ప్లేఆఫ్స్ ముంగిట ఆర్సీబీకి గుడ్‌న్యూస్‌! | Phil Salt to rejoin RCB later this week as IPL 2026 playoffs | Sakshi
Sakshi News home page

ప్లేఆఫ్స్ ముంగిట ఆర్సీబీకి గుడ్‌న్యూస్‌!

May 20 2026 9:12 PM | Updated on May 20 2026 9:23 PM

Phil Salt to rejoin RCB later this week as IPL 2026 playoffs

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్సీబీ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి ఒక శుభవార్త అందింది. గాయం కారణంగా దాదాపు నెల రోజుల పాటు ఐపీఎల్‌కు దూరంగా ఉన్న బెంగళూరు జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఈ వారం చివర్లో భారత్‌కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఏప్రిల్‌ 18న ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బౌండరీని అడ్డుకునే ప్రయత్నంలో అతడి ఎడమ చేతి వేలికి గాయం అయింది. ఆ గాయం కారణంగా అతడు మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అనంతరం జరిగిన మూడు పోటీల్లో కూడా అతడు జట్టుకు దూరంగానే ఉన్నాడు. 

గాయం తీవ్రతను పరీక్షించేందుకు మే మొదటి వారంలో ఫిల్ సాల్ట్ స్వదేశానికి వెళ్లాడు. అక్కడ నిర్వహించిన వైద్యపరీక్షల్లో గాయం పెద్దది కాదని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. అయితే మే 22న హైదరాబాద్ జట్టుతో జరగనున్న బెంగళూరు చివరి లీగ్ మ్యాచ్‌కు ఫిల్ సాల్ట్ అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. 

ఇప్పటికే 13 మ్యాచ్‌ల్లో 18 పాయింట్లు సాధించిన బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్‌లో స్థానం ఖాయం చేసుకుంది. ఈ సీజన్‌లో ఓపెనర్‌గా ఫిల్ సాల్ట్ దూకుడైన ఆటతో జట్టుకు మంచి ఆరంభాలు అందించాడు. విరాట్ కోహ్లీతో కలిసి ఆర్సీబీకి శుభారంభాలను అందించాడు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఫిల్‌ సాల్ట్‌ 202 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. 

చదవండి: బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు!

Advertisement
 
Advertisement
Advertisement