ఐపీఎల్‌లో పరుగుల పండుగ అభిమానులకు ఎంత కిక్ ఇస్తుందో, వివాదాలు, గొడవలు కూడా అదే స్థాయిలో ఫ్యాన్స్‌ను అలరించాయి. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి తాజా 19వ సీజన్ దాకా ఎన్నో గొడవలు, వివాదాలు చోటు చేసుకున్నాయి. మరి ఈ సీజన్‌లో అభిమానులకు కిక్ ఇచ్చిన టాప్-10 వివాదాలు ఏంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం.
1) కోహ్లి-గిల్ క్యాచ్ వివాదం
ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లి క్యాచ్ ఔట్‌పై ఎంత రగడ జరిగిందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 63 పరుగులతో కోహ్లి ఆర్సీబీని విజయం వైపు నడిపిస్తున్న సమయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి అర్షద్ ఖాన్ వేసిన బంతిని కోహ్లి మిడాఫ్ మీదుగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ గిల్ డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఆ క్యాచ్‌ను గిల్ సరిగ్గా పట్టలేదని, చేతుల్లోకి వెళ్లడానికి ముందు బంతి నేలను తాకిందని కోహ్లీ భావించాడు.
A chat between Virat Kohli and Shubman Gill on the catch.
- The celebration by Kohli after winning the argument. 😄 pic.twitter.com/9yVbseOqGy— Mufaddal Vohra (@mufaddal_vohra) May 31, 2026
అయితే అంపైర్ నితిన్ మీనన్ ఔట్ ఇవ్వడంతో షాక్ తిన్న కోహ్లీ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. తాను ఔట్ కాదని, క్రీజు వదలి వెళ్లనని, థర్డ్ అంపైర్ రివ్యూకు చాన్స్ ఇవ్వాలిని మొండిపట్టు పట్టాడు. చేసేదేం లేక అంపైర్ తన నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు నివేదించాడు. రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్‌కు కూడా అది స్పష్టంగా కనిపించకపోయినా.. బంతిలో కొంత భాగం నేలను తాకినట్లు గుర్తించి ఔట్ నిర్ణయాన్ని రద్దు చేసి నాటౌట్‌గా ప్రకటించాడు. కోహ్లీ సంబరాలు చేసుకోగా, గిల్ మాత్రం నిరాశతో చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత 75 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో కోహ్లీ ఆర్సీబీకి రెండో టైటిల్ అందించాడు.
2) షేక్‌హ్యాండ్ వివాదం..
ఈ సీజన్‌లో అభిమానులకు మరింత కిక్ ఇచ్చిన ఎపిసోడ్ అంటే కోహ్లీ, హెడ్ మధ్య జరిగిన షేక్ హ్యాండ్ వివాదమే అని చెప్పొచ్చు. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీతో హెడ్ వ్యంగ్యంగా మాట్లాడడం, దానికి కోహ్లీ ధీటుగా బదులివ్వడం జరిగిపోయాయి. అయితే ఈ గొడవ ఇక్కడితో సద్దుమణగలేదు.
Look behind the whole SRH coaching staff, including Daniel Vettori and Muttiah Muralitharan, were watching Virat Kohli and Travis Head, expecting some drama and ready to stop a fight. But Kohli didn’t shake hands, and everyone started laughing. 😂
Kohli you character 🔥 pic.twitter.com/W9CS6KM52t— Avénue.1 (@Avnueone8) May 23, 2026
మ్యాచ్ పూర్తైన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో హెడ్ తన వద్దకు వచ్చినా కోహ్లీ అతడిని పట్టించుకోకుండా పక్కకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఈ వివాదం హెడ్ భార్యను కూడా తాకింది. ఆమెపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు పెడుతూ కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. మరి ఈ వివాదానికి ఈ సీజన్‌తో ముగింపు పడిందా అంటే చెప్పలేని పరిస్థితి.
3) టిమ్ డేవిడ్ అనైతిక చర్య
మే 11న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ విజయం తర్వాత ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ చేతి వేళ్లతో అసభ్య సంజ్ఞలు చేయడం వివాదాస్పదమైంది. సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన మెగా వేలంలో ముంబై ఇండియన్స్ తనను విడుదల చేయడంపై వ్యంగ్యంగా ఈ సైగలు చేసినట్లు తేలింది. దీంతో బీసీసీఐ టిమ్ డేవిడ్ చర్యను తప్పుబడుతూ అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లు కేటాయించింది.
4) టాస్ వివాదం..
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-2 పోరు సందర్భంగా టాస్ సమయంలో నెలకొన్న గందరగోళం వివాదంగా మారింది. మొదట టాస్ వేసినప్పుడు పరాగ్ హెడ్ అని చెప్పాడు. అయితే మ్యాచ్ రిఫరీ ప్రకాశ్ భట్ మాత్రం పరాగ్ చెప్పింది అర్థం కాలేదంటూ టాస్ మళ్లీ వేయించాడు.
రెండో ప్రయత్నంలో రాజస్తాన్ రాయల్స్‌కు టాస్ అనుకూలించడంతో బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలి ప్రయత్నంలో గుజరాత్‌కు టాస్ అనుకూలంగా వచ్చినట్లు తర్వాత తేలింది. ఈ సమయంలో గుజరాత్ కెప్టెన్ గిల్ కాస్త అయోమయానికి గురయ్యాడు. కానీ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడంతో ఈ వివాదంపై పెద్దగా చర్చ జరగలేదు.
5) అంపైరింగ్‌పై ఎస్ఆర్‌హెచ్ ఫిర్యాదు
ఈ సీజన్‌లో వరుస వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయాలు తమను తీవ్ర ప్రభావితం చేశాయంటూ ఎస్ఆర్‌హెచ్ బీసీసీఐని ఆశ్రయించడం హైలైట్‌గా నిలిచింది. ఆర్సీబీతో మ్యాచ్‌లో క్లాసెన్ వివాదాస్పద క్యాచ్, కేకేఆర్‌తో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ క్యాచ్‌పై, లక్నో ఆటగాడు అవేశ్ ఖాన్ బంతి బౌండరీ లైన్‌ను దాటకముందే, ఆ తాడును వెనక్కి నెట్టేయడంపై ఎస్ఆర్‌హెచ్ అసహనం వ్యక్తం చేసింది. ఎంసీసీ నిబంధనల ప్రకారం ఈ చర్యపై ఆటగాడికి భారీ జరిమానా విధించాలని బీసీసీఐ ఎదుట వాదించడం చర్చనీయాంశమైంది.
6) పరాగ్ డ్రెస్సింగ్ రూమ్ ఘటన
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ వేపింగ్ (ఈ-సిగరేట్) చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. నిబంధనల ప్రకారం ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడడం నిషిద్ధం. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన బీసీసీఐ ఆట పరువుకు భంగం కలిగించినందుకు పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు, ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది.
Captain of Rajasthan Royals team Riyan Parag enjoying vape in the RR dressing room .
Vaping is illegal in India . Hello @BCCI is this allowed?
#PBKSvsRR pic.twitter.com/banIgJDO6u— Surbhi (@SurrbhiM) April 29, 2026
7) రాజస్తాన్ డగౌట్ మొబైల్ వివాదం
ఈ సీజన్‌లో వివాదాల్లో హైలైట్‌గా నిలిచిన వాటిలో రాజస్తాన్ రాయల్స్ డగౌట్‌లో మొబైల్ ఫోన్ కనిపించడమే. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా డగౌట్‌లో రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమి భిందర్ మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుండడం కెమెరాల కంటికి చిక్కింది. ఈ చర్య పట్ల సీరియస్ అయిన బీసీసీఐ భిందర్ మొబైల్ అనుకోకుండా వాడానని, మెడికల్‌రిపోర్ట్స్ చూసుకునేందుకే ఫోన్ వాడినట్లు తెలిపాడు. తన చర్య పట్ల క్షమాపణ చెప్పినప్పటికీ, అతడి వివరణతో సంతృప్తి చెందని బీసీసీఐ రోమి భిందర్‌కు రూ.లక్ష జరిమానా విధించింది. రోమి భిందర్ చర్యను వ్యతిరేకిస్తూ బీసీసీఐ ఆటగాళ్లకు కఠిన ఆంక్షలు, నిబంధనలు జారీ చేసింది.
8) అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్
ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నోతో మ్యాచ్ సందర్భంగా కేకేఆర్ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీ అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటయ్యాడు. షాట్ ఆడిన అంగ్‌క్రిష్ సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న గ్రీన్ వద్దని వారించడంతో వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ దశలో బంతిని అందుకున్న షమీ స్ట్రైకింగ్ ఎండ్ వికెట్ల వైపు విసిరాడు.
The infamous Angkrish Raghuvanshi Run out today ! 😔
What's your opinion on this decision 🤔 , my opinion is that it was not out, a blunder by 3rd umpire !
What was the hurry 😯?#LSGvsKKR #IPL2026pic.twitter.com/eJmxLm5Gwk— Cricket IQ (@S17Anurag) April 26, 2026
ఈ నేపథ్యంలో తన రన్నింగ్ దిశను మార్చుకున్న రఘువంశీ షమీ వేసిన బంతికి అడ్డు రావడంతో అది అతడి ప్యాడ్లకు తగిలింది. దీంతో లక్నో ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నందుకు అంపైర్ అంగ్‌క్రిష్ రఘువంశీని ఔట్‌గా ప్రకటించాడు.
9) అర్ష్‌దీప్ ఇన్‌స్టా వివాదం
పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో దాదాపు 200 పైగా పోస్టులను తొలగించడం ఆసక్తిగా నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో పలు వివాదాల నేపథ్యంలో అర్ష్‌దీప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తేలింది. టోర్నీ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్ సహా జట్టు సమావేశాలకు సంబంధించి కంటెంట్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేసుకోవద్దంటూ బీసీసీఐ ఆటగాళ్లను హెచ్చరించింది. అందుకే అర్ష్‌దీప్ తన ఇన్‌స్టాలో పోస్టులు తొలగించి ఉంటాడని అభిమానులు భావించారు.
10) జాసన్ హోల్డర్ క్యాచ్ వివాదం
గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్‌లో రజత్ పాటీదార్ ఇచ్చిన క్యాచ్ హోల్డర్ డైవ్ చేసి పట్టినప్పటికీ ఆ క్యాచ్ పూర్తి వివాదాస్పదమయింది. పాటిదార్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే క్రమంలో హోల్డర్ బంతిని తొలుత నేలకు ఆనించినట్లు కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, అంపైర్ ఔటివ్వడం ఆర్సీబీ డగౌట్‌లో ఆటగాళ్లకు ఆగ్రహం తెప్పించింది.
They checked the runout for 1 min and there was indeed a check of that Patidar's catch by Jason Holder, just judged in 17 secs
Truly disappointing to see umpiring at this level this season. New day, new lowpic.twitter.com/KGgbi2a7qb— Gautam (@indiantweetrian) April 30, 2026
హోల్డర్ పట్టిన క్యాచ్‌పై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔట్ కాదని తెలుస్తున్నప్పటికీ మూడో అంపైర్ పాటిదార్‌ను ఔట్ అని ప్రకటించడం అత్యంత వివాదాస్పదమయ్యింది.


