
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. నగరంలో ఈరోజు(శుక్రవారం, అక్డోబర్ 3వ తేదీ) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ సమావేశమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవల్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు కె. లక్ష్మణ్, రఘునందన్‌రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావులు పాల్గొన్నారు.
దీనిలో భాగంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ కేంద్ర ప్రభుత్వం ఇమేజ్‌ను పెంచేందుకు పార్టీలోని ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి. కేంద్ర పాలసీలకు అనుగుణంగా కోర్టలల మనం వాదిస్తామనేది కీలకం రానున్న మూడేళ్లు కీలకం. అందుకు ప్రత్యేకమైన శిక్షణ తరగతులు నిర్వహించాలి.కేంద్ర ప్రభుత్వ స్టాండ్ బలంగా వినిపించేందుకు ఎఫర్ట్ పెట్టాలి. తెలంగాణ లో అధికారంలో బీజేపీ రావాలి అంటే అందరం కలసి కట్టుగా పని చేయాలి. అర్జున్ రామ్ మేఘవల్ ఐఏఎస్‌గా ఉన్నప్పటికీ రాజీనామా చేసి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. ప్రతి శాఖ అనేక రిఫార్మ్స్ తీసుకువస్తుంది. కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలి.బ్రిటిష్ చట్టాలు ఇప్పటికి అమలు అవుతున్నాయి. వర్తమాన ప్రజల ఆలోచనలకు అనుగుణంగా చట్టాలు తేవాలని మోదీ ఆలోచన’ అని పేర్కొన్నారు.
ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘ కాలం చెల్లిన చట్టాలను మోదీ రద్దు చేశారు దేశాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేసేందుకు ఇతర దేశాలు కుట్రలు పన్నుతున్నాయి. మోదీ విజనరీ లీడర్ కాబట్టి సూక్ష్మంగా స్పందిస్తున్నారు. జీఎస్టీ తగ్గిపుతో దీపావళి వెలుగులు పేదల ఇళ్లల్లో నింపుతున్నారు. అగ్రదేశాల అడ్డగోలు టారిఫ్‌లతో తో భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తున్నాయి.ఇండియా ఎదుగుదలను చాలా దేశాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. స్వదేశీ వస్తువుల వినియోగించడం ద్వారా.. మన ఆదాయం ఇతర దేశాలకు వెళ్లకుండా ఉంటుంది. పెట్టుబడులు పెరుగుతాయి. ఇతరులకు ఉపాధి కలుగుతుంది’ అని స్పష్టం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ. ‘ త్వరిగతిన న్యాయం దక్కాలని గత చట్టాలను రద్దు చేసి.. భారత న్యాయ సంహిత చట్టాలు మోదీ సర్కార్ తెచ్చింది. హైదరాబాద్ నడి రోడ్డుపై న్యాయవాది దంపతులను నరికి చంపారు. కేసు వేసిన వాళ్లను వెనక్కి తీసుకోకపోతే హత్య చేశారు. సీబీఐ దర్యాప్తు ప్రస్తుతం జరుగుతుంది. న్యాయవాదులకు భద్రత కల్పించే చట్టాలు రావాలి’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
త్వరలో ఆపరేషన్ సిందూర్ 2.0