వివిధ విభాగాల్లో భారత క్రికెట్ జట్ల ద్వైపాక్షిక సిరీస్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ నిన్న (మే 6) విడుదల చేసింది. పురుషులు, మహిళలు, ఏ-జట్లు, అండర్-19 జట్ల మ్యాచ్‌లకు వేదికలు, తేదీలను ఖరారు చేసింది. ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత క్రికెట్ బిజీ షెడ్యూల్‌లోకి వెళ్లనుంది. ముఖ్యంగా భారత్-ఏ, మహిళల సీనియర్ టీమ్, అండర్-19 జట్లు వరుస సిరీస్‌లలో పాల్గొననున్నాయి.
ఆస్ట్రేలియా-ఏతో సిరీస్
ఆస్ట్రేలియా-ఏ జట్టు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్-ఏ జట్టుతో రెండు మల్టీ డే మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడనుంది.
సెప్టెంబర్ 22- తొలి మల్టీ డే మ్యాచ్ (పుదుచ్చేరి)
సెప్టెంబర్ 29- రెండో మల్టీ డే మ్యాచ్ (పుదుచ్చేరి)
అక్టోబర్ 6- తొలి వన్డే (పుదుచ్చేరి)
అక్టోబర్ 9- రెండో వన్డే (పుదుచ్చేరి)
అక్టోబర్ 11- మూడో వన్డే (పుదుచ్చేరి)
అండర్-19 జట్టుకు ఆస్ట్రేలియా సవాల్
భారత అండర్-19 జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో మూడు వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్‌లు ఆడనుంది.
సెప్టెంబర్ 18- తొలి వన్డే (రాజ్‌కోట్)
సెప్టెంబర్ 21- రెండో వన్డే (రాజ్‌కోట్)
సెప్టెంబర్ 23- మూడో వన్డే (రాజ్‌కోట్)
సెప్టెంబర్ 27- తొలి మల్టీ డే మ్యాచ్ (రాజ్‌కోట్)
అక్టోబర్ 5- రెండో మల్టీ డే మ్యాచ్ (అహ్మదాబాద్)
చారిత్రక సిరీస్
భారత్.. జింబాబ్వే మహిళల జట్టుకు తొలిసారి ఓ ద్వైపాక్షిక సిరీస్ కోసం ఆతిథ్యమివ్వనుంది. టీ20, వన్డే ఫార్మాట్‌లలో జరిగే ఈ సిరీస్ అక్టోబర్‌లో జరుగనుంది. ఈ సిరీస్‌లో తొలుత టీ20లు, ఆతర్వాత వన్డేలు జరుగనున్నాయి. టీ20లకు రాయ్‌పూర్, వన్డేలకు బరోడా ఆతిథ్యమివ్వనుంది.
అక్టోబర్ 16- తొలి టీ20
అక్టోబర్ 18- రెండో టీ20
అక్టోబర్ 20- మూడో టీ20
అక్టోబర్ 23- తొలి వన్డే
అక్టోబర్ 25- రెండో వన్డే
అక్టోబర్ 28- మూడో వన్డే
మహిళల ఏ జట్టు vs ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా జట్టుతో భారత మహిళల ఏ జట్టు సెప్టెంబర్‌లో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. ఇందులో 3 టీ20లు (సెప్టెంబర్ 12, 15, 17-మొహాలి), 3 వన్డేలు (20, 23, 25- ధర్మశాల), ఓ మల్టీ డే మ్యాచ్ (29- ధర్మశాల) జరుగనున్నాయి.
మహిళల ఏ జట్టు vs ఇంగ్లండ్
ఇంగ్లండ్ జట్టుతో భారత మహిళల ఏ జట్టు నవంబర్-డిసెంబర్‌లో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. ఇందులో 3 టీ20లు (నవంబర్ 30, డిసెంబర్ 3, 5- పూణే), 3 వన్డేలు (డిసెంబర్ 8, 11, 14- నవీ ముంబై), ఓ మల్టీ డే మ్యాచ్ (డిసెంబర్ 19- నవీ ముంబై) జరుగనున్నాయి.
మహిళల అండర్-19 జట్టు vs శ్రీలంక
శ్రీలంక అండర్-19 జట్టు జూన్‌లో భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో 3 టీ20లు (జూన్ 22, 24, 27- చెన్నై), 3 వన్డేలు (జూన్ 30, జులై 3, 6- పుదుచ్చేరి) జరుగనున్నాయి.
మహిళల అండర్-19 జట్టు vs ఇంగ్లండ్
ఇంగ్లండ్ అండర్-19 జట్టు నవంబర్-డిసెంబర్‌లో భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో 5 టీ20లు (నవంబర్ 26, 28 (బరోడా), డిసెంబర్ 1, 3, 6 (సూరత్)) జరుగనున్నాయి.


