టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌ ప్రకటన.. సూర్యవంశీకి ఛాన్స్‌ | BCCI Announce New T20I Captain Teams For Ireland England Asian Games | Sakshi
Sakshi News home page

BCCI: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌ ప్రకటన.. సూర్యవంశీకి ఛాన్స్‌

Jun 6 2026 1:15 PM | Updated on Jun 6 2026 4:16 PM

BCCI Announce New T20I Captain Teams For Ireland England Asian Games

టీమిండియాకు కొత్త టీ20 కెప్టెన్ వ‌చ్చాడు. సూర్య‌కుమార్ యాద‌వ్‌పై వేటు వేసిన బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ.. అత‌డి స్ధానంలో జ‌ట్టు ప‌గ్గాల‌ను మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు అప్పగించింది. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ల‌తో టీ20 సిరీస్‌లకు జ‌ట్టు ఎంపిక సంద‌ర్భంగా అజిత్ అగార్క‌ర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 

అదేవిధంగా శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు డిప్యూటీగా హైద‌రాబాదీ తిల‌క్ వ‌ర్మ‌ను సెల‌క్ట‌ర్లు నియ‌మించారు. వీటితో పాటు సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా క్రీడలకు భారత జట్టును ప్రకటించారు. ఏషియన్‌ గేమ్స్‌లో కూడా టీమిండియా కెప్టెన్‌గా అయ్యర్‌ వ్యవహరించనున్నాడు.

వైభవ్‌కు ఛాన్స్‌
ఇక ఐపీఎల్‌-2026లో దుమ్ములేపిన రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టీ20 జట్టులో చోటు కల్పించారు. దీంతో 15 ఏళ్ల సూర్యవంశీ.. భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయష్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ 16 ఏళ్ల వయస్సులో టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు.

సూర్య ఖేల్ ఖతం
ఇక టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ ప్రస్ధానం ముగిసినట్లే. సారధిగా భారత్‌కు టీ20 ప్రపంచకప్‌-2026ను అందించినప్పటికి.. పేలవ ఫామ్‌, భవిష్యత్తు ప్రణాళికల కారణంగా అతడిపై వేటు వేశారు. కెప్టెన్‌గానే కాకుండా పూర్తిగా జట్టు నుంచే సూర్యను తొలగించారు. గత కొంత కాలంగా టీ20లకే పరిమితమైన సూర్యను, ఇకపై మరి భారత జెర్సీలో చూడకపోవచ్చు.

ప్రిన్స్‌ యాదవ్‌కు చోటు
మరోవైపు వైభవ్‌తో పాటు ఈ ఏడాది సీజన్‌లో అదరగొట్టిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేస్‌ బౌలర్‌ ప్రిన్స్‌ యాదవ్‌కు కూడా టీ20 జట్టులో చోటు దక్కింది. ప్రిన్స్‌ యాదవ్‌ ఇప్పటికే అఫ్గానిస్తాన్‌తో వన్డేలకు ఎంపికైన సంగతి తెలిసిందే.

సచిన్ రికార్డు బ్రేక్... టీమిండియాలోకి వైభవ్ అయ్యర్‌కు కెప్టెన్సీ

ఐర్లాండ్ టీ20లకు భారత జట్టు
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, నితీశ్‌ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా

ఇంగ్లండ్ టీ20లకు భారత జట్టు
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, తిలక్ వర్మ, నితీశ్‌ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, వ‌రుణ్ చక్రవర్తి

ఆసియా క్రీడలకు భారత టీ20 జట్టు
శ్రేయస్‌  అయ్యర్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ (వైస్‌ కెప్టెన్‌), రవి బిష్ణోయి, అభిషేక్‌ శర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, జస్‌ప్రీత్‌ బుమ్రా, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, హర్షిత్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, శివం దూబే, వరుణ్‌ చక్రవర్తి, వైభవ్‌ సూర్యవంశీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement