HYD: డీసీఎంను ఢీకొన్నకారు.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి | Road Accident At Hayat Nagar | Sakshi
Sakshi News home page

HYD: డీసీఎంను ఢీకొన్నకారు.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

May 21 2025 6:59 AM | Updated on May 21 2025 9:35 AM

Road Accident At Hayat Nagar

సాక్షి, హయత్‌నగర్‌: హైదరాబాద్‌ నగర శివారు హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌లోని కుంట్లూరు వద్ద బుధవారం తెల్లవారుజామున అతి వేగంలో ఉన్న డీసీఎంను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను ​కుంట్లూరుకు చెందిన చంద్రసేనారెడ్డి, త్రినాద్ రెడ్డి, వర్షిత్ రెడ్డిగా గుర్తించారు. అయితే, ఇంటికి సరిగ్గా 100 మీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇంటికి చేరుకోవడానికి కొన్ని సెకన్ల ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement