టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) శిబిరంలో ఉన్న పాండ్యా అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.
అయితే ఇంగ్లండ్ సిరీస్‌కు ఇంకా సమయం ఉండడంతో అప్పటివరకు పాండ్యా కోలుకుంటాడని వార్తలు వచ్చినప్పటికీ, బీసీసీఐ మెడికల్ బృందం మాత్రం పాండ్యా ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధంగా లేడని తెలిపింది. ఎందుకంటే రీహాబిలిటేషన్ సెంటర్‌లో ఉన్న పాండ్యా ఫిట్‌నెస్ టెస్టులో విఫలమయ్యాడని, అతడు కోలుకునేందుకు మరో నెల రోజులు పట్టే అవకాశముందని సమాచారం.
అయితే ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా జూలై 14 నుంచి 19 మధ్య మూడు వన్డేలు ఆడనుంది. ఈ లెక్కన హార్దిక్ టీమిండియాతో జాయిన్ కావడం కష్టమే. ఇక గాయంతో బాధపడుతున్న కోహ్లీ కూడా ఇంగ్లండ్ సిరీస్‌లో ఆడుతాడా లేదా అనేది జూన్ 22న (సోమవారం) తేలనుంది. ఆరోజు కోహ్లికి ఫిట్‌నెస్ టెస్టు జరగనుంది.
అయితే అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ టూర్లకు హార్దిక్ పాండ్యాను ఎంపిక చేస్తూ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వన్డే వరల్డ్‌కప్ రోడ్‌మ్యాప్ ప్రక్రియలో భాగంగా పాండ్యా కీలకం కానున్నాడని అజిత్ అగార్కర్ వెల్లడించాడు. కానీ ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో వెన్ను గాయంతో బాధపడ్డ పాండ్యా సీవోఈకి చేరుకున్నాడు. వెన్ను నొప్పి నుంచి తేరుకునే లోపే తొడ కండరాల గాయం కావడంతో ఆఫ్గన్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ఒక్కరోజు ముందే పాండ్యా ఆడడం లేదని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.
2027 వన్డే వరల్డ్‌కప్ ఆడేనా?
వరుస గాయాలతో సతమతమవుతున్న పాండ్యా వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో ఆడుతాడా లేదా అన్నది మిస్టరీగా మారింది. టీమిండియా కూడా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ అనంతరం మళ్లీ సెప్టెంబర్‌లో వెస్టిండీస్ టూర్‌లో వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. అప్పటికి కోలుకొని పాండ్యా జట్టులోకి వస్తే మంచిదే, కానీ మళ్లీ ఏదైనా గాయం బారిన పడితే మాత్రం వన్డే ప్రపంచకప్‌కు పాండ్యా అందుబాటులో ఉండేది అనుమానమే.
Read: నోరు మూసుకున్నందుకు రెడ్‌కార్డ్.. ఫిఫా చరిత్రలోనే తొలిసారి!


