PBKS vs RR
-
రియాన్ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చర్యలు చేపట్టింది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ప్రవర్తించిన తీరుకు జరిమానాతో సరిపెట్టింది. కాగా ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమితుడైన రియాన్ పరాగ్.. సారథిగా ఆకట్టుకుంటున్నాడు.ఇ–సిగరెట్‌తో పొగ పీల్చి..పరాగ్ కెప్టెన్సీలో రాజస్తాన్ ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లలో ఆరు గెలిచింది. అయితే, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా పరాగ్ (Riyan Parag) ప్రవర్తించిన తీరు వివాదానికి దారి తీసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్రెసింగ్ రూమ్‌లో ఉన్న రియాన్ పరాగ్ ‘వేపింగ్’ (ఇ–సిగరెట్‌తో పొగ పీల్చడం) చేశాడు.భారత్‌లో నిషేధంఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. నిజానికి ద్రవరూపంలో ఉండే నికొటిన్‌ను ఉపయోగించే ఇ–సిగరెట్లను భారత ప్రభుత్వం 2019లోనే నిషేధించింది. అలాంటి ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో కెప్టెన్ స్థాయిలో ఉండి పరాగ్ నిబంధనలు అతిక్రమించడం చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలో బీసీసీఐ రియాన్ పరాగ్‌పై వేటు వేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం కాగా.. ఓ జర్నలిస్టు మాత్రం అతడు చేసిన తప్పునకు విధించే శిక్ష విషయంలో ఐపీఎల్ నియమాల్లో స్పష్టత లేదని పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకుంది.మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతరియాన్ పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు.. క్రమశిక్షణారాహిత్యం కింద అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.21 కింద ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ ఆర్టికల్ ప్రకారం.. టోర్నీ గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటారు.ఇదిలా ఉంటే.. వేపింగ్‌పై నిషేధం ఉన్నప్పటికీ ఈమేరకు అతిక్రమనకు పాల్పడితే లక్ష రూపాయల జరిమానా లేదా ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి తరుణంలో బీసీసీఐ మాత్రం తూతూమంత్రంగా చర్యలు తీసుకుందనే విమర్శలు వస్తున్నాయి.చదవండి: IPL 2026: క్లాసెన్ సంచలన నిర్ణయం..? డిమాండ్లకు తలొగ్గి? -
BCCI: రియాన్ పరాగ్ ఎస్కేప్.. ఊహించని ట్విస్ట్!
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్-2026లో భాగంగా.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా అతడు డ్రెస్సింగ్‌రూమ్‌లో ‘వేపింగ్’ (ఇ–సిగరెట్‌తో పొగ పీల్చడం) చేసిన సంగతి తెలిసిందే. అతడు చేసిన పని టీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. రియాన్‌తో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.లక్ష రూపాయల జరిమానా లేదాకాగా ద్రవరూపంలో ఉండే నికొటిన్‌ను ఉపయోగించే ఇ–సిగరెట్లను భారత ప్రభుత్వం 2019లోనే నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతిక్రమనకు లక్ష రూపాయల జరిమానా లేదా ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.నిజానికి ఇప్పుడు పరాగ్ వివాదం ప్రభుత్వ నిబంధనలకంటే బీసీసీఐ కోణంలో అతిపెద్ద సమస్యగా మారింది. ఐపీఎల్‌లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఒక జట్టుకు కెప్టెన్‌గా ఉంటూ అతడు ఇలా చేయడంపై చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ రియాన్ పరాగ్‌పై కఠిన చర్యలు తీసుకోనుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఊహించని ట్విస్ట్అయితే, రియాన్ పరాగ్ విషయంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. విపుల్ కశ్యప్ అనే జర్నలిస్టు ఇందుకు సంబంధించి తాజా అప్డేట్ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. రియాన్ పరాగ్‌పై బీసీసీఐ నేరుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని దీని సారాంశం.రియాన్ పరాగ్ తప్పించునే అవకాశంఐపీఎల్ లేదంటే బీసీసీఐ ప్రవర్తనా నియమావళిలో ‘వేపింగ్’కు సంబంధించి ఎలాంటి శిక్ష విధించాలన్న అంశంపై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ తప్పించునే అవకాశం ఉండగా.. మ్యాచ్ అధికారులపై మాత్రం బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.🚨 BIG UPDATE FROM IPL 🚨Rajasthan Royals captain Riyan Parag could face a 2-match ban after an alleged dressing room incident.⚠️ Reports suggest he was caught vaping inside the dressing room.🔥 If confirmed, Yashasvi Jaiswal is likely to lead RR for the next two matches.… pic.twitter.com/bKD9zfpQko— True Vector (@TrueVector33) April 28, 2026ఆయనపై వేటు?ఓ ఆటగాడు అలాంటి నిషేధిత వస్తువును మైదానంలోకి తీసుకురావడమే గాకుండా.. ఓవైపు మ్యాచ్ జరుగుతుండగా డ్రెసింగ్ రూమ్‌లో వేపింగ్ చేయడాన్ని బీసీసీఐ భద్రతా వైఫల్యంగా భావిస్తున్నట్లు సమాచారం. అతడికి ఆ అవకాశం ఇచ్చినందుకు గానూ మ్యాచ్ రిఫరీ లేదంటే ఇతర అధికారులపై వేటు పడనుందని సమాచారం.కాగా పంజాబ్ కింగ్స్- రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు అమిత్ శర్మ రిఫరీ. ఒకవేళ బీసీసీఐ గనుక రంగంలోకి దిగితే అతడికి పనిష్మెంట్ తప్పకపోవచ్చు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ పంజాబ్‌కు ఈ సీజన్లో తొలిసారి ఓటమిని రుచిచూపించింది. శ్రేయస్ అయ్యర్ సేనను పరాగ్ బృందం ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో రియాన్ పరాగ్ 16 బంతుల్లో కేవలం 29 పరుగులు చేశాడు.UPDATE: రియాన్ పరాగ్‌పై బీసీసీఐ చర్యలుచదవండి: IPL 2026: భారీ తప్పిదం.. ముంబై ఇండియన్స్ ఓటమికి కారణం ఇదే? -
వైభవ్ సూర్యవంశీపై విద్వేష విషం.. వీడియో వైరల్
వైభవ్ సూర్యవంశీ.. గతేడాది కాలంగా భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్న పేరు. దేశీ క్రికెట్, భారత్ అండర్-19 జట్టు తరఫున అదరగొట్టిన ఈ బిహారీ పిల్లాడు.. ఐపీఎల్-2026లోనూ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు.గతేడాది రాజస్తాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా ఐపీఎల్లో అత్యంత పిన్న వయసు (14 ఏళ్లు)లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.ఆ తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా గడ్డపై ఫార్మాట్లకు అతీతంగా రాణించిన వైభవ్.. అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లోనూ దుమ్ములేపాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించి భారత్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.36 బంతుల్లోనే శతకంఇక తాజాగా ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ తరఫున మరోసారి అదరగొడుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే శతకం సాధించాడు. తాజాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.ఆరెంజ్ క్యాప్తద్వారా ఈ సీజన్లో ఇప్పటికి ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 400 పరుగులు పూర్తి చేసుకున్నాడు వైభవ్. తద్వారా అత్యధిక పరుగుల వీరులకు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ చేతులు మారి ఈ లెఫ్టాండర్‌కు చేరింది. దీంతో మరోసారి వైభవ్ సూర్యవంశీపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.అదే సమయంలో కొంతమంది ‘అభిమానుల’ ముసుగులో వైభవ్ సూర్యవంశీని తిట్టిపోయడం ఆశ్చర్యం కలిగించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో... టీమ్ బస్సులో వెళ్తున్న సమయంలో వైభవ్ ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటున్నట్లు కనిపిస్తోంది.విద్వేష విషంఆ సమయంలో కొంతమంది బస్సు బయట నిల్చుని వైభవ్‌ను ఫొటోలు, వీడియోలు తీయాలని అత్యుత్సాహం ప్రదర్శించారు. అయితే, వైభవ్ మాత్రం వారి వైపు చూడకుండా తన పనిలో తాను మునిగిపోయాడు. దీంతో.. ‘‘చాలా ఎక్కువైంది. ఒక్కసారైనా చూడవచ్చు కదా! ఇంత ఓవరాక్షన్ ఎందుకు?’’ అంటూ వైభవ్‌పై విద్వేష విషం చిమ్మారు.Shameless how grown men are mocking a 15-year-old for 'attitude.' He’s just a kid trying to process the pressure of being a professional athlete. Let him breathe.💔 pic.twitter.com/HrDY6uY33D— CSK Xtra (@Im_Kushall) April 28, 2026సిగ్గులేకుండా..అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు వైభవ్ సూర్యవంశీకి మద్దతుగా నిలుస్తూ.. అక్కడున్న వాళ్లపై మండిపడుతున్నారు. ‘‘సిగ్గులేకుండా పదిహేనేళ్ల పిల్లాడిపై ఈ ‘పెద్ద మనుషులు’ విషం చిమ్ముతున్నారు. ఆటిట్యూడ్ చూపిస్తున్నాడంటూ పిల్లాడిని ఆడిపోసుకుంటూ వెక్కిరిస్తున్నారు.ప్రపంచంలోనే భారీ క్రేజ్ ఉన్న ఐపీఎల్లో ఈ పిల్లాడు ఆడుతున్నాడు. వరల్డ్‌క్లాస్ బౌలర్లను ఎదుర్కొంటూ చితక్కొడుతున్నాడు. ఆ ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో కాస్త సేద తీరితే.. తమవైపు చూడలేదంటూ ఇంతకు దిగజారుతారా? మీకిదో వ్యసనంగా మారింది. పాపం పిల్లాడిని కాస్త ఊపిరిపీల్చుకోనివ్వండి’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం అద్భుతం: శ్రేయస్ -
టీమిండియాకు సెలక్ట్ చేయమని అడగట్లేదు.. కానీ
భారత టీ20 జట్టులో స్థానం కోసం పోటీ రోజురోజుకీ పెరిగిపోతోంది. వన్డే, టెస్టు జట్ల కెప్టెన్ శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఈ రేసులో ముందు వరుసలో ఉండగా.. దేవదత్ పడిక్కల్, ఆకిబ్ నబీ, ప్రియాన్ష్ ఆర్య, చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ పేర్లు కూడా తరచుగా వినిపిస్తున్నాయి.చివరగా అపుడేఅయితే, వీరందరి కంటే అర్హుడైన ఆటగాడు మరొకడు ఉన్నాడని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అంటున్నాడు. గత మూడేళ్లుగా మెరుగ్గా రాణిస్తున్నా అతడిని సెలక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే.. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal).టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్‌గా నిలిచిన భారత జట్టుతో ప్రయాణించాడు జైసూ. ఆ తర్వాత శ్రీలంకతో జూలైలో జరిగిన సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున చివరి టీ20 ఆడాడు. ఇక ఐపీఎల్లో మాత్రం రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా జైస్వాల్ నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.తాజాగా పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో.. 27 బంతుల్లో 51 పరుగులతో ఆకట్టుకున్నాడు యశస్వి జైస్వాల్. పంజాబ్‌పై రాజస్తాన్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.టీమిండియాకు సెలక్ట్ చేయమని అడగట్లేదు.. కానీ‘‘గత మూడేళ్లుగా అతడి గణాంకాలు పరిశీలించండి. 2024లో వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. ఆ తర్వాత జట్టు నుంచి తప్పించేశారు. ప్రతి ఆటగాడి కెరీర్లో ఇలాంటివి సహజమే.అయితే, యశస్వి గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడటం లేదు. అతడిని కచ్చితంగా భారత టీ20 జట్టుకు ఎంపిక చేయాలని నేను అనడం లేదు. జట్టులో ఇప్పుడు చోటు ఖాళీగా లేదని నాకు కూడా తెలుసు.సెలక్షన్ సంగతి పక్కనపెడితే..కానీ ఇక్కడ ఓ విషయం గమనించాల్సి ఉంది. గత మూడేళ్లుగా అతడు ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్నాడు. సగటు, స్ట్రైక్‌రేటు కూడా బాగుంది. తన పనిని తాను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. అయినా సరే సెలక్షన్ సంగతి పక్కనపెడితే.. కనీసం చర్చల్లో కూడా ఎవరూ అతడి పేరు తీసుకురావడం లేదు.గంజిలో ఈగ లాగా తీసిపారేశారు. అతడు చేసిన తప్పేంటి?’’ అని ఆకాశ్ చోప్రా టీమిండియా సెలక్షన్ కమిటీ తీరును విమర్శించాడు. కాగా ఐపీఎల్-2026లో ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన జైస్వాల్ 306 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గతేడాది 14 మ్యాచ్‌లలో కలిపి 559.. అదే విధంగా 2024లో 16 మ్యాచ్‌లలో కలిపి 435 పరుగులు సాధించాడు యశస్వి జైస్వాల్. చదవండి: బాబర్ ఆజం ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర -
రూ. 18 కోట్లు! .. వరుస వైఫల్యాలు.. అందరి కళ్లు అతడి మీదే..
యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal).. ఈ టీమిండియా స్టార్ క్రికెటర్ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. తన కెరీర్‌కు పునాది వేసిన ముంబై క్రికెట్‌ను వీడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తదుపరి దేశవాళీ సీజన్లో గోవాకు ఆడనుండటం చర్చకు దారితీసింది. ముంబై కెప్టెన్ అజింక్య రహానే, యాజమాన్యంతో విభేదాల వల్లే జైసూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు రావడం గమనార్హం.వరుస వైఫల్యాలు.. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా యశస్వి జైస్వాల్ ఫామ్‌లేమితో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో, ఇంగ్లండ్‌తో వన్డేలోనూ పరుగులు రాబట్టలేక ఇబ్బంది పడ్డాడు. ఇక ఐపీఎల్-2025 (IPL 2025)లోనూ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది.రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంటే..మెగా వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్ తమ ఓపెనర్ జైసూను ఏకంగా రూ. 18 కోట్లకు అట్టిపెట్టుకుంది. అయితే, ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ అతడు తేలిపోయాడు. తన స్థాయికి తగ్గట్లుగా ఒక్కసారీ బ్యాట్ ఝులిపించలేకపోయాడు. మూడు ఇన్నింగ్స్‌లో కలిపి 11.33 సగటుతో 34 పరుగులు మాత్రమే చేయగలిగాడు.ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒక్కటే గెలిచింది. ఇక శనివారం నాటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో యశస్వి జైస్వాల్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అతడే ముఖ్యం‘‘జైస్వాల్ ఇప్పటికీ పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. ఓపెనర్‌గా తను బ్యాట్ ఝులిపిస్తేనే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది. జట్టులో అతడు అత్యంత కీలక సభ్యుడు. తప్పక పరుగులు చేయాల్సిన బాధ్యత అతడిపై ఉంది. పంజాబ్‌తో మ్యాచ్‌లో అందరి దృష్టి అతడి మీదే కేంద్రీకృతమై ఉంటుందనడంలో సందేహం లేదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.సంజూ రాకతోఇక పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా సంజూ శాంసన్ కెప్టెన్‌గా విధుల్లో చేరనుండటం రాజస్తాన్‌కు సానుకూలాంశంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్‌గా, కీపర్‌గా రాయల్స్ సంజూను మిస్ అయింది.పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవడంలో అతడు దిట్ట. కీపర్‌గానూ జట్టుకు అతడి సేవలు ముఖ్యం. కాబట్టి అతడి రాకతో జట్టులో సానుకూల వాతావరణం ఏర్పడింది’’ అని పేర్కొన్నాడు.చదవండి: IPL 2025 MI Vs LSG: బెడిసికొట్టిన వ్యూహం.. ఏం చేస్తున్నావ్ హార్దిక్? .. ఆకాశ్ అంబానీ రియాక్షన్ వైరల్


