
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్ధత, సీఎం రేవంత్ రెడ్డి చేతకాని పాలనతో పరిశ్రమలు తెలంగాణ నుంచి పారిపోతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ చేతకాని పాలనతో రూ. 2,800 కోట్ల కేన్స్ పెట్టుబడి గుజరాత్‌కు తరలిపోయిందని విమర్శించారు.
ప్రత్యక్షంగా 2 వేలమంది తెలంగాణ యువత ఉద్యోగాలకు రేవంత్ సర్కార్ గండికొట్టిందని ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్‌ఎస్ శ్రమ.. రేవంత్ చేతకానితనం వల్ల బూడిదలో పోసిన పన్నీరుగా మారిందన్నారు. ఢిల్లీకి ఏటీఎంలా రాష్ట్రాన్ని వాడుకోవడమే కాంగ్రెస్ ఏకైక అజెండా అని కేటీఆర్ మండిపడ్డారు.
ఇదొక "చెత్త" సర్కారు!
రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్తకుప్పలతో హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు కేటీఆర్ ‘‘ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. బీఆర్‌ఎస్ హయాంలో వర్షాకాలానికి 2 నెలల ముందు నుంచే సీజనల్ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై మున్సిపల్ శాఖ, జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు సమీక్షా, సమన్వయ సమావేశాలు నిర్వహించి, ముందస్తు చర్యలు చేపట్టేవి. కానీ ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు. ప్రజలు ఈసురోమని అలమటిస్తుంటే పాలకులు మాత్రం "ఆర్ఆర్ ట్యాక్స్" వసూళ్లలో బిజీగా ఉన్నారు! ’ అని విమర్శించారు.
ఇదొక "చెత్త" సర్కారు!
రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్తకుప్పలతో హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయి.
ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు… pic.twitter.com/AUkd9C4Bel— KTR (@KTRBRS) August 18, 2025