
తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి

గురువారం తెల్లవారుజామున మాధవానంద సరస్వతీ స్వామి పుష్కరాలను ప్రారంభించారు

ఈ సందర్భంగా సరస్వతీ నది వద్ద మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక పూజలు చేశారు. త్రివేణి సంగమం వద్ద పుష్కర్ స్థానం ఆచరించి కుటుంబ సమేతంగా ప్రత్యేక అర్చనలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు దంపతులు.

సరస్వతీ పుష్కరాల్లో కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సరస్వతీ ఘాట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ పుణ్యస్నానం ఆచరిస్తారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పుష్కరాలకోసం దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది.






















