
మహిళా హెడ్‌కానిస్టేబుల్ ఇష్టారాజ్యం
సివిల్ వివాదాల్లో సైతం జోక్యం
నంగునూరు(సిద్దిపేట): ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తుండటంతో పోలీసులకు సైతం తలనొప్పులను తెస్తోంది. ఇటీవల ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధితుల ఎదుటే సిబ్బందిపై చిందులు తొక్కడంతో అక్కడే ఉన్న ఎస్‌ఐ, పోలీసులు అవాక్కయ్యారు. ఇంత జరుగుతున్నా ఆమెపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో సివిల్ వివాదాల్లో సహితం జోక్యం చేసుకుంటున్నారు.
రెండు రోజుల కిందట ఏకంగా మండల మెజి్రస్టేట్, తహసీల్దార్‌కు ఫోన్ చేసి రిజి్రస్టేషన్ ఆపాలని చెప్పడంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్.. రిసెప్షన్ గదిలో విధులు నిర్వహిస్తున్నారు. ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుగా ఆమెనే కలవాల్సిరావడం అనుకూలంగా మార్చుకున్నారు. కేసులకు సంబంధించిన ఫిర్యాదులో జోక్యం చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారం రోజుల కిందట తనపై అధికారిపై ఎస్‌ఐ, సిబ్బంది, బాధితుల ఎదుటే వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది.
రిజిస్ట్రేషన్ ఆపాలంటూ తహసీల్దార్‌కు ఫోన్..
నంగునూరుకు చెందిన ఓ వ్యక్తి తన కూతురు పేరిట రెండెకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు శనివారం స్లాట్ బుక్ చేసుకున్నాడు. రిజి్రస్టేషన్ చేయొద్దని అతని కుమారుడు అడ్డు చెప్పడంతో వివాదం రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. ఈ విషయంపై మహిళా హెడ్‌కానిస్టేబుల్ రిజి్రస్టేషన్ ఆపాలని తహసీల్దార్‌కు ఫోన్ చేయడంతో ఆశ్చర్యానికి గురైన సదురు అధికారి.. ఎస్‌ఐకి, మరో ఉన్నతాధికారికి ఫోన్ చేసిన ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
రిసెప్షనిస్ట్ విధుల నుంచి తొలగించాం
ఈ విషయమై రాజగోపాల్‌పేట ఎస్‌ఐ ఎండీ అసీఫ్‌ను వివరణ కోరగా.. మహిళా హెడ్ కానిస్టేబుల్ తహసీల్దార్‌కు ఫోన్ చేయడం నిజమేనన్నారు.
దీంతో తహసీల్దార్ సరిత తనతో పాటు ఏసీపీతో ఫోన్‌లో మట్లాడారన్నారు. ఆమెను రిసెప్షనిస్ట్ విధుల నుంచి తొలగించి సాధారణ విధులు అప్పగించామన్నారు.