై జస్టిస్ గవాయి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణను మొదటిసారి వింటున్నామని సింఘ్వీ అన్నారు. ఈ అప్లికేషన్ (ఐఏ)ను ఈ కేసుతో కలిపి విచారించడం కుదరదని సీజేఐ స్పష్టం చేశారు. కావాలంటే వేరే పిటిషన్ దాఖలు చేసుకోవాలని ఆదేశిస్తూ... ఐఏను విత్‌డ్రా చేసుకునేందుకు స్వేచ్ఛనిచ్చారు. -
ఎవరు సుప్రీం?
ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతిగానీ, గవర్నర్‌గానీ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలి. ఒకవేళ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపాలను కుంటే అందుకు తగు కారణాలనూ పేర్కొనాలి. గవర్నర్ల ఆలస్యపూరిత చర్య న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుంది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా న్యాయసమీక్ష అధికారం మాకు ఉంది.సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ప్రశ్నబిల్లులకు ఆమోదముద్ర విషయంలో ఏకంగా గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితి విధించడమేంటి? గవర్నర్లు, రాష్ట్రపతి ఫలానా కాలపరిమితిలోపే నిర్ణయం వెలువర్చాలని రాజ్యాంగంలో ఎలాంటి కాలావధి ప్రస్తావన లేకపోయినా బిల్లుల విషయంలో మీరెలా కాలపరిమితిని విధిస్తారు? ఆర్టీకల్ 200, 201ను ఈ తరహాలోనే వినియోగించాలని గవర్నర్లు, రాష్ట్రపతికి మీరెలా దిశానిర్దేశం చేయగలరు?న్యూఢిల్లీ: రాష్ట్రాల శాసనసభలు పంపిన బిల్లులు గవర్నర్లు, రాష్ట్ర పతి వద్ద ఆమోదముద్ర కోసం నెలల తరబడి వేచిచూస్తున్న వైనంపై తీవ్ర అసహనం వ్యక్తంచేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వెలువర్చిన సంచలనాత్మక తీర్పు, ఆ తీర్పులో గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితి విధించిన వైనంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసాధారణ రీతిలో స్పందించారు. బిల్లులకు ఆమోదముద్ర విషయంలో ఏకంగా గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితి విధించడమేంటని సుప్రీంకోర్టుపై రాష్ట్రపతి తాజాగా ప్రశ్నల వర్షం కురిపించారు.సర్వోన్నత న్యాయస్థానం వెలువర్చిన అత్యంత కీలకమైన తీర్పుపై ఇలా రాష్ట్రపతి తీవ్ర, విస్తృతస్థాయిలో స్పందించడం, నేరుగా సుప్రీంకోర్టునే స్పందన కోరడం ఇటీవలికాలంలో ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు వెలువర్చిన తీర్పులపై సందేహాలు వెలిబుచ్చుతూ ప్రశ్నలు సంధించడం కూడా ఇదే తొలిసారి అని న్యాయరంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు. రాష్ట్ర అసెంబ్లీలు పంపిన బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం కోసం గవర్నర్ రిజర్వ్‌లో ఉంచిన నేపథ్యంలో అలాంటి బిల్లులపై మూడు నెలల్లోగా రాష్ట్రపతి తన నిర్ణయాన్ని తెలపాల్సిందేనని ఏప్రిల్ 8వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువర్చడం తెల్సిందే.దీంతో బిల్లులపై రాష్ట్రపతికి సుప్రీంకోర్టు కాలపరిమితిని విధించవచ్చా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగంలోని 143(1) అధికరణం ద్వారా తనకు దఖలు పడిన అసాధారణ అధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి తాజాగా సుప్రీంకోర్టుకు పలు ప్రశ్నలు వేశారు. రాష్ట్రపతి మొత్తంగా 14 సూటి ప్రశ్నలు వేశారు. గత నెలలో ఇచ్చిన తీర్పులో ఏముంది? తమిళనాడు శాసనసభ ఆమోదించిన కొన్ని బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ రవి ఆమోదించకుండా తన వద్దే చాలా కాలంగా పెండింగ్‌లో ఉంచడంతో డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతిగానీ గవర్నర్‌గానీ గరిష్టంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలంటూ జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌ల ధర్మాసనం తేల్చి చెప్పింది. ఒకవేళ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపాలనుకుంటే అందుకు తగు కారణాలనూ పేర్కొనాలని సూచించింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై ఎటూ తేల్చకపోతే తమను మళ్లీ ఆశ్రయించవచ్చని కోర్టు స్పష్టంచేసింది. గవర్నర్ల ఆలస్యపూరిత చర్య న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా ఈ న్యాయసమీక్ష అధికారం తమకు ఉందని కోర్టు వెల్లడించింది. ఆ 14 ప్రశ్నలు క్లుప్తంగా.. ⇒ ఆర్టీకల్ 200 ప్రకారం తన వద్దకు వచ్చిన బిల్లులపై గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఏఏ రకాలైన నిర్ణయాలు తీసుకోవచ్చు? ⇒ బిల్లులపై అన్ని రకాల ఆప్షన్లను ఉపయోగించుకుంటూ నిర్ణయాలు తీసుకునే క్రమంలో రాష్ట్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాలు, సూచనలకు గవర్నర్ ఏమేరకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది? ⇒ స్వీయ విచక్షణాధికారంతో గవర్నర్ తీసుకునే నిర్ణయాలను రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం ఎంత మేరకు న్యాయసమ్మతమైనవిగా భావిస్తారు? ⇒ ఆర్టీకల్ 200 కింద గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను సుప్రీంకోర్టు ఆర్టికల్ 361 కింద న్యాయసమీక్ష జరుపుతుందా?. రాజ్యాంగబద్ధంగా తీసుకున్న నిర్ణయాలను ఏ విధంగా సవాల్ చేయగలదు? ⇒ గవర్నర్ ఇంతకాలంలోపే నిర్ణయం వెలువర్చాలని రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేకపోయినా మీరెలా గవర్నర్‌ను ఫలానా కాలపరిమితిలోపే నిర్ణయం చెప్పాలని ఆదేశించగలరు?. ఆర్టికల్ 200ను ఈ తరహాలోనే వినియోగించాలని మీరెలా దిశానిర్దేశం చేయగలరు? ⇒ ఆర్టికల్ 201 ప్రకారం తనకు దఖలుపడిన విచక్షణాధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి వెలువర్చిన నిర్ణయాలు ఏ విధంగా న్యాయసమీక్ష పరిధిలోకి వస్తాయి? ⇒ రాష్ట్రపతి ఫలానా కాలపరిమితిలోపే నిర్ణయం వెలువర్చా లని రాజ్యాంగంలో ఎలాంటి కాలావధి ప్రస్తావన లేకపోయినా బిల్లుల విషయంలో మీరెలా రాష్ట్రపతికి కాలపరిమితిని విధిస్తారు? ఆర్టికల్ 201ను ఈ తరహాలోనే వినియోగించాలని రాష్ట్రపతికి ఏ అధికారంతో ఆదేశాలు ఇచ్చారు? ⇒ రాష్ట్రపతి సమ్మతి కోసం ఏదైనా బిల్లును గవర్నర్ పెండింగ్‌లో పెడితే ఈ బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి సుప్రీంకోర్టును సూచనలు, సలహాల కోసం సంప్రదించాలా?. ఒకవేళ సంప్రదించినా కోర్టు ఇచ్చే ఆ సలహాలు, సూచనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందా? ⇒ బిల్లులకు సంబంధించి గవర్నర్‌గానీ, రాష్ట్రపతిగానీ తీసుకున్న నిర్ణయాలు చట్టంగా మారేలోపే ఆ నిర్ణయాలను కోర్టు న్యాయసమీక్ష జరపవచ్చా?. చట్టంగా మారబోతున్న బిల్లు ల్లోని అంశాలపై కోర్టు మధ్యలోనే తీర్పులు ఇవ్వవచ్చా? ⇒ ఆర్టికల్ 142 ద్వారా తమకు దఖలుపడిన అసాధారణ అధి కారాలను ఉపయోగిస్తూ సుప్రీంకోర్టు అప్పటికే గవర్నర్లు/ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలు/ఉత్తర్వులు అమలుకాకుండా ప్రత్యామ్నాయ ఉత్తర్వులు/తీర్పులు వెలువర్చవచ్చా? ⇒ రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందినా సరే గవర్నర్ ఆమోదించని/ఆమోదం పొందని బిల్లును చట్టంగా అమలుచేయొచ్చా? ⇒ ఏదైనా చట్టం రాజ్యాంగానికి లోబడే ఉందా? లేదా? అని తేల్చి కనీసం ఐదుగురు సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాలనే నిబంధనను సుప్రీం కచ్చితంగా అమలుచేయాల్సిన అవసరం లేదుకదా? ⇒ ఆర్టీకల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు దఖలుపడిన అధికారాలు కేవలం చట్టాలు ఏ విధంగా అమలవుతున్నాయి? వంటి విధానపర నిర్ణయాలకే పరిమితమా? లేదంటే పరిపాలన, చట్టాల కూర్పు వంటి న్యాయస్థానాలేతర అంశాలకూ విస్తరించాయా? ⇒ సుప్రీంకోర్టుకు ఆర్టికల్ 131 కింద కాకుండా మరే ఇతర అధికరణం కింద రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే అధికారం ఉందా? -
ఏమీ లేకున్నా... ఇచ్చెయ్ గుర్తింపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలకు అను బంధ గుర్తింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దాదాపు అన్ని కాలేజీలకు గుర్తింపు ఇవ్వాలని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాల యం (జేఎన్టీయూహెచ్) అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రైవేటు కాలేజీల తనిఖీ నివేదికలపై వర్సిటీ అధికారులు గురువారం సమీక్షించారు. అనేక కాలేజీల్లో సరిపడా బోధకులు లేరని, మౌలిక వసతులు లేవని తనిఖీ బృందాలు పేర్కొన్నట్టు తెలిసింది. అయితే, వర్సిటీ ఉన్నతాధికారులు వీటిని పెద్దగా పరిగణనలోనికి తీసుకోకుండా, లోపా లను సరిచేసుకునేందుకుమరో అవకాశం ఇవ్వాలని మాత్రమే నిర్ణయించినట్టు సమాచారం.కాలేజీలు ప్రారంభించే నాటికి ఫ్యాకల్టీని నియమించుకోవాలని, లేబోరేటరీలు, మౌలిక వసతులు కల్పించాలని ప్రైవేటు కాలేజీలకు తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తు న్నాయి. ఫ్యాకల్టీ లేకుండా గుర్తింపు ఇవ్వడం ఏమిటని విద్యావేత్తలు, విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. గుర్తింపు ఇచ్చాక కాలేజీలు స్పందించకపోతే చేసేది ఏమీ లేదని పేర్కొంటున్నారు. ఒత్తిడా? డీలానా? ఫ్యాకల్టీ, మౌలిక వసతులు లేని కాలేజీల వల్ల విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదని అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఆగ్రహం వ్యక్తంచేసింది. తనిఖీల్లో ఈ అంశాలను ప్రధానంగా చూడాలని సూచించింది. వాస్తవానికి ఫ్యాకల్టీ, మౌలిక వసతులు లేనప్పుడు సెక్షన్లు తగ్గించడమో, గుర్తింపు నిలిపివేయడమో చేయాలి. కానీ, వీటి ఏర్పాటుకు కాలేజీలకు మరో అవకాశం ఇవ్వాలని అధికారులు నిర్ణయించా రు. ఈ మొత్తం వ్యవహారం వెనుక భారీ డీల్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒక ప్రైవేటు కాలేజీకి చెందిన వ్యక్తితో యూనివర్సిటీ కీలక అధికారి అంటకాగడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడం వల్లే అందరికీ అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి వస్తోందని ఆయన సమర్థిచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కోర్సులకు అధ్యాపకులెక్కడ? ఇంజనీరింగ్ కాలేజీలను జేఎన్టీయూహెచ్ బృందాలు కొన్ని నెలల క్రితమే తనిఖీ చేశాయి. 140 కాలేజీల్లో వాస్తవ పరిస్థితితో నివేదిక ఇచ్చాయి. 50 కాలేజీల్లో డేటాసైన్స్ బోధించేందుకు మాస్టర్ డిగ్రీ చేసిన నిపుణులు లేరని తేల్చారు. కొన్ని కాలేజీలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వారిని బోధకులుగా చూపించే ప్రయత్నం చేశాయి. వారి పాన్‌కార్డులను పరిశీలిస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తు న్నట్టు తేలింది. ఆల్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఏఐఎంఎల్ కోర్సుల్లో సీట్లు పొందిన కాలేజీల్లోనూ నిపుణుల కొరత కనిపిస్తోంది.గుర్తింపులేని సంస్థల నుంచి డిప్లొమా కోర్సులు చేసిన వారిని బోధకులుగా చూపించినట్టు తేలింది. రెండుమూడు సెక్షన్లకు ఒకే అధ్యాపకుడు ఉన్న కాలేజీల సంఖ్య 24 ఉందని గుర్తించారు. డిజిటల్ లేబొరేటరీలు పేరుకు మాత్రమే ఉంటున్నాయి. అందులో లాంగ్ లెర్నింగ్ లాంగ్వేజ్, ఇతర ప్రోగ్రామింగ్ ఫైల్స్ కూడా కన్పించడం లేదని తనిఖీ బృందాలు వర్సిటీకి నివేదించినట్టు తెలిసింది. డేటాసైన్స్‌ను విశ్లేషించేందుకు లేబోరేటరీలో అవసరమైన ప్రోగ్రామింగ్ లేదని గుర్తించారు. -
సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్‌కు నిరసన సెగ.. కాంగ్రెస్ ఎంపీ అనుచరులే
సాక్షి, జయ శంకర్ భూపాలపల్లి జిల్లా: సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం పర్యటనలో గందరగోళం నెలకొంది. ప్లకార్డులతో కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ అనుచరులు నిరసన చేపట్టారు. స్థానిక ఎంపీకి ఆహ్వానం లేదని వంశీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల్లో కూడా ఎంపీ ఫొటో పెట్టలేదని అనచరులు ఆవేదన తెలిపారు. కార్యకర్తల ఆందోళనను అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు.కాగా, సరస్వతి పుష్కరాలు సందర్భంగా గురువారం సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా సరస్వతీదేవీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పుణ్యస్నానం ఆచరించి.. సరస్వతి నవరత్న మాల హారతిలో పాల్గొన్నారు. -
గామా నైఫ్.. మెదడు చికిత్సల్లో సరికొత్త విప్లవం
మెదడులో వచ్చే సమస్యలు.. ప్రధానంగా క్యాన్సర్ మెటాస్టాటిస్ కణితులను శస్త్రచికిత్సతో తొలగించడం కష్టం అవుతుంది. అలాంటప్పుడు గామానైఫ్ చికిత్స చాలా ప్రయోజనకరం. ఇందులో రేడియేషన్ కిరణాలను కేంద్రీకరించి పంపుతారు. మొత్తం 192 గామా కిరణాలను మెదడులో ఒకేచోటుకు పంపుతారు. దీనివల్ల ప్రభావిత ప్రాంతం మీద అధికమోతాదులో రేడియేషన్ అందుతుంది. చుట్టుపక్కల కణజాలాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అత్యంత కచ్చితత్వం కోసం ఎంఆర్ఐ లేదా సీటీస్కాన్ లాంటివాటి సాయంతో ఈ చికిత్స చేస్తారు. చికిత్సకు ముందు రోగి తల కదలకుండా ఉండేందుకు ఒక ఫ్రేమ్ పెడతారు. గామా కిరణాలు సరిగ్గా ఎక్కడ పడాలో చూస్తారు. ఏమాత్రం నొప్పి లేకుండా, కొన్ని గంటల్లోనే అయిపోయే ఈ చికిత్స సమయంలో రోగి మెలకువగానే ఉంటారు. ఇందులో కోత ఉండదు కాబట్టి రక్తం పోదు, ఇన్ఫెక్షన్లు రావు, జనరల్ ఎనస్థీషియా ఇవ్వక్కర్లేదు. మెదడులో వచ్చే కణితులు (క్యాన్సర్, ఇతరాలు), రక్తనాళాలు సరిగా ఏర్పడకపోవడం, పిట్యుటరీ కణితులు, విపరీతమైన నొప్పి తదితరాలకు ఇది బాగా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. చాలామంది రోగులు అదేరోజు ఇంటికి వెళ్లి, పనులు చేసుకోవచ్చు. ఇది ఒకేసారి చేసే చికిత్స. దుష్ప్రభావాలు చాలా తక్కువ, విజయాల రేటు ఎక్కువ.రోగులకు ప్రయోజనాలివీ.. మెదడు శస్త్రచికిత్సలకు ప్రత్యామ్నాయంగా.. కోత, నొప్పి లేని పద్ధతిని గామా నైఫ్ అందిస్తుంది. దీనివల్ల రోగులకు సమస్యలుండవు, వేగంగా కోలుకుంటారు. మెదడులో ఉండే ఆరోగ్యకరమైన కణజాలాలను పాడుచేయకుండా సమస్యను మాత్రమే కచ్చితంగా తొలగిస్తుంది. చాలావరకు ఒకే సెషన్లో అయిపోతుంది. రోగులు అదేరోజు ఇంటికి వెళ్లచ్చు. ఇప్పటివరకు గామా నైఫ్ చికిత్సలు ప్రపంచంలో 10 లక్షల మందికి పైగా రోగులు పొందారు. మన దేశంలో ఇప్పటివరకు 8వేల ప్రొసీజర్లు చేశారు. కొన్నిరకాల మెదడు కణితులకు, న్యూరాల్జియా లాంటి సమస్యలకు ఇది 90% విజయాలు అందిస్తుంది. ఇందులో మిల్లీమీటర్ల స్థాయి కచ్చితత్వంతో రేడియేషన్ అందిస్తారు. దీనికి సగటున 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు పడుతుంది. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదు. చికిత్స అనంతరం 24-48 గంటల్లోనే 90% రోగులు తమ పనులు చేసుకుంటారు. వైట్ బ్రెయిన్ మెటాస్టాటిస్ కణితులు, రక్తనాళాల్లో సమస్యలు.. లాంటి 20 రకాల సమస్యలకు ఇది సమర్థవంతమైన పరిష్కారం. కిమ్స్ ఆస్పత్రిలో పెట్టినది ఒకే సెషన్లో పలు కణితులను కూడా నయం చేస్తుంది. దాంతో చికిత్స సమయం తగ్గుతుంది. న్యూరాల్జియా సమస్యకు దీంతో చికిత్స చేస్తే 48 గంటల్లోనే నొప్పి బాగా తగ్గుతుంది. మొత్తం రోగుల్లో 2% మందికి మాత్రమే కొన్ని ప్రభావాలు కనిపిస్తాయి. సంప్రదాయ మెదడు శస్త్రచికిత్సల కంటే ఇందులో దుష్ప్రభావాలు దాదాపు లేనట్లే. -
‘ఇది తెలంగాణ ఆడబిడ్డలకు అత్యంత తీవ్రమైన అవమానం’
హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన విదేశీ వనితలకు తెలంగాణ ఆడబిడ్డల చేత కాళ్లు కడిగించడాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని, మన ఆడబిడ్డల అభిమానాన్ని తాకట్టుపెట్టారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ ఆడపడుచులతో విదేశీ వనితల కాళ్లు కడిగిస్తారా? అంటూ ప్రశ్నించారు కిషన్‌రెడ్డి. ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు కిషన్‌రెడ్డి. ‘ప్రపంచదేశాల ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచాల్సింది పోయి.. వారి ముందు మన ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టేట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు. 72వ మిస్‌వరల్డ్ పోటీల్లో భాగంగా.. కల్చరల్, స్పిరిచువల్ టూర్లో పాల్గొనేందుకు.. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన రామప్ప దేవాలయానికి ప్రపంచ అందగత్తెలు వచ్చిన సందర్భంలో.. విదేశీ వనితల కాళ్లను తెలంగాణ మహిళలతో, దళిత, గిరిజన యువతులతో కడిగించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహంకారానికి నిదర్శనం. మహిళా సాధికారతకు, మహిళల ధైర్యసాహసాలకు ప్రతీక అయిన రాణి రుద్రమదేవి ఏలిన గడ్డపై, చారిత్రక రామప్ప ఆలయ ప్రాంగణంలో తెలంగాణ మహిళలను అవమానించడం దురదృష్టకరం.సమ్మక్క, సారలమ్మ పుట్టిన గడ్డపై మహిళలకు అత్యంత తీవ్రమైన అవమానం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. భారతీయులను విదేశీయుల ముందు మోకరిల్లేలా చేయడమే కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఢిల్లీలోని ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలను సంతృప్తి పరిచేందుకే రాహుల్ గాంధీ.. భారతీయ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాళ్లు కడిగించారు.‘అతిథి దేవో భవ’ మన విధానం.. కానీ అతిథిని గౌరవించే క్రమంలో మన మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించడం క్షమార్హం కాదు. విదేశీ అందగత్తెలముందు మన గౌరవాన్ని పెంచేలా వ్యవహరించి ఉంటే బాగుండేది. కానీ మన గౌరవాన్ని దిగజార్చింది. ప్రజల గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత కానీ.. దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఏమాత్రం సమర్థనీయం కాదు.ఇందుకుగానూ.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతోపాటుగా రేవంత్ రెడ్డి.. భారతీయ మహిళలకు, తెలంగాణ మహిళా సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
Miss World 2025: యాదగిరిగుట్టలో ప్రపంచ అందగత్తెలు
యాదాద్రి: ప్రపంచ హెరిటేజ్ విలేజ్ భూదాన్ పోచంపల్లి, ఆధ్మాతిక క్షేత్రమైన యాదగిరిగుట్టలో ఇవాళ ప్రపంచ సుందరీమణులు పర్యటించారు. మిస్ వరల్డ్ పోటీదారులకు ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ముందుగా పోచంపల్లిలో చేనేత ఇక్కత్, డబుల్ ఇక్కత్ చీరల తయారీ, పుట్టపాక తేలియా రుమాల్, సిద్దిపేట గొల్లభామ, నారాయణపేట, గద్వాల చీరలు, వస్త్రాలను పరిశీలించారు. ఇందు కోసం 13 స్టాళ్లను ఏర్పాటు చేశారు.చేనేత విశిష్టతను వివిధ దేశాల అందగత్తెలకు వివరించారు. మరోవైపు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృష్ణశిలతో నిర్మితమైన యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయ విశిష్టతను ప్రపంచ సుందరీమణులకు వివరించారు.కాగా, పట్టు పరికిణీలు, చీరలు కట్టుకొని తెలుగుదనం ఉట్టిపడేలా తిలకం దిద్దుకున్న ప్రపంచ దేశాల సుందరీమణులు నిన్న(బుధవారం) ఓరుగల్లు పర్యటనలో జిగేల్మన్నారు. హెరిటేజ్ వాక్‌లో భాగంగా వివిధ దేశాలకు చెందిన 57 మంది సుందరీమణులు రెండు బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్ కోట సందర్శనలో 22 మంది బుధవారం సాయంత్రం హనుమకొండకు చేరుకున్నారు. మరో బృందం ములుగు జిల్లా రామప్పలో సందడి చేసింది.సుందరీమణులకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు, సంప్రదాయ డోలు వాయిద్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు సుందరీమణులు నృత్యాలు చేశారు. అనంతరం సంప్రదాయ ప్రకారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తాంబాలంలోని చెంబులో ఉన్న నీళ్లతో సుందరీమణులు కాళ్లను కడుక్కున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న నంది విగ్రహం వద్ద ఫొటో షూట్లో పాల్గొన్నారు.అనంతరం కల్యాణ మంటపాన్ని దర్శించారు. అనంతరం ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన సుందరీమణులు వరంగల్ కోటను సందర్శించి అక్కడే ఏర్పాటు చేసిన పేరిణి శివతాండవం, ఇతర సంప్రదాయ నృత్యాలను చూసి తిరిగి హరిత హోటల్‌కు చేరుకుని డిన్నర్ చేసి హైదరాబాద్‌కు బయలుదేరారు. ములుగు జిల్లా రామప్ప ఆలయం వద్ద ప్రపంచ సుందరీమణులకు గుస్సాడీ నృత్య ప్రదర్శన, ఒగ్గుడోలు ప్రదర్శన ద్వారా కళాకారులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత చరిత్ర ఆలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పురాతన కట్టడం, వారసత్వ సంపద.. రామప్ప ఆలయాన్ని తిలకించి మంత్రముగ్ధులయ్యారు. -
రూ. 9 కోట్ల నగదు.. రూ. 8 కోట్ల విలువ చేసే నగలు స్వాధీనం!
హైదరాబాద్: నగరానికి చెందిన వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. గురువారం హైదరాబాద్ లోని వైఎస్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టింది. ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న వైఎస్ రెడ్డి.. అక్రమ అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. దీనిలో భాగంగా ఈరోజు ఆయనకు సంబంధించి పలు చోట్ల సోదాలు చేపట్టింది. ముంబైతో పాటు హైదరాబాద్ ఇలా 12 చోట్ల ఈడీ సోదాలు చేసింది. దీనిలో భాగంగా రూ. 9 కోట్ల నగదు, రూ. 8 కోట్ల విలువ చేసే నగలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 41 భవనాలకు అక్రమ అనుమతులు ఇచ్చారని ఆరోపణలకు కేసు నమోదు కాగా, దీనికి సంబంధించి సోదాలు చేశారు ఈడీ అధికారులు. బిల్డర్స్ తో కుమ్మక్కై అనధికారంగా అనుమతులు ఇచ్చినట్లు గుర్తించిన తర్వాత ఈడీ సోదాలు చేసింది. -
Hyderabad: ప్రయాణికులకు మెట్రో షాక్..!
హైదరాబాద్: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాకిచ్చింది. మెట్రో ట్రైన్ టికెట్ల ధరలను పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం తీసుకుంది. కనిష్ట ధర రూ. 10 నుంచి రూ. 12కు పెంచగా, గరిష్ట ధర రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు. తాజాగా పెంచిన ధరలు మే 17 నుంచి అమల్లోకి రానున్నట్లు ఎల్ అండ్ టీ స్సష్టం చేసింది. హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు వివరాలు ఇలా ఉన్నాయి..ప్రస్తుతం కనిష్ట ధర ₹10.. గరిష్ట ధర 60 రూపాయలురెండు కిలోమీటర్ల వరకు 12 రూపాయలునాలుగు కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయలు6 కిలోమీటర్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు 40 రూపాయలు9 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు 50 రూపాయలు12 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు 55 రూపాయలు18 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు 66 రూపాయలు21 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయలు24 కిలోమీటర్ల నుంచి ఆపై కిలోమీటర్లకు 75 రూపాయలు పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం -
‘రైతుల ప్రాణాలంటే తెలంగాణ ప్రభుత్వానికి లెక్కలేదు’
హైదరాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు చనిపోతే రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల ప్రాణాలంటే తెలంగాణ ప్రభుత్వానికి లెక్కలేదని విమర్శించారు. ఈ రోజు(గురువారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ‘40 కేజీల వరి ధాన్యం బస్తా నుంచి 4 కేజీల తరుగు తీస్తున్నారు. 13 లక్షల క్వింటాళ్ల ధాన్యం తరుగు రూపంలో పక్కదారి పడుతుంది. 6 వేల కోట్ల రూపాయల తరుగు రూపంలో రైతుల నుంచే కొట్టేస్తున్నారు. ఇది ఎవరి ఖాతాల్లో చేరుతోంది. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన రైస్ మిల్లు లు ఎన్ని ?, బ్లాక్ లిస్ట్ లో పెట్టిన రైస్ మిల్లులకు మళ్ళీ ఎందుకు ధాన్యం పంపుతున్నారు ? ,గతంలో ధాన్యం తీసుకుని సీఎంఆర్(CMR)ఇవ్వని రైస్ మిల్లులకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ?, ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం CBI తో దర్యాప్తు చేయించాలి. బీఆర్ఎస్ పాలనలో సివిల్ సప్లై శాఖలో అవినీతి జరిగిందని ఆరోపించిన రేవంత్, ఉత్తమ్... ఎందుకోసం విచారణ చేయడం లేదు ?’ అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. -
Saraswati Pushkaralu 2025: సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం పుష్కర శోభ సంతరించుకుంది. ఉదయం 5 గంటల 44 నిమిషాలకు మాధవానంద సరస్వతీ చేతుల మీదుగా మొదటి పుష్కర స్నానం లాంఛనంగా ప్రారంభమైంది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు మొదటిసారిగా జరుగుతున్నాయి. నేటి నుంచి మే 26 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరుగనున్నాయి.ఇవాళ కాళేశ్వరంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పర్యటించారు. 17 అడుగుల సరస్వతీదేవి ఏకశిలా విగ్రహాన్ని నదీ తీరంలో సీఎం ఆవిష్కరించారు. అనంతరం సీఎంతో పాటు మంత్రుల పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సరస్వతీ నది పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర-ముక్తీశ్వరుణ్ని దర్శించుకున్నారు. అనంతరం సరస్వతీ హారతి కార్యక్రమానికి హాజరయ్యారు.పుష్కరాల నిర్వహణ కోసం రూ.35 కోట్లతో ఏర్పాట్లు చేశారు. తెలంగాణా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. పుష్కర ఘాట్లు, మంచినీటి వసతి, రోడ్ల మరమ్మతులు, పార్కింగ్, పారిశుధ్యానికి ప్రాధాన్యతనిచ్చిన దేవాదాయశాఖ.. ఎండల తీవ్రత ఉన్నందున టెంట్లు, పందిర్లతో భక్తులకు సకల ఏర్పాట్లు చేసింది. సరస్వతీ పుష్కరాలతో కాళేశ్వరం త్రివేణి సంగమ శోభ సంతరించుకుంది. -
కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలిసి రావాలి: బండి సంజయ్
హైదరాబాద్: రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రానికి సహకరించలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలిసి రావాలన్నారు.తెలంగాణ రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అంశానికి సంబంధించి మాట్లాడిన బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుస్నాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైనిక స్కూల్ ను ఏర్పాటు చేయాలని గత నెలలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తికి రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు.రాష్ట్ర ప్రభుత్వం సైనిక స్కూలు ఏర్పాటు కోసం వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో అన్ని పార్టీలు కలిసి రావాలి. ఇక్కడ రాజకీయ పార్టీల వైఖరిని పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కలిసి రావాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రానికి సహకరించలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలిసి రావాలని కోరుతున్నా’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. -
తెలంగాణ : సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం (ఫొటోలు)
-
తేలని తెలంగాణ బీజేపీ గమనం
కాంగ్రెస్‌ను ‘కప్పల తక్కెడ’ అని విమర్శించే బీజేపీ (BJP), తెలంగాణ (Telangana) విభాగం పార్టీ అంతర్గత వివాదాల్లో కాంగ్రెస్‌ను మించింది. కమలంలో ఎన్ని పువ్వు రేఖలున్నాయో అంత కన్నా ఎక్కువ గ్రూపులున్నా యని పార్టీ వర్గాలే నర్మగర్భ వ్యాఖ్య చేస్తాయి. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా కొత్త అధ్యక్షుడిని నియమించుకోలేని పరిస్థితి! ఉన్న ఎని మిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో... అత్యధికులు పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానానికి పోటీ పడేవారే! వీరిలో ఒకరంటే మరొకరికి పడదు.పార్టీ జాతీయ బాధ్యులు కుదించిన రెండు, మూడు పేర్ల జాబితాల్ని అధిష్ఠానానికి సమర్పించినట్టు సమాచారం. పోయినసారి ఎన్నికల్లోనే వెనుకబడిన వర్గాల (బీసీ) వ్యక్తిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ నాయకత్వం, అదే ఒరవడిలో బలమైన బీసీ సామా జికవర్గాలను మచ్చిక చేసుకునే ‘సోషల్ ఇంజినీరింగ్’కు యత్నిస్తోంది. ముది రాజ్, మున్నూరు కాపు (బీసీ), మాదిగ (ఎస్సీ) సామాజికవర్గాలకు ప్రాధాన్యంతో ‘త్రీ–ఎమ్ ఫార్ములా’ను ముందుకు తోస్తోంది. మల్కాజ్గిరిఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ (కరీంనగర్) పేర్లను అధినాయకత్వం సీరి యస్‌గా పరిశీలిస్తోందని అంటున్నారు. ఒకరు ముది రాజ్ సామాజికవర్గానికి చెందితే మరొకరు మున్నూరు కాపు సామాజికవర్గం వారు. బండి సంజయ్ ఇది వరకు అధ్యక్షులుగా ఉండి ఇప్పుడు కేంద్రమంత్రిగా ఉన్నందున ఈటల రాజేందర్ వైపు అధినాయకత్వం కొంత మొగ్గింది. పార్టీలో తరచూ రగిలే పాత (తొలి నుంచి పార్టీలో ఉన్న), కొత్త (ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన) నాయకుల మధ్య ఉండే స్పర్థ ఒక అడ్డంకిగా మారింది. పార్టీ పాత నాయకులు పలువురు ఈ ఆలోచనను వ్యతిరేకించారు. దానికి తోడు పార్టీ నియమావళి ప్రకారం పదిసార్లకు తగ్గకుండా సాధా రణ సభ్యుడిగా, కనీసం మూడు పర్యాయాలు క్రియా శీల సభ్యుడిగా ఉన్న వారిని మాత్రమే అధ్యక్షుడిగా నియమించాలని ఉంది. తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్య క్షుడిగా అన్నామలైని నియమించే విషయంలో లోగడ ఇటువంటి అడ్డంకే వచ్చింది. ఆయన 2017లో ఏఐఏడీఎంకే పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చారు. పార్టీ నియమావళిని సడలించడం, పాత నాయకులకు నచ్చ జెప్పడం ద్వారా అధిష్ఠానం ఒక నిర్ణయం చేయవచ్చు. అలా చేస్తుందా? అన్నది ప్రశ్న. పార్టీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ (సంస్థా గత వ్యవహారాలు), సునీల్ బన్సల్ (రాష్ట్ర ఇంచార్జీ) వారివైన నివేదికలు పై వారికి (మోదీ–షా ద్వయం) ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ, ఒక్క రాష్ట్రాధ్యక్ష ఎన్నిక మినహా దాదాపు పూర్తయింది. మండల, జిల్లా స్థాయి అధ్యక్షులు ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షులు ఎన్నికై రెండు, మూడు మాసాలవుతున్నా... రాష్ట్ర అధ్యక్ష ఎన్నికతో ముడివడి ఉండటం వల్ల జిల్లా కమిటీలు ఏర్పాటు కాలేదు.మండల స్థాయి కమిటీలు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు కావాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితేనే సంస్థా గతంగా బలోపేతం చేసి, గ్రామ స్థాయి వరకు పార్టీని పటిçష్ఠపరచి, స్థానిక సంస్థలకు సమాయత్తం చేయడా నికి వీలవుతుంది. అన్ని స్థాయిల్లో మూడోవంతు మహిళలుండాలి. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమి టీల్లోనూ ‘త్రీ ఎమ్ ఫార్ములా’కు ప్రాధాన్యం ఇవ్వాలని నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రాధ్యక్ష నియామకపు చిక్కుముడి వీడితే ఈ అన్నీ ఓ కొలిక్కివస్తాయి.అంచనాల స్థాయిలో బీఆర్ఎస్ రాష్ట్రంలో పుంజు కోవట్లేదని భావిస్తున్న బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని భావిస్తున్నాయి. నిజంగానే ప్రజలు ఆ దిశలో ఆలోచించినా... ఆ పరిస్థితిని సానుకూలంగా మలచుకునే స్థితిలో పార్టీ లేదని బీజేపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ‘త్రీ ఎమ్ ఫార్ములా’లో భాగమైన మాదిగలను ఆకట్టుకో వడానికి గత ఎన్నికల్లోనే మంద కృష్ణ మాది గను అక్కున చేర్చుకొని ప్రధాని మోదీ ఎస్సీ వర్గీక రణకు సానుకూలత ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా, సదరు బాధ్యతను రాష్ట్రాలకు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయించడం, రాష్ట్రంలో ఆ మేర చట్టం తీసుకురావడం జరిగిపోయాయి.పార్టీని గెలిపిస్తే బీసీని సీఎంగా చేస్తామని ఎన్ని కల ప్రకటన చేస్తూ, సరిగ్గా ఎన్నికల ముందు బీసీ రాష్ట్రాధ్యక్షుడిని కారణం చెప్పకుండా అధిష్ఠానం పక్కకు తప్పించడాన్ని ఇప్పటికీ తప్పుబట్టేవారు పార్టీలో ఉన్నారు. అదే సమయంలో, నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీని నివారించి బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా చేసి, ఏడాది తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ముఖాముఖి తలపడి ఆధిక్యత తీసుకోవడం పార్టీ వ్యూహమని,అందుకే అలా చేశారని చెప్పేవాళ్లూ ఉన్నారు. వ్యూహాలు ఎత్తుగడల సంగతెలా ఉన్నా... ఢిల్లీ నాయ కత్వం స్థాయిలో రాష్ట్ర పార్టీ పని చేయటం లేదనే భావన బలంగా ఉంది. పార్లమెంటు కమిటీ హాలులో ప్రత్యేక సమావేశం పెట్టి ప్రధాని మోదీ మందలించిన తర్వాత రాష్ట్ర ఇంచార్జీ బన్సల్ మందలించింది కూడా అందుకే! ‘గోడమీద రాతల నుంచి చిన్న పోస్టర్ అతికించడం వరకు... అన్నీ డబ్బుమయం అయిపోయాయి తప్ప తెలంగాణలో ఆశించన ఫలితాలు రావట్లేద’ని ఆయన మండిపడటం వెనుక ఎంత నిజముందో పార్టీ రాష్ట్ర నాయకత్వం బేరీజు వేసుకోవాలి.-దిలీప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ -
కామెడీ పేరుతో వేషాలా.. చట్టప్రకారం శిక్ష తప్పదు: సజ్జనార్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: కామెడీ పేరుతో తెలంగాణలో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదని హెచ్చరించారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. సోషల్ మీడియా పిచ్చి మాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు.టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగాట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ఇదేం వెర్రి కామెడీ!?. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా!? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా!? . కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే #TGSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. ఇలాంటి సోషల్ మీడియా పిచ్చిమాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది’ అని హెచ్చరికలు జారీ చేశారు. ఇదేం వెర్రి కామెడీ!?సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా!? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా!? కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే #TGSRTC యాజమాన్యం ఏమాత్రం… pic.twitter.com/OBXeqmCZRp— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 15, 2025 -
తెలంగాణ సర్కార్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. పక్కా ప్లాన్ ప్రకారమే చేశారంటూ..
ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలిలో భూముల్లో చెట్ల నరికివేతపై జవాబు చెప్పాలి. పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకి వెళ్లాల్సిందే. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు అంటూ హెచ్చరించింది.తెలంగాణలో కంచె గచ్చిబౌలి భూముల అంశంపై ఈరోజు మరోసారి విచారణ చేపట్టారు. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏమిటి?. పక్కా ప్రణాళికతోనే వారాంతంలో చెట్లు నరికారు. డజన్ల కొద్ది బుల్డోజర్లు తీసుకొచ్చి చెట్లు నరికారు. సుస్థిర అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. చెట్లు నాటకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలు ఉంటాయి. అధికారులను సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. చెట్ల నరికివేతను సమర్ధించుకోవద్దు.. వాటిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి.. కంచె గచ్చిబౌలిలో పనులన్నీ నిలిపి వేశామని వెల్లడించారు. పర్యావరణం కాపాడుతూనే ఐటీ ప్రాజెక్టులు చేస్తామని చెప్పారు. రిజైన్డర్స్ దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని సింఘ్వీ కోరారు.అనంతరం, విద్యార్థుల అరెస్టు అంశాన్ని ఈ కేసులో చేర్చవద్దని తెలిపింది. విద్యార్థుల అరెస్టు అంశంపై మరొక పిటిషన్‌తో రావాలని సూచించింది. తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేసింది. తాము ఈ కేసులో పర్యావరణ విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. -
కుటుంబం కోసం భార్య జాబ్.. అనుమానంతో భర్త ఏం చేశాడంటే?
సాక్షి, పహాడీషరీఫ్: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తలపై కర్రతో బాది.. గాజుతో చేయి నరాలు కోసి ఆపై చున్నీతో ఆమె గొంతు బిగించి భార్యను భర్త హతమార్చాడు.ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ ప్రాంతానికి చెందిన జాకీర్ అహ్మద్, నాజియాబేగం(30) దంపతులు. వీరికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు సంతానం. ఆటో నడుపుతూ జీవనం సాగించే జాకీర్ సంపాదనతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో నాజియా ప్రైవేట్ జాబ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమైపె అనుమానం పెంచుకున్నాడు జాకీర్. ఆమెపై అనుమానంతో 15రోజుల క్రితం తన మకాంను బాలాపూర్ ఠాణా పరిధిలోని కొత్తపేట న్యూ గ్రీన్‌సిటీ కాలనీకి మార్చాడు.అలాగే, అనుమానంతో రహస్యంగా భార్యను గమనిస్తున్నాడు. ఈనెల 13న రాత్రి 11గంటలకు ఇంటికి వచ్చాడు. పిల్లలు మరో గదిలో ఉండగా.. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తున్నావని భార్యను జాకీర్ నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అర్ధరాత్రి భార్యతో గొడవపడి కర్రతో తలపై మోది, గొంతుకు చున్నీ బిగించి హత్యచేశాడు. రక్తపు మడుగుల్లో పడి ఉన్నా.. ఆమెపై కోపం తగ్గలేదు. కిటికీకి ఉన్న అద్దాన్ని విరగ్గొట్టి ఓ ముక్కతో ఆమె కుడిచేయి నరాలను కోసేశాడు. అక్కడి నుంచి పారిపోయి, బుధవారం ఉదయం అత్త రుబీనాబీకి ఫోన్ చేసి చెప్పాడు. తల్లి, కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా నాజియా అప్పటికే మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
Ration Card: రేషన్ కార్డులు ఎక్కడ .. జారీ ఎప్పుడు..!
వరంగల్‌కు చెందిన ఆంజనేయులు ఉపాధి కోసం రెండు దశాబ్దాల క్రితం నగరానికి వలస వచ్చి బోడుప్పల్లో స్థిర పడ్డారు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాని ఆధారంగా జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డులేదని అధికారులు గుర్తించి క్షేత్ర స్థాయి విచారణ కూడా పూర్తి చేశారు. రేషన్ కార్డు కోసం ఎంపికై జాబితాలో సైతం పేరు చేర్చారు. అయితే ఇప్పటి వరకు రేషన్ కార్డు మంజూరు కాలేదు . ఇలాంటి ఉదంతాలు సిటీలో అనేకం. అయితే ప్రభుత్వం గత రెండు నెలలుగా మీ సేవ ఆన్లైన్ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ క్రమంలో ప్రజాపాలన దరఖాస్తులతో ఎంపికైన కుటుంబాలు కూడా మళ్లీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలా? వద్దా ? అనేది తెలియక వారు సందిగ్ధంలో పడ్డారు. దీనిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని కోరుతున్నారు.సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో కొత్త రేషన్ కార్డుల కోసం ఎంపికైన కుటుంబాలకు స్పష్టత లేకుండా పోయింది. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా సమగ్ర కుటుంబ సర్వేతో రేషన్ కార్డుల కోసం ఎంపికైనా ఇప్పటికీ మంజూరు అందని ద్రాక్షగా తయారైంది. మరో వైపు తాజాగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో ఇప్పటికే ఆఫ్‌లైన్ దరఖాస్తుల ద్వారా ఎంపికైన కుటుంబాల పరిస్థితి ప్రశ్నార్ధకంగా తయారైంది. మళ్లీ ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే డబులింగ్ అయి అసలుకే ఎసరు వస్తుందన్న ప్రచారం కూడా కొనసాగుతోంది. సంబంధిత పౌరసరఫరాల అధికారులు కూడా స్పష్టత ఇవ్వక పోవడంతో పేద కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నారు.సర్వేలో 83 వేల కుటుంబాలు సరిగ్గా ఐదు నెలల క్రితం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డులు లేని సుమారు 83 వేల కుటుంబాలను గుర్తించారు. వాటిపై నిబంధనల ప్రకారం విచారణ నిర్వహించి 70 శాతం కుటుంబాలు అర్హులు అని తేల్చారు. పారదర్శకత కోసం వార్డు సభల్లో లబి్ధదారుల జాబితాను ప్రకటించిన తర్వాతనే కార్డులు మంజూరుకు సిఫార్సు చేయాలని జీహెచ్ఎంసీ భావించినప్పటికీ తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో వార్డు సభలు వాయిదా పడి ప్రక్రియ ముందుకు సాగలేదు. వాస్తవంగా గతేడాది జరిగిన ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు 5.73 లక్షల కుటుంబాల కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రభుత్వం కేవలం గ్యారంటీ పథకాల దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని, రేషన్ కార్డు దరఖాస్తులను పక్కకు పెట్టింది. సమగ్ర కుటుంబ సర్వేలో గుర్తించిన కుటుంబాలపై విచారణ జరపడంతో మిగతా కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. దీంతో వాటిపై కూడా విచారణ జరిపిస్తామని అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌ద్వారా కొత్త దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో సర్వే జాబితాపై ఎలాంటి కదలిక లేకుండా పోయింది.ఆన్లైన్ ద్వారా 2.60 లక్షల దరఖాస్తులు కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవా అన్లైన్లో ఇప్పటి వరకు సుమారు 2.60 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండటంతో ఎలాంటి క్షేత్ర స్థాయి విచారణ ప్రారంభం కాలేదు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఆదేశాలకు జారీ కాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. వాస్తవంగా సమగ్ర కుటుంబ సర్వేలో గుర్తించిన అర్హత గల కుటుంబాల జాబితా కూడా జీహెచ్ఎంసీ నుంచి పౌరసరఫరాల శాఖకు అందక పోవడం, మరోవైపు ఆన్లైన్ దరఖాస్తులపై కనీసం విచారణ ప్రారంభం కాకపోవడం వెరసి కొత్త రేషన్‌కార్డుల జారీపై సందిగ్ధత నెలకొంది.