Munaf Patel
-
షోయబ్ అక్తర్ ఒక ‘పిచ్చివాడు’.. అతడికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
షోయబ్ అక్తర్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకరిగా పేరు గాంచాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఫాస్టెస్ట్ బాల్(161.3 కి.మీ/గం) రికార్డు ఇప్పటికే అక్తర్ పేరిటే ఉంది. తన ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించిన అక్తర్.. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తాజాగా ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌పై భారత మాజీ పేసర్ మునాఫ్ పటేల్ ప్రశంసల వర్షం కురిపించాడు. అక్తర్‌కు బౌలింగ్ పట్ల ఉన్న అంకితభావాన్ని మునాఫ్ పటేల్ కొనియాడాడు. "షోయబ్ అక్తర్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలి. దాదాపు 15 ఏళ్ల పాటు ఆసియా లాంటి పరిస్థితుల్లో 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అతడి పట్టుదలకు హ్యాట్సాఫ్. వేగంగా బౌలింగ్ చేయడం వల్ల అక్తర్ రెండు మోకాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.రిటైర్మెంట్ తర్వాత అతడు సరిగ్గా నడవడానికి నాలుగైదు సంవత్సరాలు పట్టింది. అక్తర్ చాలా మొండోడు. ఫాస్ట్ బౌలింగ్ అంటే పిచ్చి. అలాంటి పిచ్చి ఉన్నవాడు మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేయగలడు"అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మునాఫ్ పటేల్ పేర్కొన్నాడు.అక్తర్ చివరగా 2011 ప్రపంచకప్‌లో ఆడాడు. పాక్ తరపున 46 టెస్టులు ఆడి 178 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా అతడి పేరిట 247 వన్డే వికెట్లు కూడా ఉన్నాయి. కాగా షోయబ్ తన కెరీర్లో నిలకడగా ఒకే వేగంతో బౌలింగ్ చేసేందుకు ఎన్నో సవాళ్లును ఎదుర్కొన్నాడు. మ్యాచ్‌లకు ముందు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు తీసుకునేవాడినని అతడే చాలా సార్లు చెప్పాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీకి సంబంధించి బిగ్ న్యూస్! -
బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెటర్!
టీమిండియా మాజీ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలో పెద్ద బాంబు పేల్చాడు. కోచ్‌గా గంభీర్‌ను తొలగిస్తే టీమిండియాలో విపత్తు తప్పదంటూ బీసీసీఐని హెచ్చరించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్‌కు టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే గంభీర్ సారథ్యంలో భారత జట్టు మిశ్రమ ఫలితాలను అందుకుంది. చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లు భారత్ గంభీర్ కోచ్‌గా ఉన్న సమయంలోనే వచ్చాయి. అయితే ఇదే సమయంలో జట్టులో సీనియర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడం వెనుక గంభీర్ పాత్ర ఉందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. వన్డే, టీ20 ఫార్మాట్లో గంభీర్ కోచ్‌గా పర్వాలేదనిపించినప్పటికీ టెస్టు ఫార్మాట్లో దారుణంగా విఫలమవ్వడంతో అతన్ని కోచ్‌గా తప్పించాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే మునాఫ్ పటేల్ గంభీర్‌కు అండగా నిలిచాడు. మునాఫ్ పటేల్ మాట్లాడుతూ.. ‘గంభీర్ వంటి నిఖార్సైన వ్యక్తిని కోచ్ పదవి నుంచి తొలగిస్తే, భారత జట్టులోని స్టార్ ఆటగాళ్లను మేనేజ్ చేయడం ఎవరికైనా చాలా కష్టమవుతుంది. గంభీర్ అత్యంత నిజాయితీ గల వ్యక్తి. ముక్కుసూటిగా మాట్లాడే అతని తత్వాన్ని అందరూ ఇష్టపడరు. కానీ జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలనైనా తీసుకోవడానికి వెనుకాడరు. ముఖ్యంగా జట్టులో క్రమశిక్షణ తప్పినా లేదా ఆటగాళ్లు సరిగ్గా రాణించకపోయినా, వారిని జట్టు నుంచి తప్పించే ధైర్యం గంభీరకు ఉంది. విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లకు 'నో' చెప్పడం అంత తేలికైన విషయం కాదు. తన కఠిన నిర్ణయాలతో శత్రువులను కూడా పెంచుకున్నాడు. అయితే కోచ్‌గా తన పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడని మాత్రం బలంగా చెప్పగలను.’ అని మునాఫ్ వెల్లడించాడు. ఎన్సీఏ క్రికెట్ అకాడమీలో సౌకర్యాల్లో కొరత స్పష్టంగా కనిపిస్తోందని మునాఫ్ పేర్కొన్నాడు. ఆటగాళ్ల ఫిట్నెస్, ప్రాక్టీస్, రీహాబిలిటేషన్ సెంటర్ సహా ఇతర కార్యక్రమాలకు వినియోగించే ఎన్సీఏ అకాడమీలో ప్రస్తుతం బలమైన వ్యవస్థ కనిపించడం లేదని తెలిపాడు. వెంటనే ఎన్సీఏ అకాడమీని పటిష్టపరిచేందుకు బీసీసీఐ చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఫిజియోథెరపిస్టులు, కోచ్‌లు, సరైన శిక్షణ వంటి ప్రాథమిక సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని మునాఫ్ వెల్లడించాడు. కాగా దేశ వ్యాప్తంగా క్రికెట్ ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో బీసీసీఐ 2000 సంవత్సరంలో బెంగళూరు కేంద్రంగా ఎన్సీఏ అకాడమీని స్థాపించింది. ప్రస్తుతం మునాఫ్ పటేల్ ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి, నాలుగు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: సంచలన నిర్ణయం.. 32 ఏళ్లకే రిటైర్మెంట్! -
ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ!
గెలుపు జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ (Munaf Patel)కు ఐపీఎల్ పాలక మండలి జరిమానా విధించింది. అంతేకాదు.. అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ కూడా జతచేసింది. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్భంగా మునాఫ్ పటేల్ అనుచిత ప్రవర్తనకు గానూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ మేరకు శిక్ష విధించింది.మ్యాచ్ ‘టై’.. ఫలితం తేల్చేందుకుఅసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ఢిల్లీ సొంత మైదానంలో బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో తలపడింది. అరుణ్‌జైట్లీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అక్షర్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.సూపర్ ఓవర్లో గెలిచిన ఢిల్లీఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ కూడా 20 ఓవర్ల పూర్తయ్యేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి.. 188 పరుగులే చేసింది. ఫలితంగా మ్యాచ్ ‘టై’ కావడంతో అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ ఐదు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేయగా.. ఢిల్లీ (2, 4, 1, 6) నాలుగు బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది.పట్టికలో అగ్రస్థానానికిఈ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్‌పై గెలుపొందడంతో పాటు.. సీజన్లో ఐదో విజయం అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ- రాజస్తాన్ జట్ల మధ్య సూపర్ ఓవర్ సమయంలో ఢిల్లీ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ ఫోర్త్ అంపైర్‌తో వాదనకు దిగాడు.అంపైర్‌తో వాగ్వాదంబౌండరీ లైన్ వద్ద ఫోర్త్ అంపైర్ నిల్చుని ఉండగా.. అక్కడే కూర్చుని ఉన్న మునాఫ్ పటేల్ అతడితో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగాడు. మైదానంలో ఉన్న తమ ఆటగాళ్లకు సందేశం చేరవేసేందుకు వేరే ఆటగాడిని పంపాలని భావించగా.. ఫోర్త్ అంపైర్ అందుకు నిరాకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడితో మునాఫ్ వాదనకు దిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.జరిమానాతో పాటుఈ క్రమంలో ఐపీఎల్ పాలక మండలి మునాఫ్ పటేల్‌కు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అంపైర్‌తో అనుచితంగా ప్రవర్తించిన కారణంగా అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం మేర కోత విధించడంతో పాటు.. ఓ డీమెరిట్ పాయింట్ కూడా జతచేసినట్లు వెల్లడించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్ 2.20 నిబంధనను అతడు ఉల్లంఘించిన కారణంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.కాగా మునాఫ్ పటేల్ మార్గదర్శనంలో ఢిల్లీ బౌలింగ్ విభాగం రాణిస్తోంది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటూ జట్టును అగ్రస్థానంలో నిలపడంలో బౌలర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ను కట్టుదిట్టంగా వేసి.. మ్యాచ్ టై కావడానికి ప్రధాన కారణమైన పేసర్ మిచెల్ స్టార్క్.. సూపర్ ఓవర్లోనూ అద్భుతం చేసి ఢిల్లీని గెలిపించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.చదవండి: Rohit Sharma: కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం𝙉𝙚𝙧𝙫𝙚𝙨. 𝘿𝙧𝙖𝙢𝙖. 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨! 😉A quick morning catch-up on that late-night Super-Over nail-biter! 🙌#TATAIPL | #DCvRR | @DelhiCapitals pic.twitter.com/QeKsfPmCyk— IndianPremierLeague (@IPL) April 17, 2025 -
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ బౌలర్
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్ మునాఫ్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం ఇవాళ (నవంబర్ 12) అధికారికంగా ప్రకటించింది. మునాఫ్ వచ్చే సీజన్ నుంచి హెడ్ కోచ్ హేమంగ్ బదాని, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ వేణుగోపాల్ రావుతో కలిసి పని చేస్తాడు. మునాఫ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా జేమ్స్ హోప్స్ పని చేశాడు. ఢిల్లీ యాజమాన్యం ఇటీవలే రికీ పాంటింగ్‌ను హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తొలగించింది. పాంటింగ్‌తో పాటు హోప్స్ తదితరులు తమ పదవులు కోల్పోయారు. పాంటింగ్, సౌరవ్ గంగూలీ స్థానాల్లో హేమంగ్ బదాని, వేణుగోపాల్ రావు హెడ్ కోచ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు చేపట్టారు. సపోర్టింగ్ స్టాఫ్‌కు ఎంపిక చేసుకునే బాధ్యతను ఢిల్లీ యాజమాన్యం హెడ్ కోచ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌కే వదిలేసింది. ఈ క్రమంలో బదాని, వేణు మునాఫ్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసుకున్నారు.41 ఏళ్ల మునాఫ్ పటేల్ 2013లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మునాఫ్ 2008-17 మధ్యలో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ ఫ్రాంచైజీల తరఫున 63 మ్యాచ్‌లు ఆడి 74 వికెట్లు పడగొట్టాడు. మునాఫ్ టీమిండియా తరఫున 2006-2011 మధ్యలో మూడు ఫార్మాట్లలో కలిపి 86 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 125 వికెట్లు పడగొట్టాడు. మునాఫ్ 2011లో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. -
అత్యాచారం కేసులో హార్దిక్ పాండ్యా.. ? గ్యాంగ్‌స్టర్ భార్య సంచలన ఆరోపణలు..!
Dawood Ibrahim Wife Aide Accuses Hardik Pandya and Rajiv Shukla: టీ20 ప్రపంచకప్-2021లో ఆశించిన మేర రాణించకపోవడంతో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సహాయకుడు రియాజ్ భాటి భార్య రెహ్నుమా భాటి.. హార్ధిక్ పాండ్యాతో పాటు మునాఫ్ పటేల్, పృథ్వీరాజ్ కొఠారీ, మాజీ బీసీసీఐ చైర్మన్ రాజీవ్ శుక్లాలపై సంచలన ఆరోపణలు చేసింది. సదరు వ్యక్తులంతా తనను లైంగిక వేధింపులకు గురి చేసి, అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముంబైలోని సాంతా క్రూజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. COMPLAINT COPY EXCLUSIVE‼️ https://t.co/Nj2U9UoA8P pic.twitter.com/o5uWCoDfLx — Sameet Thakkar (@thakkar_sameet) November 10, 2021 తన భర్త రియాజ్ భాటి స్వప్రయోజనాల కోసం అతని వ్యాపార భాగస్వామ్యులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసేవాడని, అలా కొందరు హై ప్రొఫైల్ సెలబ్రిటీల వద్దకు తనను పంపాడని రెహ్నుమా ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే, రెహ్నుమా ఇచ్చిన ఫిర్యాదులో సరైన అడ్రస్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే, హార్ధిక్.. గతంలో ‘కాఫీ విత్ కరణ్ షో’లో వివాదాస్పద కామెంట్లు చేసి ఓ మ్యాచ్ నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హార్ధిక్.. భార్య నటాశాతో కలిసి మాల్దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. చదవండి: "గంగూలీతో విభేదాలు నిజమే.." రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు -
లంక లీగ్ వేలానికి మునాఫ్ పటేల్
కొలంబో: శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ఆధ్వర్యంలో జరుగనున్న తొలి లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో భారత మాజీ పేసర్ మునాఫ్ పటేల్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్‌కు సంబంధించి అక్టోబర్ 1న జరుగనున్న వేలానికి మునాఫ్ పటేల్ అందుబాటులో ఉండనున్నాడు. 37 ఏళ్ల మునాఫ్ భారత్ తరఫున 13 టెస్టులు, 70 వన్డేలు, 3 టి20లు ఆడాడు. 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోనూ సభ్యుడు. ఎల్పీఎల్ కోసం మునాఫ్‌తో పాటు ఇంగ్లండ్ ప్లేయర్ రవి బొపారా, దక్షిణాఫ్రికా ఆటగాడు కోలిన్ మున్రో, వెర్నాన్ ఫిలాండర్‌లతో కలిపి మొత్తం 150 మంది అంతర్జాతీయ క్రికెటర్లు వేలానికి రానున్నారు. ఇందులో పాల్గొనే ఐదు ఫ్రాంచైజీలు గరిష్టంగా ఆరుగురు చొప్పున అంతర్జాతీయ క్రికెటర్లను దక్కించుకోవచ్చు. (చదవండి: ముంబైతో కలిసిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్) -
నన్ను కావాలనే ఇరికిస్తున్నారు: మునాఫ్
న్యూఢిల్లీ: విదర్భ క్రికెట్ చీఫ్ దేవేంద్ర సుర్తి తనను కావాలనే ఇరికిస్తున్నారని భారత మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ ఆరోపించాడు. తాను దేవేంద్రను చంపుతానంటూ ఆయన చేసిన ఫిర్యాదు వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉందని మునాఫ్ పేర్కొన్నాడు. తాను కేవలం క్రికెటర్ల ఆటకు సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడం తప్ప, సెలక్షన్ పరమైన వాటిలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని బరోడా క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) క్రికెట్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న మునాఫ్ అన్నాడు. తనను మునాఫ్ చంపుతానంటూ బెదిరించినట్లు దేవేంద్ర సుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాడటాన్ని సహించలేక మునాఫ్ బెదిరింపులకు దిగాడని సుర్తి పేర్కొన్నారు. ఒకవేళ తనకు కానీ, కుటుంబానికి కానీ ఏమైనా ప్రమాదం వాటిల్లితే మునాఫ్‌నే పూర్తి బాధ్యడ్ని చేయాల్సి ఉంటుందని పోలీస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాము సుర్తి నుంచి ఫిర్యాదు తీసుకున్నామని, ఇప్పటివరకూ అయితే ఎటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని నవాపురా పోలీస్ ఇన్స్పెక్టర్ ఆర్ఎమ్ చౌహాన్ తెలిపారు. దీనిపై స్పందించిన మునాఫ్.. ‘ ఎటువంటి కారణాలు లేకుండా నా పేరును తెరపైకి తీసుకొచ్చారు. నాకు తెలిసినంత వరకూ క్రికెట్ ఆడటమే తెలుసు. సుర్తికి సెలక్షన్ కమిటీ సభ్యులతో ఇబ్బందులున్నాయి. నేను కేవలం మెంటార్‌ని మాత్రమే. నాకు సెలక్షన్స్‌తో ఎటువంటి సంబంధం ఉండదు. అటువంటప్పుడు నాపేరును ఎందుకు బయటకు తెస్తున్నారు. ఇది అనవసరమైన రాద్ధాంతం తప్ప నేను ఎవర్నీ చంపుతానని బెదిరించలేదు’ అని మునాఫ్ పేర్కొన్నాడు. మునాఫ్ పటేల్ 2006లో భారత్ తరఫున అరంగేట్రం చేసి 70 వన్డేలు, 13 టెస్టులు, 3 టీ20లు ఆడాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మునాఫ్.. 2011లో భారత్ వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. -
క్రికెట్‌కు మునాఫ్ పటేల్ వీడ్కోలు
న్యూఢిల్లీ: భారత పేస్‌బౌలర్ మునాఫ్ పటేల్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. 2011 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన మునాఫ్ ఆ తర్వాత గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. 2006లో ఇంగ్లండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన అతను మొత్తం 13 టెస్టుల్లో 35 వికెట్లు... 70 వన్డేల్లో 86 వికెట్లు... 3 టి20ల్లో 4 వికెట్లు తీశాడు. వరల్డ్‌కప్ గెలిచిన ఏడాదే ఇంగ్లండ్‌తో చివరి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన మునాఫ్ ఆ తర్వాత తిరిగి జట్టుకు ఎంపిక కాలేదు. ‘ఇప్పటి వరకు చాలామందితో కలిసి ఆడాను. వారిలో ధోని తప్ప దాదాపు అందరూ తప్పుకున్నారు. మిగతావారు ఆడుతూ నేను రిటైర్మెంట్ ప్రకటిస్తే ఎక్కువ బాధ ఉండేది. ఇక వైదొలగాల్సిన సమయం వచ్చేసింది’ అని 35 ఏళ్ల మునాఫ్ పేర్కొన్నాడు. -
నాలుగేళ్ల తరువాత తొలి ఐపీఎల్ మ్యాచ్
ముంబై:దాదాపు నాలుగేళ్ల పాటు ఒక లీగ్ కు దూరంగా ఉండి పునరాగమనం చేయడమంటే అంత తేలికైన విషయం కాదు. అయితే భారత మాజీ పేస్ బౌలర్ మునాఫ్ పటేల్ నాలుగేళ్ల తరువాత తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఆదివారం వాంఖేడ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా గుజరాత్ లయన్స్ తరపున మునాఫ్ బరిలోకి దిగాడు. ఇలా సుదీర్ఘ విరామం తరువాత ఆడటం చాలా అరుదుగా జరుగుతుంది. కాగా, మునాఫ్ పటేల్ పై నమ్మకం ఉంచిన గుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనా తుది జట్టులోకి తీసుకున్నాడు. దాంతో పాటు మునాఫ్ చేత పూర్తి కోటా బౌలింగ్ కూడా వేయించాడు. నిన్నటి మ్యాచ్ లో నాలుగు ఓవర్ల బౌలింగ్ వేసిన మునాఫ్ 35 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. ముంబై ఇండియన్స్ ఓపెనర్ జాస్ బట్లర్ వికెట్ మునాఫ్ ఖాతాలో చేరింది. 1426 రోజుల తరువాత తొలి మ్యాచ్ ఆడినప్పటికీ మునాఫ్ చక్కటి రిథమ్ తో బౌలింగ్ చేయడం ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ కు ముందు మునాఫ్ చివరి సారి 2013లో ఆడాడు. అప్పుడు ముంబై ఇండియన్స్ తరపున మునాఫ్ పాల్గొన్నాడు. చెన్నై కింగ్స్ తో జరిగిన ఆ మ్యాచ్ లో మునాఫ్ మూడు ఓవర్లు వేసి వికెట్ తీయకుండా 32 పరుగులిచ్చాడు. అప్పటి మ్యాచ్ లో మునాఫ్ బౌలింగ్ ను చితక్కొట్టిన వారిలో రైనా ఒకడు. ఇప్పుడ అదే రైనా జట్టులో మునాఫ్ తిరిగి ఆడటం ఇక్కడ విశేషం.


