భారత లెజెండరీ క్రికెటర్‌ కన్నుమూత | Indias oldest Test cricketer CD Gopinath dies at 96 | Sakshi
Sakshi News home page

భారత లెజెండరీ క్రికెటర్‌ కన్నుమూత

Apr 9 2026 8:00 PM | Updated on Apr 9 2026 9:29 PM

Indias oldest Test cricketer CD Gopinath dies at 96

భార‌త క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. టీమిండియా అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్, చెన్నై క్రికెట్ దిగ్గజం దొరైస్వామి గోపీనాథ్ (96) మరణించారు.  చెన్నైలోని తన నివాసంలో వృద్ధాప్య సమస్యలతో ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. 1952లో ఇంగ్లండ్‌పై భార‌త్ సాధించిన తొలి టెస్ట్ విజ‌యంలో గోపీనాథ్ కీల‌క పాత్ర పోషించారు.

భారత్ ఇన్నింగ్స్ ఎనిమిది పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ చారిత్ర‌త్మ మ్యాచ్‌లో గోపీనాథ్ 35 పరుగులు చేశారు. తొలి టెస్టు విజ‌యం సాధించిన భార‌త జ‌ట్టులో ఇప్పటివరకు జీవించి ఉన్న ఏకైక క్రికెట‌ర్ గోపీనాథ్ కావ‌డం విశేషం. ఇప్పుడు ఆయ‌న మ‌ర‌ణంతో భార‌త క్రికెట్‌లో ఒక శ‌కం ముగిసింది.

1951లో ఇంగ్లండ్‌పై అంత‌ర్జాతీయ అరంగేట్రం చేసిన గోపీనాథ్ త‌న కెరీర్‌లో భారత్ తరపున 8 టెస్టులు ఆడారు. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో మ‌ద్రాస్‌ త‌ర‌పున ఆడ‌న 83 మ్యాచ్‌లు ఆడారు. గోపీనాథ్ త‌న అరంగేట్ర మ్యాచ్‌లోనే మెరుపుగలు మెరిపించాడు.  తన అరంగేట్ర టెస్టులో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మొదటి ఇన్నింగ్స్‌లో 50 (నాటౌట్), రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మొత్తంగా ఆయ‌న 8 మ్యాచ్‌ల‌లో 242 ప‌రుగులు చేశారు. ఆయ‌న మృతి పట్ల పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
చదవండి: IPL 2026: డేవిడ్‌ మిల్లర్‌ కాదు.. ఢిల్లీ ఓటమికి అసలు కారణమిదే?

Advertisement
 
Advertisement
Advertisement