BCCI: రియాన్‌ పరాగ్‌ ఎస్కేప్‌.. ఊహించని ట్విస్ట్‌! | Riyan Parag To Escapes BCCI Punishment Another To Be Sentenced | Sakshi
Sakshi News home page

BCCI: రియాన్‌ పరాగ్‌ ఎస్కేప్‌.. ఊహించని ట్విస్ట్‌!

Apr 30 2026 1:17 PM | Updated on Apr 30 2026 3:04 PM

Riyan Parag To Escapes BCCI Punishment Another To Be Sentenced

రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్‌-2026లో భాగంగా.. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా అతడు డ్రెస్సింగ్‌రూమ్‌లో ‘వేపింగ్‌’ (ఇ–సిగరెట్‌తో పొగ పీల్చడం) చేసిన సంగతి తెలిసిందే. అతడు చేసిన పని టీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. 

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కాగా.. రియాన్‌తో పాటు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

లక్ష రూపాయల జరిమానా లేదా
కాగా ద్రవరూపంలో ఉండే నికొటిన్‌ను ఉపయోగించే ఇ–సిగరెట్‌లను భారత ప్రభుత్వం 2019లోనే నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతిక్రమనకు లక్ష రూపాయల జరిమానా లేదా ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.

నిజానికి ఇప్పుడు పరాగ్‌ వివాదం ప్రభుత్వ నిబంధనలకంటే బీసీసీఐ కోణంలో అతిపెద్ద సమస్యగా మారింది. ఐపీఎల్‌లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఒక జట్టుకు కెప్టెన్‌గా ఉంటూ అతడు ఇలా చేయడంపై చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ రియాన్‌ పరాగ్‌పై కఠిన చర్యలు తీసుకోనుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఊహించని ట్విస్ట్‌
అయితే, రియాన్‌ పరాగ్‌ విషయంలో ఊహించని ట్విస్ట్‌ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. విపుల్‌ కశ్యప్‌ అనే జర్నలిస్టు ఇందుకు సంబంధించి తాజా అప్‌డేట్‌ను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. రియాన్‌ పరాగ్‌పై బీసీసీఐ నేరుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని దీని సారాంశం.

రియాన్‌ పరాగ్‌ తప్పించునే అవకాశం
ఐపీఎల్‌ లేదంటే బీసీసీఐ ప్రవర్తనా నియమావళిలో ‘వేపింగ్‌’కు సంబంధించి ఎలాంటి శిక్ష విధించాలన్న అంశంపై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రియాన్‌ పరాగ్‌ తప్పించునే అవకాశం ఉండగా.. మ్యాచ్‌ అధికారులపై మాత్రం బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆయనపై వేటు?
ఓ ఆటగాడు అలాంటి నిషేధిత వస్తువును మైదానంలోకి తీసుకురావడమే గాకుండా.. ఓవైపు మ్యాచ్‌ జరుగుతుండగా డ్రెసింగ్‌ రూమ్‌లో వేపింగ్‌ చేయడాన్ని బీసీసీఐ భద్రతా వైఫల్యంగా భావిస్తున్నట్లు సమాచారం. అతడికి ఆ అవకాశం ఇచ్చినందుకు గానూ మ్యాచ్‌ రిఫరీ లేదంటే ఇతర అధికారులపై వేటు పడనుందని సమాచారం.

కాగా పంజాబ్‌ కింగ్స్‌- రాజస్తాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌కు అమిత్‌ శర్మ రిఫరీ. ఒకవేళ బీసీసీఐ గనుక రంగంలోకి దిగితే అతడికి పనిష్మెంట్‌ తప్పకపోవచ్చు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌ సందర్భంగా రాజస్తాన్‌ పంజాబ్‌కు ఈ సీజన్‌లో తొలిసారి ఓటమిని రుచిచూపించింది. శ్రేయస్‌ అయ్యర్‌ సేనను పరాగ్‌ బృందం ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో రియాన్‌ పరాగ్‌ 16 బంతుల్లో కేవలం 29 పరుగులు చేశాడు.

చదవండి: IPL 2026: భారీ తప్పిదం.. ముంబై ఇండియన్స్‌ ఓటమికి కారణం ఇదే?

Advertisement
 
Advertisement
Advertisement