ఇదొక ‘చెత్త’ సర్కారు!.. కేటీఆర్‌ ఫైర్‌ | BRS Ktr Serious Comments On Revanth Govt | Sakshi
Sakshi News home page

ఇదొక ‘చెత్త’ సర్కారు!.. కేటీఆర్‌ ఫైర్‌

Aug 18 2025 11:52 AM | Updated on Aug 18 2025 12:36 PM

BRS Ktr Serious Comments On Revanth Govt

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ పనితీరుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసిన మురుగు నీరు, చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని మండిపడ్డారు. వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా..‘ఇదొక ‘చెత్త’ సర్కారు!. రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్త కుప్పలతో హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయి. ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి.

బీఆర్‌ఎస్‌ హయాంలో వర్షాకాలానికి 2 నెలల ముందు నుంచే సీజనల్‌ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై మున్సిపల్ శాఖ, జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు సమీక్షా, సమన్వయ సమావేశాలు నిర్వహించి, ముందస్తు చర్యలు చేపట్టేవి. కానీ ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు. ప్రజలు ఈసురోమని అలమటిస్తుంటే పాలకులు మాత్రం ‘ఆర్ఆర్ ట్యాక్స్’ వసూళ్లలో బిజీగా ఉన్నారు!’ అంటూ కాంగ్రెస్‌ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అలాగే, అంతకుముందు.. రామంతాపూర్‌లో కరెంట్‌ షాక్‌ తగిలి ఐదుగురు మృతి చెందిన ఘటనపై కేటీఆర్‌ స్పందించారు. ఈ క్రమంలో కేటీఆర్‌..‘రామంతపూర్ గోఖలేనగర్‌లో శ్రీ కృష్ణాష్టమి ఊరేగింపులో జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరం. కరెంట్ షాక్‌కు గురై ఐదుగురు యువకులు మరణించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. పండుగ వేళ జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరమైనది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement