
ఈ టోర్నమెంట్‌కు సంబంధించి అక్టోబర్ 1న జరుగనున్న వేలానికి మునాఫ్ పటేల్ అందుబాటులో ఉండనున్నాడు.
కొలంబో: శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) ఆధ్వర్యంలో జరుగనున్న తొలి లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్)లో భారత మాజీ పేసర్ మునాఫ్ పటేల్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్‌కు సంబంధించి అక్టోబర్ 1న జరుగనున్న వేలానికి మునాఫ్ పటేల్ అందుబాటులో ఉండనున్నాడు. 37 ఏళ్ల మునాఫ్ భారత్ తరఫున 13 టెస్టులు, 70 వన్డేలు, 3 టి20లు ఆడాడు. 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోనూ సభ్యుడు. ఎల్‌పీఎల్ కోసం మునాఫ్‌తో పాటు ఇంగ్లండ్ ప్లేయర్ రవి బొపారా, దక్షిణాఫ్రికా ఆటగాడు కోలిన్ మున్రో, వెర్నాన్ ఫిలాండర్‌లతో కలిపి మొత్తం 150 మంది అంతర్జాతీయ క్రికెటర్లు వేలానికి రానున్నారు. ఇందులో పాల్గొనే ఐదు ఫ్రాంచైజీలు గరిష్టంగా ఆరుగురు చొప్పున అంతర్జాతీయ క్రికెటర్లను దక్కించుకోవచ్చు.
(చదవండి: ముంబైతో కలిసిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్)