ఐపీఎల్‌లో హనీ ట్రాప్‌..? | BCCI warns IPL teams over honey trap risks, tighten hotel room access rules | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌లో హనీ ట్రాప్‌.. స్ట్రిక్ట్‌ రూల్స్‌ జారీ చేసిన బీసీసీఐ

May 8 2026 8:29 AM | Updated on May 8 2026 8:53 AM

BCCI warns IPL teams over honey trap risks, tighten hotel room access rules

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో 'హనీ ట్రాప్' ప్రమాదాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అప్రమత్తమైంది. ఆటగాళ్ల భద్రత, టోర్నీ సమగ్రత దృష్ట్యా అన్ని ఫ్రాంచైజీలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా సంతకంతో ఏడు పేజీల అధికారిక నోటీసు పంపినట్లు సమాచారం.

ఐపీఎల్‌ సమయంలో కొందరు ఆటగాళ్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి హోటళ్లలో ఉండటం, ప్రయాణాలు చేయడం పట్ల బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా ఉన్న వ్యక్తుల ద్వారా జట్టు వ్యూహాలు, అంతర్గత సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉందని బీసీసీఐ భావిస్తోంది.

ఈ నేపథ్యంలో అన్ని జట్ల మేనేజ్‌మెంట్‌లకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఆటగాళ్లను కలిసే అతిథుల వివరాలు, హోటల్‌ కదలికలన్నిటినీ రికార్డు చేయాలని సూచించింది. అవసరమైతే అకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

నిబంధనలు ఉల్లంఘించినట్లయితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇందులో షోకాజ్‌ నోటీసులు, భారీ జరిమానాలు, సస్పెన్షన్‌ లేదా డిస్‌క్వాలిఫికేషన్‌ వంటి చర్యలు ఉండొచ్చని తెలిపింది. చట్టపరమైన ఉల్లంఘనలు ఉంటే పోలీసు కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

కాగా, ఇలాంటి ప్రమాదాల నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్లను అప్రమత్తం చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా భారత జట్టు విదేశీ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యులు, భాగస్వాముల ప్రయాణాలపై పరిమితులు విధించింది.

ముఖ్యంగా 2024-25 బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఓటమి తర్వాత బోర్డు మరింత కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఐపీఎల్‌ నిర్వహణలో ఆఫ్‌ఫీల్డ్‌ వ్యవహారాలపై కూడా బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టడం క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏదో జరుగుతుందని ఫ్యాన్స్‌ గుసగుసలాడుకుంటున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement