అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు గిల్ నేతృత్వంలో 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్సీ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే పంత్ డిమోషన్ వెనుక గిల్ కీలకపాత్ర పోషించాడంటూ ఒక అభిమాని సంచలన ఆరోపణలు చేయడం ఆసక్తి రేపింది.
పంత్ వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఒక అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టుకు పంత్ సోదరి సాక్షి లైక్ కొట్టింది. 'పంత్ వైస్ కెప్టెన్సీ పదవి ఊడిపోవడానికి తెర వెనుక కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పెద్ద రాజకీయమే నడిపాడు. తన పదవికి ఉన్న ముప్పును తొలగించుకోవడానికే వైస్ కెప్టెన్సీకి పంత్‌ను కాదని రాహుల్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది’ అంటూ పోస్టు పెట్టాడు.
పంత్ భవిష్యత్తులో టెస్టు కెప్టెన్ అయ్యే అవకాశం ఉండడంతోనే గిల్ ఇలా చేసి ఉండొచ్చని సదరు అభిమాని ఆరోపించాడు. అయితే ఇదంతా ఒక అభిమాని ఎలాంటి ఆధారాలు లేకుండా తన అభిప్రాయంగా పోస్టును పెట్టడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే పంత్ సోదరి సాక్షి అభిమాని పెట్టిన పోస్టును లైక్ చేస్తూ ‘ఇది నిజమే అయి ఉండొచ్చు’ అని పేర్కొనడం ఆసక్తిని రేపింది.
అయితే అభిమాని పెట్టిన పోస్టుకు లైక్ కొట్టింది నిజంగా పంత్ సోదరి సాక్షినా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ పోస్టుపై సోషల్‌మీడియాలో అభిమానులు రెండు విధాలుగా స్పందించారు. కొందరు పంత్‌కు సపోర్ట్ చేస్తే, మరికొందరు గిల్‌కు మద్దతుగా పోస్టులు పెట్టారు.
ఈ సంగతి పక్కనబెడితే యాక్సిడెంట్ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి పంత్ పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. 2025లో ఇంగ్లండ్ టూర్‌లో పంత్ సరైన ప్రదర్శన చేయలేదు. దీంతో వన్డే, టీ20 జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. అయితే టెస్టుల్లో పంత్‌కు మంచి రికార్డు ఉండడంతో ఆఫ్గన్‌తో టెస్టుకు ఎంపిక చేశారు. కానీ తుది జట్టులో ఉంటాడా లేడా అన్నది చూడాలి.
ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ పంత్ పెద్దగా రాణించలేదు. 132 మ్యాచ్‌లాడి కేవలం 286 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్‌గా పంత్ జట్టును ప్లేఆఫ్స్ చేర్చడంలోనూ విఫలమయ్యాడు. వరుస ఓటములతో ఈ సీజన్‌లో లక్నో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.
🚨 Rishabh Pant’s sister has liked an Instagram reel that says Shubman Gill has played politics with Rishabh Pant and removed him from the Vice Captaincy so that he don't have any competition in Test captaincy. 🚨
Someone should tell her, that India lost 2-0 vs South Africa at… pic.twitter.com/DpNs4ACLKu— Ahmed Says (@AhmedGT_) May 20, 2026


