
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. మంత్రులు కమిషన్లు తీసుకోకుండా ఏ పనిచేయరంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌లో ‘కనీసం ఇప్పటికైనా కొన్ని నిజాలు బయట పెట్టినందుకు మంత్రి కొండా సురేఖకు నా హృదయపూర్వక అభినందనలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘కమీషన్ సర్కార్’గా మారిపోయింది. ఇది రహస్యమే కాదు. ఓపెన్ సీక్రెట్.
అంతేకాదు, ఈ ప్రభుత్వంలో ఫైల్స్‌పై సంతకం చేసేందుకు మంత్రులు, వారి సహచర మంత్రులు 30శాతం కమిషన్ తీసుకుంటున్నారు. ఇదే కమిషన్ల వ్యవహరంలో సచివాలయంలో పలువురు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన విషయం గుర్తుందా? అని ప్రశ్నించారు. ఆ ఘటనే ఈ ప్రభుత్వంలో మంత్రుల కమిషన్ల భాగోతాన్ని బహిర్గతం చేసింది.

ఈ సందర్భంగా కొండా సురేఖని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కమిషన్లు తీసుకుంటున్న మంత్రుల వివరాల్ని బయటపెట్టాలి. ప్రజల ముందు బహిర్ఘతం చేయాలని అన్నారు. ఇదే అంశంపై రాహుల్ గాంధీ,రేవంత్‌రెడ్డిలు వారి సొంత కేబినెట్ మంత్రి చేసిన ఆరోపణలపై మీరు దర్యాప్తుకు ఆదేశించగలరా?’అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Many congratulations to Minister Konda Surekha garu for finally speaking some truths!
Congress in Telangana runs a “commission sarkaar”, and it's unfortunate this has become an open secret in Telangana
In this 30% commission government, ministers, according to their own… https://t.co/3dMd2yDfb5— KTR (@KTRBRS) May 16, 2025