ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా అఫ్గానిస్తాన్‌తో సిరీస్ ఆడేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లకు సంబంధించి జట్టును ప్రకటించారు. గంభీర్ హెడ్‌కోచ్‌గా టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సహా 2026 టీ20 ప్రపంచకప్ నెగ్గింది. 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు గంభీరే టీమిండియాకు హెడ్‌కోచ్‌గా కొనసాగనున్నాడు.
అయితే టీ20 క్రికెట్‌లో గంభీర్‌ను కోచ్‌గా తప్పించి వేరే వాళ్లకు అవకాశమివ్వాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కేవలం ఊహాగానాలే అయినప్పటికీ ఇప్పటికిప్పుడు గంభీర్ స్థానంలో టీమిండియాకు కొత్త టీ20 కోచ్‌గా ఎవరు వస్తే బాగుంటుందనే దానిపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తన అభిప్రాయం వెల్లడించాడు.
గంభీర్ స్థానంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌కు హెడ్‌కోచ్‌గా ఉన్న ఆశిష్ నెహ్రా కోచ్ స్థానానికి సరైన వ్యక్తి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్పోర్ట్స్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడాడు. ‘ఆశిష్ నెహ్రా చాలా స్మార్ట్ క్రికెటర్. క్రికెట్ గురించి అతడితో మాట్లాడితే కచ్చితంగా ఎమెషనల్ అవుతాము. అతడు ఎప్పుడు జట్టు గురించే ఆలోచిస్తాడు.
ఆశిష్ నెహ్రా చాలా నిక్కచ్చిగా ఉండే కోచ్. ఆటను చాలా సూక్ష్మంగా అంచనా వేస్తాడు. ఎవరిని నొప్పించడానికి ప్రయత్నించడు. ఆటగాళ్లను తీర్చిదిద్దడం, వారి కెరీర్ ఎదుగుదలకు నెహ్రా సహయపడుతాడు. ఒక కోచ్‌గా జట్టును చాలా ప్రభావితం చేయగలడు. ఆటగాళ్లందరినీ ఒకే తాటిపై నడిపించగల సత్తా అతని సొంతం. బీసీసీఐ ఒకవేళ టీ20 క్రికెట్‌కు కొత్త కోచ్‌ను చూస్తున్నట్లయితే ఆ పాత్రకు ఆశిష్ నెహ్రా న్యాయం చేయగలడు.
నెహ్రాను కేవలం బౌలింగ్ కోచ్‌గా చూడడం ఆపేయాలి. ఎందుకంటే ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు హెడ్‌కోచ్‌గా విజయవంతమయ్యాడు. అంతేగాక చాలాకాలం టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆశిష్ నెహ్రాకు వేర్వేరు కెప్టెన్ల ఆధ్వర్యంలో ఆడిన అనుభవముంది. ఒకవేళ టీమిండియాకు కోచ్ పాత్రలో వస్తే హెడ్‌కోచ్‌గానే రావాలని కోరుకుంటున్నా’అంటూ తెలిపాడు.
కాగా ఐపీఎల్‌లో ఆశిష్ నెహ్రా హెడ్‌కోచ్‌గా గుజరాత్ టైటాన్స్‌ను విజయవంతంగా నడిపించాడు. 2022లో చాంపియన్స్‌గా నిలిచిన గుజరాత్ ఆ తర్వాతి సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది. 2024 సీజన్‌లో విఫలమైనప్పటికీ, 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన గుజరాత్ ఈ ఏడాది సీజన్‌లో ఫైనల్ చేరి మరోసారి రన్నరప్‌గా నిలిచింది.


