వైభవ్‌ సూర్యవంశీకి భారీ షాక్‌..! ఒకవేళ అదే జరిగితే? | BCCI Reacts To Anti-Corruption Protocol Breach In RR vs RCB Match | Sakshi
Sakshi News home page

IPL 2026: వైభవ్‌ సూర్యవంశీకి భారీ షాక్‌..! ఒకవేళ అదే జరిగితే?

Apr 12 2026 4:57 PM | Updated on Apr 12 2026 5:18 PM

BCCI Reacts To Anti-Corruption Protocol Breach In RR vs RCB Match

ఐపీఎల్‌-2026లో శుక్ర‌వారం(ఏప్రిల్ 10) ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఘ‌న విజ‌యం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో రాజ‌స్తాన్ గెలుపొందిన‌ప్ప‌టికి.. ఆ జట్టు మేనేజర్ రోమీ భిందర్ చేసిన ఒక చిన్న పొరాటు ఇప్పుడు వివాదానికి దారితీసింది.

మ్యాచ్ జరుగుతుండగా రోమీ భిందర్  డగౌట్‌లో, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో కలిసి మొబైల్ ఫోన్ వాడుతూ టీవీ కెమెరాలకు చిక్కాడు. ఇందుకు సబంధించిన వీడియోను తొలుత ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనల ప్రకారం..  మ్యాచ్ జరుగుతున్నప్పుడు డగౌట్‌లో మొబైల్ ఫోన్లు వాడటం పూర్తిగా నిషేధం. ఈ  ఘటనపై ఐపీఎల్ ఫౌండర్‌, మాజీ చైర్మెన్ లలిత్ మోదీ తీవ్రంగా స్పందించాడు. అవినీతి నిరోధక, భద్రతా విభాగం అధికారులు అప్పుడు ఏం చేస్తున్నారని అతడు ఎక్స్‌లో రాసుకొచ్చాడు. తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు.

రోమీ భిందర్ 'ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా'  నిబంధనలను ఉల్లంఘించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్‌లో సెల్ ఫోన్ వాడకం నిషేధం. ఇది పొరపాటున జరిగి ఉండవచ్చు. 

కానీ అతడు నిబంధనలు ఉల్లంఘించనందున చర్యలు తప్పవు. మ్యాచ్ రిఫరీ, అవినీతి నిరోధక విభాగం నివేదిక ఆధారంగా జరిమానా ఉంటుందా లేదా మ్యాచ్ నిషేధం ఉంటుందా అనేది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయిస్తుంది" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐ పేర్కొన్నారు. కాగా మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ తన "లోకల్ గార్డియన్" అని రోమీ భిందర్‌ను పేర్కొనడంతో, ఈ ఘటనపై మరింత లోతైన విచారణ జరిగే అవకాశం ఉంది.

 బీసీసీఐ యాంటి కరప్షన్‌ యూనిట్‌ నివేదిక ప్రకారం ఐపీఎల్ గవర్నింగ్ అతడిపై చర్యలు తీసుకోనుంది. నివేదిక ఆధారంగా భారీ జరిమానా లేదా కొన్ని మ్యాచ్‌ల పాటు డగౌట్, డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాకుండా నిషేధం విధించే ఛాన్స్‌ ఉంది.

మరోవైపు రుమీ బింద‌ర్ ప‌క్క‌న ఉండి ఫోన్ చూసిన 15 వైభ‌వ్ సూర్యవంశీపై కూడా బీసీసీఐ స్వల్ప జరిమానాను విధించే అవకాశం ఉందని  టైమ్స్ ఇండియా తమ కథనంలో పేర్కొంది.
చదవండి: Sanju Samson: చరిత్ర సృష్టించిన శాంసన్‌.. ధోని కూడా సాధ్యం కాలేదు

Advertisement
 
Advertisement
Advertisement