ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు స్టార్ ప్లేయర్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి తొడ కండరాల గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో అతడి స్ధానంలో ముంబై ఆల్‌రౌండర్ సూర్యాన్ష్ షెడ్గేను సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు.
సూర్యాన్ష్ జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించింది. కాగా అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌లో నితీశ్ గాయపడ్డాడు. దీంతో లక్నో వేదికగా జరిగిన రెండో వన్డేకు అతడు దూరమయ్యాడు.
మూడో మ్యాచ్‌కు మళ్లీ అతడు తిరిగొచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతడు కాస్త అసౌకర్యానికి గురయ్యాడు. ఈ ఆంధ్ర క్రికెటర్ గాయం కాస్త తీవ్రమైనది తేలడంతో జట్టు నుంచి తప్పించారు.
ఇక సూర్యాన్ష్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన త్రైపాక్షిక సిరీస్‌లో భారత్-ఏ విజయం సాధించడంలో సూర్యాన్ష్ కీలక పాత్ర పోషించాడు. ఈ ముంబైకర్‌కు బౌలింగ్‌తో పాటు అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. లోయర్ ఆర్డర్‌లో వచ్చి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగలడు. ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ తరపున కూడా అతడు అద్భుతంగా రాణించాడు.
ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో టీ20లకు భారత జట్టు
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, సూర్యాన్ష్ షెడ్గే, మహ్మద్ సిరాజ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ
చదవండి: Rishabh Pant: ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డీల్.. రూ.12 కోట్లు వదులుకుని?


