breaking news
BCCI
-
డబ్బు తిరిగి ఇచ్చేయండి.. బీసీసీఐ స్పందన ఇదే
భారత్- దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 రద్దైన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై విమర్శల వర్షం కురుస్తోంది. లక్నోలో పొగమంచు కారణంగా టాస్ పడకుండానే మ్యాచ్‌ను ముగించాల్సి వచ్చింది. ఆరుసార్లు మైదానంలోకి వచ్చి.. పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు ఆఖరికి 9.30 నిమిషాల సమయంలో.. ప్రతికూల వాతావరణం వల్ల మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.అయితే, ఉత్తర భారతంలో పరిస్థితులు తెలిసి కూడా బీసీసీఐ (BCCI) ఇలా మ్యాచ్‌ను షెడ్యూల్ చేయడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి. నవంబరు, డిసెంబరు నెలల్లో అక్కడ కాలుష్యం, పొగమంచు ఏ స్థాయిలో ఉంటుందో తెలిసినా లక్నోలో మ్యాచ్ ఎలా షెడ్యూల్ చేశారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. స్పందించిన బీసీసీఐమరోవైపు.. లక్నో మ్యాచ్ కోసం టికెట్ల రూపంలో డబ్బులు ఖర్చుచేసిన ప్రేక్షకులు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఈ మ్యాచ్ నిర్వహణకు ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) బాధ్యత వహిస్తుందని తెలిపారు.‘‘ఈ మ్యాచ్ టికెట్ల విక్రయాన్ని రాష్ట్ర అసోసియేషన్ చూసుకుంది. బీసీసీఐ మ్యాచ్ నిర్వహణ హక్కులను మాత్రమే వారికి ఇచ్చింది. మిగతా విషయాలన్ని యూపీసీఏ పరిధిలోనే ఉంటాయి’’ అని IANSకు గురువారం దేవజిత్ సైకియా తెలిపారు. తద్వారా ప్రేక్షకులకు టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో యూపీసీఏదే పూర్తి బాధ్యత అని చెప్పకనే చెప్పారు. రీఫండ్ నిబంధనల ప్రకారం.. కాగా బీసీసీఐ రీఫండ్ నిబంధనల ప్రకారం.. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దైతే టికెట్లు కొనుక్కున్న వారు.. ఆ మొత్తాన్ని తిరిగి పొందేందుకు అర్హులు అవుతారు. ఇప్పుడు బంతి యూపీసీఏ కోర్టులో ఉందన్నమాట! కాగా సొంతగడ్డపై టీమిండియా సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత కటక్‌లో భారత్ 101 పరుగులతో గెలవగా.. ముల్లన్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లో ప్రొటిస్ జట్టు 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ధర్మశాలలో మూడో టీ20లో భారత్ గెలిచి.. 2-1తో ఆధిక్యం సంపాదించింది. లక్నోలోని ఏకనా స్టేడియంలో నాలుగో టీ20 జరగాల్సి ఉండగా.. పొగమంచు వల్ల రద్దైపోయింది. ఇరుజట్ల మధ్య ఆఖరి, ఐదో టీ20కి అహ్మదాబాద్ వేదిక.చదవండి: తల్లి నగలు, ప్లాట్లు, పొలం అమ్మేశారు.. ఇప్పుడిలా! -
'ఇంతకంటే దారుణ పరిస్థితుల్లో ఆడాను.. అంపైర్ల నిర్ణయంతో షాకయ్యాను'
లక్నో వేదికగా బుధవారం జరగాల్సిన భారత్-దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 భారీ పొగమంచు కారణంగా రద్దయింది. కనీసం టాస్ వేసేందుకు వీలు పడలేదు. సాయంత్రం 6:30 గంటలకు పడాల్సిన టాస్.. పొగమంచు కారణంగా పదేపదే వాయిదా పడుతూ వచ్చింది. పొగ మంచు దుప్పటిలా కప్పేయడంతో విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోయింది. సాయత్రం 6:50 నుండి 9:25 గంటల వరకు అంపైర్లు దాదాపు ఆరుసార్లు పిచ్‌ను పరిశీలించారు. చివరకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో రాత్రి 9:25 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గాలి నాణ్యత సూచీ 400 దాటిపోవడంతో ఆటగాళ్ల ఆరోగ్య భద్రతా దృష్ట్యా అంపైర్లు ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు కామెంటేటర్ ఉన్న భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అంపైర్ల నిర్ణయంపై మండిపడ్డాడు."అంపైర్ల నిర్ణయం నన్ను షాక్‌కు గురిచేసింది. సమయం గడిచేకొద్దీ పొగమంచు తగ్గుతుందని అనుకోవడం పొరపాటు. నేను దీనికంటే దారుణమైన పరిస్థితుల్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాను. ఇక్కడ పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి" అని ఉతప్ప పేర్కొన్నాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే 3-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకోనుంది. ఒకవేళ సౌతాఫ్రికా గెలిస్తే సిరీస్ సమం కానుంది. అయితే ఈ సిరీస్‌కు భారత స్టార్ ప్లేయర్లు అక్షర్ పటేల్, శుభ్‌మన్ గిల్ దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా అక్షర్ పటేల్ మూడో టీ20కే ముందు జట్టు నుంచి తప్పుకోగా.. తాజాగా గిల్ కాలికి గాయమైంది. దీంతో అతడు ఐదో టీ20కు అందుబాటులో లేడు. అతడి స్ధానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి రానున్నారు.చదవండి: IND vs SA: క్రికెట్ వర్సెస్ కాలుష్యం.. నిజంగా ఇది సిగ్గు చేటు! -
క్రికెట్ వర్సెస్ కాలుష్యం.. నిజంగా ఇది సిగ్గు చేటు!
లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా బుధవారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయ్యింది. పొగమంచు కమ్మేయడంతో కనీసం టాస్ పడకుండానే మ్యాచ్‌ను ముగించాల్సి వచ్చింది. లక్నోలో గాలి నాణ్యత సూచీ (AQI) 400 దాటి 'హానికర' స్థాయికి చేరుకుంది.దీంతో మొత్తంగా ఆరు సార్లు మైదానంలోకి వచ్చి పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు.. చివరిసారిగా రాత్రి 9.25 సమయంలో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో బీసీసీఐ షెడ్యూల్ తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.ప్రణాళిక లోపం..!వాతావరణంపై పూర్తి నియంత్రణ ఎవరి చేతిలోనూ ఉండదు. కానీ ఉత్తర భారతదేశంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో కాలుష్యం, పొగమంచు తీవ్రత ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇది కొత్త విషయం ఏమీ కాదు. గతంలో దీపావళి తర్వాత ఢిల్లీలో జరగాల్సిన టెస్ట్ మ్యాచ్‌ను కాలుష్యంగా కారణంగా బీసీసీఐ కోల్‌కతాకు మార్చింది. అంటే బోర్డుకు అక్కడి పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉంది. కానీ ఈసారి మాత్రం ముందస్తు జాగ్రత్త తీసుకోవడంలో బీసీసీఐ విఫలమైంది. దేశవ్యాప్తంగా ఇంకా ఎన్నో వేదికలు ఉన్నప్పటికి లక్నోలోనే షెడ్యూల్ చేయాల్సిన అవసరం ఏముందని బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంతటి కాలుష్యంలో ఆడటం ఆటగాళ్లకు ప్రేక్షకులకు, అధికారులకు ప్రాణసంకటమే. ఈ మైదానంలో హార్డిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు మాస్కులు ధరించి తిరగాల్సి వచ్చింది. ఈ సిరీస్‌లో ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20లోనూ భారత ఆటగాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఇంతటి చలిలో ఆడడం ఇదే తొలిసారి అని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చెప్పుకొచ్చాడు.ఇప్పటికైనా మారాల్సిందే..భారత్‌లో క్రికెట్ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు.. కోట్లాది మంది భావోద్వేగం. తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు టిక్కెట్లు తీసుకుని మరి మైదానంకు వచ్చిన అభిమానులకు నిరాశ ఎదురవ్వడం చాలా బాధాకారం. ఇకనైనా బీసీసీఐ షెడ్యూలింగ్ చేసేటప్పుడు.. వాతావరణ పరిస్థితులు, కాలుష్య స్థాయిలను పరిగణనలోకి తీసుకుని వేదికలను ఎంపిక చేయాలని క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు.అయితే వచ్చే ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగే వైట్‌బాల్ సిరీస్‌లకు దక్షిణ, పశ్చిమ భారత నగరాలు వేదికలగా ఉన్నాయి. ఒక్క మూడో టీ20 నార్త్ ఈస్ట్(అస్సాం)లో జరగనుంది. ఈ మ్యాచ్ వేదికను బీసీసీఐ మార్చే అవకాశముంది. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఐదో టీ20 శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.ఇది రెండోసారి..అంతర్జాతీయ క్రికెట్లో పొగమంచు కారణంగా మ్యాచ్ రద్దు కావడం ఇది రెండోసారి. 1998లో ఫైసలాబాద్‌లో పాకిస్తాన్, జింబాబ్వే మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దు అయింది. ఆశ్చర్యకరంగా ఐదు రోజులూ ఆట సాధ్యం కాలేదు.చదవండి: అంధుల మహిళల క్రికెట్ జట్టుకు సచిన్ అభినందన -
వేలంలో రూ. 25.20 కోట్లు.. చేతికి రూ. 18 కోట్లు మాత్రమే!
భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ముగ్గురు ఆటగాళ్ల గురించి ప్రధానంగా చర్చ నడుస్తోంది. వీరిలో ఒకరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green).. మరో ఇద్దరు దేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు కార్తీక్ శర్మ (Kartik Sharma), ప్రశాంత్ వీర్ (Prashant Veer).రాజస్తాన్‌కు చెందిన పందొమిదేళ్ల కార్తీక్ శర్మను, ఉత్తరప్రదేశ్ ఆటగాడు ప్రశాంత్ వీర్లకు చెన్నై సూపర్ కింగ్స్ కోట్లాభిషేకం చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్‌గా సేవలు అందించే కార్తీక్ కోసం రూ. 14.20 కోట్లు.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్ కోసం కూడా అంతే మొత్తం చెన్నై వెచ్చించింది. అత్యధిక ధరఇక ఈసారి మినీ వేలంలో టాప్‌లో నిలిచిన గ్రీన్‌ను.. కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చు చేసి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా అతడు నిలిచాడు. అయితే, కోల్‌కతా వెచ్చించిన రూ. 25.20 కోట్ల మొత్తం అతడు అందుకోలేడు. వేలంలో ఈ మేర భారీ ధర పలికినా.. గ్రీన్‌కు గరిష్టంగా రూ.18 కోట్లు మాత్రమే లభిస్తాయి.కారణం ఇదేఐపీఎల్ నిబంధనల ప్రకారం మినీ వేలంలో విదేశీ ఆటగాడికి ఎంత విలువ పలికినా... ఆటగాళ్ల గరిష్ట రీటెయినింగ్ ఫీజు (రూ.18 కోట్లు) లేదా.. మెగా వేలంలో ఆటగాడికి దక్కిన మొత్తం (రూ.27 కోట్లు; రిషభ్ పంత్)కు ఇది మించరాదు. రెండింటిలో ఏది తక్కువైతే అంతే మొత్తం.. సదరు ఆటగాడికి లభిస్తుంది.ఆసీస్ ఆల్‌రౌండర్ అయిన కామెరాన్ గ్రీన్‌కు ఈ నిబంధన వర్తిస్తుంది. కాబట్టి రీటెయింగ్ ఫీజుకు సమానంగా అతడికి రూ. 18 కోట్లు దక్కుతాయి. కేకేఆర్ అతడి కోసం పర్సు నుంచి తీసిన మొత్తంలో.. మిగిలిన రూ.7.20 కోట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆటగాళ్ల సంక్షేమ నిధికి చేరతాయి. అత్యధిక పర్సు వాల్యూతో..కాగా ఈసారి అత్యధిక పర్సు వాల్యూ రూ. 64.3 కోట్లతో వేలం బరిలో దిగింది కోల్‌కతా. విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ రిటైర్మెంట్ కారణంగా అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు వీలుగా గ్రీన్ కోసం రికార్డు స్థాయిలో ఖర్చు చేసింది. అదే విధంగా శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ కోసం రూ. 18 కోట్లు, బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్ కోసం రూ. 9.20 కోట్లు వెచ్చించింది.వీరితో పాటు తేజస్వి సింగ్ (రూ.3 కోట్లు), రచిన్ రవీంద్ర (రూ.2 కోట్లు), ఫిన్ అలెన్ (రూ.2 కోట్లు), సీఫెర్ట్ (రూ.1.50 కోట్లు), ఆకాశ్‌దీప్ (రూ.1 కోటి), రాహుల్ త్రిపాఠి (రూ. 75 లక్షలు), దక్ష్ కామ్రా (రూ.30 లక్షలు), సార్థక్ రంజన్ (రూ.30 లక్షలు), ప్రశాంత్ సోలంకి (రూ.30 లక్షలు), కార్తీక్ త్యాగి (రూ.30 లక్షలు)లను వేలంలో కొనుగోలు చేసింది.ఐపీఎల్-2026కు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఇదేఅజింక్య రహానే, రోవ్‌మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువన్షి, సునిల్ నరైన్, అనుకుల్ రాయ్, ఉమ్రాన్ మాలిక్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, మనీశ్ పాండే, వరుణ్ చక్రవర్తి, రమణ్‌దీప్ సింగ్, రింకూ సింగ్ కామెరాన్ గ్రీన్, మతీశ పతిరణ, ముస్తఫిజుర్ రెహ్మాన్, తేజస్వి సింగ్ , రచిన్ రవీంద్ర, ఫిన్ అలెన్ , సీఫెర్ట్, ఆకాశ్‌దీప్, రాహుల్ త్రిపాఠి , కామ్రా , సార్థక్ రంజన్ , ప్రశాంత్ సోలంకి, కార్తీక్ త్యాగి.చదవండి: IPL 2026: కనక వర్షం.. ‘మినీ’ వేలంలో ఎవరికి ఎంత? పది జట్ల వివరాలు -
ముగిసిన ఐపీఎల్-2026 మినీ వేలం
IPL 2026 Auction LIVE Updates And Highlights: అబుదాబి వేదికగా ఐపీఎల్-2026 మినీ వేలం ముగిసింది. మొత్తం పది ఫ్రాంచైజీలు 77 స్ధానాలను భర్తీ చేశాయి. ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ నిలిచాడు. రూ.25.20 కోట్ల భారీ ధరకు అతడిని కేకేఆర్ సొంతం చేసుకుంది. అన్ క్యాప్డ్ ఆటగాళ్లు ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మలను రూ.14.20 కోట్ల రికార్డు ధరకు సీఎస్కే కొనుగోలు చేసుకుంది. వారిద్దరి కోసమే చెన్నై రూ.28 కోట్ల పైగా ఖర్చు చేసింది.👉ఆంధ్ర పేసర్ పృథ్వీ రాజ్ యర్రాను రూ.30 లక్షల కనీస ధరకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.👉పృథ్వీ షాను రూ.75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.👉హైదరాబాద్ ఆటగాడు అమన్ రావు పేరాలను రూ.30 లక్షలకు తీసుకున్న రాజస్తాన్ రాయల్స్👉ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్‌ను రూ.8.60 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.👉లుంగీ ఎంగిడిని రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.👉రాహుల్ చాహర్‌ను రూ.5.20 కోట్లకు సీఎస్కే సొంతం చేసుకుంది.👉ఆసీస్ బౌలర్ బెన్ దుర్హనియస్‌ను రూ.4.40 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది.👉ఆకాష్ దీప్‌ను, మాట్ హెన్రిలను కేకేఆర్, సీఎస్కే కొనుగోలు చేశాయి. రూ.2 కోట్ల కనీస ధరకే దక్కించుకున్నాయి.👉కివీస్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రను రూ.2 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది.👉ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లైమ్ లివింగ్‌స్టోన్‌ను రూ.13 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది.👉పృథ్వీషా, దీపక్ హుడా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.👉టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను రూ.75 లక్షలకు సీఎస్కే సొంతం చేసుకుంది. తొలి రౌండ్లో అమ్ముడుపోని సర్ఫరాజ్‌ను.. ఆఖరి రౌండ్లో చెన్నై దక్కించుకుంది.👉అమిత్ కుమార్‌ను రూ. 30 లక్షలకు ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది.👉భారత అన్క్యాప్డ్ ప్లేయర్ మంగేష్ యాదవ్‌ను రూ.5.20 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ దక్కించుకుంది.👉సైల్ ఆరోరాను రూ. 1.50 కోట్లకు ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది.👉రవిసింగ్‌ను రూ.30 లక్షలకు రాజస్తాన్ కైవసం చేసుకుంది.👉డానిష్ మలేవార్ రూ.30 లక్షలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.👉 భారత అన్క్యాప్డ్ అక్షత్ రఘువంశీని రూ.2.20 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.👉బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను రూ.9.20 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది.👉వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌ను రూ.7 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. అదేవిధంగా ఆసీస్ ప్లేయర్ మాథ్యూ షార్ట్‌ను సీఎస్కే రూ.1.50 కోట్లకు దక్కించుకుంది.👉రాహుల్ త్రిపాఠీని రూ.75 లక్షల కనీస ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది.👉శ్రీలంక స్టార్ ఓపెనర్ ఫాథుమ్ నిస్సాంకను రూ.4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.👉నమన్ తివారీని కోటిరూపయాలకు లక్నో సొంతం చేసుకుంది.👉అన్క్యాప్డ్ ప్లేయర్లు ముకుల్ చౌదరిని రూ. 2.60 కోట్లకు లక్నో, తేజస్వీ సింగ్‌ను రూ.3 కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది.కార్తీక్ శర్మకు రూ. 14. 25 కోట్లుఐపీఎల్-2026 వేలంలో మరో అన్క్యాప్డ్ ప్లేయర్ పంట పండింది. రాజస్తాన్‌కు చెందిన కార్తీక్ శర్మను రూ. 14.20 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది.యూపీ ఆటగాడికి జాక్ పాట్.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అన్క్యాప్డ్ ఆటగాడు ప్రశాంత్ వీర్‌పై కాసుల వర్షం కురిసింది. రూ.14.20 కోట్ల భారీ ధరకు సీఎస్కే కొనుగోలు చేసింది. 20 ఏళ్ల ప్రశాంత్ కోసం సీఎస్కేతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీ పడ్డాయి. కానీ చివరికి ఈ యువ ఆటగాడు సీఎస్కే సొంతమయ్యాడు.భారత వెటరన్ ప్లేయర్ విజయ్ శంకర్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.అన్క్యాప్డ్ ప్లేయర్‌కు భారీ ధర..జమ్ముకాశ్మీర్ పేసర్ అకిబ్ నబీకి ఊహించని ధర దక్కింది. రూ.30 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన నబీని రూ.8.4 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.👉విండీస్ స్పిన్నర్ అకిల్ హోస్సేన్‌ను రూ.2 కోట్ల కనీస ధరకు సీఎస్కే సొంతం చేసుకుంది.బిష్ణోయ్‌కు భారీ ధర..భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను రూ. 7.20 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.👉సౌతాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జేను రూ. 2 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.పతిరానాకు జాక్‌పాట్..శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరానాను రూ. 18 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. ఆర్సీబీలోకి కివీ స్టార్ పేసర్న్యూజిలాండ్ స్టార్ పేసర్ జాకబ్ డఫీని రూ.2 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి డకెట్..బెన్ డకెట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకోగా.. అలెన్‌ను కేకేఆర్ దక్కించుకుంది. వీరిద్దరూ రూ. 2 కోట్ల బెస్ ప్రైస్‌కు అమ్ముడుపోయారు.ముంబైలోకి డికాక్..సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్‌ను రూ. కోటి రూపాయల కనీస ధరకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.👉దీపక్ హుడా, కేఎస్ భరత్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.ఆర్సీబీలోకి వెంకటేశ్ అయ్యర్..భారత ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను రూ.7 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. అయ్యర్ కోసం కేకేఆర్, ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడ్డాయి. కేకేఆర్, లక్నో పోటీ నుంచి తప్పుకోవడంతో అయ్యర్ బెంగళూరు ఫ్రాంచైజీలోకి చేరాడు.లక్నోలోకి హసరంగశ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగాను రూ. 2 కోట్ల బెస్‌ప్రెస్‌కు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.👉ఇంగ్లండ్ క్రికెటర్ గస్ అట్కిన్సన్, కివీస్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్, లైమ్ లివింగ్ స్టోన్, అమ్ముడుపోలేదు.సర్ఫరాజ్ ఖాన్ అన్సోల్డ్భారత ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. కనీస ధర రూ.75లక్షలతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీని కొనుగోలు చేయలేదు.గ్రీన్‌కు కళ్లు చెదిరే ధర.. రూ. 25.20 కోట్లకు కేకేఆర్ సొంతంఊహించినట్లుగానే ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌పై కాసులు వర్షం కురిసింది. గ్రీన్‌ను రూ. 25.20 కోట్ల భారీ ధరకు కోల్‌కతానైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. అతడిని దక్కించుకునేందుకు మొదటిలో కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. ఆ తర్వాత రాయల్స్ పోటీ నుంచి తప్పుకోవడంతో సీఎస్కే ఎంట్రీ ఇచ్చింది. సీఎస్కే, కేకేఆర్ మధ్య తీవ్రమైన బిడ్డింగ్ వార్ జరిగింది. ఆఖరిలో సీఎస్కే రేసు నుంచి తప్పుకోవడంతో గ్రీన్ కేకేఆర్ సొంతమయ్యాడు.పృథ్వీ షా అన్‌సోల్డ్..టీమిండియా ప్లేయర్ పృథ్వీ షాకు మరోసారి నిరాశే ఎదురైంది. రూ.75 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన షాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసుందుకు ముందుకు రాలేదు. దీంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అతడితో పాటు కివీస్ వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ కాన్వే సైతం అమ్ముడు పోలేదు.ఢిల్లీకి డేవిడ్ మిల్లర్ఐపీఎల్-2026 మినీ వేలంలో అమ్ముడుపోయిన తొలి ప్లేయర్‌గా డేవిడ్ మిల్లర్ నిలిచాడు. మిల్లర్‌ను రూ.2 కోట్ల కనీస ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.మెక్‌గర్క్‌కు షాక్..ఐపీఎల్-2026 మినీ వేలం ప్రారంభమైంది. ఈ వేలంలోకి వచ్చిన తొలి ప్లేయర్‌గా ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్ నిలిచాడు. రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.మరి కాసేపట్లో ఐపీఎల్ వేలం..ఐపీఎల్-2026 మినీ వేలం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. 77 స్ధానాలను గాను ఈ వేలం జరగనుంది. ఈ వేలంలో మొత్తం 369 ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా రూ.64.30 కోట్లు ఉన్నాయి. కేకేఆర్ తర్వాత స్ధానంలో చెన్నై సూపర్ కింగ్స్(43.4 కోట్లు) నిలిచింది. పది ఫ్రాంఛైజీల్లో రూ.2.75 కోట్ల పర్స్‌తో ముంబై ఇండియన్స్ చివరిస్థానంలో ఉంది. గ్రీన్‌పై అందరి కళ్లు?ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌పై కాసుల వర్షం కురిసే అవకాశముంది. గతేడాది సీజన్‌కు దూరంగా ఉన్న గ్రీన్‌ను ఈసారి తమ జట్టులోకి తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. ముఖ్యంగా కేకేఆర్, సీఎస్కే మధ్య పోటీ నెలకొనే ఛాన్స్ ఉంది. అతడితో రవి బిష్ణోయ్, వెంకటేష్ అయ్యర్, డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి ఆటగాళ్లకు భారీ ధర దక్కనున్నట్లు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
IPL: అసలు ఎందుకీ వేలం?.. పన్నెండు ఆసక్తికర అంశాలు
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలమే హాట్‌టాపిక్. అబుదాబి వేదికగా మంగళవారం వేలం పాటకు రంగం సిద్ధమైంది. అన్ని ఫ్రాంఛైజీలలో కలిపి మొత్తం 77 ఖాళీలు ఉండగా.. 359 మంది క్రికెటర్లు పోటీలో ఉన్నారు.ఇంతకీ అసలు ఈ వేలంపాట ఎందుకు నిర్వహిస్తారు? ఆటగాళ్లను మార్చుకోకుండా.. ఆక్షన్ ద్వారానే ఎందుకు కొనుగోలు చేస్తారు? బిడ్డింగ్ ఎలా జరుగుతుంది? తదితర పన్నెండు ఆసక్తికర అంశాలు ఈ సందర్భంగా తెలుసుకుందాం!ఎందుకీ ఐపీఎల్ వేలం?లీగ్‌లో భాగమైన పది ఫ్రాంఛైజీలు.. వచ్చే సీజన్‌కు గానూ తమ జట్లను నిర్మించుకోవడం, పటిష్టం చేసుకోవడం కోసం బిడ్లు వేస్తాయి. తమ పర్సులో ఉన్న మొత్తం ద్వారా వేలంలో అందుబాటులో ఉన్న ఆటగాళ్లను కొనుగోలు చేస్తాయి.వేలం ఎవరు నిర్వహిస్తారు?భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ వేలాన్ని నిర్వహిస్తుంది. ఇండిపెండెంట్ ఆక్షనీర్ వేలంపాట పాడతారు. నిబంధనలకు అనుగుణంగా బిడ్లను పూర్తి చేసేలా చూసుకుంటారు. తొలుత పురుషులు మాత్రమే ఐపీఎల్ ఆక్షనీర్లుగా ఉండగా.. గత కొంతకాలంగా మల్లికా సాగర్ ఆక్షనీర్‌గా సత్తా చాటుతున్నారు.వేలానికి బదులు సింపుల్‌గా ఆటగాళ్లను మార్చుకోవచ్చా?ఫ్రాంఛైజీ మధ్య పోటీతత్వం, సమాన అవకాశాలు దక్కాలంటే వేలం నిర్వహణ తప్పనిసరి. పర్సులో అధిక మొత్తం కలిగిన ఫ్రాంఛైజీలు తొలుత టాప్ ప్లేయర్లందరినీ సొంతం చేసుకుంటే.. మిగతా ఫ్రాంఛైజీల జట్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.అందుకే వేలం ద్వారానే ఆటగాళ్లను సొంతం చేసుకోవడం జరుగుతుంది. అయితే, ట్రేడింగ్ ద్వారా వేలానికి ముందు ఆటగాళ్లను మార్చుకునే వెసలుబాటు కూడా ఉంటుంది.ఐపీఎల్ వేలంలోకి ఆటగాళ్లు ఎలా వస్తారు?తమ దేశ క్రికెట్ బోర్డుల అనుమతితో ఆయా దేశాల ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో కనీస ధరతో తమ పేరును నమోదు చేసుకుంటారు. ఈ క్రమంలో ఫ్రాంఛైజీలు తమకు ఆసక్తి ఉన్న ప్లేయర్ల జాబితాను సమర్పించిన తర్వాత.. అధికారికంగా ఆటగాళ్లు వేలం బరిలో నిలుస్తారు. రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఆక్షన్ పూల్‌లోకి రాలేరు.కనీస ధర అంటే ఏమిటి?ఓ ఆటగాడు తన స్థాయికి తగిన రీతిలో కనీస ధరతో వేలంలో నమోదు చేసుకుంటాడు. అన్క్యాప్డ్ ప్లేయర్లు సాధారణంగా రూ. 20 లక్షలతో వేలంలోకి వస్తారు.నిజానికి వేలంలో వివిధ స్లాబులు ఉంటాయి. అయితే, కనీస ధర ఎక్కువగా ఉన్న ఆటగాళ్లు (సాధారణంగా రూ. 2 కోట్లతో స్టార్లు మాత్రమే ఉంటారు) సెలక్షన్ గ్యారెంటీ అనేమీ ఉండదు. ఫామ్ దృష్ట్యా ఫ్రాంఛైజీలు ఒక్కోసారి కనీస ధర అత్యంత తక్కువగా ఉన్న ఆటగాళ్లను కూడా కొనుగోలు చేస్తాయి.అదే విధంగా తమ జట్టుకు అవసరమైన నైపుణ్యాలు కలిగి ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తాయి. అంతేకాదు ఆటగాడి వయసు కూడా ఇక్కడ కీలకమే.బిడ్డింగ్ వర్క్ ఎలా జరుగుతుంది?ఆక్షనీర్ ఆటగాడి పేరు చదవగానే.. సదరు ప్లేయర్‌పై ఆసక్తి ఉన్న ఫ్రాంఛైజీలు తమ పెడల్స్‌ను ఎత్తుతాయి. ఆటగాడిని దక్కించుకోవాలని భావిస్తే ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడుతూ ధరను పెంచుతూ పోతాయి. ఆఖరికి మిగతా వారితో పోలిస్తే అధిక ధర పలికిన ఫ్రాంఛైజీకే ప్లేయర్ దక్కుతాడు.పర్సు విలువ సమానమేనా?లీగ్‌లోని ప్రతి ఫ్రాంఛైజీ పర్సు విలువ సమానంగానే ఉంటుంది. తమకు కేటాయించిన మొత్తం నుంచే ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అదే విధంగా విదేశీ ప్లేయర్ల సంఖ్యకు కూడా ఓ పరిమితి ఉంటుంది.రిటెన్షన్, రిలీజ్లు!వేలానికి ముందు తాము అట్టిపెట్టుకోవాలనుకునే ఆటగాళ్ల జాబితాను ఫ్రాంఛైజీలు నిర్ణీత గడువులోగా సమర్పిస్తాయి. అదే విధంగా.. తమకు అవసరం లేదనుకున్న ఆటగాళ్లను వేలంలోకి వదులుతాయి. ఈ క్రమంలో పర్సులో మిగిలిన మొత్తం ఆధారంగా వేలంలో తమ వ్యూహాలను అమలు చేస్తాయి.అయితే, రిలీజ్ చేసిన ఆటగాడిని తిరిగి దక్కించుకునేందుకు రైట్ టు మ్యాచ్ (RTM) నిబంధన ద్వారా ఫ్రాంఛైజీలకు వెసలుబాటు ఉంటుంది. అంటే.. తాము వదిలేసిన ఆటగాడు సరసమైన ధరకే తిరిగి తమకు దొరికే క్రమంలో.. ఇతర ఫ్రాంఛైజీ ఎంత మొత్తమైతే చెల్లిస్తుందో అదే ధరకు అతడిని తిరిగి తాము కొనుగోలు చేసుకోవచ్చు.మినీ వేలం అంటే?జట్లలో స్వల్ప మార్పుల నిమిత్తం నిర్వహించేదే మినీ వేలం. రీషఫిల్‌లో భాగంగా ఫ్రాంఛైజీలు డెత్ ఓవర్ బౌలర్లు, పవర్ హిట్టర్లు, మణికట్టు స్పిన్నర్లు.. వంటి కచ్చితమైన నైపుణ్యాలున్న కొంతమంది ఆటగాళ్ల కోసం పోటీపడతాయి.అన్క్యాప్డ్ ప్లేయర్లకు కూడా భారీ మొత్తం ఎలా?అద్భుతమైన నైపుణ్యాలు కలిగి ఉండి.. తమ జట్టులో ఇమిడిపోతాడనుకుంటే అన్క్యాప్డ్ ప్లేయర్లను సైతం ఫ్రాంఛైజీలు భారీ మొత్తం వెచ్చించేందుకు వెనుకాడవు. ముఖ్యంగా ఇలాంటి యువ ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు ఎక్కువ ఆసక్తి చూపిస్తాయి. తద్వారా వారిని తమ జట్టులో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం భాగం చేసుకునే వీలు కలుగుతుంది. ఇందుకు రాజస్తాన్ రాయల్స్ గతేడాది మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీ అనే పద్నాలుగేళ్ల పిల్లాడిని రూ. 1.10 కోట్లకు కొనడం నిదర్శనం. అందుకు తగ్గట్లే విధ్వంసకర శతకంతో ఈ చిచ్చరపిడుగు సత్తా చాటాడు.అమ్ముడుపోకుండా ఉంటారెందుకు?ఫామ్‌లేమి, ఆటలో నిలకడలేకపోడం.. కనీస ధర అర్హత కంటే అధికంగా ఉందని ఫ్రాంఛైజీలు భావించడం వల్ల కొంతమంది ఆటగాళ్లు అమ్ముడుపోకుండా మిగిలిపోతారు. ఆటగాడి వయసు, వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ కూడా ఆటగాళ్ల కొనుగోలు అంశాన్ని ప్రభావితం చేశాయి.మరి ఆ ఆటగాడి పరిస్థితి ఏమిటి?తొలి రౌండ్లలో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన ఆటగాడు.. ఫ్రాంఛైజీల ఆసక్తి దృష్ట్యా తదుపరి ఆక్సిలెరేటెడ్ రౌండ్లో వేలంలోకి వస్తారు. అప్పటికీ అమ్ముడుపోకుండా ఉంటే.. ఎవరైనా ఆటగాడు గాయపడితే అతడి స్థానంలో వీరిని ఏ ఫ్రాంఛైజీ అయినా రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంటుంది. అదీ జరగదలేదంటే.. ఆసారికి సదరు ప్లేయర్ ఐపీఎల్లో భాగం కాడు.ఇక ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎంత క్రేజ్ ఉందో.. వేలానికి కూడా అంతే ఆదరణ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన ఆటగాడు, జట్ల కూర్పు తదితర అంశాల దృష్ట్యా క్రికెట్ ప్రేమికులు వేలం పూర్తయ్యేవరకు స్క్రీన్లకే అతుక్కుపోతారనడంలో అతిశయోక్తిలేదు.చదవండి: IPL 2026 Auction: ఐపీఎల్ వేలంలో మనోళ్లు 17 మంది.. అదృష్టం వరించేనా -
బీసీసీఐ కీలక ఆదేశాలు
ముంబై: ప్రస్తుత భారత జట్టులోని క్రికెటర్లు ఎవరైనా సరే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీకి దూరం కావద్దని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. అవకాశం ఉంటే అన్ని మ్యాచ్‌లు ఆడాలని... లేదా కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని సీనియర్ సెలక్షన్ కమిటీ ఆదేశించింది. కాగా డిసెంబర్ 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికాతో భారత్ చివరి టీ20 జరిగే డిసెంబర్ 19, న్యూజిలాండ్‌తో తొలి వన్డే జరిగే జనవరి 11 మధ్య సమయంలో అవకాశం ఉన్న అన్ని మ్యాచ్‌లు ఆడాలని బోర్డు తేల్చి చెప్పింది. రో-కోలకు మా త్రమే కాకుండాఇక భారత్ తరఫున ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకే కాకుండా ఇతర రెగ్యులర్ క్రికెటర్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. దక్షిణాఫ్రికాతో రెండో టి20 ముగియగానే ఆటగాళ్లకు ఈ విషయాన్ని బోర్డు వెల్లడించినట్లు సమాచారం.అదే విధంగా.. ఎవరైనా ఆటగాడు గాయంతో బాధపడుతూ ఆడలేని స్థితిలో ఉన్నట్లు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) అన్‌ఫిట్‌గా తేలిస్తేనే వారికి సడలింపు ఉంటుంది. జనవరి మొదటి వారంలో ఒకే రోజు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్, టీ20 వరల్డ్ కప్ జట్లను సెలక్టర్లు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు.. కుటుంబ సన్నిహితులు ఒకరు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతోనే జస్ప్రీత్ బుమ్రా ధర్మశాలలో మూడో టీ20 మ్యాచ్‌కు దూరమైనట్లు తెలిసింది. అంతా బాగుంటేనే అతడు తర్వాతి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు.క్రీడాసమాఖ్యల జాబితాలో బీసీసీఐ లేదు! న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)ల జాబితాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) లేదని క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పష్టం చేసారు. త్వరలో అమల్లోకి రానున్న కొత్త క్రీడా చట్టానికి సంబంధించి లోక్‌సభలో జరిగిన చర్చపై జవాబిస్తూ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. బీసీసీఐని ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చే అవకాశం ఉందా అంటూ టీఎంసీ ఎంపీ మాల రాయ్ అడిగిన ప్రశ్నకు మాండవీయ సమాధానమిచ్చారు. చదవండి: IND vs SA: అక్షర్ పటేల్ స్థానంలో అతడే.. బీసీసీఐ ప్రకటన -
BCCI: అక్షర్ పటేల్ స్థానంలో అతడే
సౌతాఫ్రికాతో జరిగే చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా అతడు ఈ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ధ్రువీకరించింది.సఫారీ జట్టుతో నాలుగో టీ20 కోసం జట్టు సహచరులతో పాటు లక్నోకు వచ్చినా... వైద్యుల సూచనల మేరకు తర్వాతి మ్యాచ్‌లు ఆడరాదని అక్షర్ (Axar Patel) నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన అక్షర్ ధర్మశాలలో జరిగిన మూడో టీ20లో కూడా బరిలోకి దిగలేదన్న సంగతి తెలిసిందే.అక్షర్ స్థానంలోమరోవైపు.. అక్షర్ స్థానంలో మరో లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ షహబాజ్ అహ్మద్ (Shahbaz Ahmed)ను సెలక్టర్లు ఎంపిక చేశారు. బెంగాల్‌కు చెందిన 31 ఏళ్ల షహబాజ్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 3 వన్డేలు, 2 టీ20లు ఆడి మొత్తం 5 వికెట్లు పడగొట్టాడు. హాంగ్జూలో జరిగిన 2023 ఆసియా క్రీడల్లో అతను చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఇదిలా ఉంటే.. స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆల్ ఫార్మాట్ల సిరీస్‌తో బిజీగా ఉన్న టీమిండియా.. టెస్టుల్లో 2-0తో వైట్‌వాష్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకుని ఊరట పొందింది. 2-1తో ఆధిక్యం ఈ క్రమంలో కటక్ వేదికగా తొలి టీ20లో సఫారీలను 101 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన భారత జట్టు.. ముల్లన్‌పూర్‌లో మాత్రం 51 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఇక ధర్మశాలలో ఆదివారం నాటి మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయం బాట పట్టిన టీమిండియా.. 2-1తో ఆధిక్యం సంపాదించింది. ఇక లక్నోలో బుధవారం నాటి మ్యాచ్‌లోనూ గెలుపొంది మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. కాగా మూడో టీ20లో అక్షర్ పటేల్‌తో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలను కూడా టీమిండియా కోల్పోయింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా బుమ్రా ఇంటికి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అతడి రీఎంట్రీ గురించి మాత్రం బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు అప్డేట్ లేదు.చదవండి: మాక్ వేలంలో రూ. 30.50 కోట్లకు అమ్ముడుపోయిన గ్రీన్.. ఎవరు కొన్నారంటే? -
ఐపీఎల్ 2026కి సంబంధించి బిగ్ అప్డేట్.. డేట్ మారింది
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి బిగ్ అప్డేట్ అందింది. లీగ్ ప్రారంభ తేదీ మారినట్లు ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్‌బజ్ పేర్కొంది. ముందుగా ప్రకటించినట్లు ఐపీఎల్ 2026 మార్చి 15న కాకుండా మార్చి 26న ప్రారంభం కానున్నట్లు తెలిపింది. మే 31తో ముగియనున్నట్లు పేర్కొంది. ఇవాళ (డిసెంబర్ 15) అబుదాబీలో జరిగిన ఫ్రాంఛైజీల మీటింగ్‌లో ఈ విషయం ఖరారైనట్లు వెల్లడించింది. సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ విషయంలో ఇంకా స్పష్టత లేనట్లు ప్రకటించింది.సాధారణంగా సీజన్ ఓపెనర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ (ఆర్సీబీ) హోం గ్రౌండ్లో జరుగుతుంది. అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంపై సందిగ్దత నెలకొనడంతో ఈ విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు. పై విషయాలను ఐపీఎల్ సీఈవో హేమంగ్ అమిన్ తమతో షేర్ చేసుకున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది.కాగా, రేపు అబుదాబీ వేదికగా ఐపీఎల్ 2026 మినీ వేలం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో 10 ఫ్రాంచైజీలకు సంబంధించి 77 స్లాట్లు భర్తీ కానున్నాయి. ఇందులో 31 విదేశీ స్లాట్లు కాగా.. మిగతావన్నీ దేశీయ ఆటగాళ్లతో భర్తీ చేయబడతాయి. 10 ఫ్రాంచైజీల వద్ద రూ. 237.55 కోట్ల నిధులు ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా రూ. 64.30 కోట్లు, రెండో అత్యధికంగా చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 43.40 కోట్లు ఉన్నాయి. ఈ వేలంలో తాజా అడిషన్స్‌తో పాటు (అభిమన్యు ఈశ్వరన్) మొత్తం 369 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
టీమిండియాకు ఊహించని షాక్.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్
సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల వల్ల జట్టును వీడాడు. దీంతో ధర్మశాల వేదికగా సఫారీలతో జరుగుతున్న కీలకమైన మూడో టీ20కు బుమ్రా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా వెల్లడించింది. "జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల చేత ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతడు మూడో టీ20కు అందుబాటులో లేడు. బుమ్రా తదుపరి మ్యాచ్‌లకు జట్టులో చేరే విషయంపై అప్డేట్ ఇస్తామని" బీసీసీఐ పేర్కొంది. ఇదే విషయాన్ని టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్పుకొచ్చాడు. ఇక జస్ప్రీత్ స్ధానంలో యువ పేసర్ హర్షిత్ రాణా తుది జట్టులో వచ్చాడు. బుమ్రాతో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా ధర్మశాల టీ20కు దూరమయ్యాడు. దీంతో కుల్దీప్ యాదవ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది. అయితే బుమ్రా తిరిగి జట్టులో చేరుతాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ సిరీస్‌లో భాగంగా నాలుగో టీ20 డిసెంబర్ 17న లక్నో వేదికగా జరగనుంది. రెండు రోజుల సమయం లభించడంతో అతడు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు తడబడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. హర్షిత్ రాణా రెండు , అర్ష్‌దీప్, హార్దిక్ పాండ్యా తలా వికెట్ సాధించారు.తుది జట్లుదక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్‌కీపర్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిచదవండి: Asia Cup 2025: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా.. -
BCCI: శుభ్‌మన్ గిల్‌కు మరో బిగ్ ప్రమోషన్..!
టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు మరో బిగ్ ప్రమోషన్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్దమైంది. 2025/26 సీజన్‌కు సంబంధించిన కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో గిల్‘ఏ ప్లస్’ కేటగిరీకి పదోన్నతి పొందే అవకాశం ఉంది.డిసెంబర్ 22న జరగనున్న బీసీసీఐ 31వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ఆటగాళ్ల కాంట్రాక్టులపై నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం గిల్ ప్రమోషన్‌పై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. గిల్ ప్రస్తుతం గ్రేడ్-ఎలో ఉన్నాడు. అందుకు గాను ప్రతీ ఏటా రూ. 5 కోట్లను జీతంగా అందుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ‘ఏ ప్లస్’ కేటగిరీలో గిల్‌కు చోటు దక్కితే ప్రతీ ఏటా ఇకపై రూ.7 కోట్లు వార్షిక వేతనం తీసుకోనున్నాడు. ప్రస్తుతం గ్రేడ్ A+ కేటగిరీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ,రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. అయితే రో-కో ద్వయం కేవలం ఒక్క ఫార్మాట్లో ఆడుతుండడంతో వారిని గ్రేడ్-ఎకు డిమోట్ చేసే అవకాశముంది.శుభ్‌మన్ గిల్ రైజ్శుభ్మన్ గిల్.. అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే భారత జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ ఏడాది జూన్‌లో రోహిత్ శర్మ నుంచి టెస్టు జట్టు పగ్గాలను చేపట్టిన గిల్.. ఇంగ్లండ్ గడ్డపై అదరహో అనిపించాడు. అతడి నాయకత్వంలోని భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో డ్రా చేసింది.ఆ తర్వాత అక్టోబర్‌లో వన్డే కెప్టెన్‌గా కూడా గిల్ బాధ్యతలు చేపట్టాడు. అంతేకాకుండా టీ20ల్లో భారత వైస్ కెప్టెన్‌గా గిల్ ఉన్నాడు. 2026 టీ20 ప్రపంచ కప్ తర్వాత గిల్‌ను టీమిండియాకు ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా బీసీసీఐ నియమించనున్నట్లు తెలుస్తోంది.చదవండి: IPL 2026 SRH Plans: కావ్య మారన్ మాస్టర్ ప్లాన్..! యార్కర్ల కింగ్‌పై కన్ను? -
బీసీసీఐ కీలక సమావేశం..
టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి... కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కాంట్రాక్ట్‌ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 22న జరగనున్న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆటగాళ్ల కాంట్రాక్టులతో పాటు... మహిళల దేశవాళీ క్రికెట్ చెల్లింపుల విషయంలో ప్రధానంగా చర్చ సాగనుంది. మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జరుగుతున్న తొలి ఏజీఎం ఇదే. ఇప్పటి వరకు కోహ్లి, రోహిత్ ‘ఏ ప్లస్’ కేటగిరీలో ఉండగా... ఇప్పుడు కేవలం ఒక్క ఫార్మాట్లోనే ఆడుతున్న కారణంగా ఈ ఇద్దరినీ అందులో నుంచి తొలగించే అవకాశం ఉంది. కొత్త ‘ఏ ప్లస్’ కాంట్రాక్టు జాబితాలో ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు... టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ చోటు దక్కించుకోనున్నాడు. ఆన్లైన్లో జరగనున్న ఈ ఏజీఎంలో మహిళల దేశవాళీలో టోర్నీల మ్యాచ్ ఫీజులు, అంపైర్లు, రిఫరీల జీతభత్యాలు తదితర అంశాలపై చర్చించనున్నారు.ఇక బోర్డు డిజిటల్ సొత్తుకు సంబంధించిన చర్చ కూడా జరగనుంది. ప్రస్తుతం మిథున్ మన్హాస్ బోర్డు అధ్యక్షుడిగా కొనసాగుతుండగా... రఘురామ్ భట్ కోశాధికారిగా వ్యవహరిస్తున్నాడు. చదవండి: జోరు కొనసాగించాలని... -
టీమిండియాకు ఆల్‌రౌండర్లు కావలెను!
ముఖ్యమైన ప్రకటన.. టీమిండియాకు ఆల్‌రౌండర్లు కావలెను. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో నాణ్యమైన ఆల్‌రౌండర్ల లోటు కన్పిస్తోంది. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, సుందర్ వంటి వారు ఉన్నప్పటికి.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల విభాగంలో భారత్ చాలా వెనకబడి ఉంది. ఒక్క హార్ధిక్ పాండ్యా తప్ప చెప్పుకోదగ్గ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ భారత లేరు. అయితే హార్దిక్ ఫిట్నెస్ సమస్యల వల్ల ఎప్పుడు జట్టులో ఉంటాడో.. ఎప్పుడు బయట ఉంటాడో తనకే తెలియదు. నితీశ్ కుమార్ రెడ్డిని మూడు ఫార్మాట్లలో ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నప్పటికి.. ఆశించినంతమేర ఫలితాలు మాత్రం రావడం లేదు. మొదటిలో అతడిపై నమ్మకం ఉంచిన గంభీర్ అండ్ కో.. ఇప్పుడు ఎక్కువగా స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే పరిగణిస్తోంది. టీ20 సెటాప్‌లో భాగంగా ఉన్న శివమ్ దూబే పరిస్థితి కూడా అంతంతమాత్రమే. SENA దేశాలతో పోలిస్తే మనం చాలా వెనకబడి ఉన్నాము. గతంలో కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ వంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ప్రపంచ క్రికెట్‌నే శాసించారు. కచ్చితంగా అటువంటి ఆల్‌రౌండర్లు భారత జట్టుకు అవసరం.ఆల్‌రౌండర్ల ఉపయోగాలు ఏంటి?జట్టు సమతుల్యంగా ఉండాలంటే కచ్చితంగా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు కావాలి. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి సేనా దేశాల విజయాలలో ఆల్‌రౌండర్లదే కీలక పాత్ర. ఒక్క ఆస్ట్రేలియాలోనే మిచెల్ మార్ష్, గ్రీన్, అబాట్, స్టోయినిష్ వంటి అద్బుతమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. నిజమైన ఫాస్ట్-బౌలింగ్ ఆల్‌రౌండర్ లేకపోతే, జట్టు కూర్పు ఒక పెద్ద సమస్యగా మారుతుంది. టీమిండియా ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటుంది. ప్రతీ మ్యాచ్‌కు ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక ఒక సమస్యగా మారింది. అదనపు బ్యాటర్‌ను ఆడిస్తే బౌలింగ్ బలహీనపడుతుంది. ఐదుగురు బౌలర్లతో ఆడితే బ్యాటింగ్ లైనప్ బలహీనంగా మారుతుంది. ఈ అసమతుల్యత కారణంగానే భారత్ విదేశాల్లో కీలక మ్యాచ్‌లు, టెస్ట్ సిరీస్‌లలో ఓడిపోయింది. భారత జట్టులో స్పిన్ ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉండడంతో ఎవరికి అవకాశమివ్వాలో తెలియక టీమ్ మెనెజ్‌మెంట్ తలలు పట్టుకుంటుంది. జడేజా, అక్షర్ వంటి వారు ఉపఖండ పిచ్లోపై రాణిస్తున్నప్పటికి విదేశీ గడ్డపై బంతితో సత్తాచాటలేకపోతున్నారు. దీంతో విదేశీ పర్యటనలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల లోటు స్పష్టంగా కన్పిస్తోంది.శార్ధూల్ రీ ఎంట్రీ ఇస్తాడా?బీసీసీఐ సెలక్టర్లు మరోసారి శార్ధూల్ ఠాకూర్ వంటి వెటరన్ ఆల్రౌండర్లను పరిగణలోకి తీసుకోవాల్సిన అసవరముంది. శార్ధూల్ జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నప్పటికి దేశవాళీ క్రికెట్లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఫార్మాట్లకు అతీతంగా ఠాకూర్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవాలని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో అతడు రీ ఎంట్రీ ఇచ్చినప్పటికి ఓ మోస్తారు ప్రదర్శన చేశాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. అయితే లార్డ్ ఠాకూర్ మరోసారి సత్తా చాటుతున్నప్పటికీ.. ఇప్పట్లో తిరిగి పునరాగమనం చేసే సూచనలు కన్పించడం లేదు.అయితే, ఠాకూర్ మాత్రం కూడా వన్డే ప్రపంచకప్-2027లో ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. అతడితో పాటు రాజ్ అంగద్ బవా, సూర్యాంశ్ షెడ్గే వంటివారిపై కూడా సెలక్టర్లు దృష్టిసారించాల్సి ఉంది. అండర్-19 ప్రపంచకప్‌లో రాజ్ అంగద్ బవా బంతితో పాటు బ్యాట్‌తో కూడా అద్భుతంగా రాణించాడు. సూర్యాంశ్‌కు కూడా సీమ్-బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా రాణించే సత్తా ఉంది. చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! -
ఐపీఎల్-2026 వేలంలో బిగ్ ట్విస్ట్..! ఫైనల్ లిస్ట్ ఖరారు
ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ 16న దుబాయ్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేలంలో పాల్గోనే ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేలం కోసం మొత్తం 1,355 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకోగా.. అందులో 350 మంది షార్ట్‌లిస్ట్ అయినట్లు క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ లిస్ట్‌లో చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన 35 మంది ఆటగాళ్లు ఉండటం గమనార్హం. సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ తొలుత తన పేరును రిజిస్టర్ చేసుకోలేదు. దీంతో మొదటి ప్రకటించిన జాబితాలో అతడు పేరు లేదు. కానీ చివరి నిమిషంలో తన మనసును మార్చుకుని వేలంలో పాల్గోవాలని నిర్ణయించుకున్నాడు.దీంతో కొన్ని ఫ్రాంచైజీల అభ్యర్థన మేరకు డి కాక్‌ను తుది జాబితాలో చేర్చారు. డికాక్ తన బేస్ ధరను 50 శాతం తగ్గించుకున్నాడు. కనీస ధర రూ. రూ.కోటి రూపాయలతో అతడు వేలం బరిలోకి దిగనున్నాడు. ఈ 35 మంది క్రికెటర్లలో శ్రీలంక, సౌతాఫ్రికా ప్లేయర్లతో పాటు భారత దేశవాళీ క్రికెటర్లు కూడా ఉన్నారు. ఇక వేలానికి సంబంధించిన విదివిధానాలు బీసీసీఐ ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలను మెయిల్ చేసినట్లు తెలుస్తోంది.వేలం రూల్స్ ఇవే..ఈ మినీ వేలం మొదట క్యాప్డ్ (Capped) ఆటగాళ్లతో ప్రారంభమవుతుంది. ఇందులో బ్యాటర్లు, ఆల్-రౌండర్లు, వికెట్ కీపర్-బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఉంటారు. తరువాత అన్క్యాప్డ్ (Uncapped) ఆటగాళ్లతో పూర్తి రౌండ్ కొనసాగుతుంది.మొదటి 70 మంది ఆటగాళ్ల పేక్లు పూర్తయిన తర్వాత మిగిలిన ప్లేయర్ల కోసం యాక్సిలరేటెడ్ రౌండ్‌ను నిర్వహించనుంది. చివగా తొలి మూడు రౌండ్లలో అమ్ముడుపోని ఆటగాళ్లు ఆఖరిలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. అయితే ఈసారి మార్క్యూ లిస్ట్ రౌండ్ ఉండదు. తొలి రౌండ్లో కెమెరూన్ గ్రీన్, డెవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, డేవిడ్ మిల్లర్ వంటి విదేశీ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశముంది. అదే విధంగా వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్‌కు కూడా భారీ ధర దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ వేలంలో అన్ని జట్లు కలిపి మొత్తం 77 స్లాట్లు భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో 31 విదేశీ స్థానాలు ఉన్నాయి.ఐపీఎల్ వేలంలో కొత్త ఆటగాళ్లువిదేశీ ఆటగాళ్లు: అరబ్ గుల్ (ఆఫ్ఘనిస్తాన్), మైల్స్ హమ్మండ్ (ఇంగ్లండ్), డాన్ లాటెగాన్ (ఇంగ్లండ్), క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా), కానర్ ఎస్టర్‌హూజెన్ (దక్షిణాఫ్రికా), జార్జ్ లిండే (దక్షిణాఫ్రికా), బయాండా మజోలా (దక్షిణాఫ్రికా), ట్రావీన్ మాథ్యూ (శ్రీలంక), డిసురి లంకాల్ (పెర్నాగెసల్ వెల్సాల్ లంకా), డిసురి లంకాల్ (శ్రీలంక), అకీమ్ అగస్టే (వెస్టిండీస్).భారత ఆటగాళ్లు: సాదేక్ హుస్సేన్, విష్ణు సోలంకి, సబీర్ ఖాన్, బ్రిజేష్ శర్మ, కనిష్క్ చౌహాన్, ఆరోన్ జార్జ్, జిక్కు బ్రైట్, శ్రీహరి నాయర్, మాధవ్ బజాజ్, శ్రీవత్స ఆచార్య, యష్‌రాజ్ పుంజా, సాహిల్ పరాఖ్, రోషన్ వాఘ్సారే, యష్ డిచోల్కర్, అయాజ్క్ వల్కర్, ధుర్మిల్త్ ఖాన్, ధుర్మిల్త్ ఖాన్ పురవ్ అగర్వాల్, రిషబ్ చౌహాన్, సాగర్ సోలంకి, ఇజాజ్ సవారియా, అమన్ షెకావత్.చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! -
ఇండిగో సంక్షోభం.. బీసీసీఐకి ఊహించని షాక్!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దేశవాళీ టీ20 టోర్నీ నాకౌట్ మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ మార్పు చేసింది. లాజిస్టికల్ సమస్యల కారణంగా భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి డిసెంబర్ 12 నుండి 18 వరకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఎమరాల్డ్ హైస్కూల్ గ్రౌండ్లు ఫైనల్‌తో సహా 13 సూపర్ లీగ్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ లాజిస్టికల్ సమస్యల కారణంగా మ్యాచ్‌లను నిర్వహించలేమని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) బీసీసీఐకి తెలియజేసింది. డిసెంబర్ 9 నుంచి 12 వరకు ఇండోర్‌లో గ్లోబల్ డాక్టర్ల కాన్ఫరెన్స్ జరగడం వల్ల స్టార్ హోటల్స్ ఖాళీగా లేవు. దీంతో నాకౌట్ మ్యాచ్‌లు ఇప్పుడు పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) స్టేడియం, డివై పాటిల్ అకాడమీ వేదికగా జరగనున్నాయి.బీసీసీఐకు సవాల్..మరోవైపు ఇండిగో సంక్షోభం బీసీసీఐని సైతం కలవరపెడుతోంది. డీజీసీఏ కొత్తగా అమలు చేసిన ఫైలట్ రోస్టరింగ్ నియమాల కారణంగా సుమారు 1,000 విమానాలు రద్దు అయ్యాయి. దీంతో బీసీసీఐ కూడా తీవ్రమైన లాజిస్టికల్ సవాళ్లను ఎదుర్కొనే అవకాశముంది.ప్రస్తుతం దక్షిణాఫ్రికా-భారత్ టీ20 సిరీస్‌తో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కూడా జరుగుతోంది. నాలుగు గ్రూప్ స్టేజ్ వేదికలైన అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్ నుండి ఆటగాళ్లు, కోచ్‌లు, అంపైర్లు, అధికారులను పూణేకు బీసీసీఐ విమానాల్లో తరలించాలి. వీటితో ఇతర దేశీయ టోర్నమెంట్లు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి."ఇదే సంక్షోభం కొనసాగితే ఎనిమిది జట్లతో పాటు మ్యాచ్ అఫీషియల్స్‌ను నాకౌట్ మ్యాచ్‌ల కోసం పూణేకు విమానంలో తరలించడం సవాలుగా మారవచ్చు. అలాగే అహ్మదాబాద్‌లో మహిళల అండర్-23 T20 ట్రోఫీ, పురుషుల అండర్-19 కూచ్ బెహర్ ట్రోఫీ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ టోర్నీల కోసం జట్లు, అంపైర్లు ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణించాల్సి ఉందిష అని ఓ బీసీసీఐ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు. -
దుమ్ములేపిన మహ్మద్ షమీ.. ఇప్పటికైనా కళ్లు తెరవండి!
దేశవాళీ క్రికెట్లో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మరోసారి తన అద్భుత ప్రదర్శనతో జాతీయ సెలక్టర్లు సవాల్ విసిరాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. గురువారం సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో దుమ్ములేపాడు.తన సీమ్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో షమీ కేవలం 13 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అతడి సంచలన ప్రదర్శన ఫలితంగా సర్వీస్‌పై 7 వికెట్ల తేడాతో బెంగాల్ విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్వీసస్ 18.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మోహిత్ అహ్లావాట్(38) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నకుల్ శర్మ(32), వినీత్(32) రాణించారు. బెంగాల్ బౌలర్లలో షమీతో పాటు ఆకాష్ దీప్ మూడు, ఆఫ్-స్పిన్నర్ వ్రిత్తిక్ ఛటర్జీ రెండు వికెట్లు సాధించాడు.అభిషేక్, అభిమన్యు మెరుపులుఅనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని బెంగాల్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 15.1 ఓవర్లలో చేధించింది. అభిషేక్ పోరెల్(56), అభిమన్యు ఈశ్వరన్(58) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఈ టోర్నీలో బెంగాల్‌కు ఇది నాలుగో విజయం. ఈ గెలుపుతో బెంగాల్( 16) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.సెలక్టర్లపై విమర్శలు..ఇక దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న షమీకి జాతీయ జట్టులోకి చోటు ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న వరల్డ్ క్లాస్ బౌలర్‌ను ఎలా పక్కన పెడతారని సెలక్టర్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ల సైతం షమీని ఎంపిక చేయకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేల్లోనూ భారత బౌలింగ్‌లో అనుభవం లేమి కన్పించింది. దీంతో అనుభవజ్ఞుడైన షమీని ఎందుకు జట్టులోకి తీసుకు రావడం లేదని మాజీ హాఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. షమీ చివరగా భారత్ తరపున ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడాడు. అప్పటి నుంచి ఫిట్నెస్ లోపం పేరిట అతడిని జట్టులోకి తీసుకోవడం లేదు. కానీ షమీ మాత్రం దేశవాళీ క్రికెట్లో క్రమం తప్పకుండా ఆడుతున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టులోనూ షమీకి చోటు దక్కలేదు.చదవండి: ENG vs AUS: 'నగ్నంగా నడుస్తానని సవాల్'... హేడెన్ పరువు కాపాడిన జో రూట్ -
భారత జట్టు నుంచి ఫినిషర్ అవుట్.. కారణమెవరు?
టీమిండియా స్టార్ ప్లేయర్ రింకూ సింగ్‌ను టీ20 వరల్డ్‌కప్-2026కు పక్కన పెట్టనున్నారా? అంటే అవునానే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోనే సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టులో రింకూ సింగ్ పేరు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.రింకూ ఔట్.. హార్దిక్ ఇన్అతడి స్ధానంలో జట్టులోకి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగొచ్చాడు. ఈ జట్టు సెలక్షన్‌ను బట్టి రింకూ పొట్టి ప్రపంచకప్ ప్రణాళికలలో లేనిట్లు తెలుస్తోంది. రింకూ చివరగా భారత్ తరపన ఆసియాకప్-2025లో ఆడాడు.పాక్‌తో జరిగిన ఫైనల్లో విన్నింగ్ రన్స్ అతడే కొట్టాడు.అయితే వాస్తవానికి హార్దిక్ పాండ్యాకు గాయం కాకపోయి ఉంటే రింకూకు తుది జట్టులో దక్కకపోయేది. ఇప్పుడు పాండ్యా గాయం నుంచి కోలుకోని తిరిగి రావడంతో రింకూను పూర్తిగా ప్రధాన జట్టు నుంచే తప్పించారు. బహుశా రింకూ తరుచుగా చెప్పే విధంగా దేవుని ప్లాన్ అయి వుంటుంంది.గంభీర్ కారణమా?రింకూ గత కొన్ని టీ20 సిరీస్‌లగా జట్టుతో పాటు ఉన్నప్పటికి తుది జట్టులో మాత్రం పెద్దగా చోటు దక్కలేదు. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎక్కువగా ఆల్‌రౌండర్ల మొగ్గు చూపడంతో రింకూ చాలా మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమయ్యాడు. అతడికి బదులుగా వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబేలకు ప్లేయింగ్ ఎలెవన్‌లో టీమ్ మెనెజ్‌మెంట్ చోటు కల్పిస్తోంది.అతడు ఆస్ట్రేలియా పర్యటనలో జట్టులో ఉన్నప్పటికీ, ఒక్కసారి కూడా బ్యాటింగ్ చేయలేదు. మొన్నటివరకు ముఖ్యమైన 'ఫినిషర్'గా పరిగణించబడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఇప్పుడు ఏకంగా జట్టులోనే లేకుండా పోయాడు. అయితే టీ20 వరల్డ్‌కప్-2026 భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఉపఖండంలో మంచి స్పిన్నర్లు, స్పిన్‌ను ధీటుగా ఎదుర్కొనే బ్యాటర్లు కావాలి. వాషింగ్టన్, దూబేలు స్పినర్లకు బాగా ఆడగలరు. అంతేకాకుండా వాషింగ్టన్ బంతితో కూడా మ్యాజిక్ చేయగలడు. సుందర్, దూబే ప్రధాన జట్టులో ఉన్నప్పటికి ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం ఇద్దరిలో ఒకరికి చోటు దక్కే అవకాశముంది. ఎందుకంటే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రూపంలో ఇద్దరూ స్పిన్నర్లు ఎలాగానూ తుది జట్టులో ఉంటారు. బహుశా అందుకే రింకూను టీ20 ప్రపంచకప్ సెటాప్ నుంచి తప్పించండొచ్చు. అంతే తప్ప రింకూపై వేటు వెనక మరే ఏ ఇతర కారణం లేకపోవచ్చని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదేసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్- ఫిట్‌నెస్‌కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్🏏తొలి టీ20: డిసెంబరు 9- కటక్, ఒడిశా🏏రెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్పూర్, చండీగఢ్🏏మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్🏏నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్🏏ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్, గుజరాత్.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ -
భారత జెర్సీ అదిరిపోయిందిగా..
టీ20 వరల్డ్‌కప్-2026 కోసం టీమిండియా జెర్సీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రిలీజ్ చేసింది. రాయ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా ఈ కొత్త జెర్సీని బీసీసీఐ ఆవిష్కరించింది. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా హాజరయ్యారు.వీరితో పాటు టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, తిలక్ వర్మలు కూడా పాల్గోన్నారు. వీరిద్దరూ భారత కొత్త జెర్సీ కిట్లతో ఫోటోలకు పోజులిచ్చారు. అదేవిధంగా భారత్, శ్రీలంక వేదికలగా జరిగే ఈ మెగా ఈవెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు.అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. భారత జట్టుకు నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి చెప్పుకొచ్చాడు. ఈ జెర్సీలో భారత జెండాలోని మొత్తం మూడు రంగులు ఉన్నాయి. ఎక్కువగా ముదురు నీలం రంగు ఉండగా.. ఇరు వైపులా ఆరెంజ్ రంగు ఉంది. కాలర్ దగ్గరలో తెలుపు రంగు ఉంది జెర్సీ మధ్యలో స్పాన్సర్ అపోలో టైర్స్, ఇండియా అని పేరు రాసి ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతోంది.గ్రూపు-ఎలో భారత్ఇక ఈ పొట్టి ప్రపంచకప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ గ్రూపు-ఎలో భారత్ ఉంది. భారత్‌తో పాటు పాక్, నెదర్లాండ్స్, నమీబియా, అమెరికా ఉన్నాయి. టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 7న అమెరికాతో వాంఖడే వేదికగా తలపడనుంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా పాకిస్తాన్-భారత్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.India's jersey for #t20worldcup2026 #TeamIndia #INDvsSA pic.twitter.com/376CAa3eDY— Aakash Biswas (@aami_aakash) December 3, 2025 -
అదే జరిగితే నీపై వేటు వేస్తారు: గంభీర్‌పై రవిశాస్త్రి వ్యాఖ్యలు వైరల్
టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ మిశ్రమ ఫలితాలు చవిచూస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫర్వాలేదనిపించినా.. టెస్టుల్లో అతడికి ఇప్పటికే రెండు చేదు అనుభవాలు చవిచూశాడు. గంభీర్ మార్గదర్శనంలో గతేడాది న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 3-0తో వైట్‌వాష్‌కు గురైంది.గంభీర్ టెస్టు కోచ్‌గా పనికిరాడంటూ..భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై ఇలా ఓ విదేశీ జట్టు చేతిలో మన జట్టు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో క్లీన్‌స్వీప్ కావడం ఇదే తొలిసారి. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా దాదాపు దశాబ్దం తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (BGT)ని కోల్పోయింది. ఆసీస్ చేతిలో 3-1తో ఓడి ఇంటిబాట పట్టింది.ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో 2-2తో టెస్టు సిరీస్‌ను సమం చేసిన టీమిండియా.. తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికా చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్ టెస్టు కోచ్‌గా పనికిరాడని.. అతడిని వెంటనే తొలగించాలంటూ డిమాండ్లు పెరిగాయి.బీసీసీఐదే నిర్ణయంఈ విషయంపై గంభీర్ (Gautam Gambhir) స్వయంగా స్పందిస్తూ.. తన హయాంలోనే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే)-2025, ఆసియా టీ20 కప్-2025లో జట్టు గెలిచిందని పేర్కొన్నాడు. తనను కోచ్‌గా కొనసాగించాలా? లేదా? అనే నిర్ణయం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకుంటుందని స్పష్టం చేశాడు.అదే జరిగితే నీపై వేటు వేస్తారుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. ప్రభాత్ ఖబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ భవితవ్యం గురించి ప్రశ్న ఎదురుకాగా.. ‘‘మన ప్రదర్శన బాగా లేకుంటే.. కచ్చితంగా మనపై వేటు వేస్తారు. పదవి నుంచి తొలగిస్తారు.పరస్పర సమన్వయం, ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్ ఇక్కడ అత్యంత ముఖ్యం. మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటేనే అంతా సాఫీగా సాగిపోతుంది. గెలిచేలా ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాలి. కోచ్‌లుగా మా పని అదే. అయితే, మనం చేసే పని పట్ల ఇష్టం ఉండాలి. దానిని ఆస్వాదించాలి. అంతేగానీ ఒత్తిడిగా ఫీలవ్వకూడదు’’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.కాగా టీమిండియా మాజీ క్రికెటర్ అయిన రవిశాస్త్రి.. 2017- 2021 వరకు భారత జట్టు హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు. అతడి మార్గదర్శనంలోనే తొలిసారి టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండుసార్లు బోర్డర్- గావస్కర్ ట్రోఫీలు గెలిచింది. అంతేకాదు.. సౌతాఫ్రికాలో తొలిసారి వన్డే సిరీస్‌ను కూడా టీమిండియా కైవసం చేసుకుంది. రవిశాస్త్రి- నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి కాంబినేషన్లో టెస్టుల్లో టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా అగ్రపీఠానికి చేరుకుంది.చదవండి: హర్షిత్ రాణాకు బిగ్ షాక్ -
రోహిత్‌తో గంభీర్ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!.. బీసీసీఐ సీరియస్!
భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల భవితవ్యం గురించి క్రికెట్ వర్గాల్లో గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. వీరిద్దరు వన్డే ప్రపంచకప్-2027 టోర్నమెంట్ వరకు కొనసాగుతారా?.. యాజమాన్యం ఇందుకు అనుకూల పరిస్థితులు కల్పిస్తుందా? అనేది దీని సారాంశం.వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి..ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేశారు రో-కో. ఇద్దరూ కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ (Rohit Sharma).. జట్టులో కీలక ఆటగాడిగా కోహ్లి (Virat Kohli) ఉన్న వేళ.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నుంచి అనూహ్య ప్రకటన వచ్చింది.ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించినట్లు అగార్కర్ తెలిపాడు. వన్డే వరల్డ్‌కప్-2027 ఆడేందుకు తాము కట్టుబడిఉన్నామనే హామీ రో-కో నుంచి రాలేదని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఆద్యంతం అద్భుత ఆట తీరుతోఅయితే, ఆసీస్ టూర్లో అందుకు భిన్నంగా రోహిత్- కోహ్లి తమదైన శైలిలో సత్తా చాటారు. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లి మూడో వన్డేలో రాణించగా.. రోహిత్ మాత్రం ఆద్యంతం అద్భుత ఆట తీరుతో అలరించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. తాజాగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో తొలి వన్డేలోనూ ఇద్దరూ దుమ్ములేపారు.రాంచి వేదికగా రోహిత్ శర్మ మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57) బాదగా.. కోహ్లి ఏకంగా సెంచరీ (120 బంతుల్లో 135) చేశాడు. వన్డేల్లో 52వ, ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో 83వ శతకం బాది తన బ్యాటింగ్‌లో పస తగ్గలేదని నిరూపించాడు. వీరిద్దరి అద్భుత ఆట తీరు వల్లే టీమిండియా సఫారీలతో తొలి వన్డేల్లో నెగ్గింది.అగ్రెసివ్‌గా సెలబ్రేషన్స్ఈ నేపథ్యంలో సెంచరీ తర్వాత కోహ్లి మునుపటి కంటే అగ్రెసివ్‌గా సెలబ్రేట్ చేసుకోగా.. రోహిత్ సైతం కోహ్లి శతక్కొట్టడంతో మురిసిపోయాడు. కోహ్లికి మద్దతుగా చప్పట్లు కొడుతూ వారెవ్వా అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌కాగా..రో- కో ఫ్యాన్స్ హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌తో పాటు అగార్కర్‌ను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.A leap of joy ❤️💯A thoroughly entertaining innings from Virat Kohli 🍿Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5— BCCI (@BCCI) November 30, 2025 బీసీసీఐ సీరియస్!ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్- అగార్కర్‌లతో రో-కోలకు సఖ్యత పూర్తిగా చెడిందనే ప్రచారం జరుగగా.. బీసీసీఐ వర్గాలు స్పందించాయి. దైనిక్ జాగరణ్తో మాట్లాడుతూ.. ‘‘గంభీర్‌తో సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లిలకు సత్సంబంధాలు లేకుండా పోయాయి. కోచ్- ఆటగాళ్ల మధ్య ఉండాల్సిన సఖ్యత వారి మధ్య లోపించింది.వీరిద్దరి భవితవ్యంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. రాయ్‌పూర్ లేదంటే విశాఖపట్నం వన్డేల తర్వాత ఇందుకు సంబంధించి సమావేశం జరుగుతుంది. ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్- అగార్కర్‌కు అస్సలు మాటల్లేవు.ఇక కోహ్లి- గంభీర్ కూడా ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు. ఇందుకు తోడు రోహిత్- కోహ్లి అభిమానులు గంభీర్- అగార్కర్‌లను ట్రోల్ చేయడం పట్ల బీసీసీఐ సీరియస్‌గా ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.రోహిత్‌తో గంభీర్ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి వన్డే తర్వాత డ్రెసింగ్‌రూమ్‌లోకి వెళ్లే సమయంలో గంభీర్ తలుపు దగ్గరే ఉన్నా కోహ్లి పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మరోవైపు.. హోటల్‌లాబీలో గంభీర్‌తో రోహిత్ సీరియస్‌గా ఏదో చర్చిస్తుండగా.. టీమ్‌తో హోటల్ సిబ్బంది జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసింది.తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ కేక్ కట్ చేయగా.. సిబ్బంది కోహ్లిని సైతం రావాల్సిందిగా కోరారు. అయితే, వాళ్లకు థాంక్స్ చెబుతూనే.. ‘‘అవేమీ వద్దు’’ అన్నట్లుగా సైగ చేస్తూ కోహ్లి అక్కడి నుంచి నిష్క్రమించాడు. చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గాKohli completely ignored gambhir after win 😭😭 pic.twitter.com/XNBwPZPN0q— ADITYA (@Wxtreme10) December 1, 2025Gautam Gambhir seen talking with Rohit Sharma at the team hotel while the Indian team was celebrating their victory by cutting a cake.🇮🇳❤️ pic.twitter.com/iw6ld3PCv4— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 1, 2025 -
గంభీర్, అగార్కర్‌లతో బీసీసీఐ అత్యవసర భేటీ!
సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. బుధవారం (డిసెంబర్ 3) జరగనున్న రెండో వన్డేలో కూడా ప్రోటీస్‌ను చిత్తు చేసి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని రాహుల్ సేన పట్టుదలతో ఉంది.అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్‌కు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్‌తో పాటు మరికొంత మంది ఉన్నత అధికారులు హాజరు కానున్నట్లు సమాచారం. సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ ఓటమికి గల కారణాలను, భవిష్యత్తు ప్రణాళికలను గంభీర్, అగార్కర్‌తో బీసీసీఐ చర్చించే అవకాశముంది.బీసీసీఐ సీరియస్?"హోమ్ టెస్టు సీజన్లో మాకు కొన్ని ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయి. ఈ సీజన్లో మైదానంలోనూ, బయట కొన్ని గందరగోళ వ్యూహాలు కనిపించాయి. వాటిపై మాకు స్పష్టత కావాలి. మా తదుపరి టెస్టు సిరీస్‌కు ఇంకా ఎనిమిది నెలల సమయం మిగిలి ఉంది. అందుకోసం ముందుస్తు ప్రణాళికలను కోచ్, చీఫ్ సెలక్టర్ నుంచి అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాము. అంతేకాకుండా వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. ఆ తర్వాత వన్డే ప్రపంచకప్‌లో కూడా టీమిండియా టైటిల్ ఫేవరేట్‌గా ఉంది. కాబట్టి ఈ రెండు మెగా ఈవెంట్లను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత సమస్యలను వెంటనే పరిష్కరించాలని బోర్డు భావిస్తోంది" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా టీమ్‌మెనెజ్‌మెంట్‌కు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ మీటింగ్‌కు బీసీసీఐ కొత్త బాస్ మిథున్ మన్హాస్ హాజరవుతారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ సమావేశం మ్యాచ్ రోజే జరగనుండడంతో సీనియర్ ప్లేయర్లు మాత్రం దూరంగా ఉండనున్నారు. ఇక టెస్టుల్లో సౌతాఫ్రికా చేతిలో వైట్‌వాష్ కావడంతో గంభీర్‌పై తీవ్ర స్ధాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే అతడిని కోచ్ పదవి నుంచి తప్పించాలని చాలా డిమాండ్ చేశారు.గంభీర్ మాత్రం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటిలో గంభీర్ హెడ్‌కోచ్ పదవికి ఎటువంటి ముప్పులేదు. ఒప్పందం ప్రకారం వన్డే ప్రపంచకప్-2027 వరకు భారత హెడ్ కోచ్‌గా కొనసాగే అవకాశముంది.చదవండి: వాళ్ల పోరాటం అద్భుతం: టీమిండియాకు మాజీ కెప్టెన్ వార్నింగ్ -
చెప్పినట్లు వింటారా?.. తమ మాటే నెగ్గించుకుంటారా?
సౌతాఫ్రికాతో టెస్టుల్లో వైట్‌వాష్ తర్వాత వన్డే సిరీస్‌కు సిద్ధమైంది టీమిండియా. సంప్రదాయ క్రికెట్లో విఫలమైనా.. పరిమిత ఓవర్ల సిరీస్‌లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. నవంబరు 30- డిసెంబరు 6 మధ్య ప్రొటిస్ జట్టుతో భారత్ మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా రాంచి వేదికగా ఆదివారం జరిగే తొలి వన్డేకు టీమిండియా సిద్ధమైంది. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు జట్టు మొత్తం ఇప్పటికే మ్యాచ్ జరిగే వేదికకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రో- కో భవితవ్యంపై మరోసారి చర్చ మొదలైంది. వన్డే వరల్డ్‌కప్-2027 (ICC World Cup 2027) వరకు ఈ లెజెండరీ బ్యాటర్లు కొనసాగుతారా? లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.వాటి ఆధారంగానే నిర్ణయిస్తాంఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. రోహిత్- కోహ్లిల విషయంలో యాజమాన్యం ఆచితూచి నిర్ణయం తీసుకోనుందని తెలిపాయి. జట్టులో వారి పాత్ర, అంచనాలు, ఫామ్ ఆధారంగానే వీరిద్దరు ప్రపంచకప్ టోర్నీ ఆడతారా? లేదా? అన్న విషయంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నాయి.‘‘ఆస్ట్రేలియా పర్యటనలో వాళ్లిద్దరు మూడో వన్డేలో వింటేజ్ ఆటను గుర్తు చేశారు. అయితే, అప్పటికే సిరీస్ మన చేజారిపోయింది. తొలి రెండు మ్యాచ్‌లలో రో-కో పెద్దగా ఆకట్టుకోలేదు. కాబట్టి ఒక్క మ్యాచ్‌లో ఆడినంత మాత్రాన ప్రతిసారీ వారికి మినహాయింపు లభిస్తుందని అనుకోవద్దు’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియతో సదరు వర్గాలు పేర్కొన్నాయి.తిరుగులేని రో-కోవన్డేల్లో ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు కోహ్లి, రోహిత్. ముఖ్యంగా ఇప్పటికే వన్డే ఫార్మాట్లో 51 శతకాలతో అత్యధిక సెంచరీల వీరుడిగా కోహ్లి కొనసాగుతుండగా.. యాభై ఓవర్ల క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఘనుడు రోహిత్ (264 పరుగులు). వీరి ఘనతను చెప్పడానికి ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే.ఇక కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ కూడా గెలిచాడు. కానీ అనూహ్యంగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు అతడిని సారథిగా తప్పించి.. అతడి స్థాయంలో శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించింది మేనేజ్మెంట్. వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి జట్టును సన్నద్ధం చేసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.చెప్పినట్లు వింటారా?కాగా వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ఇంకా 22 నెలల వ్యవధి ఉంది. ఈలోపు టీమిండియా ఆడే వన్డే సిరీస్‌లలో ప్రదర్శన ఆధారంగానే రో- కో భవితవ్యం తేలనుందని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచకప్ నాటికి రోహిత్ 40, కోహ్లి 38 ఏళ్ల వయసు దాటేస్తారు. కాబట్టి ఫిట్నెస్ పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే, ఇప్పటికే ఫిట్‌నెస్‌కు మారుపేరుగా పేరొందిన కోహ్లి.. మరింత ఫిట్‌గా మారగా.. రోహిత్ ఆసీస్ టూర్‌కు ముందు ఏకంగా పది కిలోల బరువు తగ్గి స్లిమ్‌గా మారిపోయాడు. అయితే, ఇప్పటికే వీరిద్దరు అంతర్జాతీయ టీ20లతో పాటు.. టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరు కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నారు.ఇలాంటి తరుణంలో ఫిట్నెస్, మ్యాచ్ ప్రాక్టీస్, ఫామ్ కోసం రో- కో దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. బోర్డు కూడా వీరి నుంచి ఇదే కోరుకుంటోంది. అయితే, ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తమను తాము నిరూపించుకున్న రో-కో ఇందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇటీవల సౌతాఫ్రికా-‘ఎ’తో వన్డే సిరీస్‌లో వీరిద్దరు ఆడతారని ముందుగా వార్తలు వచ్చాయి.గంభీర్, అగార్కర్‌తో చర్చల తర్వాతే..కానీ ఈ అనధికారిక సిరీస్‌లో రో-కో ఆడలేదు. ఏదేమైనా సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌తో రోహిత్- కోహ్లి భవిష్యత్తుపై ఒక అంచనాకు రావాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం జరిగే సమావేశంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈ విషయం గురించి రో-కోతో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీలో రోహిత్- కోహ్లి వంటి సీనియర్ల అనుభవం యువ జట్టుకు పనికివస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం వీరిని మించి సత్తా చాటుతున్న యువ ఆటగాళ్లు కూడా ఎవరూ లేరు. అలాంటపుడు రో- కోను గనుక కావాలని తప్పిస్తే మాత్రం టీమిండియాకు కష్టాలు తప్పకపోవచ్చు!!చదవండి: India vs South Africa: టికెట్లు సోల్డ్ అవుట్ -
గంభీర్ తీరుపై బీసీసీఐ ఆగ్రహం!?.. ఇంకోసారి ఇలా చేస్తే..
భారత క్రికెట్ వర్గాల్లో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ భవిత్యం గురించే ప్రస్తుతం చర్చ. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫర్వాలేదనిపిస్తోన్నా.. టెస్టు ఫార్మాట్లో మాత్రం అతడి మార్గదర్శనంలో భారత్ చేదు ఫలితాల్ని చవిచూస్తోంది.గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్ అయిన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికా చేతిలో 2-0తో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో గంభీర్ కోచింగ్ శైలిపై విమర్శల వర్షం కురుస్తోంది. దిగ్గజాలు విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ అకస్మాత్ రిటైర్మెంట్ ప్రకటనల వెనుక గంభీర్ హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి.విమర్శలు.. రాజీనామాకు డిమాండ్అదే విధంగా టెస్టుల్లో కీలకమైన మిడిలార్డర్లో మార్పులతో ప్రయోగాలకు దిగుతున్న గంభీర్ ( (Gautam Gambhir)) వల్లే కూర్పు దెబ్బతింటోందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్‌గా అతడిని తొలగించాలనే డిమాండ్లు వస్తుండగా.. భారత దిగ్గజాలు సునిల్ గావస్కర్, అశ్విన్ వంటి వాళ్లు మాత్రం గౌతీకి మద్దతుగా నిలుస్తున్నారు. కోచ్ కేవలం శిక్షణ వరకే పరిమితమని.. ఈ వైఫల్యానికి ఆటగాళ్లే ప్రధాన కారణమని మండిపడుతున్నారు.అండగా ఉంటామని చెప్పినా..ఇక బీసీసీఐ (BCCI) సైతం గంభీర్‌కు తాము మద్దతుగా ఉంటామనే సంకేతాలు ఇచ్చింది. అతడి కాంట్రాక్టు 2027 వరకు కొనసాగుతుందని బోర్డు వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. గంభీర్‌కు అండగా ఉంటామని చెప్పినప్పటికీ అతడి వ్యవహారశైలిపై మాత్రం బోర్డు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.గంభీర్ తీరుపై గుర్రుగా ఉన్న బీసీసీఐ!ప్రధానంగా మీడియా సమావేశంలో గంభీర్ దూకుడుగా మాట్లాడటం తమను చిక్కుల్లో పడేస్తోందనే యోచనలో బోర్డు పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారత్- సౌతాఫ్రికా (IND vs SA) తొలి టెస్టుకు వేదికైన కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై విమర్శలు రాగా.. తానే కావాలని పిచ్ అలా తయారు చేయించానని గంభీర్ అంగీకరించిన విషయం తెలిసిందే.అదే విధంగా.. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పుల గురించి, యువ పేసర్ హర్షిత్ రాణాను ఆడించే విషయమై గంభీర్ ఘాటుగా స్పందించిన విధానం బీసీసీఐని కాస్త ఇరుకునపెట్టినట్లు తెలుస్తోంది. స్పెషలిస్టులను పక్కనపెట్టి.. ఆల్రౌండర్లకు పెద్దపీట వేస్తూ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా విమర్శలకు కారణమవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ బోర్డుకు అసంతృప్తి కలిగించినట్లు సమాచారం.ఒకవేళ విఫలమైతే.. అంతే సంగతులుఏదేమైనా ఇప్పటికిప్పుడు గంభీర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోయినా.. టీ20 ప్రపంచకప్-2026 తర్వాత మాత్రం అతడిపై ఫోకస్ పెరగనుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ చాంపియన్‌గా నిలిచిన ఆ క్రెడిట్ మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్‌దేనని అంతా అంటున్న మాట. ఇలాంటి తరుణంలో వరల్డ్‌కప్ టోర్నీలో భారత్‌ను విజేతగా నిలిపితేనే గంభీర్ భవిష్యత్తు సజావుగా సాగిపోతుంది. లేదంటే.. అతడిపై వేటు పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు!!చదవండి: Ashes: ఊహించిందే జరిగింది.. ఆసీస్ కీలక ప్రకటన -
బీసీసీఐ కీలక ప్రకటన
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026 సీజన్‌కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక ప్రకటన చేసింది. తాజా ఎడిషన్‌లో నవీ ముంబై, వడోదరలను ఈ మెగా ఈవెంట్ వేదికలుగా ఖరారు చేసినట్లు తెలిపింది. అదే విధంగా.. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 మధ్య డబ్ల్యూపీఎల్ నాలుగో ఎడిషన్ నిర్వహిస్తామని వెల్లడించింది.డబ్ల్యూపీఎల్-2026 మెగా వేలం సందర్భంగా లీగ్ చైర్మన్ జయేశ్ జార్జ్ గురువారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. న్యూఢిల్లీ వేదికగా మెగా వేలం మొదలుకాగా.. ఐదు ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన ప్లేయర్ల కోసం పోటీపడుతున్నాయి. ముంబై ఇండియన్స్‌కు రెండుసార్లు టైటిల్ అందించిన భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా వేలంలో కూర్చోవడం విశేషం.ఇదిలా ఉంటే.. డబ్ల్యూపీఎల్ 2023లో మొదలై ఇప్పటికి మూడు సీజన్లు పూర్తిగా డబ్ల్యూపీఎల్ తొలి చాంపియన్‌గా ముంబై నిలిచింది. ఆ మరుసటి ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్ స్మృతి మంధాన ట్రోఫీ అందించింది. ఈ ఫ్రాంఛైజీకి ఇదే తొలి టైటిల్. ఇక ఈ ఏడాది హర్మన్ మరోసారి తన సారథ్యంతో ముంబైని విజేతగా నిలిపింది.కాగా డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పాల్గొంటున్నాయి. -
పంత్‌ను కాదని రాహుల్‌కు కెప్టెన్సీ.. కారణమిదే?
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎంపికైన సంగతి తెలిసిందే. రెగ్యూలర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గైర్హాజరీ కారణంగా జట్టు పగ్గాలను రాహుల్‌కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ అప్పగించింది. అయితే తొలుత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను తాత్కాలిక వన్డే కెప్టెన్‌గా నియమిస్తారని వార్తలు వచ్చాయి.పంత్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మెన్ ఇన్ బ్లూకు స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో అతడికే జట్టు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని అంతా భావించారు. కానీ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మాత్రం రాహుల్ వైపే మొగ్గు చూపింది. అయితే పంత్‌కు కాకుండా రాహుల్‌ను నియమించడానికి గల కారణాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు."సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో మాత్రమే కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. శుభ్‌మన్ గిల్ తిరిగి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ సమయానికి అందుబాటులో వచ్చే అవకాశముంది. అతడు తన గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు.ఇక రిషబ్ పంత్ సంవత్సర కాలంలో కేవలం ఒక వన్డే మ్యాచ్ మాత్రమే ఆడాడు. అందుకే అతడిని కెప్టెన్సీ ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు" అని సదరు అధికారి పీటీఐతో పేర్కొన్నారు. కాగా పంత్ గతేడాది శ్రీలంకపై భారత్ తరపున చివరగా ఆడాడు. అప్పటి నుంచి వన్డే జట్టుకు దూరంగా ఉన్నాడు. మళ్లీ ఇప్పుడు అతడు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ సందర్భంగా పునరాగమనానికి అతడు సిద్దమయ్యాడు.ఇక ఈ వన్డే సిరీస్‌కు గిల్‌తో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా దూరమయ్యారు. అదేవిధంగా బుమ్రా, సిరాజ్, అక్షర్ పటేల్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో జట్టులోకి రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్, జైశ్వాల్ వచ్చారు. నవంబర్ 30 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది.భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్, జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, పంత్, సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిధ్, అర్ష్‌దీప్, ధ్రువ్ జురెల్. చదవండి: Prithvi Shaw: కెప్టెన్‌గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన -
పాపం సంజూ.. వరల్డ్ మోస్ట్ అన్‌లక్కీ క్రికెటర్
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో... అతడి స్థానంలో సీనియర్ బ్యాటర్ రాహుల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు.అదేవిధంగా ఈ సిరీస్‌కు గిల్‌తో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా దూరమయ్యారు. సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు విశ్రాంతినివ్వగా... రవీంద్ర జడేజా ఎనిమిది నెలల తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు.దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చాన్నాళ్ల తర్వాత బ్లూ జెర్సీలో సొంత అభిమానుల ముందు మైదానంలో అడుగు పెట్టనున్నారు. మరోవైపు మహారాష్ట్ర క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ ఛాన్నాళ్ల తర్వాత జట్టులోకి తిరిగొచ్చాడు. గిల్ స్ధానంలో గైక్వాడ్‌కు చోటు దక్కింది. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ స్ధానంలో తిలక్ వర్మకు సెలక్టర్లు పిలుపునిచ్చారు.సంజూ మరో 'సారీ'..ఇక భారత వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు మరోసారి సెలక్టర్లు మొండిచేయి చూపించారు. సఫారీలతో వన్డే సిరీస్‌కు రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు చోటు దక్కింది. పంత్ కూడా ఏడాది తర్వాత వన్డే జట్టులోకి వచ్చాడు. పంత్ గైర్హజరీలో కూడా సంజూకు చోటు దక్కలేదు. వన్డేల్లో కూడా బ్యాకప్ వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్‌ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకుంటున్నారు. సఫారీలతో వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో కూడా జురెల్ ఉన్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో మంచి రికార్డు ఉన్నప్పటికి సంజూను జట్టులోకి తీసుకోకపోవడంపై నెటిజన్లు ఫైరవతున్నారు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌పై విమర్శల వర్షం కురుపిస్తున్నారు.శాంసన్ చివరగా 2023 డిసెంబరులో దక్షిణాఫ్రికాపై వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో సిరీస్‌లకు అతడికి చోటు దక్కలేదు. ఇప్పటివరకు 16 వన్డేలు ఆడిన సంజూ 56.66 సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్, జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, పంత్, సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిధ్, అర్ష్‌దీప్, ధ్రువ్ జురెల్. -
టీమిండియా కెప్టెన్‌గా రాహుల్..
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే,సిరీస్‌కు సంబంధించి భారత జట్టున ప్రకటించింది బీసీసీఐ. మూడు వన్డేల సిరీస్‌కు సంబంధించి జట్లను ప్రకటించారు. వన్డే జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. నవంబర్ 30 నుంచి దక్షిణాఫ్రికాతో ఆరంభం కానున్న వన్డే సిరీస్‌కు గిల్ స్థానంలో రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. మెడ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో ఆ స్థానంలో కెప్టెన్‌గా రాహుల్‌ను నియమించారు. ఇక విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు తిరిగి జట్టులోకి వచ్చారు. రాహుల్‌కు డిప్యూటీగా రిషభ్ పంత్ వ్యవహరిస్తారు. సఫారీలతో వన్డే సిరీస్‌కు భారత జట్టుకేఎల్ రాహల్(కెప్టెన్), రిషభ్ పంత్(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, జైశ్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ రాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ధ్రువ్ జురెల్ -
నీ దూకుడు సాటెవ్వరు!
అనంతపురం కార్పొరేషన్: తండ్రి ప్రోత్సాహానికి తోడు ఆత్మవిశ్వాసం జతకట్టడంతో క్రికెట్లో తనకు ఎదురు లేదని నిరూపిస్తున్నాడు రాప్తాడు మండలం బొమ్మేపర్తి గ్రామానికి చెందిన మచ్చా రామలింగారెడ్డి, లక్ష్మి దంపతుల కుమారుడు మచ్చా దత్తారెడ్డి. క్రీజులో కాసేపు నిలదొక్కుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించేలా బంతిని అలవోకగా బౌండరీలు దాటిస్తూ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో పాటు వికెట్ కీపర్‌గానూ ప్రతిభ కనబరుస్తున్నాడు. ఆంధ్ర క్రికెట్ అకాడమీలో సభ్యుడిగా ఉన్న సమయంలో భారత మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ వద్ద కీపింగ్‌లో మెలకువలు అభ్యసించాడు. ఈ సీజన్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 41 స్టంపింగ్‌లు, క్యాచ్‌లు పట్టి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అండర్ –12, 14, 16, 19, 23 ఇలా అన్ని ఫార్మాట్లలో అంచనాలకు మించి రాణించి, 20 ఏళ్లకే ఆంధ్ర రంజీ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. అతనిలోని క్రీడాకారుడికి పట్టం కడుతూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇటీవల అండర్ –23 ఏపీ జట్టుకు ఎంపిక చేసింది. జిల్లా సీనియర్ క్రికెటర్లలో ఒకరైన తన తండ్రి మచ్చా రామలింగారెడ్డి స్ఫూర్తి,తోనే తాను కూడా క్రికెట్లోకి అడుగు పెట్టానని, తనకు అన్ని విధాలుగా వెన్నంటి ఉంటూ ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ అందిస్తున్న ప్రోత్సాహాన్ని మరువలేనని మచ్చా దత్తారెడ్డి అంటున్నాడు. భారత జట్టులో చోటు దక్కించుకోవడమే తన అంతిమ లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు పేర్కొంటున్నాడు. అధిగమించిన మైలు రాళ్లు బీసీసీఐ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో జరిగిన అండర్ –19, 23 క్రికెట్ మ్యాచ్‌ల్లో మచ్చా దత్తారెడ్డి 1,500 పరుగులు సాధించాడు. వికెట్‌కీపర్‌గా, బ్యాటర్‌గా బీసీసీఐ టోరీ్నలో ఈ ఘనత సాధించిన వారిలో దత్తారెడ్డి ప్రథముడు కావడం గమనార్హం. ఆంధ్ర ప్రీమియర్ లీగ్– 4 లో విజేతగా నిలిచిన తుంగభద్ర వారియర్స్ జట్టులో దత్తారెడ్డి కీలక ఆటగాడిగా ఖ్యాతి దక్కించుకున్నాడు.గత మూడేళ్లలో జాతీయ స్థాయి టోరీ్నల్లో పాల్గొని హర్యానాపై 172 నాటౌట్, మణిపూర్‌పై 105 నాటౌట్‌గా క్రీజ్‌లో నిలిచాడు. అండర్ –23 డెబ్యూట్‌లో గోవా జట్టుపై 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అండర్ –19 కూచ్‌బెహర్ ట్రోఫీ 2021–22 సీజన్లో 250, 2022–23 సీజన్లో 470 పరుగులు చేశాడు. 2022–23 లో జరిగిన అండర్ –19 వినోద్ మన్కడ్ ట్రోఫీలో 150 పరుగులు సాధించాడు. 2023–24 సీజన్లో అండర్ –23 సీకే నాయుడు ట్రోఫీలో 140 పరుగులు సాధించాడు. -
గంభీర్‌పై విమర్శల వర్షం.. స్పందించిన బీసీసీఐ
హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ (Gautam Gambhir) వచ్చిన తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో విజయ పరంపర కొనసాగిస్తున్న టీమిండియా.. టెస్టు ఫార్మాట్లో మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతోంది. ముఖ్యంగా స్వదేశంలోనూ వరుస మ్యాచ్‌లలో ఓటమి పాలుకావడం విమర్శలకు దారితీస్తోంది.గంభీర్ మార్గదర్శనంలో సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో టెస్టుల్లో టీమిండియా 3-0తో వైట్‌వాష్ అయింది. బంగ్లాదేశ్, వెస్టిండీస్ వంటి ఫామ్‌లోలేని జట్లపై గెలిచినా.. తాజాగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులోనూ ఓటమిని మూటగట్టుకుంది. వేళ్లన్నీ గంభీర్ వైపేకోల్కతా వేదికగా సఫారీ (IND vs SA)లు విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా 93 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ముప్పై పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై విమర్శలు రాగా.. వేళ్లన్నీ గంభీర్ వైపే చూపాయి. అతడి ఆలోచనకు తగ్గట్లే రూపొందించిన పిచ్‌పై భారత జట్టు బోల్తా పడిందని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సైతం మండిపడ్డాడు.ఈ క్రమంలో గంభీర్ కూడా పిచ్ పరిస్థితికి తానే కారణమంటూ నైతిక బాధ్యత వహించాడు. అయినా సరే గంభీర్‌పై విమర్శల వర్షం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా స్పందించాడు. గంభీర్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందంటూ అతడికి మద్దతు పలికాడు.బీసీసీఐ స్పందన ఇదే‘‘మా సెలక్టర్లు, కోచింగ్ సిబ్బంది.. మరీ ముఖ్యంగా హెడ్‌కోచ్, మా ఆటగాళ్లపై బీసీసీఐకి పూర్తి నమ్మకం ఉంది. ఎవరినీ మేము తక్కువ చేయము. ప్రతి ఒక్కరికి మా మద్దతు ఉంటుంది. అందుకే మా జట్టు చాన్నాళ్లుగా అద్భుత విజయాలు సాధిస్తోంది.అయితే, ఏదో ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రాన దాని గురించి సోషల్ మీడియాలో రచ్చ చేయడం సరికాదు. ఇలాంటి వాళ్లను మేము అస్సలు పట్టించుకోము. ఇదే జట్టు.. ఇదే హెడ్‌కోచ్ మార్గదర్శనంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.అదే విధంగా.. ఆసియా టీ20 కప్ టోర్నీలోనూ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్ గడ్డ మీద ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది’’ అంటూ దేవజిత్ సైకియా.. గంభీర్, టీమిండియాను సమర్థించాడు. బయటి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చేసే విమర్శలను తాము పట్టించుకోమని రెవ్‌స్పోర్ట్స్‌తో పేర్కొన్నాడు. కాగా గంభీర్ గైడెన్స్‌లో ఈ ఏడాది టీమిండియా చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే, స్వదేశంలో కివీస్ చేతిలో టెస్టుల్లో ఘోర పరాభవంతో పాటు ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 1-3తో చేజార్చుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ట్రోఫీని టీమిండియా కోల్పోయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు సిరీస్‌ను 2-2తో సమం చేసింది. తాజాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు ఓడిన టీమిండియా.. గువాహటిలో శనివారం మొదలయ్యే రెండో టెస్టులో తప్పకగెలవాల్సిందే!.. లేదంటే సొంతగడ్డపై మరో పరాభవం తప్పదు!!చదవండి: ఎవరిని ఆడించాలో తెలుసు.. నిర్ణయం తీసుకున్నాం: రిషభ్ పంత్ -
టీమిండియా కెప్టెన్‌గా రిషబ్ పంత్.. బీసీసీఐ అధికారిక ప్రకటన
గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు ముందు భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సెకెండ్ టెస్టు నుంచి టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పి కారణంగా తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించింది. అతడి స్ధానంలో భారత జట్టు సారథిగా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు. జట్టుతో పాటు గిల్ గువహటికి వెళ్లినప్పటికి ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరింత సమయం పట్టనుంది. గిల్ తన గాయం నుంచి కోలుకోనేంందుకు తిరిగి ముంబైకి వెళ్లనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత కెప్టెన్ ముంబైలోని డాక్టర్ దిన్షా పార్దివాలా వద్ద చికిత్స పొందనున్నాడు. దీంతో గిల్ నవంబర్ 30 నుంచి సఫారీలతో జరిగే వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశముంది.గిల్‌కు ఏమైందంటే?ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో రోజు ఆటలో స్వీప్ షాట్ ఆడే క్రమంలో గిల్‌కు మెడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అతడిని కోల్‌కతాలోని వుడ్స్ల్యాండ్ అస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణ తర్వాత అతడిని అస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం నెక్ బ్యాండ్ లేకుండా గిల్ కన్పించడంతో రెండో టెస్టులో ఆడుతాడని చాలా భావించారు. అతడు జట్టుతో పాటు గువహటికి వెళ్లడంతో భారత శిబిరంలో ఆశలు రేకెత్తాయి. కానీ అతడికి ఇంకా పూర్తి స్ధాయిలో నొప్పి తగ్గలేదు. అందుకే అతడిని రెండో టెస్టు నుంచి బీసీసీఐ తప్పించింది.38వ టెస్టు కెప్టెన్‌గా..టీమిండియా టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు తొలిసారి చేపట్టేందుకు పంత్ సిద్దమయ్యాడు. టీ20 క్రికెట్లో సారథిగా అపారమైన అనుభవం కలిగి ఉన్న పంత్.. సంప్రాదాయ క్రికెట్లో ఎలా జట్టును నడిపిస్తాడని అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా కెప్టెన్‌గా పంత్ వ్యవహరించాడు. 2017-18 రంజీ ట్రోఫీ సీజన్లో ఇషాంత్ శర్మ గైర్హజరీలో ఢిల్లీ జట్టును పంత్ నడిపించాడు. ఆ సీజన్లో పంత్ వ్యక్తిగత ప్రదర్శన పరంగా నిరాశపరిచినప్పటికి.. అతడి నాయకత్వంలో ఢిల్లీ ఫైనల్‌కు చేరింది. పంత్ ఇప్పటివరకు ఐదు ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించగా.. రెండు విజయాలు, ఒక ఓటమిని ఎదుర్కొన్నాడు.రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిసింది. అదేవిధంగా గతంలో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా కూడా పంత్ బాధ్యతలు నిర్వర్తించాడు. సీనియర్ ఆటగాళ్లు గైర్హజరీలో ఐదు టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ ఐదు మ్యాచ్‌లలో భారత్ రెండింట విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది.ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఐపీఎల్లో పంత్ ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా కూడా పంత్ పనిచేశాడు. ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంత్ 57 మ్యాచ్‌లలో నాయకత్వం వహించాడు.ఇందులో 30 విజయాలు, 27 ఓటములు ఉన్నాయి. అతడి విన్నింగ్ శాతం 52.63గా ఉంది. టీ20ల్లో కెప్టెన్‌గా సాహసోపేతమైన నిర్ణయాలు, ఫీల్డ్ ప్లేస్మెంట్లు సెట్ చేయడంలో పంత్‌ది దిట్ట. మరి టెస్టుల్లో అదే మైండ్ సెట్‌తో వెళ్తాడా లేదా? తన శైలికి భిన్నంగా జట్టును నడిపిస్తాడో వేచి చూడాలి. కాగా భారత టెస్టు జట్టుకు 38వ కెప్టెన్‌గా పంత్ రికార్డులకెక్కాడు. -
శుబ్‌మన్ గిల్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం!
సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తోంది. అంతేకాదు అతడు జట్టును వీడి తిరిగి ముంబైకి పయనమైనట్లు సమాచారం. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియాతో రెండు టెస్టులు (IND vs SA) ఆడేందుకు సౌతాఫ్రికా ఇక్కడకు వచ్చింది.ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినా.. కోల్‌కతా వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరుగగా సౌతాఫ్రికా టీమిండియాపై ముప్పై పరుగుల తేడాతో గెలిచింది. కోల్‌కతాలో జరిగిన ఈ మ్యాచ్ రెండో రోజు ఆట సందర్భంగా గిల్ మెడ నొప్పితో మైదానం వీడాడు. ఆ తర్వాత వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తెలిపింది.ఆ మరుసటి రోజు గిల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు బోర్డు వెల్లడించింది. అయితే, మెడ నొప్పి ఇంకా తీవ్రంగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో చావోరేవో తేల్చుకోవాల్సిన రెండో టెస్టుకు గిల్ దూరమవుతాడనే అంచనాలు రాగా.. అనూహ్యంగా అతడు జట్టుతో పాటు గువాహటికి ప్రయాణం చేశాడు. తద్వారా మ్యాచ్‌కు తాను అందుబాటులో ఉంటాననే సంకేతాలు ఇచ్చాడు.అయితే, గిల్ ఇంకా మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్లు ఫిజియోలు, వైద్యులు నిర్ణయించలేదని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ గురువారం మీడియా సమావేశంలో తెలిపాడు. శుక్రవారం సాయంత్రానికి గిల్ పరిస్థితిని బట్టి మ్యాచ్ ఆడించాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాడు. తాజా సమాచారం ప్రకారం గిల్ ఈ మ్యాచ్ నుంచి వైదొలిగినట్లు సమాచారం.జట్టు నుంచి రిలీజ్!టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. బీసీసీఐ గిల్‌ను జట్టు నుంచి రిలీజ్ చేసింది. కోలుకునే దశలో భాగంగా అతడిని మళ్లీ ముంబైకి పంపించినట్లు తెలుస్తోంది. బోర్డు సూచన మేరకు కొన్నాళ్ల పాటు గిల్ ముంబైలో డాక్టర్ దిన్షా పార్థీవాలా పర్యవేక్షణలో ఉండనున్నట్లు సమాచారం. రికవరీని బట్టి గిల్ సౌతాఫ్రికాతో వన్డేలు ఆడతాడా? లేదా? అన్న విషయాన్ని బోర్డు నిర్ణయిస్తుంది. కాగా భారత్- సౌతాఫ్రికా మధ్య శనివారం మొదలయ్యే రెండో టెస్టుకు గువాహటిలోని బర్సపరా స్టేడియం వేదిక. ఇందులో గెలిస్తేనే టీమిండియా సిరీస్‌ను 1-1తో సమం చేయగలదు. లేదంటే సొంతగడ్డపై టెస్టులలో మరో ఘోర పరాభవం తప్పదు.చదవండి: IND vs SA: 'నీ ఈగోను పక్కన పెట్టు'.. టీమిండియా ఓపెనర్‌కు వార్నింగ్ -
శుబ్‌మన్ గిల్ వెళ్తాడు.. కానీ: బీసీసీఐ
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక అప్డేట్ అందించింది. గిల్ గువాహటికి ప్రయాణం చేస్తాడని స్పష్టం చేసింది. కాగా భారత జట్టు స్వదేశంలో సౌతాఫ్రికా (IND vs SA)తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.మెడ నొప్పి తీవ్రం కావడంతోఇందులో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా గిల్ భారత తొలి ఇన్నింగ్స్ సమయంలో గాయపడ్డాడు. మెడ నొప్పి తీవ్రం కావడంతో మైదానం వీడాడు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గిల్‌ను ఆస్పత్రికి తరలించిన బీసీసీఐ.. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఐసీయూలో ఉంచి చికిత్స అందించింది.ప్రస్తుతం గిల్ పరిస్థితి బాగానే ఉంది. అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కానీ మెడ నొప్పి మాత్రం ఇంకా తగ్గలేదు. దీంతో బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు అతడి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో గిల్ విమాన ప్రయాణం చేస్తే.. నొప్పి ఎక్కువయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించినట్లు సమాచారం బయటకు వచ్చింది.దీంతో సౌతాఫ్రికాతో గువాహటిలో శనివారం మొదలయ్యే రెండో టెస్టుకు గిల్ అందుబాటులో ఉండడనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో బీసీసీఐ తాజాగా గిల్ ఆరోగ్యం గురించి కీలక అప్డేట్ అందించింది.శుబ్‌మన్ గిల్ వెళ్తాడు.. కానీఈ మేరకు.. ‘‘కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో రెండో రోజు ఆట సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మెడ నొప్పితో బాధపడ్డాడు. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించాము.మరుసటి రోజు అతడు డిశ్చార్జ్ అయ్యాడు. చికిత్సకు గిల్ స్పందిస్తున్నాడు. నవంబరు 19న జట్టుతో కలిసి అతడు గువాహటికి ప్రయాణం చేస్తాడు. అయితే, బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలోనే ఉంటాడు. పరిస్థితిని బట్టి అతడిని రెండో టెస్టులో ఆడించాలా? లేదా? అనే నిర్ణయం తీసుకుంటాం’’ అని బీసీసీఐ బుధవారం నాటి ప్రకటనలో పేర్కొంది.చదవండి: ఆల్‌టైమ్ టీ20 జట్టు.. రోహిత్, కోహ్లికి దక్కని చోటు!.. ఓపెనర్లుగా వారే.. -
T20: చాంపియన్ కర్ణాటక.. ఫైనల్లో ఆంధ్ర జట్టుపై గెలుపు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అండర్–19 మహిళల టీ20 ట్రోఫీ ఎలైట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు రన్నరప్‌గా నిలిచింది. కోల్‌కతా వేదికగా బుధవారం జరిగిన ఫైనల్లో ఆంధ్ర జట్టు ఏడు వికెట్ల తేడాతో కర్ణాటక (Karnataka vs Andhra) జట్టు చేతిలో ఓడిపోయింది. మొహమ్మద్ మెహక్ సారథ్యంలోని ఆంధ్ర జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు సాధించింది.ధాటిగా ఆడిన దీక్ష.. కానీఆంధ్ర ఓపెనర్ కాట్రగడ్డ దీక్ష (21 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడింది. సేతు సాయి (46 బంతుల్లో 45; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. గ్రీష్మ సైనీ (12 బంతుల్లో 11; 2 ఫోర్లు), అంజుమ్ (22 బంతుల్లో 14; 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఈ నలుగురు మినహా మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు.కర్ణాటక బౌలర్లలో జె.దీక్ష 21 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... వందిత రావు, వేద వర్షిణి 2 వికెట్ల చొప్పున తీశారు. అనంతరం 120 పరుగుల లక్ష్యాన్ని కర్ణాటక 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకొని చాంపియన్‌గా అవతరించింది. ఒకదశలో 55 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన కర్ణాటక జట్టును సీడీ దీక్ష (39 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), కాష్వీ కందికుప్ప (20 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు) విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు అజేయంగా 65 పరుగులు జోడించారు.రెండో స్థానంలో నిలిచిఆంధ్ర బౌలర్లలో తమన్నా, బీఎస్ దీప్తి, అంజుమ్ ఒక్కో వికెట్ తీశారు. మొత్తం 30 జట్లు పాల్గొన్న ఈ టోరీ్నలో గ్రూప్ ‘ఎ’లో ఉన్న ఆంధ్ర జట్టు లీగ్ మ్యాచ్‌లు ముగిశాక రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర 27 పరుగుల తేడాతో రాజస్తాన్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గుజరాత్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర ఐదు వికెట్ల తేడాతో నెగ్గి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. బెంగాల్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆంధ్ర ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్ పోరుకు చేరుకుంది.చదవండి: హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం -
ఆరోజే ఐపీఎల్ వేలం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026 Auction)- 2026 సీజన్ వేలం వరుసగా మూడో ఏడాది విదేశీ గడ్డపైనే జరగనుంది. తాజా సీజన్ వేలం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుదాబి నగరాన్ని వేదికగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉన్నతాధికారి ఒకరు నిర్ధారించారు. కాగా 2023లో దుబాయ్, 2024లో జిద్దాలో ఐపీఎల్ లీగ్ వేలం నిర్వహించారు. అయితే, వేలంపాటకు సంబంధించిన తేదీ విషయంలో బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. డిసెంబర్ 15 లేదా 16 తేదీల్లో వేలం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా పది ఫ్రాంఛైజీలు నవంబరు 15 నాటికి తాము అట్టిపెట్టుకునే, విడిచిపెట్టే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అత్యధికంగా ఐదేసి సార్లు ట్రోఫీ గెలవగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ మూడు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ ఒక్కోసారి చాంపియన్‌గా నిలిచాయి. ఇక 2009లో డక్కన్ చార్జర్స్ టైటిల్ గెలుచుకుంది. ఈ ఏడాది ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడగా.. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ల కల ఇంకా తీరలేదు.ఇదీ చదవండి: సరికొత్త చరిత్రజమ్మూ కశ్మీర్ జట్టు తమ రంజీ ట్రోఫీ చరిత్రలో ఘనతకెక్కే విజయాన్ని సాధించింది. గత 65 ఏళ్లుగా ఢిల్లీ చేతిలో ఇంటా బయటా ఓడిపోతూ వచ్చిన కశ్మీర్ ఇప్పుడు ఢిల్లీ గడ్డపై ఢిల్లీనే వణికించి గెలిచింది. గ్రూప్ ‘డి’లో జరిగిన ఈ మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్ జట్టు 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై జయభేరి మోగించింది. ఇది గాలివాటం గెలుపు కానేకాదు. మ్యాచ్ మొదలైన మొదటి రోజు నుంచి ఢిల్లీ బ్యాటర్లను జమ్మూ బౌలర్లు ఆకిబ్ నబీ (5/35), వంశజ్ (2/57), ముస్తాక్ (2/50) సమష్టిగా దెబ్బకొట్టారు.తర్వాత బ్యాటింగ్‌లో కెప్టెన్ పారస్ డోగ్రా తొలి ఇన్నింగ్స్ శతకం, ఢిల్లీ రెండో ఇన్నింగ్స్‌ను వంశజ్ (6/68), సాహిల్ (3/73) ఇలా ప్రతి ఒక్కరు కశ్మీర్‌ను గెలిపించేందుకు ప్రతీ రోజు కష్టపడ్డారు. 1960 నుంచి ఇప్పటివరకు ఢిల్లీ, జమ్మూ కశీ్మర్ జట్లు 43 సార్లు తలపడితే ఇందులో 37 మ్యాచ్‌ల్లో ఢిల్లీదే గెలుపు. గత సీజన్ వరకు ఢిల్లీపై గెలుపన్నదే ఎరుగని కశీ్మర్ జట్టు ఎట్టకేలకు తాజా సీజన్లో అసాధారణ ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. ఇక్బాల్ అజేయ శతకం మంగళవారం 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్ స్కోరు 55/2తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కశ్మీర్ 43.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ (147 బంతుల్లో 133 నాటౌట్; 20 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతను బాదుతున్న బౌండరీలు, భారీ సిక్స్‌లతో విరుచుకుపడుతున్న వైనం చూస్తే ఇది నాలుగు రోజుల ఫస్ట్‌క్లాస్ మ్యాచా లేదంటే వన్డేనా అన్న సందేహం కలుగకమానదు.ఒంటిచేత్తో గెలిపించడం అంటే ఇదేనేమో అనిపించేలా దంచేశాడు. అవుటైన ముగ్గురు శుభమ్ (8), వివ్రంత్ శర్మ (3), వంశజ్ (8)లు చేసిందేమీ లేదు. ఇక్బాల్‌తో పాటు అజేయంగా నిలిచిన సారథి పారస్ డోగ్రా (10 నాటౌట్) పెద్ద స్కోరేం కాదు. ఈ నలుగురి కంటే కూడా ఎక్స్‌ట్రాల (17) రెండో అత్యధిక స్కోరు కావడం గమనార్హం!.. ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘డి’లో 7 పాయింట్లతో ఢిల్లీ ఆరో స్థానంలో ఉంది. సొంతగడ్డపై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలవకపోగా (రెండు డ్రా)... ఇప్పుడు కశ్మీర్ చేతిలో చిత్తుగా ఓడటంతో ఢిల్లీ నాకౌట్ అవకాశాల్ని క్లిష్టం చేసుకుంది.చదవండి: ఆర్సీబీ వాళ్లిద్దరిని వదిలేస్తే చాలు!.. మిగతా అందరూ ఉండాల్సిందే! -
శ్రేయస్ అయ్యర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం!
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమయ్యే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ శ్రేయస్ అయ్యర్.. పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అయ్యర్ తన ప్రక్కెటుమకల గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నాడు. అయితే అయ్యర్‌కు వైద్యులు దాదాపు ఐదు వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో ఈ ముంబై ఆటగాడిని సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఆడించి రిస్క్ తీసుకోడదని బీసీసీఐ భావిస్తుందంట. శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పడుతోంది. అయ్యర్ విషయంలో బోర్డు, సెలక్షన్ కమిటీ ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోదు అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. అయ్యర్ స్దానంలో సెలక్టర్లు సాయిసుదర్శన్కు చోటు ఇచ్చే అవకాశముంది.అయ్యర్‌కు ఏమైందంటే?ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో క్యారీ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే క్రమంలో బంతి అయ్యర్ పక్కటెముకలకు బలంగా తాకింది. ప్లీహానికి (Spleen Injury) తీవ్ర గాయమైంది. ఆ తర్వాత అంతర్గతంగా రక్తస్రావం జరిగినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో అతడికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఉంచి చికిత్స అందించారు. దాదాపు నాలుగు రోజుల తర్వాత శ్రేయస్ అయ్యర్ అస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయ్యర్ ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు.చదవండి: మహ్మద్ షమీ వర్సెస్ అగార్కర్.. ఎవరు గొప్ప బౌలర్? -
బీసీసీఐ చారిత్రక నిర్ణయం..!
మహిళల సీనియర్ క్రికెట్ జట్టు విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలిసారి ఓ విదేశీ వ్యక్తిని టీమిండియా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా (Strength And Conditioning Coach) నియమించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం బంగ్లాదేశ్ పురుషుల జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న నాథన్ కైలీతో (Nathan Keilty) బీసీసీఐ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తై కైలీ భారత మహిళా క్రికెట్ జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా ఎంపికైతే చరిత్ర అవుతుంది. భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్రలో తొలిసారి ఓ విదేశీ వ్యక్తి స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా ఎంపికైనట్లవుతుంది. ఇప్పటివరకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కి చెందిన వారు మాత్రమే మహిళల జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లుగా పనిచేశారు.ప్రస్తుతం భారత మహిళల జట్టుకు అల్ హర్షా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో ఆయన అద్భుతంగా పనిచేశారు. కానీ త్వరలో అతనికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. హర్షా స్థానాన్ని కైలీ భర్తీ చేస్తాడని బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి క్లూ ఇచ్చాడు.కాగా, ఇటీవలికాలంలో క్రికెట్ జట్ల సక్సెస్‌లో స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌ల పాత్ర క్రియాశీలకంగా మారింది. ప్లేయర్లలో శారీరక సామర్థ్యం, ఫిట్నెస్, గాయాల నివారణ, మానసిక స్థైర్యం వంటి అంశాలను వీరు పర్యవేక్షిస్తారు. జట్టులో ప్రతి ప్లేయర్‌కు వీరు వేర్వురుగా ప్రణాళికలు రూపొందిస్తుంటారు. దేశీయ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌ల పోలిస్తే విదేశీ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లకు పని అనుభవం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరి సేవల కోసం దాదాపుగా అన్ని జట్లు ఎగబడుతుంటాయి. భారత పురుషుల జట్టు ఇటీవలే దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్ లె రూక్స్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ నియమించుకుంది. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్‌కు బెదిరింపులు -
ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు!
టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami) పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే జట్టును ప్రకటించే సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) చేసిన వ్యాఖ్యలు.. బదులుగా షమీ కౌంటర్ ఇవ్వడం ఇందుకు కారణం.షమీ ఫిట్నెస్ గురించి అప్డేట్ లేదని అగార్కర్ తెలపగా.. రంజీలు ఆడే తాను వన్డేలు ఆడలేనా? అంటూ షమీ గట్టిగానే బదులిచ్చాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని.. అయితే, జట్టు ఎంపిక సమయంలో తనను సెలక్టర్లు ఎవరూ సంప్రదించలేదని బాంబు పేల్చాడు.మరో‘సారీ’ఇందుకు బదులిస్తూ.. షమీ ఫిట్‌గా లేనందువల్లే అతడిని ఆసీస్ టూర్‌కు ఎంపిక చేయలేదని అగార్కర్ పునరుద్ఘాటించాడు. ఈ క్రమంలో బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ (Ranji Trophy) తాజా సీజన్లో ఒకే మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు కూల్చి ఆటతోనే బదులిచ్చాడు షమీ.ఈ పరిణామాల నేపథ్యంలో సౌతాఫ్రికాతో నవంబరులో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌కు షమీని ఎంపిక చేస్తారనే విశ్లేషణలు రాగా.. మరోసారి సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. ఫలితంగా భారత జట్టు యాజమాన్యంపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు... ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సీనియర్ అధికారి ఒకరు షమీ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. ఇంగ్లండ్ పర్యటనకు రావాల్సిందిగా షమీని సెలక్టర్లు కోరినా.. అతడు మాత్రం రాలేనని చెప్పాడంటూ ఆరోపించారు.ఈ మేరకు PTIతో మాట్లాడుతూ.. ‘‘జాతీయ జట్టు సెలక్టర్లు.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చెందిన సహాయక సిబ్బంది చాలాసార్లు షమీ ఫిట్నెస్ చెక్ చేయాలని కాల్ చేశారు. ఇంగ్లండ్‌లో జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ నేపథ్యంలో షమీ సేవలను ఉపయోగించుకోవాలని ఎంతగానో తపించిపోయారు.ఇంగ్లండ్ పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బౌలింగ్ చేయగల సత్తా ఉన్న షమీ వంటి బౌలర్‌ను ఎవరు మాత్రం ఎందుకు కాదనుకుంటారు?.. తనను సెలక్టర్లు ఎవరూ సంప్రదించలేదంటూ షమీ గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం.సెలక్టర్లు అడిగినా రాలేదుఅంతర్జాతీయ క్రికెట్లో వరుసగా మ్యాచ్‌లు ఆడేందుకు షమీ ఫిట్‌గా ఉన్నాడా? లేడా? అన్న అంశంపై స్పోర్ట్స్ సైన్స్ టీమ్ ఎప్పటికప్పుడు అతడి మెడికల్ రిపోర్టులు పరిశీలిస్తూనే ఉంది’’ అని సదరు అధికారి పేర్కొన్నారు. సెలక్టర్లు అడిగినా రాలేదని పరోక్షంగా వెల్లడించాడు. కాగా ఇప్పటికే టెస్టు, టీ20 జట్లలో చోటు కోల్పోయిన షమీ.. వన్డేల్లో మాత్రం సత్తా చాటుతున్నాడు.చివరగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీలో ఈ రైటార్మ్ పేసర్ భాగమయ్యాడు. ఈ మెగా ఈవెంట్లో షమీ తొమ్మిది వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత ఇంత వరకు మళ్లీ జాతీయ జట్టుకు ఆడలేదు. కెరీర్‌కు ఎండ్కార్డ్ఇక వన్డే వరల్డ్‌కప్-2027ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన యాజమాన్యం.. విరాట్ కోహ్లి అందుబాటుపై కూడా క్లారిటీ లేదని చెప్పింది. ఇలాంటి తరుణంలో 35 ఏళ్ల షమీకి ఇకపై వన్డేలలోనైనా అవకాశం ఇవ్వడం దాదాపు అసాధ్యమని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగా షమీ అంతర్జాతీయ కెరీర్‌కు పూర్తిస్థాయిలో ఎండ్‌కార్డ్ పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ఆ ఓవరాక్షనే వద్దనేది.. అదేమైనా వరల్డ్ కప్ ట్రోఫీనా? -
జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా
తొలిసారి వన్డే ప్రపంచకప్ (Women's Cricket World Cup 2025 Winner Prize Money) గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు (Team India) భారీ నజరానా (Prize Money) లభించింది. జగజ్జేత భారత్‌కు రికార్డు స్థాయిలో 44 లక్షల 80 వేల డాలర్లు (రూ. 39 కోట్ల 80 లక్షలు) ప్రైజ్‌మనీ అందింది. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు 22 లక్షల 40 వేల డాలర్లు (రూ. 19 కోట్ల 90 లక్షలు) లభించాయి.సెమీఫైనల్లో ఓడిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల ఖాతాలో 11 లక్షల 20 వేల డాలర్ల (రూ. 9 కోట్ల 94 లక్షలు) చొప్పున చేరాయి. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన శ్రీలంక, న్యూజిలాండ్ జట్లకు 7 లక్షల డాలర్ల (రూ. 6 కోట్ల 21 లక్షలు) చొప్పున... ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లకు 2 లక్షల 80 వేల డాలర్ల (రూ. 2 కోట్ల 48 లక్షలు) చొప్పున లభించాయి.అంతేకాకుండా ఈ మెగా ఈవెంట్లో ఆడిన ఎనిమిది జట్లకు గ్యారంటీ మనీ కింద 2 లక్షల 50 వేల డాలర్ల (రూ. 2 కోట్ల 22 లక్షలు) చొప్పున దక్కాయి. లీగ్ దశలో సాధించిన ఒక్కో విజయానికి ఆయా జట్లకు 34 వేల 314 డాలర్ల (రూ. 30 లక్షల 47 వేలు) చొప్పున లభించాయి. 300 శాతం పెరిగిన ప్రైజ్మనీవన్డే ప్రపంచకప్ విజేతకు లభించే ప్రైజ్‌మనీ ఈసారి 300 శాతం పెరిగింది. ఐసీసీ అధ్యక్షుడు జై షా ఈ పెంపును అమల్లోకి తెచ్చారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.బీసీసీఐ భారీ నజరానావరల్డ్కప్ విజేత భారత్‌కు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. జగజ్జేత టీమిండియాకు రూ. 51 కోట్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు సైకియా తెలిపారు. ఈ బహుమతిని జట్టులోని ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ పంచుకుంటారని అన్నారు.కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలుపొంది, వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి సౌతాఫ్రికాను చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారత్‌కు భారీ స్కోర్ (298/7) అందించగా.. టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగిపోయింది. ఫలితంగా సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వర్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చదవండి: హ్యాట్సాఫ్ మజుందార్ -
ఓటముల నుంచి ఉవ్వెత్తున ఎగసి...
ఎనిమిదేళ్ల క్రితం... వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 229 పరుగుల లక్ష్య ఛేదనలో చివర్లో తడబడిన భారత మహిళలు 9 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆఖరి 3 ఓవర్లలో 3 వికెట్లతో 14 పరుగుల చేయాల్సిన స్థితిలో అంత చేరువగా వచ్చి ఓడటం అందరినీ వేదనకు గురి చేసింది. అయితే 2017 వరల్డ్ కప్ ప్రదర్శన గతంతో పోలిస్తే మహిళల జట్టుకు ఎంతో మేలు చేసింది. అన్ని వైపుల ఆసక్తి కనిపించడంతో పాటు టీమ్ స్థాయి కూడా పెరిగింది. ప్రతీ దశలో బీసీసీఐ అన్ని రకాలుగా ప్రోత్సాహం ఇస్తూ టీమ్‌కు తగిన అవకాశాలు కల్పించింది. అయినా సరే, 2021 వరల్డ్ కప్ మరోసారి నిరాశను మిగిల్చింది. ఈ టోర్నీలో భారత్ సెమీస్‌కు కూడా చేరలేకపోయింది. దీని తర్వాత మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సి వచ్చింది. సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత హర్మన్‌ప్రీత్ చేతుల్లోకి వన్డే టీమ్ సారథ్య బాధ్యతలు వచ్చాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం అమోల్ మజుందార్‌ను హెడ్ కోచ్‌గా ఎంపిక చేసిన తర్వాత టీమ్‌లో అసలైన మార్పు మొదలైంది. ఆ సమయంలో వేరే ఆలోచన లేకుండా 2025 వరల్డ్ కప్ కోసమే పక్కా ప్రణాళికతో జట్టు సన్నద్ధమైంది. టోర్నీ వేదిక భారత్ కావడంతో దానికి అనుగుణంగా జట్టును తీర్చిదిద్దేందుకు టీమ్ మేనేజ్మెంట్ ప్రయత్నించింది. 2023లో పూర్తి స్థాయిలో వచ్చిన ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రభావం కూడా టీమ్‌పై కనిపించింది. ఈ లీగ్ మన ప్లేయర్లకు కూడా పరిమిత ఓవర్ల క్రికెట్లో దూకుడు నేర్పించింది. అప్పుడప్పుడు కొన్ని ఓటములు వచ్చినా ప్రత్యర్థులు తేలిగ్గా తీసుకునే పరిస్థితిలో మార్పు కూడా కనిపించింది. ప్రత్యేక శిబిరాలు, ఎక్కువ విరామం లేకుండా వరుసగా వేర్వేరు జట్లతో సిరీస్‌లు భారత్ ఆటను మరింత పదునుగా మార్చాయి. గత రెండేళ్లలో ఇది క్రమ పద్ధతిలో సాగింది. బలమైన ప్రత్యర్థులైన ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలపై జట్టు చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. ఇటీవలే ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి సిరీస్ గెలవడం టీమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. సరిగ్గా టోర్నీకి ముందు స్వదేశంలోనే జరిగిన సిరీస్‌లో ఆ్రస్టేలియాతో ఓడినా... మన జట్టు కూడా బలమైన ప్రదర్శనే ఇచ్చింది. ముఖ్యంగా మూడో వన్డేలో 412 పరుగుల లక్ష్య ఛేదనలో ఏకంగా 369 పరుగులు చేయగలిగింది. ఇదే మ్యాచ్ సెమీస్‌లో ఆసీస్‌పై విజయానికి స్ఫూర్తినిచ్చిందనడంలో సందేహం లేదు. జట్టులోని ప్రతీ ఒక్కరు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. 434 పరుగులతో ఎప్పటిలాగే స్మృతి జట్టు నంబర్‌వన్ బ్యాటర్‌గా తన స్థాయిని ప్రదర్శించగా, గాయంతో 7 మ్యాచ్‌లకే పరిమితమైన ప్రతీక 308 పరుగులు సాధించింది. విజయం సాధించిన తర్వాత వీల్‌చైర్‌లో కూర్చొని ఆమె సంబరాల్లో పాల్గొనడం సగటు అభిమానులందరికీ సంతృప్తినిచ్చింది. జెమీమా 292 పరుగులే చేసినా, ఆసీస్‌పై సెమీఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్‌ను ఆమెను చిరస్థాయిగా నిలబెట్టింది. రిచా ఘోష్ ఏకంగా 133.52 స్ట్రయిక్‌రేట్‌తో చేసిన 235 పరుగులు జట్టుకు ప్రతీసారి కావాల్సిన జోరును అందించాయి. 260 పరుగులు చేసిన హర్మన్ నాయకురాలిగా జట్టును సమర్థంగా నడిపించింది. సెమీస్ ఆడిన ఇన్నింగ్స్ కూడా ఆమె స్థాయిని చూపించింది. కెప్టెన్‌గా సాధించిన ఈ గెలుపుతో భారత క్రికెట్లో ఆమె దిగ్గజాల సరసన నిలిచింది. బౌలింగ్‌లో దీప్తి శర్మ 22 వికెట్లతో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా విజయంలో ప్రధాన భూమిక పోషించింది. ముఖ్యంగా ఫైనల్లో తీసిన ఐదు వికెట్లు ఎప్పటికీ మర్చిపోలేనివి. బ్యాటింగ్‌లో కూడా ఆమె 3 అర్ధసెంచరీలు సాధించింది. రేణుక, క్రాంతి, అమన్‌జోత్, రాధ అంకెలపరంగా పెద్ద గణాంకాలు నమోదు చేయకపోయినా... జట్టుకు అవసరమైన ప్రతీసారి కీలక సమయంలో తామున్నామంటూ ముందుకు వచ్చారు. ఇదే జట్టును నడిపించింది. లీగ్ దశలో వరుసగా దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌లాంటి చేతుల్లో ఓడి ఒక్కసారిగా జట్టు నిరాశలో కూరుకుపోయింది. అన్నివైపుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఆట మాత్రం మారడం లేదని సూటిపోటు మాటలు వినిపించాయి. కానీ అక్కడినుంచి టీమ్ ఉవ్వెత్తున ఎగసింది. సెమీస్ స్థానం ఖాయం చేసుకోవడంతో పాటు సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లలో అద్భుత విజయాలతో చాంపియన్‌గా నిలిచింది. ఈ అసాధారణ, అద్భుత ప్రదర్శనకు దేశం మొత్తం సలామ్ చేస్తోంది. -
ఆసీస్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో కీలక మార్పు
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత టీ20 జట్టులో ఓ కీలక మార్పు చోటు చేసుకుంది. ఆసీస్ మిగిలిన రెండు టీ20కు ముందు జట్టు నుంచి స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను బీసీసీఐ రిలీజ్ చేసింది. 30 ఏళ్ల కుల్దీప్ స్వదేశానికి వచ్చి దక్షిణాఫ్రికా-తో జరగనున్న రెండో అనాధికరిక టెస్టులో ఇండియా-ఎ జట్టు తరపున ఆడనున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు ఈ మ్యాచ్ కుల్దీప్కు ప్రాక్టీస్ ఉపయోగపడుతుందని బోర్డు భావించింది. ఈ క్రమంలోనే జట్టు నుంచి యాదవ్‌ను బీసీసీఐ విడుదల చేసింది. "బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో దక్షిణాఫ్రికా-ఎతో జరగనున్న రెండో టెస్టులో కుల్దీప్ పాల్గోనున్నాడు. భారత జట్టు మెనెజ్‌మెంట్ అభ్యర్ధన మెరకు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి కుల్దీప్ను రిలీజ్ చేశాము" అని భారత క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఆసీస్‌తో తొలి రెండు మ్యాచ్‌లలో ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగమైన కుల్దీప్.. మూడో టీ20కి మాత్రం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు ఏకంగా జట్టు నుంచి బయటకు వచ్చేశాడు. ఇక ఆదివారం హోబర్ట్ వేదికగా జరిగిన మూడో టీ20లో 5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది.ఆసీస్‌తో సిరీస్ కోసం అప్డేటడ్ భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, సంజూకు రష్‌దీప్ సింగ్, సంజూకు వాషింగ్టన్ సుందర్.దక్షిణాఫ్రికా -ఎతో జరిగే టెస్టుకు భారత-ఎ జట్టురిషబ్ పంత్ (కెప్టెన్) , కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, ఇ, ఖులీల్, అబ్ర్మేద్యు, ఖులీల్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్ -
WC 2025: కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ!.. బీసీసీఐ బంపరాఫర్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. నవీ ముంబై వేదికగా భారత్- సౌతాఫ్రికా (IND W vs SA W) మధ్య ఆదివారం నాటి ఫైనల్‌తో ఈ టోర్నీలో కొత్త చాంపియన్ అవతరించనుంది.ఈ ఈవెంట్లో ఇప్పటికే రెండుసార్లు రన్నరప్‌గా నిలిచిన టీమిండియా.. తొలిసారి ఫైనలిస్టు అయిన సౌతాఫ్రికా... ప్రస్తుత బలాబలాల దృష్ట్యా టైటిల్ పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త చాంపియన్ రాకతో పాటు.. ఈసారి వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి మరో ప్రత్యేకత కూడా ఉంది.కళ్లు చెదిరే ప్రైజ్మనీవిజేతగా నిలిచిన జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ ప్రకటించింది. పురుషుల, మహిళల క్రికెట్లో రికార్డు స్థాయిలో చాంపియన్‌కు ఏకంగా 4.48 మిలియన్ యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 39.78 కోట్లు) ఇవ్వనుంది.123 కోట్ల రూపాయలుఅదే విధంగా.. రన్నరప్ జట్టుకు.. విజేతకు అందించిన నగదులో సగం అంటే 2.24 మిలియన్ యూఎస్ డాలర్లు (దాదాపు రూ. 19 కోట్లకు పైగా) ప్రైజ్‌మనీగా ప్రకటించింది. భారత్- శ్రీలంక సంయుక్త ఆతిథ్య దేశాలుగా ఉన్న ఈ టోర్నీ ప్రైజ్‌మనీల మొత్తానికి ఐసీసీ ఏకంగా 13.88 మిలియన్ యూఎస్ డాలర్లు అంటే... దాదాపు 123 కోట్ల రూపాయలు కేటాయించింది.239 శాతం పెంచారువరల్డ్కప్ టోర్నీ చరిత్రలోనే ఇది అత్యధికం. వన్డే వరల్డ్‌కప్-2022 ఎడిషన్‌తో పోలిస్తే ఇది ఏకంగా 297 శాతం ఎక్కువ కావడం విశేషం. అంతేకాదు.. నాటి విజేత ఆస్ట్రేలియాకు ఇచ్చిన ప్రైజ్‌మనీ కంటే తాజా సీజన్ విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్‌మనీని ఏకంగా 239 శాతం పెంచడం గమనార్హం.రూ. 42 కోట్లకుఇక ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే దాదాపు 3,50,000 యూఎస్ డాలర్ల ప్రైజ్‌మనీ (సుమారుగా 3.1 కోట్ల రూపాయలు) సొంతం చేసుకుంది. టోర్నీలో పాల్గొన్నందుకు, గ్రూప్ దశలో మూడు విజయాలకు గానూ ఈ మొత్తం టీమిండియాకు లభించింది. అన్నీ సజావుగా సాగి భారత్ చాంపియన్‌గా అవతరిస్తే మొత్తం ప్రైజ్‌మనీ రూ. 42 కోట్లకు చేరుకుంటుంది.మరోవైపు.. సౌతాఫ్రికా ఇప్పటికే నాలుగు లక్షల యూఎస్ డాలర్లకుపైగా గెలుచుకుంది. గ్రూప్ దశలో ఐదు విజయాలు సాధించి ఈ మొత్తం సొంతం చేసుకుంది. ఏదేమైనా క్రికెట్ ప్రపంచంలో పురుష జట్ల ఆధిపత్యం కొనసాగుతున్న వేళ.. మహిళా టోర్నీలో రికార్డు స్థాయి ప్రైజ్‌మనీ అందించడం హర్షించదగ్గ పరిణామం. మహిళా క్రికెట్‌కు ఆదరణ పెంచడంతో పాటు.. యువ ఆటగాళ్లను ఆకర్షించడానికి ఇలాంటి చర్యలు తోడ్పడతాయి.బీసీసీఐ బంపరాఫర్!ఇదిలా ఉంటే.. ఒకవేళ హర్మన్ సేన గనుక వన్డే వరల్డ్‌కప్ గెలిస్తే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మహిళా క్రికెటర్లుకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోందని సమాచారం. పురుష క్రికెటర్లతో పాటు మహిళా ప్లేయర్లకు కూడా సమవేతనం చెల్లించాలనే యోచనలో ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి. మరోవైపు.. హర్మన్‌సేన ట్రోఫీ గెలిస్తే బీసీసీఐ రూ. 125 కోట్ల నజరానా ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. కాగా నవీ ముంబై వేదికగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు భారత్- సౌతాఫ్రికా మధ్య ఫైనల్‌కు తెరలేస్తుంది.చదవండి: IND vs AUS 3rd T20: సమం చేసేందుకు సమరం -
BCCI: శ్రేయస్ అయ్యర్ డిశ్చార్జ్.. కానీ..
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని.. అతడు వేగంగా కోలుకుంటున్నట్లు తెలిపింది. బీసీసీఐ వైద్య బృందం, సిడ్నీలోని స్పెషలిస్టులు అతడి రికవరీ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని.. శనివారం అతడిని డిశ్చార్జ్ చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. కాగా భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సిడ్నీలో ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. పక్కటెముకల్లో అంతర్గత రక్తస్రావంహర్షిత్ రాణా బౌలింగ్‌లో ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీ ఇచ్చిన రన్నింగ్ క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్ పక్కటెముకలకు బలమైన గాయమైంది. దీంతో వైద్య సిబ్బంది సహాయంతో అతడు మైదానాన్ని వీడగా... ఆ తర్వాత పరిస్థితి తీవ్రతను గుర్తించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయు)కు తరలించారు.స్పందించిన శ్రేయస్పక్కటెముకల్లో అంతర్గత రక్తస్రావాన్ని గుర్తించి వైద్యం అందించగా... శ్రేయస్ త్వరితగతిన కోలుకుంటున్నాడు. ఈ విషయంపై గతంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటన విడుదల చేసింది. అయితే రెండోసారి వైద్య పరీక్షల అనంతరం శ్రేయస్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ‘ప్రస్తుతం కోలుకునే ప్రక్రియలో ఉన్నాను. రోజు రోజుకు మరింత మెరుగ్గా అనిపిస్తుంది. క్లిష్ట సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని శ్రేయస్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. గాయం కారణంగా మైదానాన్ని వీడినప్పటి నుంచి అయ్యర్... బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలోనే ఉండగా.. తాజాగా అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు బోర్డు తెలిపింది.వారికి బీసీసీఐ థాంక్స్ఈ సందర్భంగా.. సిడ్నీ డాక్టర్ కొరొష్ హగిగి, అతడి వైద్య బృందానికి.. అదే విధంగా.. భారత్‌కు చెందిన డాక్టర్ దిన్షా పార్దీవాలాకు బీసీసీఐ ధన్యవాదాలు చెప్పింది. శ్రేయస్ అయ్యర్ త్వరగా కోలుకునేలా మెరుగైన చికిత్స అందించినందుకు కృతజ్ఞతలు తెలిపింది.డిశ్చార్జ్ అయినాకాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినా శ్రేయస్ అయ్యర్ మరికొన్నాళ్లు పాటు సిడ్నీలోనే ఉండనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. చికిత్స అనంతర పరీక్షల కోసం అతడు సిడ్నీలోనే ఉంటాడని.. విమాన ప్రయాణం చేయొచ్చని వైద్యులు చెప్పిన తర్వాతే భారత్‌కు తిరిగి వస్తాడని తెలిపింది.చదవండి: రోహిత్ శర్మ ఆల్‌టైమ్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బాబర్ -
IND vs AUS 1st T20I: వర్షం వల్ల మ్యాచ్ రద్దు
Australia vs India, 1st T20I- Canberra: ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైపోయింది. కాన్బెర్రాలో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఐదు ఓవర్ల తర్వాత ఆటకు వర్షం అంతరాయం కలిగించగా.. మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. కాసేపటి తర్వాత తిరిగి మొదలుపెట్టారు.అయితే, 9.4 ఓవర్ల మధ్య వర్షం మళ్లీ ఆటంకం కలిగించింది. ఆ తర్వాత వాన తగ్గే సూచనలు కనిపించకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. 9.4 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 14 బంతుల్లో 19 పరుగులు చేసి నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (20 బంతుల్లో 37), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 39) అజేయంగా నిలిచారు.మళ్లీ వర్షం.. ఆగిన ఆట9.4 ఓవర్ల వద్ద వర్షం మళ్లీ ఆటకు ఆటంకం కలిగింది. స్కోరు: 97-1. సూర్య 24 బంతుల్లో 39, గిల్ 20 బంతుల్లో 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.తొమ్మిది ఓవర్లలో టీమిండియా స్కోరు: 82-1.సూర్య 20 బంతుల్లో 37, సూర్య 20 బంతుల్లో 25 పరుగులతో క్రీజులో ఉన్నారు.తిరిగి ప్రారంభమైన ఆట.. ఆట తిరిగి ప్రారంభమైంది. 6 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్(25), సూర్యకుమార్ యాదవ్(12) ఉన్నారు.వర్షం వల్ల ఆటకు అంతరాయంఐదు ఓవర్ల ఆట ముగిసే సరికి భారత్ స్కోరు: 43-1. గిల్ 16, సూర్య 8 పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్3.5: నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగిన అభిషేక్ శర్మ. 14 బంతుల్లో 19 పరుగులు చేసి టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఓపెనింగ్ బ్యాటర్. టీమిండియా స్కోరు: 36-1(4). గిల్ 16 పరుగులతో ఉండగా.. సూర్యకుమార్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నాడు.టాస్ గెలిచిన ఆస్ట్రేలియాకాన్బెర్రా వేదికగా టీమిండియాతో తొలి టీ20లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా (IND vs AUS 1st T20I) తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఆసీస్ సారథి మిచెల్ మార్ష్ (Mitchell Marsh) మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగుంది. కాన్బెర్రాలో ప్రేక్షకుల మద్దతు కూడా మాకు కలిసి వస్తుంది. టీమిండియా మాదిరే మేము కూడా దూకుడైన క్రికెట్ ఆడుతున్నాం.ఇరుజట్లు పటిష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా వరల్డ్ నంబర్ వన్ జట్టుగా ఉంది. ఇలాంటి జట్టుతో పోటీ అంటే ఆసక్తికరమే. మా జట్టులో అవసరమైన మేర బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లు ఉన్నారు’’ అని పేర్కొన్నాడు.ఇక టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘మేము ముందుగా బ్యాటింగ్ చేయాలనే భావించాము. వికెట్ బాగుంది. మనుకా ఓవల్‌లో ఎక్కువ మ్యాచ్‌లు జరుగలేదని మా అనలిస్టుల ద్వారా విన్నాను. సెకండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ కాస్త నెమ్మదించవచ్చు.అది ఎప్పుడూ తలనొప్పిగానే ఉంటుందిఅందుకే ముందుగానే బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. మూడు- నాలుగు రోజుల ముందే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేశాము. నిన్నటి మాదిరే ఈరోజు వాతావరణం చల్లగా ఉంది.మా జట్టులో ప్రతి ఆటగాడు తన వంతు పాత్ర పోషిస్తాడు. బాధ్యతాయుతంగా ఆడతారు. అందుకే తుదిజట్టు ఎంపిక ఎప్పుడూ తలనొప్పిగా మారుతుంది. అయితే, ఆ విషయంలో మాకు సంతోషంగా ఉంది. ఇంతమంది మంచి ఆటగాళ్లు అందుబాటులో ఉండటం సానుకూలాంశం. మాకు చాలా ఆప్షన్లు ఉన్నాయి.నితీశ్ రెడ్డి అవుట్ఈరోజు రింకూ సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, నితీశ్ రెడ్డి మిస్సవుతున్నారు’’ అని తెలిపాడు. కాగా గాయం కారణంగా నితీశ్ రెడ్డి ఆస్ట్రేలియాతో తొలి మూడు టీ20 మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వెల్లడించింది. గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్న నితీశ్ రెడ్డి బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. తుదిజట్లు:టీమిండియా అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టొయినిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్.చదవండి: నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది.. సెలక్టర్ జోక్యంతో షమీ యూటర్న్?SKYBALL incoming!Get ready for some fearless batting, full hitting as #TeamIndia have been put in to bat first in the 1st T20I!#AUSvIND 👉 1st T20I | LIVE NOW 👉 https://t.co/nKdrjgZhGQ pic.twitter.com/wpak5bA2lz— Star Sports (@StarSportsIndia) October 29, 2025 -
ఈ హెడ్‌కోచ్ వద్దని పట్టుబట్టిన ఆటగాళ్లు.. తొలగించిన బీసీసీఐ!
గత దశాబ్ద కాలంగా భారత క్రికెట్ జట్టు- హెడ్‌కోచ్‌ల మధ్య అనుబంధం బాగా బలపడింది. రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)లతో మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సత్సంబంధాలు కొనసాగించారు. ఇక ద్రవిడ్ మార్గదర్శనంలో.. రోహిత్ సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన విషయం తెలిసిందే.ఆ తర్వాత ద్రవిడ్ హెడ్‌కోచ్ పదవి నుంచి వైదొలగగా.. మరో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ (Gautam Gambhir) భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. తన వ్యూహాలకు అనుగుణంగా యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు వచ్చేలా చేస్తున్న గౌతీ.. ఇటీవలే శుబ్‌మన్ గిల్ టెస్టు, వన్డే పగ్గాలు చేపట్టడంలో కీలక పాత్ర పోషించాడు.ప్రస్తుతానికి కోచ్‌కు- ఆటగాళ్లకు మధ్య చిన్న చిన్న విభేదాలు తప్ప పెద్ద గొడవలేమీ లేనట్లే కనిపిస్తోంది. జట్టుపై పూర్తిగా పట్టు సాధించిన గౌతీ.. అవసరమైన వేళ ఆటగాళ్లకు మద్దతుగా ఉంటూ టీమ్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వివాదంమరి గతంలో ఓ హెడ్‌కోచ్‌కు- ఆటగాళ్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వివాదం రాజుకుందని తెలుసా?.. మీరు ఊహించినట్లుగా ఇది గ్రెగ్ చాపెల్- సౌరవ్ గంగూలీ ఎపిసోడ్ గురించి కాదు. భారత వరల్డ్‌కప్ విన్నింగ్ హీరోకు- దిగ్గజ ఆటగాళ్లకు మధ్య జరిగిన గొడవ.. ఇంతకీ ఏంటీ విషయం?!కపిల్ దేవ్ కెప్టెన్సీలో వన్డే వరల్డ్‌కప్-1983 నెగ్గిన జట్టులో సభ్యుడైన మదన్ లాల్.. 1996- 97 మధ్య కాలంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉండగా.. మదన్ లాల్ (Madan Lal) నాడు టీమ్‌లో ఉన్న కొందరు ఆటగాళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.విఫలం అవుతావని చెప్పాది హిందూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మదన్ లాల్ మాట్లాడుతూ.. టీమిండియా ఓటములకు సదరు ఆటగాళ్లే కారణం అనేలా విమర్శలు చేశాడు. అజయ్ జడేజా గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నువ్వు బౌలర్‌గా లేదంటే బ్యాటర్‌గా ఆడబోతున్నావా? అనేది ముందుగానే నిర్ణయించుకో అని అతడికి చెప్పాను. ఒక్క మ్యాచ్‌లో సరిగ్గా ఆడకపోతే తర్వాత ఐదు మ్యాచ్‌లలోనూ విఫలం అవుతావని చెప్పా’’ అని మదన్ లాల్ పేర్కొన్నాడు.ఆల్‌రౌండర్‌గా రాణించలేడుమరోవైపు రాబిన్ సింగ్‌ను ఉద్దేశించి.. ‘‘చాలానే కష్టపడతాడు కానీ.. అంతర్జాతీయ స్థాయిలో ఆల్‌రౌండర్‌గా రాణించలేడు’’ అని మదన్ లాల్ అన్నాడు. ఇక సబా కరీం గురించి మాట్లాడుతూ.. ‘‘అతడొక సగటు వికెట్ కీపర్ బ్యాటర్ మాత్రమే’’ అని ట్యాగ్ ఇచ్చాడు.కుంబ్లే ‘టర్న్’ కాదు.. దానిమీద దృష్టి పెట్టుఅంతేగాకుండా అప్పట్లో టీమిండియా ప్రధాన స్పిన్ అస్త్రమైన అనిల్ కుంబ్లే గురించి చెబుతూ.. ‘‘అతడి బౌలింగ్‌తో సంతోషంగా లేనని చెప్పా. నువ్వు బంతిని తిప్పడం కంటే లైన్ అండ్ లెంగ్త్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టమని చెప్పా’’ అని మదన్ లాల్ పేర్కొన్నాడు. ఓవరాల్‌గా.. ‘‘మేము గెలవలేకపోతున్నాం. కానీ నేనొక్కడినే ఏం చేయగలను?’’ అంటూ ఆటగాళ్లను టార్గెట్ చేశాడు.ఈ ఇంటర్వ్యూ తర్వాత భారత క్రికెట్ శిబిరంలో కల్లోలం చెలరేగింది. అప్పటి మేనేజర్ రత్నాకర్ శెట్టి వెంటనే జర్నలిస్టు విజయ్ను సంప్రదించి.. మదన్ లాల్ నిజంగానే ఈ వ్యాఖ్యలు చేశారని నిర్దారించుకున్నాడు.మాటల్లేవ్.. బాయ్‌కాట్ చేసేశారుఈ నేపథ్యంలో.. మదన్ లాల్ వ్యాఖ్యలతో తీవ్రంగా నొచ్చుకున్న ఆటగాళ్లు అతడితో చాలా రోజుల పాటు మాట్లాడనే లేదు. నాటి సిరీస్‌లో ఓ వన్డేలో అజయ్ జడేజా సెంచరీ చేసిన తర్వాత ఈ విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ మ్యాచ్‌లో మొహమ్మద్ అజారుద్దీన్ కూడా సెంచరీ చేశాడు. వేటు వేసిన బీసీసీఐఆ తర్వాత ఈ హెడ్‌కోచ్ వద్దని ఆటగాళ్లు పట్టుబట్టడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మదన్ లాల్‌పై వేటు వేసి అన్షుమాన్ గైక్వాడ్‌తో అతడి స్థానాన్ని భర్తీ చేసింది. అలా టీమిండియా హెడ్‌కోచ్‌గా మదన్ లాల్ పది నెలల పదవీ కాలం వివాదంతో ముగిసిపోయింది. అప్పటి బీసీసీఐ మేనేజర్ రత్నాకర్ శెట్టి తన ఆటోబయోగ్రఫీ.. ‘ఆన్ బోర్డ్- మై ఇయర్స్ ఇన్ బీసీసీఐ’లో ఈ విషయాలను ప్రస్తావించాడు.చదవండి: కాంట్రాక్టర్ నుంచి శ్రేయస్ దాకా.. మైదానంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్లు వీరే..! -
శ్రేయస్ అయ్యర్ గాయంపై బీసీసీఐ మరో అప్డేట్
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది. అయ్యర్ వేగంగా కోలుకుంటున్నట్లు బోర్డు తెలిపింది. "ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా శ్రేయస్ అయ్యర్ పొత్తికడుపుపై బలమైన గాయమైంది. ఈ గాయం కారణంగా అతని ప్లీహం (Spleen) చీలికకు గురై, అంతర్గత రక్తస్రావం జరిగింది.వెంటనే అతడి గాయాన్ని గుర్తించి బీసీసీఐ వైద్య బృందం అంతర్గత రక్తస్రావాన్ని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం శ్రేయస్ ఆరోగ్యం నిలకడగా ఉంది. మంగళవారం (అక్టోబర్ 28) అతడికి మరోసారి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. అతడి స్ల్పీన్ గాయంలో మెరుగుదల కన్పించింది. అతడు శరవేగంగా కోలుకుంటున్నాడు. అతడు మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు" అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా పేర్కొన్నారు. అయ్యర్‌ను ప్రస్తుతం ఐసీయూ నుంచి బయటకు తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో అతడు ఆస్ప్రత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశముంది.చదవండి: ఆస్పత్రిలో శ్రేయస్ అయ్యర్.. ఖర్చులు ఎవరు భరిస్తారో తెలుసా? -
ఆస్పత్రిలో శ్రేయస్ అయ్యర్.. ఖర్చులు ఎవరు భరిస్తారో తెలుసా?
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గాయపడిన సంగతి తెలిసిందే. సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో అలెక్స్ కారీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో.. శ్రేయస్ ఎడమ వైపు పక్కటెముకలు నేలను బలంగా తాకడంతో స్ల్పీన్(ప్లీహాం)కి గాయమైంది.అయ్యర్ ప్రస్తుతం సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బీసీసీఐ వెల్లడించింది. అయ్యర్‌ను ఐసీయూ నుంచి బయటకు తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.అయితే ఆస్పత్రిలో ఈ చికిత్సకు శ్రేయస్ స్వయంగా ఖర్చు చేస్తున్నారా? లేక బీసీసీఐ భరిస్తుందా? అన్న సందేహం అందరిలో నెలకొంది. అధికారిక మ్యాచ్‌లు లేదా టూర్లలో గాయపడిన క్రికెటర్ల వైద్య ఖర్చులను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI)నే భరిస్తుంది.సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లకు బీసీసీఐ భరోసా..👉సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఉన్న ఆటగాళ్లందరూ బీసీసీఐ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ కింద పూర్తి కవరేజీని పొందుతారు. 👉విదేశాల్లో అత్యవసర చికిత్స, సర్జరీ, ఆసుపత్రి ఖర్చులు, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) లో పునరావాసం ఖర్చులు అన్ని బీసీసీఐనే భరిస్తుంది.👉ఆటగాడు విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ గాయం అయిన వెంటనే బీసీసీఐ మెడికల్ స్టాప్.. స్ధానిక వైద్యుల సహాయంతో వెంటనే చికిత్సను ప్రారంభిస్తారు. శ్రేయస్ అయ్యర్ విషయంలో ఇప్పుడు అదే జరిగింది.👉గాయం కారణంగా ఒక ఆటగాడు మ్యాచ్‌లకు దూరమైనప్పుడు, మ్యాచ్ ఫీజును కూడా బీసీసీఐ పరిహారంగా చెల్లిస్తుంది.👉సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో భాగం కాని ఆటగాళ్లకు కూడా బీమా పాలసీలు ఉన్నాయి. కానీ కాంట్రాక్ట్ ఆటగాళ్లకు లభించేంత ప్రయోజనాలను వారికి ఉండవు.చదవండి: Shreyas Iyer injury update: శ్రేయస్ అయ్యర్ తల్లిదండ్రుల కీలక నిర్ణయం.. -
శ్రేయస్ అయ్యర్ తల్లిదండ్రుల కీలక నిర్ణయం..
టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) అభిమానులకు శుభవార్త. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడిన(స్ల్పీన్ ఇంజూరీ) అయ్యర్.. శరవేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ ప్రస్తుతం సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.అయ్యర్ ఆరోగ్యం రోజు రోజుకు మెరుగు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వారంలోపు అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశముంది. ఈ విషయాన్ని శ్రేయస్ తండ్రి సంతోష్ అయ్యర్ ధృవీకరించారు."శ్రేయస్ వేగంగా కోలుకుంటున్నాడు. బీసీసీఐ వైద్య బృందం అతడి పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. సిడ్నీలోని బెస్ట్ డాక్టర్లు అయ్యర్‌కు చికిత్స అందిస్తున్నారు. అతడు వారంలోపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. వీలైతే అంతకంటే ముందు తిరిగి ఇంటికి రావచ్చు.అతడు టీ20 జట్టులో బాగం కానుందున నేరుగా ఇంటికే రానున్నాడు. దీంతో సిడ్నీ వెళ్లాలనుకున్న మా నిర్ణయాన్ని మార్చుకున్నాము. మేము అక్కడికి వెళ్లడం లేదని" సంతోష్ అయ్యర్ డెక్కన్ క్రానికల్‌తో పేర్కొన్నారు.అయ్యర్ ఎలా గాయపడ్డాడంటే?సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో అలెక్స్ క్యారీ క్యాచ్‌ను అందుకునే క్రమంలో బంతి శ్రేయస్ అయ్యర్ ఎడమ పక్కటెముకులకు బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో మైదానాన్ని వీడాడు. అయితే అతడి గాయం చిన్నదే అని అంతా భావించారు. కానీ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన అయ్యర్, కాసేపటికే స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడి అస్పత్రికి తరలించి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు.స్కాన్‌లో అతడి ప్లీహానికి (స్ప్లీన్) గాయమైనట్లు తేలింది. అంతేకాకుండా అంతర్గత రక్తస్రావం కూడా జరిగిందని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో అతడికి ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో తీవ్ర ఆందోళన చెందిన అయ్యర్ తల్లిదండ్రులు సిడ్నీకి పయనమయ్యేందుకు సిద్దమయ్యారు.కానీ అతడు ఆరోగ్యం కుదుట పడటంతో తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కాగా శ్రేయస్ పరిస్థితి కాస్త మెరుగుపడటంతో ప్రస్తుతం ఐసీయూ నుంచి బయటకు తీసుకువచ్చినట్లు సమాచారం. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ కూడా శ్రేయస్ గాయంపై అప్డేట్ ఇచ్చాడు. తాను అయ్యర్ మాట్లాడని, బాగానే ఉన్నాడు అని సూర్య చెప్పుకొచ్చాడు. కాగా వచ్చే నెలలలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు శ్రేయస్ దూరమయ్యే అవకాశముంది.చదవండి: ఎనిమిది వికెట్లతో చెలరేగిన షమీ.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్! -
నాకు ఫోన్ చేసి మరీ..: బీసీసీఐ, టీమిండియాపై సంచలన ఆరోపణలు
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ (Chris Broad) టీమిండియాపై సంచలన ఆరోపణలు చేశాడు. పలు మ్యాచ్‌లలో భారత జట్టు చేసిన తప్పులను కప్పి పుచ్చాలంటూ తనకు ఫోన్లు వచ్చాయని.. రాజకీయ జోక్యం వల్లే ఒత్తిళ్లు పెరిగాయని ఆరోపించాడు.కాగా ఇంగ్లండ్ దిగ్గజ పేసర్లలో ఒకడైన స్టువర్ట్ బ్రాడ్ (Stuard Broad) తండ్రే క్రిస్ బ్రాడ్. ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 25 టెస్టుల్లో 1661, 34 వన్డేల్లో 1361 పరుగులు చేశాడు. అనంతరం 2003- 2024 వరకు ఐసీసీ మ్యాచ్ రిఫరీగా పనిచేశాడు క్రిస్ బ్రాడ్.కాంట్రాక్టును పునరుద్ధరించని ఐసీసీమొత్తంగా 123 టెస్టులు, 361 వన్డేలు, 138 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు బ్రాడ్ రిఫరీగా పనిచేశాడు. అయితే, ఇంకొన్నాళ్లు కొనసాగాలని చూసినా ఐసీసీ అతడి కాంట్రాక్టును పునరుద్ధరించలేదు.ఇదిలా ఉంటే.. తాజాగా ‘ది టెలిగ్రాఫ్‌నకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రాడ్ మాట్లాడుతూ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆనాటి మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్ల కంటే ఇండియా మూడు, నాలుగు ఓవర్లు వెనుకబడి ఉంది.అక్కడ ఉంది టీమిండియాజరిమానా పడే పరిస్థితి నెలకొంది. ఇంతలో నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘ఉదారంగా వ్యవహరించండి. ఎందుకంటే అక్కడ ఉంది టీమిండియా’ అని నాకు సందేశం వచ్చింది. సరే మరేం పర్లేదు అనుకున్నా.గంగూలీ నా మాట లెక్కచేయలేదుతగినంత సమయం దొరకడంతో చెప్పినట్లే చేశాం. అయితే, ఆ తర్వాతి మ్యాచ్‌లోనూ ఇదే పునరావృతమైంది. స్లో ఓవర్ రేటు నివారించేలా చర్యలు తీసుకోవాలని సౌరవ్ గంగూలీకి చెప్పినా అతడు నా మాట లెక్కచేయలేదు.అంతలో మళ్లీ ఫోన్.. ‘నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు?’ అని అడిగాను. ఇందుకు బదులుగా.. ‘అతడు (గంగూలీ) ఏం చేస్తే అదే చేయనివ్వండి’ అనే సమాధానం వచ్చింది. అంతా రాజకీయం. అప్పటి నుంచే క్రీడల్లో రాజకీయ జోక్యం మొదలైంది. ఇంకా నయం నేను ఇంకా ఆ పదవిలో లేను.కానీ 20 ఏళ్ల పాటు నాపైకి ఎన్నో ‘బుల్లెట్లు’ దూసుకువచ్చాయి. రాజకీయ జోక్యం వల్ల సమస్యలు వచ్చాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. ‘20 ఏళ్ల సుదీర్ఘ సమయం. ఎలా తట్టుకున్నానో అనిపిస్తుంది’’ అని క్రిస్ బ్రాడ్ ఆరోపణలు చేశాడు. అయితే, టీమిండియా ఆడిన ఏ మ్యాచ్ విషయంలో తాను ఇలాంటి ఒత్తిళ్లకు గురయ్యానన్నది మాత్రం అతడు స్పష్టంగా చెప్పలేదు.అందుకే ఆరోపణలా?కాగా ఐసీసీ తన కాంట్రాక్టును పునరుద్ధరించకపోవడాన్ని దృష్టిలో పెట్టుకునే బ్రాడ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఐసీసీ ప్రస్తుత చైర్మన్‌గా.. బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా ఉన్న విషయం తెలిసిందే.చదవండి: క్రికెట్ ఒక్కటే జీవితం కాదు.. కోహ్లి నన్ను బాగా అర్థం చేసుకుంటాడు: రోహిత్ శర్మ -
స్పృహ తప్పి పడిపోయాడు!.. ప్రాణాపాయమే!;.. కీలక అప్డేట్ ఇచ్చిన సూర్య
భారత వన్డే క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి (Shreyas Iyer Health Update)పై టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ కీలక అప్డేట్ అందించాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందంటూ అభిమానులకు శుభవార్త చెప్పాడు. వైద్యులు నిరంతరం శ్రేయస్‌ను కనిపెట్టుకుని ఉండి.. ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నారని సూర్య తెలిపాడు.కాగా ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా శ్రేయస్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. హర్షిత్ రాణా (Harshit Rana) బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్‌ను సంచలన రీతిలో అందుకున్న ఈ ముంబై బ్యాటర్.. వెంటనే కిందపడిపోయాడు. పొట్ట పట్టుకుని నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి అతడిని డ్రెసింగ్‌రూమ్‌కు తీసుకువెళ్లాడు.స్పృహ తప్పి పడిపోయాడుఆ తర్వాత గాయం తీవ్రత ఎక్కువ కావడంతో వెంటనే సిడ్నీలోని ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ క్రమంలో బీసీసీఐ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘అయ్యర్ డ్రెసింగ్‌రూమ్‌కు వెళ్లగానే స్పృహ తప్పి పడిపోయాడు.ప్రాణాంతకమైన గాయమేఆ వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, ఫిజియో, టీమ్ డాక్టర్ వెంటనే స్పందించి పరిస్థితి చేయి దాటకుండా చూసుకున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నా.. ప్రాణాంతకమైన గాయమే అది. శ్రేయస్ పట్టుదల గల ఆటగాడు. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతాడు’’ అని పేర్కొన్నాయి.ఇక ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు శ్రేయస్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘శ్రేయస్ గాయపడ్డాడని తెలిసిన వెంటనే నేను అతడికి కాల్ చేశాను.నేను అయ్యర్‌తో మాట్లాడుతున్నాఅయితే, అప్పుడు తన ఫోన్ తన దగ్గర లేదని తెలిసింది. వెంటనే ఫిజియో కమలేశ్ జైన్‌కు ఫోన్ చేశా. పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నా. ఇక గత రెండురోజులుగా నేను అయ్యర్‌తో మాట్లాడుతున్నా. దీనర్థం.. అతడు బాగానే ఉన్నట్లు కదా!అవును.. శ్రేయస్ పరిస్థితి మెరుగుపడుతోంది. వైద్యులు నిరంతరం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరికొన్న రోజుల పాటు అయ్యర్ వారి పర్యవేక్షణలోనే ఉండనున్నాడు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది’’ అంటూ శ్రేయస్ గురించి ఆందోళన చెందుతున్న అభిమానులకు సూర్య ఊరట కలిగించాడు.కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా వన్డే సిరీస్‌ను పూర్తి చేసుకుంది. ఇందులో మార్ష్ బృందం.. గిల్ సేనను 2-1తో ఓడించి సిరీస్ గెలుచుకుంది. ఇరుజట్ల మధ్య బుధవారం (అక్టోబరు 29) నుంచి టీ20 సిరీస్ మొదలుకానుంది. నవంబరు 8న ఐదో టీ20తో సిరీస్ ముగుస్తుంది.చదవండి: యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం -
Shreyas Iyer: పరిస్థితి సీరియస్?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు!
టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా గాయపడిన ఈ ముంబై బ్యాటర్ ప్రస్తుతం ఇంటెన్సిక్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నాడు.గాయం మూలంగా శ్రేయస్ అయ్యర్‌కు అంతర్గత రక్తస్రావం జరిగినట్లు గుర్తించిన వైద్యులు సిడ్నీ ఆస్పత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నారు. టీమిండియా డాక్టర్ కూడా సిడ్నీలోనే ఉండి.. స్థానిక వైద్యులతో కలిసి ఎప్పటికప్పుడు శ్రేయస్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.వేగంగా కోలుకుంటున్నాడు!ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పందించింది. క్యాచ్ అందుకునే క్రమంలో అతడి పక్కటెముకల్లో (ఎడమ) గాయం అయిందని.. స్ల్పీన్ (ప్లీహం) ఇంజూరీ అయిందని తెలిపింది. ప్రస్తుతం శ్రేయస్ వేగంగా కోలుకుంటున్నాడని.. అతడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు!దీంతో, శ్రేయస్ అయ్యర్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే, తాజా సమాచారం మాత్రం వారిని మరోసారి ఆందోళనలోకి నెట్టింది. ఈ టీమిండియా స్టార్ కుటుంబ సన్నిహిత వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. శ్రేయస్ గాయం తీవ్రత దృష్ట్యా అతడి తల్లిదండ్రులు వెంటనే సిడ్నీకి పయనం కానున్నట్లు తెలిపాయి. ఇందుకోసం అర్జెంట్ వీసా కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించాయి. తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వెంటనే వీసా మంజూరు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు శ్రేయస్ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నాయి.అభిమానుల్లో సందేహాలుఈ నేపథ్యంలో మరోసారి శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరుగగా.. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్ సొంతం చేసుకుంది.ఈ క్రమంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో శనివారం నామమాత్రపు మూడో వన్డే జరిగింది. ఇందులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేయగా.. 34వ ఓవర్లో హర్షిత్ రాణా బంతితో రంగంలోకి దిగాడు.అప్పటికి క్రీజులో ఉన్న ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ మిడాఫ్/ఎక్స్ట్రా కవర్ దిశగా బంతిని గాల్లోకి లేపగా.. బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి పరిగెత్తుకు వచ్చిన శ్రేయస్ డైవ్ కొట్టి మరీ సంచలన క్యాచ్ అందుకున్నాడు.Shreyas SUPERMAN Iyer! 💪Puts his body on the line for #TeamIndia and gets the much needed wicket. 🙌💙#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuAfKW pic.twitter.com/LCXriNqYFy— Star Sports (@StarSportsIndia) October 25, 2025ఐసీయూలో ఉంచి చికిత్సఈ క్రమంలో శ్రేయస్ గాయపడ్డాడు. ఎడమవైపు పక్కటెముకల్లో నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో కుప్పకూలిపోయాడు. సహచర ఆటగాళ్లు, ఫిజియో వచ్చి పరిశీలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్కానింగ్ కోసం సిడ్నీలోని ఆస్పత్రికి పంపగా అంతర్గత రక్తస్రావాన్ని గుర్తించిన వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో ఏడు రోజుల పాటు అయ్యర్‌ను ఐసీయూలోనే ఉంచనున్నట్లు తెలుస్తోంది.కాగా చాన్నాళ్ల క్రితమే టీమిండియా టీ20 జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్.. ఇటీవలే టెస్టు క్రికెట్‌కు విరామం ప్రకటించాడు. వన్డేల్లో మాత్రం మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో రాణిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు ఆసీస్ టూర్ సందర్భంగా వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చింది బీసీసీఐ. కానీ ఈ గాయం కారణంగా అతడు చాన్నాళ్లపాటు జట్టుకు దూరమయ్యే పరిస్థితుల తలెత్తాయి. ఇక మూడో వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. తద్వారా క్లీన్‌స్వీప్ గండం నుంచి గట్టెక్కింది.Update: Shreyas Iyer: ఐసీయూ నుంచి బయటకు! చదవండి: పృథ్వీ షా విధ్వంసకర శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ -
గెలుపు జోష్‌లో ఉన్న టీమిండియాకు భారీ షాక్..
ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో గెలిచి మంచి జోష్‌లో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దాదాపు నెల రోజుల పాటు జట్టుకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో క్యాచ్‌ను అందుకునే క్రమంలో అయ్యర్ పక్కటెముకులకు గాయమైంది.వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి స్కాన్లు చేయించగా.. గాయం కాస్త తీవ్రమైనదిగా తేలినట్లు సమాచారం. దీంతో వచ్చే నెల ఆఖరిలో సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు అయ్యర్ అందుబాటుపై అనుమానాలు నెలకొన్నాయి. భారత్‌కు బిగ్ షాక్.."మ్యాచ్ జరుగుతుండగానే శ్రేయస్ అయ్యర్‌ను స్కాన్ల కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక నిర్ధారణ ప్రకారం.. ఎడమ ప్రక్కటెముకలలో చిన్న ఫ్రాక్చర్ ఉంది.అతడు కనీసం మూడు వారాల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయ్యర్ కోలుకోవడానికి ఎక్కువ సమయం అవసరమా లేదా అని నిర్ధారించడానికి మరిన్ని రిపోర్ట్లు స్కాన్లు చేయాల్సి ఉంది.ఇది హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ అయితే ఎక్కువ సమయం పట్టవచ్చు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అయ్యర్ అందుబాటులో ఉంటాడో లేదో ఇప్పుడే చెప్పలేము. మూడు వారాలలో అతడు కోలుకుంటే సౌతాఫ్రికా సిరీస్‌లో ఆడే అవకాశం ఉందని" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు.ఒకవేళ అయ్యర్ ప్రోటీస్‌తో సిరీస్‌కు దూరమైతే భారత్ గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. అయ్యర్ భారత వన్డే సెటాప్‌లో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. అయితే గతంలో కూడా శ్రేయస్ వెన్ను గాయంతో బాధపడ్డాడు. కోలుకుని తిరిగొచ్చాక ఇప్పుడు పక్కటెముల గాయం బారిన పడ్డాడు. కాగా సౌతాఫ్రికా-భారత్ మధ్య వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: రోహిత్ శర్మ రిటైర్మెంట్ అప్పుడే.. కన్ఫర్మ్ చేసిన కోచ్ -
ఆస్ట్రేలియా క్రికెటర్లకు సారీ చెప్పిన బీసీసీఐ..
వన్డే వరల్డ్‌కప్‌లో ఆడేందుకు వచ్చిన ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ఆకతాయి వేధింపులకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సభ్యులు ఇద్దరూ గురువారం రాత్రి హోటల్‌కు తిరిగి వస్తుండగా.. ఇండోర్‌లోని ఖజ్రానా రోడ్ వద్ద ఓ వ్యక్తి వారి వెంటపడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే సదరు క్రికెటర్లు జట్టు మేనేజర్‌కు సమాచారం అందించారు. అతడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన పోలీలుసు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఖజ్రానాకు చెందిన 30 ఏళ్ల అకీల్‌ను నిందుతుడిగా గుర్తించారు. ప్రస్తుతం అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంతకుముందు కూడా అతడిపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. "ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. భారత్ అతిథిలను గౌరవించే దేశంగా పేరుగాంచినది. ఇటువంటి ఘటనలు దేశ గౌరవాన్ని దెబ్బతీస్తాయి. ఎవరిపట్ల కూడా ఇలా ప్రవర్తించకూడదు. ఆసీస్ క్రికెటర్లకు ఇలా జరిగినందుకు మేము చింతిస్తున్నాము. నిందితుడిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నందుకు సంతోషిస్తున్నాము.ఈ వన్డే ప్రపంచ కప్‌లో ఆడేందుకు వచ్చిన అన్ని జట్లకు ఇప్పటికే పూర్తి స్ధాయి భద్రతను కల్పించాము. ఇకపై సెక్యూరిటీ మరింత పెంచుతాము. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాము." అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) పీటీఐతో పేర్కొన్నారు. కాగా అక్టోబర్ 30న జరగనున్న రెండో సెమీఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.చదవండి: భారత్ సెమీస్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా -
తీవ్ర గాయం! ఆస్పత్రిలో శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆసీస్ బ్యాటర్ అలెక్స్ క్యారీ క్యాచ్‌ను అందుకునే క్రమంలో బంతి అయ్యర్ ఎడమ పక్కటెముకలకు బలంగా తాకింది. దీంతో అడడు తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి ఏ మాత్రం నొప్పి తగ్గలేదు.దీంతో అతడు మైదానాన్ని వీడి వెళ్లాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 34వ ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత అయ్యర్ తిరిగి ఫీల్డ్‌లోకి రాలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టార్గెట్‌ను పూర్తి చేయడంతో శ్రేయస్‌కు బ్యాటింగ్‌కు ఛాన్స్ రాలేదు. ఒకవేళ అతడి వరకు బ్యాటింగ్‌కు వచ్చినా కూడా డ్రెస్సింగ్ రూమ్ పరిమితమయ్యేవాడు. తాజాగా శ్రేయస్ గాయంపై బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది.అయ్యర్ గాయంపై బీసీసీఐ అప్డేట్"ఫీల్డింగ్ చేస్తుండగా శ్రేయస్ అయ్యర్ ఎడమ పక్కటెముకకు గాయమైంది. అతడి గాయం తీవ్రత తెలుసుకోనేందుకు ఆస్ప్రత్రికి తరలించారు" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా అయ్యర్ గాయం తీవ్రమైనది కాకుడదని అభిమానులు కోరుకుంటున్నారు.అతడు భారత వన్డే జట్టులో కీలక సభ్యునిగా ఉన్నాడు. ఇటీవలే వైస్ కెప్టెన్‌గా కూడా ప్రమోట్ అయ్యాడు. ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత మిడిలార్డర్లో అయ్యర్ ముఖ్యమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అడిలైడ్ వన్డేలో కూడా శ్రేయాస్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. అయితే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ సమయానికి అయ్యర్ పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశముంది. వచ్చే నెల ఆఖరిలో భారత్-సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. ఇక ఆఖరి వన్డే విషయానికి వస్తే.. ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 38.3 ఓవర్లలో చేధించింది. భారత సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ(125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 121 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(81 బంతుల్లో 7 ఫోర్లతో 74 నాటౌట్) ఆర్ధ శతకంతో సత్తాచాటాడు.చదవండి: #ViratKohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్ -
దిగజారిన పీసీబీ చీఫ్ నఖ్వీ!... ఈసారి..
ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్లో చాంపియన్‌గా నిలిచిన టీమిండియా ఇప్పటి వరకు ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్, ఆసియా క్రికెట్ మండలి (ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఇందుకు ప్రధాన కారణం.పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ (IND vs PAK) తొలిసారిగా ఆసియా కప్ టోర్నీలో తొలిసారిగా ముఖాముఖి తలపడ్డాయి. ఈ క్రమంలో దాయాది దుశ్చర్యలకు నిరసనగా టీమిండియా ఆటగాళ్లు తొలుత లీగ్ దశలో.. పాక్ ప్లేయర్లతో షేక్‌హ్యాండ్ (No ShakeHand)కు నిరాకరించారు.పప్పులు ఉడకవని తెలుసుకునిదీనిని అవమానంగా భావించిన పాక్ బోర్డు.. టీమిండియాను నిందల పాలు చేయాలని ప్రయత్నాలు చేసింది. భారత్‌తో మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన వ్యక్తిని తప్పించాలంటూ రచ్చ చేసింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) దిగిరాకపోవడంతో తమ పప్పులు ఉడకవని తెలుసుకుని మిన్నకుండిపోయింది.అయితే, సూపర్-4 మ్యాచ్‌లోనూ భారత జట్టు షేక్‌హ్యాండ్‌కు నిరాకరించింది. ఇందుకు ప్రతిగా పాక్ ఆటగాళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. గన్ పేలుస్తున్నట్లు సెలబ్రేషన్స్ చేసుకుంటూ వక్రబుద్ధి చాటుకున్నారు. ఇక ఫైనల్లోనూ దాయాది పాక్‌తో.. సెప్టెంబరు 28న తలపడిన టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీ గెలుచుకుంది.నఖ్వీ చేతుల మీదుగా తీసుకోమునిబంధనల ప్రకారం తానే టీమిండియాకు ట్రోఫీ అందజేస్తానంటూ మొహ్సిన్ నఖ్వీ ముందుకు వచ్చాడు. అయితే, అతడు కేవలం పీసీబీ, ఏసీసీ చీఫ్ మాత్రమే కాకుండా.. పాక్ మంత్రి కూడా కావడంతో భారత జట్టు అతడి చేతుల మీదుగా కప్ అందుకునేందుకు నిరాకరించింది.ఈ క్రమంలో ట్రోఫీతో పాటు.. మెడల్స్ కూడా తనతోపాటు ఎత్తుకెళ్లిన నఖ్వీ ఇంత వరకు వాటిని తిరిగి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల నఖ్వీకి ఇ-మెయిల్ పంపింది. ట్రోఫీ తమకు అప్పగించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఐసీసీ వద్దే పంచాయతీ తేలుతుందిఅయినప్పటికీ నఖ్వీ బుద్ధి మారలేదు. తన చేతుల మీదుగానే ట్రోఫీ ఇస్తానని.. ఇందుకోసం బీసీసీఐ ఆటగాళ్లను తన దగ్గరకు పంపించాలంటూ అహంకారం ప్రదర్శించాడు. దీంతో ఐసీసీ వద్దే పంచాయతీ తేల్చుకునేందుకు బీసీసీఐ సిద్ధమైంది.తాజా సమాచారం ప్రకారం.. బీసీసీఐ వర్గాలు ANIతో మాట్లాడుతూ.. నఖ్వీ ట్రోఫీని ఏసీసీ ప్రధాన కార్యాలయం నుంచి తరలించాడని పేర్కొన్నాయి. ‘‘కొన్నిరోజుల క్రితం బీసీసీఐ అధికారి ఒకరు యూఏఈలో ఉన్న ఏసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.మరింత దిగజారిన పీసీబీ చీఫ్ నఖ్వీ!... ఈసారి..ఏసీసీ ఆఫీస్‌లో ట్రోఫీ ఉందా అని ఆరా తీశారు. అయితే, స్టాఫ్ చెప్పిన సమాధానం విని ఆయన ఆశ్చర్యపోయారు. ట్రోఫీని ఇక్కడి నుంచి తరలించి.. అబుదాబిలో ఓ చోటు నఖ్వీ దాచిపెట్టాడని వాళ్లు చెప్పారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో గెలిచిన జట్టు ట్రోఫీని ఎత్తుకెళ్లిన నఖ్వీ మరీ ఇంతలా దిగజారిపోతాడని అనుకోలేదంటూ నెటిజన్లు అతడిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా ఆసియా కప్-2025 టోర్నీలో లీగ్ దశలో పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్.. సూపర్-4 మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది. చదవండి: అతడు అదరగొట్టాడు.. కాబట్టి నితీశ్ రెడ్డిపై వేటు పడొచ్చు: మాజీ కెప్టెన్ -
బతికితే చాలనుకున్నా.. ఆకాశ్ అంబానీ హెల్ప్ చేశారు: తిలక్ వర్మ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు తిలక్ వర్మ (Tilak Varma). 2022లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన తిలక్.. ఆ మరుసటి ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు.ఆసియా కప్ హీరోఅనతికాలంలోనే భారత టీ20 జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన ఈ హైదరాబాదీ బ్యాటర్.. ఇటీవల ఆసియా టీ20 కప్-2025 టోర్నీలోనూ అదరగొట్టాడు. పాకిస్తాన్‌తో ఫైనల్లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున 32 టీ20 మ్యాచ్‌లు, నాలుగు వన్డేలు ఆడిన తిలక్ వర్మ.. ఆయా ఫార్మాట్లలో 962, 68 పరుగులు చేశాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ సీజన్ 2025-26 సీజన్‌తో బిజీగా ఉన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.ఈ నేపథ్యంలో కెరీర్‌లోని చేదు అనుభవాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు తిలక్ వర్మ. గాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి చేయిదాటిపోయిందని.. ఆ సమయంలో ముంబై ఫ్రాంఛైజీ సహ యజమాని ఆకాశ్ అంబానీ సాయం చేశారని తెలిపాడు. బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్‌తో మాట్లాడుతూ..బ్యాట్ ఎత్తేందుకు కూడా శక్తి సరిపోలేదు‘‘2022లో బంగ్లాదేశ్‌లో మ్యాచ్ ఆడుతున్నాం. నేను భారత్-‘ఎ’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నా. బ్యాటింగ్‌కు వచ్చిన కాసేపటి తర్వాత నా కళ్లు చెమ్మగా మారాయి. బ్యాట్ ఎత్తేందుకు కూడా శక్తి సరిపోవడం లేదు. నా నరాల్లో జీవం లేనట్లే అనిపించింది.ఆకాశ్ అంబానీ హెల్ప్ చేశారువెంటనే రిటైర్డ్ హర్ట్‌గా వెనక్కి వచ్చేశాను. ఆ సమయంలో విషయం తెలుసుకుని ఆకాశ్ అంబానీ ఫోన్ చేశారు. బీసీసీఐ పెద్దలతో మాట్లాడి.. నా పరిస్థితి గురించి చెప్పారు. నాకు చాలా సాయం చేశారు.బతికి బయటపడితే చాలుఆస్పత్రిలో వైద్యులు నన్ను హెచ్చరించారు. ఒకవేళ ఇంకాస్త ఆలస్యంగా వచ్చి ఉంటే పరిస్థితి ఇంకా దిగజారిపోయేదన్నారు. నా శరీరంలోకి సూది కూడా దిగడం లేదు. అలాంటి పరిస్థితుల్లో బతికి బయటపడితే చాలు అనుకున్నా’’ అని తిలక్ వర్మ చేదు జ్ఞాపకాన్ని పంచుకున్నాడు.కాగా ఐపీఎల్-2022 సీజన్ తర్వాత తిలక్ వర్మ కండరాల నొప్పితో బాధపడ్డాడు. అయితే, కోలుకోవడంపై దృష్టి పెట్టకుండా వరుస మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి.. ఆస్పత్రిలో చికిత్స తీసుకునేంత వరకు వచ్చింది. అయితే, అదృష్టవశాత్తూ త్వరగానే కోలుకున్న 22 ఏళ్ల తిలక్ వర్మ.. ప్రస్తుతం టీమిండియా తరఫున సత్తా చాటుతూ తనను తాను నిరూపించుకుంటున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్.. ఆసియాలోనే తొలి క్రికెటర్‌గా రోహిత్ రికార్డు -
అందుకే అతడిని సెలక్ట్ చేయలేదు: స్పందించిన బీసీసీఐ!
సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్ ఆడే భారత్- ‘ఎ’ జట్టు (IND A vs SA A)ను ప్రకటించిన నాటి నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)పై విమర్శలు కొనసాగుతున్నాయి. రిషభ్ పంత్ (Rishabh Pant) కెప్టెన్‌గా వ్యవహరించే ఈ జట్టులో ఉద్దేశపూర్వకంగానే సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan)కు చోటు ఇవ్వలేదనే ఆరోపణలు వస్తున్నాయి.ఇంటిపేరు కారణంగానే అంటూసొంతగడ్డపై సర్ఫరాజ్ ఖాన్ సత్తా చాటగలడని.. అయినా అతడిని పక్కనపెట్టడం ఏమిటని మాజీ క్రికెటర్లు సైతం విమర్శిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేత షామా మొహమ్మద్ అయితే ఓ అడుగు ముందుకేసి.. ఇంటిపేరు కారణంగానే సర్ఫరాజ్‌పై వేటు వేశారంటూ హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.గజ్జల్లో గాయంఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు ఈ విషయంపై స్పందించినట్లు ఎన్డీటీవీ తెలిపింది. సర్ఫరాజ్ ఖాన్‌ను భారత్- ‘ఎ’ జట్టుకు ఎంపిక చేయకపోవడానికి గల కారణం వెల్లడించినట్లు పేర్కొంది. ఈ మేరకు.. ‘‘సర్ఫరాజ్ గజ్జల్లో గాయం కారణంగా చాలా రోజులు ఆటకు దూరమయ్యాడు. ఇటీవలే రంజీ ట్రోఫీ మొదటి రౌండ్ సందర్భంగా ముంబై తరఫున కాంపిటేటివ్ క్రికెట్లో పునరాగమనం చేశాడు.త్వరలోనే తిరిగి జట్టులోకిరంజీ తాజా సీజన్లో అతడి ప్రదర్శన, ఫిట్నెస్ ఎలా ఉంటుందో అంచనా వేసిన తర్వాతే అతడిని ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు. అందుకే భారత్-‘ఎ’ జట్టుకు ఎంపిక చేయలేదు. త్వరలోనే తిరిగి అతడు జట్టులోకి వస్తాడని నమ్ముతున్నాం’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు ఎన్డీటీవీ తెలిపింది.కాగా స్వదేశంలో దేశంలో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో ఈనెల 30 నుంచి నవంబర్ 9 వరకు జరిగే రెండు నాలుగు రోజుల (ఫస్ట్‌క్లాస్) అనధికారిక టెస్టు మ్యాచ్‌లలో తలపడే భారత ‘ఎ’ జట్టుకు పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ. పంత్ రీఎంట్రీబెంగళూరు వేదికగా జరిగే ఈ రెండు మ్యాచ్‌ల కోసం రెండు వేర్వేరు జట్లను మంగళవారం సెలక్టర్లు ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ తేదీలను దృష్టిలో ఉంచుకుంటూ ఆయా ఆటగాళ్ల అందుబాటును బట్టి జట్లను ఎంపిక చేశారు.కాగా ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టులో పేసర్ క్రిస్ వోక్స్ బంతి బలంగా తగలడంతో పంత్ కాలికి తీవ్ర గాయమైంది. దాంతో చివరి టెస్టు నుంచి తప్పుకున్న అతడు ఆ తర్వాత ఆసియా కప్ టీ20 టోర్నీ, వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. చికిత్స అనంతరం కోలుకున్న పంత్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృందం ఇటీవలే సర్టిఫికెట్ ఇచ్చింది. దాంతో అతడిని ముందుగా ‘ఎ’ జట్టు తరఫున ఆడించాలని సెలక్టర్లు నిర్ణయించారు.అన్నీ సానుకూలంగా ఉంటే దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం పంత్‌ను ఎంపిక చేయడం లాంఛనమే. పంత్‌తో పాటు యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు మరింత మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని భావించి అతడిని రెండు మ్యాచ్‌ల కోసం ఎంపిక చేశారు. దేశవాళీలో రాణిస్తూ ఫామ్‌లో ఉన్న రజత్ పాటీదార్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్, ఆకాశ్‌దీప్‌లను రంజీ కారణంగా ఒకే మ్యాచ్ కోసం ఎంపిక చేశారు. మరోవైపు టెస్టు సిరీస్‌కు ముందు తమ ఆటకు పదును పెట్టాలని భావిస్తున్న రెగ్యులర్ టెస్టు జట్టు సభ్యులు కేఎల్ రాహుల్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ధ్రువ్ జురేల్ కూడా రెండో మ్యాచ్‌లో ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగుతారు. భారత్ ‘ఎ’ జట్టు (తొలి మ్యాచ్‌కు): రిషభ్ పంత్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), ఆయుశ్ మాత్రే, జగదీశన్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్, హర్ష్ దూబే, తనుశ్ కొటియాన్, మానవ్ సుతార్, అన్షుల్ కంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుశ్ బదోని, సారాంశ్ జైన్, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్. భారత్ ‘ఎ’ జట్టు (రెండో మ్యాచ్‌కు): పంత్ (కెప్టెన్), సాయిసుదర్శన్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుశ్ కొటియాన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్. చదవండి: డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్‌బై చెప్పేశాడా? -
వచ్చి తీసుకోవాల్సిందే: నఖ్వీ ఓవరాక్షన్.. బీసీసీఐ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచి దాదాపు నెల రోజులు కావస్తున్నా టోర్నీకి సంబంధించిన ట్రోఫీ మాత్రం ఇంకా టీమ్‌కు అందలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ (Mohsin Naqvi) ఆదేశాల మేరకు ఇప్పటికీ ట్రోఫీ దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉంది. ఈ విషయంపై దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరోసారి ఏసీసీకి లేఖ రాసింది. ఏసీసీలోని సభ్య దేశాలైన శ్రీలంక, అఫ్గానిస్తాన్ జట్లు కూడా బీసీసీఐకి మద్దతు పలుకుతూ వెంటనే ట్రోఫీని భారత జట్టుకు అందించాలని కోరాయి. బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా, రాజీవ్ శుక్లా లేఖ రాసిన విషయాన్ని ఏసీసీ అధికారి ఒకరు నిర్ధారించారు. అయితే నఖ్వీ మాత్రం తన మొండితనాన్ని వీడలేదు. బీసీసీఐకి సంబంధించినవారు ఎవరైనా దుబాయ్‌కు వచ్చి తన చేతుల మీదుగా తీసుకుంటేనే దానిని అందిస్తామని అతడు పునరుద్ఘాటించాడు. అయితే బీసీసీఐ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. దాంతో ఆసియా కప్ ఫైనల్ రోజులాంటి యథాతథ స్థితి ఇంకా కొనసాగుతోంది. నా చేతుల మీదుగా తీసుకోవచ్చుబీసీసీఐ లేఖపై తాజాగా నఖ్వీ స్పందించాడు. ‘ఆసియా కప్ ఫైనల్ రోజు నా చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోబోమని భారత్ చివరి క్షణం వరకు చెప్పలేదు. వేదికపై అతిథులంతా చేరిన తర్వాత ఆ విషయం తెలిసింది. మేం 40 నిమిషాలు వేచి చూసినా ఎవరూ రాలేదు. ఆసియా కప్ ట్రోఫీ భారత్‌దే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి బీసీసీఐ ప్రతినిధి ఎవరైనా ఆసియా కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన ఆటగాడు ఒకరితో కలిసి ఇక్కడికి వచ్చి నా చేతుల మీదుగా తీసుకోవచ్చు’ అని అదే మాట చెప్పాడు. ఈ ప్రతిష్టంభనకు ఏసీసీలో పరిష్కారం లభించదని భారత బోర్డుకు అర్థమైంది. త్వరలో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి సమావేశంలో నఖ్వీపై ఫిర్యాదు చేయాలని... అక్కడే ఏదో ఒకటి తేల్చుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది.చదవండి: పాకిస్తాన్ అవుట్ -
BCCI: ఇస్తారా? లేదా?.. పీసీబీ చీఫ్ నక్వీకి బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్
ఆసియా టీ20 కప్-2025 ట్రోఫీ ఇంత వరకు టీమిండియాకు అందనే లేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB), ఆసియా క్రికెట్ మండలి (ACC) చైర్మన్ మొహ్సిన్ నక్వీ మొండి వైఖరి ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నక్వీకి గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.తీవ్ర పరిణామాలుట్రోఫీ గనుక టీమిండియాకు అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బీసీసీఐ నక్వీకి అధికారికంగా ఇ- మెయిల్ పంపినట్లు సమాచారం. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఇండియా టుడే పేర్కొంది. ఒకవేళ నక్వీ గనుక తమకు సరైన రీతిలో సమాధానం ఇవ్వకుంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని ఆశ్రయిస్తామని చెప్పినట్లు తెలిపింది.అదే జరిగితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందని హెచ్చరించామని.. వీలైనంత త్వరగా ట్రోఫీ పంపించాలని మెయిల్ రాసినట్లు పేర్కొంది. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్ టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.టీమిండియా నిరాకరణలీగ్, సూపర్-4 దశల్లో పరాజయమన్నదే ఎరుగక ఫైనల్ చేరిన సూర్యకుమార్ సేన.. టైటిల్ పోరు (సెప్టెంబరు 28)లో దాయాది పాకిస్తాన్‌ను ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. అయితే, ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న నక్వీ నుంచి కప్ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది. మరోవైపు.. నక్వీ మాత్రం పట్టువీడలేదు. ట్రోఫీ, మెడల్స్ తీసుకుని హోటల్‌కు పారిపోయాడు.పద్ధతి ప్రకారమేతన చేతుల మీదుగానే టీమిండియా ట్రోఫీ తీసుకోవాలని.. ఒకవేళ ఎవరైనా వచ్చి అడిగినా ట్రోఫీ ఇవ్వొద్దని నక్వీ ఏసీసీ ప్రతినిధులకు చెప్పినట్లు సమాచారం. దీంతో బీసీసీఐ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకుంది. పద్ధతి ప్రకారమే ట్రోఫీని తమ వద్దకు రప్పించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే మెయిల్ కూడా పంపినట్లు తెలుస్తోంది.పూర్తి స్పృహలో ఉండేకాగా నక్వీ చేతుల మీదుగా ట్రోఫీని టీమిండియా నిరాకరించడానికి గల కారణాన్ని సైకియా గతంలో వెల్లడించాడు. ‘‘ఏసీసీ చైర్మన్‌గా ఉన్న వ్యక్తి పాకిస్తాన్ సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. పూర్తి స్పృహలో ఉండే ఈ నిర్ణయం తీసుకున్నాము’’ అని దేవజిత్ సైకియా తెలిపాడు.ఉగ్రదాడికి నిరసనగాపహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రదాడికి నిరసనగా టీమిండియా పాక్ ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్‌కు నిరాకరించింది. దీంతో రచ్చకెక్కిన పీసీబీ.. అతి చేసింది.ఇందుకు అనుగుణంగానే పాక్ ఆటగాళ్లు హ్యారిస్ రవూఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ మైదానంలో టీమిండియా ఆటగాళ్లు, అభిమానులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించి.. ఐసీసీతో చివాట్లు తిన్నారు. ఆ తర్వాత ఫైనల్లో దాయాది చేతిలో ఓడి ఇంటిబాట పట్టగా.. పీసీబీ చైర్మన్ నక్వీ ఇలా మెడల్స్, ట్రోఫీ ఎత్తుకెళ్లడం గమనార్హం.చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషభ్ పంత్ -
‘అగార్కర్, గంభీర్‌లను తొలగిస్తేనే సరి!’.. సిగ్గు పడండి!
టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు (Navjot Singh Sidhu)కు కోపం వచ్చింది. తన గురించి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సోషల్ మీడియా వేదికగా ఈ మాజీ ఓపెనర్ మండిపడ్డాడు. ఇలాంటి నకిలీ వార్తలు ప్రచారం చేయొద్దంటూ సదరు నెటిజన్‌కు చురకలు అంటించాడు.అసలేం జరిగిందంటే.. టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia)లో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆసీస్‌తో వన్డేలకు ఎంపిక చేసిన జట్టుపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడం.. మొహమ్మద్ షమీని కాదని హర్షిత్ రాణా (Harshit Rana)కు జట్టులో చోటివ్వడం ఇందుకు ప్రధాన కారణాలు.ఏడు వికెట్ల తేడాతో ఓటమిఈ క్రమంలో ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి నేపథ్యంలో మరోసారి మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మ్యాచ్‌లో గిల్ సేన ఆసీస్ చేతిలో.. ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్‌లో డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం విజేతను తేల్చారు.అగార్కర్, గంభీర్‌లను తొలగిస్తేనే సరి?ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో వన్డేలో టీమిండియా ఓటమి తర్వాత నవజ్యోత్ సింగ్ సిద్ధు.. గంభీర్, అగార్కర్‌లను ఘాటుగా విమర్శించినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది. జాడ్ ఇన్సానే అనే అకౌంట్ నుంచి ‘‘ఒకవేళ టీమిండియా వన్డే వరల్డ్‌కప్ గెలవాలనుకుంటే.. బీసీసీఐ అజిత్ అగార్కర్, గౌతం గంభీర్‌లను వీలైనంత త్వరగా తమ పదవుల నుంచి తప్పించాలి.అదే విధంగా పూర్తి గౌరవ మర్యాదలతో కెప్టెన్సీని రోహిత్ శర్మకు తిరిగి అప్పగించాలి’’ అని సిద్ధు అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇందుకు సిద్ధుతో పాటు గౌతీ, అగార్కర్ల ఫొటోలను కూడా సదరు నెటిజన్ జతచేశారు.సిగ్గు పడండిఈ విషయంపై స్పందించిన సిద్ధు.. ‘‘నేను ఎప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడలేదు. అసత్యపు వార్తలను ప్రచారం చేయకండి. అసలు ఇలాంటివి కూడా చేస్తారని అస్సలు ఊహించలేదు. సిగ్గు పడండి’’ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అక్టోబరు 19- నవంబరు 8 వరకు ఈ టూర్ కొనసాగుతుంది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ -
BCCI: పిరికిపందల దాడి.. అఫ్గన్ బోర్డుకు మద్దతుగా బీసీసీఐ ప్రకటన
అఫ్గనిస్తాన్ క్రికెటర్ల మృతి పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సంతాపం వ్యక్తం చేసింది. అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB)కు సంఘీభావం ప్రకటించింది. తమ క్రికెటర్ల మరణానికి కారణమైన దేశంతో.. అఫ్గన్ బోర్డు సిరీస్ రద్దు చేసుకోవడాన్ని బీసీసీఐ స్వాగతించింది.పిరికిపందల దాడి.. ఈ మేరకు.. ‘‘సరిహద్దులోని పక్తికా ప్రావిన్స్‌లో పిరికిపందలు జరిపిన సీమాంతర వైమానిక దాడుల్లో అఫ్గనిస్తాన్ యువ క్రికెటర్లు కబీర్ ఆఘా, సిబ్ఘతుల్లా, హరూన్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. వీరి మృతి పట్ల బీసీసీఐ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది.ఈ కష్ట సమయంలో బీసీసీఐ అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డుకు మద్దతుగా నిలుస్తుంది. అఫ్గన్ క్రికెట్ ప్రపంచానికి, మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. మీ దుఃఖాన్ని మేమూ పంచుకుంటాం. ఇందుకు కారణమైన అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.తీవ్రంగా కలచివేస్తోందివైమానిక దాడుల్లో మరణించిన అమాయక ప్రజలు.. ముఖ్యంగా క్రీడల్ని భవిష్యత్తుగా ఎంచుకున్న వ్యక్తులు మృతి చెందడం తీవ్రంగా కలచివేస్తోంది. అఫ్గనిస్తాన్ ప్రజలకు బీసీసీఐ హృదయపూర్వకంగా సానుభూతి ప్రకటిస్తోంది. వారి బాధను మేమూ పంచుకుంటాము’’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేరిట బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది.కాగా పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో అఫ్గన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఇందులో ముగ్గురు స్థానిక క్రికెటర్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాక్ వైఖరికి నిరసనగా పాకిస్తాన్‌తో ఆడాల్సిన ముక్కోణపు సిరీస్ నుంచి తప్పుకొంటున్నట్లు అఫ్గన్ బోర్డు ప్రకటించింది.ఆట కంటే దేశమే ముఖ్యంఅఫ్గన్ టీ20 జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్‌తో పాటు పలువురు క్రికెటర్లు బోర్డు నిర్ణయాన్ని స్వాగతించారు. ఆట కంటే దేశమే ముఖ్యమని పేర్కొన్నారు. కాగా రావల్పిండి వేదికగా నవంబరు 19 నుంచి పాకిస్తాన్- శ్రీలంక- అఫ్గనిస్తాన్ మధ్య త్రైపాక్షిక టీ20 సిరీస్ నిర్వహణకు ముందుగా షెడ్యూల్ ఖరారైంది.అయితే, పాక్ దుశ్చర్య కారణంగా అఫ్గన్ బోర్డు ఈ సిరీస్‌ను బహిష్కరించగా.. తాము మరో జట్టు కోసం వెతుకుతున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ‘‘అప్గనిస్తాన్ తప్పుకొన్నా ట్రై సిరీస్ కచ్చితంగా జరుగుతుంది. అఫ్గన్ జట్టు స్థానాన్ని భర్తీ చేయగల టీమ్ కోసం చూస్తున్నాం’’ అని పీసీబీ వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి.చదవండి: రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం! -
బీసీసీఐ ఎపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా చాముండేశ్వరనాథ్
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా ఆంధ్ర మాజీ క్రికెటర్ వి.చాముండేశ్వరనాథ్ ఎన్నికయ్యారు. ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఐసీఏ) పురుషుల క్రికెటర్ల ప్రతినిధిగా ఆయన కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. బుధ, గురువారాల్లో జరిగిన ఐసీఏ ఎన్నికల్లో అపెక్స్ కౌన్సిల్ పదవి కోసం ఎన్నిక జరిగింది. ఇందులో చాముండి 755–83 ఓట్ల తేడాతో రాజేశ్ జడేజాపై గెలుపొందారు. ఇప్పటి వరకు చాముండి ఐసీఏ ప్రతినిధిగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో ఉన్నారు. దిలీప్ వెంగ్‌సర్కార్ స్థానంలో ఎపెక్స్ కౌన్సిల్లోకి వచ్చిన ఆయన మూడేళ్ల పాటు పదవిలో ఉంటారు. ఐసీఏ ఎన్నికల్లో భారత మాజీ కెప్టెన్ శాంత రంగస్వామి అధ్యక్షురాలిగా, వి.సుందరమ్ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఎపెక్స్ కౌన్సిల్ మహిళా క్రికెటర్ల ప్రతినిధిగా సుధా షా ఎంపిక కాగా...ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో శుభాంగి కులకర్ణికి అవకాశం దక్కింది. చదవండి: IND vs AUS: కెప్టెన్సీ నుంచి తొలగిస్తారని భయపడ్డా: సూర్యకుమార్ యాదవ్ -
అందరికీ తెలుసు: అగార్కర్‌కు ఇచ్చిపడేసిన షమీ.. స్ట్రాంగ్ కౌంటర్
టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)- చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు షమీని ఎంపిక చేయలేదు యాజమాన్యం. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. అతడి ఫిట్నెస్ గురించి తమకు సమాచారం లేదని అగార్కర్ జట్టు ప్రకటన సందర్భంగా మీడియా ముఖంగా వెల్లడించాడు.ఇందుకు షమీ ఘాటుగానే స్పందించాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేవాడిని.. వన్డేలు ఆడలేనా? అని ప్రశ్నించాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని స్పష్టం చేశాడు. సెలక్షన్ అనేది తన చేతుల్లో లేదని.. ఫిట్నెస్ గురించి ఎవరూ అడగకపోయినా చెప్పడం సరికాదంటూ.. సెలక్టర్లు జట్టు ఎంపిక సమయంలో తనను సంప్రదించలేదని సంకేతాలు ఇచ్చాడు.ఫిట్‌గా లేకపోవడం వల్లేఈ క్రమంలో షమీ వ్యాఖ్యలపై అగార్కర్ శుక్రవారం స్పందించాడు. ఎన్డీటీవీ వేదికగా మాట్లాడుతూ.. ‘‘షమీ నా ముందు ఉండి ఉంటే సమాధానం ఇచ్చేవాడిని. అతడు నిజంగా ఫిట్‌గా ఉంటే అలాంటి బౌలర్‌ను ఎవరైనా కాదనుకుంటారా. గత ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో నేను అతడితో చాలాసార్లు మాట్లాడాను.ఫిట్‌గా లేకపోవడం వల్లే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయలేకపోయాం’ అని ఈ భారత మాజీ పేసర్ స్పష్టం చేశాడు. తాము ఆడిన రోజుల్లో సెలక్టర్లకు ఏనాడూ ఫోన్ చేయలేదని, ఇప్పుడు కాలం మారిందన్న అగార్కర్... జట్టుకు ఎంపిక కాని యువ ఆటగాళ్లు తనకు వెంటనే ఫోన్ చేస్తారని, వారికి వంద శాతం నిజాయితీగా తాను సమాధానం ఇస్తానని చెప్పాడు.అంతా మీ కళ్ల ముందే ఉంది కదా!ఈ నేపథ్యంలో అగార్కర్‌కు షమీ మరోసారి గట్టిగానే కౌంటర్ ఇచ్చిపడేశాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘అతడు ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పనివ్వండి. నేను ఎలా బౌలింగ్ చేస్తున్నారో మీరే చూస్తున్నారు. నేనెంత ఫిట్‌గా ఉన్నానో.. ఎలా ఆడుతున్నానో.. అంతా మీ కళ్ల ముందే ఉంది కదా!’’ అంటూ అగార్కర్‌కు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చాడు.కాగా షమీ చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా ప్రాతినిథ్యం వహించాడు. ఈ మెగా వన్డే టోర్నమెంట్లో తొమ్మిది వికెట్లు కూల్చిన ఈ కుడిచేతి వాటం పేసర్.. వరుణ్ చక్రవర్తితో కలిసి భారత్ తరఫున సంయుక్తంగా లీడ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయితే, ఐపీఎల్-2025లో మాత్రం ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.ఈ సీజన్లో షమీ ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి.. 11.23 ఎకానమీతో కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. కాగా ఫామ్‌లేమి, పనిభారం కారణంగా ఇంగ్లండ్‌తో టెస్టులకు షమీని ఎంపిక చేయలేదనే వార్తలు వచ్చాయి. తాజాగా ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి కూడా అతడిని తప్పించడం గమనార్హం.దుమ్ములేపిన షమీఇదిలా ఉంటే.. షమీ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. బెంగాల్ తరఫున బరిలోకి దిగిన ఈ యూపీ బౌలర్.. ఉత్తరాఖండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 14.5 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన షమీ.. రెండో ఇన్నింగ్స్‌లో 24.4 ఓవర్లలో కేవలం 38 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు.తద్వారా బెంగాల్ విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు షమీ. కాగా ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్‌లో భాగంగా బెంగాల్ జట్టు ఉత్తరాఖండ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది.చదవండి: సెలక్షన్ విషయంలో ద్రవిడ్‌తో విభేదాలు.. మా నిర్ణయమే ఫైనల్: అగార్కర్ -
రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్‌మన్ గిల్
టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) విజయశాతం 75. ఆటగాడిగానూ యాభై ఓవర్ల ఫార్మాట్లో హిట్‌మ్యాన్‌కు తిరుగులేదు. రెండేళ్ల క్రితం వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన రోహిత్.. ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) గెలిచాడు. రానున్న వన్డే వరల్డ్‌కప్‌లోనూ అతడే టీమిండియాకు సారథ్యం వహిస్తాడని అంతా అనుకున్నారు.పది కిలోల బరువు తగ్గి అందుకు అనుగుణంగానే ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన రోహిత్.. ఇటీవలే టెస్టులకూ రిటైర్మెంట్ ప్రకటించాడు. తద్వారా తన దృష్టి మొత్తం వన్డేలపైనే ఉంటుందని చెప్పకనే చెప్పాడు. అంతేకాదు.. 38 ఏళ్ల రోహిత్ ఇటీవలే పది కిలోల బరువు కూడా తగ్గి మునుపటి కంటే కూడా మరింత ఫిట్‌గా తయారయ్యాడు.అయితే, అనూహ్య రీతిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతడి స్థాయంలో యువ ఆటగాడు, టెస్టు సారథి అయిన శుబ్‌మన్ గిల్‌కే వన్డే జట్టు బాధ్యతలూ అప్పగించింది. వన్డే వరల్డ్‌కప్-2027ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్న ట్లు బోర్డు తెలిపింది. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్తో పాటు గిల్‌తోనూ రోహిత్‌కు విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరిగింది.రెండింటికీ చాలా తేడా ఉంటుందిఈ క్రమంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు శనివారం మీడియాతో మాట్లాడిన గిల్.. ఈ విషయంపై స్పందించాడు. ‘‘బయట మా గురించి జరుగుతున్న ప్రచారానికి, అంతర్గత విషయాలకు చాలా తేడా ఉంటుంది. మా మధ్య ఉన్న బంధాన్ని ఎవరూ చెరిపివేయలేరు.ఇంతకు ముందు మేమెలా కలిసి ఉన్నామో.. ఇప్పుడూ అలాగే ఉన్నాము. అతడు పూర్తి సహాయసహకారాలు అందించే వ్యక్తి. ఇన్నేళ్ల అనుభవం కారణంగా.. నేనేదైనా తప్పు చేసినట్లు భావిస్తే.. నా తప్పులను సరిదిద్దుతాడు. ఒకవేళ నాకు ఆయన సలహాలు అవసరమని భావిస్తే.. తప్పక అడుగుతా.అంతిమ నిర్ణయం నాదేప్రతి ఒక్కరి ఆలోచనలను నేను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తా. అలాగే మ్యాచ్ విషయంలో పరిస్థితులకు అనుగుణంగా నేనే అంతిమ నిర్ణయం తీసుకుంటా. రోహిత్ భాయ్, విరాట్ భాయ్‌తో నాకు మంచి రిలేషన్ ఉంది.నాకు ఏవైనా సందేహాలు వస్తే.. వారి సలహాలు తీసుకుంటా. నాకు సహాయం చేసేందుకు వాళ్లు కూడా ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు’’ అని శుబ్‌మన్ గిల్ తెలిపాడు. తద్వారా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. కాగా రోహిత్ పాటు టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: IND vs AUS: జట్లు, షెడ్యూల్, వేదికలు, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
బీసీసీఐ, కేంద్రం.. ఆప్ఘన్‌ను చూసైనా సిగ్గుపడాలి: ప్రియాంక చతుర్వేది
ముంబై: పాకిస్తాన్ సైన్యం వైమానిక దాడుల కారణంగా ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లు మృతిచెందారు. దీంతో వచ్చే నెలలో పాకిస్తాన్, శ్రీలంక జట్లతో తలపడబోయే ముక్కోణపు సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏసీబీ నిర్ణయంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. ఏసీబీని చూసి బీసీసీఐ, భారత ప్రభుత్వం నేర్చుకోవాలి అని ఘాటు విమర్శలు చేశారు.శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘పాకిస్తాన్ వ్యవస్థలో అమాయక బాధితుల రక్తం తాగే కొందరు వ్యక్తులు సరిహద్దుల్లో ఉన్నారు. వారంతా సిగ్గుపడాలి. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్‌తో తమ సిరీస్ మ్యాచ్‌లను రద్దు చేసుకోవడం సరైన చర్య. బహుశా బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం క్రీడల కంటే దేశానికి ఎలా ప్రాధాన్యత ఇవ్వాలో ఆప్ఘన్ నుంచి నేర్చుకోవాలంటూ విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు సంఘీభావంగా శ్రీలంక జట్టు కూడా సిరీస్ నుండి కూడా వైదొలగాలని ఆశిస్తున్నాను. 2009లో పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడు వారి జట్టుపై కూడా ఉగ్రవాదులు దాడి చేశారని మర్చిపోకూడదు. బీసీసీఐ లాగా కాకుండా పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇతర ఆసియా జట్లు సంఘీభావంగా నిలుస్తాయని ఆశిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.Pakistan establishment is made up of a bunch of cowards who thrive on the blood of their innocent victims and get thrashed at the borders. Shame on them. Good to see Afghanistan Cricket Board call off their series matches with Pakistan, maybe BCCI and GoI can take tips on how to… https://t.co/VzAvFcUOwi— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) October 18, 2025రాజకీయాలకు క్రీడలను దూరంగా ఉంచాలి. ఇక్కడ పోరాటం కేవలం రాజకీయల గురించి మాత్రమే కాదు. దుష్ట దేశం పాకిస్తాన్ గురించి. పాక్ ఉగ్రవాదం కారణంగా ఇప్పటికే పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ ప్రభావితమైంది. దేశం అంతా బాధపడుతోంది. కాబట్టి ఇది రాజకీయాలను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవాలి’ అంటూ హితవు పలికారు. ఇక, అంతుకుముందు కూడాప్రియాంక బీసీసీఐ, కేంద్రం తీరును తప్పుబట్టారు. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో భారత జట్టు మ్యాచ్‌లు ఆడటమేంటని ప్రశ్నించారు. Keep Politics out of sports is something that gets thrown around so easily by apologists of the government and the BCCI. This isn’t politics but about terrorism. Lives are lost, families are impacted, economy is affected, country suffers all of it because of one rogue nation. So…— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) October 18, 2025ఇదిలా ఉండగా.. క్రికెటర్ల మరణంపై ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘అత్యంత విషాదకరమైన ఘటన. అనైతికం, అనాగరిక చర్య. పాకిస్తాన్ వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. విషాద ఘటనలో మహిళలు, పిల్లలు, క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. జాతీయజట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటోన్న యువ ప్లేయర్ల లక్ష్యం నెరవేరకుండానే జీవితం ముగిసింది. పౌరులపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలిగించిన దాడిని ప్రతిఒక్కరూ ఖండించాలని కోరుతున్నా. పాక్‌తో తలపడబోయే ట్రై సిరీస్ నుంచి వైదొలుగుతున్నామని మా క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం సరైందే. క్లిష్ట సమయాల్లో ప్రజలకు అండగా నిలుస్తాం. మాకు దేశ సమగ్రత అత్యంత ముఖ్యమైన అంశం’ అని పేర్కొన్నాడు. -
షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) వ్యాఖ్యలపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) స్పందించాడు. షమీ నిజంగానే ఫిట్‌గా ఉండి ఉంటే కచ్చితంగా జట్టులో ఉండేవాడని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో చివరగా టీమిండియాకు ఆడాడు షమీ.టాప్ వికెట్ టేకర్ఈ వన్డే మెగా టోర్నీలో తొమ్మిది వికెట్లు తీసిన షమీ.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో కలిసి సంయుక్తంగా టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయినప్పటికీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఈ రైటార్మ్ పేసర్‌కు సెలక్టర్లు చోటివ్వలేదు.అప్డేట్ లేదన్న అగార్కర్ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా అగార్కర్ మాట్లాడుతూ.. షమీ ఫిట్నెస్ గురించి తమకు అప్డేట్ లేదని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో షమీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు తెలిపాడు. రంజీలు ఆడగలిగే తాను వన్డేల్లో ఆడలేనా అంటూ సెలక్టర్ల తీరుపై విమర్శలు గుప్పించాడు.షమీ కౌంటర్ఫిట్నెస్ గురించి ఎవరైనా తనను అడిగితే సమాధానం ఇస్తానే తప్ప.. తనంతట తానే ఫిట్‌గా ఉన్నానని చెప్పలేను కదా అంటూ అగార్కర్‌కు కౌంటర్ ఇచ్చాడు. తద్వారా సెలక్షన్ సమయంలో తనను ఎవరూ సంప్రదించలేదనే సంకేతాలు ఇచ్చాడు. ఈ విషయం గురించి అగార్కర్ తాజాగా స్పందించాడు.అగార్కర్ స్పందన ఇదేఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌కు హాజరైన అగార్కర్.. షమీ పట్ల తమ నిర్ణయం సరైందేనని పేర్కొన్నాడు. ‘‘ఒకవేళ అతడు నేరుగా మాట్లాడి ఉంటే.. అందుకు నేను సమాధానం ఇచ్చేవాడిని. కానీ అతడు సోషల్ మీడియాలో ఏ ఉద్దేశంతో మాట్లాడాడో తెలియదు.ఒకవేళ నేను ఈ విషయం గురించి చదివి ఉంటే.. అతడికి ఫోన్ ద్వారానైనా జవాబు ఇచ్చేవాడిని. ప్రతి ఒక్క ప్లేయర్ కోసం నా ఫోన్ ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంటుంది. గత కొన్నినెలలుగా అతడితో నేను తరచూ చాట్ చేస్తూనే ఉన్నాను.ఏం జరుగుతుందో చూద్దాంకానీ మీకు ఇక్కడ హెడ్లైన్ ఇచ్చేలా ఏమీ మాట్లాడదలచుకోలేదు. టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శనలు ఇచ్చిన ఘనత షమీకి ఉంది. ఏదేనా ఉంటే పరస్పరం మాట్లాడుకుంటాం.ఇంగ్లండ్ పర్యటనకు ముందు కూడా.. తను ఫిట్‌గా ఉంటే కచ్చితంగా టూర్‌కు పంపిస్తామని చెప్పాము. దురదృష్టవశాత్తూ అప్పుడు అతడు ఫిట్‌గా లేడు. ఇక దేశీ క్రికెట్ సీజన్ ఇప్పుడే ఆరంభమైంది కదా.. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని పేర్కొన్నాడు.అయితే, ఇంగ్లండ్‌తో టెస్టులకు సిద్ధంగా లేకపోయినా.. వన్డే ఫార్మాట్‌కు తాను ఫిట్‌గా ఉన్నానని షమీ చెప్పగా.. అగార్కర్ మాత్రం ఇలా స్పందించడం గమనార్హం.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే అక్కడికి చేరుకుంది. అక్టోబరు 19- నవంబరు 8 వరకు ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: ‘భర్త కంటే ‘బాబా’నే ఎక్కువ!.. తండ్రి కోసం కుర్తా కొనలేని వాడు.. అతడికి రూ. 15 లక్షల గిఫ్ట్!’ -
BCCI: రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!.. స్పందించిన బీసీసీఐ
టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli)- రోహిత్ శర్మ (Rohit Sharma)ల అంతర్జాతీయ క్రికెట్ భవితవ్యంపై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. వీరిద్దరు ఇంగ్లండ్ పర్యటనలో టెస్టులు ఆడేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వచ్చినా.. అనూహ్యంగా ఇద్దరూ ఐదు రోజుల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించారు.వన్డే కెప్టెన్సీ నుంచి తొలగింపుఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పెద్దల వైఖరితో నొచ్చుకున్న రో- కో ఈ మేరకు అనూహ్య నిర్ణయం తీసుకున్నారనే వార్తలు వినిపించాయి. ఇక ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కూ వీడ్కోలు పలికిన రోహిత్- కోహ్లి.. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్నారు. అయితే, ఊహించని రీతిలో రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించింది బీసీసీఐ.దేశీ టోర్నీలు కూడా ఆడాలిఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు రోహిత్ స్థానంలో శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు వన్డే జట్టు పగ్గాలు అప్పగించింది. వన్డే వరల్డ్‌కప్-2027ను దృష్టిలో పెట్టుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. ఈ సందర్భంగా రో- కో వన్డే వరల్డ్‌కప్ వరకు కొనసాగుతారనే హామీ కూడా లేదని చెప్పాడు. అంతేకాదు.. అవసరమైతే ఈ ఇద్దరు దేశీ టోర్నీలు కూడా ఆడాల్సి ఉంటుందని సంకేతాలు ఇచ్చాడు.రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి వన్డేలకూ త్వరలోనే గుడ్‌బై చెప్పనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్ వీరి అంతర్జాతీయ కెరీర్లో చివరిదనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు.స్పందించిన బీసీసీఐఢిల్లీలో మంగళవారం వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత్ జయభేరి మోగించిన అనంతరం రాజీశ్ శుక్లా మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో రో- కో వన్డే రిటైర్మెంట్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘వాళ్లిద్దరు జట్టులో ఉండటం మాకు అతిపెద్ద సానుకూలాంశం. ఇద్దరూ గొప్ప బ్యాటర్లు.వారిద్దరి సమక్షంలో టీమిండియా కచ్చితంగా ఆస్ట్రేలియాను ఓడించి తీరుతుంది. రో-కో లకు ఇదే చివరి సిరీస్ అనడం హాస్యాస్పదం. అసలు మేము ఈ విషయం గురించి ఆలోచించము. రిటైర్మెంట్ అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం. ఏదేమైనా రోహిత్- కోహ్లికు ఆసీస్ సిరీస్ ఆఖరిది అనడం తప్పు’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నాడు.ఇద్దరూ ఇద్దరేకాగా వన్డేల్లో కోహ్లి, రోహిత్‌లకు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వన్డేల్లో 51 సెంచరీలతో కోహ్లి ప్రపంచ రికార్డు సాధిస్తే.. రోహిత్ వన్డే ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది వీరిద్దరు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ విజేతగా నిలవడంలో తమ వంతు పాత్ర పోషించారు.అంతేకాదు 2025లో రోహిత్ ఇప్పటికి 8 వన్డేల్లో ఓ సెంచరీ సాయంతో 302 పరుగులు చేయగా.. కోహ్లి ఏడు ఇన్నింగ్స్ ఆడి 275 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 36 ఏళ్ల కోహ్లి ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా.. 37 ఏళ్ల రోహిత్ ఇటీవల పది కిలోలు తగ్గి మరింత ఫిట్‌గా తయారయ్యాడు. కాబట్టి ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ దృష్ట్యా వీరిద్దరు ఇప్పట్లో రిటైర్ కాకపోవచ్చని చెప్పవచ్చు.చదవండి: సిగ్గుచేటు అంటూ గంభీర్ ఫైర్.. బీసీసీఐ స్పందన ఇదే -
BCCI: గంభీర్ వ్యాఖ్యలపై స్పందించిన బీసీసీఐ
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) చేసిన ‘సిగ్గుచేటు’ వ్యాఖ్యలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajeev Shukla) స్పందించాడు. గంభీర్ సరిగ్గానే మాట్లాడానని సమర్థించిన అతడు.. యువ ఆటగాడి పట్ల సీనియర్ల ప్రవర్తన సరికాదని పేర్కొన్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..గంభీర్ హెడ్‌కోచ్ కాగానే..ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలవడంలో యువ పేసర్ హర్షిత్ రాణా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాటి కేకేఆర్ మెంటార్ గంభీర్.. టీమిండియా హెడ్‌కోచ్ కాగానే హర్షిత్ జాతీయ జట్టులోకి వచ్చేశాడు. వరుస వైఫల్యాలు చెందినా.. టీమిండియాలో అతడి స్థానానికి ఢోకా లేకుండా పోయింది.ముఖ్యంగా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఫిట్‌గానే ఉన్నానని మొత్తుకుంటున్నా.. సెలక్టర్లు అతడిని పట్టించుకోవడం లేదు. ఇలాంటి తరుణంలో ఆస్ట్రేలియాతో వన్డే, టీ20లకు హర్షిత్ రాణా ఎంపిక కావడం విమర్శలకు దారితీసింది. గంభీర్ ప్రియ శిష్యుడు కాబట్టే అతడికి ఛాన్సులు వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.చిక్కా, అశూ విమర్శలుఈ విషయంలో మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్, టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఘాటుగానే స్పందించారు. హర్షిత్‌ను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో అర్థం కావడం లేదని పరోక్షంగా గంభీర్‌ను విమర్శించారు.గంభీర్ ఆగ్రహంఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో రెండో టెస్టులో విజయానంతరం మీడియాతో మాట్లాడిన గంభీర్.. చిక్కా, అశూలను టార్గెట్ చేశాడు. ‘‘యూట్యూబ్‌లో వ్యూస్ కోసం యువ ఆటగాడి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు.మీ స్వార్థం కోసం 23 ఏళ్ల క్రికెటర్‌ను టార్గెట్ చేస్తారా? ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వచ్చిన ఆటగాడి గురించి ఇలా మాట్లాడకండి’’ అంటూ ఫైర్ అయ్యాడు. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా స్పందించాడు.బీసీసీఐ స్పందన ఇదే‘‘గౌతం గంభీర్ సరిగ్గానే చెప్పాడు. ఓ ఆటగాడి ఎంపిక గురించి ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటే.. బాధ్యతాయుతంగా విమర్శించాలి. అంతేకానీ.. సదరు ప్లేయర్ ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా మాట్లాడకూడదు.ఎవరిని ఎంపిక చేయాలో యాజమాన్యం చూసుకుంటుంది. ఇతర ఆటగాళ్ల గురించి మాట్లాడేటపుడు.. మీరెంత బాధ్యతాయుతంగా ఉన్నారో ఆలోచించుకోండి’’ అంటూ రాజీవ్ శుక్లా గంభీర్‌కు మద్దతు పలికాడు. ANIతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా గంభీర్, హర్షిత్ ఇద్దరూ ఢిల్లీకి చెందిన వారే కావడం గమనార్హం.చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్.. భారత తొలి క్రికెటర్‌గా ఫీట్#WATCH | Delhi: On Indian Men’s Cricket Team Head Coach Gautam Gambhir's statement on the selection process and bowler Harshit Rana, BCCI Vice President Rajeev Shukla says, "What Gautam Gambhir said is absolutely right. Comments should be made about players with responsibility;… pic.twitter.com/yOrJXFKanF— ANI (@ANI) October 14, 2025 -
మరో వివాదంలో HCA.. టాలెంట్ ఉన్న వాళ్లను తొక్కేస్తున్నారు!?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మరో వివాదంలో చిక్కుకుంది. HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం రేపింది. ఈ విషయంపై అసోసియేషన్‌తో పలువురు క్రికెటర్లపై రాచకొండ సీపీకి ఫిర్యాదు అందింది. అండర్- 16, అండర్- 19, అండర్-23 లీగ్ మ్యాచ్‌లలో పలువురు ప్లేయర్ల ఫేక్ బాగోతం తాజాగా బయటపడినట్లు సమాచారం. వయసు ఎక్కువగా ఉన్న ఆటగాళ్లు కూడా నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో లీగ్‌లలో ఎంట్రీ ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఈ విషయంలో గతంలో ఆరుగురు ప్లేయర్లను గుర్తించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వారిపై నిషేధం విధించింది. అయినప్పటికీ ఎక్కువ వయసున్న ఆటగాళ్లలో తక్కువ వయసున్న విభాగంలో ఆడేందుకు HCA అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. దీని వల్ల ప్రతిభావంతులైన ఆటగాళ్లకు నష్టం వాటిల్లుతుందన్న సంగతి తెలిసినా HCA తమ తీరు మార్చుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో.. అవినీతికి పాల్పడుతూ టాలెంట్ లేని ప్లేయర్లను ఆడిస్తున్న HCA అధికారులపై చర్యలు తీసుకోవాలని అనంతరెడ్డి అనే వ్యక్తి రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా గత కొన్నాళ్లుగా HCA వివిధ అంశాల్లో అవినీతికి పాల్పడిన తీరు.. అసోసియేషన్‌పై విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే.చదవండి: యువ క్రికెటర్లకు HCA బంపరాఫర్.. ఆలస్యం చేయకండి -
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ వేలం?
ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలాన్ని భారత్‌లో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భావిస్తున్నట్లు సమాచారం. గత రెండు సీజన్లకు సంబంధించిన వేలాన్ని దుబాయ్, సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా కండక్ట్ చేశారు.క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం.. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత ఈ క్యాష్‌రిచ్ వేలాన్ని భారత్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు సమాచారం. ఇంకా ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ త్వరలోనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (GC) దీనిపై సమావేశం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.అదేవిధంగా ఈ మినీ అక్షన్ను డిసెంబర్ 13 నుండి 15 మధ్య నిర్వహించే అవకాశముందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే గతేడాది మాత్రం బోర్డర్-గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్, అప్పటి బీసీసీఐ కార్యదర్శి జై షా విదేశీ పర్యటన కారణంగా కాస్త ముందుగానే(నవంబర్ 24, 25 తేదీల్లో) వేలం జరిగింది.కాగా ఐపీఎల్ వేలం ఇప్పటివరకు ఎక్కువసార్లు బెంగళూరులోనే జరిగింది. మొత్తం 7 సార్లు ఈ గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అక్షన్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. అయితే గత కొన్ని ఐపీఎల్ సీజన్లలో అహ్మదాబాద్ అత్యంత ప్రాధాన్యతగల వేదికగా అవతరించింది. 2022లో గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు అరంగేట్రం నుంచి గత నాలుగు ఐపీఎల్ ఫైనల్స్‌లో అహ్మదాబాద్ వేదికగానే జరిగింది. దీంతో ఈసారి బీసీసీఐ మినీ వేలాన్ని మొదటిసారిగా అహ్మదాబాద్‌లో నిర్వహించే అవకాశం ఉందని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.ఇప్పటివరకు ఐపీఎల్ వేలం జరిగిన వేదికలు🔹 2008 – ముంబై🔹 2009 – గోవా🔹 2010 – బెంగళూరు🔹 2011 – బెంగళూరు🔹 2012 – బెంగళూరు🔹 2013 – చెన్నై🔹 2014 – బెంగళూరు🔹 2015, 2016, 2017, 2018 – బెంగళూరు.🔹 2019 – జైపూర్🔹 2020 – కోల్‌కతా🔹 2021 – చెన్నై🔹 2022 – బెంగళూరు🔹 2023 – దుబాయ్ (UAE)🔹 2024 – జెడ్డా (సౌదీ అరేబియా)చదవండి: గెలుపు వాకిట్లో భారత్ -
వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా గుడ్ న్యూస్ అందింది. యువ ఆటగాడు సాయి సుదర్శన్ గాయం తీవ్రతపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) వైద్య బృందం అప్డేట్ ఇచ్చింది. అతడి గాయం అంత తీవ్రమైనది కాదని మెడికల్ టీమ్ వెల్లడించింది.సుదర్శన్ ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే ముందు జాగ్రత్త చర్యగా మూడో రోజు ఆటకు కూడా ఈ తమిళనాడు బ్యాటర్ దూరంగా ఉండనున్నాడు. రెండో రోజు ఆట సందర్భంగా సుదర్శన్ గాయపడిన సంగతి తెలిసిందే.అసలేమి జరిగిందంటే?రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔట్‌సైడ్ ఆఫ్ దిశగా పడిని విండీస్ ఓపెనర్ క్యాంప్‌బెల్ బలంగా స్వీప్ చేశాడు. ఈ క్రమంలో షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సుదర్శన్ బంతి నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ ఆ బంతి నేరుగా అతని చేతుల్లోకి వెళ్లడం , ఆ వేగంలో కూడా సుదర్శన్ విడిచిపెట్టుకుండా అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.ఈ క్యాచ్‌ను అందుకునే క్రమంలో బంతి అతడి చిటికెన వేలు తాకింది. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. దీంతో ఫిజియో సాయంతో అతడు మైదానాన్ని వీడాడు. అతడి స్దానంలో సబ్‌స్ట్యూట్‌గా దేవదత్త్ పడిక్కల్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. అయితే బ్యాటింగ్‌కు సుదర్శన్ వస్తాడో రాడో ఇంకా క్లారిటీ లేదు.అయితే వెస్టిండీస్ మాత్రం తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌కు చేరువైంది. 209 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే విండీస్ ఫాలో ఆన్ గండం తప్పించుకునేటట్లు కన్పించడం లేదు. విండీస్ ఫాల్ ఆన్‌కు ఇంకా 105 పరుగుల వెనుకంజలో ఉంది.చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 65 ఏళ్లలో ఇదే తొలిసారి -
నాకైతే ఆడాలని ఉంది.. కానీ అది నా చేతుల్లో లేదు: జడేజా
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. జడ్డూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికి సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.గతేడాది టీ20లకు వీడ్కోలు పలికిన జడేజా.. ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2009 నుంచి భారత్ తరఫున వన్డే క్రికెట్ ఆడుతున్న జడేజా అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా నిలిచాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకోవడంలోనూ అతడు కీలక పాత్ర పోషించాడు.ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ ఈ సౌరాష్ట్ర క్రికెటర్ అదరగొడుతున్నాడు. ఫిట్నెస్ పరంగా కూడా అతడు చాలా మెరుగ్గా ఉన్నాడు. ఆసీస్ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో వన్డే ప్రపంచ కప్-2027లో జడేజా ఆడుతాడో లేదో సందిగ్ధంగా మారింది. అయితే బీసీసీఐ చీఫ్ సెలక్టర్ మాత్రం జడేజా తమ ప్రణాళిలకలలో ఉన్నాడని జట్టు ప్రకటన సందర్భంగా చెప్పుకొచ్చాడు. తాజాగా జడేజా కూడా ప్రపంచకప్‌లో ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు."వన్డే ప్రపంచ కప్-2027లో ఆడాలనుకుంటున్నాను. కానీ అది నా చేతుల్లో లేదు. సెలక్షన్ కమిటీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆసీస్ టూర్‌కు జట్టు ఎంపికకు ముందు సెలక్టర్లు, కెప్టెన్ నాతో మాట్లాడారు. వారి చెప్పిన కారణాలు నాకు అర్థమయ్యాయి. కానీ వన్డే ప్రపంచకప్ గెలవడం మా అందరి కల" అని జడేజా విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.చదవండి: అది నేను ఎప్పటికీ మర్చిపోలేను: గంభీర్ -
ఆసియాకప్ ట్రోఫీ ఎత్తుకెళ్లాడు.. కట్ చేస్తే! నఖ్వీ పోస్ట్ ఊస్టింగ్?
2025 ఆసియా కప్.. ఈ ఖండాతర టోర్నీ చరిత్రలో అత్యంత వివాదాస్పద ఎడిషన్‌గా నిలిచింది. షేక్ హ్యాండ్ వివాదం మొదలు ఆసియా కప్ ట్రోఫీ వరకూ ఆధ్యంతం తీవ్ర ఉత్కంఠను రేపింది. పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో భారత జట్టు అంటిముట్టనట్టే వ్యవహరించింది. తొలుత షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి నిరాకరించిన భారత్.. ఆ తర్వాత ఏసీసీ చైర్మెన్, పీసీబీ చీఫ్ మోహ్సన్ నఖ్వీ(mohsin naqvi) చేతుల మీదగా విన్నింగ్ ట్రోఫీని తీసుకోవడానికి సముఖత చూపలేదు. నక్వీ తన చేతుల మీదుగానే ట్రోఫీ తీసుకోవాలని పట్టుబట్టినప్పటికి బీసీసీఐ ఆదేశాల మేరకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ అందుకు అంగీకరించలేదు.దీంతో నఖ్వీ స్టేడియం నుంచి ట్రోఫీతో పాటు విజేతల పతకాలను కూడా తీసుకెళ్లడం పెద్ద వివాదానికి దారితీసింది. ఇప్పటికి ఇంకా ట్రోఫీని భారత్‌కు అతడు అందజేయలేదు. ట్రోఫీ ప్రస్తుతం దుబాయ్‌లోని ఏసీసీ ఆఫీస్‌లో ఉంది. తన అనుమతి లేకుండా ట్రోఫీని ఎవరికీ అప్పగించకూడదని ఏసీసీ అధికారులకు నఖ్వీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. నఖ్వీ ట్రోఫీని తీసుకుని వెళ్లిపోవడం, ఇంకా అందజేయకపోవడంపై బీసీసీఐ గుర్రుగా ఉంది. వచ్చే నెలలో జరిగే ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని బీసీసీఐ లేవనెత్తునుంది. అంతేకాకుండా ఐసీసీ డైరెక్టర్ పదవి నుండి అతడిని తొలిగించాలని భారత క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తోంది.నఖ్వీ ఏసీసీ చైర్మెన్‌తో పాటు ఐసీసీ డైరెక్టర్ గానూ కొనసాగుతున్నాడు. కాగా ఐసీసీ చైర్మెన్‌గా జై షా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో నఖ్వీ డైరక్టర్ పదవి ఊడిపోవడం ఖాయమని ప్రచారం సాగుతోంది."ఆసియాకప్ టోర్నీకి అధికారిక హోస్ట్‌గా ఉన్న బీసీసీఐకి ట్రోఫీని పంపడానికి నిరాకరించే హక్కు నఖ్వీకి లేదు. అతడు ట్రోఫీని భారత్‌కు ఇప్పటికే పంపించాల్సింది. కానీ అందుకు అతడు ఒప్పుకోవడం లేదు. కాబట్టి అందుకు నఖ్వీ భారీ మూల్యం చెల్లించుకోనున్నాడు" అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: ఐపీఎల్లో అదరగొట్టాడు.. కట్ చేస్తే! ఇప్పుడు ఊహించని జాక్ పాట్ -
'టీమిండియా'పై కేసు.. గట్టిగా అక్షింతలు వేసిన ఢిల్లీ హైకోర్టు
భారత క్రికెట్ జట్టును టీమిండియా (Team India) అని పిలవడంపై అభ్యంతరం వ్యక్తమైంది. ఓ ప్రైవేట్ సంస్థ (BCCI) ఎంపిక చేసే జట్టును భారత జట్టు లేదా టీమిండియా అని పిలవకూడదని రీపక్ కన్సాల్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత పిటిషన్ (PIL) దాఖలు చేశారు.బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు ఇండియా లేదా భారత్ పేరును వాడుకోకూడదని పిటిషన్లో పేర్కొన్నారు. ఇలా చేసి జాతీయ గుర్తింపు పొందడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.సమాచార హక్కు చట్టం (RTI) ఆధారంగా బీసీసీఐకి ప్రభుత్వ గుర్తింపు లేదా నిధులు లేవని పేర్కొన్నారు. జాతీయ చిహ్నాలు, జెండా, పేరు వాడకం ద్వారా 1950 చట్టం, 2002 ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘన జరుగుతోందని అభిప్రాయపడ్డారు. ప్రసార్ భారతి వంటి జాతీయ ప్రసార సంస్థలు బీసీసీఐ జట్టును ‘టీమిండియా’ పేరుతో ప్రసారం చేయడం సరికాదని పేర్కొన్నారు.ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ తిప్పికొట్టింది. ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, న్యాయమూర్తి తుషార్ రావ్ గెడెలా ఈ పిటిషన్‌ను కోర్టు సమయాన్ని వృథా చేసే చర్యగా అభివర్ణించారు.ఈ జట్టు విశ్వ వేదికపై భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది. అలాంటప్పుడు టీమిండియా లేదా భారత జట్టని ఎందుకు పిలవకూడదని న్యాయమూర్తి తుషార్ గెడెలా పిటిషనర్‌ను ప్రశ్నించారు.క్రీడా జట్లను ప్రభుత్వ అధికారులు ఎంపిక చేస్తారా..? కామన్వెల్త్, ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్లను ప్రభుత్వమే ఎంపిక చేస్తుందా అని ప్రధాన న్యాయమూర్తి ఉపాధ్యాయ ప్రశ్నించారు. మీ ఇంట్లో జాతీయ జెండా ఎగురవేయడం నిషేధమా అని నిలదీశారు. దేశ పేరు, జాతీయ చిహ్నాల వాడకం ప్రభుత్వానికి మాత్రమే పరిమితం కాదని స్పష్టం చేశారు. క్రీడా వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం ప్రమాదకరమని హెచ్చరించారు. దేశానికి సంబంధించి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అలాంటి వాటిపై దృష్టి పెట్టాలని అక్షింతలు వేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు అర్హం కాదని కొట్టి పారేశారు.ఈ తీర్పుతో టీమిండియా అనే పేరు చట్టబద్ధంగా కొనసాగించవచ్చని, బీసీసీఐ జట్టు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.చదవండి: టీమిండియాపై అనూహ్య విజయం.. దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు -
డబ్ల్యూపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఖరారు..! నిబంధనలు ఇవే?
మహిళల ప్రీమియర్ లీగ్-2026(WPL) మెగా వేలానికి ముహార్తం ఖారైరనట్లు తెలుస్తోంది. ఈఎస్సీఎన్ క్రిక్‌ఇన్ ఫో ప్రకారం.. ఈ ఏడాది నవంబర్ 25 లేదా 29న వేలం నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సిద్దమవుతున్నట్లు సమాచారం.29వ తేదీ శనివారం కావడంతో అదే రోజున వేలం జరిగే అవకాశముంది. ఈ మహిళల టోర్నమెంట్ కేవలం మూడు సీజన్లు మాత్రమే పూర్తి చేసుకున్నందున.. ముంబై ఇండియన్స్ ఉమెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్, ఢిల్లీ క్యాపిటల్స్ వేలం నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కానీ బీసీసీఐ మాత్రం మెగా వేలం నిర్వహణకే మొగ్గు చూపింది.ఐదుగురికే ఛాన్స్డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ వేలం నేపథ్యంలో ఐదు ఫ్రాంచైజీలకు గురువారం నిర్వాహకులు ఈమెయిల్ పంపించారు. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా ఐదుగురిని రిటైన్ చేసుకోవచ్చు ఈమెయిల్లో రాసుకొచ్చారు. వారిలో ముగ్గురు ఇండియన్ క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉండాలి. భారత క్రికెటర్లలో ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లను రిటైన్ చేసుకునేందుకు కూడా వీలు కల్పించారు. ఒకవేళ ఫ్రాంచైజీలు ఐదు మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంటే వారిలో కచ్చితంగా ఒకరు అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ ఉండాలి. ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను సమర్పించడానికి నవంబర్ 5 డెడ్‌లైన్‌గా విధించారు. ఐపీఎల్ మాదిరిగానే డబ్ల్యూపీఎల్‌లో రైట్ టు మ్యాచ్‌ను అనుమతిస్తూ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఒక ఫ్రాంచైజీ గరిష్టంగా ఐదు ఆర్టీఎమ్ కార్డులను ఉపయోగించకోవచ్చు.రూ. 15 కోట్లతో వేలం..డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ వేలంలో ఫ్రాంచైజీలు రూ.15 కోట్లు ఖర్చు చేయనున్నాయి. రిటెన్షన్ కోసం ఐదు స్లాబ్‌లు రూ.3.5 కోట్లు (ప్లేయర్ 1), రూ. 2.5 కోట్లు (ప్లేయర్ 2), రూ.1.75 కోట్లు (ప్లేయర్ 3), రూ. 1 కోటి(ప్లేయర్ 4), రూ. 50 లక్షలు (ప్లేయర్ 5)గా నిర్ణయించారు. కానీ ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు కంటే ఎక్కువ చెల్లించడానికి బీసీసీఐ అనుమతిచ్చింది.చదవండి: World cup: రిచా ఘోష్ తుపాన్ ఇన్నింగ్స్.. టీమిండియా స్కోరెంతంటే? -
భారత్-పాక్ మ్యాచ్‌లు వద్దు.. అందుకు వారు ఒప్పుకొంటారా?: బీసీసీఐ
ఆసియాప్-2025లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఊహించని పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ అంతటా భారత జట్టు ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో అంటిముట్టనట్టే ఉన్నారు. కనీసం కరచాలనం చేసేందుకు కూడా ఇష్టపడలేదు. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని తీసుకోవడానికి కూడా భారత్ నిరాకరించింది.నఖ్వీ పీసీబీ చీఫ్‌తో పాటు పాక్ మంత్రిగా ఉండడమే అందుకు కారణం. అయితే ఈ ఆసియాకప్‌లో జరిగిన సంఘటనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది భారత్‌కు సపోర్ట్ చేస్తే మరి కొతమంది పాక్‌కు మద్దతుగా నిలిచారు.ఇదే విషయంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ అథర్టన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇరు దేశాల మధ్య సమస్యలు పరిష్కారం అయ్యే వరకు భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లను నిర్వహించవద్దని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి అథర్టన్ సూచించాడు. అతడి వ్యాఖ్యలపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు."భారత్-పాకిస్తాన్ మధ్య సమస్యలు అంత సులువుగా పరిష్కరం కావు. బయట నుంచి వ్యక్తులు ఏదైనా మాట్లాడుతారు. ఏదైనా చెప్పినంత ఈజీ కాదు. అందుకు స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్లు అంగీకరిస్తారా? ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియానే కాదు ఏ ప్రధాన జట్టు అయినా టోర్నమెంట్ నుండి వైదొలిగితే తర్వాత స్పాన్సర్లను ఆకర్షించడం చాలా కష్టమని" సదరు అధికారి పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది ఆసియాకప్‌లో మూడు సార్లు పాక్-భారత్ జట్లు తలపడ్డాయి. మూడు మ్యాచ్‌లలోనూ పాక్‌ను టీమిండియా చిత్తు చేసింది. అయితే విన్నింగ్ ట్రోఫీ ఇప్పటివరకు ఇంకా భారత్ వద్ద చేరలేదు.చదవండి: Prithvi Shaw: భారీ శతకంతో చెలరేగిన పృథ్వీ షా -
వన్డే సారథిగా గిల్
రోహిత్ శర్మ భారత వన్డే జట్టు కెప్టెన్ హోదాలో చాంపియన్స్ ట్రోఫీలో జట్టును విజేతగా నిలిపాడు. దీని తర్వాత టీమిండియా మరో వన్డే మ్యాచ్ ఆడలేదు. లెక్క ప్రకారం చూస్తే ఏదైనా స్వల్ప మార్పు మినహా అదే జట్టు తర్వాతి సిరీస్ కోసం కొనసాగాలి. కానీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ భిన్నంగా ఆలోచించింది. ఐసీసీ టోర్నీని గెలిపించినా సరే... సారథ్యం నుంచి తప్పించి అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఓపెనింగ్ బ్యాటర్‌గా జట్టులో స్థానం దక్కించుకోగలిగిన ఆటగాడు నాయకత్వానికి మాత్రం అవసరం లేదని తేలి్చంది. ఇప్పటికే టెస్టు కెప్టెన్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్‌ను ఇప్పుడు వన్డే కెప్టెన్‌గా కూడా నియమించి మార్పుకు సెలక్టర్లు శ్రీకారం చుట్టారు. ఆటగాళ్లుగా మాత్రం రోహిత్, విరాట్ కోహ్లి భారత జట్టు తరఫున ఆ్రస్టేలియా పర్యటనకు ఎంపికయ్యారు. అహ్మదాబాద్: భారత టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఇప్పుడు వన్డేల్లోనూ సారథ్య బాధ్యతలు చేపడుతున్నాడు. అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ గిల్‌ను వన్డే జట్టు కొత్త కెప్టెన్‌గా నియమించింది. ఇప్పటి వరకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను అనూహ్యంగా నాయకత్వం నుంచి తప్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై జరిగే 3 వన్డేలు, 5 టి20ల సిరీస్‌ల కోసం టీమ్‌లను సెలక్టర్లు ప్రకటించారు. కెప్టెన్‌గా రోహిత్ వైఫల్యం లేకపోయినా... భవిష్యత్తును, ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని 26 ఏళ్ల గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు సెలక్టర్లు వెల్లడించారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తొలి సారి టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన గిల్ ఇప్పుడు రెండు ఫార్మాట్లలో కెప్టెన్ కావడంతో పాటు టి20 టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. 2026 టి20 వరల్డ్ కప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌నుంచి అతనికి టి20 సారథ్య బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉంది. రోహిత్ వయసు (38)ను దృష్టిలో ఉంచుకొని చూస్తే 2027 వరకు ఆటగాడిగా, కెప్టెన్‌గా కొనసాగడం కష్టంగానే అనిపించినా... ఇంత తొందరగా అతడిని కెప్టెన్ హోదానుంచి తప్పిస్తారనేది మాత్రం ఎవరూ ఊహించలేదు. అయితే అసలు వన్డే జట్టులో ఉంటారా లేదా అనే చర్చ జరిగిన నేపథ్యంలో... రోహిత్‌తో పాటు మరో సీనియర్ విరాట్ కోహ్లిలకు కూడా వన్డే టీమ్‌లో స్థానం లభించింది. వైస్ కెప్టెన్‌గా శ్రేయస్... భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన జట్టులో పలు మార్పులు జరిగాయి. ఆ టీమ్‌లో ఉన్నవారిలో రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా ఇంకా గాయాలనుంచి కోలుకోలేదు. ఇద్దరు స్పిన్నర్లు జడేజా, వరుణ్ చక్రవర్తిలను ఎంపిక చేయలేదు. పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి కూడా జట్టులో స్థానం లభించలేదు. వారి స్థానాల్లో నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురేల్, ప్రసిధ్ కృష్ణ, అర్‡్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ వచ్చారు. టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వన్డేల నుంచి మరోసారి విశ్రాంతినిచ్చారు. గత ఏడాది ఆగస్టు తర్వాత వన్డేలు ఆడని సిరాజ్ తన ఇటీవలి టెస్టు ప్రదర్శనతో మళ్లీ టీమ్‌లోకి రాగా... టెస్టులు, టి20ల్లో ఆకట్టుకున్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, కీపర్ ధ్రువ్ జురేల్‌లకు వన్డేల్లో ఇదే తొలి అవకాశం. దుబాయ్ తరహాలో ఎక్కువ మంది స్పిన్నర్లను ఆడించే అవకాశం ఆ్రస్టేలియాలో లేదని...అందుకే జడేజాను పక్కన పెట్టామని అగార్కర్ స్పష్టం చేశాడు. వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్‌ను ఈ సిరీస్ కోసం వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. సుందర్‌కు చోటు... టి20 టీమ్‌లో మాత్రం సెలక్టర్లు పెద్దగా మార్పేమీ చేయలేదు. ఆసియా కప్‌లో విజేతగా నిలిచిన జట్టులో ఒక్క హార్దిక్ పాండ్యా మాత్రమే గాయం కారణంగా దూరమయ్యాడు. అతని స్థానంలోనే ఆల్‌రౌండర్‌గా నితీశ్ రెడ్డికి స్థానం లభించింది. ఆ 15 మందితో పాటు ఆ్రస్టేలియా పర్యటన కోసం అదనంగా 16వ ఆటగాడి రూపంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేశారు. వన్డేలకు దూరంగా ఉండనున్న బుమ్రా టి20లు మాత్రం ఆడతాడు. భారత్, ఆ్రస్టేలియా మధ్య అక్టోబర్ 19, 23, 25 తేదీల్లో వన్డేలు...అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 మధ్య 5 టి20లు జరుగుతాయి. -
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్) రాయని డైరీ
ఇండియా, పాకిస్తాన్ రెండూ కూడా ఫైనల్స్‌కు చేరుకుంటే, రెండు జట్ల మధ్య – ఈ రోజు మధ్యాహ్నం జరుగుతున్నట్లే – ఆ రోజు మధ్యాహ్నం కూడా ఇదే ప్రేమదాస స్టేడియంలో పోరు మొదలౌతుంది. ‘ప్రేమ’దాస స్టేడియంలో ‘పోరు’!! భలే ఉంటాయి ఈ అనుబంధాలు... కొట్లాడుకునే అక్కచెల్లెళ్ల మధ్య, ఘర్షణలు పడే అన్నదమ్ముల మధ్య! ఒకరి ఇంట్లోకి ఒకరు అడుగు పెట్టరు. పొరుగింట్లోనో, ఆ పై ఇంట్లోనో పంచాయితీ! ‘‘అలాగైతేనే వస్తాం’’ అని మొదటే అగ్రిమెంట్! నవ్వొస్తోంది నాకు!షేక్ హ్యాండ్స్ ఇవ్వాలనీ, సెల్ఫీలు తీసుకోవాలనీ, హగ్స్ ఇస్తుంటే వద్దనకూడదనీ రూల్ బుక్‌లో ఏమైనా ఉందా అని ‘బోర్డు’లో పెద్దవాళ్లు అంటున్నారు! అది నిజమే కానీ... షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదనీ, సెల్ఫీలు తీసుకోకూడదనీ, హగ్స్ ఇస్తుంటే వద్దనాలనీ కూడా రూల్ బుక్‌లో ఉండదేమో కదా! ఇలాంటప్పుడే, అమాయకమైన చిరునవ్వుతో – పైవారి ఆదేశాలను ధిక్కరిస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన నాకు వస్తుంటుంది.‘‘అలా చెయ్యకు హ్యారీ’’ అనేవారు చిన్నప్పుడు నాన్న. చిరునవ్వుతో సరిగ్గా అలానే చెయ్యబుద్ది అయ్యేది నాకు!‘‘అలా చెయ్యటం కరెక్ట్ కాదు హర్మన్ ’’ అనేవారు కాలేజ్‌లో ప్రిన్సిపాల్. చిరునవ్వుతో సరిగ్గా అదే కరెక్ట్ అనాలనిపించేది నాకు!ఇప్పుడిక బీసీసీఐ సెక్రెటరీ! ‘మహిళల ప్రపంచ కప్‌లో భారత్–పాక్ ప్లేయర్స్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారనే గ్యారంటీ ఏమీ లేదని అంటున్నారు! చిరునవ్వుతో సరిగ్గా నాకేం అనిపిస్తోందంటే, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోబోమనే గ్యారంటీ కూడా ఏమీ లేదని! మనసులో దగ్గరితనాన్ని ఉంచుకుని దూరాన్ని ఎంతకాలం నటించగలం? మాట్లాడాలని లోలోపల పీకుతూ ఉంటే మౌనాన్ని ఎలా పాటించగలం?కొద్దిసేపట్లో భారత్–పాక్‌ల మధ్య లీగ్ మ్యాచ్. అది వదిలేసి, ఎప్పుడో నెల తర్వాత నవంబర్ 2న ఎవరి మధ్య జరుగుతుందో కూడా తెలియని ఫైనల్ మ్యాచ్ గురించి ఆలోచిస్తున్నాన్నేను!నిజంగానే భారత్–పాక్ ఫైనల్‌కి చేరుకుంటే, ఫైనల్లో గెలుపెవరిది అనే మాట అటుంచి... ఫైనల్లోనైనా టాస్ వేశాక షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటామా, ఆట ముగిశాకైనా చేతులు కలుపుకుంటామా అన్నదే ఆలోచిస్తూ యావద్దేశంతో పాటుగా నేను కూడా ఆ రోజు తెల్లవారుజాము నుంచే టెన్షన్ టెన్షన్‌గా ఉంటాననుకుంటా!ఫాతిమా సనా పాక్ కెప్టెన్ . చిన్న పిల్ల. నాకంటే 13 ఏళ్లు చిన్న. ఎం.ఎస్.ధోనీ తన ఇన్ స్పిరేషన్ అట. ధోనీలా కూల్‌గా ఉండి ఈ వరల్డ్ కప్‌లో తన జట్టును గెలిపిస్తుందట! బహిరంగంగానే చెప్పేసింది. అది కదా ‘హై–స్పిరిటెడ్’ అంటే. కానీ బీసీసీఐ వేరే ‘హై’లో ఉంది. మొన్నటి మెన్ ్స క్రికెట్ ‘సంప్రదాయాన్నే’ ఉమెన్ ్స క్రికెట్ కూడా ఫాలో అవాలట! అంటే, నో షేక్ హ్యాండ్స్ అని. 2022 వరల్డ్ కప్‌లో – న్యూజిలాండ్‌లో భారత్–పాక్ ఆటకు పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ తన ఆర్నెల్ల వయసున్న కూతుర్ని వెంటపెట్టుకుని వచ్చింది. తల్లీకూతుళ్లతో కలిసి టీమ్ ఇండియాలోని అందరం సెల్ఫీ తీసుకున్నాం. ఆ గేమ్‌లో ఇండియా గెలిచింది కానీ, ఇండియాను బిస్మా మరూఫ్ కూతురు తన బోసి నవ్వుల్తో ‘క్లీన్ బౌల్డ్’ చేసేసింది. ఆ పాప పేరు కూడా ఫాతిమానే!లీగ్ మ్యాచ్ టైమ్ అయింది. టాస్ కోసం లోపలికి వెళుతున్నాం. గెలుపు, ఓటమి... తర్వాతి సంగతి. ఫీల్డ్‌లో ఫాతిమా నాకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతే నేను చెయ్యి చాస్తానా? లేక, ఫాతిమా షేక్ హ్యాండ్ కోసం నేనే ముందుగా చెయ్యి చాస్తానా? అంతా ఫాతిమా చేతుల్లో ఉంది.ఊహు... చేతుల్లో కాదు, ఫాతిమా చిరునవ్వులో ఉంటుంది. -
462 వికెట్లు.. స్వింగ్ సుల్తాన్..కట్ చేస్తే! ఊహించని విధంగా కెరీర్‌కు ఎండ్ కార్డ్?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లేనా? అంటే అవునానే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కూ షమీని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఆసీస్ టూర్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది.ఈ సందర్భంగా చీఫ్ సెలక్టర్ కనీసం షమీ ప్రస్తావన కూడా తీసుకు రాలేదు. షమీ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తరుపున ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్-2025లో ఆడినప్పటికి ఈ వెటరన్ పేసర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.అయితే ఐపీఎల్ అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు షమీని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఐదో రోజుల పాటు జరిగే టెస్టు మ్యాచ్‌లో ఆడే ఫిట్నెస్ షమీకి లేదని సెలక్టర్లు చెప్పుకొచ్చారు. కానీ డొమాస్టిక్ క్రికెట్లో మాత్రం షమీ రెగ్యూలర్‌గా ఆడుతూనే వస్తున్నాడు. గత నెలలో జరిగిన దులీప్ ట్రోఫీలో ఈస్ట్‌జోన్ జట్టుకు ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ప్రాతినిథ్యం వహించాడు. కానీ షమీ ఏ మాత్రం రిథమ్‌లో కన్పించలేదు.దీంతో ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోలేదు. అంతేకాకుండా ఆసియాకప్-2025కు కూడా షమీ ఎంపిక కాలేదు. టెస్టు, టీ20 ఫార్మాట్లను పక్కన పెడితే కనీసం వన్డే జట్టులో అయినా అతడికి చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ మరోసారి అతడి పేరు టీమ్ సెలక్షన్ లిస్ట్‌లో కన్పించలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇది. ఈ సిరీస్‌కు కూడా షమీ ఎంపిక కాకపోవడంతో అతడి ఇంటర్ననేషనల్ కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది. కెరీర్‌ను మార్చేసిన గాయం..షమీ గత రెండేళ్ల నుంచి చీలమండ గాయంతో సతమతవుతున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో లీడ్ వికెట్ టేకర్‌గా నిలిచిన షమీ.. అనంతరం తన చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. దీంతో ఈ రైట్ ఆర్మ్ పేసర్ దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు.ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో షమీ పునరాగమనం చేశాడు. అక్కడ మెరుగైన ప్రదర్శన చేయకపోయినప్పటికి ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ మెగా టోర్నీలో షమీ కాస్త పర్వాలేదన్పించాడు. కానీ అంత టచ్‌లో మాత్రం షమీ కన్పించలేదు. అప్పటినుంచి భారత జట్టుకు ఈ బెంగాల్ పేసర్ దూరంగా ఉంటున్నాడు. భారత క్రికెట్లో షమీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్నాడు. షమీకి టెస్టుల్లో 229, వన్డేల్లో 206 వికెట్లు ఉన్నాయి. అదేవిధంగా టీ20ల్లో అతడు 27 వికెట్లు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో మొత్తంగా 462 వికెట్లు పడగొట్టాడు. షమీ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ కెరీర్ ఇలా ముగుస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.చదవండి: IND vs AUS: పాపం అభిషేక్ శర్మ.. ఊహించని షాకిచ్చిన బీసీసీఐ!? -
రోహిత్ శర్మపై కుట్ర..! ఇది మీకు న్యాయమేనా?
భారత క్రికెట్లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ శకం ముగిసింది. ఇప్పటికే టెస్టు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్‌ను తాజాగా వన్డే కెప్టెన్సీ నుంచి సైతం బీసీసీఐ తప్పించింది. అతడి స్ధానంలో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌ను కొత్త వన్డే కెప్టెన్‌గా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నియమించింది.బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని హిట్‌మ్యాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నాడని, వన్డే ప్రపంచకప్-2027 వరకు అతడు ఆడగలడని ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు.రోహిత్ శర్మ ది బెస్ట్ కెప్టెన్.. బీసీసీపై అతడిని కావాలనే తప్పించందని ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌ను ఇలా అవమానిస్తారా? అని మరో యూజర్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఎక్స్‌లో రోహిత్ శర్మ పేరు ట్రెండ్ అవుతోంది. థాంక్యూ రోహిత్ అని అభిమానులు భావోద్వేగానికి లోనవతున్నారు.1 Like = 100 Slap .1 Rt =1000 Slap.#RohitSharma𓃵#RohitSharma #INDvsAUS pic.twitter.com/Qm4DJZI3ct— Avneesh Mishra (@RajaMishra007) October 4, 2025 END OF AN ERA 💔Thank You, Captain Rohit Sharma 🙌2 ICC trophies in just 8 months.A leader who gave India glory, pride & unforgettable memories. 🇮🇳THE HITMAN. THE CAPTAIN. THE LEGEND. #RohitSharma𓃵Congratulations Gill for your ODIs captaincy in #INDvsAUS#RohitSharma pic.twitter.com/V3KZeZAxWH— Adorable (@rehnedotumm_) October 4, 2025తిరుగులేని రోహిత్..మూడు ఫార్మాట్లలోనూ తిరిగి లేని కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. నాయకుడిగా హిట్‌మ్యాన్ భారత్‌కు రెండు ఐసీసీ టైటిల్స్‌ను అందించాడు. టీ20 ప్రపంచకప్-2024, ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్స్‌ను అతడి సారథ్యంలోనే టీమిండియా సొంతం చేసుకుంది. అదేవిధంగా వన్డే ప్రపంచకప్ 2023లో జట్టును ఫైనల్ వరకూ తీసుకెళ్లాడు. ఆ టోర్నీలో భారత్ మొత్తంగా 11 మ్యాచ్‌లలో పదింట గెలిచింది. అనుహ్యంగా తుది పోరులో ఓటమి పాలై తృటిలో ట్రోఫీని కోల్పోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఓవరాల్‌గా 56 వన్డే మ్యాచ్‌లు ఆడింది.అందులో 42 మ్యాచ్‌లలో గెలిచింది. 12 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. మరో మ్యాచ్ టైగా ముగిసింది. కెప్టెన్‌గా అతడి విజయం శాతం 76గా ఉంది. ఆసీస్ టూర్‌కు భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ , అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ -
IND vs AUS: శ్రేయస్ అయ్యర్‌కు ప్రమోషన్.. బీసీసీఐ ప్రకటన
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్‌గా అయ్యర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆస్ట్రేలియా టూర్‌కు జట్టు ఎంపిక సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు వన్డే జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్.. రెగ్యూలర్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు.రోహిత్ శర్మ స్దానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. అయితే గిల్ కంటే కెప్టెన్‌గా అనుభవం ఎక్కువగా ఉండడంతో శ్రేయస్‌కు భారత వన్డే జట్టు పగ్గాలను అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. కానీ మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండాలనే ఉద్దేశ్యంతో అజిత్ అగార్కర్ అండ్ కో ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుంది.భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై కూడా వేటు వేసే అకాశముంది. టెస్టు, వన్డేల్లో భారత సారథిగా ఉన్న గిల్ త్వరలోనే టీ20 జట్టు పగ్గాలను చేపట్టిన ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా గిల్‌ను బీసీసీఐ నియమించింది.అయ్యర్ ఫ్యూచర్ కెప్టెన్..శుబ్‌మన్ గిల్ తర్వాత భారత వన్డే జట్టు పగ్గాలను శ్రేయస్ చేపట్టే అవకాశముంది. అయ్యర్‌కు కెప్టెన్‌గా అపారమైన అనుభవం ఉంది. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుతో పాటు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ టీమ్స్‌ను విజయ పథంలో నడిపించిన ట్రాక్ రికార్డు అతడిది.అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ ఐపీఎల్-2024 ఛాంపియన్స్ నిలిచింది. అదేవిధంగా ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్‌ను రన్నరప్‌గా నిలిపాడు. వైట్‌బాల్ క్రికెట్లో గత కొంత కాలంగా అయ్యర్ దుమ్ములేపుతున్నాడు. అయితే అయ్యర్ ఈ స్ధాయికి చేరుకోవడానికి తీవ్రంగా శ్రమించాడు.ఒకనొక దశలో భారత జట్టు తరపున అయ్యర్ కెరీర్ ముగిసిందని అంతా భావించారు. బీసీసీఐ తమ ఆదేశాలను ధిక్కరించడంతో జట్టుతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. ఆ తర్వాత ఈ ముంబైకర్ దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరిచి తిరిగి జట్టులోకి వచ్చాడు.28 ఏళ్ల అయ్యర్ వన్డే ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో 11 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 530 పరుగులు చేశాడు. దీంతో బీసీసీఐ కాంట్రాక్ట్‌ను తిరిగి సంపాదించుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత్ నిలవడంలో అయ్యర్‌ది కీలక పాత్ర.అతను ఐదు మ్యాచ్‌లలో 243 పరుగులు సాధించి టోర్నీలో భారత తరపున లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ తర్వాత అయ్యర్‌ను వన్డే కెప్టెన్‌గా ఎంపిక చేయాలని చాలా మంది మాజీలు సూచించారు. కానీ సెలక్టర్లు మాత్రం వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఆసీస్ టూర్ నుంచి కొత్త రోల్లో శ్రేయస్ కన్పించనున్నాడు.ఆసీస్ టూర్‌కు భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ , అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, విరాట్ కోహ్లిభారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్చదవండి: BCCI: రోహిత్ శర్మకు భారీ షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ -
దిగొచ్చిన పీసీబీ చైర్మెన్ నఖ్వీ.. ఆసియా కప్ ట్రోఫీ అందజేత?
ఆసియా కప్-2025 ట్రోఫీ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లు తెలుస్తోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చైర్మన్, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ భారత క్రికెట్ బోర్డు దెబ్బకు దిగొచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. జీ న్యూస్ కథనం ప్రకారం.. నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అందజేసినట్లు సమాచారం. తాజాగా జరిగిన ఏసీసీ సమావేశంలో ఈ విషయంపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. అయితే ట్రోఫీ కావాలంటే భారత కెప్టెన్ నేరుగా ఏసీసీ కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని నఖ్వీ చెప్పినట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి.కానీ ఇప్పుడు నఖ్వీ వెనక్కి తగ్గి ట్రోఫీ యూఏఈ క్రికెట్ బోర్డు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.అయితే ఈ విషయంపై బీసీసీఐ గానీ, యూఏఈ క్రికెట్ బోర్డు గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా ఈ ఏడాది ఆసియాకప్ యూఏఈ ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే.అసలేంటి ఈ ట్రోఫీ వివాదం..?ఆసియాకప్ విజేతగా నిలిచిన అనంతరం ఏసీసీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని తీసుకోవడానికి భారత్ నిరాకరించింది. నఖ్వీ ఏసీసీ చైర్మెన్‌తో పాటు పీసీబీ ఛీప్, పాకిస్తాన్ మంత్రిగా ఉండడమే ఇందుకు కారణం.అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్, యూఏఈ క్రికెట్ బోర్డు చైర్మెన్ చేతులు మీదగా ట్రోఫీని తీసుకుంటామని టీమిండియా తెలియజేసింది. కానీ అందుకు నఖ్వీ అంగీకరించలేదు. దీంతో అతడు ట్రోఫీని తనతో పాటు తీసుకుని వెళ్లిపోయాడు.అప్పటి నుంచి ఆసియాకప్ ట్రోఫీ అతడి వద్దే ఉంది. కాగా ఫైనల్ మ్యాచ్‌లో పాక్‌ను 5 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ టోర్నీ అంతటా పాక్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు షేక్ హ్యాండ్ చేయడానికి నిరకారించారు. పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.చదవండి: IND vs AUS: ఆసీస్‌పై శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. 413 పరుగులు చేసిన భారత్ -
అయ్యయ్యో! పుండు మీద కారం జల్లినట్లుగా..
ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించగా.. బీసీసీఐ(BCCI) వెంటనే రూ.21 కోట్లు బోనస్‌గా ప్రకటించి ఆటగాళ్లను ఘనంగా సత్కరించింది. ఇది మన క్రీడాకారుల శ్రమకు గౌరవం, ప్రోత్సాహం, దేశం తరఫున పోరాడినందుకు ఇచ్చే గుర్తింపు అని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. సాధారణంగా రన్నరప్‌గా నిలిచిన జట్ల ఆటగాళ్లకూ ఆ దేశాలు ఎంతో కొంత ప్రొత్సాహాకం అందిస్తుంటాయి. మరి రన్నరప్‌గా నిలిచిన పాక్ ఆటగాళ్ల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?..ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్ జట్టుకు ఆసియా క్రికెట్ కంట్రోల్ బోర్డు(75,000 డాలర్ల) తరఫున రూ.66.5 లక్షల ప్రైజ్‌మనీ లభించింది. అంతేగానీ పాక్ క్రికెట్ బోర్డు నుంచి ఇప్పటిదాకా ఎలాంటి నజరానా ప్రకటించలేదు. దీంతో ఏదైనా నజరానా ప్రకటిస్తారేమోనని ఆటగాళ్లు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో.. అలాంటి ఆశలేం వద్దంటూ ఓ వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అది 2009 టీ20 వరల్డ్ కప్ విజేతగా పాక్ నిలిచిన సమయం. ఆ సమయంలో పాక్ ఆటగాళ్లకు నజరానాను ప్రకటించింది అప్పటి యూసఫ్ రజా గిలానీ ప్రభుత్వం. అయితే ప్రధాని స్వయంగా జారీ చేసిన ఆ 25 లక్షల చెక్కు బౌన్స్ అయ్యిందట. దీంతో అప్పటి పీసీబీ చైర్మన్‌ను ఆటగాళ్లు ఆశ్రయిస్తే.. అది ప్రభుత్వం ఇస్తామన్న నజరానా అని, దాంతో మాకేం సంబంధం అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారట. చివరికి ICC ఇచ్చిన ప్రైజ్ మనీ తప్ప ఆటగాళ్లకు ఇంకేమీ అందలేదు... ప్రభుత్వం ఇచ్చే చెక్కు కూడా బౌన్స్ అవుతుందా? అని పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్(Syeed Ajmal Comments Viral) చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. రెండేళ్ల కిందట నదీర్ అలీ అనే యూట్యూబర్ పాడ్‌కాస్ట్‌లో అజ్మల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు.. పాక్ జట్టులో వ్యక్తిగత విజయాలకూ తగిన గుర్తింపు ఉండదని అన్నాడాయన. 2012, 2013లో ICC టీమ్ ఆఫ్ ది ఇయర్లో తనకి చోటు దక్కినా.. పీబీసీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రొత్సాహాకం అందలేని గుర్తు చేసుకుని వాపోయాడు. దీనితో పాక్ ఆటగాళ్ల దుస్థితి ఇలా ఉందంటూ.. సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది.అదే సమయంలో.. మరోవైపు ఏసీసీ అద్యక్షుడైన పీబీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) ఆటగాళ్ల నజరానా గురించి ఆలోచించే స్థితిలో ఏమాత్రం లేడు. ఆయన పరిస్థితి కూడా ‘చంద్రుడి కోసం ఎదురుచూసే చకోర పక్షి’ పరిస్థితిని తలపిస్తోంది. 2025 ఆసియా కప్ విజేతగా నిలిచిన టీమిండియా జట్టు.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో ఆయన ట్రోఫీ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆయన ట్రోఫీతో పారిపోయాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలాయి. ఈ తరుణంలో.. తాజాగా ఏసీసీ మీటింగ్‌లో ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగతంగానైనా వచ్చి ట్రోఫీ తీసుకెళ్లాలని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అది జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే బీసీసీఐ ఇప్పటికే నఖ్వీ ట్రోఫీ తస్కరించిన వ్యవహారంపై అసంతృప్తితో ఉంది. ఈ క్రమంలో ఐసీసీకి ఫిర్యాదు చేయాలనుకుంటోంది కూడా. మరోవైపు.. మా టీమ్ మేట్స్, మా సపోర్ట్ స్టాఫ్.. వీళ్లే నా నిజమైన ట్రోఫీలు” అంటూ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ఏరకంగా చూసుకున్నా ట్రోఫీ కోసం నఖ్వీ ఎదురు చూస్తూ ఉండిపోవాల్సిందేనంటూ సెటైర్లు పేలుతున్నాయి. ఇదీ చదవండి: ఆ పాక్ ప్లేయర్‌కు థ్యాంక్స్.. అతని వల్లే గెలిచాం! -
‘మా ఆటగాళ్లంతా ఒక్కో ట్రోఫీతో సమానం’
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. చాంపియన్ టీమ్‌కు ట్రోఫీ ఇవ్వకుండా నిలిపివేసిన ఘటన గతంలో ఎన్నడూ చూడలేదని అతను అన్నాడు. అయితే తాము ఈ విషయాన్ని పట్టించుకోమని, ట్రోఫీ లేకపోవడం వల్ల తమ విజయం విలువ ఏమాత్రం తగ్గదని సూర్య వ్యాఖ్యానించాడు. ‘ఒక క్రికెట్ అభిమానిగా, ఆపై ఆటగాడిగా ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదు. ఎంతో కష్టపడి విజేతగా నిలిచి సంపాదించిన ట్రోఫీని ఆటగాళ్లకు ఇవ్వకపోవడం ఏమిటి? దానిని అందుకునేందుకు మాకు పూర్తి అర్హత ఉంది. అయితే ట్రోఫీల గురించే మాట్లాడాల్సి వస్తే మా డ్రెస్సింగ్‌రూమ్‌లోనే ఇలాంటి 14 ట్రోఫీలు ఉన్నాయి. ఈ ఆసియా కప్ గెలుపు ప్రయాణంలో మా ఒక్కో ఆటగాడు, సహాయక సిబ్బంది ఒక్కో ట్రోఫీతో సమానం. పాకిస్తానీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించరాదనే విషయం మాకు ఎవరూ చెప్పలేదు. మా జట్టు సభ్యులంతా మైదానంలో కలిసి తీసుకున్న నిర్ణయమిది’ అని సూర్యకుమార్ స్పష్టం చేశాడు. మరోవైపు పహల్గాం దాడిలో మృతి చెందిన కుటుంబాల సంక్షేమం కోసం తాను ఆసియా కప్‌లో 7 మ్యాచ్‌ల ద్వారా అందుకున్న మ్యాచ్ ఫీజు మొత్తాన్ని (రూ. 28 లక్షలు) విరాళంగా ఇస్తున్నట్లు సూర్యకుమార్ ప్రకటించాడు. నఖ్వీ తీసుకెళ్లిపోయాడు! ఫైనల్ ముగిసిన తర్వాత బహుమతి ప్రదానోత్సవానికి వేదికను ఏర్పాటు చేశారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్, పాకిస్తాన్ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి కూడా అయిన మొహసిన్ నఖ్వీ అక్కడే ఉన్నాడు. అయితే పహల్గాం దాడి సమయంలో నఖ్వీ సోషల్ మీడియాలో భారత్‌కు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశాడు. దాంతో అతడి చేతుల మీదుగా ట్రోఫీని అందుకోబోమని భారత జట్టు ముందే ఏసీసీకి సమాచారం అందించింది. దాంతో ప్రత్యామ్నాయంగా వేదికపై ఉన్న ఇతర అధికారుల నుంచి అందించవచ్చని నిర్వాహకులు భావించారు. అయితే నఖ్వీ వేదికపై ఉన్నంత సేపు తాము అక్కడికి వెళ్లమని భారత్ స్పష్టం చేసింది. అయితే నిబంధనల ప్రకారం ఏసీసీ అధ్యక్షుడి హోదాలో తానే ట్రోఫీ ఇస్తానంటూ నఖ్వీ మొండితనం ప్రదర్శించాడు. దాంతో చివరకు భారత్ కప్ అందుకోకుండానే కార్యక్రమం ముగిసింది. అయితే ఆశ్చర్యకరంగా, ఎవరూ ఊహించని విధంగా నఖ్వీ సన్నిహితులు కొందరు అక్కడ ఉన్న ఆసియా కప్ ట్రోఫీని తమతో పాటు తీసుకెళ్లిపోయారు. అనంతరం భారత జట్టు మొత్తం వేదిక వద్ద చేరి ఊహాత్మకంగా ట్రోఫీ చేతిలో ఉన్నట్లుగా నటిస్తూ సంబరాలు చేసుకుంది. బీసీసీఐ ఆగ్రహం... నఖ్వీ ప్రవర్తనపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘నఖ్వీ పాకిస్తాన్ రాజకీయ నాయకుడు కూడా. అందుకే ఆయన నుంచి ట్రోఫీ తీసుకోవద్దని భారత్ నిర్ణయించింది. కానీ ఆయన తనతో పాటు ట్రోఫీని, పతకాలను కూడా తీసుకెళ్లమని దానర్థం కాదు. అవన్నీ వీలైనంత త్వరగా భారత్‌కు వస్తాయని నమ్ముతున్నాం. నవంబరులో జరిగే ఐసీసీ సమావేశంలో ఏసీసీ అధ్యక్షుడి ప్రవర్తనపై మేం చాలా గట్టిగా నిరసన వ్యక్తం చేయనున్నాం’ అని సైకియా వెల్లడించారు. మరోవైపు టోర్నీలో భారత జట్టు ప్రవర్తన క్రికెట్‌ను అగౌరవపర్చినట్లుగా ఉందని పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా అన్నాడు. టోర్నీ ఆరంభానికి ముందు వేర్వేరు సందర్భాల్లో తనతో కరచాలనం చేసిన సూర్యకుమార్... జనం మధ్యలోకి వచ్చేసరికి మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వలేదని సల్మాన్ విమర్శించాడు. తిలక్ వర్మకు ఘన స్వాగతం... అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ సోమవారం రాత్రి నగరానికి తిరిగొచ్చాడు. శంషాబాద్ విమానాశ్రయంలో అతనికి అభిమానులు, తెలంగాణ స్పోర్ట్ అథారిటీ అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది. ‘నేను క్రీజ్‌లోకి వచ్చిన సమయంలో పాకిస్తాన్ ఆటగాళ్లు ఎన్నో వ్యాఖ్యలు చేశారు. అయితే నా బ్యాట్‌తోనే వారికి సమాధానం చెప్పాలని భావించా. అనుకున్నట్లుగానే చెలరేగిపోయా. నా ఆట తర్వాత మైదానంలో వారెవరూ కనిపించలేదు. మరో మాట అనే అవకాశం వారికి లేకుండా పోయింది. స్టేడియంలో అభిమానులు వందేమాతరంతో హోరెత్తించడంతో మరింత కసిగా చెలరేగిపోయా’ అని తిలక్ మ్యాచ్ తర్వాత వ్యాఖ్యానించాడు. -
ట్రోఫీ, మెడల్స్‌ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్.. బీసీసీఐ సీరియస్
ఆసియాకప్-2025 ఛాంపియన్స్‌గా టీమిండియా నిలిచిన అనంతరం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్‌మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని స్వీకరించడానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు.ప్రోటోకాల్ ప్రకారం.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ బాస్ అయిన మొహ్సిన్ నఖ్వీనే విజేతకు ట్రోఫీ అందించాలి. కానీ భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ట్రోఫీని అతడి నుంచి తీసుకోవాడనికి మెన్ ఇన్ బ్లూ సముఖత చూపలేదు.దీంతో దాదాపు గంట అలస్యంగా ప్రారంభమైన పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో కేవలం పాక్ ఆటగాళ్లే రన్నరప్ మెడల్స్‌ను అందుకున్నారు. అయితే భారత జట్టు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్-చైర్మన్ ఖలీద్ అల్ జరూని, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మెన్ అమీనుల్ ఇస్లాం చేతుల మీదగా ట్రోఫీని అందుకుంటామని తెలియజేసింది. అందుకు వారిద్దరూ అంగీకరించారు. కానీ మొహ్సిన్ నఖ్వీ మాత్రం తానే అందిస్తానని మొండిపట్టు పట్టాడు. దీంతో టీమిండియా పూర్తిగా ట్రోఫీనే తీసుకోమని తేల్చి చెప్పేసింది. భారత్ తీరుతో సహనం కోల్పోయిన పీసీబీ చీఫ్.. ఆసియా కప్ ట్రోఫీతో పాటు, టీమిండియా ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్‌ను హోటల్‌కు తీసుకువెళ్లిపోయాడు. ఈ క్రమంలో నఖ్వీ వ్యవహరించిన తీరు పట్ల సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. ఇదే విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. మొహ్సిన్ నఖ్వీ చర్యను భారత క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకుంటున్నట్లు సైకియా తెలిపారు.బీసీసీఐ సీరియస్.."భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికి తెలుసు. పాకిస్తాన్ సీనియర్ లీడర్స్‌లో ఒకరిగా ఏసీసీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ కొనసాగుతున్నారు. అటువంటి అప్పుడు అతడి చేతుల మీదగా ట్రోఫీని ఎలా తీసుకుంటాము? అతడి నుంచి మేము ఆసియా కప్ ట్రోఫీని తీసుకోకూడదని ముందే నిర్ణయించుకున్నాము. అతడు చేతుల మీదగా తీసుకోవడం లేదంటే ట్రోఫీ వద్దని కాదు. ట్రోఫీని, పతకాలను హోటల్ గదికి తీసుకువెళ్లే హక్కు ఎవరు ఇచ్చారు? నఖ్వీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు. అతడికి కొంచెం కూడా జ్ఞానం లేదు. ఈ విషయంపై మేం ఐసీసీకి ఫిర్యాదు చేస్తాం. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. ట్రోఫీ, పతకాలు వీలైనంత త్వరగా భారత్‌కు పంపిస్తారని ఆశిస్తున్నా" అని ఎఎన్ఐతో సైకియా పేర్కొన్నాడు.చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్ -
టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లంటే?
టీ20 ఫార్మాట్లో తమకు తిరుగులేదని భారత జట్టు మరోసారి నిరూపించుకుంది. ఆసియాకప్-2025 విజేతగా టీమిండియా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు.. రికార్డు స్థాయిలో తొమ్మిదో ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో సామాన్యుని నుంచి ప్రధాని వరకు భారత సూర్య అండ్ కోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో భారత జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ నజరానా ప్రకటించింది. ఈ చారిత్రత్మక విజయంలో భాగమైన ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి రూ. 21 కోట్ల భారీ రివార్డు ఇవ్వనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.మూడు దెబ్బలు.. అస్సలు సమాధానమే లేదు. ఆసియా కప్ చాంపియన్స్, కావాల్సిన సందేశం అందించాం. జట్టుకు, సహాయక సిబ్బందికి రూ. 21 కోట్ల బహుమతి అంటూ ఫైనల్ అనంతరం బీసీసీఐ ఎక్స్‌లో పేర్కొంది. కాగా ఈ ఖండాంతర టోర్నీలో మొత్తంగా మూడు సార్లు పాక్‌ను భారత్ చిత్తు చేసింది.అదరగొట్టిన తిలక్..ఇక భారత్ ఛాంపియన్స్‌గా నిలవడంలో హైదరాబాదీ తిలక్ వర్మది కీలక పాత్ర. 147 పరుగుల లక్ష్య చేధనలో తిలక్ మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్య చేధనలో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ తన వీరొచిత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.తిలక్ 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దీంతో లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో అందుకుంది. తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కగా.. ఓపెనర్ అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు.చదవండి: Asia Cup 2025: పట్టు బట్టిన పీసీబీ చైర్మెన్.. ఊహించని షాకిచ్చిన భారత్ -
BCCI: టీమిండియాకు కొత్త సెలక్టర్లు.. అగార్కర్‌తో కలిసి..
భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీలో రెండు మార్పులు జరిగాయి. ఎస్.శరత్, సుబ్రతో బెనర్జీ స్థానాల్లో ఇద్దరు టీమిండియా మాజీ క్రికెటర్లు సెలక్టర్లుగా నియమితులయ్యారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీలో ప్రజ్ఞాన్ ఓజా, రుద్ర ప్రతాప్ సింగ్ (RP Singh) చేరారు.ముంబైలో ఆదివారం జరిగిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సర్వసభ్య సమావేశంలో బోర్డు ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్‌ల నియామకాన్ని ఖరారు చేసింది. కాగా ఖాళీ అయిన సెలక్టర్ల పోస్టులకు ఈ నెల ఆరంభంలో బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే.అర్హతలు ఇవేబీసీసీఐ నిబంధనల ప్రకారం.. సెలక్టర్‌గా ఎంపిక కావాలంటే.. అంతర్జాతీయ స్థాయిలో కనీసం ఏడు టెస్టులు లేదంటే 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. అంతేగాక ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కనీసం ఐదు సంవత్సరాల వ్యవధి పూర్తై ఉండాలి. అంతేకాదు గత ఐదేళ్ల కాలంలో బీసీసీఐకి సంబంధించిన ఏ క్రికెట్ కమిటీలోనూ భాగమై ఉండరాదు.ఇద్దరూ టీమిండియా బౌలర్లేఇక ఒడిశాకు చెందిన 39 ఏళ్ల ప్రజ్ఞాన్ ఓజా టీమిండియా తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ టెస్టుల్లో 113, వన్డేల్లో 21, టీ20లలో పది వికెట్లు పడగొట్టాడు. 2008 నుంచి 2013 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఓజా.. 2015లో ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.మరోవైపు.. ఉత్తరప్రదేశ్ లెఫ్టార్మ్ పేసర్ ఆర్పీ సింగ్ అంతర్జాతీయ స్థాయిలో 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 40, 69, 15 వికెట్లు కూల్చాడు. 2005లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఆర్పీ సింగ్.. 2011లో భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడేశాడు. ఇక 2016లో ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పేశాడు.వారికి మొండిచేయిఈ నేపథ్యంలో అన్ని అర్హతలు కలిగి ఉన్నందున ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్ టీమిండియా జాతీయ సెలక్టర్లుగా ఎంపికయ్యారు. సౌత్ జోన్ నుంచి ఓజా దరఖాస్తు చేసుకోగా.. సెంట్రల్ జోన్ నుంచి ఆర్పీ సింగ్ సెలక్టర్ రేసులో నిలిచాడు. వీరితో పాటు ప్రవీణ్ కుమార్, అమేయ్ ఖురాసియా, ఆశిశ్ విన్స్టన్ జైదీ, శక్తి సింగ్ పోటీ పడగా.. ఓజా, ఆర్పీ సింగ్ మాత్రమే సఫలమయ్యారు.బీసీసీఐ సీనియర్ మెన్ సెలక్షన్ కమిటీ👉చైర్మన్: అజిత్ అగార్కర్ (వెస్ట్ జోన్)👉సభ్యుడు: శివ్ సుందర్ దాస్ (ఈస్ట్ జోన్)👉సభ్యుడు: ఆర్పీ సింగ్ (సెంట్రల్ జోన్)👉సభ్యుడు: అజయ్ రాత్రా (నార్త్ జోన్)👉సభ్యుడు: ప్రజ్ఞాన్ ఓజా (సౌత్ జోన్).చదవండి: ‘పాక్‌తో ఫైనల్... శివం దూబే అవుట్!.. భారత తుదిజట్టు ఇదే!’ -
BCCI అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ ఎన్నిక
-
వైభవ్ సూర్యవంశీ అలానే వచ్చాడు.. ఇకపై!.. బీసీసీఐ కీలక నిర్ణయం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. అండర్-16, అండర్-19 ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడాలంటే.. కనీసం ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ అయినా ఆడి ఉండాలని తెలిపింది. ముంబైలో ఆదివారం జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.వైభవ్ సూర్యవంశీ అలానే వచ్చాడుకాగా ఐపీఎల్లో ఇప్పటికే ఎంతో మంది అండర్-19 ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకున్న విషయం తెలిసిందే. అయితే, బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ మాత్రం పదమూడేళ్ల 243 రోజుల వయసులోనే ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయాడు.ఐపీఎల్ వేలం-2025 సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ వైభవ్ (Vaibhav Suryavanshi)ను ఏకంగా రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందే వైభవ్ సూర్యవంశీ దేశీ జట్టు తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాడు. రంజీల్లో చిన్న వయసులోనే అరంగేట్రం చేసిన ఆటగాడిగా నిలిచాడు.ఆయుశ్ మాత్రే సైతంఇక వైభవ్‌తో పాటు.. మహారాష్ట్రకు చెందిన ఆయుశ్ మాత్రే కూడా ఇదే కోవకు చెందుతాడు. ఇప్పటికే రంజీల్లో ఆడుతున్న ఆయుశ్.. ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించారు. వీరితో పాటు ఆండ్రీ సిద్దార్థ్, ముషీర్ ఖాన్, స్వస్తిక్చికారా.. సౌతాఫ్రికాకు చెందిన క్వెనా మఫాకా.. అఫ్గనిస్తాన్ ఆటగాడు అల్లా ఘజన్ఫర్ వంటి వాళ్లు అండర్-19 స్థాయిలోనే ఐపీఎల్లో అడుగుపెట్టారు.ఇకపై అదే అర్హతఅయితే.. ఇకపై ఐపీఎల్‌లోకి రావాలంటే అండర్-16, అండర్-19 ప్లేయర్లు కనీసం ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ అయినా ఆడాలని బీసీసీఐ తాజాగా నిర్ణయించింది. అంతకుముందు ఈ నిర్ణయం ఫ్రాంఛైజీల చేతుల్లో ఉండేది. అండర్-16, 19 స్థాయిల్లో తమకు నచ్చిన ఆటగాళ్లను ఫ్రాంఛైజీలు ఎంచుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు మాత్రం అలా కుదరదు.కనీసం ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. బీసీసీఐ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో హర్షం వ్యక్తమవుతోంది. ప్రతిభతో పాటు సంప్రదాయ క్రికెట్లో నైపుణ్యాలు కలిగిన ఆటగాళ్లను ఎంపిక చేయడం ద్వారా వారి భవిష్యత్తుతో పాటు లీగ్‌కు కూడా మేలు జరుగుతుందని నెటిజన్లు అంటున్నారు.చదవండి: ‘పాక్‌తో ఫైనల్... శివం దూబే అవుట్!.. భారత తుదిజట్టు ఇదే! -
బీసీసీఐకి కొత్త బాస్.. అధికారిక ప్రకటన
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ (Mithun Manhas) నియమితుడయ్యాడు. ముంబైలో ఆదివారం జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో కొత్త బాస్‌కు సంబంధించిన నిర్ణయం జరిగింది. 45 ఏళ్ల మిథున్ మన్హాస్ పోటీ అన్నదే లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.దేశీ క్రికెట్లో పరుగుల వరదకాగా జమ్మూ కశ్మీర్‌కు చెందిన మిథున్ మన్హాస్ ఢిల్లీ తరఫున సుదీర్ధకాలం దేశవాళీ క్రికెట్ ఆడాడు. 1997- 2017 వరకు కొనసాగిన కెరీర్లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 157 మ్యాచ్‌లు ఆడిన మిథున్.. 27 శతకాల సాయంతో 9714 పరుగులు సాధించాడు. అదే విధంగా.. లిస్ట్-‘ఎ’ క్రికెట్లో 130 మ్యాచ్‌లలో కలిపి 4126 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉండటం విశేషం.ఇక టీ20 ఫార్మాట్లో 91 మ్యాచ్‌లు ఆడిన మన్హాస్ 1170 పరుగులు చేశాడు. అయితే, మిడిలార్డర్ బ్యాటర్ అయిన మన్హాస్‌కు.. తన కెరీర్లో ఎప్పుడూ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం రాలేదు. టీమిండియా తరఫున అరంగేట్రం చేయకుండానే మన్హాస్ ఆటకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది.ఇక ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (డేర్‌డెవిల్స్), పుణె వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆడిన మిథున్ మన్హాస్.. మొత్తంగా 55 మ్యాచ్‌లు ఆడి 514 పరుగులు రాబట్టాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌గా మారిన మన్హాస్.. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పంజాబ్ కింగ్స, గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ జట్ల సహాయక బృందంతో కీలక పాత్ర పోషించాడు.కోచ్‌గానూ సేవలుఅంతేకాదు బంగ్లాదేశ్ పురుషుల అండర్-19 జట్టుకు బ్యాటింగ్ సలహాదారుడిగానూ మిథున్ మన్హాస్ పనిచేశాడు. ఇక జమ్మూ కశ్మీర్ క్రికెట్‌ను గాడిన పెట్టే క్రమంలో బీసీసీఐ నియమించిన కమిటిలో ఉన్న మిథున్‌కు క్రీడా పరిపాలనలోనూ అనుభవం ఉంది.అనూహ్యంగా తెరపైకిఅయితే, ఊహించని రీతిలో మిథున్ మన్హాస్ ఏకంగా బీసీసీఐ అధ్యక్షుడిగా.. అది కూడా పోటీలేకుండా ఏకగ్రీవం కావడం విశేషం.బోర్డు పెద్దల అండదండలతోనే అతడికి పదవి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా 70 ఏళ్ల వయసు నిండిన కారణంగా రోజర్ బిన్నీ.. బోర్డు నిబంధనల ప్రకారం ఇటీవలే బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో బిన్నీ స్థానంలో ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. తాజాగా మన్హాస్ ఎంపిక అధికారికం కావడంతో.. బిన్నీ వారసుడిగా అతడు బాధ్యతలు చేపట్టనున్నాడు. సరికొత్త చరిత్రతద్వారా సౌరవ్ గంగూలీ, బిన్నీ తర్వాత బీసీసీఐ బాస్ అయిన మూడో క్రికెటర్‌గా.. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆడకుండానే ఈ పదవిని అలంకరించిన తొలి ఆటగాడిగా మన్హాస్ చరిత్ర సృష్టించాడు.చదవండి: ఆసియా కప్ ఫైనల్: బలహీనంగానే పాకిస్తాన్.. భయపెడుతున్న ముఖాముఖి రికార్డు! -
బీసీసీఐ కీలక నిర్ణయం.. పంజాబ్ కింగ్స్‌కు షాక్!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శనివారం కీలక నియామకం చేపట్టింది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ సునిల్ జోషి (Sunil Joshi)ని నియమించింది. సాయి రాజ్ బహుతులే స్థానంలో అతడు ఈ మేరకు బాధ్యతలు చేపట్టనున్నాడు.ఆటకు స్వస్తి చెప్పిన తర్వాతకాగా కర్ణాటకకు చెందిన సునిల్ జోషి స్పిన్ ఆల్‌రౌండర్. టీమిండియా తరఫున 15 టెస్టుల్లో 41 వికెట్లు తీయడంతో పాటు.. 352 పరుగులు చేశాడు. అదే విధంగా.. 69 వన్డేల్లో 69 వికెట్లు తీసి 584 పరుగులు సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 5129 పరుగులు కూడా సునిల్ జోషి ఖాతాలో ఉన్నాయి.ఆటకు స్వస్తి చెప్పిన తర్వాత కోచ్ అవతారమెత్తిన సునిల్ జోషి దేశీ క్రికెట్లో అస్సాం, జమ్మూ కశ్మీర్, హైదరాబాద్ జట్లకు మార్గనిర్దేశనం చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్, అమెరికా, ఒమన్ జట్లకు కోచ్‌గా సేవలు అందించాడు.ఇక ఐపీఎల్లో 2023 నుంచి 2025 వరకు పంజాబ్ కింగ్స్ జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గానూ సునిల్ జోషి పనిచేశాడు. తాజా నియామకంతో పంజాబ్ ఫ్రాంఛైజీతో అతడికి ఉన్న అనుబంధం తెగిపోయినట్లయింది. వచ్చే సీజన్లో పంజాబ్ వేరే కోచ్‌ను వెతుక్కోవాల్సి ఉంటుంది. కాగా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత్-‘ఎ’ జట్టు ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సునిల్ జోషి భారత జట్టుతోనే ఉన్నాడు.ఆణిముత్యాలను వెలికి తీసేందుకుభారత పురుషుల, మహిళల క్రికెట్లోని అన్ని ఏజ్ గ్రూపుల ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్దే ఉద్దేశంతో బీసీసీఐ.. సునిల్ జోషిని రంగంలోకి దించింది. రాకేశ్ ధ్రువ్, నూషిన్ ఆల్ ఖదీర్ వంటి వారి పేర్లు పరిశీలనలోకి వచ్చినా.. సునిల్కే ఓటు వేసింది.ఇక CoE హెడ్, సహచర మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి సునిల్ పనిచేయనున్నాడు. యువ, వర్ధమాన స్పిన్నర్లకు శిక్షణ ఇవ్వనున్నాడు. అంతేకాదు.. టీమిండియా జట్టులో భాగమైన ఆటగాళ్లకు కూడా అవసరమైన సమయంలో CoEలో మెళకువలు నేర్పించేందుకు సిద్ధమయ్యాడు.కాగా టీమిండియా ప్రస్తుతం ఆసియా టీ20 కప్-2025 టోర్నీతో బిజీగా ఉంది. దుబాయ్‌లో ఆదివారం జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌తో తలపడనుంది. అనంతరం స్వదేశంలో అక్టోబరు 2 నుంచి వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో అక్టోబరు 1న సునిల్ జోషి తన బాధ్యతలు చేపట్టనుండటం గమనార్హం.చదవండి: IND vs WI: ‘అతడి తండ్రి గట్టిగానే నిలదీశాడు.. అందుకే ఆ ప్లేయర్‌పై వేటు’ -
సూర్య... అలాంటి వ్యాఖ్యలొద్దు
దుబాయ్: ప్రస్తుతం ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లు ఏకపక్షంగా జరుగుతున్నాయి. కానీ ఆరోపణలు, ఫిర్యాదులే పోటాపోటీగా సాగుతున్నాయి. ‘షేక్‌హ్యాండ్’ తిరస్కరణపై సలసల ఉడికిపోతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇంకో అడుగు ముందుకేసి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఫిర్యాదు చేసింది. లీగ్ దశలో పాక్‌పై గెలుపు అనంతరం విజయాన్ని పహల్గాంలో ఊచకోతకు గురైన బాధితులకు అంకితమిస్తున్నట్లు సూర్య వ్యాఖ్యానించాడు. క్రీడల్లో రాజకీయ ప్రభావిత అంశాల ప్రస్తావనపై పీసీబీ ఫిర్యాదు చేసింది. దీన్ని విచారించిన మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడవద్దని భారత కెప్టెన్‌కు సూచించారు. అయితే బుధవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పాకిస్తాన్ క్రికెటర్లు హరిస్ రవూఫ్, సాహిబ్జాదా ఫర్హాన్‌లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ఇ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ నెల 21న సూపర్–4 దశలో జరిగిన మ్యాచ్ సందర్భంగా రవూఫ్ తన చేతులతో భారత యుద్ధ విమానాలు కూలినట్లుగా సంజ్ఞలు చేశాడు. అప్పుడే మైదానంలోని భారత అభిమానులు కోహ్లి... కోహ్లి... అంటూ బిగ్గరగా ఆరిచారు. 2022లో జరిగిన టి20 ప్రపంచకప్‌లో రవూఫ్ బౌలింగ్‌ను చిత్తు చేస్తూ కోహ్లి మ్యాచ్ విన్నింగ్ సిక్స్‌లతో అలరించిన సందర్భాన్ని పాక్ బౌలర్‌కు గుర్తు చేశారు. ఓపెనర్ సాహిబ్జాదా తన అర్ధసెంచరీ పూర్తవగానే బ్యాట్‌ను గన్లా ఫైరింగ్ చేస్తూ రెచ్చగొట్టాడు. ఈ నేపథ్యంలోనే భారత బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై నేడు మ్యాచ్ రిఫరీ తన నిర్ణయాన్ని వెలువరించనున్నారు. -
BCCI: వెస్టిండీస్‌తో టెస్టులకు టీమిండియా ప్రకటన.. అతడిపై వేటు
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్టును ప్రకటించింది. శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలో.. పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను గురువారం వెల్లడించింది.ఇక స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌కు గిల్ డిప్యూటీగా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను.. బీసీసీఐ వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడిన జట్టులో స్వల్ప మార్పులతోనే భారత్ విండీస్‌తో బరిలో దిగనుంది.రిషభ్ పంత్ దూరం.. కరుణ్‌పై వేటువైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) గాయం నుంచి ఇంకా కోలుకోని కారణంగా వెస్టిండీస్‌తో సిరీస్‌కు దూరం కాగా.. ఇంగ్లండ్ పర్యటనలో వరుస వైఫల్యాలు చవిచూసిన కరుణ్ నాయర్‌పై వేటు పడింది. కాగా దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత టీమిండియా తరఫున ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.ధ్రువ్ జురెల్‌తో పాటు అతడు..ఐదు టెస్టుల్లో భాగంగా నాలుగు మ్యాచ్‌లు ఆడిన కరుణ్ నాయర్.. కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేయగలిగాడు. దీంతో బీసీసీఐ అతడికి మరో అవకాశం ఇచ్చేందుకు మొగ్గుచూపకపోవడం గమనార్హం. మరోవైపు.. వికెట్ కీపర్ల కోటాలో.. పంత్ గైర్హాజరీలో ధ్రువ్ జురెల్‌తో పాటు తమిళనాడు ప్లేయర్ నారాయణ్ జగదీశన్ జట్టుకు ఎంపికయ్యాడు.నితీశ్ రెడ్డికి చోటుఇక గాయం వల్ల ఇంగ్లండ్ సిరీస్ మధ్యలోనే జట్టుకు దూరమైన ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా.. విండీస్‌తో సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇక పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌తో కలిసి ప్రసిద్ కృష్ణ మరోసారి సేవలు అందించనున్నాడు. స్పెషలిస్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. స్పిన్ ఆల్‌రౌండర్ల కోటాలో జడేజా, అక్షర్ పటేల్‌తో కలిసి వాషింగ్టన్ సుందర్ బరిలో దిగనున్నాడు.2-2తో సమంకాగా ఆసియా టీ20 కప్- 2025 టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా సొంతగడ్డపై రెండు టెస్టులు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా అక్టోబరు 2- అక్టోబరు 14 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. కాగా చివరగా గిల్ సేన ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో తలపడి 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో టెస్టులకు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, నారాయణ్ జగదీశన్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.చదవండి: పాక్ ఆటగాళ్ల బరితెగింపు.. షాకిచ్చిన బీసీసీఐ!.. తగ్గమంటూ పీసీబీ ఓవరాక్షన్ -
టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన
టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు మరో బంపరాఫర్ వచ్చింది. ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో జరిగే వన్డే సిరీస్‌కు అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గురువారం ప్రకటించింది. అదే విధంగా.. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరమైనట్లు బీసీసీఐ వెల్లడించింది.కాగా గత కొంతకాలంగా శ్రేయస్ అయ్యర్ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. టీ20 ఫార్మాట్లో సూపర్ ఫామ్‌లో ఉన్నా ఆసియా కప్ టీ20- 2025 టోర్నమెంట్ ఆడే భారత జట్టుకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో బీసీసీఐ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు రాగా.. ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో స్వదేశంలో అనధికారిక టెస్టు సిరీస్‌కు భారత్-‘ఎ’ జట్టు కెప్టెన్‌గా అయ్యర్‌ను ఎంపిక చేసింది.కెప్టెన్సీ వదులుకోవడంతో పాటు..ఈ నేపథ్యంలో ఆసీస్‌తో తొలి అనధికారిక టెస్టు ఆడిన శ్రేయస్ అయ్యర్ (8) విఫలమయ్యాడు. అయితే, రెండో టెస్టు ఆరంభానికి ముందే కెప్టెన్సీని వదులుకోవడంతో పాటు.. జట్టు నుంచి తప్పుకొన్నాడు. టెస్టుల్లో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న శ్రేయస్.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం భారత క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది.అయితే, వెన్నునొప్పి కారణంగా నాలుగు రోజుల పాటు ఫీల్డింగ్ చేయలేకపోతున్నానని శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐకి లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి. కొన్నాళ్ల పాటు రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉండనున్నట్లు బోర్డుకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.ఆరునెలల పాటు దూరంఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఆరునెలల పాటు శ్రేయస్ అయ్యర్ రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉండనున్నట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇరానీ కప్ మ్యాచ్‌కు అతడిని ఎంపిక చేయలేదని స్పష్టం చేసింది.రజత్, తిలక్ అవుట్.. కెప్టెన్‌గా శ్రేయస్స్వదేశంలో రెండు అనధికారిక టెస్టుల తర్వాత భారత్- ‘ఎ’ జట్టు.. ఆస్ట్రేలియా- ‘ఎ’తో మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్ (సెప్టెంబరు 30- అక్టోబరు 5) ఆడనుంది. కాన్పూర్ ఇందుకు వేదిక.ఈ నేపథ్యంలో ఆసీస్‌తో తొలి వన్డేకు రజత్ పాటిదార్‌ను... రెండు, మూడో వన్డేలకు తిలక్ వర్మను తొలుత బీసీసీఐ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అయితే, తాజాగా వారిద్దరిని తప్పించి శ్రేయస్ అయ్యర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఇక తొలి వన్డేకు దూరంగా ఉండనున్న.. ఆసియా కప్-2025 ముగిసిన తర్వాత తిలక్ వర్మ.. రెండు, మూడో వన్డేల్లో వైస్ కెప్టెన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడితో పాటు హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ కూడా ఈ సిరీస్ ఆడతారు. మరోవైపు.. రజత్ పాటిదార్ ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.ఆస్ట్రేలియా- ‘ఎ’తో తొలి అనధికారిక వన్డేకు భారత జట్టుశ్రేయన్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుశ్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిషాంత్ సింధు, గుర్జప్నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), ప్రియాంశ్ ఆర్య, సిమర్జీత్ సింగ్.ఆస్ట్రేలియా- ‘ఎ’తో రెండు, మూడో అనధికారిక వన్డేలకు భారత జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, ప్రభ్సిమ్రాన్ సింగ్ (డబ్ల్యుకె), రియాన్ పరాగ్, ఆయుశ్ బదోని , సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిశాంత్ సింధు, గుర్జప్నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: అసలు అక్కడ ఏం ఉంది?: అభిషేక్ శర్మపై గావస్కర్ ‘ఫైర్’ -
పాక్ ఆటగాళ్ల బరితెగింపు.. షాకిచ్చిన బీసీసీఐ!.. మరోసారి పీసీబీ ఓవరాక్షన్
టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా కవ్వింపులకు పాల్పడ్డ పాకిస్తాన్ ఆటగాళ్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) చర్యలకు ఉపక్రమించింది. భారతీయల మనోభావాలు దెబ్బతినేలా.. రెచ్చగొట్టేలా ప్రవర్తించిన సాహిబ్జాదా ఫర్హాన్, హ్యారిస్ రవూఫ్‌లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి ఫిర్యాదు చేసింది.కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా టీ20 కప్-2025 వేదికగా భారత్- పాక్ (IND vs PAK)జట్లు తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే. లీగ్ దశలో మ్యాచ్ సందర్భంగానే టీమిండియా తమ వైఖరిని దాయాదికి తెలియజేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించింది.రెచ్చగొట్టేలా సెలబ్రేషన్స్ఇక సూపర్-4 మ్యాచ్‌లోనూ టీమిండియా తన వైఖరిని కొనసాగించింది. అయితే, లీగ్ దశ మ్యాచ్‌లో కాస్త సైలెంట్‌గానే ఉన్నపాక్ ఆటగాళ్లు.. ఈసారి మాత్రం రెచ్చగొట్టేలా కవ్వింపులకు పాల్పడ్డారు. ఓపెనర్ ఫర్హాన్ అర్ధ శతకం పూర్తి చేసుకోగానే.. ఏకే-47 మాదిరి బ్యాట్‌ను ప్రేక్షకుల వైపు ఎక్కుపెట్టి.. కాలుస్తున్నట్లు సంబరాలు చేసుకున్నాడు.పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను కాల్చి చంపిన ఘటనను ఈ చర్య ద్వారా ఫర్హాన్ మరోసారి గుర్తుచేసినట్లయింది. అయితే, మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ కూడా.. తాను సాధారణంగా హాఫ్ సెంచరీకి సెలబ్రేట్ చేసుకోనని.. ఈసారి మాత్రం ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని అనిపించిందని మరోసారి రెచ్చగొట్టాడు.‘6-0’ సంజ్ఞతో రవూఫ్ కవ్వింపులుఅంతేకాదు.. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా తాను లెక్కచేయనంటూ ఫర్హాన్ అహంకారపూరితంగా మాట్లాడాడు. ఇక హ్యారిస్ రవూఫ్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ‘6-0’ సంజ్ఞతో టీమిండియా అభిమానుల వైపు చూస్తూ అతి చేశాడు.కాగా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరిట భారత ఆర్మీ.. ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇందుకు బదులుగా పాక్ సైన్యం రంగంలోకి వచ్చి ఎదురుదాడికి ప్రయత్నించగా.. భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ ఘటనలో పాక్ ఎయిర్‌బేస్‌లు కూడా ధ్వంసమైనట్లు సమాచారం.కిక్కురమనలేదుఅయితే, రవూఫ్ మాత్రం పాక్ చెప్పుకొంటున్నట్లుగా.. తాము భారత్‌కు చెందిన ఆరు యుద్ధ విమానాలు కూల్చేశామన్నట్లు ఇలా సైగ చేయడం గమనార్హం. లీగ్ దశలో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ఆటలు, రాజకీయం వేరు అంటూ సుద్దులు చెప్పిన పాక్.. సూపర్-4 మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు ఇంత యథేచ్చగా బరితెగించినా కిక్కురమనలేదు.షాకిచ్చిన బీసీసీఐఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ.. పాక్ ఆటగాళ్ల ప్రవర్తనపై ఐసీసీకి ఇ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సాహిబ్జాదా ఫర్హాన్, హ్యారిస్ రవూఫ్‌ల నుంచి ఐసీసీ లిఖిత పూర్వక వివరణ అడిగే అవకాశం ఉంది. విచారణలో భాగంగా వీరిద్దరు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. లీగ్, సూపర్-4 దశలో పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా.. బుధవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఆసియా కప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది.పాక్ బోర్డు ఓవరాక్షన్బీసీసీఐ చర్యల నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు కూడా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. లీగ్ దశలో పాకిస్తాన్‌పై తమ విజయాన్ని సూర్య.. పహల్గామ్ బాధితులు, ఆపరేషన్ సిందూర్ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత ఆర్మీకి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి పీసీబీ.. ఐసీసీని ఆశ్రయించినట్లు సమాచారం.చదవండి: అసలు అక్కడ ఏం ఉంది?: అభిషేక్ శర్మపై గావస్కర్ ‘ఫైర్’ -
బీసీసీఐకి శ్రేయస్ అయ్యర్ లేఖ!.. ఇకపై నేను...
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా వైదొలగడం క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. చాన్నాళ్లుగా టెస్టుల్లో పునరాగమనం కోసం వేచి చూస్తున్న ఈ ముంబైకర్‌కు ‘ఎ’ జట్టు సారథిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సువర్ణావకాశం ఇచ్చింది.ఆస్ట్రేలియా- ‘ఎ’తో అనధికారిక టెస్టులుకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 (WTC)లో భాగంగా టీమిండియా.. అక్టోబరులో స్వదేశంలో వెస్టిండీస్ (IND vs WI)తో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, విండీస్‌తో సిరీస్‌కు ముందు భారత్- ‘ఎ’- ఆస్ట్రేలియా- ‘ఎ’ మధ్య రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌లకు షెడ్యూల్ ఖరారైంది. వెస్టిండీస్‌తో సిరీస్‌కు ముందు సన్నాహకంగా ఈ సిరీస్ ఉపయోగపడనుంది.ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌ను చేసిన బీసీసీఐ.. ధ్రువ్ జురెల్ (Dhruv Jurel), సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి వంటి యువ టీమిండియా స్టార్లను కూడా ఎంపిక చేసింది. ఇక రెండో టెస్టులో భాగంగా టీమిండియా సీనియర్లు కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ కూడా భారత్-‘ఎ’ జట్టులో చేరారు.కెప్టెన్సీతో పాటు జట్టు నుంచీ తప్పుకొన్నాడుఅయితే, తొలి టెస్టులో విఫలమైన శ్రేయస్ అయ్యర్(8).. రెండో టెస్టు ఆరంభానికి కొన్ని గంటల ముందే కెప్టెన్సీతో పాటు జట్టు నుంచీ వైదొలిగాడు. ఈ క్రమంలో అతడు బీసీసీఐకి ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం..‘‘శ్రేయస్ అయ్యర్ రెడ్ బాల్ క్రికెట్ నుంచి విరామం తీసుకోవాలని భావించాడు. ఇదే విషయాన్ని సెలక్టర్లకు చెప్పాడు. రానున్న కొన్ని నెలల పాటు అతడు టెస్టు ఫార్మాట్‌కు దూరంగా ఉండబోతున్నాడు.కారణం ఇదేవెన్నునొప్పి కారణంగా తన శరీరం నాలుగు కంటే ఎక్కువ రోజులు ఫీల్డింగ్ చేసేందుకు సిద్ధంగా లేదని చెప్పాడు. అందుకే ఇప్పట్లో టెస్టు క్రికెట్‌ను పూర్తి స్థాయిలో ఆడలేనని స్పష్టం చేశాడు. కాబట్టి సెలక్టర్లు ఇందుకు తగినట్లుగానే అతడి విషయంలో నిర్ణయం తీసుకుంటారు’’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.గతంలో బీసీసీఐ వేటుఫలితంగా వెస్టిండీస్‌తో సిరీస్‌కు కూడా శ్రేయస్ అయ్యర్ దూరమైనట్లు తెలుస్తోంది. కాగా గతేడాది కూడా శ్రేయస్ అయ్యర్ వెన్నునొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు దూరం కాగా... బీసీసీఐ అతడిపై వేటు వేసింది. ఫిట్‌గానే ఉన్నా అబద్దం చెప్పాడని.. దేశీ క్రికెట్ తప్పనసరిగా ఆడాలన్న నిబంధనను ఉల్లంఘించాడని పేర్కొంటూ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది. అయితే, ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకున్న శ్రేయస్ అయ్యర్ దేశీ క్రికెట్లో మూడు ఫార్మాట్లలోనూ అదరగొట్టాడు. అనూహ్య రీతిలో పుంజుకునిముఖ్యంగా కెప్టెన్‌గా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన అయ్యర్.. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. బ్యాటర్‌గానూ పొట్టి ఫార్మాట్లో ఇరగదీశాడు.ఐసీసీ చాంపియన్స్‌ట్రోఫీ-2025 (వన్డే)లోనూ టీమిండియా తరఫున సత్తా చాటి టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, ఆసియా కప్ టీ20- 2025 టోర్నీకి మాత్రం సెలక్టర్లు అయ్యర్‌ను ఎంపిక చేయలేదు. భవిష్యత్తు ప్రశ్నార్థకందీంతో బోర్డు తీరుపై విమర్శలు రాగా.. భారత్ -‘ఎ’ కెప్టెన్‌గా ఛాన్స్ ఇచ్చింది. కానీ శ్రేయస్ అయ్యర్ తనకు తానుగా తప్పుకొని మరోసారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకున్నాడు. కాగా అయ్యర్ గత ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా చివరి టెస్టు ఆడాడు.చదవండి: ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్.. చెలరేగిన టీమిండియా యువ ప్లేయర్ -
IND vs WI: విండీస్‌తో సిరీస్‌కు పంత్ దూరం
న్యూఢిల్లీ: భారత స్టార్ వికెట్ కీపర్–బ్యాటర్ రిషభ్ పంత్ సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు దూరం కానున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన పంత్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం వల్లే కరీబియన్ జట్టుతో ఆడటం లేదు. జూలైలో ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా అతని ఎడమ కాలి పాదానికి గాయమైంది. ప్రస్తుతం అతను బెంగళూరులోని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలోని పునరావాస శిబిరంలో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొనే జట్టు ఎంపిక కోసం రేపు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఇంగ్లండ్‌లో జరిగిన టెండూల్కర్–అండర్సన్ ట్రోఫీలో పాల్గొన్న భారత జట్టుకు పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. నాలుగో టెస్టులో గాయం వల్ల అతని స్థానంలో ఎన్. జగదీశన్‌ను ఐదో టెస్టుకు తీసుకున్నారు. కానీ తుది జట్టులో మాత్రం అతనికి చోటు దక్కలేదు. ప్రస్తుతం స్ట్రెంత్–కండిషనింగ్ క్యాంపులో ఉన్న రిషభ్‌ను బోర్డు వైద్యసిబ్బంది పర్యవేక్షిస్తోంది. అయితే అతను జట్టుకు ఎప్పుడు అందుబాటులోకి వస్తాడనే నిర్దిష్టమైన సమాచారాన్ని వైద్య సిబ్బంది వెల్లడించడం లేదు. ఈ నేపథ్యంలో అతిత్వరలో జరిగే విండీస్ సిరీస్ సహా ఆ్రస్టేలియా పర్యటనకు సైతం అతను దూరమయ్యే అవకాశాలున్నాయి. ఆసీస్, భారత్ ‘ఎ’ జట్ల మధ్య జరిగిన తొలి అనధికారిక టెస్టులో ఆకట్టుకున్న నితీశ్ కుమార్ రెడ్డి, దేవదత్ పడిక్కల్‌ల పేర్లను సెలక్షన్ కమిటీ పరిశీలించనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్íÙప్లో భాగంగా భారత్, విండీస్‌ల మధ్య జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు వచ్చే నెల 2న అహ్మదాబాద్‌లో మొదలవుతుంది. -
బీసీసీఐ కీలక ప్రకటన
ఆసియా కప్ 2025 రసవత్తరంగా సాగుతున్న వేళ బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా ఎంపిక తేదీని ప్రకటించారు. ఈ సిరీస్ కోసం భారత జట్టును సెప్టెంబర్ 23 లేదా 24 తేదీల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. జట్టు ఎంపిక ఆన్లైన్ మీటింగ్ ద్వారా జరుగుతుందని తెలిపారు.విండీస్‌తో సిరీస్ అక్టోబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి టెస్ట్ అక్టోబర్ 2–6 మధ్యలో అహ్మదాబాద్‌లో.. రెండో టెస్ట్ అక్టోబర్ 10–14 మధ్యలో ఢిల్లీలో జరగాల్సి ఉంది. ఈ సిరీస్ కోసం విండీస్ జట్టును ఇదివరకే ప్రకటించారు.ఎవరెవరు ఎంపికవుతారు..?విండీస్‌తో సిరీస్‌కు ఎవరెవరు ఎంపికవుతారనే అంశంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటే భారత-ఏ ఆటగాళ్లను ఈ సిరీస్ కోసం పెద్ద పీఠ వేసే అవకాశం ఉంది. ఇప్పటికే ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ధృవ్ జురెల్, దేవ్‌దత్ పడిక్కల్, ఎన్ జగదీసన్ సత్తా చాటారు.వీరితో పాటు ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ, అంతకుముందు జరిగిన బుచ్చిబాటు టోర్నీల్లో సత్తా చాటిన ఆటగాళ్ల పేర్లను కూడా పరిశీలించే అవకాశం ఉంది. సీనియర్ బౌలర్ బుమ్రాను ఈ సిరీస్ కోసం పరిగణలోకి తీసుకోకపోవచ్చు. వర్క్ లోడ్ కారణంగా అతనికి విశ్రాంతి ఇస్తారని తెలుస్తుంది. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన కరుణ్ నాయర్‌ను కూడా పక్కన పెడతారని సమాచారం. ఆసీస్-ఏతో సిరీస్‌కు భారత-ఏ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్ పేరు కూడా పరిశీలనకు రావచ్చు. శ్రేయస్ ఇటీవల ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ కొనసాగుతాడు. సూర్యకుమార్ సేన దూకుడుఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు అన్ని విభాగాల్లో సత్తా చాటుతూ అజేయ జట్టుగా దూసుకుపోతుంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగరవేసిన టీమిండియా.. ఇవాళ (సెప్టెంబర్ 21) గ్రూప్-4 దశలో పాకిస్తాన్‌తో తలపడనుంది. -
BCCI: అధ్యక్ష పదవి రేసులో ఊహించని పేరు.. ఎవరీ ఆటగాడు?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవి రేసులో మరో కొత్త పేరు తెరమీదకు వచ్చింది. దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన మిథున్ మన్హాస్ (Mithun Manhas) బీసీసీఐ కొత్త బాస్ కాబోతున్నాడనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాగా రోజర్ బిన్నీ బీసీసీఐ (BCCI) అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.బోర్డు నిబంధనల ప్రకారం 70 ఏళ్లు నిండిన వారు అధ్యక్ష పదవిలో కొనసాగకూడదు. బిన్నీ ఇటీవలే 70వ పడిలోకి అడుగుపెట్టినందున.. నిబంధనలకు లోబడి రాజీనామా చేశారు. బిన్నీ స్థానంలో బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఈ నేపథ్యంలో బీసీసీఐ కాబోయే అధ్యక్షుడిగా టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్తో పాటు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తదితరుల పేర్లు వినిపించాయి. అయితే, సచిన్ ఈ వార్తలను ఇప్పటికే ఖండించాడు.ఈ క్రమంలో మిథున్ మన్హాస్ కొత్తగా మీదకు వచ్చాడు. అతడితో పాటు మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె బోర్డులో చేరనున్నట్లు సమాచారం. ఇక సెప్టెంబరు 28న జరిగే బీసీసీఐ సర్వ సభ్య సమావేశం సందర్భంగా కొత్త అధ్యక్షుడు ఎవరన్నది తేలనుంది.ఎవరీ మిథున్ మన్హాస్?జమ్ము కశ్మీర్‌కు చెందిన 45 ఏళ్ల మన్హాస్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 157 మ్యాచ్‌లు ఆడి 9714 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్డెవిలల్స్, పుణె వారియర్స్‌కు ఆడాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయకుండానే అతడి కెరీర్ ముగిసిపోయింది. ఒకవేళ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఖరారైతే.. టీమిండియాకు ఆడకుండానే బాస్ అయిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కుతాడు. -
మరోసారి HCA వివాదం.. బీసీసీఐకి ఫిర్యాదు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో మరోసారి వివాదం చెలరేగింది. హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న దల్జిత్ సింగ్‌పై పలువురు క్లబ్ సెక్రటరీలు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ఫిర్యాదు చేశారు. కాగా ఈ నెల 28న ముంబై లో బీసీసిఐ 95వ వార్షిక సభ్య సమావేశం (AGM) జరుగనుంది.ఈ నేపథ్యంలో ఏజీఎంలో పాల్గొనేందుకు బీసీసీఐ... అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా హెచ్‌సీఏకు కూడా ఆహ్వానం అందింది. ఈ క్రమంలో HCA యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా దల్జిత్ ఉండటం నిబంధనలకు విరుద్ధం అంటూ పలువురు క్లబ్ సెక్రటరీలు బీసీసీఐకి లేఖలు రాశారు. అదే విధంగా.. దల్జిత్పై సింగిల్ మెoబర్ కమిటీ జస్టిస్ నవీన్ రావ్‌కు కూడా వీరు ఫిర్యాదు చేశారు.కాగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును జూలై నెలలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడితో పాటు కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను కూడా సీఐడీ అరెస్టు చేసింది.ఈ క్రమంలో జగన్మోహన్ రావు అక్రమ పద్ధతిలో హెచ్‌సీఏలోకి ప్రవేశించినట్లు సీఐడీ గుర్తించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడిగా జగన్మోహన్ రావును తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అతడి స్థానంలో దల్జిత్ సింగ్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. -
Asia Cup 2025: మళ్లీ భారత్-పాక్ మ్యాచ్.. ఎప్పుడంటే?
ఆసియాకప్-2025లో చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్‌లో యూఏఈను 41 పరుగుల తేడాతో పాక్ చిత్తు చేసింది. దీంతో గ్రూపు-ఎ నుంచి సూపర్ 4కు ఆర్హత సాధించిన జట్టుగా పాకిస్తాన్ నిలిచింది.ఈ క్రమంలో సెప్టెంబర్ 21(ఆదివారం) దుబాయ్ వేదికగా జరగనున్న సూపర్-4 మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ.. మెన్ ఇన్ గ్రీన్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. మరోసారి దాయాది పాక్‌ను చిత్తు చేయాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. కాగా లీగ్ స్టేజిలో భాగంగా గత ఆదివారం(సెప్టెంబర్ 14) జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.128 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే హ్యాండ్ షేక్ వివాదమే ఎక్కువగా హైలెట్ అయింది. ఈ మ్యాచ్‌లో పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరాచాలనాన్ని తిరష్కరించారు.దీంతో ఘోర అవమానంగా భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. భారత్ ఆటగాళ్లతో పాటు మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాప్ట్‌పై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. కానీ రూల్ బుక్‌లో ప్రత్యర్ధి ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ చేయడం తప్పనిసారి అని లేకపోవడంతో ఐసీసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు సూపర్-4లో కూడా నో హ్యాండ్ షేక్ విధానాన్ని భారత్ కొనసాగించనుంది.చదవండి: మరోసారి బీభత్సం సృష్టించిన సాల్ట్.. ఈసారి పసికూన బలి -
Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్‌కు ఊరట?!
ఆసియా కప్-2025 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) రచ్చకెక్కింది. తమ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయకపోవడాన్ని పీసీబీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో భారత్, పాక్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycroft)ను తక్షణం ఆసియా కప్ నుంచి తప్పించాలని పీసీబీ డిమాండ్ చేసింది.ఆయనే బాధ్యుడంటూ..ఈ మేరకు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లకు ఫిర్యాదు కూడా చేసింది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు చెప్పాడని, ఈ వివాదానికి ఆయనే బాధ్యుడని ఫిర్యాదులో ప్రముఖంగా పేర్కొంది.ఈ విషయంపై మంగళవారం స్పందించిన ఐసీసీ పాక్ బోర్డు ఫిర్యాదును తోసిపుచ్చింది. ‘సోమవారం రాత్రే ఐసీసీ తమ నిర్ణయాన్ని వెలువరించింది. రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్‌ను తప్పించలేమని పాక్ బోర్డు ఫిర్యాదును తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశాం’ అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. కాగా జింబాబ్వేకు చెందిన పైక్రాఫ్ట్‌కు అంతర్జాతీయ క్రికెట్లో విశేషానుభవం వుంది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో సీనియర్ రిఫరీ అయిన ఆయన మూడు ఫార్మాట్లలో కలిసి 695 మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించారు. పురుషులు, మహిళల మ్యాచ్‌లు కలిపి ఉన్నాయి.ఐసీసీ యూటర్న్.. పాక్‌కు ఊరట?!ఈ నేపథ్యంలో కనీసం తమ మ్యాచ్‌ల వరకైనా ఆండీ క్రాఫ్ట్‌ను దూరం పెట్టి రిచీ రిచర్డ్సన్కు రిఫరీ బాధ్యతలు ఇవ్వాలని పీసీబీ కోరింది. కాగా ఆసియా కప్ టోర్నీలో బుధవారం పాకిస్తాన్- యూఏఈ మధ్య జరిగే మ్యాచ్‌కూ పైక్రాఫ్ట్ రిఫరీగా ఉన్నారు. అయితే, పీసీబీ విజ్ఞప్తిని మన్నించిన ఐసీసీ.. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడబోయే అన్ని మ్యాచ్‌ల నుంచి పైక్రాఫ్ట్‌ను రిఫరీగా తప్పించినట్లు ఎన్డీటీవీ తన తాజా కథనంలో పేర్కొంది.కాగా పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాకు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు పాక్ జట్టుతో కరచాలనం చేయలేదు. కచ్చితమైన నిబంధనలేమీ లేవుఈ నేపథ్యంలో పీసీబీ రిఫరీతో పాటు టీమిండియా తీరును తప్పుబట్టగా.. ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న కచ్చితమైన నిబంధనలేమీ లేవని బీసీసీఐ కౌంటర్ ఇచ్చింది.ఇక దుబాయ్ వేదికగా ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కొన్ని అంశాలు క్రీడాస్ఫూర్తికి మించినవి ఉంటాయంటూ పాక్ విమర్శలను తిప్పికొట్టాడు. పాక్‌పై ఈ గెలుపును ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైన్యానికి అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని సూర్య స్పష్టం చేశాడు.చదవండి: సూర్యకుమార్‌పై పాక్ మాజీ కెప్టెన్ దిగజారుడు వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన కోచ్ -
టీమిండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్
టీమిండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్ వచ్చేసింది. అపోలో టైర్స్ (Apollo Tyres) భారత జట్టు జెర్సీ స్పాన్సర్ హక్కులు దక్కించుకుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. ఒప్పందం ప్రకారం 2027 వరకు అపోలో టైర్స్ టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ‘డ్రీమ్ 11’తో కటీఫ్కాగా ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ ‘డ్రీమ్ 11’ ఇటీవలే భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్ హక్కులు కోల్పోయిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్’ను అనుసరించి.. డ్రీమ్ 11తో బీసీసీఐ తమ బంధాన్ని తెంచుకుంది. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. కాగా మూడేళ్ల కాలానికి 2023లో రూ.358 కోట్లతో డ్రీమ్ 11 ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.ఒక్కో మ్యాచ్‌కు రూ. 4.5 కోట్లుఅయితే, ఇప్పుడు అనూహ్య రీతిలో డ్రీమ్ 11పై వేటు పడగా.. అపోలో టైర్స్ ఆ స్థానాన్ని భర్తీ చేసింది. ఈ క్రమంలో ఒక్కో మ్యాచ్‌కు రూ. 4.5 కోట్ల చొప్పున అపోలో టైర్స్ బోర్డుకు చెల్లించనుంది. ఒప్పంద కాలంలో దాదాపు 130 మ్యాచ్‌లకు ఈ సంస్థ జెర్సీ స్పాన్సర్‌గా ఉండనుంది. అంతకు ముందు డ్రీమ్ 11 జెర్సీ స్పాన్సర్‌గా ఉండి.. ఒక్కో మ్యాచ్‌కు రూ. 4 కోట్లు చెల్లించింది.కాగా టీమిండియా జెర్సీ స్పాన్సర్ హక్కులు దక్కించుకునేందుకు కాన్వా, జేకే టైర్, బిర్లా ఓప్టస్ పెయింట్స్ వంటివి ఆసక్తి చూపగా.. అపోలో టైర్స్ తమ బిడ్‌ను ఖరారు చేసుకుంది. ఇదిలా ఉంటే.. అర్ధంతరంగా డ్రీమ్ 11 తప్పుకోవాల్సి రావడంతో టీమిండియా ఆసియా కప్-2025 టోర్నమెంట్లో జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగిన విషయం తెలిసిందే.చదవండి: ఛీ.. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు.. ఇదేం పద్ధతి? -
పాకిస్తాన్‌తో ఆడితే తప్పు కాదా? షేక్ హ్యాండ్ ఇస్తేనే తప్పా?: మనోజ్ తివారీ
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ జట్టుతో సంప్రదాయ కరచాలనాన్ని టీమిండియా ఆటగాళ్లు తిరష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఖండాంతర టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు మధ్య పోరు జరిగింది. అయితే ఈ మ్యాచ్ టాస్ దగ్గర నుంచి ఆట ముగిసే వరకు భారత జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లతో అంటిముట్టనట్టు ఉన్నారు.తొలుత టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అనంతరం మ్యాచ్ ముగిశాక కూడా కరచాలనం చేసేందుకు భారత జట్టు ఇష్టపడలేదు. దీంతో భారత జట్టు తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.కానీ భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ మాత్రం టీమిండియా మెనెజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. పాకిస్తాన్‌తో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు, షేక్ హ్యాండ్ ఇస్తే తప్పు ఏముందని తివారీ అన్నాడు. అయితే పాకిస్తాన్ మ్యాచ్‌తో భారత్ బహిష్కరించాలని తివారీ ముందే నుంచే తన వాదన వినిపిస్తూ వస్తున్నాడు."నేను భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌తో ఆసియాకప్ మొత్తాన్ని బాయ్‌కట్ చేస్తున్నాను. ఎందుకంటే క్రికెట్ అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే. క్రీడలకు ఇచ్చిన విలువ జీవితాలకు ఇవ్వడం లేదు. ఇది నాకు నచ్చడం లేదు. మనం మానవ జీవితాలను క్రీడలతో పోల్చడం సరి కాదు" అని పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు తివారీ స్టెట్మెంట్ ఇచ్చాడు.ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. "పాక్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్‌ను తిరష్కరించడం సరైన నిర్ణయం కాదు. మీరు పాకిస్తాన్‌తో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు.. హ్యాండ్ షేక్ చేస్తే తప్పు ఏముంది. పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించి మీరు ఏది చెప్పినా ప్రజులు నమ్మేవారు.ఈ టోర్నీ ఆరంభానికి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్యకుమార్ యాదవ్.. పాకిస్తాన్ కెప్టెన్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ వీడియోను నేను చూశాను. మరి అప్పుడు ఎలా కరచాలనం చేశారు. ఆ సమయంలో మీకు తప్పు అన్పించలేదా? అంటే ఇప్పుడు విమర్శకుల నుంచి తప్పించుకోవడం కోసం నో హ్యాండ్ షేక్ నిర్ణయం తీసుకున్నారా? ముందే వారి కెప్టెన్, చైర్మెన్‌కు హ్యాండ్ షేక్ ఇచ్చి ఇప్పుడు మ్యాచ్‌లో తిరష్కరించి ఏమి సాధించారో నాకు ఆర్ధం కావడం లేదు. విమర్శకుల నుంచి తామును తాము రక్షించుకోవడానికే ఈ విజయాన్ని పహల్గామ్ బాధితులకు, భారత సాయుధ దళాలకు అంకితం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు" అని ఇన్సైడ్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారీ పేర్కొన్నాడు.చదవండి: Asia Cup Handshake Controversy: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్? -
Asia Cup 2025: ‘చేయి’ కలపలేదని...
దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నిలో భారత్, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఫలితం ఏకపక్షంగా ముగిసింది. చెత్తగా ఆడిన పాకిస్తాన్ తమ ఆటతీరును విశ్లేషించు కోవాల్సిందిపోయి ఇరు జట్ల ఆటగాళ్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకోలేదనే అంశంపై వివాదాన్ని రాజేస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దీనిపైనే దృష్టి పెట్టినట్లుంది. ఫిర్యాదులు, చర్యలు చేపట్టాలంటూ తెగ హడావుడి చేస్తోంది. కానీ కరచాలనం తిరస్కరణ కొత్తదేమీ కాదు. టెన్నిస్‌లో, ఫుట్‌బాల్‌లోనూ ఉద్రిక్తతలు, రాజకీయ వైరం కారణంగా ఆయా దేశాలకు చెందిన ప్లేయర్లు ఎన్నోసార్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకోలేదు. దీనిపై టెన్నిస్ ఇంటిగ్రిటీ గానీ, ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిపా) గానీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పీసీబీ మాత్రం నానా యాగీ చేస్తోంది. మ్యాచ్ రిఫరీని తొలగించండి మ్యాచ్ ముగిసిన తర్వాత తమ జట్టు ఆటగాళ్లతో టీమిండియా క్రికెటర్లు పరస్పర కరచాలనం తిరస్కరించడంపై పీసీబీ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఆదివారం నాటి లీగ్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన అండీ పైక్రాఫ్ట్‌ను తక్షణమే తొలగించాలని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)కి ఫిర్యాదు చేసింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జోక్యం చేసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఏసీసీ చీఫ్‌గా పీసీబీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ ఉంటే, ఐసీసీ చీఫ్‌గా భారత్‌కు చెందిన జై షా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ఎవరెలా స్పందిస్తారోనన్నది, ఎలా ముగింపు పలుకుతారో అన్నది ఆసక్తికరంగా మారింది. ‘మ్యాచ్ రిఫరీపై ఐసీసీకి ఫిర్యాదు చేశాం. ఐసీసీ నియమావళి, ఎంసీసీ చట్టాలు, క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ వ్యవహరించారు. దీన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే ఆయన్ని ఆసియా కప్ నుంచి తొలగించాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది’ అని ఏసీసీ చీఫ్ కూడా అయిన నఖ్వీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. టాస్ వేసే సమయంలోనే భారత కెపె్టన్ సూర్యకుమార్‌తో షేక్‌హ్యాండ్ చేయొద్దని పాక్ కెపె్టన్ సల్మాన్ అగాతో రిఫరీ పైక్రాఫ్ట్ చెప్పారని పీసీబీ పేర్కొంది. టీమ్ షీట్ల మారి్పడి సజావుగా జరగలేదని పాకిస్తన్ జట్టు మేనేజర్ నవిద్ చిమా కూడా ఏసీసీకి ఫిర్యాదు చేశారు. షీమ్ షీట్లను ఇద్దరు కెపె్టన్లు మార్చుకోవడం సహజం. కానీ ఈ సారి టీమ్ షీట్లను కెపె్టన్ల నుంచి రిఫరీ తీసుకున్నారు. తెలుసా... ఆతిథ్య హక్కులు దక్కవు!పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లు ఆడొద్దు, ఇకపై జరగొద్దు అని భారత్‌లో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కానీ బహుళ జట్లు బరిలో ఉండే ఈవెంట్లలో తప్పుకుంటే ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులు పొందే అవకాశాలు రావు. ఎందుకంటే ప్రస్తుతం క్రికెట్ ఇప్పుడు ఒలింపిక్ చార్టర్లో భాగమైంది. లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్‌లో నిర్వహణకు సిద్ధమైంది. ఇక భారత్ 2030 కామన్వెల్త్ క్రీడలు, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం పోటీపడాలనుకుంటుంది. ఇలాంటి సమయంలో పాక్‌తో ఆడం, మ్యాచ్‌లను బహిష్కరిస్తామంటే ఆతిథ్య ఆశలు, అవకాశాలు అడుగంటుతాయి.గతంలో... టెన్నిస్‌లో...ఇప్పుడు ఆసియా కప్ క్రికెట్లో షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం వివాదాస్పదం చేస్తున్నారు కానీ... ఇలా జరగడం క్రీడల్లో ఇదేమీ మొదటిసారి కాదు. 2023లో ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నిలో ఉక్రెయిన్‌కు చెందిన స్వితోలినా, బెలారస్ ప్లేయర్ విక్టోరియా అజరెంకా మ్యాచ్ అనంతరం షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు. వింబుల్డన్ నిర్వాహక కమిటీ స్వితోలినాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ అంశాన్ని అసలు పట్టించుకోనేలేదు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో బెలారస్ అండగా నిలవడమే ఈ వైఖరికి కారణం కాగా... ఇప్పటికీ కూడా పలువురు ఉక్రెయిన్ ప్లేయర్లతో... బెలారస్, రష్యా ప్లేయర్లు కరచాలనం చేయడం లేదు. అమెరికా, ఇరాన్ దేశాల వైరం కారణంగా ఫుట్‌బాల్‌లో ఇరుజట్లు తలపడినపుడు కూడా ఆటగాళ్ల మధ్య షేక్‌హ్యాండ్స్ కనిపించవు. అదేమీ నిబంధన కాదు... రూల్ బుక్ చూస్కోండి పహల్గాంలో పాక్ ఉగ్రమూకల ఊచకోతకు గురైన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు పాకిస్తానీ క్రికెటర్లతో పరస్పరం చేయి కలపకూడదని జట్టు మేనేజ్మెంట్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది కోచ్ గంభీర్దో లేదంటే కెపె్టన్ సూర్యకుమార్ నిర్ణయం కానేకాదని జట్టు వర్గాలు స్పష్టం చేశాయి. దాయాది క్రికెటర్ల షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమర్థించుకుంది. ‘ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం ఇవ్వాలనే నిబంధనేది రూల్ బుక్‌లో లేదు. ఇది పూర్తిగా గుడ్‌విల్‌తో ముడిపడిన స్నేహపూర్వక అంశమే! అంతేకానీ చట్టం అయితే కాదు. కాబట్టి కచ్చితంగా షేక్‌హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు స్పష్టత ఇచ్చారు. -
హ్యాండ్ షేక్ వివాదం.. భారత్‌కు ఫైన్ పడుతుందా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
ఆసియాకప్-2025 గ్రూపు-ఎలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాక్‌ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే హ్యాండ్‌షేక్ వివాదమే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసన తెలిపింది.టాస్ దగ్గర నుంచి మ్యాచ్ పూర్తి అయ్యేంతవరకు పాక్ ఆటగాళ్లను టీమిండియా కనీసం పట్టించుకోలేదు. గతంలో ఇరు జట్లు తలపడినప్పుడు ఆటగాళ్లు ఒకరొకరు పలకరించుకునేవారు. కానీ ఈసారి కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. మైదానంలోకి వచ్చామా, గెలిచి వెళ్లామా అన్నట్లు భారత జట్టు తమ వైఖరిని కనబరిచింది.తొలుత టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాతో కరచాలనం చేసేందుకు నిరాకరించాడు. కనీసం అతడి ముఖం కూడా చూడకుండా సూర్య డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ఇదంతా ముందుస్తు ప్రణాళికలో భాగంగానే జరిగింది.ఆ తర్వాత మ్యాచ్ ముగిశాక కూడా పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భారత జట్టు నిరాకరించింది. అంతేకాకుండా పాక్ ప్లేయర్లు టీమిండియా డ్రెసింగ్‌రూమ్ వైపు వెళ్లగా.. సహాయక సిబ్బంది తలుపు మూసేసినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ టీమ్ అసహననానికి లోనైంది. ఫలితంగా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెర్మనీని సల్మాన్ ఆఘా బహిష్కరించాడు. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో పాల్గోన్న పాక్ హెడ్ కోచ్ మైక్ హసన్ భారత ఆటగాళ్లు తమ పట్ల వ్యవహరించిన తీరు బాధ కలిగించందని చెప్పుకొచ్చాడు.ఈ హ్యాండ్ షేక్ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సైతం స్పందించింది. "భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడం పట్ల జట్టు మేనేజర్ నవీద్ చీమా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది క్రీడా స్పూర్తికి విరుద్దం. నిరసనలో భాగంగా తమ కెప్టెన్‌ను పోస్టు మ్యాచ్ సెర్మనీకి పంపలేదని" పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ హ్యాండ్ షేక్ వివాదంపై ఏసీసీకి, ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు పీసీబీ సిద్దమైనట్లు సమాచారం. అంతేకాకుండా ఐసీసీ చర్యలు తీసుకుపోతే యూఏఈతో తమ తదుపరి మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పీసీబీ బెదిరిస్తోంది.ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టుపై ఐసీసీ చర్యలు తీసుకుంటుందా? అసలు రూల్స్ ఏమి చెబుతున్నాయి? అన్న విషయాలను ఓసారి తెలుసుకుందాం. ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి?ఆసియాకప్‌ను ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తున్నప్పటికి.. ఈ టోర్నీపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు పూర్తి అధికారం ఉంటుంది. ఈ టోర్నీలో పాల్గోనే జట్లు, ఆటగాళ్లకు ఐసీసీ ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది. ఐసీసీ ఎల్లప్పుడూ క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహిస్తుంది.ఆటగాళ్లు తమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఐసీసీ కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. కానీ మ్యాచ్ ముగిశాక ఇరు జట్ల ఆటగాళ్లు తప్పనిసరిగా షేక్ హ్యాండ్ ఇవ్వాలనే నిబంధన ఐసీసీ రూల్స్ బుక్‌లో ఎక్కడా లేదు. షేక్ హ్యాండ్ అనేది క్రీడా స్ఫూర్తికి చిహ్నంగా మాత్రమే పరిగణిస్తారు. అదేమి ఖచ్చితమైన రూల్ కాదు. కరచాలనం చేయాలా వద్దా అన్నది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఐసీసీ రూల్ బుక్ ముందు మాటలో ఆటగాళ్లు.. సహచరులను, మ్యాచ్ అధికారులను, అంపైర్లను గౌరవించడం గురుంచి ఉంటుంది. అంతే తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం నేరమని ఐసీసీ తమ రూల్స్‌లో ఎక్కడా ప్రస్తావించలేదు.ఒకవేళ ఆటగాళ్లతో దురుసగా ప్రవర్తించి కరచాలనం చేయకపోతే దాన్ని ఐసీసీ నేరంగా పరిగణిస్తోంది. కానీ ఈ సందర్భంలో టీమిండియా ఆటగాళ్లు ప్రత్యర్థులను ఏ మాత్రం రెచ్చ గొట్టేలా ప్రవర్తించలేదు. దీంతో భారత జట్టుకు ఐసీసీ ఎటువంటి జరిమానా విధించే అవకాశం లేదు.బీసీసీఐ స్పందన ఇదే..ఈ విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. "మీకు ఏదైనా సందేహం ఉంటే ఒక్కసారి రూల్ బుక్‌ను చదవండి. అందులో ఎక్కడ కూడా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వాలని ప్రత్యేకంగా ఏమీలేదు. అది కేవలం మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమే. షేక్ హ్యాండ్స్ ఇవ్వాలా లేదా అన్నది వారి సొంత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప ప్రత్యేకంగా చట్టం ఏమీ లేదు. కాబట్టి ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయకపోయిన అదేమి పెద్ద నేరం కాదు" అని సదరు అధికారి పీటీఐతో పేర్కొన్నారు. -
'అలా ఎక్కడా రాసి లేదు'.. షేక్హ్యాండ్పై పాక్‌కు బీసీసీఐ స్ట్రాంగ్ కౌంటర్
ఆసియాకప్-2025లో ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయభేరి మ్రోగించింది. అయితే ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా గానీ, ఆట ముగిశాక కానీ భారత జట్టు ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు ఇష్టపడలేదు. ఎటువంటి కరచాలనాలు, పలకరింపులు లేకుండా తమ పని తాము చేసుకుని మైదానం వీడారు.పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా ఇండియన్ టీమ్ మెనెజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ సూపర్-4లో మరోసారి పాక్‌తో తలపడితే సూర్య అండ్ కో ఇదే పద్దతిని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. బీసీసీఐ నుంచి అనుమతి లభించిన తర్వాతే పాక్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్చేయకూడదనే నిర్ణయాన్ని టీమిండియా తీసుకుందంట. అయితే భారత ఆటగాళ్లు తమతో కరచాలనం చేయకపోవడంపై పాకిస్తాన్ టీమ్ అసహనం వ్యక్తం చేసింది. ఇది క్రీడా స్పూర్తికి విరుద్దమని, భారత జట్టు తీరుపై ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసేందుకు పాకిస్తాన్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు గట్టి కౌంటరిచ్చారు. పాక్ ఫిర్యాదు చేసిన అది చెల్లదు అని ఆయన తెలిపారు."మీకు ఏదైనా సందేహం ఉంటే ఒక్కసారి రూల్ బుక్‌ను చదవండి. అందులో ఎక్కడ కూడా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వాలని ప్రత్యేకంగా ఏమీలేదు. అది కేవలం మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమే. షేక్ హ్యాండ్స్ ఇవ్వాలా లేదా అన్నది వారి సొంత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప ప్రత్యేకంగా చట్టం ఏమీ లేదు. కాబట్టి ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయకపోయిన అదేమి పెద్ద నేరం కాదు" అని సదరు అధికారి పీటీఐతో పేర్కొన్నారు.చదవండి: Asia Cup 2025: ఇది కదా సక్సెస్ అంటే.. గురువు రికార్డునే బద్దలు కొట్టిన అభిషేక్ -
బీసీసీఐ కూడా చెప్పినట్లే వినాలి!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికే పెద్దపీట వేస్తోందని, తద్వారా భారత్‌ను ప్రపంచ టాప్–10 క్రీడా దేశాల్లో నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ‘ప్లేకామ్ బిజినెస్ ఆఫ్ స్పోర్ట్స్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘గతంలో క్రీడా సమాఖ్యల్లో తిష్ట వేసుకు కూర్చున్న సమస్యలు, వివాదాలే పతాక శీర్షికలయ్యేవి. ప్రస్తుతం మేం ఈ వివాదాలను పక్కనబెట్టి అథ్లెట్ల ప్రదర్శన మెరుగుపర్చడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాం. అంతర్జాతీయ క్రీడల్లో భారత ఆటగాళ్లు పోడియంలో నిలిచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. కొత్తగా తీసుకొచ్చిన క్రీడా బిల్లు కూడా తగవుల్ని పరిష్కరించడంతో పాటు క్రీడాకారుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుంది. అథ్లెట్లు రాణించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తున్నాం’ అని అన్నారు. బీసీసీఐ కూడా చెప్పినట్లే వినాలి!దేశంలోని క్రీడా సమాఖ్యలన్నీ క్రీడా బిల్లుకు లోబడే ఉండాలని నిర్ణయించామని, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా కొత్త క్రీడా పాలసీ ప్రకారమే నడచుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. తద్వారా ప్రతీ సమాఖ్యలోనూ జవాబుదారీతనాన్ని పెంచామని అన్నారు. అంతర్జాతీయ క్రీడల్లో పురుషులకు దీటుగా భారత మహిళా అథ్లెట్లు పోటీపడాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని మంత్రి వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ‘ఫిట్ ఇండియా’, ‘ఖేలో ఇండియా’, టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) కార్యక్రమాలు అథ్లెట్ల కోసమే రూపొందించామని మాండవీయ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో వ్యవహరిస్తున్నారని, భారత క్రీడావికాసం కోసం ప్రణాళికబద్ధంగా కృష్టి చేస్తున్నారని ఆయన చెప్పారు. పదేళ్ల ప్రణాళికతో క్రీడాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మన్సుఖ్ మాండవీయ అన్నారు. క్షేత్రస్థాయిలోఇక భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రతిభాన్వేషణ పోటీలను పెంచుతామని చెప్పారు. కేవలం నగరాలు, అకాడమీలే కాదు... మారుమూల గ్రామాలు, పట్టణాల్లో ఉన్న ప్రతిభావంతులను పాఠశాల స్థాయి పోటీల్లో గుర్తించి నాణ్యమైన శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు. -
చెమటలు గక్కిన హార్దిక్.. పడబోయిన రింకూ.. బీసీసీఐ వీడియో వైరల్
టీమిండియా ఆటగాళ్లు ‘బ్రాంకో టెస్టు’ (Bronco Test)లో భాగంగా చెమటలు గక్కారు. భారత జట్టు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియాన్ లీ రౌక్స్ (Adrian Le Roux) ఆధ్వర్యంలో కఠిన శ్రమకోరుస్తూ ప్రాక్టీస్ చేశారు. కాగా ఆటగాళ్ల ఫిట్నెస్ పరీక్ష కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల బ్రాంకో టెస్టును ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.1200 మీటర్ల పరుగుసాధారణంగా రగ్బీ ఆటగాళ్లు ఏరోబిక్, కార్టియోవాస్క్యులర్ కెపాసిటీని పెంచుకునేందుకు ఈ టెస్టును ఉపయోగిస్తున్నారు. ఇందులో 0 మీటర్ల నుంచి మొదలు పెట్టి 60 మీ... పరిగెత్తి.. ఆ తర్వాత 0- 40 మీ.. 0-20 మీ. పరుగు తీయాలి. మొత్తంగా 240 మీటర్లను ఓ సెట్లో పూర్తి చేయాలి. మొత్తంగా ఐదు సెట్లను అంటే.. 1200 మీటర్లను ఆరు నిమిషాల్లో పూర్తి చేయాలి.చెమటలు గక్కిన హార్దిక్.. పడబోయిన రింకూఇక ఆసియా కప్-2025లో భాగంగా సెప్టెంబరు 14నాటి పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో మైదానంలోనే రౌక్స్.. ఆటగాళ్లకు బ్రాంకో టెస్టు నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ విడుదల చేసింది. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా చెమటలు గక్కగా.. రింకూ కిందపడిపోబోయాడు. మిగతా ఆటగాళ్లు సైతం పరుగు పూర్తి చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు.ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినాఈ విషయం గురించి రౌక్స్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మేము బ్రాంకో టెస్టు రన్ చేశాము. ఇదేమీ కొత్త రకం పరీక్ష కాదు. వివిధ క్రీడల్లో ఇప్పటికే చాలా ఏళ్లుగా దీనిని వాడుతున్నారు.ఇదొక ఫీల్డ్ టెస్టు. ఎక్కడైనా దీనిని నిర్వహించవచ్చు. ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా మేము దీనిని ఉపయోగించుకోవచ్చు. ట్రెయినింగ్ పరంగా.. ఆటగాళ్ల శారీరక దృఢత్వాన్ని పరీక్షించేందుకు .. ఇలా రెండు విధాలుగా ఇది ఉపయోగపడుతుంది.శారీరకంగా బలంగా ఉంటేనే..ఆటగాళ్ల ఏరోబిక్ ఫిట్నెస్ పెంచుకోవడానికి సహకరిస్తుంది. క్రికెట్ నైపుణ్యాలతో కూడిన ఆట. అయితే, ఆటగాళ్లు పూర్తి ఫిట్‌గా ఉన్నపుడే వారి కెరీర్సుదర్ఘీ కాలం కొనసాగుతుంది. శారీరకంగా బలంగా ఉన్నపుడే అన్ని రకాల సవాళ్లకు ఆటగాళ్లు సిద్ధం కాగలుగుతారు. మా ఆటగాళ్లు అద్బుతం. వారి హార్డ్‌వర్క్‌తో నన్నెంతగానో ఆకట్టుకుంటున్నారు.నేను గతంలో ఐపీఎల్ జట్లతో పనిచేశాను. ఎంతో మంది ఆటగాళ్లను చూశాను. ఇప్పుడిది నాకు కొత్త జట్టే. అయినా.. గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవం నాకు ఉంది. ఇలాంటి పోరాట పటిమ ఉన్న జట్టుతో కలిసి ఉండటం గర్వంగా ఉంది’’ అని జట్టు పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
అరటిపండ్లకు రూ.35 లక్షలు ఖర్చు? బీసీసీఐకి హైకోర్టు నోటీసులు
ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ (CAU)లో రూ.12 కోట్ల స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఏయూ భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని.. టోర్నమెంట్స్ కోసం కేటాయించిన ఫండ్స్‌ను దారిమళ్లించారని, వాటిపై విచారించాలని కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి.దీంతో ఆరోపణలపై విచారణ జరిపించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI)కి ఉత్తరాఖండ్ హైకోర్టు బుధవారం నోటీసు జారీ చేసింది. ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ ఆడిట్ నివేదిక ఆధారంగా ఆటగాళ్లకు అరటిపండ్ల కోసం రూ.35 లక్షలకు ఖర్చు చేశారని పిటిషనర్ ఆరోపించారు.2024-25 ఏడాదికి గానూ సీఏయూ ఆడిట్ నివేదికపై దర్యాప్తును కోరుతూ సంజయ్ రావత్ అనే వ్యక్తి వాజ్యం దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మనోజ్ కుమార్ తివారీ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. ఈ ఫిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.ఆడిట్ రిపోర్ట్ ప్రకారం.. రాష్ట్ర క్రికెట్ బోర్డు నిర్వహించే అన్ని టోర్నమెంట్లకు సీఎయూ భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఈవెంట్ మెనెజ్‌మెంట్ ఫీజుల కోసం రూ.6.4 కోట్లు, టోర్నమెంట్ల నిర్వహణ, ట్రయల్స్ కోసం రూ.26.3 కోట్లు చేసినట్లు సంజయ్ రావత్ తన ఫిటిషన్లో పేర్కొన్నారు. కాగా ఈ ఖర్చు గత ఆర్ధిక సంవత్సరంలో రూ. 22.30 కోట్లే ఉంది. ముఖ్యంగా ఆహార ఖర్చుల పేరుతో అసోసియేషన్ కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసిందన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. దీనిపై బీసీసీఐ విచారణ జరిపి కోర్టుకు నివేదిక సమర్పించనుంది.చదవండి: ఆ జట్టు ఓటమి ఖాయమే!.. టీమిండియా నుంచి ఎవరిని తప్పిస్తారు?: అక్తర్ -
పక్షవాతం.. నొప్పి భరించలేకపోయా: టీమిండియా స్టార్ క్రికెటర్
గత కొన్నాళ్లుగా భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైన పేరు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer). పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మంచి ఫామ్‌లో ఉన్నా ఆసియా కప్-2025 ఆడే టీమిండియాలో అతడికి చోటు దక్కకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇదిలా ఉంటే.. 2022-23 మధ్య కాలంలో శ్రేయస్ ఇంతకంటే గడ్డు పరిస్థితులే ఎదుర్కొన్నాడు.క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడన్న కారణంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శ్రేయస్ సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేసింది. అదే సమయంలో ఫిట్నెస్ సమస్యలు కూడా అతడిని వెంటాడాయి. నాటి పరిస్థితి గురించి శ్రేయస్ అయ్యర్ తాజాగా మాట్లాడుతూ విస్మయకర విషయాలు వెల్లడించాడు.పక్షవాతం వచ్చింది‘‘ఆ సమయంలో నేను నొప్పితో ఎంతగా విలవిల్లాడానో ఎవరికీ తెలియదు. నా కాలుకు పక్షవాతం వచ్చింది. వెన్నెముకకు సర్జరీ జరిగిన తర్వాత.. నడుములో రాడ్డుతో ఎలా మేనేజ్ చేసుకున్నానో నాకే తెలియదు. ఆ ప్లేస్‌లో ఉన్న నరం కూడా దెబ్బతిన్నది.అదెంతో ప్రమాదకరమని వైద్యులు చెప్పారు. ఆ సమయంలో భరించలేని నొప్పి. నా కాలి చిటికిన వేలు వరకు నొప్పి పాకింది. నిజంగా అదొక భయంకర అనుభవం’’ అని జీక్యూ ఇండియాకు శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.కాగా గాయం నుంచి కోలుకున్న తర్వాత శ్రేయస్ అయ్యర్ ముంబై తరఫున దేశవాళీ క్రికెట్లో తనను తాను నిరూపించుకున్నాడు. అదే విధంగా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా టైటిల్ అందించాడు. ఈ క్రమంలోనే టీమిండియాలో పునరాగమనం చేయగా.. బీసీసీఐ అతడి సెంట్రల్ కాంట్రాక్టును పునరుద్ధరించింది. వన్డే వరల్డ్‌కప్-2023లో ఆడిన శ్రేయస్ అయ్యర్ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.వాటిని మాత్రమే నియంత్రించగలనుఅదే విధంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాను విజేతగా నిలపడంలో ముఖ్య భూమిక అతడిదే. ఇక ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ గొప్పగా రాణించాడు. జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయినప్పటికీ ఆసియా టీ20 కప్ ఆడే భారత జట్టులో మాత్రం అతడికి చోటు దక్కకపోవడం గమనార్హం.ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘నా ఆధీనంలో ఉన్న వాటిని మాత్రమే నేను నియంత్రించగలను. నా నైపుణ్యాలు, బలాలను మరింత మెరుగుపరచుకోవడం మాత్రమే నాకు తెలిసిన పని. అవకాశం వచ్చినప్పుడు రెండు చేతులతో దానిని అందిపుచ్చుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను’’ అని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు.చదవండి: ‘యువీకి అప్‌గ్రేడ్ వర్షన్ అతడు.. గిల్‌కు కూడా మంచి ఛాన్స్’ -
ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆ సిరీస్‌కు కోహ్లి-రోహిత్ దూరం!?
