దులీప్‌ ట్రోఫీతో షురూ | BCCI announces domestic season | Sakshi
Sakshi News home page

దులీప్‌ ట్రోఫీతో షురూ

May 21 2026 3:58 AM | Updated on May 21 2026 3:58 AM

BCCI announces domestic season

అక్టోబర్‌ 11 నుంచి రంజీ ట్రోఫీ 

దేశవాళీ సీజన్‌ను ప్రకటించిన బీసీసీఐ

ముంబై: భారత దేశవాళీ క్రికెట్‌కు సంబంధించి 2026–27 సీజన్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఆగస్టు 23 నుంచి జరిగే దులీప్‌ ట్రోఫీ టోర్నీతో సీజన్‌ మొదలవుతుంది.  జోనల్‌ ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‌లు బెంగళూరులో జరుగుతాయి. ప్రస్తుత రంజీ చాంపియన్‌ జమ్ము కశ్మీర్, రెస్టాఫ్‌ ఇండియా జట్ల మధ్య నిర్వహించే ఇరానీ కప్‌ మ్యాచ్‌ ఆ తర్వాత అక్టోబర్‌ 1 నుంచి 5 వరకు శ్రీనగర్‌లో జరుగుతుంది. అనంతరం ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ సుదీర్ఘ సీజన్‌ ప్రారంభం కానుంది. 

అక్టోబర్‌ 11 నుంచి మార్చి 3 వరకు రంజీ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీని డిసెంబర్‌ 14 నుంచి జనవరి 8 వరకు...టి20 టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీని నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 6 వరకు నిర్వహిస్తారు. పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి అండర్‌–15, అండర్‌–16, అండర్‌–19, అండర్‌–23, సీనియర్‌ కేటగిరీల్లో సీజన్‌ మొత్తం కలిపి బీసీసీఐ ఏకంగా 1788 అధికారిక మ్యాచ్‌లు నిర్వహించనుండటం విశేషం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement