ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన సంచనల బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ బౌలర్లను చితక్కొడుతున్న వైభవ్ సూర్యవంశీ అలవోకగా బౌండరీలు, సిక్సర్లు బాదేస్తున్నాడు. పనిలో పనిగా ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో శతకంతో రెచ్చిపోయాడు.
ఇప్పటికే ఆడిన 8 మ్యాచ్‌ల్లో వైభవ్ సూర్యవంశీ 234 స్ట్రైక్‌రేట్‌తో 357 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. వైభవ్ ఇలాగే ఆడుతూ పోతే ఆరెంజ్ క్యాప్ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అగ్రశ్రేణి బౌలర్లందరినీ ఉతికారేస్తున్న వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ఏమైనా స్ప్రింగులున్నాయా లేక అతడి మెదడులో ఏఐ చిప్ పెట్టారా అని పాకిస్తాన్ క్రికెట్ అనలిస్ట్ నౌమన్ నియాజ్ సరదా వ్యాఖ్యలు చేయడం ఆసక్తి కలిగించింది.
వైభవ్ సూర్యవంశీ బుర్రలో ఏఐ చిప్‌ను ఏమైనా ఇన్‌స్టాల్ చేశారేమోనని తనకు అనుమానంగా ఉందని తెలిపారు. టీనేజీ వయసులో ఉన్నప్పటికీ భారీ సిక్సర్లు ఎలా కొడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. వైభవ్‌కు డోపింగ్ టెస్టు చేయాల్సిందే అని పేర్కొన్నాడు.
నౌమన్ నియాజ్ మాట్లాడుతూ.. ‘వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) ఒకసారి వైభవ్‌ను చెక్ చేస్తే బాగుంటుంది. అతడి బుర్రలో ఏదైనా ఏఐ చిప్ ఇన్‌స్టాల్ చేసారా అన్నది తెలుసుకోవడానికి ఏదో ఒక ల్యాబ్‌కు పంపించి పరీక్షించాల్సిందే. వైభవ్ నాకు మనిషిలా అనిపించడం లేదు. అయితే అతడి మీద అంచనాలు భారీగానే ఉన్నాయి.
నిజంగానే వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన ప్లేయర్. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో అతడి బ్యాటింగ్ నాకు కొంచెం స్లో అనిపించింది. ఇక ఒక టీనేజీ కుర్రాడు కండలు తిరిగిన దేహంతో ఉంటాడా? కానీ సూర్యవంశీ 18 ఏండ్లు నిండకుండానే అతడి దేహదారుఢ్యం బలంగా కనిపిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో వైభవ్ ఆటలో మరింత రాటు దేలడం ఖాయం.
ఇప్పుడు వైభవ్‌కు 15 ఏళ్లు. త్వరలోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశముంది.నిజానికి అతడి బ్యాటింగ్‌లో పెద్దగా టెక్నిక్స్ కనిపించవు. కానీ అతడి మణికట్టు బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కుల చూపిస్తూ డేంజరస్ బ్యాటర్‌గా తయారయ్యాడు’ అని చెప్పుకొచ్చారు. ఈ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడి 5 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. లీగ్‌లో రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్‌ను మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది.