అంతా ఊహించిందే జరిగింది. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఆస్ట్రేలియా-ఎ సిరీస్‌లో భాగం కావడం లేదు. ఇప్పటికే టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలికిన రోకో ద్వయం ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు.చివరగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జెర్సీలో కన్పించిన వీరిద్దరూ తిరిగి వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌లో ఆడనున్నారు. ఈ క్రమంలో వీరిద్దరిని స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న అనాధికారిక వన్డే సిరీస్‌లో భారత్-ఎ జట్టు తరపున ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది వారికి ప్రాక్టీస్ ఉపయోగపడుతుందని, అందుకు రో-కో కూడా అంగీకరించారని పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ఇవన్నీ వట్టి రూమర్సే అని ఆయన కొట్టిపారేశారు."ఆస్ట్రేలియా-తో జరిగే సిరీస్‌లో రోహిత్, కోహ్లి ఇద్దరూ ఆడడం ఆసాధ్యమనే చెప్పాలి. ఇప్పటివరకు మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా జానియర్లతో కలిసి ఆడమని వారిని మేము బలవంతం కూడా చేయము. వారింత వారు ప్రాక్టీస్ కావాలని భావిస్తే, ఆస్ట్రేలియా వన్డేలకు ముందు ఒకటి రెండు అనాధికారిక మ్యాచ్‌లు ఆడే అవకాశముంది. కానీ ఇది జరగకపోవచ్చు. ఎందుకంటే వారు ప్రస్తుతం చాలా ఫిట్‌గా ఉన్నారు. ఆస్ట్రేలియాతో వన్డేలకు రోహిత్, కోహ్లి కూడా సిద్దంగా ఉన్నారని" సదరు అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు. కాగా రోహిత్ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ఫిట్‌గా కన్పిస్తున్నాడు. దాదాపు ఎనిమిది కేజీలు తగ్గినట్లు తెలుస్తోంది. ఇటీవలే హిట్‌మ్యాన్ తన ఫిట్నెస్ టెస్టును క్లియర్ చేశాడు. కోహ్లి ఇంకా తన ఫిట్నెస్ టెస్టుకు హాజరు కావాల్సి ఉంది. కాగా ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆసీస్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20 సిరీస్‌లో మెన్ ఇన్ బ్లూ తలపడనుంది.చదవండి: ఆల్‌టైమ్ ఆసియా టీ20 జట్టు: భారత్ నుంచి ఐదుగురు.. యువీకి నో ఛాన్స్ -
మరో జహీర్ ఖాన్ అన్నారు.. కట్ చేస్తే! ఒక మ్యాచ్‌కే ఖేల్ ఖతం
అన్షుల్ కాంబోజ్.. టీమిండియాకు మరో జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్ అవుతాడు. ఇవి ఇంగ్లండ్ పర్యటలో భారత తరపున టెస్టు అరంగేట్రం చేసిన పేసర్ కాంబోజ్ గురుంచి లెజెండరీ రవిచంద్రన్ అశ్విన్ అన్న మాటలు. కానీ అశ్విన్ అంచనాలను కాంబోజ్ అందుకోలేకపోయాడు. బుమ్రా, జహీర్లతో పోల్చడం పక్కన పెడితే కాంబోజ్ కనీస పోటీ ఇవ్వలేకపోయాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు ముందు అర్ష్‌దీప్ సింగ్, ఆకాష్ దీప్ గాయపడడంతో సెలక్టర్లు అనుహ్యంగా అన్షుల్‌కు పిలుపునిచ్చారు.ఉన్నపళంగా మాంచెస్టర్‌కు వెళ్లిన కాంబోజ్.. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో అరంగేట్రం చేశాడు. ఈ హర్యానా పేసర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. అంతేకాకుండా సరైన పేస్‌ను జనరేట్ చేయడంలో కూడా కాంబోజ్ ఇబ్బంది పడ్డాడు. గంటకు 120 కి.మీ వేగంతో మాత్రమే కాంబోజ్ బౌలింగ్ చేశాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఒక్క మ్యాచ్‌కే వేటు..అయితే భారత రెడ్ బాల్ క్రికెట్ సెటాప్ నుంచి కాంబోజ్‌ను బీసీసీఐ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న అనాధికారిక టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కాంబోజ్‌కు చోటు దక్కలేదు. ఇటీవల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో బీసీసీఐ కండక్ట్ చేసిన పేస్ బౌలర్ల క్యాంపునకు కాంబోజ్ హాజరైనప్పటికి.. ఆసీస్‌తో సిరీస్‌కు మాత్రం సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో అతడు తిరిగి జాతీయ జట్టలోకి రావడం అనుమానమే. ఆస్ట్రేలియా-ఎతో సిరీస్‌కు సీనియర్ పేసర్లు ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్‌లతో పాటు యువ పేసర్లు యశ్ ఠాకూర్గు, గుర్నూర్ బ్రార్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే అన్షుల్‌కు దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. గతేడాది రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో కాంబోజ్ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టి చరిత్ర కెక్కాడు. అంతేకాకుండా గతేడాది నుంచి ఇండియా-ఎ జట్టులో కాంబోజ్ భాగమవుతూ వస్తున్నాడు.కానీ ఇప్పుడు జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేసిన తర్వాత కూడా భారత్-ఎ జట్టు నుంచి అతడిని తప్పించడం అందరిని ఆశ్యర్యపరిచింది. కాంబోజ్ ఏమైనా ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడా? లేదా సెలక్టర్లు కావాలనే పక్కన పెట్టారా తెలియాల్సింది.ఆసీస్-తో సిరీస్‌కు భారత్-ఎ జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బదోని, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్,ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యష్ ఠాకూర్ -
IND vs PAK: కేంద్రం అనుమతి.. బీసీసీఐ స్పందన ఇదే
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా- పాకిస్తాన్ (Ind vs Pak) మ్యాచ్ నిర్వహణపై సందిగ్దం పూర్తిగా తొలగిపోయింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌కు రాజముద్ర వేసిన విషయం తెలిసిందే. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది.కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఆసియా కప్ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్ దక్కించుకుంది. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఉన్న ఒప్పందం దృష్ట్యా తటస్థ వేదికపై మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.రెండు గ్రూపులు.. ఎనిమిది జట్లుఇక సెప్టెంబరు 9- 28 మధ్య నిర్వహించే ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి.ఇదిలా ఉంటే.. ఒకే గ్రూపులో ఉన్న భారత్- పాక్ లీగ్ దశలో ఒకసారి కచ్చితంగా ముఖాముఖి తలపడాల్సి ఉంది. సెప్టెంబరు 14న చిరకాల ప్రత్యర్థుల పోరుకు షెడ్యూల్ ఖరారైంది. ఆ తర్వాత సూపర్ ఫోర్ దశలో.. అన్నీ సజావుగా సాగితే ఫైనల్లోనూ ఈ రెండు జట్లు పోటీ పడే అవకాశం ఉంది.అనుమతినిచ్చిన కేంద్ర ప్రభుత్వం అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో క్రీడల్లోనూ అన్ని సంబంధాలు తెంచుకోవాలనే డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్ టోర్నీలోనూ దాయాదుల పోరు ఉండబోదనే వార్తలు వచ్చాయి. అయితే, ఇదొక మల్టీలేటరల్ ఈవెంట్ (ఇతర దేశాలు కూడా పాల్గొంటున్న టోర్నీ) కావడంతో కేంద్ర ప్రభుత్వం ఇందుకు అంగీకరించింది.బీసీసీఐ స్పందన ఇదేఅయితే, ఈ విషయంపై బీసీసీఐ మాత్రం ఇంత వరకు నోరు విప్పలేదు. తాజాగా.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించాడు. ‘‘కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాలనేది బీసీసీఐ విధానం. ఇప్పుడు కూడా అంతే. మల్టీ నేషనల్ టోర్నమెంట్ లేదంటే అంతర్జాతీయ స్థాయి టోర్నీలో ఆడాలన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పక తీసుకుంటాం.భారత్‌తో సంబంధాలు బాగాలేని దేశాల జట్లతో ఆడాలా? లేదా? అన్న విషయాన్ని కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. ఆసియా కప్ టోర్నీలో కూడా వివిధ దేశాలు పాల్గొంటున్నందున మాకు అనుమతి లభించింది. ఆసియా క్రికెట్ నియంత్రణ మండలి లేదంటే అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే టోర్నీల్లో టీమిండియా ఆడకుండా ఉండదు కదా!ఫిఫా, ఏఎఫ్సీ.. ఇలా ఈ క్రీడలోనైనా.. మేము ప్రత్యేకంగా ఓ దేశంతో మ్యాచ్ ఆడబోమని చెబితే.. ఇండియన్ ఫెడరేషన్ మీద ఆంక్షలు విధించే అవకాశం ఉండవచ్చు’’ అని దేవజిత్ సైకియా పేర్కొన్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌లలో మాత్రం టీమిండియా పాక్‌తో ఆడబోదని స్పష్టం చేశాడు.చదవండి: చిన్ననాటి గురువుకు రూ. 80 లక్షల సాయం.. హార్దిక్, కృనాల్ మంచి మనసు -
భారత జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన
ఆస్ట్రేలియా-తో జరగనున్న రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత్-ఎ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యాడు. అయ్యర్ డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ వ్యవహరించనున్నాడు.అదేవిధంగా దులీప్ ట్రోఫీ-2025కు దూరమైన బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు దేవ్‌దత్త్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డికి కూడా చోటు దక్కింది. నితీశ్ ఇంగ్లండ్ సిరీస్ మధ్యలోనే గాయం కారణంగా స్వదేశానికి వచ్చేశాడు.అతడు ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో అదరగొడుతున్న తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ నారయణ్ జగదీశన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఇదే టోర్నీలో సెంచరీతో మెరిసిన రుతురాజ్ గైక్వాడ్‌ను మాత్రం సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు.అతడితో పాటు మధ్యప్రదేశ్ ఆటగాడు, ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్‌ను కూడా సెలక్టర్లు ఎంపిక చేయలేదు. తద్వారా వీరిద్దరూ ఇండియా రెడ్ బాల్ క్రికెట్ సెటాప్‌లో లేనిట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ టూర్లో అరంగేట్రం చేసిన తమిళనాడు ఆటగాడు సాయిసుదర్శన్ సైతం ఈ జట్టులో ఉన్నాడు.ఫాస్ట్ బౌలర్లగా ప్రసిద్ద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఖాలీల్ అహ్మద్, యష్ ఠాకూర్లను ఎంపిక చేశారు. కాగా రెండో టెస్టుకు టీమిండియా స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ జట్టుతో చేరనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది.టెస్టు జట్టులోకి అయ్యర్ ఎంట్రీ?కాగా స్వదేశంలో వెస్టిండీస్ జరగనున్న టెస్టు సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేసే అవకాశముంది. ఇంగ్లండ్ టూర్‌కు, ఆసియాకప్-2025కు అయ్యర్‌ను ఎంపికచేయకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో అతడిని తిరిగి భారత టెస్టు జట్టులోకి తీసుకు వచ్చేందుకు సెలక్టర్లు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడికి భారత-ఎ జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఆస్ట్రేలియా-ఎ జట్టు రెండు టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు భారత్‌కు రానుంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సెప్టెంబర్-16 నుంచి సెప్టెంబర్-23 వరకు జరగనుంది. రెండు మ్యాచ్‌లు కూడా లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరగనుంది. అనంతరం ఆక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్-భారత్ టెస్టు సిరీస్ మొదలు కానుంది.భారత్-ఎ జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బదోని, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్,ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యష్ ఠాకూర్ -
BCCI: ఒక్కో మ్యాచ్‌కు రూ. 3 కోట్ల 50 లక్షలు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన (జెర్సీ) స్పాన్సర్షిప్ విలువను బీసీసీఐ మరింత పెంచింది. ఇటీవలే ‘డ్రీమ్ 11’ను తప్పించడంతో కొత్త స్పాన్సర్షిప్ వేటలో ఉన్న బోర్డు ఈసారి మరింత పెద్ద మొత్తాన్ని ఆశిస్తోంది. కొత్త విలువ ప్రకారం భారత్ ఆడే ద్వైపాక్షిక సిరీస్‌లో ఒక్కో మ్యాచ్‌కు స్పాన్సరర్ రూ. 3 కోట్ల 50 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.ఇక ఎక్కువ దేశాలు పాల్గొనే ఐసీసీ లేదా ఏసీసీ టోర్నీలో అయితే ఇది ఒక్కో మ్యాచ్‌కు రూ. 1 కోటీ 50 లక్షలుగా ఉంది. ‘డ్రీమ్ 11’ ఇప్పటి వరకు రూ. 3 కోట్ల 17 లక్షలు, రూ.1 కోటీ 12 లక్షలు చెల్లిస్తూ వచ్చింది. ఆసియా కప్ ముగిసిన తర్వాతే జెర్సీ స్పాన్సర్షిప్ ఒప్పందం ఖరారు కానుంది. ఇక బోర్డు ఆశించిన విధంగా జరిగితే ఏడాదికి సుమారు రూ. 400 కోట్లు బీసీసీఐ ఖాతాలో చేరతాయి.ఇదిలా ఉంటే.. స్పాన్సర్షిప్ కోసం బిడ్లను కోరుతూ మంగళవారం బోర్డు ప్రకటన ఇచ్చింది. దీనికి ఆఖరి తేదీ సెప్టెంబరు 16 కావడంతో జెర్సీ స్పాన్సర్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుంది. ఇదీ చదవండి: 27 ఏళ్ల తర్వాత... లండన్: ఆఖరిదాకా ఉత్కంఠ రేపిన రెండో వన్డేలోనూ దక్షిణాఫ్రికానే విజయం సాధించింది. తద్వారా వరుస విజయాలతో మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో ఇంగ్లండ్‌పై సిరీస్‌ను కైవసం చేసుకుంది. 1998 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవడం విశేషం. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో వన్డేలో సఫారీ జట్టు 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.ముందుగా దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మాథ్యూ బ్రిట్జ్కీ (77 బంతుల్లో 85; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), ట్రిస్టన్ స్టబ్స్ (62 బంతుల్లో 58; 2 ఫోర్లు, 1 సిక్స్), మార్క్రమ్ (64 బంతుల్లో 49; 6 ఫోర్లు, 1 సిక్స్), బ్రెవిస్ (20 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), కార్బిన్ బాష్ (32 నాటౌట్; 3 ఫోర్లు) సమష్టిగా రాణించారు.తన కెరీర్లో ఐదో వన్డే ఆడిన బ్రిట్జ్కీ వరుసగా నాలుగో అర్ధ సెంచరీ చేయడం విశేషం. న్యూజిలాండ్‌తో ఫిబ్రవరి 10న అరంగేట్రం వన్డేలో సెంచరీ (150) చేసిన బ్రిట్జ్కీ ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో 83, 57, 88, 85 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 4, ఆదిల్ రషీద్ 2 వికెట్లు తీశారు. తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ దాదాపు గెలుపుతీరం దాకా కష్టపడింది. చివరకు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 325 పరుగులకు పరిమితమైంది.తద్వారా విజయానికి కేవలం 5 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఆర్చర్ (14 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆఖరిదాకా జట్టును గెలిపించేందుకు విఫల ప్రయత్నం చేశాడు. అంతకుముందు రూట్ (72 బంతుల్లో 61; 8 ఫోర్లు), బట్లర్ (51 బంతుల్లో 61; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), బెథెల్ (40 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. బర్గర్ 3, కేశవ్ మహరాజ్ 2 వికెట్లు తీశారు. రేపు ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే జరుగుతుంది. చదవండి: చిన్ననాటి గురువుకు రూ. 80 లక్షల సాయం.. హార్దిక్, కృనాల్ మంచి మనసు -
ఫైనల్‌కు ముందు మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. కోటి ఆఫర్?
యూపీ టీ20 లీగ్-2025.. ఫైనల్ మ్యాచ్‌కు ముందు మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుంది. ఈ టోర్నీలోని లీగ్ స్టేజి మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేయడానికి బుక్కీలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ విషయం బీసీసీఐ యాంటీ కరప్షన్ విభాగం దృష్టికి వెళ్లింది. అనంతరం లక్నో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. టైమ్స్ నౌ రిపోర్ట్ ప్రకారం.. కాశీ రుద్రాస్ టీమ్ మేనేజర్ అర్జున్ చౌహాన్‌కు ‘vipss_nakrani’ అనే యూజర్ నుంచి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ మెసెజ్ వచ్చింది. అందులో తను బుకీని అని, మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే కోటి రూపాయలతో పాటు అదనంగా 50 లక్షల రూపాయల కమిషన్ ఇస్తానని రాసి ఉందంట. వెంటనే అర్జున్ ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేశాడు. ఆతర్వాత ఏసీయూ సభ్యలు బుకీ ఫోన్ నంబర్ పొందడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్‌ను కంటిన్యూ చేశారు. ఆటగాళ్లు తన సూచనలను పాటించాలని, మ్యాచ్‌ల సమయంలో తన సహచరులతో కలిసి మైదానంలో ఉంటానని కూడా బుకీ వెల్లడించాడు.ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలను, కాల్‌లను మరొక ఫోన్లో రికార్డు చేసి పోలీస్‌లకు అధారాలగా బీసీసీఐ ఏసీయూ అప్పగించింది. దీంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ విషయాన్ని లక్నో డీసీపీ ధ్రువీకరించారు. కాగా యూపీ టీ20 లీగ్ విషయానికి వస్తే.. శనివారం ఫైనల్ పోరులో ఎకానా స్టేడియం వేదికగా కాశీ రుద్ర, మీరట్ మావెరిక్స్ జట్లు తలపడనున్నాయి. -
కోహ్లి ఏమైనా పైనుంచి దిగి వచ్చాడా?
-
అతడికి అనుమతి ఎందుకు?.. అసలు బీసీసీఐ ఏం చేస్తోంది?
ఆసియా కప్-2025 టోర్నమెంట్, ఆ తర్వాత వరుస సిరీస్‌ల నేపథ్యంలో ఇప్పటికే భారత ఆటగాళ్లలో చాలా మంది ఫిట్నెస్ పరీక్షకు హాజరయ్యారు. బెంగళూరులో నిర్వహించిన టెస్టుల్లో వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), టెస్టు సారథి శుబ్‌మన్ గిల్, టీ20 జట్టు నాయకుడు సూర్యకుమార్ యాదవ్ పాసయ్యారు.వీరితో పాటు మహ్మద్ సిరాజ్, జితేశ్ శర్మ (Jitesh Sharma), ప్రసిద్ కృష్ణ, రుతురాజ్ గైక్వాడ్, అభినవ్ మనోహర్, రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, సంజూ శాంసన్, శివం దూబే, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, ముకేశ్ కుమార్, హార్దిక్ పాండ్యా (Hardik Pandya), ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్ తదితరులు ఫిట్నెస్ పరీక్ష పూర్తి చేసుకున్నట్లు సమాచారం.వారంతా రెండో దశలో..ఇక రెండో దశలో భాగంగా రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి తదితరులు ఈ నెలలో ఫిట్నెస్ పరీక్ష పూర్తిచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఆటగాళ్లంతా బెంగళూరులో ఫిట్నెస్ పరీక్షకు హాజరైతే.. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి మాత్రం లండన్‌లోనే ఉన్నాడు.లండన్‌లోనే కోహ్లి ఫిట్నెస్ టెస్టుఅక్కడే కోహ్లి ఫిట్నెస్ పరీక్షలో పాల్గొన్నట్లు సమాచారం. ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి కోహ్లి ముందుగానే అనుమతి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, టీమిండియా అభిమానులు మాత్రం దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘‘కోహ్లి భారత్‌లో కంటే లండన్‌లోనే ఎక్కువగా ఉంటాడు.తన కుటుంబమంతా అక్కడే ఉంటుంది. మ్యాచ్‌లు, ఐపీఎల్ ఉన్నపుడు మాత్రమే ఇండియాకు వస్తాడు. ఇప్పుడు ఫిట్నెస్ టెస్టు కూడా అక్కడేనా?.. అసలు బీసీసీఐ ఎందుకిలా చేస్తోంది?..అతడు ఏమైనా స్పెషలా? వేరేదేశంలో ఫిట్నెస్ టెస్టుకు ఎలా అనుమతినిస్తారు? మాకైతే ఇప్పుడు కోహ్లి ఇంగ్లండ్ క్రికెటర్ ఏమో అనే డౌట్ వస్తోంది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ, కోహ్లి తీరును ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా రీఎంట్రీకాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లి.. ఇటీవలే టెస్టుల నుంచి కూడా వైదొలిగాడు. ప్రస్తుతం వన్డే, ఐపీఎల్లో కొనసాగుతున్న ఈ దిగ్గజ బ్యాటర్.. తదుపరి ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇదిలా ఉంటే.. చివరగా ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టులు ఆడిన టీమిండియా.. తదుపరి ఆసియా కప్-2025 టోర్నీలో పాల్గొననుంది. సెప్టెంబరు 9-28 వరకు పొట్టి ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీకి యూఏఈ వేదిక.చదవండి: ధృవ్ జురెల్‌ను తప్పించిన సెలెక్టర్లు -
టీమిండియా స్పాన్సర్ షిప్ కోసం టెండర్లను ఆహ్వానించిన బీసీసీఐ
టీమిండియా జెర్సీ స్పాన్సర్షిప్ నుంచి ఫ్యాంటసీ గేమ్ ఫ్లాట్ ఫామ్ డ్రీమ్ 11 తప్పుకొన్న సంగతి తెలిసిందే. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు-2025కు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో డ్రీమ్ 11 ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆసియాకప్ టోర్నీలో ప్రధాన స్పాన్సర్షిప్ లేకుండానే భారత జట్టు ఆడనుంది. అయితే ఈ ఏడాది ఆక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్ సమయానికి మాత్రం టీమిండియాకు కొత్త స్పాన్సర్‌ను బీసీసీఐ తీసుకురానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం టీమిండియా స్పాన్పర్ షిప్ కోసం భారత క్రికెట్ బోర్డు టెండర్లను అహ్హనించింది.ఇందుకోసం ఆసక్తి ఉన్న కంపెనీలు సెప్టెంబర్ 16 లోపు తమ ధరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ డెడ్‌లైన్ విధించింది. బిడ్డింగ్‌లో పాల్గోనే కంపెనీలు ఐఈఓఐ కింద రూ. 5,90,000(నాన్ రిఫండ్బుల్) ధరఖాస్తు రుసుము చెల్లించాలి.అంతేకాకుండా ధరఖాస్తు చేసే కంపెనీల వార్షిక టర్నోవర్ కనిష్టంగా రూ.300 కోట్లు అయినా ఉండాలని నిబంధనను బీసీసీఐ విధించింది. వీటితో పాటు స్పాన్సర్షిప్ కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలకు పలు మార్గదర్శకాలను బోర్డు జారీ చేసింది.స్పాన్సర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలకు మార్గదర్శకాలు ఇవే..👉అథ్లెటిజర్, స్పోర్ట్స్‌వేర్ తయారీదారులు ధరఖాస్తు చేయకూడదు.👉బ్యాంకులు, ఆర్ధిక సేవలను అందించే సంస్థలు, బ్యాంకింగేతర ఆర్ధిక కంపెనీలకు అవకాశం లేదు.👉శీతల పానీయాలు తాయారు చేసే కంపెనీలకూ ఛాన్స్ లేదు.👉కంపెనీలు ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గాంబ్లింగ్‌తో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధం కలిగి ఉండకూడదు. ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లఘించకూడదు👉క్రిప్టో ట్రేడింగ్, క్రిప్టో ఎక్ఛేంజ్, క్రిప్టో టోకెన్స్‌కు సంబంధించిన వ్యాపార కార్యకలాపాల్లో భాగస్వామ్యం ఉండకూడదు.చదవండి: ఆసియాకప్‌లో లీడింగ్ వికెట్ టేకర్.. మూడేళ్లగా జట్టుకు దూరం -
ధోని ఫోన్ లిఫ్ట్ చేశాడా? నేను నమ్మలేకపోతున్నా: భారత మాజీ క్రికెటర్
భారత క్రికెట్ జట్టు మెంటార్‌గా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని మరోసారి నియమించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి.. ఇప్పటికే భారత క్రికెట్ బోర్డు ధోనితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కానీ ధోని ఇంకా తన అభిప్రాయాన్ని తెలియజేయలేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.కాగా ఈ జార్ఖండ్ డైనమేట్ టీ20 ప్రపంచకప్-2021లో అప్పటి హెడ్‌కోచ్ రవిశాస్త్రితో కలిసి భారత జట్టు మెంటార్‌గా ధోని పనిచేశాడు. అయితే మళ్లీ ఇప్పుడు అతడు అనుభవాన్ని ఉపయోగించుకోవాలని బీసీసీఐ భావిస్తుందంట. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనిని సంప్రదించడం చాలా కష్టమని, అతడు నిజంగా బీసీసీఐ ఫోన్ కాల్‌కు స్పందించాడా అని? ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా ధోనిపై చాలా రోజుల నుంచి తివారీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ధోని తనకు అన్యాయం చేశాడని, అతడి వల్లే తన అంతర్జాతీయ కెరీర్ ముగిసిపోయిందని పదేపదే తివారీ ఆరోపిస్తూ వస్తున్నాడు."ఆటగాడిగా, కెప్టెన్‌గా ధోనికి అపారమైన అనుభవం ఉంది. అటువంటి వ్యక్తి టీమిండియాకు మెంటార్‌గా వస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యువ ఆటగాళ్లను స్టార్లగా తీరిదిద్దడంలో అతడు కీలక పాత్ర పోషిస్తాడు. అయితే అతడికి నిజంగా బీసీసీఐ ఆఫర్ ఇచ్చిందో లేదో త్వరలోనే తెలుస్తోంది. కానీ అతడు బోర్డ్ ఫోన్ కాల్‌కు స్పందించాండంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే అతన్ని ఫోన్లో సంప్రదించడం కష్టం. మెసేజ్‌లకు కూడా ధోని రిప్లే ఇవ్వడం చాలా అరుదు. ఈ విషయం ఇప్పటికే చాలా మంది చెప్పారు. మనం పంపిన మెసేజ్‌ను కూడా అతడు చదువుతాడా లేదో కూడా తెలియదు. ఏదేమైనప్పటికి అతడు మెంటార్ వస్తే జట్టుకు మేలు జరుగుతందని నేను అనుకుంటున్నాను. ధోని, గౌతమ్ గంభీర్ జోడీ అద్బుతాలు చేయవచ్చు" అని ఎఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారీ పేర్కొన్నాడు. ఒకవేళ బీసీసీఐ ఆఫర్‌ను ధోని అంగీకరిస్తే టీ 20 ప్రపంచకప్-2026కు ముందే భారత జట్టు మెంటార్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశముంది.చదవండి: DT 2025: అంకిత్, యశ్ ధుల్ సెంచరీలు.. భారీ ఆధిక్యంలో నార్త్ జోన్ -
టీమిండియాకు గుడ్ న్యూస్.. జ్వరం నుంచి కోలుకున్న వైస్ కెప్టెన్
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వైరల్ ఫీవర్ కారణంగా దులీప్ ట్రోఫీ-2025కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ దేశవాళీ టోర్నీలో నార్త్ జోన్‌గా కెప్టెన్‌గా గిల్ వ్యవహరించాల్సి ఉండేది. కానీ టోర్నీ ఆరంభానికి ముందు గిల్ జ్వరం బారిన పడ్డాడు.దీంతో వైద్యుల సూచన మెరకు ఈ రెడ్‌బాల్ క్రికెట్ ఈవెంట్‌ను గిల్ వైదొలిగాడు. ఇక సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్‌పై గిల్ దృష్టిసారించాడు. ఈ క్రమంలో శుబ్‌మన్ శుక్రవారం(ఆగస్టు 29) బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరాడు.టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. గిల్ జ్వరం నుంచి కోలుకుని శిక్షణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా ఆసియాకప్‌కు ముందు ఆగస్టు 30 లేదా 31న కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలతో కలిసి గిల్ ఫిట్నెస్ పరీక్షలను ఎదుర్కొంటాడని వార్తలు వచ్చాయి. కానీ గిల్ మాదిరే రాహుల్ కూడా వైరల్ ఫీవర్ బారిన పడినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. దీంతో రోహిత్ ఫిట్నెస్ పరీక్షను సెప్టెంబర్ 15 వాయిదా వేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. గిల్ ఆసియాకప్‌లో ఆడేందుకు వెళ్లనుండడంతో ఈ ఫిట్నెస్ టెస్టులో రాహుల్, రోహిత్ మాత్రమే పాల్గోనున్నారు.ఆసియాకప్ కోసం టీమిండియా సెప్టెంబర్ 4న దుబాయ్‌కు బయలు దేరనుంది. అయితే భారత జట్టు వేర్వేరు బ్యాచ్‌లగా యూఏఈ గడ్డపై అడుగపెట్టనున్నట్లు సమాచారం. గిల్ బెంగళూరు నుంచి నేరుగా దుబాయ్‌కు వెళ్లనున్నాడు. కాగా భారత టీ20 జట్టులో చాలా మంది సభ్యులు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్‌లోనే ఉన్నారు. దుబాయ్‌కు చేరుకున్నాక వారం రోజుల పాటు ట్రైనింగ్ క్యాంపును టీమిండియా ఏర్పాటు చేయనుంది. ఇక ఖండాంతర టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. మెన్ ఇన్ బ్లూ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనుండగా.. అతడికి డిప్యూటీగా గిల్ ఎంపికయ్యాడు.ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్చదవండి: అదొక అత్యంత వరెస్ట్ టెస్ట్.. ఆటగాళ్లకు కఠిన సవాల్: డివిలియర్స్ -
అదొక అత్యంత వరెస్ట్ టెస్ట్.. ఆటగాళ్లకు కఠిన సవాల్: డివిలియర్స్
టీమిండియా ఆటగాళ్ల ఫిట్నెస్ లెవల్స్‌ను నిర్ధారించేందుకు బీసీసీఐ ఇటీవలే బ్రాంకో టెస్టును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో కొత్తగా వచ్చిన స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లి రాక్స్ ఈ పరీక్షను భారత క్రికెట్‌కు పరిచయం చేశాడు.టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సెప్టెంబర్ 13న బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఈ పరీక్షకు హాజరకానున్నాడు. అతడికి యోయో టెస్టుతో పాటు బ్రాంకో పరీక్ష కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫిట్నెస్ టెస్టుపై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లకు ఈ ఫిట్నెస్ పరీక్ష అంతమంచిది కాదని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు"తొలుత ఈ టెస్టు గురించి నాకు చెప్పినప్పుడు ఆర్ధం కాలేదు. ‘బ్రోంకో టెస్ట్' అంటే ఏంటి అని అడిగాను. వారు నాకు మొత్తం వివరించినప్పుడు ఈ టెస్టు ఎంటో ఆర్దమైంది. ఎందుకంటే నేను 16 ఏళ్ల వయసు నుంచి ఇది చేస్తున్నాను. దక్షిణాఫ్రికాలో మేము దీనిని స్ప్రింట్ రిపీటబిలిటీ టెస్ట్ అని పిలుస్తాము.ఇది మీరు పాల్గోనే అత్యంత చెత్త ఫిట్నెస్ టెస్ట్‌లలో ఒకటి. ప్రిటోరియా యూనివర్సిటీ, సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో కూడా ఈ టెస్టులో మేము పాల్గోన్నాము. ముఖ్యంగా శీతాకాలపు ఉదయాల్లో మాకు ఈ టెస్టులు నిర్వహించేవారు. ఆ సమయంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. సముద్ర మట్టానికి 1,500 మీటర్ల ఎత్తులో ఉండటంతో ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యేది. ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉండడంతో మా ఊపిరితిత్తులు కాలిపోయేలా అన్పించేది. బీసీసీఐ తమ ఆటగాళ్ల ట్రైనింగ్‌లో బ్రోంకో టెస్ట్‌ను చేర్చడం నిజంగా గొప్ప విషయం. ఆటగాళ్ల ఫిట్నెస్ అంచనా వేసేందుకు ఈ టెస్టు సరైనది. కానీ ప్లేయర్లకు ఈ టెస్టు ఒక ఛాలెంజ్‌లా ఉంటుంది అని తన యూట్యూబ్ ఛానల్లో డివిలియర్స్ పేర్కొన్నాడు.బ్రాంకో టెస్ట్ అంటే ఏంటి?ఈ టెస్టులో భాగంగా ఆటగాడు తొలుత 20 మీటర్ల షటిల్ రన్ చేయాలి. తర్వాత దీనిని 40, 60 మీటర్లకు పెంచుతారు. ఈ మూడూ కలిపి ఒక సెట్ కాగా.. మొత్తంగా ఐదు సెట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే.. ఓవరాల్‌గా 1200 మీటర్ల దూరం విరామం లేకుండా ఆటగాడు వేగంగా పరుగుతీయాలి. ఇందుకు కేవలం ఆరు నిమిషాల సమయం ఉంటుంది.చదవండి: ZIM vs SL: శ్రీలంకను వణికించిన జింబాబ్వే.. ఉత్కంఠ పోరులో ఓటమి -
మరణించిన భారత క్రికెటర్ల భార్యలకు ఆర్దిక చేయూత
భారత క్రికెటర్స్ అసోసియేషన్ (ICA) కీలక నిర్ణయం తీసుకుంది. మరణించిన భారత క్రికెటర్ల భార్యలకు రూ. లక్ష గ్రాంట్‌ను ప్రకటించింది. ఈ మొత్తాన్ని అర్హులైన వితంతువులకు ఒక్కసారిగా చెల్లిస్తారు. ఈ స్కీమ్ తొలి దఫాలో దాదాపు 50 మందికి లబ్ది చేకూరే అవకాశం ఉంది. మాజీ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచే ప్రక్రియలో భాగంగా ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టినట్లు ICA తెలిపింది.ఈ పథకానికి ప్రస్తుతం ఆమల్లో ఉన్న మిగతా పథకాలతో సంబంధం లేదు. అవి కొనసాగుతుండగానే, ఈ కొత్త పథకం అమల్లోకి వస్తుంది. ICA ఇప్పటికే మరణించిన భారత మాజీ టెస్ట్ క్రికెటర్ల భార్యలకు నెలసరి పెన్షన్ ఇస్తుంది. కొత్త పథకానికి ICA వార్షిక సంవత్సర రెండో బోర్డు మీటింగ్‌లో ఆమోదం లభించింది.కాగా, మాజీ క్రికెటర్ల కుటుంబాలకు అండంగా నిలవడమే ధ్యేయంగా ICA ఏర్పాటు చేయబడింది. దీన్ని 2019లో స్థాపించారు. ICAలో 1750కు పైగా భారత మాజీ క్రికెటర్లు సభ్యులుగా ఉన్నారు. ICA ఇప్పటికే 60 దాటి, పెన్షన్ లభించని మాజీ క్రికెటర్లకు సీనియర్ మెంబర్ రికగ్నిషన్ ప్రోగ్రామ్ కింద రూ. లక్ష ఆర్దిక సాయం చేస్తుంది. అలాగే సభ్యుల కుటుంబాలకు రూ. 2.5 లక్షల గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. వీటికి అదనంగా ప్రతి సభ్యుడికి ఏడాదికోసారి కంప్లీట్ బాడీ చెకప్ ప్రోగ్రామ్‌ను కూడా చేపడుతుంది. -
ODIs: ‘కోహ్లిని తప్పించలేరు.. రోహిత్ శర్మపై వేటు వేసేందుకు కుట్ర?’
టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి (Manoj Tiwary) సంచలన వ్యాఖ్యలు చేశాడు. వన్డే కెప్టెన్ రోహిత్ శర్మను పక్కనపెట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)లో అంతర్గత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించాడు. వన్డే ప్రపంచకప్-2027 నాటికి రోహిత్ తనకు తానుగా తప్పుకొనేలా చేయాలని చూస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.కొత్తగా బ్రోంకో టెస్టు అయితే, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) దగ్గర మాత్రం వారి పప్పులు ఉడకవని మనోజ్ తివారి పేర్కొన్నాడు. అసలు విషయం ఏమిటంటే.. బీసీసీఐ ఆటగాళ్ల ఫిట్నెస్ పరీక్షకు కొత్తగా బ్రోంకో టెస్టును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రగ్బీ, ఫుట్‌బాల్ ఆటగాళ్లకు నిర్వహించే బ్రోంకో టెస్టు ద్వారా టీమిండియా క్రికెటర్ల ఫిట్నెస్ను పరీక్షించాలని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (CoE) నిర్ణయించింది.ఇందులో భాగంగా ఆటగాడు తొలుత 20 మీటర్ల షటిల్ రన్ చేయాలి. తర్వాత దీనిని 40, 60 మీటర్లకు పెంచుతారు. ఈ మూడూ కలిపి ఒక సెట్ కాగా.. మొత్తంగా ఐదు సెట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే.. ఓవరాల్‌గా 1200 మీటర్ల దూరం విరామం లేకుండా ఆటగాడు వేగంగా పరుగుతీయాలి. ఇందుకు కేవలం ఆరు నిమిషాల సమయం ఉంటుంది.కోహ్లిని తప్పించలేరు.. రోహిత్‌పై వేటు వేసేందుకు కుట్రఈ నేపథ్యంలో బ్రోంకో టెస్టు గురించి మనోజ్ తివారి మాట్లాడుతూ.. ‘‘వన్డే వరల్డ్‌కప్-2027 ప్రణాళికల నుంచి విరాట్ కోహ్లిని తప్పించడం అంత తేలికేమీ కాదు. అయితే, రోహిత్ శర్మపై విషయంలో మాత్రం వారు సఫలమయ్యే అవకాశం ఉంది. భారత క్రికెట్లో ఏం జరుగుతుందో నేను గత కొన్నాళ్లుగా నిశితంగా పరిశీలిస్తున్నా.కొన్ని రోజుల క్రితం బ్రోంకో టెస్టు ప్రవేశపెట్టారు. రోహిత్ శర్మ లాంటి వాళ్లను బయటకు పంపేందుకే ఇలాంటి కఠినమైన ఫిట్నెస్ పరీక్షను తీసుకువచ్చారు. అన్నిటికంటే ఇదే టఫెస్ట్ ఫిట్నెస్ టెస్టు. అయినా.. ఇప్పుడే ఇది ఎందుకు ప్రవేశపెట్టారు? హెడ్‌కోచ్‌గా తొలి టెస్టు సిరీస్‌కు సన్నద్ధమైనపుడే దీనిని తీసుకురావాల్సింది.ఈ ప్రశ్నలకు నాకైతే బదులు తెలియదు. అయితే, నిశితంగా పరిశీలిస్తే మాత్రం రోహిత్ శర్మ ఈ టెస్టు పాస్ కావడం కష్టం. అతడు ఫిట్‌నెస్‌పై అంతగా దృష్టి పెట్టడు. బ్రోంకో టెస్టు ద్వారా అతడిని ఆపేయాలనే ఉద్ధేశంతో ఉన్నారని నాకు సందేహం’’ అంటూ మనోజ్ తివారి పరోక్షంగా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.చదవండి: ఒక్క సిక్స్‌తో అంతా తలకిందులయ్యేది.. అప్పుడు నేను..: సిరాజ్ -
BCCI:‘డ్రీమ్ 11’తో కటీఫ్!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్షిప్ నుంచి ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ ‘డ్రీమ్ 11’ను తప్పించారు. డ్రీమ్ ఎలెవన్‌తో ఒప్పందాన్ని అధికారికంగా రద్దు చేసుకుంటున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించారు. మూడేళ్ల కాలానికి 2023లో రూ.358 కోట్లతో డ్రీమ్ 11 ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్’ ప్రకారం ఇకపై ‘డ్రీమ్ 11’ తన కార్యకలాపాలు కొనసాగించే అవకాశం లేదు. దాంతో ఆరి్థకపరంగా ఆ కంపెనీకి భారం కావడంతో పాటు ప్రభుత్వం నిషేధించిన సంస్థతో ఒప్పందాన్ని కొనసాగించరాదని బోర్డు కూడా నిర్ణయించింది. ‘మాకు ఈ విషయంలో చాలా స్పష్టత ఉంది. ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం డ్రీమ్ 11 లేదా అలాంటి ఏ గేమింగ్ కంపెనీతోనైనా బీసీసీఐ ఒప్పందాన్ని కొనసాగించదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఒప్పందం రద్దు చేయాల్సిందే. ప్రధాన స్పాన్సర్‌గా మరో కొత్త కంపెనీ కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రక్రియ ఇంకా ఆరంభ దశలోనే ఉంది’ అని సైకియా వెల్లడించారు. ‘డ్రీమ్ 11తో ఒప్పందం 2026 వరకు ఉంది. అయితే తాజా పరిణామాల్లో డ్రీమ్ 11 వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు కాబట్టి ఉల్లంఘన అనే మాటే తలెత్తదని సైకియా చెప్పారు. ‘ప్రధాన స్పాన్సర్ పరిస్థితిని మేం అర్థం చేసుకోగలం. చెల్లింపుల ఉల్లంఘనలాంటివేమీ వర్తించవు కాబట్టి వారిపై ఎలాంటి జరిమానా కూడా విధించడం లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం కాబట్టి అందరూ పాటించాల్సిందే. వారి వ్యాపారం దెబ్బ తినడమే కాదు, బీసీసీఐ లాభాలపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ స్పాన్సర్లలో ఒకటిగా ఉన్న ‘మై సర్కిల్ 11’తో కూడా ఒప్పందం ముగియడం ఖాయమైంది. ‘మై సర్కిల్ 11’ ఏడాదికి రూ. 125 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ. 625 కోట్లతో బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆసియా కప్‌లోగా సాధ్యమేనా! ‘డ్రీమ్ 11’ తప్పుకోవడంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ వేటలో పడింది. ఆసియా కప్‌కు ముందే ఈ ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నా...అది సాధ్యం కాకపోవచ్చు. సెపె్టంబర్ 9 నుంచే టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కొత్త స్పాన్సర్ కోసం ప్రకటన ఇచ్చి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పట్టవచ్చు. కాబట్టి ఆసియా కప్‌లో టీమిండియా ప్రధాన స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇది మరింత ఆలస్యం అయితే వన్డే వరల్డ్ కప్‌లో మహిళల జట్టు కూడా స్పాన్సర్ లేకుండానే ఆడుతుంది. భారత జట్టుతో జత కట్టేందుకు జపాన్‌కు చెందిన ప్రఖ్యాత మోటార్ కంపెనీ టయోటా ముందుకు వస్తున్నట్లు సమాచారం. టయోటా ఇప్పటికే ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌కు ప్రధాన స్పాన్సర్‌గా ఉండటంతో పాటు ఆ్రస్టేలియా టీమ్‌తో కూడా సహ స్పాన్సర్లలో ఒకటిగా కొనసాగుతోంది. ఫైనాన్షియల్ సర్విస్ కంపెనీ అయిన ‘ఫిన్‌టెక్’ కూడా ఆసక్తి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో పలు కంపెనీల వద్ద పోటీ ఉండవచ్చు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. బోర్డు కూడా గత ఒప్పందంకంటే ఎక్కువ మొత్తాన్ని ఆశిస్తోంది. నిజానికి ‘డ్రీమ్ 11’ లోగోతో కూడిన జెర్సీలతో భారత టీమ్ కిట్ సిద్ధంగా ఉంది. అయితే వీటిని వేసుకోరాదని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించింది. -
టీమిండియా జెర్సీ కొత్త స్పాన్సర్‌గా టొయోటా..?
ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తమ జట్లకు జెర్సీ స్పాన్సర్‌గా ఉన్న ప్రధాన గేమింగ్ ప్లాట్‌ఫాం డ్రీమ్11తో(Dream11) ఒప్పందాన్ని ఉన్నపళంగా రద్దు చేసుకుంది.దీంతో ప్రస్తుతానికి భారత క్రికెట్ జట్ల జెర్సీలకు అధికారిక స్పాన్సర్ లేకుండా పోయారు. త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో కూడా టీమిండియా జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగవచ్చు. ఈలోపు కొత్త జెర్సీ స్పాన్సర్ దొరికితే వారి లోగోతో ఉన్న జెర్సీలతో టీమిండియా ఆటగాళ్లు ఆసియా కప్ బరిలోకి దిగుతారు.డ్రీమ్11 స్థానంలో టీమిండియా జెర్సీని స్పాన్సర్ చేసేందుకు టొయోటా మోటార్ కార్పొరేషన్ ఆసక్తి చూపుతోంది. టొయోటాతో పాటు ఓ ఫిన్‌టెక్ స్టార్టప్, టాటా గ్రూప్, రిలయన్స్, అదానీ గ్రూప్ వంటి సంస్థలు కూడా బీసీసీఐకి తమ ఆసక్తిని తెలిపాయని సమాచారం. జెర్సీ స్పాన్సర్‌షిప్‌ను అధికారిక టెండర్ ప్రక్రియ ద్వారా నిర్ణయిస్తారు. ఇది ఇంకా ప్రారంభం కాలేదు. బీసీసీఐ త్వరలో కొత్త స్పాన్సర్ కోసం టెండర్లను ఆహ్వానించనుంది.కాగా, 2023లో రూ. 358 కోట్లతో మూడేళ్ల కాలానికి బీసీసీఐతో డ్రీమ్11 ఒప్పందం కుదుర్చుకుంది. ఎడ్-టెక్ దిగ్గజం బైజూస్ స్థానాన్ని డ్రీమ్11 భర్తీ చేసింది. తాజాగా భారత ప్రభుత్వ నిర్ణయంతో డ్రీమ్11-బీసీసీఐ అగ్రిమెంట్ మధ్యలోనే క్యాన్సిల్ అయ్యింది. -
'డ్రీమ్ 11తో బంధం ముగిసింది'.. బీసీసీఐ అధికారిక ప్రకటన
భారత క్రికెట్ జట్టుకు జెర్సీ స్పాన్సర్‌గా ఉన్న ఫ్యాంటసీ గేమ్ ఫ్లాట్ ఫామ్ డ్రీమ్ 11(Dream11)తో బీసీసీఐ ఒప్పందం రద్దు చేసుకుంది. 'ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు-2025 పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ధ్రువీకరించారు. దీంతో సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో టీమిండియా స్పాన్సర్ లేకుండానే ఆడనుంది. కాగా ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్లును ఆగస్టు 20న లోక్‌సభ, 21న రాజ్యసభ ఆమోదించింది.ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో ఈ బిల్ ఇప్పుడు చట్టంగా మారింది. ఫలితంగా భారత జట్టుకు జెర్సీ స్పాన్పర్ లేకుండా పోయింది. కొత్త స్పాన్సర్స్ కోసం బీసీసీఐ త్వరలోనే టెండర్లను ఆహ్హానించనున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది."ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు- 2025 ఆమోదించబడిన తర్వాత బీసీసీఐ-డ్రీమ్ 11 మధ్య సంబంధాలను నిలిపివేస్తున్నాము. భవిష్యత్తులోనూ ఇలాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోమని" దేవజిత్ సైకియా న్యూస్ ఏజెన్సీ ఎఎన్ఐతో పేర్కొన్నారు. 2023లో రూ. 358 కోట్లతో మూడేళ్ల కాలానికి బీసీసీఐతో ‘డ్రీమ్ 11’ ఒప్పందం కుదుర్చుకుంది. ఎడ్-టెక్ దిగ్గజం బైజూస్‌ను ‘డ్రీమ్ 11’ భర్తీ చేసింది. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయంతో డ్రీమ్ 11 అగ్రిమెంట్ మధ్యలోనే క్యాన్సిల్ అయింది.ఇప్పుడు డ్రీమ్ 11 మధ్యలోనే నిష్క్రమించినప్పటి.. ఈ సంస్థపై భారత క్రికెట్ మండలి ఎలాంటి జరిమానా విధించడం లేదట. ఒప్పందం ప్రకారం చట్టపరమైన కారణాలతో మధ్యలో స్పాన్సర్‌షిప్‌ను వదిలేసినా.. ఎలాంటి జరిమానా పడకుండా నిబంధన ఉన్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయింది. -
సెలక్షన్ కమిటీలో మార్పులు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ సీనియర్ సెలక్షన్ కమిటీలో త్వరలో మార్పులు జరిగే అవకాశం ఉంది. అజిత్ అగార్కర్ చైర్మన్‌గా ఉన్న ఈ బృందంలో ఐదు జోన్ల నుంచి ఐదుగురు సెలక్టర్లు ఉన్నారు. టీమిండియా సెలక్టర్ పదవి కోసం బీసీసీఐ తాజాగా దరఖాస్తులు కోరింది. చీఫ్ సెలక్టర్ అగార్కర్ కాంట్రాక్ట్ 2026 టి20 వరల్డ్ కప్ వరకు ఉండగా, అజయ్ రాత్రా గత అక్టోబర్‌లోనే ఇందులోకి వచ్చాడు. కాబట్టి మిగిలిన ముగ్గురు శివ్‌సుందర్ దాస్ (సెంట్రల్ జోన్), సుబ్రతో బెనర్జీ (ఈస్ట్), ఎస్. శరత్ (సౌత్‌జోన్)లలో ఇద్దరు తప్పుకోనున్నారు. వీరిలో ఏ ఇద్దరు అనేది స్పష్టంగా తెలియికపోయినా... ఎస్.శరత్‌ను గతంలో అతను సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుత జూనియర్ కమిటీ చైర్మన్ తిలక్ నాయుడు పనితీరుపై బోర్డు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. సీనియర్ కమిటీ నుంచి శరత్ తప్పుకుంటే సౌత్‌జోన్ నుంచి ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్, హైదరాబాద్‌కు చెందిన ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తిగా ఉన్నాడు. సెంట్రల్ జోన్ కోటాలో సెలక్టర్ పదవిని మాజీ పేసర్ ఆర్పీ సింగ్ కూడా ఆశిస్తున్నాడు. సెలక్టర్ ఎంపిక కోసం సెపె్టంబర్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలంటూ బోర్డు గడువు విధించింది. నిబంధనల ప్రకారం ఐదేళ్ల క్రితం రిటైర్ అయినవాళ్లు మాత్రమే దరఖాస్తు చేయాలి. కనీసం 7 టెస్టులు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు...లేదంటే 10 వన్డేలు లేదా 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. మరోవైపు సీనియర్ మహిళల సెలక్షన్ కమిటీలో కూడా మార్పులు ఖాయమయ్యాయి. వన్డే వరల్డ్ కప్‌కు జట్టును ఎంపిక చేయడంతో ఈ కమిటీ పదవీకాలం ముగిసింది. నలుగురు సభ్యుల ఈ బృందంలో నీతూ డేవిడ్, ఆర్తి వైద్య, రేణు మార్గరెట్ తప్పుకోవడం ఖాయం కాగా... రెండేళ్ల క్రితమే కమిటీలోకి వచ్చిన శ్యామ షా మాత్రం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. -
పాపం హార్దిక్ పాండ్యా!.. బీసీసీఐ ఉపాధ్యక్షుడి కామెంట్స్ వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన ఆట తీరుతో హిట్‌మ్యాన్ కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన రోహిత్.. టీ20లలోనూ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే.ఇక ఐపీఎల్ (IPL)లోనూ ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి.. జట్టును ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత రోహిత్‌కు ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ ఫీట్ నమోదు చేసిన మొదటి సారథి కూడా ఇతడే!.. అయితే, గతేడాది ముంబై ఇండియన్స్ ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది.రోహిత్‌పై వేటు.. పాండ్యాకు పగ్గాలురోహిత్ను తప్పించి.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను కెప్టెన్‌గా నియమించింది. అయితే, హిట్‌మ్యాన్ అభిమానులు ఈ విషయాన్ని అంత తేలికగా జీర్ణం చేసుకోలేకపోయారు. రోహిత్‌ను పక్కనపెట్టడాన్ని విమర్శిస్తూ.. ముంబై ఇండియన్స్‌ను తప్పుబట్టడంతో పాటు హార్దిక్‌ను సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.పాపం హార్దిక్.. చేదు అనుభవంఅంతేకాదు.. ముంబై ఇండియన్స్ సొంత మైదానం వాంఖడేలోనూ హార్దిక్ పాండ్యాపై నేరుగానే తిట్ల వర్షం కురిపించారు. అతడిని హేళన చేస్తూ కించపరిచేవిధంగా వ్యవహరించారు. అయితే, హార్దిక్ మాత్రం ఇందుకు కౌంటర్ ఇచ్చేందుకు బదులు.. ఆటపై మరింతగా శ్రద్ధ పెట్టాడు.కానీ ముంబై ఇండియన్స్‌ను విజయవంతంగా ముందుకు నడపలేకపోయాడు. హార్దిక్ సారథ్యంలో 2024లో ఆ జట్టు మరీ చెత్త ప్రదర్శనతో పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. అయితే, ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించాడు.వరల్డ్‌కప్ గెలిచిన వీరుడురోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత మరోసారి రోహిత్ సారథ్యంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను టీమిండియా సొంతం చేసుకోవడంలోనూ పాలుపంచుకున్నాడు.రోహిత్ శర్మ ఫ్యాన్స్ అలా చేశారుఅయితే, 2024 నాటి ఐపీఎల్లో వాంఖడే వేదికగా హార్దిక్ పాండ్యా ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాజాగా స్పందించాడు. యూపీటీ20 యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘అలాంటి సంఘటనలు జరిగినపుడు బీసీసీఐలోని వ్యక్తులు సదరు ఆటగాళ్లతో మాట్లాడతారు.వారికి ధైర్యం చెబుతారు. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచిస్తారు. నిజానికి హార్దిక్ విషయంలో రోహిత్ శర్మ ఫ్యాన్స్ అలా చేశారు. తమ అభిమాన ఆటగాడి స్థానంలో అతడు కెప్టెన్‌గా రావడాన్ని సహించలేకపోయారు.హార్దిక్ పరిణతితో వ్యవహరించాడురోహిత్ వారినేమీ అతడిపైకి ఉసిగొల్పలేదు. అంతేకాదు.. హార్దిక్‌కు కూడా ఇలా జరుగవచ్చని ముందు నుంచే అవగాహన ఉంది. ఏదేమైనా ఆ పరిస్థితుల్లో హార్దిక్ పరిణతితో వ్యవహరించాడు. ఆ ప్రభావం తనమీద పడకుండా చూసుకున్నాడు.భావోద్వేగాల్లో కూరుకుపోకుండా.. ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకున్నాడు. ఒక్కసారి ఆటగాళ్లు తిరిగి గొప్పగా రాణిస్తే తిట్టిన వారే.. ప్రశంసించడం మొదలుపెడతారు’’ అని రాజీవ్ శుక్లా చెప్పుకొచ్చాడు.చదవండి: Asia Cup 2025: అదొక వింత నిర్ణయం.. కెప్టెన్ అయ్యే ప్లేయర్‌ను జట్టు నుంచి తీసేస్తారా? -
రోహిత్, విరాట్ కోహ్లి రిటైర్మెంట్!? .. బీసీసీఐ ఉపాధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఆస్ట్రేలియా టూర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీ20లు, టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న వీరిద్దరూ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత రో-కో ద్వయం ఇప్పటివరకు భారత తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే వన్డే ప్రపంచకప్-2027 దృష్ట్యా వీరిద్దరి స్ధానాల్లో యువ ఆటగాళ్లను బీసీసీఐ సిద్దం చేయనుందని, అక్టోబర్‌లో ఆసీస్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డేల సిరీసే ఆఖరిదని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సీనియర్ ద్వయం రిటైర్మెంట్ వార్తలపై బీసీసీఐ (BCCI ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు. అవన్నీ వట్టి రూమర్సే అని అతడు కొట్టిపారేశారు. రోహిత్, కోహ్లి ఇద్దరూ వైట్ బాల్ క్రికెట్లోకి తిరిగొచ్చేందుకు తమ ట్రైనింగ్‌ను తిరిగి ప్రారంభించారు. కాగా రాజీవ్ శుక్లా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో శుక్లాను సచిన్ టెండూల్కర్‌లాగానే రోహిత్, కోహ్లిలకు ప్రత్యేకంగా ఫేర్వెల్ నిర్వహిస్తారా ? అని హోస్ట్ ప్రశ్నించాడు."రోహిత్, కోహ్లి ఇంకా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కాలేదు. వారిద్దరూ ఇంకా వన్డేలు ఆడుతున్నారు. వారు ప్రస్తుతం కేవలం రెండు ఫార్మాట్ల నుంచి మాత్రమే తప్పుకొన్నారు. మరో ఫార్మాట్లో ఆడుతున్నప్పుడు మీరెందుకు వారి ఫేర్వెల్ గురుంచి మాట్లాడుతున్నారు? వారి రిటైర్మెంట్ గురించి మీరంతా ఎందుకు ఆందోళన చెందుతున్నారు? బీసీసీఐకి ఒక పాలసీ ఉంటుంది. బీసీసీఐ ఎవరిని కూడా రిటైర్మెంట్ ఇవ్వమని అడగదు. వారే సొంతంగా తమ నిర్ణయాలు తీసుకోవాలి. ప్లేయర్ తీసుకునే నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము. ఆటగాళ్లు విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో మాకు తెలుసు. కానీ ఇదంతా ఇప్పుడు అనవసరం.విరాట్ కోహ్లి చాలా ఫిట్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ కూడా బాగా ఆడుతున్నాడు. కాబట్టి వారి ఫేర్వెల్ గురుంచి ఆలోచిండం ఆపయేండి" అని శుక్లా పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఆక్టోబర్‌లో భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది.చదవండి: Asia Cup 2025: 'ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే'.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం -
‘డ్రీమ్’ బంధం ముగిసినట్లే!
న్యూఢిల్లీ: ‘సెబీ’ నిబంధనలు ఉల్లంఘించిన సహారా గ్రూప్, కాంపిటీషన్ కమిషన్ విచారణను ఎదుర్కొన్న స్టార్ ఇండియా, ఆర్థిక సమస్యలతో ఒప్పో, చెల్లింపులు చేయలేక బాకీపడ్డ బైజూస్... భారత క్రికెట్ జట్టు గత నాలుగు ప్రధాన స్పాన్సర్లు ఏదో ఒక వివాదం లేదా సమస్యతో సహవాసం చేయడం బీసీసీఐకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ జాబితాలో ‘డ్రీమ్ 11’ కూడా చేరింది. ఇందులో నేరుగా కంపెనీ పాత్ర లేకపోయినా... ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంతో పరిస్థితి మారిపోయింది. ఇకపై ‘డ్రీమ్ 11’ భారత టీమ్ స్పాన్సర్‌గా కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. ఆన్లైన్ ఫాంటసీ స్పోర్ట్స్, గ్యాంబ్లింగ్ వేదికలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇదే కేటగిరీలో వచ్చే ‘డ్రీమ్ 11’కు దీని కారణంగా ఆర్థిక పరంగా గట్టి దెబ్బ తగలనుంది. 2023లో రూ. 358 కోట్లతో మూడేళ్ల కాలానికి బీసీసీఐతో ‘డ్రీమ్ 11’ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్ 2026 మార్చి వరకు ఉంది. అయితే ఆసియా కప్‌కు ముందే స్పాన్సర్షిప్ ఒప్పందం రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ‘ఫలానా సంస్థతో ఒప్పందానికి అనుమతి లేదంటే మేం ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్లం. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతీ పాలసీ, నిబంధనలను బీసీసీఐ పాటిస్తుంది’ అని ఆయన చెప్పారు. ఈ స్పాన్సర్షి-ప్‌కు సంబంధించి త్వరలోనే మరింత స్పష్టత రావచ్చు. తక్కువ సమయంలో బోర్డు మళ్లీ కొత్త స్పాన్సర్‌తో ఒప్పందం కుదుర్చుకుంటుందా అనేది ఆసక్తికరం. మరోవైపు డ్రీమ్ 11 శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. ‘డబ్బులు చెల్లించి ఆడే పోటీలన్నింటినీ మేం నిలిపివేశాం. ఉచితంగా ఆడుకునే ఆన్లైన్ సోషల్ గేమ్‌లుగా వాటిని మార్చేశాం. ఇన్నేళ్లు మేం నిబంధనల ప్రకారమే పని చేశాం. భారత ప్రభుత్వ చట్టాలను మేం గౌరవిస్తే. ఇకపై మా ఇతర సంస్థలు ఫ్యాన్ కోడ్, డ్రీమ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా క్రీడలతో అనుబంధాన్ని కొనసాగిస్తాం’ అని పేర్కొంది. -
టీమిండియా సెలెక్టర్‌గా ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్..
బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కకర్ పదవీ కాలాన్ని పొడిగించిన బీసీసీఐ.. సౌత్‌జోన్ సెలక్టర్ శ్రీధరన్ శరత్‌తో పాటు మరొకరిపై వేటు వేసేందుకు సిద్దమైంది. ఈ క్రమంలోనే జాతీయ సెలెక్టర్ పదవులకు భారత క్రికెట్ బోర్డు దరఖాస్తులను ఆహ్వానించింది. కాగా ప్రస్తుత సెలక్షన్ కమిటీలో అగార్కర్‌తో పాటు ఎస్ఎస్ దాస్, సుబ్రతో బెనర్జీ, అజయ్ రాత్రా, ఎస్ శరత్ ఉన్నారు.సెలక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా..టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా సౌత్ జోన్ నుంచి జాతీయ సెలెక్టర్ అయ్యే అవకాశముందని టైమ్స్ ఆఫ్ ఇండియా తమ రిపోర్ట్‌లో పేర్కొంది. సెలెక్టర్‌గా దాదాపు నాలుగేళ్లు పూర్తి చేసుకున్న ఎస్. శరత్ స్థానంలో ఓజా ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. అయితే శరత్ మరోసారి జూనియర్ సెలక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రజ్ఞాన్ ఓజా 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20ల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో ప్రజ్ఞాన్ ఐపీఎల్లో కూడా ముంబై ఇండియన్స్, డక్కన్ ఛార్జర్స్ తరపున ఆడాడునేషనల్ సెలెక్టర్ ధరఖాస్తుకు ఆర్హతలు ఇవే..టీమిండియా సెలక్టర్ పదవికి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 7 టెస్టులు లేదా 10 వన్డేలు లేదా కనీసం 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాలి. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కనీసం ఐదేళ్లు దాటి ఉండాలి. బీసీసీఐ ఏ క్రికెట్ కమిటీలోనూ 5 సంవత్సరాల పాటు సభ్యుడిగా పనిచేసి ఉండకూడదు. కాగా అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్‌ను వచ్చే ఏడాది జూన్ వరకు బీసీసీఐ పొడిగించింది. అతడి పదవీకాలంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2024, ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. అదేవిధంగా వన్డే ప్రపంచకప్-2023 రన్నరప్‌గా కూడా మెన్ ఇన్ బ్లూ నిలిచింది. ఈ క్రమంలోనే అజిత్ కాంట్రాక్ట్‌ను పొడిగించేందుకు బీసీసీఐ మొగ్గు చూపింది.చదవండి: నా బెస్ట్ కెప్టెన్ అతడే.. ధోనికి కూడా అంత సులువుగా ఏదీ రాలేదు: ద్రవిడ్ -
టీమిండియా వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..? బీసీసీఐ రియాక్షన్ ఇదే?
టీమిండియా తదుపరి వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను నియమించేందుకు బీసీసీఐ ఆసక్తి ఉందని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ వారుసుడిగా అయ్యర్ భారత జట్టు వన్డే పగ్గాలను చేపట్టనున్నాడనని రెండు రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది.అయ్యర్‌కు ఆసియాకప్ జట్టులో చోటు దక్కని అనంతరం ఈ విషయం బయటకు వచ్చింది. అయితే తాజాగా ఈ వార్తలపై భారత క్రికెట్ బోర్డు స్పందించింది. అవన్నీ వట్టి రూమర్సే అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కొట్టిపారేశారు. వన్డే కెప్టెన్సీకి సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని నేనూ విన్నాను. అవన్నీ తప్పుడు వార్తలే. ప్రస్తుతం ఎటువంటి చర్చలు జరగడం లేదు అని సైకియా హిందూస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నారు.వన్డే కెప్టెన్‌గా గిల్..అయితే తాజా రిపోర్ట్స్ ప్రకారం.. రోహిత్ శర్మ తర్వాత భారత వన్డే జట్టు బాధ్యతలను శుబ్‌మన్ గిల్‌కే అప్పగించే అవకాశముంది. "వన్డే క్రికెట్లో శుబ్‌మన్ గిల్ సగటు 59 పైగా ఉంది. ప్రస్తుతం అతడు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇటీవలే టెస్టు కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు.తన తొలి సిరీస్‌లోనే జట్టును అద్భుతంగా నడిపించాడు. అటువంటి ఒక ప్లేయర్ సమయం వచ్చినప్పుడు వన్డే జట్టుకు కూడా నాయకత్వం వహించే అవకాశముంది" అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.కాగా టెస్టు కెప్టెన్‌గా ఉన్న గిల్.. వన్డే, టీ20ల్లో రోహిత్, సూర్యకుమార్ యాదవ్‌లకు డిప్యూటీగా వ్యవహరిస్తున్నాడు. ఆస్ట్రేలియా టూర్ తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఒకవేళ అదే జరిగితే టెస్టులు మాదిరిగానే వన్డేల్లో కూడా జట్టు పగ్గాలను గిల్ తీసుకునే సూచనలు కన్పిస్తున్నాయి. వీటిన్నంటికి ఓ క్లారిటి రావాలంటే మరో రెండు నెలలు ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఆసియాకప్-2025కు సిద్దమవుతోంది.ఆసియా కప్ టీ20-2025 టోర్నమెంట్‌కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.చదవండి: సిరాజ్, రాహుల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు!?.. బీసీసీఐ ఫైర్ -
సిరాజ్, రాహుల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు!?.. బీసీసీఐ ఫైర్
దులీప్ ట్రోఫీ 2025 తొలి రౌండ్ మ్యాచ్‌లకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మెరకు ఆయా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనెజర్ అబే కురువిల్లా లేఖ రాశారు.ముఖ్యంగా సౌత్ జోన్ జట్టులో కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి సుదర్శన్,మహ్మద్ సిరాజ్ వంటి స్టార్ ప్లేయర్లు లేకపోవడంతో బీసీసీఐ స్పందించాల్సి వచ్చింది. వీరందరూ ప్రస్తుతం భారత టెస్టు జట్టులో భాగంగా ఉన్నారు. ఇంగ్లండ్ టూర్ తర్వాత వీరిందరికి నెలకు పైగా విశ్రాంతి లభించింది.అంతేకాకుండా ఆసియాకప్ జట్టులో వీరివ్వరూ భాగం కాకపోవడంతో దులీప్ ట్రోఫీలో ఆడుతారని అంతా భావించారు. కానీ సౌత్ జోన్ జట్టులో వారిలో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. దీంతో అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్ వరకు వారికి విశ్రాంతి లభించనుంది. కాగా దులీప్ ట్రోఫీకి జట్లను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ కాకుండా, జోన్ సెలెక్టర్లు ఎంపిక చేస్తారు."దులీప్ ట్రోఫీ ప్రతిష్టను కాపాడుకునేందుకు, సరైన పోటీ అందించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న భారత ఆటగాళ్లను వారి సంబంధిత జోనల్ జట్లకు కచ్చితంగా ఎంపిక చేయాలి. కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు లేదా టీమిండియాలో ఎంపిక కోసం ఎదురు చూస్తున్న ఆటగాళ్లందరూ బీసీసీఐ నిర్వహించే దేశవాళీ టోర్నీల్లో పాల్గొనాలి.ఒకవేళ ఎవరైనా ఆటగాడు అందుబాటులో ఉన్నప్పటికి సరైన కారణం లేకుండా దేశీయ క్రికెట్ టోర్నీల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంటే సదరు ప్లేయర్‌ను జాతీయ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోరు" అని లేఖలో కురువిల్లా పేర్కొన్నారు.కాగా గతేడాదే సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్లో ఆడాలి అని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు గత రంజీ సీజన్లో ఆడారు. దులీప్ ట్రోఫీ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: భారత్, పాక్ పోరుకు రాజముద్ర -
ఆస్ట్రేలియా టూర్.. రోహిత్ శర్మ ఊహించని నిర్ణయం!?
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎతో జరిగే అనాధికారిక మూడు వన్డేల సిరీస్‌లో భారత్-ఎ తరపున ఆడేందుకు రోహిత్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.ఈ మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 30 నుంచి ఆక్టోబర్ 5 మధ్య కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది. కాగా టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నాడు. ఈ ఏడాది ఆక్టోబర్‌లో భారత జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఐపీఎల్-2025 తర్వాత క్రికెట్ దూరంగా ఉంటున్న హిట్‌మ్యాన్.. ఆసీస్-ఎతో జరిగే అనాధికారిక సిరీస్‌ను సన్నహాకంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేవ్ స్పోర్ట్స్ రిపోర్ట్ ప్రకారం.. రోహిత్ ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేసినట్లు తెలుస్తోంది.కాగా ఆస్ట్రేలియా టూర్ తర్వాత రోహిత్ పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వినిపించాయి. వన్డే ప్రపంచకప్-2027ను దృష్టిలో పెట్టుకుని రోహిత్, కోహ్లి స్దానాల్లో యువ ఆటగాళ్లను సిద్దం చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.అంతేకాకుండా వన్డేల్లో తన స్ధానాన్ని కాపాడుకోవాలంటే విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడమని రోహిత్‌ను సెలక్టర్లు కోరనున్నట్లు సమాచారం. మరి రోహిత్ ఈ దేశవాళీ వన్డే టోర్నీలో ఆడుతాడో లేదో వేచి చూడాలి. అయితే ఆసియాకప్ ముగిసిన తర్వాత వన్డే జట్టు భవిష్యత్తు గురించి చర్చించడానికి సెలెక్టర్లు ముంబైలో సమావేశం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.ఒకవేళ రోహిత్ తన కెరీర్‌ను ముగిస్తే భారత వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా రోహిత్ శర్మ చివరగా విజయ్ హాజారే ట్రోఫీ 2018లో ముంబై తరపున ఆడాడు.చదవండి: Ajinkya Rahane: ఇక గుడ్ బై.. అజింక్య రహానే సంచలన నిర్ణయం -
అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్ పొడిగింపు.. అతడిపై వేటు?
టీమిండియా ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీ కాలాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పొడిగించినట్లు తెలుస్తోంది. అగార్కర్ వచ్చే ఏడాది జూన్ వరకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా కొనసాగనున్నాడు.2023లో ఛీప్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అగార్కర్.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ బీసీసీఐ అభ్యర్దన మేరకు తన నిర్ణయాన్ని అజిత్ మార్చుకోనున్నట్లు తెలుస్తోంది.ఈ విషయంపై కొన్ని నెలల కిందటే అతడితో బీసీసీఐ చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ ఆఫర్‌కు అగార్కకర్ అంగీకరించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది."అజిత్ అగార్కర్ పదవీకాలంలో భారత పురుషల క్రికెట్ జట్టు రెండు ఐసీసీ టైటిల్స్‌ను గెలుచుకుంది. అంతేకాకుండా టెస్టులు, టీ20ల్లో భారత జట్టు పురోగతి సాధించింది. దీంతో భారత క్రికెట్ బోర్డు అతడి కాంట్రాక్ట్‌ను జూన్ 2026 వరకు పొడిగించింది. కొన్ని నెలల క్రితమే ఈ ఆఫర్‌ను అతడు అంగీకరించాడు" అని ఓ బీసీసీఐ అధికారి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో చెప్పుకొచ్చారు.కాగా అగార్కర్ బీసీసీఐ ఛీప్ సెలక్టర్‌గా తన మార్క్‌ను చూపించాడు. అతడి పదవీకాలంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2024, ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. అదేవిధంగా వన్డే ప్రపంచకప్-2023 రన్నరప్‌గా కూడా మెన్ ఇన్ బ్లూ నిలిచింది.అయితే ప్రస్తుత సెలక్షన్ కమిటీలో ఓ మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. శ్రీధరన్ శరత్ స్దానంలో మరో కొత్త వ్యక్తికి అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా శరత్ జనవరి 2023లో సీనియర్ సెలక్షన్ కమిటీకి పదోన్నతి పొందారు. ప్రస్తుత సెలక్షన్ కమిటీలో అగార్కర్, ఎస్ఎస్ దాస్, సుబ్రతో బెనర్జీ, అజయ్ రాత్రా, ఎస్ శరత్ ఉన్నారు.చదవండి: టీమిండియా వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్? -
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆటగాళ్లకు ‘అగ్ని పరీక్ష’!
సెప్టెంబరులో ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ మొదలు.. వరుస సిరీస్‌లతో టీమిండియా బిజీబిజీగా గడుపనుంది. ఈ ఖండాంతర ఈవెంట్ తర్వాత స్వదేశంలో అక్టోబరులో వెస్టిండీస్‌తో టెస్టులు.. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది.ఆటగాళ్లు ఫిట్‌గా ఉంటేనే..ఆ తర్వాత నవంబరులో టీమిండియా సొంతగడ్డపై సౌతాఫ్రికా (IND vs SA)తో టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లలో తలపడనుంది. మరి ఈ బిజీ షెడ్యూల్లో భారత జట్టు అనుకున్న ఫలితాలు రాబడుతూ సాఫీగా ముందుకు సాగాలంటే ఆటగాళ్లు ఫిట్‌గా ఉండటం అత్యంత ముఖ్యం.బీసీసీఐ కీలక నిర్ణయంఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదింట.. కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడిన విషయం తెలిసిందే. ఫలితంగా టీమిండియా యాజమాన్యం తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఫిట్నెస్ పరీక్షలో భాగంగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (CoE) సరికొత్త టెస్టును ప్రవేశపెట్టినట్లు సమాచారం. రగ్బీ, ఫుట్‌బాల్ క్రీడాకారులకు నిర్వహించే బ్రోంకో టెస్టు ద్వారా భారత ఆటగాళ్ల ఫిట్నెస్ను పరీక్షించనున్నట్లు తెలిసింది. బీసీసీఐ కాంట్రాక్టు ప్లేయర్లు, ముఖ్యంగా పేసర్లకు ఈ పరీక్ష ద్వారా ఫిట్నెస్ స్థాయి పెంచుకునే వీలు కలుగుతుందని భావిస్తున్నట్లు సమాచారం.ఫాస్ట్ బౌలర్లు పరిగెత్తడం లేదు!ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ బ్రోంకో టెస్టును ప్రవేశపెట్టింది. కొంత మంది సెంట్రల్ కాంట్రాక్టు క్రికెటర్లు బెంగళూరుకు వెళ్లి ఈ పరీక్ష చేయించుకున్నారు. ఫిట్నెస్ ప్రమాణాలు పెంచేందుకే సీఓఈ ఈ నిర్ణయం తీసుకుంది.భారత క్రికెటర్లలో చాలా మంది.. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు జిమ్‌లో ఎక్కువ సమయం (స్పీడ్ రన్నింగ్) గడపడం లేదని తెలిసింది. తప్పకుండా ఎక్కువ సేపు రన్నింగ్ చేయాలని స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ ఆడ్రియన్ లే రౌక్స్ వారికి చెప్పారు’’ అని పేర్కొన్నాయి.ఇంతకీ ఏమిటీ బ్రోంకో టెస్టు?ఇదొక రకమైన ఫిట్నెస్ పరీక్ష. ఇందులో భాగంగా ఆటగాడు తొలుత 20 మీటర్ల షటిల్ రన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 40 మీటర్లు, 60 మీటర్ల షటిల్ రన్లో పాల్గొంటాడు. ఈ మూడింటిని కలిపి ఒక సెట్‌గా వ్యవహరిస్తారు.పరీక్ష సమయంలో ఆటగాడు ఇలాంటి ఐదు సెట్లు పూర్తి చేయాలి. అంటే.. మొత్తంగా 1200 మీటర్ల దూరం విరామం లేకుండా వేగంగా పరిగెత్తాలి. ఆరు నిమిషాల్లోనే సదరు ప్లేయర్ ఈ పని పూర్తి చేయాలి.ఇదిలా ఉంటే.. రెండు కిలోమీటర్ల టైమ్ ట్రయల్‌లో ఫాస్ట్ బౌలర్లు ఎనిమిది నిమిషాల పదిహేను సెకండ్లలో బెంచ్ మార్కును అందుకోవాలి. మరోవైపు.. బ్యాటర్లు, వికెట్ కీపర్లు, స్పిన్నర్లకు ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ల టైమ్ ఉంటుంది. కాగా అంతకు ముందు బీసీసీఐ ఆటగాళ్లకు యో-యో టెస్టు నిర్వహించేదన్న విషయం తెలిసిందే.చదవండి: ఇదే ఫైనల్ స్క్వాడ్ కాదు.. వారికి మరో ఛాన్స్: అగార్కర్ -
Ind Vs Pak మ్యాచ్ గురించి అగార్కర్‌కు ప్రశ్న.. బీసీసీఐ రియాక్షన్ ఇదే
క్రికెట్ ప్రేమికులకు మరోసారి మజా అందించేందుకు ఆసియా కప్ (Asia Cup 2025) టోర్నమెంట్ సిద్ధంగా ఉంది. యూఏఈ వేదికగా ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహణకు సెప్టెంబరు 9- 28 వరకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈ ఖండాంతర టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.ఆరోజే భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్!గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ తలపడనుండగా.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పోటీపడనున్నాయి. ఒకే గ్రూపులో ఉన్న దాయాదులు భారత్- పాక్ (India vs Pakistan) జట్లు ఈ టోర్నీ లీగ్ దశలో సెప్టెంబరు 14న తొలిసారి తలపడతాయి. ఆ తర్వాత సూపర్ 4, ఫైనల్ కలుపుకొని మరో రెండుసార్లు పరస్పరం ఢీకొట్టే అవకాశం లేకపోలేదు.ఆ మ్యాచ్ రద్దుఅయితే, ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌తో క్రీడల్లోనూ ఎలాంటి బంధం కొనసాగించవద్దనే డిమాండ్లు పెరిగాయి. ఇటీవల వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్లోనూ ఇండియా చాంపియన్స్.. పాకిస్తాన్‌తో ఆడేందుకు విముఖత చూపింది.లీగ్, సెమీ ఫైనల్ మ్యాచ్‌ను బహిష్కరించి.. దేశమే తమకు ముఖ్యమని మాజీ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు తేల్చిచెప్పింది. అయితే, ఆసియా కప్ టోర్నీలో మాత్రం చిరకాల ప్రత్యర్థులు కచ్చితంగా ముఖాముఖి పోటీపడే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఈ విషయం గురించి టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు తాజాగా ప్రశ్న ఎదురైంది. ఆసియా కప్-2025 టోర్నీ కోసం మంగళవారం భారత జట్టును ప్రకటించారు. ఈ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి అగార్కర్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.అగార్కర్‌కు ప్రశ్న.. బీసీసీఐ రియాక్షన్ ఇదేఈ క్రమంలో ఓ విలేఖరి.. ‘‘సెప్టెంబరు 14న ఆసియా కప్ టోర్నీలో బిగ్ మ్యాచ్ ఉంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఇరుదేశాల మధ్య గత రెండు నెలలుగా ఏం జరుగుతుందో మనకి తెలుసు. మరి ఈ మ్యాచ్ విషయంలో మీ వైఖరి ఏమిటి?’’ అని ప్రశ్నించారు.ఇందుకు అగార్కర్ బదులిచ్చేందుకు సిద్ధమవుతుండగా.. బీసీసీఐ మీడియా మేనేజర్ అతడికి అడ్డుపడ్డారు. ‘‘ఆగండి.. కాస్త ఆగండి. జట్టు ఎంపిక గురించిన ప్రశ్నలు మాత్రమే అడగండి’’ అంటూ సమాధానం దాటవేసేలా చేశారు. దీంతో మరోసారి భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టుసూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్. చదవండి: Asia Cup 2025: అందుకే శ్రేయస్‌ను సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్ -
Asia Cup 2025: భారత జట్టు ప్రకటన ఆలస్యం.. కారణమిదే?
ఆసియాకప్-2025కు భారత జట్టు ప్రకటన కాస్త ఆలస్యం కానుంది. వాస్తవానికి మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు విలేకరుల సమావేశంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాల్గోవల్సింది.కానీ ముంబైలో భారీ వర్షాల కారణంగా వీరిద్దరి ప్రెస్కాన్ఫరెన్స్ ఆలస్యమ్యే అవకాశం ఉందని బీసీసీఐ మీడియా సంస్థలకు సమాచారమిచ్చినట్లు హిందూస్తాన్ టైమ్స్ తమ కథనంలో పేర్కొంది. కాగా ముంబైలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి.అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ముంబై వ్యాప్తంగా పాఠశాలకు సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా అనేక కార్యక్రమాలు రద్దు చేయబడ్డాయి. ఒకవేళ వర్షం తగ్గుముఖం పట్టకపోతే అగార్కర్, సూర్య వర్చవల్‌గా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశముంది.ఆసియాకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ జట్టులో టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు చోటు దక్కుతుందా లేదా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓపెనింగ్ స్లాట్ కోసం సంజూ శాంసన్, యశస్వి జైశ్వాల్, అభిషేక్ శర్మల నుంచి గిల్‌కు తీవ్రమైన పోటీ ఉంది. అయితే ఈ జట్టులో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను సెలక్టర్లు చేర్చినట్లు తెలుస్తోంది. అతడితో పాటు రియాన్ పరాగ్‌కు చోటు కల్పించినట్లు సమాచారం.ఆసియాకప్-2025కు భారత జట్టు(అంచనా): సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సామ్సన్, జైస్వాల్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, జితేశ్ శర్మ.చదవండి: KBC 2025: ఐపీఎల్‌పై రూ. 7.50 లక్షల ప్రశ్న.. సమాధానం మీకు తెలుసా? -
గిల్‌కు చోటు దక్కేనా!
కెప్టెన్సీలో ఆడిన గత 20 టి20ల్లో 17 గెలిచి జోరు మీదుంది. ఈ అన్ని మ్యాచ్‌లకు వేర్వేరు కారణాలతో శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ దూరమయ్యారు. మరోవైపు ఈ ఏడాది జట్టు 5 టి20లు మాత్రమే ఆడింది. నిజానికి వీటిలో ప్రదర్శనను బట్టి చూస్తే భారత జట్టులో పెద్దగా మార్పులకు ఆస్కారం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. టెస్టు కెపె్టన్‌గా రాణించి అన్ని ఫార్మాట్లకు నాయకుడిగా పరిగణనలోకి తీసుకుంటున్న గిల్‌తో పాటు ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ కూడా టి20 రేసులోకి వచ్చారు. దీనికి తోడు ఐపీఎల్లో ఆటను గుర్తిస్తే శ్రేయస్ అయ్యర్‌కు కూడా అవకాశం ఉంది. ఇలాంటి స్థితిలో ఆసియా కప్ కోసం సెలక్టర్లు ఎలాంటి జట్టును ప్రకటిస్తారనేది ఆసక్తికరం. న్యూఢిల్లీ: ఆసియా కప్ టి20 క్రికెట్ టోరీ్నలో పాల్గొనే భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నేడు ప్రకటించనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే స్వదేశంలో టి20 వరల్డ్ కప్ కూడా ఉన్న నేపథ్యంలో ఇదే జట్టును అప్పటి వరకు సన్నద్ధం చేసే ఆలోచనతో సెలక్టర్లు ఉన్నారు. సెపె్టంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఆసియా కప్ జరుగుతుంది. 15 మంది సభ్యులతో టీమ్‌ను ఎంపిక చేయాల్సి ఉండగా... ఇటీవల యువ ఆటగాళ్లు తమకు లభించిన అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంతో జట్టులో చోటుపై గట్టి పోటీ నెలకొంది. తిలక్ వర్మకు పోటీ! ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ తమ ఆటతో స్థానాలు సుస్థిరం చేసుకున్నారు. ఇంగ్లండ్‌తో భారత్ ఆడిన చివరి టి20 సిరీస్‌లో అభిషేక్ 219.68 స్ట్రయిక్‌రేట్‌తో 279 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో సామ్సన్ కాస్త తడబడినా... అంతకుముందు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై చెలరేగి ఐదు ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు సాధించాడు. ఈ స్థితిలో గిల్, జైస్వాల్‌ను తీసుకొచ్చి కూర్పును చెడగొడతారా అనేది సందేహమే. రిజర్వ్ ఓపెనర్‌గా జైస్వాల్‌ను గానీ, గిల్‌ను కానీ తీసుకొస్తే సామ్సన్ను పక్కన పెట్టక తప్పదు. మూడో స్థానంలో హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ దక్షిణాఫ్రికాపై రెండు సెంచరీలు సహా 280 పరుగులు చేసి కుదురుకున్నాడు. అయితే ఐపీఎల్లో అతను ఆకట్టుకోలేకపోగా, ఇక్కడే శ్రేయస్ అయ్యర్ నుంచి పోటీ ఎదురవుతోంది. ఈ సీజన్లో 600కు పైగా పరుగులు చేసిన శ్రేయస్ సవాల్ విసురుతున్నాడు. నాలుగులో సూర్యకుమార్ ఖాయం కాగా, వరల్డ్ కప్ విజయం సహా గత రెండేళ్లుగా ఐదో స్థానాన్ని శివమ్ దూబే సొంతం చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా స్థానానికి ఢోకా లేకపోగా, ఏడో స్థానం కోసం రింకూ సింగ్ పోటీ పడుతున్నాడు. చివర్లో దూకుడుగా ఆడే ప్రయత్నంలోనే అయినా గత కొన్ని మ్యాచ్‌లలో రింకూ నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదు. కొత్తగా ఒక అదనపు ఆల్‌రౌండర్ ఉంటే మేలని భావిస్తే ముందుగా రింకూ స్థానమే ప్రశ్నార్ధకంగా మారనుంది. బుమ్రా ఖాయం... స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఖాయం. ఆల్‌రౌండర్‌గా అక్షర్ ఎంతో విలువైన ఆటగాడు కాగా, ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 14 వికెట్లతో వరుణ్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. గాయంతో వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఈ ఫార్మాట్లో ఆడని కుల్దీప్ కోలుకొని చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటాడు. అతను టి20 టీమ్‌లోకి రావడం లాంఛనమే. మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అనుకుంటే వాషింగ్టన్ సుందర్ అందరికంటే ముందున్నాడు. అతని తాజా ఫామ్ కూడా అనుకూలం కానుంది. మూడో పేసర్‌గా హార్దిక్ ఉన్నాడు కాబట్టి రెగ్యులర్ పేసర్లుగా బుమ్రా, అర్‡్షదీప్ల స్థానాలకు ఢోకా లేదు. మరో పేసర్‌గా ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్ అందుబాటులో ఉన్నా... వీరి ఎంపిక సందేహమే. కొంత విశ్రాంతి తీసుకొని టెస్టు క్రికెట్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టాలని వీరిద్దరికి సెలక్టర్లు సూచించే అవకాశాలే ఎక్కువ. ఇంగ్లండ్‌తో ఆడిన తర్వాత ఐపీఎల్లో ఘోరంగా విఫలమైన మొహమ్మద్ షమీ అంతర్జాతీయ టి20 కెరీర్ ఇక ముగిసినట్లుగానే భావించవచ్చు. గాయం వల్ల నితీశ్ కుమార్ రెడ్డి అందుబాటులో లేడు. రెండో వికెట్ కీపర్‌గా ఐపీఎల్లో ఆకట్టుకున్న జితేశ్ శర్మను సెలక్టర్లు ఎంపిక చేయవచ్చు. జట్టులోకి ఎంపికయ్యే అవకాశం ఉన్న 15 మంది సభ్యులు (అంచనా): సూర్యకుమార్ (కెపె్టన్), అభిషేక్ శర్మ, సామ్సన్, జైస్వాల్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, జితేశ్ శర్మ. -
ఆసియాకప్ కోసం టీమిండియా మాస్టర్ ప్లాన్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆసియాకప్ టీ20 టోర్నీకి మరో 22 రోజుల్లో తెరలేవనుంది. సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్ తొలి మ్యాచ్‌లో అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఈ ఆసియా జెయింట్స్ పోరు కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆగస్టు 19న ప్రకటించే అవకాశముంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ అనంతరం భారత జట్టుకు ఒక నెల పాటు విరామం లభించింది. వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో టీమిండియా తలపడాల్సిండేది.కానీ ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో ఈ సిరీస్ తాత్కాలికంగా వాయిదా పడింది. దీంతో భారత ఆటగాళ్లకు లాంగ్ బ్రేక్ దొరికింది. ఈ క్రమంలో టీమిండియా మెనెజ్‌మెంట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఆసియాకప్‌నకు ముందు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు యూఏఈలో ఒక ప్రత్యేక శిబిరాన్ని చేయనుంది. ఇందుకోసం టీమిండియా నాలుగు రోజుల ముందే యూఏఈ గడ్డపై అడుగుపెట్టనుంది. అయితే తొలుత ఆసియాకప్‌కు సిద్దం కావడానికి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఒక క్యాంప్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ సూచించినట్లు సమాచారం.కానీ టీమ్ మెనెజ్‌మెంట్ మాత్రం యూఏఈ పరిస్థితులు అలవాటు పడేందుకు అక్కడకి వెళ్లి తమ శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే ఈ స్పెషల్ క్యాంపు చాలా మంది భారత ఆటగాళ్లకు ఉపయోగపడనుంది.ఐపీఎల్-2025 తర్వాత సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్ లోపించింది. అటువంటి వారు ఈ క్యాంపును సన్నాహాకంగా ఉపయోగించుకోవచ్చు. ఇక దాయాది పాకిస్తాన్ కూడా ఈ మెగా టోర్నీకి తమ సన్నాహాకాలను ప్రారంభించనుంది. అయితే భారత్‌కు భిన్నంగా పాక్ జట్టు అఫ్గాన్-యూఏఈలతో ట్రై సిరీస్ ఆడనుంది.అంతేకాకుండా మెన్ ఇన్ గ్రీన్ ఐసీసీ ఆకాడమీలో నాలుగు రోజుల పాటు ఒక ప్రత్యేక క్యాంపును నిర్వహించనుంది. ఈ టోర్నీ కోసం పీసీబీ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో స్టార్ ప్లేయర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజంలకు చోటు దక్కలేదు. ఈ ఆసియా జెయింట్స్ పోరులో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా వ్యవహరించనున్నాడు.చదవండి: వాళ్ళేమి తోపు ఆటగాళ్లు కాదు.. సెలక్టర్లు మంచి పనిచేశారు: పాక్ మాజీ కెప్టెన్ -
రిషబ్ పంత్ గాయం ఎఫెక్ట్.. సరికొత్త రూల్‌ను తీసుకురానున్న బీసీసీఐ!
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) దేశవాళీ క్రికెట్ సీజన్ 2025-26లో 'సీరియస్ ఇంజురీ రీప్లేస్మెంట్'సరికొత్త రూల్‌ను పరిచయం చేయనుంది. ఈ రూల్ ప్రకారం ఏ ప్లేయరైనా తీవ్రంగా గాయపడితే అతడి స్ధానంలో 'లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్’ మరొకరిని తీసుకోవచ్చు.అంటే ఉదహరణకు బౌలర్ గాయపడితే బౌలర్, బ్యాటర్ గాయపడితే బ్యాటర్‌ను భర్తీ చెయోచ్చు. టాస్ వేసే ముందు ఆయా జట్లు నలుగురు ఆటగాళ్లతో కూడిన జాబితాను అంపైర్లకు అందజేయాలి. ఎవరైనా గాయపడితే వారి నుంచే భర్తీ చేయాలి. ప్రస్తుతానికి ఈ రూల్ సీకే నాయుడు ట్రోఫీలో వర్తించనుంది.అహ్మదాబాద్‌లో జరుగుతున్న సెమినార్లో అంపైర్లకు ఈ మార్పు గురించి తెలియజేసేందుకు బీసీసీఐ ఒక ప్రత్యేక సెషన్‌ను నిర్వహించింది. అయితే ఈ ఏడాది జరగనున్న సయ్యద్ ముష్తాక్ అలీ లేదా విజయ్ హజారే ట్రోఫీలో బోర్డు ఈ ప్రవేశ పెట్టకపోవచ్చు.ఐపీఎల్-2026, రంజీ ట్రోఫీ సీజన్లో ఈ కొత్త నియమాన్ని అమలు చేసే అవకాశముంది. అయితే గాయం తీవ్రతను బట్టి వైద్యుడిని సంప్రదించిన తర్వాత ఆటగాడిని రిప్లేస్ చేయాలా వద్దా అని నిర్ణయించే తుది అధికారం మ్యాచ్ రిఫరీదేనని బోర్డు అధికారి ఒకరు స్పష్టం చేశారు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో తీవ్రంగా గాయపడ్డ రిషబ్ పంత్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఈ కొత్త రూల్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ సిరీస్‌లో పంత్ కాలు ఎముక విరిగిన కూడా బ్యాట్‌కు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో కేవలం కంకషన్ సబ్‌స్ట్యూట్(తలకు దెబ్బ)కు మాత్రమే రిప్లేస్మెంట్ అవకాశముంది.చదవండి: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. ఆటగాళ్లకు జీతాలు కట్!? -
విరాట్, రోహిత్ రిటైర్మెంట్ వెనుక కుట్ర..? మాజీ ప్లేయర్ సంచలన కామెంట్స్
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ తమకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. భారత క్రికెట్‌కు డాదాపు 16 ఏళ్ల పాటు తమ సేవలను అందించిన ఈ ఇద్దరి లెజెండరీ క్రికెటర్లకు సరైన వీడ్కోలు మాత్రం లభించింది.ఈ కోవకు చెందిన వారే టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు. వారిద్దరూ కూడి ఎటువంటి వీడ్కోలు లేకుండా తమ టెస్టు కెరీర్లను ముగించారు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్, కోహ్లిలు వారం రోజుల వ్యవధిలో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందిరికి షాకిచ్చారు.ఈ సీనియర్ ద్వయం లేకుండానే ఇంగ్లండ్‌కు వెళ్లిన భారత జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమంగా ముగించింది. అయితే తాజాగా రోహిత్, కోహ్లి రిటైర్మెంట్లపై భారత మాజీ ఆల్ రౌండర్ కర్సన్ ఘావ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐలో రాజకీయాల వల్లే వారిద్దరూ త్వరగా రిటైరయ్యారని ఆయన ఆరోపించాడు."వరల్డ్ క్రికెట్లో ప్రస్తుతం అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెటర్లలో విరాట్ కోహ్లి ఒకడు. మరో మూడేళ్ల పాటు భారత జట్టు తరపున ఆడే సత్తా కోహ్లికి ఉంది. అటువంటిది ఆకస్మికంగా కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించడం వెనక కొన్ని శక్తులు ఉన్నాయని నేను అనుకుంటున్నాను.అంతేకాకుండా సుమారు 14 ఏళ్ల పాటు భారత జట్టుకు తన సేవలను అందించిన విరాట్‌కు బీసీసీఐ కనీసం ఫేర్వెల్ కూడా ఏర్పాటు చేయలేదు. కోహ్లి, రోహిత్ వంటి ఆటగాళ్లు ఘనమైన వీడ్కోలుకు ఆర్హులు. ఇది బీసీసీఐలోని అంతర్గత రాజకీయాల కారణంగా జరిగింది.దీనిని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ కారాణాలతోనే కోహ్లి త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మ కూడా కావాలనుకుంటే మరి కొన్నాళ్ల పాటు ఆడేవాడు. కానీ కొంత మంది బీసీసీఐ పెద్దలు అతడిని జట్టు నుంచి బయటకు పంపాలని చూశారు. వారు కోరుకున్న విధంగానే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడని" విక్కీ లాల్వానీ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘావ్రీ పేర్కొన్నాడు. -
'టీమిండియా మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా అతడే సరైనోడు'
భారత పురుషుల క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో వెర్వేరు కెప్టెన్లు ఉన్న సంగతి తెలిసిందే. వన్డేల్లో రోహిత్ శర్మ, టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్, టెస్టుల్లో శుబ్‌మన్ గిల్ టీమిండియా సారథిలుగా ఉన్నారు. రోహిత్ శర్మ టీ20, టెస్టుల నుంచి రిటైర్ కావడంతో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా ఈ ముగ్గురు కెప్టెన్ల విధానంపై బీసీసీఐ మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు."ప్రస్తుతం శుబ్‌మన్ గిల్‌ను చూస్తుంటే 2017లో విరాట్ కోహ్లిలా కన్పిస్తున్నాడు. లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోని హయంలో విరాట్ బాగా రాటు దేలాడు. ఆ తర్వాత అతడి వారుసుడిగా కోహ్లి భారత జట్టు పగ్గాలు చేపట్టాడు. ఇప్పుడు గిల్ కూడా విరాట్ లాగే రోహిత్ సారథ్యంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. టెస్ట్ కెప్టెన్‌గా గిల్‌ను నియమించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన ముందుచూపును చాటుకున్నాడు. టీ20 ఫార్మాట్‌కు కూడా గిల్ సరిపోతాడు. 2026 టీ20 ప్రపంచకప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌కు బదులుగా ఎవరు కెప్టెన్సీ తీసుకుంటారనే దానిపై బీసీసీఐ స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలి.ఇతర దేశాలు మాదిరిగా భారత్‌లో స్ప్లిట్ కెప్టెన్సీ దీర్ఘకాలంలో పనిచేయదు. అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న ఒక ఆటగాడు ఒక ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఉన్నప్పుడు, మిగిలిన ఫార్మాట్లకు కూడా అతనే నాయకత్వం వహించాలి. గిల్ బ్యాటర్‌గా కూడా రాణించాడు.అంతేకాకుండా ఐపీఎల్లో కూడా అతడు సారథ్యం వహించాడు" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాంధీ పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ భారత వన్డే జట్టు కెప్టెన్‌గా గిల్ ఎంపికయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: Asia Cup 2025: సంజూ శాంసన్‌కు నో ఛాన్స్..? ఆర్సీబీ స్టార్‌కు చోటు? -
BCCI: అప్పటి వరకు అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ
బెంగళూరు: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ తన పూర్తి పదవీకాలం కొనసాగనున్నారు. 2022 అక్టోబర్‌లో ఎంపికైన ఆయన ఈ ఏడాది సెప్టెంబర్ వరకు బోర్డు అధ్యక్షుడిగా ఉంటారు. గత నెల 19న బిన్నీకి 70 ఏళ్లు పూర్తయ్యాయి. నిబంధనల ప్రకారం ఆయన వెంటనే తప్పుకోవాల్సి ఉంది. అయితే తాజాగా మంగళవారం ‘నేషనల్ స్పోర్ట్స్ బిల్’ పార్లమెంట్లో ఆమోదం పొందింది. దీని ప్రకారం క్రీడా సంఘాల ఆఫీస్ బేరర్ల వయోపరిమితిని 75 ఏళ్లకు పెంచారు.ఇక బీసీసీఐ కూడా ఒక క్రీడా సమాఖ్యగా ఈ బిల్లు పరిధిలోకి రావడంతో ఈ నిబంధన కూడా దానికి వర్తించనుంది. దీంతో బిన్నీ కొనసాగేందుకు మార్గం సుగమమైంది. సెప్టెంబరు చివర్లో జరిగే ఏజీఎంలోనే కొత్త అధ్యక్షుడి ఎన్నికపై బీసీసీఐ ముందుకు వెళుతుంది. ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు తీసుకోకపోయినా... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్లో మన జట్టు దేశానికి ప్రాతినిధ్యం వహించనున్న నేపథ్యంలో బీసీసీఐ కూడా కొత్త బిల్లు పరిధిలోకి వచ్చింది.అయితే బోర్డు నుంచి ఎలాంటి సమాచారం కోరకుండా దానిని ఆర్టీఐ పరిధి నుంచి తప్పిస్తూ సవరణ చేర్చిన తర్వాతే ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. పార్లమెంట్లో ఇప్పుడే బిల్లు పాస్ అయింది కాబట్టి దానిని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత లోటుపాట్లపై చర్చిస్తామని బీసీసీఐ న్యాయ నిపుణుల బృందం అభిప్రాయపడింది. చదవండి: Shai Hope: వన్డే క్రికెట్ చరిత్రలో మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్ -
మీకు ఆటే ముఖ్యమా?: బీసీసీఐ తీరుపై హర్భజన్ ఆగ్రహం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరుపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. దేశం కంటే మీకు ఆటే ముఖ్యమా అంటూ బోర్డు పెద్దల్ని ప్రశ్నించాడు. క్రికెట్ కంటే సైనికుల త్యాగం ఎంతో గొప్పదని.. కాబట్టి ఇప్పటికైనా ఆసియా కప్-2025 (Asia Cup) విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించాడు.పాక్‌తో మ్యాచ్ బహిష్కరించిన ఇండియా చాంపియన్స్ఇటీవల పహల్గామ్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి అమాయక పర్యాటకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో తీవ్రంగా స్పందించిన భారత సైన్యం.. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఇందుకు పాక్ సైన్యం ప్రతిస్పందించగా.. దాయాదికి కూడా గట్టిగానే బుద్ధి చెప్పింది.ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొనగా.. ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీలో భారత ఆటగాళ్లు పాకిస్తాన్ (IND vs PAK)తో మ్యాచ్‌ను బహిష్కరించారు. సెమీ ఫైనల్లో దాయాదితో పోటీ పడాల్సి ఉండగా.. తమకు అన్నింటికంటే దేశమే ముఖ్యమని శిఖర్ ధావన్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు ఈ మ్యాచ్ నుంచి కూడా నిష్క్రమించారు.ఆసియా కప్‌లో మాత్రం దాయాదితో పోరుకు సై!అయితే, ఆసియా కప్ టీ20 టోర్నీ-2025లో మాత్రం భారత్- పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉండటంతో పాటు.. అత్యధికంగా మూడుసార్లు ముఖాముఖి పోటీ పడే అవకాశం ఉన్నట్లు షెడ్యూల్ ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై మాజీ క్రికెటర్లు, అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మీకు ఆటే ముఖ్యమా?పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్‌లను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ముందుగా నిర్ణయించిన ప్రకారం మ్యాచ్‌లు యథావిధిగా సాగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ స్పందించాడు. ‘‘వారికి (బీసీసీఐ) ఏది ముఖ్యమో.. ఏది ప్రాధాన్యం లేని విషయమో అర్థం కావడం లేదు.సరిహద్దులో నిలబడి ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడే సైనికుల కుటుంబాలు.. తరచూ వారిని చూడలేవు. ఒక్కోసారి సైనికులు తమ ప్రాణాలనే త్యాగం చేయాల్సి వస్తుంది. వాళ్లు ఎప్పటికీ ఇంటికి తిరిగా రాలేరు కూడా!వారి త్యాగమే ఎంతో గొప్పదిఅందరి కంటే వారి త్యాగమే ఎంతో గొప్పది. వారితో పోలిస్తే ఇలాంటివి చాలా చిన్న విషయాలు. వారి కోసం మనం ఒక్క క్రికెట్ మ్యాచ్‌ను వదులుకోలేమా? మన ప్రభుత్వం కూడా ‘హింస- త్యాగం’ ఒకేచోట ఉండలేవని చెప్తోంది.కొంత మంది సరిహద్దులో యుద్ధం చేస్తున్నపుడు.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నపుడు.. మనం మాత్రం వెళ్లి వాళ్లతో క్రికెట్ ఆడటమా?.. సమస్య పరిష్కారమయ్యేంత వరకు క్రికెట్ అనేది చిన్న విషయంలా చూడాలి. దేశ ప్రయోజనాలే మనకు ప్రథమ ప్రాధాన్యం కావాలి.మనకు ఏ గుర్తింపు వచ్చినా.. అది దేశం కారణంగానేనని గుర్తుపెట్టుకోండి. మీరొక ఆటగాడు లేదంటే నటుడు.. ఎవరైనా కానీవండి. దేశం కంటే ఎవరూ గొప్పవారు కాదు. దేశం తరఫున తప్పక నిర్వర్తించాల్సిన విధులను విస్మరించకూడదు’’ అంటూ భజ్జీ బీసీసీఐ తీరును ఎండగట్టాడు. చదవండి: Shai Hope: వన్డే క్రికెట్ చరిత్రలో మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్ -
National Sports Bill 2025: లోక్‌సభ ఆమోదం.. ఇందులో ఏముంది?
జాతీయ క్రీడా పరిపాలనా బిల్లు-2025 (National Sports Governance Bill)కి లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. అదే విధంగా.. జాతీయ యాంటీ-డోపింగ్ (సవరణ) బిల్లుకు కూడా ఈరోజే ఆమోదం లభించింది. అయితే, విపక్షాలు మాత్రం ఇందుకు సహకరించలేదు. అయినప్పటికీ నిరసనల నడుమే క్రీడా పరిపాలనా బిల్లుకు ఆమోదం లభించింది.అతిపెద్ద సంస్కరణ ఇదిఈ సందర్భంగా కేంద్ర క్రీడా శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ సభలో మాట్లాడుతూ.. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత క్రీడా రంగంలో ప్రవేశపెట్టిన అతిపెద్ద సంస్కరణ ఇది. జవాబుదారీతనం తీసుకురావడం ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతుంది. క్రీడా సమాఖ్యలన్నీ అత్యుత్తమంగా పరిపాలన చేసేందుకు ఇది తోడ్పడుతుంది’’ అని పేర్కొన్నారు.స్పోర్ట్స్ ఎకోసిస్టమ్‌లో దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుందన్న మాండవీయ.. దురదృష్టవశాత్తూ ప్రతిపక్షాలు ఈ బిల్లు ఆమోదంలో పాలు పంచుకోలేకపోయాయన్నారు. ‘‘1975లో మేము ఈ బిల్లుకు సంబంధించి తొలి డ్రాఫ్ట్ తయారుచేశాము. కానీ క్రీడలు కూడా వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజకీయ రంగు పులుముకున్న కారణంగా ఇది సాధ్యం కాలేదు.అయితే, కొంతమంది మంత్రులు ఈ బిల్లును ప్రవేశపెట్టగలిగారు కానీ.. దీనికి ఆమోదం లభించేలా చేయలేకపోయారు. 2011లో మనకు జాతీయ స్పోర్ట్స్ కోడ్ వచ్చింది. దానిని బిల్లుగా మార్చేందుకు మేము కృషి చేశాం.అనంతరం క్యాబినెట్లో చర్చల్లో భాగంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకే ఇది పార్లమెంట్ వరకు చేరుకోలేకపోయింది. ఏదేమైనా నేనషల్ స్పోర్ట్స్ బిల్ గవర్నెన్స్ బిల్ ఒక సంచలనాత్మక మార్పునకు నాంది.అతి పెద్దదైన మన దేశంలో ఒలింపిక్స్‌లో, అంతర్జాతీయ స్థాయిలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం నిజంగా విచారకరం. క్రీడా రంగ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ బిల్లు దోహదం చేస్తుంది’’ అని మన్సుఖ్ మాండవీయ చెప్పుకొచ్చారు.ఇందులో ఏముంది?కాగా క్రీడా సంస్థలకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వీలు కల్పించడం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు ద్వారా సాధ్యమవుతుంది. రాజకీయ ఒత్తిడి, జోక్యం ఉండదని చెబుతున్నారు. స్పోర్ట్స్ ట్రిబ్యునల్ ఏర్పాటు ద్వారా.. అథ్లెట్లు, ఆఫీస్ బేరర్లు, క్రీడా సమాఖ్యల మధ్య తగాదాలను త్వరితగతిన పరిష్కరించే వీలుంటుంది. ప్రతిభ ఆధారంగా మాత్రమే ఆటగాళ్ల ఎంపిక ఉండేలా చూసుకుంటారు.జాతీయ క్రీడా సమాఖ్యలకు సంబంధించిన ఆడిట్లు సకాలంలో పూర్తి చేయడంతో పాటు.. నిధుల వినియోగానికి సంబంధించి పారదర్శకత ఉండేందుకు ఇది దోహదం చేస్తుంది. క్రీడా పరిపాలనా విభాగాన్ని మెరుగుపరచి, ఎవరి పాత్ర ఏమిటన్న అంశాలపై స్పష్టతనివ్వడం ద్వారా ఒలింపిక్స్ వంటి హై ప్రొఫైల్ ఈవెంట్లు నిర్వహించడం కాస్త సులువుగా మారుతుంది. అయితే, అన్నింటికీ మించి ఆటగాళ్లకు సురక్షిత వాతావరణం కల్పించడం.. అంటే.. అన్ని రకాల వేధింపుల నుంచి ఉపశమనం కలిగించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.బీసీసీఐకి రిలీఫ్ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి మాత్రం ఈ బిల్లులో ఉపశమనం లభించింది. బోర్డు వ్యవహారాల గురించి ఆర్టీఐ నుంచి సమాచారం కోరేందుకు మాత్రం అనుమతి ఉండదు. బీసీసీఐ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం తీసుకోవడం లేదు.. కాబట్టి అందుకే ఈ మేరకు మినహాయింపు ఇచ్చారని సమాచారం. అదే విధంగా.. అడ్మినిస్ట్రేటర్లకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ బాడీ అనుమతించినట్లయితే.. 70- 75 ఏళ్ల వ్యక్తులు కూడా క్రీడా సమాఖ్యల ఎన్నికల్లో పాల్గొనవచ్చు.చదవండి: క్రికెట్లో కలకాలం నిలిచిపోయే రికార్డులు.. ఎవ్వరూ బ్రేక్ చేయలేరు! -
‘సెలక్టర్లు అతడిని తప్పించలేదు.. తనే తప్పుకొన్నాడు’
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) టెస్టు మ్యాచ్ ఆడి రెండేళ్లు దాటిపోయింది. చివరగా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (WTC)-2023 ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ బెంగాల్ పేసర్ బరిలోకి దిగాడు. నాటి ఈ మెగా పోరులో షమీ ఓవరాల్‌గా నాలుగు వికెట్లు తీయగలిగాడు.అనంతరం స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్‌కప్-2023లో అద్భుత ప్రదర్శన కనబరిచిన షమీ.. ఈ ఐసీసీ ఈవెంట్ ముగిసిన తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.వరుస సిరీస్‌లకు దూరంఈ క్రమంలో సుదీర్ఘ విరామం అనంతరం పరిమిత ఓవర్ల క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చిన ఈ రైటార్మ్ పేసర్.. ఆఖరిగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)ఫైనల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, టెస్టుల్లో మాత్రం వరుస సిరీస్‌లకు అతడు దూరమయ్యాడు.స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్- అనంతరం ఆస్ట్రేలియా పర్యటన, ఇంగ్లండ్ టూర్లకు ఎంపిక చేసిన జట్లలో షమీకి చోటు దక్కలేదు. అయితే, ఆసీస్ టూర్‌కు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పినా సెలక్టర్లు పట్టించుకోలేదనే వార్తలు వచ్చాయి.ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు తాజాగా స్పందిస్తూ.. ‘‘ఫామ్‌లేమి కారణంగా అతడిని జట్టు నుంచి తప్పించలేదు. ఫిట్నెస్ సమస్యల కారణంగా తనకు తానే తప్పుకొన్నాడు. అందుకే ఇంగ్లండ్‌కు ప్రయాణం చేయలేకపోయాడు.సెలక్టర్లు తప్పించలేదు.. తనే తప్పుకొన్నాడుఆస్ట్రేలియా టూర్ మిస్సైన తర్వాత.. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయాలని సెలక్టర్లు భావించారు. అతడి అవసరం జట్టుకు ఉందని భావించారు. జట్టును ఖరారు చేసే సమయంలో షమీతో మాట్లాడారు కూడా!అయితే, తను మాత్రం ఆత్మవిశ్వాసంతో లేడు. ఫిట్నెస్ సమస్యలు లేవని కచ్చితంగా చెప్పలేకపోయాడు. షమీ ఫిట్నెస్ సాధిస్తే సంప్రదాయ ఫార్మాట్లోనూ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వగలడు. రంజీ మ్యాచ్‌లలో మూడు- నాలుగు ఓవర్లు బౌల్ చేసి అతడు విశ్రాంతి తీసుకున్నాడు. అయితే, ఐదు రోజుల మ్యాచ్‌కు అతడి శరీరం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నపుడే రీఎంట్రీపై స్పష్టత వస్తుంది.దులిప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున అతడి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి’’ అని పేర్కొన్నాయి. అదే విధంగా.. 34 ఏళ్ల షమీకి వయస్సు పెద్ద సమస్య కాదని.. ఇంకో ఏడు- ఎనిమిదేళ్ల పాటు క్రికెట్ ఆడగల సత్తా అతడిలో ఉందంటూ సదరు వర్గాలు ప్రశంసలు కురిపించాయి.చదవండి: క్రికెట్లో కలకాలం నిలిచిపోయే రికార్డులు.. ఎవ్వరూ బ్రేక్ చేయలేరు! -
ఆసియాకప్-2025కు శుబ్‌మన్ గిల్ దూరం!?
ఆసియాకప్-2025కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో నెల రోజుల్లో యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ షూరూ కానుంది. సెప్టెంబర్ 9న అబుదాబి వేదికగా తొలి మ్యాచ్‌లో హాంకాంగ్, అఫ్గానిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ ఆసియా సింహాల పోరు కోసం బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డులు తమ ప్రాథిమిక జట్లను ప్రకటించాయి.బీసీసీఐ సెలక్షన్ కమిటీ కూడా వచ్చే వారం భారత జట్టును ప్రకటించే అవకాశముంది. అయితే ఈ టోర్నీ కోసం భారత జట్టులో టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను చేర్చాలా వద్దా అని సెలక్టర్లు తర్జబర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని గిల్‌కు విశ్రాంతి ఇవ్వాలని అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ఆసియాకప్ ముగిసిన నాలుగు రోజులకే భారత్-వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఆసియాకప్‌నకు గిల్‌కు విశ్రాంతి ఇచ్చి టీ20 వరల్డ్ కప్-2026లో అతడిని ఆడించాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు ది టెలిగ్రాఫ్ తమ కథనంలో పేర్కొంది.కాగా గిల్ వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు దులీప్ ట్రోఫీ-2025లో ఆడనున్నాడు. నార్త్‌జోన్ కెప్టెన్‌గా శుబ్‌మన్ వ్యవహరించనున్నాడు. కాగా గిల్ ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా, వ్యక్తిగత ప్రదర్శనంగా పరంగా ఆకట్టుకున్నాడు.ఐదు మ్యాచ్‌లలో 75.40 సగటుతో 754 పరుగులు చేసి గిల్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఇక ఆసియాకప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా యూఏఈతో తలపడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న దాయాది పాకిస్తాన్‌తో మెన్ ఇన్ బ్లూ అమీతుమీ తెల్చుకోనుంది.చదవండి: శుబ్‌మన్ గిల్ జెర్సీ కోసం పోటీ.. ఎన్ని లక్షలకు అమ్ముడుపోయిందంటే? -
టీమిండియా సెలక్టర్లు కాదు.. ఇకపై అతడే డిసైడ్ చేస్తాడా?
టీమిండియాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ (Sandeep Patil) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నవతరం ఆటగాళ్లంతా పనిభారం అంటూ సాకులు చూపడం సరికాదని విమర్శించాడు. ఆధునిక క్రికెట్లో కెప్టెన్, హెడ్‌కోచ్ కంటే ఫిజియోలకే ఎక్కువ ప్రాముఖ్యం దక్కుతోందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy) ఆడేందుకు టీమిండియా ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో ఆద్యంతం రసవత్తరంగా సాగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను గిల్ సేన 2-2తో సమంగా ముగించింది. బుమ్రా మూడే ఆడాడుఅయితే, ఈ సిరీస్‌లో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా.. అతడిని కేవలం మూడు టెస్టుల్లోనే ఆడించారు. పనిభారం తగ్గించుకునే క్రమంలో బుమ్రా కీలక సమయంలో.. కీలక మ్యాచ్‌లకు దూరం కావాల్సి వచ్చింది. సిరీస్ డ్రా అయింది కాబట్టి సరిపోయింది గానీ.. లేదంటే బుమ్రాతో పాటు మేనేజ్మెంట్పై విమర్శల దాడి మరింత ఎక్కువయ్యేది. ఈ నేపథ్యంలో వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ గురించి క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తుండగా.. టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.అతడే డిసైడ్ చేస్తాడా?‘‘అసలు బీసీసీఐ ఇలాంటి వాటికి ఎలా అంగీకరిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. కెప్టెన్, హెడ్‌కోచ్ కంటే వీరికి ఫిజియోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తి అయ్యేలా ఉన్నాడు. అసలు సెలక్టర్లు ఏం చేస్తున్నారు?సెలక్షన్ కమిటీ సమావేశాల్లో వీరితో కలిసి ఫిజియో కూడా కూర్చుంటాడా ఏమిటి?. ఎవరి వర్క్‌లోడ్ ఎంత? ఎవరు ఆడాలని అతడే డిసైడ్ చేస్తాడా?’’ అని 1983 వన్డే వరల్డ్‌కప్ విన్నర్ సందీప్ పాటిల్ అసహనం వ్యక్తం చేశాడు.పనికిమాలిన వ్యవహారంఅదే విధంగా.. ‘‘వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ అనేదే ఓ పనికిమాలిన వ్యవహారం. ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నారా? లేదంటే అన్‌ఫిట్?.. ఈ రెండిటి ఆధారంగానే జట్ల ఎంపిక ఉండాలి. అంతేగానీ.. ఈ వర్క్‌లోడ్ బిజినెస్‌ను పట్టించుకోకూడదు.మా రోజుల్లో అయితే ఫ్యాన్సీ స్ట్రోక్స్ ఆడేందుకు ప్రయత్నించినా సునిల్ గావస్కర్ తిట్టేవాడు. అయితే, రోజులు మారాయి. కానీ ఈ నవతరం క్రికెటర్లు తరచూ మ్యాచ్‌లు మిస్ కావడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా’’ అని సందీప్ పాటిల్ మిడ్-డేతో పేర్కొన్నాడు.చదవండి: నిన్ను ఇలా చూడలేకపోతున్నాం భయ్యా!.. విరాట్ కోహ్లి ఫొటో వైరల్


