
కృష్ణా: తెలంగాణలోని నారాయణపేట జిల్లా కృష్ణా మండలం కూసుమర్తి గ్రామీ సమీపంలోని భీమా నదిలో శనివారం మధ్యాహ్నం మొసలి ఒక రైతుపై దాడి చేసి నీటి మడుగులోకి లాక్కెళ్లింది.
వివరాలివి.. కూసుమూర్తికి చెందిన రైతు జింకల తిప్పన్న(55), శివప్ప గౌడకలిసి తిప్పన్న వరి నారుమడి పోవడానికి .. తన పొలం పక్కన ఉన్న భీమా నదిలో మోటారు బిగించడానికి వెళ్లాడు. ఈ క్రమంలో నీటి మడుగులో మోటార్ వద్ద చెత్త ఉండటంతో.. దానిని తొలగించడానికి నీటిలోకి వెళ్లాడు. అదే సమయంలో అక్కడే ఉన్న మొసలి తప్పణ్ణపై దాడి చేసింది.
ఆయన కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు వచ్చి రక్షించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే మొసలి తిప్పణ్ణను పూర్తిగా నీటిలోకి లాక్కెళ్లింది. ఇంతవరకు ఆచూకీ దొరకలేదు.