బీసీసీఐ అనుమతి లేదు.. విజయ్‌ దేవరకొండకు నోటీసులు | TCA Sent Legal Notice To Vijay Devarakonda Over TG20 League | Sakshi
Sakshi News home page

బీసీసీఐ అనుమతి లేదు.. విజయ్‌ దేవరకొండకు నోటీసులు

Jun 17 2026 4:29 PM | Updated on Jun 21 2026 1:42 PM

TCA Sent Legal Notice To Vijay Devarakonda Over TG20 League

టాలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA)  లీగల్ నోటీసులు పంపింది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) అనుమతి లేకుండా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) టీజీ20 లీగ్ నిర్వహిస్తోందని.. దీనినిప్రమోట్ చేయటం నేరమని ఆరోపించింది.

బీసీసీఐ అనుమతి లేకుండా కార్పొరేట్ కంపెనీలతో HCA వ్యాపారం చేస్తోందని.. ఇది ఎంతమాత్రం సరికాదని టీసీఏ పేర్కొంది. లీగ్‌తో మమేకమైన సినీ హీరోలు విజయ్ దేవరకొండ, వెంకటేశ్‌లతో పాటు.. క్రికెటర్లు తిలక్ వర్మ, అంబటి రాయుడు, మహ్మద్‌ సిరాజ్‌లకు టీసీఏ లీగల్ నోటీసులు పంపింది.

స్థానిక టీ20 లీగ్‌ నిర్వహణకు 45 రోజుల ముందు అనుమతి తీసుకోవాలి.. కానీ బీసీసీఐ అనుమతి లేకుండా డబ్బులు వాసులు చేసి HCA లీగ్ నిర్వహిస్తోందని టీసీఏ ఆరోపణలు చేసింది.

టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘TG20 ఒక మోసపూరిత లీగ్. TG20 లీగ్‌ను నిర్వహించడానికి HCA వద్ద BCCI అనుమతులు లేవు. లీగ్ అనుమతులు చూపించమని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు నేను సవాలు విసురుతున్నాను. 'తెలంగాణ' అనే పదాన్ని ఉపయోగించే హక్కు HCAకు లేదు. తెలంగాణ క్రికెట్ వ్యవహారాలను చూసుకోవడానికి 'తెలంగాణ క్రికెట్ అసోసియేషన్' ఉంది’’ అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement