
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో లుప్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానానికి ప్రమాదం తప్పింది. విమానం రన్‌వే మీదకు వెళ్లిన వెంటనే విమానం ముందు టైరులో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఈ క్రమంలో పైలట్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది.
వివరాల ప్రకారం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి ఫ్రాంక్ ఫోర్ట్ వెల్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. రన్‌వే మీదకు వెళ్లిన వెంటనే విమానం ముందు టైరులో సాంకేతిక సమస్య కనిపించింది. సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని తిరిగి మళ్లించారు. దీంతో, పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 190 మంది ప్రయాణీకులు ఉన్నారు. పైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.