తెలుగోడే అర్హుడు.. అందుకే అక్షర్‌ను తప్పించాం! | BCCI Reveals Why Tilak Varma Replaced Axar Patel As India Vice Captain | Sakshi
Sakshi News home page

Tilak Varma: తెలుగోడే అర్హుడు.. అందుకే అక్షర్‌ను తప్పించాం!

Jun 6 2026 3:36 PM | Updated on Jun 6 2026 4:03 PM

BCCI Reveals Why Tilak Varma Replaced Axar Patel As India Vice Captain

తెలుగు క్రికెట‌ర్ నంబూరి తిల‌క్ వ‌ర్మ‌కు బీసీసీఐ వైస్ కెప్టెన్‌గా ప్ర‌మోష‌న్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. శ‌నివారం బీసీసీఐ ఇంగ్లండ్‌, ఐర్లాండ్ టూర్‌తో పాటు ఆసియా గేమ్స్‌కు టీమిండియా జ‌ట్టును ఎంపిక చేసింది. ఈ టోర్నీల‌కు వేర్వేరుగా ప్ర‌క‌టించిన జ‌ట్ల‌లో తిల‌క్ వ‌ర్మ చోటు ద‌క్కించుకోవ‌డ‌మే గాక‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు డిప్యూటీగా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. 

అయితే ఉన్న‌ప‌ళంగా అక్ష‌ర్ ప‌టేల్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి త‌ప్పించి ఆ బాధ్య‌త‌ల‌ను తిల‌క్ వ‌ర్మ‌కు అప్ప‌గించ‌డంపై బీసీసీఐ స్పందించింది. జ‌ట్ల‌ను ప్ర‌క‌టించిన అనంత‌రం సెలెక్ష‌న్ క‌మిటీ హెడ్ అజిత్ అగార్క‌ర్ మీడియాతో మాట్లాడాడు. ‘రాబోయే రెండేళ్ల కాలంలో టీమిండియా చాలా టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులోనే 2028 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కూడా ఉంది.  

అక్ష‌ర్‌ప‌టేల్ అప్ప‌టి వ‌ర‌కు జ‌ట్టులో ఉంటాడా లేదా అనేది సందేహం. అందుకే మాకు తిల‌క్ వ‌ర్మ డిప్యూటీ కెప్టెన్ ప‌ద‌వికి స‌రైనోడిలా క‌నిపించాడు. అక్ష‌ర్ ప‌టేల్ వైస్ కెప్టెన్‌గా త‌న బాధ్య‌త‌లను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించిన‌ప్ప‌టికీ, రాబోయే రెండేళ్ల సైకిల్‌ను దృష్టిలో పెట్టుకొని తిల‌క్ వ‌ర్మ‌ను డిప్యూటీగా ఎంపిక చేయాల‌ని నిర్ణ‌యించాం. అందునా తిల‌క్ వ‌ర్మ ఒక అద్భుత ఆట‌గాడు. డిప్యూటీ కెప్టెన్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు ఇవ్వ‌డం ద్వారా మ‌రింత నేర్చుకుంటాడ‌న్న‌ది మా న‌మ్మ‌కం.’ అని చెప్పుకొచ్చాడు. 

అజిత్ అగార్క‌ర్ చెప్పిన‌ట్లుగానే తిల‌క్ వ‌ర్మ కొన్నేళ్లుగా భార‌త టీ20 జ‌ట్టులో కీల‌క ఆట‌గాడిగా మారిపోయాడు. 2024లో సౌతాఫ్రికా గ‌డ్డ‌పై రెండు శ‌త‌కాలు బాదిన తిల‌క్ వ‌ర్మ‌, ఆ గ‌డ్డ‌పై 3-1 తేడాతో సిరీస్‌ను గెల‌వ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. ఇక గ‌తేడాది ఆసియా క‌ప్ ఫైన‌ల్లో భార‌త్ గెల‌వ‌డంలో తిల‌క్ వ‌ర్మ‌దే కీల‌క‌పాత్ర‌. ఆ మ్యాచ్‌లో 69 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. 

ఇప్ప‌టిదాకా బ్యాట‌ర్‌గా రాణించిన తిల‌క్ వ‌ర్మ ఇక‌పై వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు స‌వాల్ విస‌రనున్నాయి. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌తో పాటు 2028 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌పై దృష్టి సారించిన నేప‌థ్యంలో తిల‌క్ వ‌ర్మ బ్యాట‌ర్‌గా భార‌త బ్యాటింగ్‌లో మూల స్తంభాల్లో ఒక‌డిగా ఉండ‌డంతో పాటు డిప్యూటీ నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను కూడా స‌మ‌ర్థంగా నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంటుంది. ఇక అక్ష‌ర్‌ప‌టేల్ వైస్‌కెప్టెన్ ప‌దవిని కోల్పోయిన‌ప్ప‌టికీ సీనియ‌ర్ స్పిన్న‌ర్‌గా జ‌ట్టులో చోటు కాపాడుకున్నాడు.

ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్ల‌కు భారత జట్టు: 
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్‌ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్‌), నితీష్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాద‌వ్‌, వైభ‌వ్ సూర్య‌వంశీ.

చదవండి: క‌నిపించ‌ని సూర్య‌కుమార్ పేరు.. కెరీర్‌కు ఎండ్‌కార్డ్‌!

Advertisement
 
Advertisement
Advertisement