బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెట‌ర్‌! | Munaf Patel Defends Gautam Gambhir About Kohli-Rohit Retire-Test Cricket | Sakshi
Sakshi News home page

బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

Apr 15 2026 6:49 PM | Updated on Apr 15 2026 7:52 PM

Munaf Patel Defends Gautam Gambhir About Kohli-Rohit Retire-Test Cricket

టీమిండియా మాజీ ఆట‌గాడు, ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌలింగ్ కోచ్‌ మునాఫ్ ప‌టేల్ భార‌త జ‌ట్టు ప్ర‌ధాన కోచ్‌ గౌత‌మ్ గంభీర్ విష‌యంలో పెద్ద బాంబు పేల్చాడు. కోచ్‌గా గంభీర్‌ను తొల‌గిస్తే టీమిండియాలో విప‌త్తు త‌ప్ప‌దంటూ బీసీసీఐని హెచ్చ‌రించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్‌కు టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.  

అయితే గంభీర్ సార‌థ్యంలో భార‌త జ‌ట్టు మిశ్ర‌మ ఫలితాల‌ను అందుకుంది. చాంపియ‌న్స్ ట్రోఫీ,  ఆసియా క‌ప్‌, టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లు భార‌త్ గంభీర్ కోచ్‌గా ఉన్న స‌మ‌యంలోనే వ‌చ్చాయి. అయితే ఇదే స‌మ‌యంలో జ‌ట్టులో సీనియ‌ర్లైన రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు టెస్టు క్రికెట్ నుంచి త‌ప్పుకోవ‌డం వెనుక గంభీర్ పాత్ర ఉంద‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. 

వ‌న్డే, టీ20 ఫార్మాట్‌లో గంభీర్ కోచ్‌గా ప‌ర్వాలేద‌నిపించినప్ప‌టికీ టెస్టు ఫార్మాట్‌లో దారుణంగా విఫ‌ల‌మ‌వ్వ‌డంతో అత‌న్ని కోచ్‌గా త‌ప్పించాల‌నే డిమాండ్లు పెరిగిపోయాయి. ఈ నేప‌థ్యంలోనే మునాఫ్ ప‌టేల్ గంభీర్‌కు అండ‌గా నిలిచాడు. మునాఫ్ ప‌టేల్ మాట్లాడుతూ.. ‘గంభీర్ వంటి నిఖార్సైన వ్యక్తిని కోచ్ పదవి నుంచి తొలగిస్తే, భారత జట్టులోని స్టార్ ఆటగాళ్లను మేనేజ్ చేయడం ఎవరికైనా చాలా కష్టమవుతుంది. 

గంభీర్ అత్యంత నిజాయితీ గల వ్యక్తి. ముక్కుసూటిగా మాట్లాడే అత‌ని తత్వాన్ని అంద‌రూ ఇష్ట‌ప‌డ‌రు. కానీ జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలనైనా తీసుకోవడానికి వెనుకాడరు. ముఖ్యంగా జట్టులో క్రమశిక్షణ తప్పినా లేదా ఆటగాళ్లు సరిగ్గా రాణించకపోయినా, వారిని జట్టు నుంచి తప్పించే ధైర్యం గంభీరకు ఉంది. 

విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లకు 'నో' చెప్పడం అంత తేలికైన విషయం కాదు. త‌న క‌ఠిన నిర్ణ‌యాల‌తో శ‌త్రువుల‌ను కూడా పెంచుకున్నాడు. అయితే కోచ్‌గా త‌న ప‌నిని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్నాడ‌ని మాత్రం బలంగా చెప్ప‌గ‌ల‌ను.’ అని మునాఫ్ వెల్లడించాడు. ఎన్‌సీఏ క్రికెట్ అకాడ‌మీలో సౌక‌ర్యాల్లో కొర‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని మునాఫ్ పేర్కొన్నాడు. 

ఆట‌గాళ్ల ఫిట్‌నెస్‌, ప్రాక్టీస్‌, రీహాబిలిటేష‌న్ సెంట‌ర్ స‌హా ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు వినియోగించే ఎన్‌సీఏ అకాడ‌మీలో ప్ర‌స్తుతం బ‌ల‌మైన వ్య‌వ‌స్థ క‌నిపించ‌డం లేద‌ని తెలిపాడు. వెంట‌నే ఎన్‌సీఏ అకాడ‌మీని ప‌టిష్ట‌ప‌రిచేందుకు బీసీసీఐ చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవస‌ర‌ముంది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఫిజియోథెర‌పిస్టులు, కోచ్‌లు, స‌రైన శిక్ష‌ణ వంటి ప్రాథ‌మిక సౌక‌ర్యాల‌ను మ‌రింత మెరుగుపరచాల‌ని మునాఫ్ వెల్ల‌డించాడు. 

కాగా దేశ వ్యాప్తంగా క్రికెట్ ప్ర‌మాణాల‌ను మెరుగుప‌రిచే ల‌క్ష్యంతో బీసీసీఐ 2000 సంవ‌త్స‌రంలో బెంగ‌ళూరు కేంద్రంగా ఎన్‌సీఏ అకాడ‌మీని స్థాపించింది.  ప్రస్తుతం మునాఫ్ పటేల్ ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఈ సీజ‌న్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించి, నాలుగు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

చదవండి: సంచలన నిర్ణయం.. 32 ఏళ్ల‌కే రిటైర్మెంట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement