
హైదరాబాద్: కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కౌంటర్లకు రీ కౌంటర్లు అన్నట్లు ఇరు పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు. ఈ క్రమంలోనే బీజేపీ-కాంగ్రెస్‌లు కలిసి కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయన్న బీఆర్‌ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటరిచ్చారు. తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు.
‘ నేను జైల్లో ఉన్నప్పుడు…మా అన్న కేటీఆర్, మా బావ హరీష్ రావు ఇద్దరూ వచ్చి మన పార్టీని BJP లో విలీనం చేద్దామనుకుంటున్నాం… ఏమంటావ్!?” అని అడిగారు. మీరు విలీనం చేసుకుంటామంటే చేసుకోండి… నాకు సంబంధం లేదు. బయటకు వచ్చాక కూడా అదే చెబుతా! అని వాళ్లకు చెప్పాను.
సుమారు నాలుగైదు నెలల క్రితం జాగృతి కవిత ఈ breaking news ను ఈ రాష్ట్రంలో తనకు సన్నిహితులైన దాదాపు అన్నీ ఛానెళ్ల, పత్రికల ప్రతినిధులకు రకరకాల రూపంలో స్వయంగా లీక్ ఇచ్చింది. పాపం ఆవిడ breaking ఆవేదనను ఎవరూ అర్థం చేసుకోలేదు. సింగిల్ కాలం వార్త కూడా వేయలేదు.ఆ తర్వాత ఆమె రాసిన లేఖ లీకు అందిరికీ తెలిసిన విషయమే’ అంటూ పోస్ట్ పెట్టారు ఎంపీ చామల.
“నేను జైల్లో ఉన్నప్పుడు…
మా అన్న కేటీఆర్…
మా బావ హరీష్ రావు…
ఇద్దరూ వచ్చి మన పార్టీని BJP లో విలీనం చేద్దామనుకుంటున్నాం… ఏమంటావ్!?” అని అడిగారు.
“మీరు విలీనం చేసుకుంటామంటే చేసుకోండి… నాకు సంబంధం లేదు. బయటకు వచ్చాక కూడా అదే చెబుతా!” అని వాళ్లకు చెప్పాను.
సుమారు నాలుగైదు… pic.twitter.com/38Qrgs6NoE— Kiran Kumar Chamala (@kiran_chamala) July 26, 2025