ఐపీఎల్ 2026 నేపథ్యంలో బీసీసీఐ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. మ్యాచ్ సమయంలో బెంచ్‌పై ఉన్న ఆటగాళ్ల కదలికలపై కఠిన నియంత్రణలు విధించింది. జట్టుకు ఎంపికైన 16 మంది (11 మంది ప్లేయర్లు, ఐదుగురు ఇంపాక్ట్ సబ్స్) ఆటగాళ్లు మాత్రమే ఫీల్డ్‌లోకి వెళ్లి డ్రింక్స్, బ్యాట్స్ లేదా సందేశాలు ఇవ్వాలి. ఈ జాబితలో లేని ఆటగాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీల్డ్‌లోకి ప్రవేశించరాదు.
బౌండరీ చుట్టూ గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే (బిబ్స్ ధరించి) ఉండాలి. మిగతా ఆటగాళ్లు డగౌట్‌కే పరిమితం కావాలి. బౌండరీ లైన్, LED బోర్డుల మధ్య కదలిక చేయరాదు.
బీసీసీఐ నియమావళిలోని క్లాజ్ 11.5.2, 24.1.4 ఆధారంగా ఈ నియమాలు నిర్దేశించబడ్డాయి. ఇటీవల జట్టులో లేని ఆటగాళ్లు (16 మంద సభ్యుల జాబితాలో లేని వారు) ఫీల్డ్‌లోకి వెళ్లి డ్రింక్స్, సందేశాలు ఇవ్వడం వల్ల ఈ నియమాలను అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇవాళ (ఏప్రిల్ 8) ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఢిల్లీ వేదికగా 14వ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.


