గిల్‌ వివాదాస్పద పోస్టు.. బీసీసీఐకి సీఎస్‌కే ఫిర్యాదు! | Fact Check: CSK Filed Complaint Against Shubman Gill To BCCI | Sakshi
Sakshi News home page

Fact Check: గిల్‌ వివాదాస్పద పోస్టు.. బీసీసీఐకి సీఎస్‌కే ఫిర్యాదు!

Apr 27 2026 3:36 PM | Updated on Apr 27 2026 4:50 PM

Fact Check: CSK Filed Complaint Against Shubman Gill To BCCI

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ విష‌యంలో ఆన్‌ఫీల్డ్‌, ఆఫ్‌ఫీల్డ్‌లో చాలా ఆస‌క్తిక‌ర విష‌యాలు జ‌రుగుతున్నాయి. ఆరం భంలో వ‌రుస ప‌రాజ‌యాలు, మ‌ధ్య‌లో విజ‌యాలు, మ‌ళ్లీ ఓట‌మి.. ఇలా సీఎస్‌కే త‌న ప్ర‌యాణాన్ని ప‌డుతూ లేస్తూ కొన‌సాగిస్తుంది. అయితే ఆన్‌ఫీల్డ్‌లో ఇలా ఉంటే ఆఫ్‌ఫీల్డ్‌లో సీఎస్‌కే కు అవ‌మానాలు జ‌రుగుతున్నాయి. 

సీజ‌న్ ఆరంభంలో ఆర్సీబీపై బీసీసీఐకి ఫిర్యాదు చేసిన సీఎస్‌కే తాజాగా గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌పై ఫిర్యాదు చేయ‌డం ఆస‌క్తి క‌లిగించింది. ఇందులో నిజ‌మెంత అనేది తెలియ‌నప్ప‌టికీ గిల్‌పై సీఎస్‌కే చేసిన ఫిర్యాదు కాపీ మాత్రం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

అస‌లేం జ‌రిగింది?
ఆదివారం (ఏప్రిల్ 26) చెన్నై వేదిక‌గా గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూప‌ర్‌కింగ్స్ (సీఎస్‌కే) త‌ల‌ప‌డింది. అయితే ఈ మ్యాచ్‌లో సీఎస్‌కేపై గుజ‌రాత్ 8 వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ విజ‌యం అనంత‌రం గుజ‌రాత్ కెప్టెన్ గిల్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎస్‌కే ఫ్రాంచైజీని ట్రోల్ చేస్తూ పోస్ట్ చేశాడు. 

ఏఐతో రూపొందించిన త‌న ఫొటోను పంచుకున్న గిల్ చేతిలో పసుపు రంగు విజిల్ ప‌ట్టుకొని న‌వ్వుతూ క‌నిపించాడు. అయితే గిల్ పెట్టిన పోస్టు సీఎస్‌కే జెర్సీని, ఫ్రాంచైజీ నినాదం అయిన‌ విజిల్ పోడును అవమానిస్తున్న‌ట్లుగా ఉందంటూ సీఎస్‌కకే ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అది న‌కిలీదా లేక నిజ‌మైనదేనా అన్న‌ది ఇంకా తెలియదు. అయితే సీఎస్‌కే ఫ్రాంచైజీ గిల్‌పై బీసీసీఐకి ఫిర్యాదు చేసిన కాపీ మాత్రం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

గతంలో ఆర్సీబీపై ఫిర్యాదు
ఇక ఇదే సీజ‌న్‌లో 11వ మ్యాచ్‌లో ఆర్సీబీ, సీఎస్‌కే త‌ల‌ప‌డ్డాయి. సీఎస్‌కే ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు ’దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ’ అంటూ ఓ ట్రాక్‌ను డీజే ప్లే చేశారు. అయితే ఇవి దక్షిణాదికి చెందిన ప్రజలు ఎక్కువగా తినే ఆహార పదార్థాలు. ఈ ట్రాక్‌పై సీఎస్‌కే తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. 

‘దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ’ అనే పదాలను వాడుతూ తమిళనాడు గుర్తింపును ఎగతాళి చేశారంటూ సీఎస్‌కే ఆర్సీబీ ఫ్రాంచైజీపై బీసీసీఐకి ఫిర్యాదులో చేసింది. కాగా ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో సీఎస్‌కే ఐదో ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. సీఎస్‌కే విధించిన 159 ప‌రుగుల టార్గెట్‌ను గుజ‌రాత్ మ‌రో 20 బంతులు మిగిలి ఉండ‌గానే ఛేదించింది. సాయి సుద‌ర్శ‌న్ (87), గిల్ (33), బ‌ట్ల‌ర్ (39 నాటౌట్‌) జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించారు.

చదవండి: ‘వైభ‌వ్‌పై అనుమానముంది.. డోపింగ్‌ టెస్ట్ చేయాల్సిందే!’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement