breaking news
Orissa
-
హాల్‌మార్క్‌ను నమ్మకూడదా..?
నరసన్నపేటలో వెలుగు చూసిన మోసంతో బంగారం ఆభరణాలపై హాల్‌మార్క్ ఉన్నా నమ్మడానికి లేదని స్పష్టమవుతోంది. ఆ హాల్ మార్క్ ఎంత వాస్తవమో తెలుసుకోవడానికి మరో కేంద్రం వద్ద టెస్టింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా హాల్‌మార్క్ ఉంటే బంగారానికి తిరుగులేదు అనుకుంటారు. ప్యూరిటీ ఉన్న బంగారంగా భావిస్తారు. నకిలీ టెస్టింగ్ అండ్ హాల్ మార్క్ సెంటర్ల ఏర్పాటుతో ఏది సరైన హాల్ మార్క్, ఏది నకిలీ అని తెలుసుకోలేని పరిస్థితులు ఉండటంతో కొనుగోలు దారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. -
బీజేడీ యువనేత మృతి
కొరాపుట్: బీజేడీ పార్టీ యువ నాయకుడు వి.సతీష్ (41) అనారోగ్యంతో నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. గతంలో సతీష్ బీజేడీ పార్టీ విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షునిగా, యువజన విభాగాలలో పనిచేశారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇతని మృతిపై రాజ్యసభ ఎంపీ మున్నా ఖాన్, మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి, డాబుగాం ఎమ్మెల్యే మరోహర్ రంధారి, మాజీ ఎమ్మెల్యేలు ప్రకాష్ చంద్ర మజ్జి, సదాశివ ప్రదాని సంతాపం ప్రకటించారు. నడవలేని వారికి ఇంటివద్దే పింఛన్ అందజేత కొరాపుట్: నడవలేని వారికి జయపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బి.సునీత వారింటికే వెళ్లి పెన్షన్ డబ్బులు అందజేశారు. శుక్రవారం 14వ నంబర్ వార్డులో 80 ఏళ్లు దాటిన వృద్దులకు రు.3,500 నగదుని స్వయంగా అందించారు. ప్రతి నెల సక్రమంగా అందుతున్నాయో లేదని వాకబు చేశారు. దళారుల మాట నమ్మ వద్దని, పెన్షన్ డబ్బులలో తక్కువగా ఉంటే తనకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ ప్రాంతంలో ఎవరికై నా పెన్షన్ రాకపోతే ఫిర్యాదు చేయాలన్నారు. వైస్ చైర్మన్ స్వయంగా వచ్చి డబ్బులు అందజేయడంతో వృద్ధులు తమ సాదకబాధ లు ఆమెతో చెప్పుకున్నారు. ‘ఆడపిల్ల పుడితే మొక్క నాటండి’ కొరాపుట్: ఆడపిల్ల జననానికి గుర్తుగా మెక్క లు నాటాలని నబరంగ్‌పూర్ అదనపు కలెక్టర్ తపన్‌కుమార్ కుంటియా పిలుపునిచ్చారు. శుక్రవారం నబరంగ్‌పూర్ జిల్లా డాబుగాం సమితి జునా పానీ గ్రామ పంచాయతీ కేంద్రంలో జరిగిన బేటీ బచావో–బేటీ పడావో, బిజూ కన్య రత్న పథకాల గురించి గిరిజనులతో జరి గిన అవగాహన సదస్సులో ప్రసంగించారు. ఆడ పిల్లల భవిష్యత్ కోసం ప్రభుత్వం అనేక రకాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అధికారుల నుంచి సమాచారం తీసుకోవాలన్నారు. ప్రతి ఆడపిల్ల భవిష్యత్ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని కుంటీయా అన్నా రు. కార్యక్రమంలో భాగంగా 30 మంది ఆడ పిల్లల తల్లులకు బేబీ కిట్లు అందజేశారు. ఆ ప్రాంతంలో 30 మంది ఆడ పిల్లల పేర్ల మీద పండ్ల మెక్కలు నాటారు. పట్టుబడిన కాపర్ దొంగ! శ్రీకాకుళం క్రైమ్: జిల్లాలో పలుప్రాంతాల్లో నిర్మాణ దశలో ఉన్న బిల్డింగ్‌ల వద్ద లక్షలు విలువ చేసే వైరులోని కాపర్‌ను దొంగిలించిన వ్యక్తి రెండో పట్టణ పోలీసుల అదుపులో ఉన్నాడని విశ్వసనీయ సమాచారం. శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడుకు చెందిన నిందితుడు ముందుగా హైదరాబాద్‌లో ఉండేవాడని.. జల్సాలకు అలవాటు పడి 2017, 2018, 2023లో ఇళ్లల్లో తలుపులు పగులగొట్టి చోరీలకు పాల్పడేవాడని, రెండో పట్టణ పోలీసులకు అప్పట్లో పట్టుబడినట్లు తెలిసింది. విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. పేకాట శిబిరంపై దాడులు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని జెడ్పీ వెనుక గల కామేశ్వరి కల్యాణ మండపం సమీపంలో జరుగుతున్న పేకాట శిబిరంపై టాస్క్ఫోర్సు పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించినట్లు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. సీఐ కృష్ణమూర్తి నేతృత్వంలో దాడులు నిర్వహించగా ఐదుగురు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రూ.46,970 స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో బి.గోవింద, బి.ప్రసాద్, ఎస్.కె.ఆలీ, ఎం.మోహనకృష్ణ, ఎం.రాజశేఖర్ ఉన్నారు. వీరి వద్ద నుంచి ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒ కటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె నేత్రాలు సజీవంశ్రీకాకుళం కల్చరల్: నగరంలోని చంపాగల్లివీధిలో నివాసం ఉంటున్న అంధవరపు జయలక్ష్మి (68) అనారోగ్యం కారణంగా మృతి చెందారు. మరణానంతరం ఆమె నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కుమారుడు అంధవరపు సుబుద్ధి, కోడ లు సత్యవతి, జి.లక్ష్మిలు వలసయ్య ద్వారా విషయాన్ని రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరా వుకు తెలియజేశారు. మగటపల్లి కల్యాణ్ నేత్రసేకరణ కేంద్రం టెక్నికల్ ఇన్ చార్జి సుజాత, జగదీష్‌ల ద్వారా జయలక్ష్మి కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేక రణ కేంద్రానికి అందజేశారు. దాత కుటుంబ సభ్యులను రెడ్‌క్రాస్ ప్రతినిధులు అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842 699321నంబరును సంప్రదింవచ్చని కోరారు. -
విడిది ఏదీ..?
ఇచ్ఛాపురం రూరల్: వేల కిలోమీటర్ల నుంచి అతిథి పక్షులు తేలుకుంచి చేరిపోయాయి. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు చిత్ర విచిత్రమైన కూతలతో చెట్లపై ముసురుకుంటున్నాయి. ఏటా తొలకరి జల్లులు కురిసే జూన్ మాసాంతరానికి వచ్చే పక్షులు ఈ ఏడాది కూడా ఏతెంచాయి. కొమ్మకొమ్మకు పురిటి కేంద్రాలు చెట్లపై కొమ్మలు, రెమ్మలు ఉంటే తప్ప గూడు ఏర్పాటు చేసుకోలేని ఈ పక్షులు గుడ్లు పెట్టేందుకు గ్రామం చుట్టూ ఉన్న చెట్లనే ఆశ్రయిస్తుంటాయి. ఒక్కో పక్షి రెండు నుంచి ఆరు గుడ్లు వరకు పెడు తుంటాయి. సుమారు 27 నుంచి 30 రోజుల వర కు తల్లి పక్షి గుడ్లను పొదుగుతుంది. పొదిగిన రోజు నుంచి 36 రోజుల పాటు ఆహారాన్ని తీసుకువచ్చి అందించి పిల్ల పక్షులను సంరక్షిస్తాయి. పిల్ల పక్షులకు శక్తి వచ్చి ఎగిరేంత వరకు తల్లి పక్షి లేదా మగ పక్షి గూళ్లో వీటికి కాపలాగా ఉంటాయి. స్థానికులతో అనుబంధం ఎక్కడో సైబీరియా నుంచి ఇక్కడి వరకు వచ్చే పక్షులకు అసలైన బంధువులంటే ఈ గ్రామ వాసులే. ఈ గ్రామస్తులతో పక్షులకు విడదీయలేని అనుబంధం ఉంది. పక్షుల రాక ఏ మాత్రం ఆలస్యమైనా కంగారుపడిపోతారు. ఇవి వస్తేనే వానలు కురుస్తా యని ఇక్కడి వారి నమ్మకం. తాము కూర్చున్న చోట, పక్కనే వాలుతాయని, వీటిని వేటగాళ్ల బారినుంచి గ్రామస్తులమే రక్షిస్తుంటామని చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా పక్షులకు హాని తలపెట్టాలని చూస్తే గ్రామ కట్టుబాటు ప్రకారం ఆ వ్యక్తికి గుండు గీయించి ఊరేగిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇవే ప్రత్యేకతలు ● వీటి అసలు పేరు ఓపెన్ బిల్ స్టార్క్స్. వీటి శాసీ్త్రయ నామం ‘అనస్థోమస్’. ● ఈ పక్షులు తూర్పు–దక్షిణాసియా ఖండంలో ముఖ్యంగా భారతదేశం, శ్రీలంక నుంచి మొదలుకొని తూ ర్పు ప్రాంతంలో విస్తారంగా సంచరిస్తుంటాయి. ● వీటి జీవిత కాలం సుమారు 30 ఏళ్లు. ● బాగా ఎదిగిన పక్షి 81 సెంటీమీటర్ల పొడవు, 11 కిలోల బరువు ఉంటుంది. రెక్కలు విప్పారినప్పుడు 149 సెంటీ మీటర్ల వరకు ఉంటుంది. ● దవడల మధ్యన (ముక్కు మధ్యలో) ఖాళీ ఉండటం వల్ల వీటిని ఓపెన్ బిల్ స్టార్క్స్ అని అంటారు. ● పగలంతా తంపర భూముల్లో, వరి చేలల్లో తిరుగుతూ చేపలు, నత్తలు, కప్పలు, పురుగులు, ఆల్చిప్పలను ఆహారంగా తీసుకుంటాయి. సంరక్షణ గాలి.. పక్షులను సంరక్షించాల్సిన అటవీ, పర్యావరణ శాఖాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామంలో చెట్లు పెంచాల్సిన అటవీశాఖ సిబ్బంది జాడే లేకుండా పోయింది. ఏడాదికో మారు గ్రామంలో చిన్నపాటి సమావేశాలు పెట్టి ఫొటోలు తీసి వెళ్లిపోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ గతంలో పర్యాటక శాఖ అధికారులతో పర్యటించి రూ.25లక్షలతో సుమారు ఎకరా దేవదాయ భూమిలో ప ర్యాటక కేంద్రాన్ని నిర్మిస్తానంటూ హామీ ఇచ్చి పదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నెరవేరలేదు. పక్షుల విహార కేంద్రానికి ప్రయత్నం తేలినీలాపురం మాదిరి తేలుకుంచిలో పక్షల విహార కేంద్రం నెలకొల్పేందుకు సుమారు రూ.పది లక్షల అంచనాతో గతంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. గ్రామంలో మొక్కలు నాటేందుకు గ్రామస్తు లు సహకరించడం లేదు. పక్షుల సంరక్షణకు చర్య లు తీసుకుంటున్నాం. – ఎ.మురళీకృష్ణంనాయుడు,ఫారెస్ట్ రేంజ్ అధికారి చెట్లపై సందడి చేస్తున్న విదేశీ విహంగాలు అరకొర చెట్లు ఉండడంతో గుడ్లు పెట్టేందుకు పాట్లు పట్టించుకోని అటవీ శాఖాధికారులు గతంలో వచ్చిన వరుస తుఫాన్ల తీవ్రతకు ఇక్కడ చాలా చెట్లు నేలకొరిగాయి. 2018లో వచ్చిన తిత్లీ తుఫాన్‌కు వందలాది పక్షులు మత్యువాత పడ్డాయి. ఈ ఏడాది వందల సంఖ్యలో పక్షులు వస్తున్నాయి. ప్రస్తుతం పక్షులు గూళ్లు పెట్టేందుకు నానాపాట్లు పడుతున్నాయి. చెట్లు లేక గడ్డికుప్పలు, ఇళ్లపై, పంట పొలాల చాటున గూళ్లు పెట్టుకునేందుకు సిద్ధపడుతున్నాయి. రాత్రి సమయాల్లో విష పురుగులు బారిన పడి పక్షులు మృతి చెందుతున్నాయని స్థానికులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. -
వేర్వేరు చోట్ల చోరీలు
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురంలో బంగారం షాపు నిర్వహిస్తున్న లెంక దిలీప్ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. దిలీప్ తన పిల్లలను చదువు నిమిత్తం శ్రీకాకుళంలోనూ ఇల్లు తీసుకుని అక్కడికి వెళ్లి వస్తుంటారు. ఈ నేపథ్యంలో క్రమంలో గురువారం శ్రీకాకుళం వెళ్లిన దిలీప్ శుక్రవారం జె. ఆర్.పురంలో ఉన్న ఇంటికి వెళ్లగా తలుపుల తాళా లు పగులగొట్టి ఉండటం గమనించారు. వెంటనే జే.ఆర్.పురం పోలీసులకు సమాచారం అందించా రు. గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించి వెండి, బంగారం ఆభరణాలు దొంగిలించినట్లు గు ర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. క్లూస్ టీం సభ్యులు ఇంటిని పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జె.ఆర్.పురం ఎస్సై చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టెక్కలి శ్రీనివాసనగర్‌లో.. టెక్కలి రూరల్: స్థానిక శ్రీనివాసనగర్‌లో నివాస ముంటున్న రిటైర్డ్ ఏపీఎస్పీ ఏఎస్ఐ నర్సింహమూర్తి ఇంట్లో చోరి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాసనగర్ పిల్లలబంద చెరువు సమీపంలో నివాసముంటున్న నర్సింహమూర్తి నెలరోజుల క్రితం హైదరాబాద్‌లోని తన కుమారుడి ఇంటికి వెళ్లారు. గురువారం రాత్రి ఇంటి తలుపులు తెరిచి ఉండటం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యజమాని నర్సింహమూర్తి హైదరాబాద్ నుంచి శనివారం వస్తున్నారని, ఆయన వచ్చాకే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కొత్త కెరండీ ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవం
పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి కొత్త కెరండీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం వార్షి కోత్సవాన్ని విద్యా కమిటీ అధ్యక్షుడు లింగరాజ్ మిశ్రా ప్రారంభించారు. కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ముంగి రవికుమార్ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా గుసాని సమితి విద్యాశాఖ అధికారి సీతారంపాత్రో, ఉప విద్యాశాఖ అధికారి కె.సోమేశ్వరరావు పాల్గొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలలో చేరేటట్టు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. అనంతరం వివిధ వక్తృత్వ, డ్రాయింగ్, ఆటల పోటీల్లో విజేతలైన విద్యార్థినులకు ముఖ్యఅతిథి సీతారాం పోత్రో, లింగరాజ్ మిశ్రా చేతులమీదుగా మెమొంటోలు, బహుమతులను అందజేశా రు. అనంతరం విద్యార్థులు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో సి.ఆర్.సి.సి. సి.హెచ్.గౌరీ, గుమ్మా బ్లాక్ ఉపాధ్యాయు లు అమూల్య పాణిగ్రాహి, పర్లాకిమిడి గాంధీ మెమోరియల్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం.తిరుపతిరావు, విద్యాకమిటీ ఉపాధ్యక్షులు జయక్రిష్ణ జెన్నా పాల్గొన్నారు. -
ఏఎన్ఎం దారుణ హత్య
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్న డెప్పాగుడ గ్రామానికి చెందిన శైలేంద్రీ సరక (35) శుక్రవారం దారుణ హత్యకు గురయ్యింది. సొంత బావ ఆమెను మరణాయుధంతో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం కల్యాణ సింగుపూర్ పోలీసుస్టేషన్లో తన మరదలను తానే హత్య చేశానంటూ లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సమితిలోని ధమునిపొంగ పంచాయతీ పరిధి డెప్పాగుడ గ్రామంలో భైమాఝి ప్రేపక, శైలేంద్రీ భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరిలో భార్య శైలేంద్రీ ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తుండగా, భర్త భైమాఝి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో భైమాఝికి, అతడి అన్నయ్య లొత్ర మాఝికి కొన్నాళ్లుగా భూ తగాదాలు కొనసాగుతున్నాయి. గురువారం ఇద్దరూ మరోసారి ఘర్షణ పడ్డారు. శుక్రవారం భైమాఝి పొలానికి వెళ్లడం గుర్తించిన లొత్ర మాఝి ఇంట్లో తన మరదలు ఒక్కరే ఉండడం గమనించి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో వంటపని చేసుకుంటున్న శైలేంద్రీ తలపై మరణాయుధంతో దాడిచేసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మృతి చెందిందని నిర్ధారించుకున్న తర్వాత గ్రామంలోకి వెళ్లి తన తమ్ముడు భార్యను తానే హత్య చేశానంటూ చెప్పుకుని పోలీసుస్టేషన్‌కు వెళ్లిపోయాడు. ఈ సమాచారాన్ని భైమాఝికి గ్రామస్తులు తెలియజేయడంతో పరుగున వచ్చి రక్తపు మడుగులో ఉన్న భార్యను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోలీసుస్టేషన్లో లొంగిపోయిన నిందితుడు కుటుంబ కలహాలే కారణమని వెల్లడి -
వివాహిత అనుమానాస్పద మృతి
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి చంచారగుడ గ్రామంలో అను బ్రెకబడక (23) అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి మృతురాలి తల్లిదండ్రులు ఇది హత్యేనంటూ బిసంకటక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతురాలి భర్త మకర కడ్రకను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. చంచరగుడలో నివాసముంటున్న అను బ్రెకబడక, మకర కడ్రకలు దంపతులు. శుక్రవారం తన భార్య ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చికిత్స కోసం బిసంకటక్ ఆస్పత్రికి తరలించాడు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. కాగా మృతురాలి మెడకు గాయాలు కనిపించడంతో అనుమానించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఇదిలాఉండగా గత ఐదేళ్ల క్రితం జిల్లాలోని చంద్రపూర్ సమితి కర్డాపంగ గ్రామానికి చెందిన సంతోష్ బ్రెకబడ కూతురుతో చంచారగుడ గ్రామానికి చెందిన మకర కడ్రకతో వివాహం జరిగింది. కొన్నాళ్లు సాఫీగా సాగుతున్న వీరి వైవాహిక జీవితంతో రెండేళ్లుగా తనను భర్త మానసికంగా హింసిస్తున్నట్లు అను తన తల్లిదండ్రులతో చెబుతుండేది. ఈక్రమంతో తన కూతురు మృతి చెందిన సమాచారం తెలుసుకుని గ్రామానికి చేరుకున్న అనంతరం తన కూతురుది హత్యేనంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు మలుపు తిరింగింది. హత్యేనని కన్నవారి ఆరోపణ పోలీసులకు ఫిర్యాదు -
పోలీసుల సాయంతో కుటుంబం చెంతకు తల్లి
భువనేశ్వర్: పూరీ తీర్థ యాత్రకు విచ్చేసిన కుటుంబం నుంచి 68 ఏళ్ల వృద్ధ మహిళ తప్పిపోయింది. స్థానిక పోలీసులు చొరవ కల్పించుకుని తప్పిపోయిన వృద్ధ మహిళని కుటుంబీకులకు భద్రంగా అప్పగించారు. తప్పిపోయిన వృద్ధ మహిళ శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సోంపేట గ్రామస్తురాలు 68 ఏళ్ల పొందూరు వజ్రం. ఈ నెల 17వ తేదీ గురువారం శ్రీ మందిరం సందర్శించారు. దర్శనం తర్వాత లోపలి ప్రాకారంలో ఉత్తర ద్వారం పరిసరాల్లో కుటుంబం నుంచి వృద్ధ మహిళ విడిపోయింది. ఇతర కుటుంబీకులు గుర్తించే సరికి ఆమె జాడ కనుమరుగై పోయింది. శ్రీ మందిరం నలు వైపులు, సాగర తీరం తదితర పర్యాటక ప్రాధాన్య ప్రాంతాల్లో కటుంబీకులు గాలించినా జాడ కనిపించలేదు. ఈ విషయమై పూరీ సింహ ద్వారం ఠాణాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు దాఖలు చేసిన వివరాలు ఆధారంగా తప్పి పోయిన మహిళ కోసం గాలించిన పోలీసులు వృద్ధురాల్ని గుర్తించి ఈ నెల 18 శుక్రవారం సురక్షితంగా అప్పగించారు. రద్దీ, కొత్త ప్రాంతాల్లో వృద్ధులు, పిల్లల పట్ల నిర్లక్ష్యం తగదని పోలీసులు హితవు పలికి సాగనంపారు.11 తాబేళ్ల పట్టివేతమల్కన్గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి అటవీ శాఖ వారు శుక్రవారం ఓ వ్యక్తి నుంచి 11 తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎంపీవీ గ్రామంలో అక్రమంగా తాబేళ్లు విక్రయిస్తున్నట్లు కలిమెల అటవీ శాఖకు ముందస్తు సమాచారం రావడంతో శుక్రవారం ఉదయం అటవీ శాఖ వారు ఎంపీవీ 11 గ్రామంలో మిధున్ బేపారి అనే వ్యక్తి ఇంటిపై దాడి చేయగా వారి రాకను గమనించిన మిథున్ తాబేళ్లను బాత్రూమ్లో గోనెల సంచిలో చుట్టి దాచాడు. తనిఖీలో బాత్రూమ్లో ఉన్న తాబేళ్లను స్వాధీనం చేసుకుని మిథున్‌ను అరెస్టు చేశారు.చోరీ కేసులో నిందితుడు అరెస్టు జయపురం: పట్టణంలోని ఎంజీ రోడ్డులో సాయిబాబా మందిరం పక్కనున్న బ్యాటరీ దుకాణంలో రూ.4 లక్షల నగదు, బంగారు నగలు దొంగతనం కేసులో ప్రధాన నిందితుడిని పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడు ఛొటగుడకు చెందిన గుప్త దాస్‌గా గుర్తించారు. దొంగతనం జరిగిన రూ.4 లక్షల్లో అతడి వద్ద నుంచి రూ.25 వేలు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ పోలీసు అధికారి ఎస్ఐ సిద్ధాంత బెహర వెల్లడించారు. నిందితుడు గుప్త దాస్‌పై 30కి పైగా దొంగతనాలు, దోపిడీలు మొదలగు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. గత జూన్ 29వ తేదీ రాత్రి దుకాణం గోడకు కన్నంపెట్టి రూ.4 లక్షలతో పాటు బంగారం, వెండి నగలు దొంగిలించాడని తెలియజేశారు. ఈ కేసులో ఇటీవల నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద రూ.70 వేల నగదు స్వాధీనం చేసుకున్న విషయం గుర్తు చేశారు. వీరిని విచారించి చోరీ సొత్తును రికవరీ చేయనున్నట్లు వెల్లడించారు. రెండు బైక్‌లు ఢీ : ఇద్దరు దుర్మరణం జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితి పోలీసు స్టేషన్ పరిధి సుర్లి గ్రామం జాతీయ రహదారిలో గురువారం రాత్రి ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు మోటారు బైక్‌లు ఢీకొనటంతో ఇద్దరు సంఘటన ప్రాంతంలోనే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న కొట్‌పాడ్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేసుకొని క్షతగాత్రులను వెంటనే కొట్‌పాడ్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. మరణించిన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. మరణించిన ఇద్దరిలో ఒకరు కొట్‌పాడ్ ఝొడిగుడ గ్రామం బైద్యనాథ్ గున్త, మరొకరు చత్తీస్‌గఢ్ రాష్ట్ర వాసి రఘునాథ్ భొలిగా గుర్తించారు. గాయపడిన ఇద్దిరిలో ఒకరు ఝొడిగుడ గ్రామం మొణిరాం పూజారి, మరొకరు చత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజారాం బాగెల్ అని పోలీసులు తెలిపారు. -
● కడతేరని కష్టం
భువనేశ్వర్: ఆత్మహత్యతో కన్ను మూసిన కూతురి మరణంతో క్షోభిస్తున్న తండ్రికి కష్టం రెట్టింపు చేసిన అమానుష సంఘటన వెలుగు చూసింది. బాలాసోర్ జిల్లా దెవులొ పంచాయతీ బింధాని సాహి ప్రాంతంలో మధు బింధాని అనే వ్యక్తి బీద గిరిజనుడు. అతని కుమార్తె ఆత్మహత్యతో ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలియడంతో బలియాపాల్ ఠాణా పోలీసులు ఘటనా స్థలం చేరి లాంఛనంగా కార్యకలాపాలు ముగించి తదుపరి పరీక్షల కోసం శవాన్ని ఆస్పత్రికి తరలించాలని ఆదేశించి తప్పుకున్నారు. కానీ కన్నబిడ్డ మృతదేహం రవాణాకు చేతిలో చిల్లి గవ్వ లేక ట్రాలీ రిక్షాపై కూతురు శవాన్ని ఉంచి కన్నీటి భారంతో 6 కిలో మీటర్ల దూరంలో ఉన్న బలియాపాల్ ఆస్పత్రి వరకు రిక్షాని లాగుకుంటూ పోయిన సంఘటన సర్వత్రా ఆవేదన కలిగించింది. -
అమ్మవార్లకు ఆషాడం సారె
రాయగడ: పట్టణంలోని గ్రామ దేవత బురదల పోలమ్మ, ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం మజ్జి గౌర మ్మ అమ్మవార్లకు పట్టణ ప్రజలు ఆషాడ మాసం సారెను శుక్రవారం సమర్పించారు. ఆషాడ మాసంలో ఆడబిడ్డలను సారె సమర్పిస్తుంటారు కాబట్టి, అమ్మవార్లను తమ ఇంటి ఆడ బిడ్డలుగా భావించి గత మూడేళ్లుగా ఆషాడ మాసం సారెను సమర్పిస్తూ ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. రాణిగుడఫారం, కస్తూరీనగర్, బుదరావలస తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు ఆదివాసీ సాంప్రదాయ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వచ్చి అమ్మవార్లకు సారెను సమర్పించారు. పసుపు, కుంకుమ, గాజులతో పాటు 108 రకాల పిండి వంటలను అమ్మవారికి అందజేశారు. మజ్జిగౌరమ్మ అమ్మవారి మందిరంలో తీసుకువచ్చిన పిండి వంటలను అమ్మవారి ముందర పెట్టారు. ఆలయ ప్రధాన పూజారి చంద్రశేఖర్ బెరుకో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం తీసుకొచ్చిన సారెను అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా అందజేశారు. -
ఐటీఈఆర్ ఆడిటోరియంలో కమ్మిన పొగలు
భువనేశ్వర్: నగరంలో పేరొందిన డీమ్డ్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. అదృష్టవశాత్తు పొగలు కమ్మిన ఆడిటోరియం నుంచి బయటపడి విద్యార్థులు బతికి బట్ట కట్టగలిగారు. స్థానిక జగమొరా ప్రాంతంలోని ఎస్ ఓఏ డీమ్డ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగమైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్–రీసెర్చ్ (ఐటీఈఆర్) ఆడిటోరియం రెండో అంతస్తులో శుక్రవారం అకస్మాత్తుగా పొగలు కమ్మాయి. సకాలంలో అగ్ని మాపక దళం రంగంలోకి దిగి మంటలు నివారించడంతో ప్రమాద స్థలం నుంచి 65 మంది విద్యార్థులను సురక్షితంగా బయటకు తరలించారు. అగ్నిమాపక, అత్యవసర సేవల విభాగం తక్షణ ప్రతిస్పందనతో ఇది సాధ్యమైందని ఒడిశా అగ్నిమాపక శాఖ సీనియర్ అధికార వర్గాల సమాచారం. ఒక విద్యార్థి అస్వస్థతకు గురి కాగా ఆస్పత్రికి తరలించారు. -
‘వందే భారత్’ను కొరాపుట్ వరకు నడపాలి
జయపురం: భువనేశ్వర్–విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కొరాపుట్ వరకు పొడిగించాలని ఉత్కళ సమ్మిళిణీ కొరాపుట్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరు రాసిన లేఖను విశాఖపట్నం రైల్వే డివిజన్ రెవెన్యూ మేనేజర్ ప్రవీణ కుమార్, ఏడీఆర్ఎం ఇ.శాంతారామ్‌లకు అందజేశారు. శుక్రవారం జయపురం రైల్వే స్టేషన్‌ను సందర్శించిన సమయంలో ఉత్కళ సమ్మిళిణీ కొరాపుట్ జిల్లా ప్రతినిధులు అధికారులకు లేఖను అందించారు. భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను అరుకు మీదుగా కొరాపుట్ వరకు నడపాలని విజ్ఞప్తి చేశారు. అందువలన మారుమూల ప్రాంతమైన బహుళ ఆదివాసీ ప్రాంత ప్రజలు భువనేశ్వర్ వెళ్లేందుకు అధిక సౌకర్యం కలుగుతుందని వారు వినతి పత్రంలో వివరించారు. కొరాపుట్ జిల్లా నుంచి రాష్ట్ర రాజధానికి ఒకే ఒక రైలు ఉందని ఆ ట్రైన్ ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చలేక పోతుందన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు వైద్య, విద్యా సౌకర్యాలు, వాణిజ్య, వ్యాపారాల కోసం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలపైన ఆధారపడుతున్నారన్నారు. అందువల్ల రైల్వే సౌకర్యలు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వందే భారత్ రైలు 800 కిలోమీటర్ల పరిధిలో గల పట్టణాలలో నడుస్తుందన్నార. అయితే భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం కేవలం 215 కిలోమీటర్ల దూరమని.. విశాఖపట్నం నుంచి అరుకు మీదుగా కొరాపుట్ వరకు నడిపితే 442 కిలోమీటర్లని వివరించారు. ఈ దూరాన్ని ఐదు గంటల్లోపే వందే భారత్ రైలుకు పడుతుందని వినతి పత్రంలో వివరించారు. వందే భారత్ రైలు నంబర్ 20841 భువనేశ్వర్ నుంచి కొరాపుట్ వరకు నడిపితే కేవలం 657 కిలోమీటర్లు అని ఈ దూరాన్ని చేరేందుకు తొమ్మిది గంటలు పడుతుందని పేర్కొన్నారు. కొరాపుట్ వరకు వందేభారత్ రైలును పొడిగిస్తే ఈ ప్రాంత ప్రజల ఆర్థిక సామాజిక ప్రగతికి దోహదపడిన వారౌతారని వెల్లడించారు. రైల్వే అధికారులకు మెమోరాండం అందజేసిన వారిలో ఉత్కళ సమ్మిళిణీ జిల్లా అధ్యక్షులు మదన మోహన నాయిక్, ఉపాధ్యక్షులు రాజేంద్రప్రసాద్ గౌప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస బాలా రాయ్, కార్యదర్శి నవీణ మదళ ఉన్నారు. ప్రధానమంత్రికి ఉత్కళ సమ్మిళిణీ శాఖ లేఖ -
శనివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2025
భువనేశ్వర్: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ సాగుకు సన్నాహాలు ఊపందుకున్నాయి. సాగు కోసం అవసరమైన ఎరువుల విడుదలకు రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియని శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీజను ఆరంభం కావడంతో ఎరువుల విక్రయం, పంపిణీలో అవకతవకలు, అవినీతి, అక్రమాలకు కళ్లెం వేసేందుకు అనుబంధ యంత్రాంగం ముందస్తుగా సిద్ధమైంది. ఈ ఏడాది సమగ్రంగా 58.50 లక్షల హెక్టార్ల భూమిలో ఖరీఫ్ సాగు కోసం రాష్ట్రం ప్రణాళిక ఖరారు చేసింది. దీనిలో 34.94 లక్షల హెక్టార్లలో వరి, 23.56 లక్షల హెక్టార్లలో వరియేతర పంటలు సాగు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. భారత ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ వ్యవసాయం కోసం సమగ్రంగా వివిధ గ్రేడ్ల 9.55 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రాష్ట్రానికి కేటాయించింది. దీనిలో ఇప్పటి వరకు రాష్ట్రానికి 7.94 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు విడుదల చేశారు. 3.65 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ ఎరువులు రైతులకు విక్రయించారు. వివిధ జిల్లాల్లో 4.24 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. అదనంగా, 23,589 మెట్రిక్ టన్నుల ఎరువులు త్వరలో వివిధ జిల్లాలకు చేరుకోవడానికి రవాణాలో ఉన్నాయి. 25 మంది డీలర్షిప్ లైసెన్సులు రద్దు నల్ల బజారు, నకిలీ ఎరువుల వ్యాపారం నిరోధించేందుకు మార్క్‌ఫెడ్ అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బ్లాక్ మార్కెటింగ్, నకిలీ ఎరువుల సరఫరా నివారించేందుకు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయం, రెవెన్యూ, పోలీసు శాఖలు జిల్లా, మండల స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ఎరువుల రిటైల్, హోల్‌సేల్ పాయింట్లపై ఆకస్మిక తనిఖీల నిర్వహణ, చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 1,993 రిటైల్ పాయింట్లను తనిఖీ చేసి 427 మంది రిటైలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిర్ధారిత నిబంధనలను ఉల్లంఘించినందుకు 8 కేసులలో స్టాప్ సేల్ నోటీసులు జారీ చేయగా, 25 మంది డీలర్షిప్ లైసెన్సులను రద్దు చేశారు. న్యూస్‌రీల్ 58.50 లక్షల హెక్టార్ల భూమిలో ఖరీఫ్ సాగు 9.55 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయింపు నేటి నుంచి ఖరీఫ్ వరి సేకరణ నమోదు -
మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో నాలుగు మార్కెట్ కమిటీల చైర్మన్ల నియమించినట్లు తెలిపారు. పాతపట్నం నియోజకవర్గంలో హిరమండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా మామిడి రామకృష్ణ (జనసేన), పాతపట్నం చైర్‌పర్సన్‌గా గౌరమ్మ చిన్నింటి, ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కంచిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా మద్దిలి విజయలక్ష్మి (టీడీపీ), శ్రీకాకుళం నియోజకవర్గంలోని శ్రీకాకుళం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా దారపు జ్యోత్స్న(జనసేన) ను నియమించినట్లు తెలిపారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య పొందూరు: స్థానిక కచేరీ వీధికి చెందిన చిరు వ్యాపారి ఎరబోతు దుర్గారావు(28) బుధవారం రాత్రి తన ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు వేసుకుని ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. రాత్రి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి తెరిచిచూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే స్థానిక సామాజిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. గురువారం పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని పోలీసులు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. గంజాయితో ఇద్దరు అరెస్టు ఇచ్ఛాపురం టౌన్: ఒడిశా నుంచి ముంబాయికి 22.566 కిలోల గంజాయి తరలిస్తున్న ఒడిశా రాష్ట్రం మోహన బ్లాక్‌కు చెందిన తులుషా నాయిక్, సామ్సన్ బీరోలను అరెస్టు చేసినట్లు సోంపేట ఎకై ్సజ్ మొబైల్ సీఐ జీవీ రమణ తెలిపారు. జిల్లా ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ మురళీధర్ ఆధ్వర్యంలో సోంపేట మొబైల్ ఎకై ్సజ్ బృందం ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ చుట్టుపక్కల గురువారం తనిఖీలు చేపట్టింది. ఆ సమయంలో అనుమానాస్పదంగా తులుషా నాయిక్, సామ్సన్ బీరోలు తిరుగుతుండగా గమనించి వారి లగేజీ తనిఖీ చేశారు. దీంతో వారి వద్ద 22.566 కిలోల గంజాయి పట్టుబడడంతో అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలోని జితున్ అనే వ్యక్తి వీరి ద్వారా ట్రైన్లో ముంబాయికి గంజాయి తరలించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.లక్ష వరకు ఉంటుందన్నారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్ఐ ఐ.సుజాత, సిబ్బంది శ్రీనివాస్, విజయ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ తూకంలో తేడా వస్తే చర్యలు జి.సిగడాం: ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యం తూకంలో తేడా వస్తే ఉపేక్షించేది లేదని శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి కె.సాయి ప్రత్యూష హెచ్చరించారు. మండల కేంద్రంలోని పౌర సరఫరాల గిడ్డంగిని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేషన్ డిపో డీలర్లకు బియ్యం తరుగుదల లేకుండా పంపిణీ చేయాలని, ఎక్కడైనా బియ్యం తరుగుదల వస్తే వెంటనే సంబంధిత గోదాం అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రేషన్ సరుకులు లబ్ధిదారులకు సకాలంలో అందేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎఫ్‌సీ గోదాం నుంచి వస్తున్న బియ్యాన్ని తూకం వేసి తీసుకోవాలన్నారు. అనంతరం మెట్టవలస గ్రామంలో మందుగుండు సామాగ్రి విక్రయించేందుకు షాపు నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుడి స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే అనుమతులు ఇస్తామన్నారు. ఆమెతో పాటు తహసీల్దార్ మహాదేవు సరిత, ఆర్ఐ అబోతుల రాధ, వీఆర్వో లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. పక్కాగా ప్రీస్కూల్ నిర్వహణ సారవకోట: అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్ నిర్వాహణ పక్కాగా జరగాలని సారవకోట ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి ఎస్.అనూరాధ సిబ్బందికి సూచించారు. గురువారం సారవకోట మండల పరిషత్ సమావేశ మందిరంలో సారవకోట, జలుమూరు మండలాల అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీపీ–1, పీపీ–2 పాఠ్య పుస్తకాలలో ఉన్న సబ్జెక్టు మేరకు ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్ నిర్వహణ చేపట్టాలన్నారు. కేంద్రాల నిర్వహణ, లబ్ధిదారులకు అందాల్సిన పౌష్టికాహారం తదితర వివరాలను యాప్‌లలో నమోదు చేయాలన్నారు. సూపర్వైజర్లు సుజాత, సీతారత్నం, మనోహరి పాల్గొన్నారు. -
ప్రయాణికుల రైళ్లు పునరుద్ధరించాలని వినతి
కొరాపుట్: కొరాపుట్–జయపూర్ మధ్య ప్రయాణికుల రైళ్లను పునరుద్ధరించాలని జయపూర్ చాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అధ్యక్షుడు వి.ప్రభాకర్ రైల్వే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఈ నెల 2న జయపూర్–కొరాపుట్ మధ్య మట్టి చరియలు ట్రాక్‌పైకి రావడంతో రైళ్లను నిలిపివేశారని చెప్పారు. రైల్వే సిబ్బంది ఆరో తేదీ నాటికే మార్గం సుగమం చేసినా కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయని తెలిపారు. ప్రయాణికుల రైళ్లు కొరాపుట్ నుంచి వెనుదిరుగుతున్నాయని పేర్కొన్నారు. విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా, రౌర్కెలా రైళ్లు కొరాపుట్ వరకే నడుస్తున్నాయని తెలిపారు. సమీప ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జగదల్పూర్తో పాటు కొట్‌పాడ్, జయపూర్ స్టేషన్లలో రైళ్లు ఎక్కాల్సిన ప్రయాణికులు కొరాపుట్ రోడ్డు మార్గాన వెళ్లాల్సి వస్తోందన్నారు. కొరాపుట్‌లో దిగిన వారు కిరండోల్ వరకు ట్యాక్సీలో వెళ్తే రూ.5000 వరకు ఖర్చు అవుతుందన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కొరాపుట్ నుంచి కిరండోల్ వరకు యధావిధిగా రైళ్లు నడపాలని విజ్ఞప్తి చేశారు. ఈ లేఖలను వాల్తేర్ డీఆర్ఎం, ఈస్ట్‌కోస్ట్ జీఎం, ఎంపీ సప్తగిరి ఉల్క, రైల్వే మంత్రి అశ్వినీ శ్రీ వైష్ణవ్‌లకు పంపించారు. -
అమృత్ భారత్ స్టేషన్ పనుల పరిశీలన
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా రోడ్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న అమృత్ భారత్ స్టేషన్ పనుల అభివృద్ధిని స్థానిక మండల రైల్వే అధికారి (డీఆర్ఎం) హెచ్.ఎస్.బజ్వా గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఖుర్దా రోడ్ నుంచి బరంపురం వరకు ప్రయాణికుల సౌకర్యాల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, భద్రత అంశాల్ని క్షుణ్ణంగా పర్యవేక్షించారు. దారి పొడవునా పలు స్టేషన్లలో ఆకస్మికంగా క్షేత్ర స్థాయి తనిఖీలు నిర్వహించారు. బరంపురం, బలుగాంవ్, ఇచ్ఛాపురం, ఛత్రపూర్ స్టేషన్లలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పనుల పురోగతిని సమీక్షించారు. నలుగురు వైద్యులు సస్పెన్షన్ పర్లాకిమిడి: గజపతి జిల్లాలో నలుగురు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రం సామాజిక ఆరోగ్య అధికారులను సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా ముఖ్యవైద్యాధికారి, డీపీహెచ్‌వో డాక్టర్ మహామ్మద్ ముబారక్ అలీ గురువారం తెలిపారు. మోహనా బ్లాక్‌లో పాణిగండ, రాయిపంక, బుదులి, ఆర్.ఉదయగిరిలోని శియ్యాళిలోట్టి గ్రామ పంచాయతీలో కమ్యూనిటీ హెల్త్ అధికారులు తరచూ విధులకు గైర్హాజరవుతున్నట్టు ప్రజలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విచారణ చేసివారిని సస్పెండ్ చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం వారి స్థానంలో ప్రత్యేక సూపర్వైజర్ టీం గిరిజన గ్రామాల్లో పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. -
బంద్ సంపూర్ణం
భువనేశ్వర్: ఒడిశా బంద్ నినాదంతో ఆందోళన చేస్తున్న నాయకులు బాలేశ్వర్ జిల్లా ఫకీర్ మోహన్ సేనాపతి కళాశాల విద్యార్థిని సౌమ్యక్ష బిసి ఆత్మాహుతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన 12 గంటల బంద్ ప్రశాంతంగా ముగిసింది. విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బీజేపీ ఏడాది పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు నిరంకుశ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. విద్యార్థి మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, బాలేశ్వర్ ఎంపీ, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బంద్‌లో కాంగ్రెస్ నాయకులతో పాటు వామపక్ష నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. – సాక్షి నెట్వర్క్ -
పరీక్ష పాట్లు..?
ప్రిన్సిపాల్స్‌కు అష్టకష్టాలు ఆ మధ్య యోగా డే, ఇటీవల మెగా పేరెంట్స్ మీటింగ్, తాజాగా యూనిట్ టెస్ట్ పరీక్షలు, మరోవైపు ఆన్లైన్ అడ్మిషన్లు ఇలా ప్రిన్సిపాల్స్ కు ఊపిరి తీసుకునే సమయం ఉండడం లేదు. ప్రశ్నాపత్రాలను జిరాక్స్ తీసేందుకు తగినంత సమయం లేకపోవడం, నిధులు కేటాయించకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో జిరాక్స్ సెంట ర్లు లేకపోవడం, కాలేజీల్లో వందలాది ప్రింట్లు తీసే ప్రింటర్లు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే ప్రశ్నాపత్రంతో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారన్న సంగతి అటుంచితే.. మెజారిటీ కాలేజీల్లో నిర్దేశించిన సిలబస్ పూర్తి కాలేదని తెలుస్తోంది. చాలాచోట్ల ఇప్పటికీ వివిధ సబ్జెక్టుల లెక్చరర్లు లేరు. ఈ మధ్యనే రేషనలైజేషన్ ప్రక్రియ, లెక్చరర్ల బదిలీలు, ప్రిన్సిపాల్స్ పదోన్నతలతో ఏర్పడిన ఖాళీల భర్తీ ఇంకా పూర్తి కాలేదు. లెక్చరర్ల లేనిచోట దుస్థితి ఒకలా ఉంటే.. లెక్చరర్ల ఉన్నచోట్ల పరిస్థితి మరోలా ఉంది. విద్యార్థులకు చెప్పిన పాఠాలొకటి.. ఇచ్చిన ప్రశ్నలొకటని గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదటి యూనిట్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, సాంఘి క, గిరిజన, గురుకులం, మోడల్ కాలేజీలు, కేజీబీ వీలు, హైస్కూల్ ప్లస్‌లలో చదువుతున్న ఇంటర్మీడి యట్ విద్యార్థులు ఈ పరీక్షలను రాస్తున్నారు. రోజుకు రెండు పరీక్షలు చొప్పున పరీక్షలు జరుగుతున్నాయి. మొదటి సెషన్ ఉదయం 11.30 గంట ల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతోంది. జిల్లాలో ఇదీ పరిస్థితి... పునర్విభజన శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కాలేజీలు 94 ఉన్నాయి. వీటిల్లో 19 వేల మంది వరకు విద్యార్థులు వివిధ ఇంటర్ కోర్సుల్లో చదువుతున్నారు. ఈ యూనిట్ పరీక్షల కోసం గత పది రోజులుగా ఇంటర్ బోర్డు నానా హడావుడి చేసినప్పటికీ.. ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు చేర్చడంలో సఫలీకృతం కాలేదని తెలుస్తోంది. ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు అందజేసేందుకు కాలేజీల్లో నానా అగచాట్లు పడుతున్నారు. పరీక్షకు స్వల్ప వ్యవధి ముందు క్వశ్చన్ పేపర్‌ను వెబ్సైట్లో పెడుతుండడంతో ప్రిన్సిపాల్స్ కష్టాలు అన్నీఇన్నీ కావు. డౌన్లోడ్ చేసి.. డిక్టేట్ చేస్తున్నారు.. ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని యాజమాన్యాల విద్యార్థులు యూనిట్ టెస్ట్‌లు, త్రైమాసిక, అర్థ సంవత్సర పరీక్షలను ఒకే ప్రశ్నాపత్రంతో రాసే విధానాన్ని 2023లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చారు. నాటి ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు చేసిన ప్రయత్నం మంచి ఫలితాలను ఇచ్చింది. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ తాజాగా జరుగుతున్న యూనిట్ టెస్ట్ ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు మెజారిటీ కాలేజీల్లో అందజేయలేదని తెలుస్తోంది. ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు అందజేయాల్సిందేనని జిల్లా అధికారులు ఆదేశించినప్పటికీ.. వివిధ కాలేజీల్లో ప్రశ్నాపత్రాలను ఇంటర్ బోర్డు వెబ్‌పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసి విద్యార్థులకు డిక్టేట్ చేసినట్లు సమాచారం. ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌పై లేదా బ్లాక్ బోర్డులపై క్వశ్చన్ పేపర్లలోని ప్రశ్నలను లెక్చరర్లు రాసి, తమను రాసుకోమంటున్నారని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఇంగ్లిష్, మ్యాథ్స్, కామర్స్ ఇతర ఒకేషనల్ పేపర్ల సందర్భంలో చాంతడంత ప్రశ్నలు రాయాల్సిన దుస్థితి తల్చుకుని ఆందోళన చెందుతున్నారు. ప్రారంభమైన ఇంటర్మీయట్ యూనిట్ పరీక్షలు చాలాచోట్ల ప్రశ్నాపత్రాలు అందక అవస్థలు కొన్నిచోట్ల డిక్టేట్ చేస్తుంటే రాస్తున్న వైనం ఆందోళన చెందుతున్న విద్యార్థులు సూచనలు చేశాం యూనిట్ టెస్ట్ పరీక్షలపై ప్రిన్సిపాల్స్‌కు అనేక సూచనలు చేయడం జరిగింది. పరీక్షల ప్రశ్నాపత్రాలను ప్రింటౌట్ తీసి విద్యార్థులకు అందజేయాలని ఆదేశించడమైంది. కచ్చితంగా ఇంటర్ బోర్డు ఉన్నతాధికారుల ఆదేశాలను కాలేజీల్లో అమలు చేయాల్సిందే. అమలు కాకుంటే చర్యలు తప్ప వు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – పి.దుర్గారావు, జిల్లా ఆర్ఐవో, ఇన్చార్జి డీవీఈవో, శ్రీకాకుళం -
సారా, మద్యాన్ని అరికట్టాలి
జయపురం: సారా, మద్యాన్ని అరికట్టాలని జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి మహుళి గ్రామ పంచాయతీ బిచలకోట గ్రామ ప్రజలు బొయిపరిగుడ పోలీసులకు గురువారం వినతిపత్రం సమర్పించారు. గ్రామ ప్రజలు బొయిపరిగుడ అబ్కారీ కార్యాలయానికి వెళ్లారు. అబ్కారీ అధికారి లేక పోవటంతో పోలీసు స్టేషన్‌కు వచ్చి పోలీసు అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. మహుళి పంచాయతీ కుంబారగుడ కాలనీగుడ, బెడగుడ, కొలాబ్ నదీ ప్రవాహిత ప్రాంత బాడిజొడి చొటనాళ ప్రాంతంలో నాటు సారా బట్టీలను బంద్ చేయాలని డిమాండ్ చేశారు. కొట్ట జంక్షన్లో విదేశీ మద్యం జోరుగా విక్రయిస్తున్నారని, వాటిని అరికట్టాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రాంతంలో నాటు సారా వంటకాలను, అమ్మకాలను అరికట్టేందుకు ప్రతి గ్రామానికి వెళ్లి సభలు, సమావేశాల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నామని వెల్లడించారు. సారాకు బానిస కావడం వల్ల యువత భవిష్యత్ అంధకారం అవుతుందన్నాచారు. సారా వలన తక్కువ వయసులోనే మహిళలు వితంతువులు అవుతున్నారని, గ్రామాలలో సారా అమ్మటం వలన అశాంతి, కుటుంబాల్లో కలహాలు ఏర్పడుతున్నాయన్నారు. యువకులు శాంతి భద్రతలకు విఘాతం కల్పించటమే కాకుండా.. హత్యలకు, కొట్లాటలకు కారణమవుతున్నారన్నారు. సారా నుంచి ప్రజలకు ముక్తి కల్పించాలని, ప్రజలను చైతన్యవంతులను చేయాలని, అధికారులు సహకరించాలన్నారు. -
పాతపట్నంలో ట్రాఫిక్ సమస్య
పాతపట్నం: మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పాతపట్నం సెయింట్‌ఆన్స్ పాఠశాల వద్ద గురువారం ఉదయం ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండల కేంద్రంలో 13 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలు ఉన్నాయి. ఉదయం పాఠశాలలు తెరిచేటప్పుడు, సాయంత్రం విడిచిపేట్టే సమయంలో విపరీతంగా ట్రాఫిక్ ఉంటోంది. ఇటీవల ట్రావెల్స్ బస్సులు కూడా ప్రధాన రహదారిలో ప్రయాణికులను దించేటప్పుడు ట్రాఫిక్ ఉన్నచోట నిలిపివేస్తుండడంతో ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి. అందువలన ఇప్పటికై నా పోలీసులు స్పందించి ట్రాఫిక్ లేకుండా చూడాలని ప్రజలు, వాహనదారులు వాపోతున్నారు. -
గూడ్స్ రైలు ఢీకొని కార్మికుని మృతి
రాయగడ: గూడ్స్ రైలు ఢీకొని కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన స్థానిక రైల్వే స్టేషన్ నాలుగో నంబర్ ప్లాట్‌ఫాంపై గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి సుందర్‌ఘడ్ జిల్లా దురుధేని పోలీస్ స్టేషన్ పరిధి అనల్జొర గ్రామానికి చెందిన చైతు కిసాన్ కుమారు దేవర్షి కిసాన్ (20)గా గుర్తించారు. గాయపడిన వారిలో సుందర్‌గఢ్‌కు చెందిన బబుల సాహ, రాయగడకు చెందిన సుశాంత్ దాస్‌లు ఉన్నారు. సంఘటన జరిగిన అనంతరం రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్ పనులకు సంబంధించి దేవర్షి, బబుల, సుశాంత్‌లు పుష్ ట్రాలీలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగో ప్లాట్‌ఫాం వద్ద గల నాలుగు–అయిదు ట్రాక్ లైన్ మధ్య ట్రాలీని నిలిపారు. అదే సమయంలో గూడ్స్ ట్రైన్ ట్రాలీని ఢీకొంది. దీంతో ట్రాలీ వద్దగల దేవర్షి రైలు కిందపడి నుజ్జునుజ్జవ్వగా సుశాంత్, బబులలు గాయాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన దేవర్షి కుటుంబానికి రైల్వే శాఖ తరఫున తగిన నష్టపరిహారం చెల్లిస్తారన్నారు. దేవర్షి, బబులలు ఓ రైల్వే కాంట్రాక్టరు వద్ద కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నట్లు సమాచారం. మరో ఇద్దరికి గాయాలు -
విద్యాసంస్థల్లో ప్రత్యేక హెల్ప్లైన్లు
భువనేశ్వర్: బాలాసోర్ ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని ఆత్మాహుతి ఘటన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యాసంస్థల ప్రాంగణాల్లో విద్యార్థులు, బోధన సిబ్బంది భద్రత, రక్షణ పట్ల కార్యాచరణ కట్టుదిట్టం చేసింది. ప్రధానంగా విద్యార్థినులు, ఉపాధ్యాయినులు, మహిళా సిబ్బంది పట్ల లైంగిక వేధింపులు వంటి ఘటనలకు తావు లేకుండా రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా శాఖ ఈ మేరకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాలలు, సామూహిక విద్యా శాఖ కార్యదర్శి షాలిని పండిట్ అన్ని జిల్లా విద్యా శాఖ అధికారులు, జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేశారు.విధుల నిర్వహణ ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు (నివారణ, నిషేధం, పరిష్కారం) చట్టం, 2013ని కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. విద్యా సంస్థలలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (ఐసీసీలు) కార్యాచరణ చురుకుగా కొనసాగాలని, క్రమం తప్పకుండా ఫిర్యాదుల్ని సమీక్షించి సకాలంలో తగిన చర్యలు పట్ల స్పందించచాలని పేర్కొన్నారు. ముఖ్యంగా బాలికల విద్యార్థుల శారీరక, మానసిక, సామాజిక, భావోద్వేగ కదలిక పట్ల దృష్టి సారించి, పాఠశాలల్లో సురక్షితమైన సమగ్ర సహాయక వాతావరణం నెలకొల్పాలని సూచించారు. విద్యార్థుల్లో లైంగిక ఆధారిత హింస నివారణకు సామాజిక శాస్త్ర పాఠ్యాంశాలతో అనుసంధానించబడిన అన్ని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో బర్నాలి (లింగ సమానత్వ కార్యక్రమం)ను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. హెల్ప్‌లైన్ ప్రదర్శన తప్పనిసరి.. విద్యా సంస్థల ప్రాంగణాల్లో సత్వర స్పందనకు అవసరమైన హెల్ప్‌లైన్ నంబర్ల ప్రదర్శన తప్పనిసరి చేసి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు, హాస్టళ్లు, అనుబంధ ప్రాంగణాల్లో హెల్ప్‌లైన్ నంబర్(మహిళా హెల్ప్‌లైన్ – 181, చైల్డ్ హెల్ప్‌లైన్ – 1098, పోలీస్ హెల్ప్‌లైన్– 112, పాఠశాల విద్యార్థి హెల్ప్‌లైన్ – 18003456722)లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించింది. -
పరిశుభ్ర నగరంగా భువనేశ్వర్
భువనేశ్వర్: భువనేశ్వర్ జాతీయ స్థాయిలో 10 పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. ప్రతిష్టాత్మకమైన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024లో నగరం 9వ ర్యాంక్‌ను సాధించింది. పట్టణ పరిశుభ్రత పట్ల నిబద్ధత రంగంలో గంజాం జిల్లాలో అసికా, చికిటి నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ (ఎన్ఏసీ) వరుసగా 50,000, 20,000 లోపు జనాభా విభాగంలో స్వచ్ఛ్ సెహార్ అవార్డును సొంతం చేసుకున్నాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాల్ని ప్రదానం చేశారు. రాష్ట్ర గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కృష్ణ చంద్ర మహాపాత్రో, సీనియర్ అధికారులు, పట్టణ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖను అభినందించారు. స్వచ్ఛ, సమృద్ధి ఒడిశా ఆవిష్కరణ కోసం నిరంతరం కృషి చేయాలని సూచించాచారు. -
కుప్పకూలిన బీజేడీ నేత
కొరాపుట్: రాష్ట్ర మాజీ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యదర్శి, సీనియర్ బీజేడీ నాయకుడు ప్రమోద్ కుమార్ పాఢీ అకస్మాత్తుగా ఇంటిలో కుప్పకూలిపోయారు. వెంటనే నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బీపీ పడిపోవడంతో కలహండి జిల్లా కేంద్రం భవాని పట్నలోని ప్రభుత్వ వైద్య కళాశాలకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య రాయగడ: hÌêÏÌZ° VýS$׿$-ç³N-ÆŠ‡ÌZ E¯]l² V>…«© C°íÜt-r*ÅsŒæ B‹œ C…h-±-Ç…VŠæ A…yŠæ sñæM>²ÌSi (iI-Dsîæ) ÑÔèæÓ-Ñ-§éÅ-ÌS-Ķæ$…ÌZ ^èl§ýl$-Ð]l#-™èl$¯]l² íßæÐ]l*…Ô¶æ$ çßZ™èl(19) VýS$Æý‡$ÐéÆý‡… B™èlÃ-çßæ™èlÅ ^ólçÜ$-MýS$-¯é²yýl$. Ð]l$–™èl$yýl$ ºÄñæ*-sñæMìS²MŠS Ñ¿ê-VýS…ÌZ ¨Ó-¡Ä¶æ$ çÜ…Ð]l-™èlÞÆý‡… ^èl§ýl$Ð]l#-™èl$-¯é²yýl$. çÜÐ]l*-^éÆý‡… ™ðlË$çÜ$MýS$¯]l² VýS$׿$-ç³NÆŠ‡ B§ýlÆý‡Ø ´ùÎ-çÜ$Ë$ çÜ…çœ$-r¯]l çܦÌS-¯é-ిMìS OòÜ…sìæíœMŠS º–…§ýl…™ø ^ólÆý‡$MýS$° §ýlÆ>Åç³#¢ ^ólç³-sêtÆý‡$. ÑÔèæÓ-Ñ-§éÅ-ÌS-Ķæ$…ÌZ° G¯ŒS-ïÜ&7 »êÏMŠSÌZ Æð‡…yø ¯]l…ºÆŠ‡ Ð]lç܆ VýS–çßæ…ÌZ E…r$¯é²yýl$. E§ýlĶæ$… Gç³µ-sìæ-ÌêVóS ™øsìæ Ñ§éÅ-Æý‡$¦Ë$ ÐðlãÏ ™èlË$-ç³#Ë$ ™èlrtV> Gr$-Ð]l…sìæ çÜÐ]l*-«§é¯]l… ÌôæMýS´÷-Ð]l-yýl…™ø A¯]l$-Ð]l*-°…_ Ððl…r¯ól àçÜtÌŒæ ÐéÆð‡z-¯ŒSMýS$ ™ðlÍ-Ķæ$gôæ-Ô>Æý‡$. AMýSP-yýlMýS$ ^ólÆý‡$-MýS$¯]l² ÐéÆð‡z¯ŒS MìSsìæMîS ¯]l$…yìl ^èl*yýlV> çßZ™èl Ð]l$–™èl§ólçßæ… ¸ëůŒSMýS$ ÐólÌê-yýl$™èl* MýS°-í³…-^èl-yýl…™ø Ķæ$f-Ð]l*-¯éÅ-°MìS ™ðlÍ-Ķæ$-gôæ-Ô>Æý‡$. Ð]l$–™èl$yýl$ »êÌôæ-ÔèæÓÆŠ‡ hÌêÏÌZ° ÝùÆŠ‡ {V>Ð]l*-°MìS ^ðl…¨¯]l Ð]lÅMìS¢V> çÜÐ]l*-^éÆý‡…. ™èlÆý‡^èl* ÑÔèæÓ-Ñ-§éÅ-ÌS-Ķæ$…ÌZ ѧéÅÆý‡$¦Ë$ B™èlÃçßæ-™èlÅ-ÌSMýS$ ´ëÌSµ-yýl$™èl$…-yýlyýl…™ø çÜÆý‡Ó{™é B…§øâýæ¯]l Ð]lÅMýS¢-Ð]l$-Ð]l#-™èl$…-¨. అండరాకంచ్ ఐఐసీపై ఫిర్యాదు రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి మైకంచ్ పంచాయతీ పరిధిలోని అండరాకంచ్ పోలీస్ స్టేషన్లో ఐఐసీగా విధులు నిర్వహిస్తున్న బిద్యులత నాయక్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీస కార్యాలయంలో అతనిపై ఫిర్యాదు చేశారు. ఏదైనా కేసు విషయమై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని వినతిపత్రంలొ పేర్కొన్నారు. మైకంచ్, కొడిపారి పంచాయతీల సర్పంచ్‌లు, సమితి సభ్యులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. ఈ నెల 11వ తేదీన మైకంచ్ సర్పంచ్ మస్తారామ్ మాఝి ఒక పని విషయమై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా అతనిపై ఐఐసీ నాయక్ దురుసుగా ప్రవర్తించారని వివరించారు. ప్రజా సేవ కోసం, శాంతి భద్రతలను కాపాడేందుకు ఉన్న పోలీస్ స్టేషన్లలో ప్రజలకే రక్షణ కరువైతే ఇంకా సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టి తగిన న్యాయం చేయమని కోరారు. హత్యకేసు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి దొరాగుడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక హత్య కేసుతో సంబంధం ఉన్న నిందితునికి జిల్లా అదనపు జడ్జి అల్పన స్వయి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమాన చెల్లించని పక్షంలో మరో ఏడాది శిక్షను అనుభవించాలని పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. 2021 డిసెంబర్ 24వ తేదీన కాసీపూర్ సమితిలోని గులుముజోల గ్రామంలో ఉన్న ప్రాథమిక విద్యాలయంలో ఉపాధ్యాయిరాలిగా పనిచేస్తున్న సరస్వతి నాథ్, ఆమె భర్త ముకుందనాథ్ శర్మలను గుర్తు తెలియని వ్యక్తి తురాయిఘాటి ప్రాథమిక విద్యాలయం సమీపంలో హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి దొరగుడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గులా అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసును బుధవారం విచారించిన జిల్లా అదనపు జడ్డి స్వయి నిందితునికి యావజ్జీవ శిక్షను విధించినట్లు న్యాయవాది రామప్రసాద్పాత్రో గురువారం తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు
టెక్కలి రూరల్: సంతబొమ్మాళి మండలంలోని పాలేశ్వరమ్మ అలయం సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. బోరుభద్ర పంచాయతీ పరిధి ఉదయ్పురం గ్రామానికి చెందిన భార్యాభర్తలు వంకల సంజీవ్, వంకల సరస్వతీలు తమ గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై టెక్కలి మండలంలోని రావివలస గ్రామం వైపు వస్తుండగా పాలేశ్వరమ్మ గుడి సమీపంలో బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బైక్‌పై ఉన్నటువంటి ఇరువురికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడినవారిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే సంజీవ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై సంతబొమ్మాళి పోలీసులకు సమాచారం అందించారు. అయితే వీరు వస్తున్న ద్విచక్ర వాహనానికి వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వలన ప్రమాదం జరిగి ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
కాగిత రహిత పాలనకు ప్రాధాన్యం
భువనేశ్వర్: ప్రజా సేవల రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానంతో డిజిటల్ కార్యకలాపాలు అభివృద్ధి పరచి క్రమంగా కాగిత రహిత కార్యకలాపాలకు ప్రాధాన్యత కల్పించాల్సి ఉందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వ పరిపాలనా సంస్కరణలు – ప్రజా ఫిర్యాదుల విభాగం సంయుక్తంగా నిర్వహించిన రెండు రోజుల జాతీయ సుపరిపాలన పద్ధతులపై సమావేశం గురువారం స్థానిక లోక్ సేవా భవన్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ హాజరయ్యారు. డిజిటల్ అధికారిక కార్యకలాపాల్లో రాష్ట్రం సాధించిన పురోగతితో కాగిత రహిత బడ్జెట్, సాంకేతికత ఆధారిత ఫిర్యాదుల పరిష్కారం వరకు వివిధ కార్యకలాపాల్ని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి వివరించారు. 2047 నాటికి వికసిత భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా సంస్కరణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు. అధికార పెత్తనానికి తెర దించి ప్రజా స్పందన పాలనకు పట్టం గట్టే రీతిలో సంస్కరణలు చేపడతున్నట్లు పేర్కొన్నారు. ఈ సదస్సుకు దేశం నలు మూలల నుంచి హాజరైన 400 మందికిపైగా ప్రతినిధుల చర్చలు, సలహాలు, సంప్రదింపులతో ప్రజా సుపరిపాలనలో ఉత్తమ పద్ధతులు, ఆధునిక పాలన విధానా ఆవిష్కరణల ఈ సమావేశం లక్ష్యంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి -
బాలికల విద్యాలయం తనిఖీ
కొరాపుట్: కొరాపుట్ జిల్లా బందుగాం సమితి నీలవడిలోని ప్రభుత్వ బాలికల విద్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత గురువారం ఆకస్మికంగా తణిఖీ చేశారు. మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో ఎంఎల్ఎ ఆకస్మిక సందర్శన ప్రాధాన్యతను సంతరించుకుంది. విద్యాలయం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రత, వసతులు, మౌలిక సదుపాయాలను విద్యార్థినులను అడిగి తెలసుకున్నారు. బోధన, తరగతి గదిలో పరిస్థితిపై ఆరా తీశారు. విద్యా పురోగతి తెలుసుకోవడం కోసం పాఠాలు బోధించారు. బాగా చదువుకోవాలని, ఏవైనా సమస్యలు వస్తే తనకు ఫోన్ చేయాలని భరోసా ఇచ్చారు. ప్రాంగణం లోనికి అనుమతి లేకుండా అపరిచిత వ్యక్తులు వస్తే పోలీసులకు తక్షణ సమాచారం ఇవ్వాలని సూచించారు. -
స్మార్ట్ మీటర్లు వద్దు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): విద్యుత్ స్మార్ట్ మీటర్లు వద్దని, ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని కోరుతూ వామపక్ష నాయకులు సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవన్ సీపీఎం కార్యాలయంలో విద్యు త్ భారాలకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్త లు మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలపై ఆగస్టు 5వ తేదీన విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయాల వద్ద చేప ట్టనున్న ధర్నాలను జయప్రదం చేయాలని కోరా రు. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు బద్దలుగొ ట్టండి అని యువగళం పాదయాత్రలో లోకేష్ పిలు పునిచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ స్మార్ట్ మీటర్లు బిగించడం మోసం కాదా అని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లు ద్వారా ప్రజలను తీవ్రంగా దోపిడీ చేయడానికి పూనుకుంటున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక మోసం ఇప్పటికే పెరిగిన విద్యుత్ బిల్లులతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారని, ఎన్నికలకు ముందు కూటమి నాయకులు కరెంటు చార్జీలు పెంచబోమని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు అత్యధికంగా విద్యుత్ చార్జీలు వసూలు చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. అదానీ స్మార్ట్ మీటర్ల ఖర్చులు నిమిత్తం 93 నెలల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తారన్నారు. వాటిని ఇళ్లకు బిగించకుండా ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. దక్షిణాదిలో కేరళ, బెంగాల్, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాయని తెలియజేశారు. రాష్ట్రంలో రెండు కోట్ల మీటర్లు పెట్టి రూ.25 వేల కోట్ల భారం ప్రజల మీద వేసేందుకు పూనుకున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమం ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు. జూలై 18 నుంచి 22 వరకు పట్టణ, మండల కేంద్రాల్లో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పి.చంద్రరావు, పట్టణ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ఎం.గోవర్ధనరావు తదితరులు పాల్గొన్నారు. ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలి వామపక్ష నాయకుల డిమాండ్ -
విషాదం
● వేర్వేరు చోట్ల ఇద్దరు బాలురు మృతి ● కాలువలో మునిగి ఒకరు.. నదిలో పడి మరొకరు మృత్యువాత మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మందాపల్లి పంచాయతీ పులిమేట్ల గ్రామంలో గురువారం కాలువలో పడి ఎనిమిదేళ్ల బాలుడు గణేష్ మృతి చెందాడు. 4వ తరగతి చదువుతున్న గణేష్ స్కూల్ నుంచి వచ్చాక గ్రామ సమీపంలోని కాలువలో స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో తోటి బాలురు కేకలు వేశారు. స్థానిక రైతులు స్పందించి బాలుడ్ని బయటకు తీసి తండ్రికి సమాచారం అందించారు. వెంటనే కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం అనంతరం శుక్రవారం తల్లిదండ్రులకు అప్పగిస్తామని కలిమెల ఐఐసీ ముకుందో మేల్కా తెలిపారు. జయపురం: బొయిపరిగుడ సమితి పూజారిగుడ పంచాయతీ సనపావలిగుడలో గురువారం శుక్ర మఝి కుమారుడు ఐదేళ్ల హేమంత్ మఝి సమీప నదిలో ప్రమాదవశాత్తు మునిగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వచ్చాక ఇద్దరు పిల్లలతో స్నానం చేసేందుకు నదికి వెళ్లాడు. అక్కడ కాలు జారి నీటిలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి బొయిపరిగుడ పోలీసులకు సమాచారం అందించారు. -
కలప దుంగలు తరలిస్తున్న ట్రక్కు పట్టివేత
● డ్రైవర్ అరెస్టు జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ అటవీ సిబ్బంది కలప దుంగలను అక్రమంగా తరలిస్తున్న ట్రక్కును పట్టుకున్నారు. ట్రక్కు డ్రైవర్ టికేశ్వర కుమార్ సాహును అరెస్టు చేసినట్లు అటవీ విభాగ అధికారి సందీప్ కుమార్ పాణిగ్రహి గురువారం వెల్లడించారు. ట్రక్కులో తీసుకెళ్తున్న 16 విలువైన కలప దుంగలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. బొయిపరిగుడ సమితి దసమంతపూర్ అటవీ ప్రాంతం నుంచి ఒక ట్రక్కులో కలప అక్రమంగా తీసుకుపోతున్న సమాచారం విశ్వసనీయ వర్గాల ద్వారా అందిందన్నారు. వెంటనే దసమంతపూర్ ఫారెస్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని పంపించి ట్రక్కును అడ్డుకొని కలప సీజ్ చేసినట్లు వివరించారు. కలప ఉన్న ట్రక్కును అటవీ విభాగ కార్యాలయానికి తీసుకు వచ్చామన్నారు. డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
బాలాసోర్ టు భువనేశ్వర్
గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025● బీజేడీ గర్జన ● విద్యార్థిని మృతిపై రాష్ట్రమంతా ఆందోళనలు ● ఆందోళన చేస్తూ ఆస్పత్రి పాలైన మాజీ మంత్రులు భువనేశ్వర్: బాలాసోర్ ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని సౌమ్యశ్రీ బీసీ మృతికి నిరసనగా రాష్ట్రంలో విపక్షం బిజూ జనతా దళ్ ఘటనా స్థలం బాలాసోర్ నుంచి రాజధాని భువనేశ్వర్ వరకు ఏక కాలంలో తార స్థాయిలో ఆందోళన కొనసాగిస్తోంది. ఈ ఆందోళనల్లో ఇద్దరు మాజీ మంత్రులు గాయపడి ఆస్పత్రిలో చేరారు. పలువురు కార్యకర్తలు పోలీసు దెబ్బలు తిన్నారు. బుధవారం బాలాసోర్ బంద్, రాజధానిలో లోక్ సేవా భవన్ ముట్టడి ఆందోళనలతో పరిసరాలు దద్దరిల్లాయి. పార్టీ కార్యకర్తలను ఘెరావ్ చేయడానికి ప్రయత్నించగా, బీజేడీ సీనియర్ నాయకులు ప్రణబ్ ప్రకాష్ దాస్ అలియాస్ బాబీ దాస్, ప్రీతిరంజన్ ఘొడై గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. బాధిత కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలని, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఉన్నత విద్యా విభాగం మంత్రి సూర్య వంశీ సూరజ్ పదవులకు రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థినికి న్యాయం జరగాలనే పట్టుతో బిజూ జనతా దళ్ స్థానిక లోక్ సేవా భవన్ ముట్టడి ఆందోళన చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలగాలను మోహరించి నీటి ఫిరంగులు, భాష్ప వాయువు ప్రయోగించి ఆందోళన ఆపడానికి ప్రయత్నించింది. ఇది ప్రభుత్వం అసమర్థత, అప్రజాస్వామ్య పాలనకు నిదర్శనంగా విపక్ష బిజూ జనతా దళ్ దుయ్యబట్టింది. బాలాసోర్ ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థికి న్యాయం కోసం ప్రారంభించిన ఈ పోరాటం ఆగదని, అవాంఛనీయ బలవంతపు చర్యలు, బల ప్రయోగాలను ఎదురీది నిరవధికంగా ఆందోళన కొనసాగిస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. పోలీసుల అప్రజాస్వామిక చర్యలతో మాజీ మంత్రులు ప్రణబ్ ప్రకాష్ దాస్ (బాబీ), ప్రీతిరంజన్ ఘొడై తీవ్రంగా గాయపడ్డారు. ప్రణబ్ ప్రకాష్ దాస్ అపోలో ఆస్పత్రిలో చేరగా, ప్రీతిరంజన్ ఘొడైని క్యాపిటల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, బీజేడీ ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలో మహిళా నాయకురాలు సులతా దేవ్ గాయపడ్డారు. వందలాది మంది బిజూ జనతా దళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూస్‌రీల్ -
ఇదేం తీరు..!
● వైద్యారోగ్య శాఖలో బదిలీలపై ఎమ్మెల్యేల అత్యుత్సాహం ● సిఫారసు లేఖల ప్రకారం బదిలీలు చేశారా.. లేదా? ● ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయలేదు? ● వివరంగా జాబితాలు పంపాలని ఆదేశం అరసవల్లి : కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుతో జిల్లా స్థాయి అధికారులు అవస్థలు పడుతున్నారు. పోస్టింగ్‌లకు, బదిలీలకు, ఇతరత్రా పనులకు ఒక్కో ఎమ్మెల్యే తమ ప్రాంతీయులకు అనుకూలంగా సిఫారసు లేఖలు పంపిస్తూ.. ఎలాగైనా చేయాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. తాజాగా జిల్లా వైద్యారోగ్య శాఖలో గ్రామ/వార్డు సచివాలయాల్లో ఏఎన్ఎంల బదిలీల ప్రక్రియ జూమ్ విధానంలో వివాదాస్పదంగా జరిగిన సంగతి విదితమే. నేతల ఒత్తిళ్లతో కూడిన సిఫారసు లేఖలు కూడా ఇందుకు ప్రధాన కారణం కాగా.. కార్యాలయంలో ఓ ఇద్దరు కీలక ఉద్యోగుల చేతివాటం మరో కారణమనే ఆరోపణలు వినిపించాయి. మొత్తానికి బదిలీల ప్రక్రియ ఎలాగోలా ముగిసింది. పోస్టింగుల స్థానాలను కేటాయించగా.. చాలావరకు జాయినింగ్లు కూడా అయిపోయాయి. ఇప్పుడు మళ్లీ అధికారులకు చేతినిండా పనిపడింది. బదిలీలు చేసిన జాబితాలను తిరగేస్తూ బుధవారం కార్యాలయంలో బిజిబిజీగా కనిపించారు. జాబితా కోసం...! గ్రామ/వార్డు సచివాలయాల్లో మొత్తం 605 మందికి బదిలీలు చేశారు. పేరుకు నిబంధనల ప్రకారం చేసామని అధికారులు స్టేట్మెంట్లు ఇస్తున్నా.. వాస్తవానికి అందుకు విరుద్ధంగా జరిగాయనేది బహిరంగ సత్యం. బదిలీల ప్రక్రియలో ప్రత్యేకంగా పేర్లతో కూడిన జాబితాలను నేరుగా ఎమ్మెల్యేల సంతకాలతోనే జిల్లా వైద్యారోగ్యశాఖకు పంపించారు. వీరికి మాత్రమే కోరుకున్న స్థానాల్లో బదిలీలు చేయాలని హుకుం జారీ చేశారు. సిఫారసు లేఖల ద్వారా అందిన సుమారు మూడు వందల మందికి పైగా పేర్లలో చాలావరకు ఏఎన్ఎంలకు కోరుకున్న స్థానాల్లో బదిలీలు చేశారు. తీరా ఇప్పుడు చూస్తే.. ‘అసలు మేం ఇచ్చిన సిఫారసు లేఖల్లో ఎవెరెవరికి బదిలీలు చేశారో..’ అన్న జాబితాలను తిరిగి ఎమ్మెల్యే కార్యాలయానికి పంపించాలంటూ మౌఖిక ఆదేశాలు రావడంతో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు అదే పనిలో పడ్డారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే 8, ఎచ్చెర్ల ఎమ్మెల్యే 10, ఆమదాలవలస ఎమ్మెల్యే 22, పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం, పలాస నరసన్నపేట తదితర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సైతం నాలుగైదు విడతలుగా సిఫారసుల లేఖలతో బదిలీలు చేయాలని లేఖలు అందాయి. ఈ లేఖల ప్రకారం ఎవరికి చేయలేదో.. చేయకపోవడానికి కారణాలేంటో లిఖితపూర్వకంగా ఎమ్మెల్యేలకు తెలియాలట! ఇదే పనిలో డీఎంహెచ్‌వో కార్యాలయ పరిపాలనావిభాగం, ఎస్టాబ్లిష్మెంట్ విభాగాలు తెగ కష్టపడుతున్నాయి. ఇదీ కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరు. -
బంద్ విజయవంతం చేయండి
జయపురం: బాలేశ్వర్‌లోని పీఎం స్వయం ప్రతిపత్తి కళాశాల విద్యార్థిని మరణానికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఆమె మరణానికి బాధ్యత వ హించి రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి రాజీనామా చేయాలని కోరుతూ గురువారం చేపట్టనున్న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ, జిల్లా కమ్యూనిస్టు పార్టీలు సంయుక్తంగా బుధవారం నిర్వహించిన ప త్రికా ప్రతినిధుల సమావేశంలో పిలుపునిచ్చాయి. స్థానిక జిల్లా కాంగ్రెస్ భవనంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శశిభూషణ పాత్రో అధ్యక్షతన జరిగిన సమావేశంలో జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి మాట్లాడారు. విద్యార్థిని మృతికి న్యాయం జరగాలని కోరుతూ అఖిల ఒడిశా బందుకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిందని తెలియజేశారు. బంద్‌లో జిల్లాలోని ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, మోటారు వర్కర్స్ యూనియన్లు, ప్రైవేట్ బస్సు యజమానుల సంఘం, లారీ ఓనర్స్ యూనియన్, చాంబర్ ఆఫ్ కామర్ష్ అండ్ ఇండస్ట్రీస్‌లు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి జుధిష్టర్ రౌళో, నరేంద్రకుమార్ మహంతి, కాంగ్రెస్ సీనియర్ నేత మదన మోహన్నాయిక్, కొరాపుట్ మున్సిపల్ మాజీ చైర్మన్ భగవాన్ బాహిణీపతి, కొరాపుట్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నళినీ రథ్, మానస్వినీ టక్రి, నిహార్ రంజన్ బిశాయి తదితరులు పాల్గొన్నారు. -
4
గంటలు.. నరకం● ఎం.తోటూరు ఎల్సీ గేట్‌ను మూసివేసిన రైల్వే అధికారులు ● ఇబ్బందులు పడిన విద్యార్థులు, వాహనచోదకులు ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం రైల్వే ట్రాక్ మరమ్మతుల నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఎం.తోటూరు వద్ద రైల్వే గేటును మూసివేశారు. దీంతో వాహనచోదకులు తీవర ఇబ్బందులకు గురయ్యారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిలో నాలుగు గంటల పాటు గేటు వేయడంతో అటువైపుగా వెళ్లే స్కూల్, కాలేజీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో నరకయాతన పడ్డారు. అండర్ పాసేజ్ మొత్తం వర్షం నీటితో మునిగిపోవడంతో సుమారు ఐదు కిలో మీటర్లు దూరంలో ఉన్న బెన్నుగానిపేట, కేదారిపురం గ్రామాలు మీదుగా వాహనాలు రాకపోకలు సాగించాయి. సైకిల్‌పై వెళ్లే వారు, బాటసారులు తప్పని పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి అండర్ పాసేజ్ పక్కనున్న సందులు గుండా రైల్వే పట్టాలపై నుంచి రాకపోకలు సాగించారు. అయితే ముందస్తుగా నాలుగు గంటల పాటు గేట్‌ను మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఉదయం నుంచి ఎల్సీ గేటు వద్ద ప్లకార్డులు ప్రదర్శించడంతో వాహనచోదకులు మిన్నకుండిపోయారు. -
నేడు పర్లాకిమిడిలో బంద్
పర్లాకిమిడి: ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని మృత్యువాత పడిన సంఘటనను ఖండిస్తూ గురువారం గజపతి జిల్లా బంద్‌కు కాంగ్రెస్, వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు పట్టణంలో బంద్‌కు వ్యాపార సంస్థలు, ప్రైవేటు బస్సులు సహకరించాలని ఆటో ద్వారా ప్రచారం చేశారు.కంప్యూటర్ అకౌంటెన్సీ కోర్సులో శిక్షణ రణస్థలం: ఎచ్చెర్ల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న కంప్యూటర్ అకౌంటెన్సీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ ఎన్.రామ్‌జీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పదో తరగతి చదివిన, 19 నుంచి 45 ఏళ్ల బీపీఎల్ కేటగిరి మహిళా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. 38 రోజులపాటు నిర్వహించే ఈ శిక్షణలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామని, పూర్తి వివరాలకు 77021 80537 నంబరును సంప్రదించాలని కోరారు. బాలింత మృతితో ఆందోళన శ్రీకాకుళం క్రైమ్ : నగరంలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో బుధవారం వేకువఝామున బాలింత చనిపోవడంతో ఆమె కుటుంబీకులు, బంధువులు ఆందోళన చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్ఛాపురం కొత్తపుట్టుగ గ్రామానికి చెందిన నర్తు హైమావతి (25) ఐదారేళ్లుగా పిల్లలు కలగకపోవడంతో శ్రీకాకుళం నగరానికి చెందిన, రాజకీయాల్లో ఉన్న ప్రముఖ వైద్యుడు వద్ద మందులు వాడుతోంది. భర్త విదేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లినా.. పిల్లలు కలగాలనే ఆపేక్షతో గ్రామానికి పలుమార్లు వచ్చి భార్య చికిత్స కోసం నెలకు రూ.50 వేలకు మించి ఖర్చు చేసేవారు. ఈ క్రమంలో ఈ నెల 14న హైమావతి బాబుకు జన్మనిచ్చింది. ఈ నెల 15 సాయంత్రం వరకు హైమావతి బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఒక్కసారిగా యూరిన్ ఆగిపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. మంగళవారం రాత్రి 11 దాటాక చనిపోయింది. శస్త్రచికిత్స వికటించడం వల్లే ఇలా జరిగిందని.. అయినప్పటికీ వైద్యులు బుధవారం వేకువఝామున చనిపోయినట్లు ధృవీకరించినట్లు బంధువులు ఆరోపించారు. ఈ మేరకు ఆందోళన చేయడంతో వైద్యుడు చర్చలు జరిపి రాజీ చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అప్పటికే పోలీసులకు సమాచారమందినా సెటిల్మెంట్ కావడంతో వారూ వెనుదిరగాల్సివచ్చింది. -
బైక్‌ల చోరీకి పాల్పడిన నిందితుల అరెస్టు
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్‌టౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లను అపహరించిన ఇద్దరు నిందితులను వన్‌టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వన్‌టౌన్‌లో ఎస్పీ వకుల్ జిందల్ విలేకరుల ముందు ఇద్దరు నిందితులను ప్రవేశ పెట్టారు.ఈ కేసుకు సంబంధించి ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ విజయనగరంలోని వీటీ అగ్రహారం బీసీ కాలనీకి చెందిన ఉప్పడాల రాము అలియాస్ డీజే, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం ముద్దాడపేటకు చెందిన ముద్దాడ నవీన్ అలియాస్ టైసన్ (19)తో కలిసి 11రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్, 2 యమహా మోటార్ సైకిళ్లను మారుతాళాలతో దొంగిలించారన్నారు. తరచూ విజయనగరం వన్ టౌన్, టూటౌన్ పోలీస్స్టేషన్ల పరిధిలో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ చోరీకి గురవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని వాటికి కారకులైన నిందితులను అరెస్టు చేసేందుకు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో క్రైమ్ ఎస్సై సురేంద్ర నాయుడు బైక్ దొంగతనాలపై తన సిబ్బందితో నిఘా పెట్టారన్నారు. ఈ క్రమంలోనే వీటీ అగ్రహారం బీసీ కాలనీలో నివాసం ఉంటున్న (ఎ1) ఉప్పడాల రాము అలియాస్ డీజేను అరెస్టు చేశామని తెలిపారు. గతంలో కూడా ఉప్పడాల రాము అలియాస్ డీజేపై బైక్ చోరీలకు పాల్పడినట్లు పలు కేసులున్నాయన్నారు. నిందితుడు రాము ఇటీవల జైలు నుంచి విడుదలైన తరువాత మళ్లీ బైక్ చోరీలకు పాల్పడ్డాడని తెలిపారు. ఎ1 ఉప్పడాల రాము నుంచి 7 మోటార్ సైకిల్స్‌ను, ఎ2 ముద్దాడ నవీన్ నుంచి 6 మోటార్ సైకిళ్లు రికవరీ చేశామని చెప్పారు. రికవరీ చేసిన బైక్‌లను కోర్టు ఆదేశాలతో బాధితులకు తిరిగి అందించేందుకు చర్యలు చేపడతామని ఎస్పీ ఈ సందర్భగా స్పష్టం చేశారు. ఈ కేసులో క్రియాశీలకంగా వ్యవహరించిన విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, సీఐ ఆర్వీఆర్కే చౌదరి ఆధ్వర్యంలో పని చేసిన వన్ టౌన్ క్రైమ్ ఎస్సై సురేంద్ర నాయుడు, హెచ్‌సీ ఎ.రమణారావు, కానిస్టేబుల్స్ ఎన్.గౌరీశంకర్, పి.శివశంకర్, టి.శ్రీనివాస్, పి.మంజులను ఎస్పీ వకుల్ జిందల్ అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. -
అభివృద్ధి లక్ష్యాలు సాధించాలి
కొరాపుట్: మున్సిపాలిటీల్లో అభివృద్ధి లక్ష్యాలు సాధించాలని కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తివాసన్ పిలుపునిచ్చారు. బుధవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆడిటోరియంలో మున్సిపల్ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంతవరకు అమలవుతున్న పథకాల తీరు, భవిష్యత్‌లో ప్రజలకు అందాల్సిన సేవలు గురించి నేరుగా చెప్పాలని సూచించారు. పెరుగుతున్న పట్టణల జనాభా ఆధారంగా ప్రభుత్వ సేవలు కూడా ఆధునీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లాకు చెందిన మున్సిపల్ చైర్మన్లు లలెటెందు రంజన్ శెఠి (కొరాపుట్), నొరి మహంతి (జయపూర్), శంకరరావు (కోట్పాడ్), రాజేంద్ర కుమార్ పాత్రో (సునాబెడా) తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు వీల్చైర్ల పంపిణీ రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి కార్యాలయం ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన భీమ్బోయ్ దివ్యాంగుల శిబిరంలో నలుగురు దివ్యాంగులకు జిల్లా సామాజిక సంక్షేమ శాఖ వీల్చైర్లను పంపిణీ చేసింది. అదేవిధంగా మరో ఇద్దరికి వినికిడి యంత్రాలను అందజేసింది. కార్యక్రమంలో బీడీవో బిజయ్ కుమార్, జిల్లా సామాజికి సంక్షేమ శాఖ అధికారి శ్రీకాంత్ పాణిగ్రహి, రాయగడ దివ్యాంగుల సంఘం సాధారణ కార్యదర్శి అమరేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ దంపతుల ఔదార్యం కొరాపుట్: రోడ్డు ప్రమాద బాధితుడిని మాజీ ఎంపీ దంపతులు వైద్య కళాశాలకు తీసుకెళ్లారు. బుధవారం కొరాపుట్ మాజీ ఎంపీ జిన్ను హిక్కా ,అతని సతీమణి సీనియర్ బీజేడీ నాయకురాలు కౌసల్య హిక్కాలు కొరాపుట్‌లో ప్రయాణం చేస్తున్నారు. సునాబెడా రోడ్డులో డీఐజీ ఆఫీస్ ఎదుట ఒక బైక్ చోదకుడు ప్రమాదంలో గాయపడి రోడ్డుపై పడి ఉన్నాడు. ఇది గమనించిన వీరిద్దరూ వాహనం ఆపి క్షతగాత్రుడిని రోడ్డు పక్కకు చేర్చారు. తమ వాహనంలోనే కొరాపుట్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో స్వయంగా వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి లోపలకు తీసుకెళ్లారు.‘ప్రభుత్వానిదే బాధ్యత’ రాయగడ: ఫకీర్ మోహన్ సేనాపతి కళాశాల సౌమ్య శ్రీ ఆత్మాహుతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని గుణుపూర్ మాజీ ఎమ్మెల్యే రఘునాఽథ్ గొమాంగొ ఆరొపించారు. ఈ మేరకు గుణుపూర్‌లోని కాలేజీ కూడలిలో ఆయన ఆధ్వర్యంలో బీజేడీ శ్రేణులు నిరసన చేపట్టాయి. కార్యక్రమంలొ వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థినులు పాల్గొన్నారు. సౌమ్యశ్రీ ఆత్మహత్యపై క్రైమ్ శాఖ దర్యాప్తు భువనేశ్వర్: బాలాసోర్ ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థి సౌమ్యశ్రీ బిసి ఆత్మాహుతి మరణంపై రాష్ట్ర క్రైమ్ శాఖ దర్యాప్తు చేస్తుందని క్రైం శాఖ డైరెక్టరు జనరల్ బినయ్తోష్ మిశ్రా ఈ విషయం తెలిపారు. మహిళ, శిశు నేరాల నివారణ విభాగం ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్.సాయిని ప్రత్యక్ష పర్యవేక్షణలో డీఎస్పీ ఇమాన్ కల్యాణ్ నాయక్‌తో కూడిన ప్రత్యేక బృందం సమగ్ర దర్యాప్తు జరుగుతుందని వివరించారు. -
నిందితులపై చర్యలు తీసుకోవాలి
కొరాపుట్: జర్నలిస్ట్ హత్యకు గురవడం పట్ల పాత్రికేయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. కొరాపుట్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ని ఒడిశా యూనియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ ప్రతినిధులు బుధవారం కలిశారు. మల్కన్‌గిరి జిల్లా మొటు సమితి టైమ్స్ ఒడియా వెబ్ చానల్ జర్నలిస్ట్ సి.హెచ్.నరేష్‌ను హత్య చేసిన విషయం గుర్తు చేశారు. ఇంతవరకు జర్నలిస్ట్‌లకు బెదిరింపులు, దాడులు జరిగేవని, ఇప్పుడు స్థాయి పెంచి హత్యలు చేస్తున్నారన్నారు. ఈ ఘటనలో నిందితులపై కఠిక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్ట్‌ల భద్రతకి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సంఘం సభ్యులు రజేంద్ర గౌడ, రంజన్ దాస్, శశిధర్ రౌత్, సౌమ్య, తదితరులు ఉన్నారు. -
భువనేశ్వర్ మెట్రో రైలు ప్రాజెక్టులో కదలిక
భువనేశ్వర్: మరుగున పడిన భువనేశ్వర్ మెట్రో రైలు ప్రాజెక్టులో కదలిక ఆరంభమైంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్ అధ్యక్షతన బుధవారం స్థానిక లోక్ సేవా భవన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రాజెక్టు పురోగతిపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశం తీర్మానం మేరకు ప్రాజెక్టు కార్యాచరణ కొనసాగించేందుకు ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్ అధ్యక్షతన అంతర్ మంత్రిత్వ ఉప సంఘం ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో భువనేశ్వర్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో పెరుగుతున్న వాహన రద్దీ నివారణ, నియంత్రణ దృష్ట్యా మెట్రో రైలు ప్రాజెక్టు అవసరమని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అస్పష్టమైన కారణాలతో ఈ ప్రాజెక్టు మరుగున పడింది. అంతర్ మంత్రి మండలి దీనిపై చొరవ కల్పించుకుని ముందకు సాగించాలని నిర్ణయించడం విశేషం. ఈ సమావేశంలో మంత్రులు సంపద్ చంద్ర స్వంయి, పృథ్వీరాజ్ హరిచందన్, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సీఈఓ కళ్యాణ్ పట్నాయక్, సీనియర్ అధికారులు వికాష్ కుమార్, ప్రమిత్ గర్గ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
జయపూర్ సమితి చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం
కొరాపుట్: జయపూర్ సమితి చైర్మన్ తిలోత్తమ ముదలిపై అవిశ్వాస తీర్మానం కోసం సభ్యులు విజ్ఞప్తి చేశారు. బుధవారం జయపూర్ సబ్ కలెక్టర్ ఆకవరం సస్యరెడ్డికి లేఖ అందజేశారు. ప్రస్తుత చైర్మన్‌కి బదులు ఆమె భర్త సమితి కార్యాలయంలో అధికారం చెలాయిస్తున్నారన్నారు. మిగతా సమితి సభ్యులు, సర్పంచ్‌లను పట్టించుకోవడం లేదన్నారు. మూడు సంవత్సరాలుగా ఏ కమిటీని పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వ నిర్మాణాల నిధులు దుర్వినియెగం అవుతున్నాయన్నారు. వాటిపై పర్యవేక్షణ లేదన్నారు. సమితి వైస్ చైర్మన్ గణేష్ ప్రసాద్ పాడీ, 16 మంది సర్పంచ్‌లు, 19 మంది సమితి సభ్యులు సంతకాలు చేసిన లేఖను అందజేశారు. దీనిపై సబ్ కలెక్టర్ స్పందిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందుకువెళ్తామని వారికి వివరించారు. -
ప్రజాస్వామ్య హక్కు
న్యాయ పోరాటం..భువనేశ్వర్: న్యాయం కోసం పోరాడడం ప్రజల ప్రజాస్వామ్య హక్కు. ఈ హక్కుని రాష్ట్ర పోలీసులు నిర్దాక్షిణ్యంగా కాలరాశారు. బాలాసోర్ ఫకీర్ మోహన్ కళాశాలలో 20 ఏళ్ల యువతి ఆత్మాహుతి మృతి పట్ల బిజూ జనతా దళ్ ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కొనసాగిస్తుండగా.. పోలీసులు రబ్బరు తూటాల్ని ప్రయోగిం అన్యాయంగా గాయపరిచారని విపక్ష నేత, బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య నిరసన హక్కు తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందన్నారు. అవాంఛనీయంగా రబ్బరు తూటాలతో దాడికి పోలీసులు తొందరపడ్డారని వ్యాఖ్యానించారు. బీజేడీ ప్రజాస్వామ్యబద్ధమైన ఆందోళన కొనసాగుతుండగా పోలీసులు స్పష్టంగా పక్షపాత ధోరణితో వ్యవహరించారు. అధిక బలప్రయోగంతో రబ్బరు తూటాలతో ఆందోళనకారుల్ని గాయపరచడాన్ని తీవ్రంగా ఖండించినట్లు పేర్కొన్నారు. ఈ చర్య ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతికూల పరిస్థితుల్ని ప్రేరేపిస్తుందని సూచించారు. ఇటీవల ముఖ్యమంత్రి నివాసం సమీపంలో ఒక సీనియర్ ఐసీఎస్ అధికారి తన బలగాలకు నిరసనకారుల కాళ్లు విరగ్గొట్టమని, ఈ ఘనత సాధించిన వారికి అవార్డులు ఇస్తామని హామీ ఇస్తున్నట్లు సీసీటీవీ కెమెరా రికార్డింగ్ బట్టబయలు చేసిందని నవీన్ వ్యాఖ్యానించారు. బుధవారం జరిగిన ఆందోళనలో ఇద్దరు మాజీ మంత్రుల కాళ్లు విరగొట్టారు. వీరివురికి శస్త్రచికిత్స అవసరం ఉంటుందని భావిస్తున్నారు. పలువురు సీనియర్ నాయకులు, ఒక మహిళా రాజ్యసభ సభ్యురాలు, అనేక మంది పార్టీ కార్యకర్తలను పోలీసులు దారుణంగా కొట్టారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని నవీన్ పట్నాయక్ కోరారు. నవీన్ పట్నాయక్ -
‘పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి’
రాయగడ: జిల్లాలోని గుణుపూర్, రాయగడలో గల సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ల ద్వారా జిల్లాలో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించి బుధవారం సమీక్ష జరిగింది. కలెక్టర్ ఫరూల్ పట్వారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొ, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, డీఎఫ్ఓ అన్నా సాహేబ్ అహలే ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలక్టర్ పట్వారి మా ట్లాడుతూ జిల్లాలో గల రెండు ఐటిడిఏ పరిధుల్లొ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టనున్న ప్రాజెక్టుల గురించి సంబంధిత శాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పెండింగుల్లో ఉ న్న ప్రాజెక్టు పనులను త్వరిత గతిన పూర్తి చేయా లని ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు జిల్లాలో గల ఆదివాసీ, హరిజన విద్యార్థులు చదువుకుంటున్న సంక్షేమ శాఖ పరిధుల్లోని హాస్టళ్లు, పాఠశాలల్లో రక్షణ కరువైందని ఆరోపించారు. సీసీ కెమెరాలు పెట్టాలని డిమాండ్ చేశారు. -
రబ్బరు తూటాలు ప్రయోగించ లేదు: పోలీసు కమిషనరు
భువనేశ్వర్: బాలాసోర్ విద్యార్థిని ఆత్మాహుతి మృత్యు సంఘటనకు నిరసనగా బిజూ జనతా దళ్ బుధవారం నిర్వహించిన లోక్ సేవా భవన్ ముట్టడి ఆందోళనలో రబ్బరు తూటాల్ని ప్రయోగించ లేదని జంట నగరాల పోలీసు కమిషనరు సురేష్ దేవదత్త సింగ్ తెలిపారు. ఆందోళన కట్టడి చర్యల్లో భాగంగా 5 భాష్ప వాయు సెల్స్, నీటి ఫిరంగుల్ని ప్రయోగించినట్లు వివరించారు. నిరసనకారులు అడ్డుకట్టల్ని అధిగమించడాన్ని నివారించే ప్రయత్నంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆందోళన సమగ్ర దృశ్యాలపై డ్రోన్ నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ‘సీఎం రాజీనామా చేయాలి’జయపురం: బాలేశ్వర ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యకు బాధ్యత వహించి సీఎం మోహన్ చరణ్ మాఝి, కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యామంత్రి, బాలేశ్వర్ ఎంపీలు రాజీనామా చేయాలని కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేసింది. ఈ సంఘటనపై మంగళవారం పార్టీ శ్రేణులు జయపురం ప్రధాన కూడలి వద్ద ర్యాలీ చేశాయి. కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి మాట్లాడుతూ విద్యార్థిని సౌమ్యశ్రీ తాను చదివే కళాశాల విభాగ ప్రధాన అధ్యాపకుని ద్వారా లైంగిక దాడికి గురై ఆ విషయం కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. అలాగే కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం మోహన్ చరణ్, ఉన్నత విద్యామంత్రి, బాలేశ్వర ఎంపీ, ఎమ్మెల్యేలకు కూడా ఫిర్యాదు చేసిందని అయినా ఎవరూ స్పందిచలేదని తెలిపారు. అందుకే కాలేజీ ఆవరణలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. ఆ విద్యార్థిని ఏబీవీపీ సభ్యురాలని, అయినా రాష్ట్రపతి పర్యటనకు ఇచ్చిన విలువ ఆ విద్యార్థిని ప్రాణాలకు ఇవ్వలేదని తెలిపారు. ఉత్కళ ఓంఫెడ్ ఉద్యోగుల ఆందోళన జయపురం: జయపురం రైల్వే స్టేషన్ ప్రాంతంలో గల ఓం ఫెడ్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాదనకొరకు నిరవధిక పని నిలుపు ఆందోళన చేపట్టారు. రైల్వే స్టేషన్–సేవా పేపరుమిల్లు మార్గంలో గల ఉత్కళ ఓంఫెడ్ పాలపేనెట్ ప్రాసెసింగ్ కర్మాగారం ముందు ఓం ఫెడ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉత్కళ కర్మచారి సంఘం పిలుపు మేరకు జయపురం ఓంఫెడ్ ఉద్యోగులు కార్యాలయం ముందు ధర్నా చేశారు. రెండున్నరేళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఓంఫెడ్ సంస్థలో 217 పదవులు ఖాళీగా ఉన్నా వాటిని యాజమాన్యం భర్తీ చేయడం లేదన్నారు. -
వైద్య శిబిరం ఏర్పాటు
టెక్కలి రూరల్: గూడెం పంచాయతీ సన్యాసి నీలాపురంలో బుధవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ‘నీలాపురంలో జ్వరాలు’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన వైద్య సిబ్బంది గ్రామానికి వెళ్లి బావులు, రోడ్డుకు ఇరువైపులా క్లోరినేషన్ చేయించారు. లింగాలవలస పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ పవన్‌తేజ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. రక్తపరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు. ఆన్లైన్ గేమ్స్‌లో నష్టపోయి వ్యక్తి ఆత్మహత్య హిరమండలం: గులుమూరు గ్రామానికి చెందిన మజ్జి బుజ్జి (40)గడ్డిమందు తాగి బుధవారం మృతిచెందాడు. హిరమండలం ఎస్సై ఎండీ యాసీన్ తెలిపిన వివరాల ప్రకారం.. బుజ్జి హిరమండలంలోని టాటా ప్లాంట్‌లో సూపర్వైజర్గా పని చేస్తుండేవాడు. ఆన్లైన్ గేమ్స్‌లో నష్టపోయి అప్పుల పాలయ్యాడు. మానసిక ఒత్తిడికి గురై మనస్థాపం చెంది మంగళవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. భార్య భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు. కారుణ్య నియామకాలకు కౌన్సెలింగ్ శ్రీకాకుళం పాతబస్టాండ్: కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు పొందుతున్న వారు సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమవేశ మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో విధి నిర్వహణలో ఉంటూ మృతి చెందిన వారి కుటుంబ వారసులకు కారుణ్య నియామకాల కౌన్సెలింగ్ చేపట్టారు. 42 మంది అభ్యర్థులు హాజరుకాగా రోస్టర్, రిజర్వేషన్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని 32 మందికి నియామక పత్రాలు అందజేశారు. వీరిలో 24 మంది టైపిస్టులు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు ఆఫీస్ సబార్టినేట్లు ఉన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ ఏఓ ఎం.వి.సూర్యనారాయణ, డీటీ ఢిల్లేశ్వరరావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిర్లక్ష్యమే ప్రాణం తీసింది అరసవల్లి: కుక్క కాటు వేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మురపాకలో 24 ఏళ్ల కుర్రాడు మృతిచెందినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ అనిత బుధవారం తెలిపారు. ఏప్రిల్ 18న కుక్క కాటుకు గురైతే వ్యాక్సిన్ వేసుకోకుండా నిర్లక్ష్యం వహించాడని పేర్కొన్నారు. ఎవరైనా కుక్కకాటు బారిన పడితే కచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని స్పష్టం చేశారు. మురపాక పీహెచ్సీ ఈ కేసు రిపోర్టు కాలేదన్నారు. జిల్లాలో అన్ని పీహెచ్‌సీల్లో ఏఆర్వీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సిక్కోలు వేదికగా రాష్ట్రస్థాయి చెస్‌పోటీలు శ్రీకాకుళం న్యూకాలనీ: నగరంలోని పీఎన్ కాలనీలో ఉన్న న్యూ సెంట్రల్ స్కూల్ వేదికగా ఈ నెల 20న రాష్ట్రస్థాయి స్కూల్స్ ర్యాంకింగ్ చెస్ పోటీలు జరగనున్నాయని ఆలిండియా చదరంగ సమాఖ్య చెస్ ఇన్ స్కూల్స్ కమిటీ సభ్యుడు సనపల భీమారావు బుధవారం తెలిపారు. వివిధ జిల్లాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వారి ప్రావీణ్యతను పరీక్షించుకోవచ్చన్నారు. 6 నుంచి 16 ఏళ్ల బాలబాలికలకు 12 కేటగిరీల్లో పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ముందుగా ఏపీచెస్.ఓఆర్జీ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని. పూర్తి వివరాలకు 9912559735 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. సారా ప్యాకెట్లు స్వాధీనం కంచిలి: అరవ సరియాపల్లి గ్రామానికి చెందిన బొండాడ మోహిని అనే మహిళ నాటుసారా అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సోంపేట ఎకై ్సజ్ సీఐ జి.వి. రమణ సిబ్బందితో కలిసి బుధవారం దాడులు నిర్వహించారు. ఆ సమయంలో ఆమె 80 సారా ప్యాకెట్లను విడిచిపెట్టి పారిపోయింది. వాటిని స్వాధీనపర్చుకొని మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మూడు, అంతకంటే ఎక్కువ కేసులు ఉంటే వారిపై పి.డి.యాక్టు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఈ దాడుల్లో సీఐతో పాటు కానిస్టేబుళ్లు మార్కారావు, భానుప్రసాద్, ఉమాపతి పాల్గొన్నారు. -
రాష్ట్ర పర్యటనలో అస్సోం అసెంబ్లీ పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ
భువనేశ్వర్: అస్సోం అసెంబ్లీ పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ సభ్యులు రాష్ట్ర పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఈ బృందం రాష్ట్ర శాసన సభ స్పీకర్ సురమా పాఽఢిని కలిశారు. రామేంద్ర నారాయణ్ కలిత ఆధ్వర్యంలో విచ్చేసిన అస్సోం ప్రతినిధి బృందానికి రాష్ట్ర శాసన సభ పనితీరు, రాష్ట్ర అసెంబ్లీ పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ యొక్క వివిధ కార్యకలాపాలను చైర్మన్ పద్మలోచన పండా, ఇతర సభ్యులు వివరించారు. అలాగే అస్సోంలో ఈ కమిటి కార్యకలాపాల్ని తెలుసుకున్నారు. సమగ్రంగా ఉభయ వర్గాల మధ్య సంతృప్తికర చర్చలు కొనసాగాయి. రాష్ట్రంలో 4 ఫైనాన్స్ కమిటీలు, అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కమిటీతో సహా 10 సలహా కమిటీలు, 12 శాసన సభ కమిటీలతో పలు తాత్కాలిక కమిటీలు ఒడిశా అసెంబ్లీలో చురుగ్గా పనిచేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర శాసన సభ కార్యదర్శి సత్యబ్రత్ రౌత్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
● సర్వత్రా ఆందోళనలు
కొరాపుట్: సౌమ్యశ్రీ ఆత్మాహుతిపై కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల వ్యాప్తంగా ఆగ్రహావేశాలతో కూడిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డులో ఉన్న జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విద్యార్థిని చిత్రపటం ముందు ప్రముఖులు నివాళులర్పించారు. మాఘరో సంస్థ కన్వీనర్ కాదంబని త్రిపాఠి నేతృత్వంలో మహిళలు పెద్ద ఎత్తున్న ర్యాలీ నిర్వహించారు. బందుగాం సమితిలో గురువారం బంద్ కోసం ముందస్తుగా కాంగ్రెస్ కార్యకర్తలు పాఠశాలలను లేఖలు అందజేశారు. బొయిపరిగుడ సమితి కేంద్రంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. జయపూర్ మెయిన్ రోడ్డులో డీసీసీ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. -
● మరమ్మతులు ప్రారంభం
రాయగడ: స్థానిక మెయిన్ మార్కెట్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం, రాణిగుడఫారానికి అనుసంధానించే రైల్వే అండర్ గ్రౌండ్ రోడ్డు మరామ్మతు పనులను రైల్వే శాఖ బుధవారం నుంచి ప్రారంభించింది. గత కొద్దిరోజులుగా ఈ మార్గంలో రహదారి పూర్తిగా అధ్వానంగా మారడంతో పాటు అండర్ గ్రౌండ్ కింద గుంతలు ఏర్పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. సమస్యలు వివిధ పత్రికల్లో ప్రచురితమవ్వడంతో రైల్వేశాఖ అధికారులు స్పందించారు. ప్రస్తు తం ఈ మార్గంలో మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. ఈనెల 28 వరకు పనులు కొనసాగుతాయని పేర్కొన్నారు. దీంతో వాహనాలు ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదుగా వెళ్తున్నాయి. అయితే ఫ్లై ఓవర్‌పై వాహన రాకపోకల వలన రద్దీ ఏర్పడింది. -
నిరుపేద యువతికి అండగా..
టెక్కలి : టెక్కలిలో సత్యసాయి నిత్యాన్నపూర్ణ సేవా కార్యక్రమంలో పనిచేస్తున్న నిరుపేద వితంతు కొమ్ము జ్యోతి కుమార్తె రవళి వివాహానికి సత్యసాయి సేవా సమితి సభ్యులు తమవంతు సహకారం అందజేశారు. బుధవారం రూ.50 వేల నగదు, పట్టుచీర, పుస్తెలతాడు, వివాహ సామగ్రి అందించారు. సమితి సభ్యులు అన్నపూర్ణ జగదీశ్వరరావు, నాగరాణి, టంకాల నాగరాజు తదితరులు రూ.10 వేలు, మిగిలిన దాతలు రూ.50 వేలు, బెలుసొంటి మధు పట్టుచీర, బంగారు శతమానం సమకూర్చారు. కార్యక్రమంలో యు.భాస్కరరావు, చంటి, ఆర్.ఆదినారాయణ, పి. సూర్యనారాయణ, కె.వేణుగోపాల్, ఎం.ఆదినారాయ ణ, ఎస్.రాములమ్మ, డిల్లేశ్వర్రావు, కోదండరావు, లక్ష్మణరావు, హెచ్.రాజశేఖర్, అప్పారావు, ఎం.తా తయ్య, కె.జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
పొట్టంగిలో ఎంపీ బలభద్ర మజ్జి పర్యటన
కొరాపుట్: జిల్లాలోని పొట్టంగి నియోజకవర్గంలో నబరంగ్‌పూర్ ఎంపీ బలభద్ర మజ్జి మంగళవారం పర్యటించారు. పొట్టంగిలో పవిత్ర అగ్ని గంగమ్మ దేవాలయం దర్శించుకున్నారు. అక్కడ పునః నిర్మితమవుతున్న దేవాలయ పనులు పరిశీలించారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు సుంకిలో బీజేపీ కార్యాకర్తలతో సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం ఆ ప్రాంతంలో పలువురు కార్యకర్తల నివాసాలను సందర్శించారు. బీజేడీ వర్గ విభేదాల్లో మునిగిపోయింది కొరాపుట్: ప్రతిపక్ష బీజేడీ పార్టీ వర్గ విభేదాల్లో మునిగిపోయిందని బీజేపీ యువమొర్చ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు కనుదాస్ విమర్శించారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని సర్క్యూట్ హౌస్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. నబరంగ్‌పూర్ జిల్లా నందాహండి సమితిలో గత మూడేళ్లలో రూ.12 కోట్ల అవినీతి జరిగిందని బీజేడీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి విమర్శించిన విషయం గుర్తు చేశారు. ఆ ఆరోపణ జరిగిన తర్వాత రోజే అదే పార్టీకి చెందిన సమితి చైర్మన్, ఇతర సభ్యులు అసలు అవినీతి జరగలేదని కలెక్టర్‌కి నివేధించిన విషయం గుర్తు చేశారు. ఒకరు అవినీతి జరిగిందంటే మరొకరు జరగలేదని ఒకే పార్టీ నాయకులు ప్రకటించారని గుర్తు చేశారు. ఈ పరిణామంతో ఆ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కుంజదాస్, మాజీ అధ్యక్షుడు జగదీష్ బిసోయి, దేవదాస్ మహాంకుడో తదితరులు పాల్గొన్నారు. చోరీ కేసుల్లో ఐదుగురు అరెస్టు రాయగడ: రెండు దొంగతనాల కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్టు చందిలి పొలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో జేకేపూర్ అరవింగనగర్, నువాపడ వీధులకు చెందిన మూస ఒరఫ్ అర్జన్ మినియాక, రాహుల్ ధన్‌బాద్, జొగ ఒరఫ్ రవీంద్ర గౌడొ, సురత్ కొండ, మనొజ్ దుర్గలు ఉన్నారు. నిందితుల నుంచి ఎల్ఈడీ టీవీ, రెండు మోటార్లు, మూడు వంట గ్యాస్ సిలిండర్లు, ఇత్తడి విగ్రహం, రెండు ఫ్యాన్లతో పాటు 4060 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చందిలి పోలీస్ స్టేషన్ ఐఐసీ ఉత్తమ్ ముమార్ సాహు బుధవారం తెలిపారు. గత నెల 12, 13 తేదీల్లో చందిలి పోలీస్ స్టేషన్ పరిధి జేకేపూర్‌లోని రెండు ప్రాంతాల్లో చోరీ జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేసి నిందితులను సోమవారం సాయంత్రం పట్టుకున్నారు. అనంతరం కోర్టుకు తరలించారు. ఎయిమ్స్ ఆవరణలో ఆందోళన భువనేశ్వర్: బాలాసోర్ ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని సౌమ్యశ్రీ మరణం తర్వాత శవ పరీక్షలు రాత్రికి రాత్రి ముగించి అడ్డగోలుగా తరలిస్తున్నారని దుమారం రేగింది. సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత ఆస్పత్రుల్లో శవ పరీక్షలు నిర్వహించడం జరగదు. సౌమ్యశ్రీ విషయంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఎదురు కావడంతో యువజన, విద్యార్థి కాంగ్రెస్ వర్గాలు ఆకస్మిక ఆందోళనకు దిగాయి. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆవరణలో ఆచార విరుద్ధ చర్యల్ని ఖండించారు. ఈ సందర్భంగా పోలీసులతో ఘర్షణకు దిగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు -
భగ్గుమన్న బీజేడీ శ్రేణులు
బుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025భువనేశ్వర్: రాష్ట్రం అంతటా విషాదం అలముకుంది. అధ్యాపకుని వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థిని సౌమ్య శ్రీ ఆస్పత్రిలో చావుతో పోరాటం చేసి సోమవారం అర్ధరాత్రి తనువు చాలించింది. బాలాసోర్ ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో చోటు చేసుకున్న విషాద సంఘటన ఇది. భోరుమన్న తల్లిదండ్రుల రోదనతో పలాసియా గ్రామం మారు మోగింది. ఊరంతా ఏకమై భుజాలు మార్చుకుంటూ గ్రామం ముద్దు బిడ్డ సౌమ్యశ్రీకి బరువైన గుండెతో తుది వీడ్కోలు పలికారు. బాధ్యులకు రాజీ లేని శిక్ష: గవర్నరు బాలాసోర్ ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని అకాల మరణం బాధాకరమని, ఆమె మరణం విషాదం మాత్రమే కాదని, నేటి విద్యాబోధన ప్రాంగణాల్లో యువతులను కాపాడుకోవాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తు చేస్తుందని రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరి బాబు కంభంపాటి ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం తన కఠినమైన మార్గాన్ని అనుసరిస్తుందని, బాధ్యులు రాజీలేని శిక్షను ఎదుర్కొంటారని ఆయన ఉద్ఘాటించారు. దోషులకు శిక్ష తప్పదు: ముఖ్యమంత్రి ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాల విద్యార్థిని విషాదకరమైన ఆత్మాహుతి సంఘటనను ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తీవ్రంగా పరిగణించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. చట్టం ప్రకారం ఆదర్శప్రాయమైన శిక్ష పడేలా చూడాలని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. వ్యవస్థాపరమైన వైఫల్యం: నవీన్ పట్నాయక్ ‘చాలా విచారకరమైన సంఘటన. అందరూ షాక్ అయ్యారు. రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని విషాద మరణం ఉదాసీన వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమ’ని విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. విద్యార్థిని మరణానికి దారితీసిన సంఘటనల క్రమం సంస్థాగత ద్రోహం తప్ప మరేమీ కాదు అని ఆందోళన చెందారు. న్యాయం కోసం దివంగత విద్యార్థిని చేసిన విజ్ఞప్తిని విస్మరించిన కళాశాల అధికారులు, అధికారంలో ఉన్నవారు ఉభయ వర్గాల్ని జవాబుదారీగా పరిగణించి చర్యలు చేపట్టాలని రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. పర్లాకిమిడిలో.. పర్లాకిమిడి: బాలేశ్వర్‌లో ఫకీర్ మోహన్ స్వయం ప్రతిపత్తి కళాశాలలో సౌమ్య శ్రీ మృతిపై పర్లాకిమిడి ప్యాలెస్ రోడ్డులో పలువురు మహిళలు నిరసన తెలిపారు. కళాశాలలో ఆమెను వేధించిన హెచ్ఓడీని అరెస్టు చేయాలని, ఆమెకు న్యాయం జరిగేలా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి చూడాలని సామాజిక సేవకురాలు జాస్మిన్ షేక్ డిమాండ్ చేశారు. సాయంత్రం ప్యాలెస్ నుంచి కొవ్వొత్తులతో పలువురు మహిళలు శాంతియుత ర్యాలీ జరిపారు. రాయగడ: బాలేశ్వర్‌లోని ఫకీర్ మోహన్ సేనాపతి కళాశాల విద్యార్థిని సౌమ్యశ్రీ ఆత్మాహుతికి నిరసనగా ప్రతిపక్షపార్టీలైన బీజేడీ, కాంగ్రెస్‌లు మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. స్థానిక కపిలాస్ కూడలిలో బీజేడీ శ్రేణులు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ దిష్టి బొమ్మలను తగుల బెట్టాయి. బీజేపీ అధికారంలొకి వచ్చిన ఏడాదిలోనే మహిళలకు రక్షణ కరువైందని, ఎక్కడ చూసినా అత్యాచారాలు పెరిగిపోయాయని దుమ్మెత్తిపోశారు. కల్యాణసింగుపూర్ లొ మంగళవారం నాడు కాంగ్రేస్ నాయకులు ఆందోళన చేపట్టారు. గ్రామస్తుల భుజాలపై సౌమ్యశ్రీ అంతిమ యాత్ర (ఇన్సెట్లో) సౌమ్యశ్రీ జయపురం: బాలాసోర్ జిల్లాలో ఫకీర్ మోహన యూనివర్సిటీలో సౌమ్యశ్రీ మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఆమె మృతిపై జయపురం బీజేడి శ్రేణులు భగ్గు మన్నాయి. మంగళవారం జయపురం బీజేడీ శ్రేణులు 26 వ జాతీయ రహదారిని స్తంభింపజేసి ఆందోళనలు చేపట్టారు. ప్లకార్డులు చేత పట్టి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనలో విక్రమ విశ్వ విద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు. న్యూస్‌రీల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థిని మృతి రాష్ట్రమంతటా విషాద ఛాయలు గ్రామ జనం మధ్య సౌమ్యశ్రీ అంత్యక్రియలు -
వృత్తి విద్యా కోర్సులతో ఉద్యోగ అవకాశాలు
రాయగడ: విద్యార్థులు వృత్తివిద్యా కోర్సులను అభ్యసిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జిల్లా పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరక్టర్ బసంత కుమార్ ప్రధాన్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రపంచ యువ నైపుణ్యాభివృద్ధి దినోత్సవం సందర్భంగా మంగళవారం జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నేటి పోటీ ప్రపంచంలో నైపుణ్యం కలిగిన విద్యార్థులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్యాభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశ పెట్టాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ బీకే బసంత రాయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం బిజయ్ కుమార్ సాహు, జిల్లా విద్యాశాఖ అధికారి రమచంద్ర నాహక్ తదితరులు పాల్గొన్నారు. -
బాలిక ఆత్మహత్య
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రం జానకీనగర్కి చెందిన సుమన హరిజన్ (16) సమీప పోలీస్ రిజర్వ్ బ్యారెక్ సమీపంలోని అటవీ ప్రాంతంలోని చెట్టుకు మంగళవారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నాలుగు రోజులుగా బాలిక కనిపించడం లేదని తండ్రి సభాష్ హరిజన్ జిల్లా కేంద్ర పోలీస్ స్టేషన్లో సోమ వారం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం బంధువులు గాలిస్తుండగా సుమన హరిజన్ మృతదేహం చెట్టుకు వేలాడుతుండడం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. -
కొరాపుట్‌లో కేంద్రమంత్రి శోభా కరంద్లాజే పర్యటన
కొరాపుట్: జిల్లాలో కేంద్రమంత్రి శోభా కరంద్లాజే మంగళవారం పర్యటించారు. ఆమెకు జయపూర్‌లోని ఎయిర్ స్ట్రిఫ్లో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాహిత్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాల ఆడిటోరియంని సందర్శించారు. అక్కడ గిరిజనులకు ఉపాధి కల్పించే ఎస్సీ, ఎస్టీ జాతీయ విధానం ద్వారా ఎంస్ఎంఈ పథకాల అవగాహన సదస్సు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వెనుకబడిన జిల్లాల్లో ఆదివాసీ ప్రజలకు ఉపాధి కల్పించే పథకాలు వివరించారు. అనంతరం కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి నిత్యానంద గోండో, మత్స్య శాఖా మంత్రి గోకులా నంద నాయక్, పరిశ్రమల శాఖా మంత్రి సంపత్ స్వయ్, నబరంగ్‌పూర్ ఎంపీ బలభద్ర మజ్జి, కొందమాల్ ఎంపీ సుకాంత్ పాణీగ్రాహి, ఎమ్మెల్యేలు గౌరీ శంకర్ మజ్జి, రఘురాం మచ్చో, నర్సింగ్ బోత్ర, రుపుధర్ బోత్ర, పవిత్ర శాంత, కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తివాసన్, నబరంగ్‌పూర్ కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థిని ఆత్మాహుతిపై యూజీసీ నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు
భువనేశ్వర్ : బాలాసోర్ ఫకీర్ మోహన్ (అటానమస్) కళాశాలలో విద్యార్థిని ఆత్మాహుతి సంఘటనపై వాస్తవాస్తవాలు నిర్ధారించేందుకు విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ప్రొఫెసర్ రాజ్ కుమార్ మిట్టల్ (చైర్పర్సన్ – యూజీసీ సభ్యుడు), ప్రొఫెసర్ సుష్మా యాదవ్ (మాజీ యూజీసీ సభ్యుడు), డాక్టర్ నీర్జా గుప్తా (వైస్–చాన్స్‌లర్, గుజరాత్ విశ్వవిద్యాలయం), డాక్టర్ అషిమా మంగ్లా (జాయింట్ సెక్రటరీ, యూజీసీ మరియు కోఆర్డినేటింగ్ ఆఫీసర్) సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం 7 రోజుల్లోగా తన పరిశోధనలు, సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పించాలని యూజీసీ ఆదేశించింది. ఈ విచారకర సంఘటన పరిస్థితులు, ప్రస్తుత పరిష్కార విధానాలు, యూజీసీ జారీ చేసిన లైంగిక వేధింపుల నిరోధక నిబంధనలు – 2015 అనుగుణంగా ఉన్న అంశాలను కమిటీ పరిశీలిస్తుంది. పుట్టగొడుగులకు డిమాండ్ కొరాపుట్: వర్షాలు కురుస్తుండడంతో పుట్టగొడుగుల సీజన్ ప్రారంభమైంది. వీటిని సేకరిస్తున్న వ్యక్తులు విక్రయించేందుకు జయపూర్ మార్కెట్‌కు మంగళవారం భారీగా తీసుకొని వచ్చారు. ఇప్పుడిప్పుడే పుట్టగొడుగులు లభ్యమవుతుండడంతో వీటికి డిమాండ్ పెరిగింది. కిలో 1400 రూపాయల చొప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు. బెల్ట్ షాపులపై గిరిజన మహిళల దాడి కొరాపుట్: బెల్ట్ షాపులపై గిరిజన మహిళలు మూకుమ్మడిగా దాడి చేశారు. మంగళవారం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ సమితి బెనరా గ్రామ పంచాయతీ కాలిబెడ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాల వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయని స్థానిక మహిళలు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవడంతో విసుగెత్తిపోయిన మహిళలు భారీ సంఖ్యలో వెళ్లి ఆ గ్రామంలోని బెల్టుషాపులు తనిఖీ చేసి మద్యం సీసాలు పగలగొట్టారు. తండ్రికి తలకొరివిపెట్టిన తనయ హిరమండలం: తండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది ఆ కుమార్తె. ఎల్‌ఎన్‌పేట మండలం శ్యామలాపురం గ్రామానికి చెందిన ఇప్పిలి జగదీష్ (49) కోళ్లఫారం నడుపుతున్నారు. కోళ్లఫారంలో ఉండగా ఆదివారం రాత్రి పాముకాటు వేయడంతో మృతిచెందారు. ఈయన కుమారుడు రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమార్తె లావణ్య లండన్‌లో ఉంటోంది. తండ్రి మరణంతో హుటాహుటిన బయలుదేరి స్వగ్రామానికి మంగళవారం చేరుకుంది. అన్నీ తానై అంత్యక్రియలు పూర్తి చేసింది. కొనసాగుతున్న వైద్యశిబిరం పాతపట్నం: పాతపట్నం ప్రహరాజపాలెంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరం కొనసాగుతోంది. 28 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని గంగువాడ, చాపర పీహెచ్సీ వైద్యులు పూర్ణిమ, లక్ష్మి తెలిపారు. మంగళవారం సాయంత్రం నాటికి పది మందికి జ్వరాలు తగ్గాయని, పాఠశాలలో 11 మందికి వైద్యం అందిస్తున్నామన్నారు. పాతపట్నం సీహెచ్‌సీలో ఐదుగురు విద్యార్థినులు చికిత్స పొందుతున్నారని, ఇద్దరికి జ్వరం తగ్గడంతో డిశ్చార్జి చేశామని సూపరింటెండెంట్ జి.వేణుగోపాల్ తెలిపారు. వైద్య శిబిరాన్ని టెక్కలి డీఎల్పీవో ఐ.వి.రమణ పరిశీలించారు. సింగుపురంలో చైన్‌స్నాచింగ్ శ్రీకాకుళం రూరల్: సింగుపురం లో మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని ఇద్దరు దుండగులు చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డారు. రూరల్ ఎస్ఐ ఇచ్చిన వివరాల మేరకు.. సింగుపురం గ్రామానికి చెందిన చలుమూరి వెంకటకుమారి స్థానిక ఏటీఎం వద్ద డబ్బులు తీసుకొని తిరిగి ఇంటికి వస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్క్‌లు తొడిగి నంబర్ ప్లేట్‌లేని బైక్‌పై వచ్చి మూడు తులాల బంగారు తాడును తెంచేసి పారిపోయారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గంజాయి ముఠా అరెస్టు
కాశీబుగ్గ: బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన గంజాయి ముఠాను కాశీబుగ్గ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కాశీబుర్ల డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆశాదేవి, అనితాదేవి, ఊహాదేవిలు పాట్నాలో ఓ అపార్ట్మెంట్లో వంట మనుషులుగా పనిచేస్తున్నారు. వీరికి పింకీ అనే మహిళ ద్వారా శుభరాత్, అంబాజ్ గౌడ్లు పరిచయమయ్యారు. సులభంగా సొమ్ము సంపాదించాలనే ఆశతో ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి బీహార్, కేరళ రాష్ట్రాలకు తరలించేందుకు వ్యూహరచన చేశారు. ఈ క్రమంలో పలాస రైల్వేస్టేషన్‌కు చేరుకుని రైలు ఎక్కే ప్రయత్నంలో కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి పలాస కోర్టుకు తరలించామని చెప్పారు. సమావేశంలో సీఐ సూర్యనారాయణ, క్రైం సిబ్బంది పాల్గొన్నారు. -
గుప్తేశ్వరం ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ
కొరాపుట్: గుప్తేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను కొరాపుట్ జిల్లా కొట్‌పాడ్ ఎమ్మెల్యే రుపుధర్ బోత్ర మంగళవారం పరామర్శించారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ వైద్య కళాశాలను సందర్శించారు. ఆదివారం సాయంత్రం గుప్తేశ్వరం సమీపంలో అగ్ని మాపక వాహనం బ్రేక్ ఫెయిలై బోల్భాం భక్తులపైకి దూసుకెళ్లడంతో ఒక బాలుడు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారిని తొలుత బోయిపరిగుడ సమితి కేంద్రం ఆస్పసత్రికి తర్వాత జయపూర్‌లోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడం కొరాపుట్‌లోని వైద్య కళాశాలకి తరలించారు. ఈ ఘటనలో బాలుడు చనిపోగా.. అతని ఇద్దరు సోదరులకు కూడా గాయాయ్యాయి. ఎమ్మెల్యే క్షతగాత్రులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారి అవసరాల నిమిత్తం కొంత ఆర్థిక సహాయం చేశారు. -
చీకటి పడితే ట్రాఫిక్ వెతలు!
కొరాపుట్: చీకటి పడితే ట్రాఫిక్ వెతలు వెంటాడుతుండడంతో రాజానగర్ వైపు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. కొరాపుట్ జిల్లా జయపూర్ పట్టణంలో పురాతన రాజానగర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ పెరుగుపోతుంది. రథాయాత్ర అనంతరం అక్కడ రఘునాధ మందిరం వద్ద రథం నిలుపుతారు. రథం విడి భాగాలు చేసేంత వరకు ఈ సమస్య ఉంటుంది. రథం చుట్టూ అనేక వాహనాలు పార్కింగ్ చేస్తారు. వాహనదారులు ఎంత మోర పెట్టుకున్న పార్కింగ్ నుంచి వాహనాలు తీయరు. దీంతో నిత్యం వాహనాలు ట్రాఫిక్‌లో నిలిచిపోతున్నాయి. ఈ ప్రాంతాన్ని కలుపుతూ ఐదు రోడ్లు ఉండడంతో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటుంది. సాయంత్రమైతే వాహనాలను విచ్చలవిడిగా నిలిపి వేస్తుండడంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తక్షణం రాజానగర్ రథం వద్ద ట్రాఫిక్ పోలీసుల సంఖ్య పెంచి అక్రమ పార్కింగ్‌లపై చర్యలు చేపట్టాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
విపత్తుల వేళ.. జాగ్రత్తలు ఇలా..
పైడిభీమవరం పారిశ్రామికవాడలోని మెస్సర్స్ ఆంధ్రా ఆర్గానిక్ లిమిటెడ్ పరిశ్రమలో రసాయనిక ప్రమాదాల నివారణపై మంగళవారం మాక్‌డ్రిల్ నిర్వహించారు. అమ్మోనియా ట్యాంకర్ దించినప్పుడు వాల్వ్ విరిగిపోవడం, అకస్మాత్తుగా గ్యాస్ లీక్ సంభవించడం, ఉద్యోగులు గాయపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కళ్లకు కట్టినట్టు చూపించారు. కార్యక్రమంలో పరిశ్రమ జనరల్ మేనేజర్ ఎం.కృష్ణయ్య, ఈహెచ్ఎస్ మేనేజర్ ఎన్.రాఘవరెడ్డి, ఉద్యోగులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. – రణస్థలం -
బాక్సింగ్ పోటీల్లో పతకాల పంట
జయపురం: అనుగూలులో జరిగిన అంతర్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ పోటీలలో జయపురం బాక్సింగ్ క్రీడాకారులు పతకాల పంట పండించారు. జయపురం నుంచి పాల్గొన్న 13 మంది 16 పతకాలు సాధించి సత్తాచాటారు. వీటిలో ఏడు బంగారు, రెండు రజత, ఏడు కాంస్య పతకాలు ఉన్నట్టు స్థానిక ఇండియన్ అల్టిమేట్ ఫైట్ క్లబ్బు శిక్షకులు సాయిద్ హబిబ్ మంగళవారం వెల్లడించారు. అనుగూల్ టేబుల్ టెన్నీస్ ఇండోర్ గ్రౌండ్లో ఈ పోటీలు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు జరిగినట్లు తెలిపారు. రాష్ట్ర క్రీడా, యువ సేవా విభాగం, రాష్ట్ర అమిచూర్ కిక్ బాక్సింగ్ మహాసంఘం సంయుక్తంగా పోటీలను నిర్వహించినట్లు చెప్పారు. స్థానిక అల్టిమేట్ ఫైట్ క్లబ్బు నుంచి 13 మంది పోటీల్లో పాల్గొన్నారన్నారు. తరుణ ఖోశ్ల రెండు బంగారు, రాహుల పట్నాయక్, బిజయ సాహు, రిహాన్ ఖాన్, శేఖ్ శెహబాజ్ హుసేన్ రంజిత్ కుమార్ ఒక్కో బంగారు, అభిషేక్ దాస్, మానస నాయిక్ ఒక్కో రజత, మోహిద్ యాదవ్ రెండు కాంస్య పతకాలు సాదించగా, శేఖ్ శెహబాజ్ హుసేన్, అభిషేక్ దాస్, కె.బాహుల్య, రిహాన్ ఆలీ, ఆర్యన్ మిశ్రలు బ్రాంజ్ పతకాలు సాధించినట్టు పేర్కొన్నారు. పతకాలు సాధించిన వారిలో ఇద్దరు బాలికలు ఉన్నట్టు పేర్కొన్నారు. -
ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి: రాష్ట్రపతి
భువనేశ్వర్: విద్యా సంస్థల్లో స్నాతకోత్సవం భవిష్యత్ సామర్థ్యానికి ప్రతిబింబంగా నిలుస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కటక్ రెవెన్షా విశ్వ విద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా మంగళ వారం ఆమె విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల మేధస్సు దేశాభివృద్ధికి దోహదపడాలని సూచించారు.ఉద్యోగాలు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకోకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. కటక్ రెవెన్షా బాలికల ఉన్నత పాఠశాల మూడు భవనాల పునరాభివృద్ధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శంకుస్థాపన చేశారు. వివిధ రంగాలలో విజయానికి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్న మహిళల నుంచి ప్రేరణ పొందాలని రాష్ట్రపతి పాఠశాల బాలికలకు సూచించారు. వారి జ్ఞానం, ఆత్మవిశ్వాసం, నైపుణ్యం, సంకల్పం బలంతో అసాధ్యమైన వాటిని కూడా సాధించగలరని బాలికల్ని ప్రోత్సహించారు. చిన్నారి విద్యార్థులతో రాష్ట్రపతి ముఖాముఖి సంభాషించి, కరచాలనం చేసి మురిపించారు. భారత రాష్ట్రపతితో రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, కేంద్ర విద్యా విభాగం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కటక్ లోక్ సభ సభ్యుడు భర్తృహరి మహతాబ్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
మృత్యువులోనూ వీడని బంధం
● ట్రాక్టర్ బోల్తా పడి అన్నాచెల్లెల్లు మృతి ● ప్రమాదం నుంచి బయటపడిన మరో నలుగురు ● కామేశ్వరిపేట సమీపంలో ప్రమాదం ● లుకలాంలో విషాదఛాయలు నరసన్నపేట: రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెల్లు మృత్యువాతపడిన విషాద ఘటన నరసన్నపేట మండలం కామేశ్వరిపేట సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసన్నపేట మండలం లుకలాం గ్రామానికి చెందిన గొడ్డు ఆదినారాయణ(42), చోడి లక్ష్మి (35), జి.బంగారమ్మ, లంక శ్రీనివాస్, గొడ్డు అశోక్‌కుమార్‌లు ఓ కర్రల వ్యాపారి వద్ద కూలీలుగా పనిచేస్తున్నారు. వీరిలో ఆదినారాయణ, లక్ష్మి అన్నాచెల్లెలు. పరిసర గ్రామాలకు వెళ్లి కర్రలు కొట్టడం, వాటిని ట్రాక్టర్‌పై లోడ్ చేసి తరలించడం వీరి దినచర్య. దీనిలో భాగంగా మంగళవారం స్వామి అనే వ్యక్తి ట్రాక్టర్‌పై కామేశ్వరిపేటకు బయలుదేరారు. కొల్లవానిపేట రైల్వే గేటు దాటి కొంతదూరం వెళ్లేసరికి టైర్ పంక్చర్ అయింది. వేగంగా వెళ్తుండటంతో ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న లోతైన ప్రదేశంలో తుప్పల్లోపడింది. ట్రాక్టర్, ఇంజన్ చెరోవైపు పడిపోయాయి. ట్రాక్టర్ కింద ఆదినారాయణ, లక్ష్మి ఇరుక్కుపోయారు. మిగిలిన వారు తేరుకుని వీరిద్దరినీ బయటకు తీసి అంబులెన్స్‌కు ఫోను చేయగా కొద్దిసేపటికే మరణించారు. కూలి పనులు చేస్తూ.. విజయనగరంలోని నెల్లిమర్ల ప్రాంతానికి చెందిన ఆదినారాయణ, లక్ష్మి లుకలాం వచ్చి స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచీ ఏ పనికి వెళ్లినా అన్నాచెల్లెల్లు కలిసే వెళ్లేవారు. మృత్యువులోనూ అన్నాచెల్లెల్లు బంధం వీడలేదంటూ గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. లక్ష్మికి భర్త చిన్నారావు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదినారాయణకు భార్య గున్నమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నరసన్నపేట ఇన్చార్జి ఎస్ఐ, పోలాకి ఎస్ఐ రంజిత్ ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సర్పంచ్ శ్రీను, వైఎస్సార్ సీపీ నాయకులు చింతల వెంకటరమణ, చింతల సత్యం, కామేశ్వరపేటకు చెందిన జోగినాయుడు తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీనిచ్చారు. -
మావోయిస్టు కార్యకలాపాలపై దృష్టి
కొరాపుట్: మావోయిస్టు కార్యకలాపాలపై దృష్టి ఉంటుందని సదరన్ వెస్ట్రన్ రేంజ్ డీఐజీ కన్వర్ విశాల్ సింగ్ ప్రకటించారు. సోమవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలో డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొరాపుట్, నబరంగ్‌పూర్, రాయగడ, మల్కన్‌గిరి, నువాపడ జిల్లాల్లో అప్రమత్తంగా ఉంటామన్నారు. అలాగే పోలీసులు నేర విచారణలో ముందడుగు వేస్తారన్నారు. ముఖ్యంగా గంజాయిపై ఉక్కు పాదం మోపుతామన్నారు. తక్షణం రేంజ్లో ఎస్పీతో సమావేశమైన తర్వాత పరిస్థితిపై సమీక్షిస్తామన్నారు. పదేళ్ల కిందట ఎస్పీగా పనిచేసిన చోటకు డీఐజీగా రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. తనకు కొరాపుట్ వాతావరణం ఎంతో ఇష్టమన్నారు. -
ప్రభుత్వ వాహన డ్రైవర్‌గా సంధ్యా రాణి మాఝీ
భువనేశ్వర్: మయూర్‌భంజ్‌కు చెందిన సంధ్యారాణి మాఝి రాష్ట్ర రవాణా శాఖ ఆధీనంలో ప్రభుత్వ వాహన డ్రైవర్‌గా చేరారు. ఆమె తొలి మహిళా ప్రభుత్వ వాహన డ్రైవర్‌గా నియమితులు కావడం విశేషం. రక్షణ లేదా నౌకా దళంలో ఉద్యోగ జీవితం కొనసాగించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో సంధ్యారాణి మాఝి డ్రైవింగ్‌ను ప్రారంభించింది. ఆమె భర్త రామ్ రే మాఝీ (డ్రైవర్) ప్రోత్సాహంతో డ్రైవింగ్ నేర్చుకుని అద్దె డ్రైవర్‌గా పదేళ్లకు పైగా పనిచేసింది. తర్వాత, ఆమె 2023లో జాజ్‌పూర్‌లోని ఛటియాలోని హెచ్ఎంవీ శిక్షణా కేంద్రంలో చేరింది. ఈ శిక్షణతో జపాన్‌లో పనిచేసే అవకాశం చేరువైన కుటుంబ బాధ్యతలతో స్వరాష్ట్రంలో ఉండాల్సి వచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకు డ్రైవరుగా పని చేసి ఒక పార్లర్లో బ్యూటీషియన్‌గా పనిచేసింది. -
చోరీ కేసులో నలుగురు అరెస్టు
జయపురం: జయపురం మహాత్మాగాంధీ రోడ్డులోని సాయిబాబా మందిర ప్రాంతంలో ఉన్న బ్యాటరీ దుకాణంలో జరిగిన దొంగతనం కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు జయపురం పట్టణ పోలీసులు సోమవారం వెల్లడించారు. ఆ దుకాణంలో నాలుగు లక్షల రూపాయల నగదు, బంగారు నగలు దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో ముమ్మరంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఉల్లాష్ చంద్ర రౌత్ వెల్లడించారు. అరెస్టయిన వారి నుంచి 70 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్టయిన వారిలో స్థానిక డెప్పుగుడ వాసి ధనుంజయ, ఎస్.ధనుంజయ, సురేంఽద్ర హరిజన్, కుంధారిగుడకు చెందిన రింకు సమరిలియ, ఖాళసాహి ప్రాంత వాసి భగవాన్ ముఎదులి ఉన్నారన్నారు. అరెస్టయిన వారిని కోర్టులో హాజరు పరచినట్టు చెప్పారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. గత జూన్ 29వ తేదీ రాత్రి దుండగులు దుకాణం గోడకు కన్నం పెట్టి లోపలికి ప్రవేశించి డబ్బు, బంగారు నగలు దొంగిలించినట్లు దుకాణం యజమాని వంశీ తయాల్ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా పలు ప్రాంతాలలో దాడులు నిర్వహించి నలుగురుని అరెస్టు చేశామన్నారు. న్యాయ విచారణ జరగాలి: శ్రీకాంత్ భువనేశ్వర్: బాలాసోర్ ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని ఆత్మాహుతి సంఘటనపై న్యాయ విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆ పార్టీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శ్రీకాంత్ జెనా ఈ సంఘటనపై స్పందిస్తు న్యాయ లేదా సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ విచారకర సంఘటనపై స్వతహాగా జోక్యం చేసుకున్న రాష్ట్ర క్రైమ్ శాఖ సోమ వారం నిరవధికంగా కొనసాగింది. 2 మంది సభ్యులతో కూడిన దర్యాప్తు బృందం కళాశాల ప్రత్యక్షంగా సందర్శించి దర్యాప్తు కొనసాగించింది. రిజర్వాయర్‌లో దిగి జార్ఖండ్ వాసి మృతి కొరాపుట్: లోతు తెలియక నీటిలో దిగి జార్ఖండ్ వాసి మృతి చెందాడు. సోమవారం కొరాపుట్ జిల్లా కేంద్రం సమీపంలో గల కొలాబ్ రిజర్వాయర్‌లో జార్ఖండ్‌కి చెందిన సంతోష్ ఖండల్వాల్ (28) మృతి చెందాడు. సునాపుర్ వెళ్లడానికి రిజర్వాయర్ దాటే ప్రయత్నం చేశాడు. చుట్టు తిరిగి వెళ్లడానికి దూరం ఎక్కువ అవుతుందని, నీటి లోతు తక్కువగా ఉంటుందని దిగాడు. ఆ ప్రాంతంలో ఉన్న ఊబిలో మునిగి పోయాడు. ఇది గమనించిన ఆ ప్రాంత ప్రజలు కేకలు వేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు గాలించి మృతదేహం వెలికి తీశారు. మృతుడు ఎల్అండ్టీలో కార్పెంటర్‌గా పని చేస్తున్నాడని స్థానికులు పేర్కొన్నారు. స్వస్థలం వెళ్లడానికి రైల్వే స్టేషన్‌కు వెళ్లి టికెట్ తీసి తిరిగివస్తుండగా మృత్యువాత పడ్డాడు. విద్యార్థిని ఆత్మహత్యపై గవర్నరు జోక్యం భువనేశ్వర్: బాలసోర్ ఫకీర్ మోహన్ (స్వయంప్రతిపత్తి) కళాశాల విద్యార్థిని ఆత్మాహుతి సంఘటనపై రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర ఉన్నత విద్య మంత్రి సూర్యబన్షి సూరజ్‌తో మాట్లాడారు. ప్రస్తుతం స్థానిక ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధిత యువతి ఈ దయనీయ పరిస్థితికి దారితీసిన పరిస్థితులు, పరిస్థితుల నివారణకు చేపట్టిన చర్యలకు సంబంధించి గవర్నర్ పూర్తి వివరాలు కోరారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధిత యువతికి మద్దతు కల్పించడంతో జవాబుదారీతనం నిర్ధారించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యార్థిని ఆరోగ్యంపై తాజా సమాచారం కోసం ఎయిమ్స్ భువనేశ్వర్ డైరెక్టర్‌తో గవర్నరు మాట్లాడారు. ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స విజయవంతమై యువతి త్వరగా కోలుకోవాలని గవర్నరు ఆకాంక్షించారు. విద్యార్థుల భద్రత, మానసిక శ్రేయస్సు, గౌరవాన్ని ఎల్లప్పుడూ కాపాడాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యతతో వ్యవహరించాలని ఆయన అధికారులను కోరారు. 18 పశువులు పట్టివేత రణస్థలం: మండలంలోని జాతీయ రహదారిపై రామతీర్థాలు కూడలి వద్ద వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 18 గేదెలను జేఆర్‌పురం పోలీసులు సోమవారం ఉదయం పట్టుకున్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న వ్యానులో తనిఖీలు చేపట్టారు. విజయనగరం జిల్లాలోని గుర్ల మండలంలో ఉన్న గుజ్జంగవలస గోశాలకు పశువులను తరలించారు. జేఆర్‌పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
స్థలం మంజూరు చేయాలని వినతి
పర్లాకిమిడి: స్థానిక శ్రీకృష్ణ యాదవ సంఘం అభివృద్ధి, స్వంత కార్యాలయం ఏర్పాటుకు స్థలం మంజూరు చేయాలని సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ ను అభ్యర్ధించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో శ్రీకృష్ణయాదవ సంఘం అధ్యక్షులు ఎ.కులవర్దన రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నబకిశోర్ శోబోరో, కాశీనగర్ సమతి మాజీ చైర్మన్ సి.హెచ్. సింహాద్రి, బరంపురం ఎం.పి. ప్రతినిధి దారపు రాజేష్ కుమార్ ఉన్నారు. జాతీయ దివ్యాంగ పోటీలకు ఎంపికలు కాశీబుగ్గ: జిల్లాస్థాయి దివ్యాంగ సబ్ జూనియర్, జూనియర్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్–2025 రాష్ట్రస్థాయి క్రీడా పోటీల ఎంపికలు ఈనెల 26వ తేదీన కోడి రామ్మూర్తి క్రీడా మైదానంలో జరగనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతీ దివ్యాంగ క్రీడాకారులు ఈనెల 24వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 93813 68209, 80081 62432, 91776 93836 నంబర్లను సంప్రదించాలని స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం అధ్యక్ష, కార్యదర్శులు తురల్లి రాము, డి.అచ్యుతరావు, కార్య నిర్వాహక సభ్యులు ఎన్.స్రవంతి, ఎన్.మోహన్‌రావు, గణపతి, నీలం తదితరులు కోరారు. ఉర్లాం స్కూల్లో చోరీ నరసన్నపేట: మండలంలోని ఉర్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.40 వేలు విలువ కలిగిన పరికరాలు చోరీకి గురయ్యాయని హెచ్ఎం భారతి సోమవారం తెలిపారు. మరుగుదొడ్లలో ఉన్న విలువైన స్టీల్ ట్యాప్‌లు, ఇతర పరికరాలు చోరీ చేశారన్నారు. శని, ఆదివారాలు వరుసగా స్కూల్‌కు సెలవులు కావడంతో గుర్తు తెలియన వ్యక్తులు తాళాలు విరగ్గొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాడు–నేడు పథకంలో భాగంగా ఈ పాఠశాలలో అత్యుత్తమ సదుపాయాలు కల్పించారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి రణస్థలం: లావేరు మండలంలోని జాతీయ రహదారి బెజ్జిపురం కూడలి సమీపంలో ఉన్న హైవే విశ్రాంతి భవనంలో బెజ్జిపురం గ్రామానికి చెందిన శివాజీ(54) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతిపై కుటుంబ సభ్యులు అందోళన చేపట్టారు. సంఘటన స్థలాన్ని లావేరు ఏఎస్ఐ భుజంగరావు పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతిడికి భార్య సబ్బి ఆదిలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
గుప్తేశ్వరం సందర్శన
కొరాపుట్: రాష్ట్ర పర్యాటక కార్యదర్శి, కొరాపుట్ జిల్లా నోడల్ అధికారి బల్వంత్ సింగ్ గుప్తేశ్వరాన్ని సందర్శించారు. సోమవారం కొరాపుట్ జిల్లా బొయిపరిగుడ సమితి రామగిరి సమీపంలో గల దండకారణ్యంలో ఉన్న సహజ సిద్ధ పుణ్యక్షేత్రం గుప్తేశ్వరంలో పర్యటించారు. అక్కడ కోట్లాది రూపాయలతో నిర్మితమవుతున్న శబరి నది వద్ద ఘాట్లు, స్నానపు గదులు, విశ్రాంత స్థలాలు, రోడ్లు, ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలు కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ వివరించారు. అనంతరం నందపూర్ ప్రాంతంలో పురాతన జైన మత ప్రార్థనా స్థలాలను పరిశీలించారు. అనంతరం కొరాపుట్ కాపీ బోర్డు, లమ్తాపుట్లో భారీ తాగునీటి ప్రాజెక్ట్‌లలో పర్యటించారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. -
పక్కాగా ట్రాఫిక్ నిబంధనలు అమలు
పర్లాకిమిడి: పర్లాకిమిడి పట్టణంలో మార్కెట్ జంక్షన్ వద్ద ఇటీవల ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నారు. సోమవారం ఉదయం శ్రీరామ మందిరం సమీపంలో నో పార్కింగ్ వద్ద బైక్ పెట్టిన వాహనదారుడి ఫొటో తీసి వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. రధాయాత్ర నుంచి జిల్లా ఎస్పీ, సబ్ కలెక్టర్ పట్టణంలో జనసందోహం కలిగిన మార్కెట్, హైస్కూల్ జంక్షన్, ప్యాలస్ వీధి, పాతఅగ్నిమాపక దళం వద్ద ఒన్ వే ట్రాఫిక్ అమలు చేసిన తరువాత పర్లాకిమిడి వాహన చోదకులకు కనువిప్పు కలిగింది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్‌ను పాటిస్తున్నారు. స్కూటీ డిక్కీలో పాము రాయగడ: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల రైల్ రెస్టారెంట్ వద్ద ఆగి ఉన్న ఓ స్కూటీలో పాము హల్చల్ చేసింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి రెస్టారెంట్లో ఉన్న కొందరు పాము డిక్కీలో దూరడం చూసి కేకలు పెట్టారు. వెంటనే పాములు పట్టే ప్రదీప్ సేనాపతికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న సేనాపతి సుమారు గంటన్నర సమయం కష్టపడి పామును పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆగస్టు నుంచి గోధుమల సరఫరా జయపురం: పది నెలల కిందట నిలిచి పోయిన గోధుమల సరఫరాను ప్రభుత్వం పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆగస్టు ఒకటో తేదీ నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు గోధుమలను సరఫరా చేయనున్నారు. ఆ మేరకు జయపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ డీలర్లు గోధుమలను లబ్ధిదారులకు సరఫరా చేయాలని జిల్లా పౌర విభాగ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ సమయంలో 2020–21లో పీడీఎస్ గోధుమలను లబ్ధిదారులకు నిలిపి వేశారు. అయితే 2024లో నూతన ప్రభుత్వం వచ్చిన తరువాత గోధుమలు సరఫరా చేయటం ప్రారంభించారు. 2024 అక్టోబర్ నుంచి కొరాపుట్ జిల్లాలో ప్రతి వ్యక్తికి ఒక కేజీ గోదుమలతో పాటు నాలుగు కేజీల బియ్యం ఇచ్చేవారు. అయితే హఠాత్తుగా ఏ కారణం చేతనో ప్రభుత్వం గోధుమల సరఫరా నిలిపి వేసింది. ఆనాటి నుంచి గోధుముల నిల్వలు ఉన్నా డీలర్లు సరఫరా నిలిపి వేశారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి రేషన్‌కార్డుదారులకు గోధుమలను సరఫరా చేయాలని సివిల్ సప్లై అధికారులు వెల్లడించారు.. 47 వినతుల స్వీకరణ రాయగడ: జిల్లాలోని గుడారి సమితి సమావేశం హాల్లో సోమవారం వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి, గుణుపూర్ సబ్ కలెక్టర్ కిరణ్ దీప్ కౌర్ సహాట, ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముంపో, గుణుపూర్ ఐటీడీఏ అధికారి అజయ్ కుమార్ ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. గుడారి సమితి పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి కలెక్టర్ పట్వారి 47 వినతులను స్వీకరించారు. వీటిలో 38 వ్యక్తిగత, తొమ్మిది సామూహిక గ్రామ సమస్యలుగా గుర్తించారు. ఈ సందర్భంగా పది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 88 వేల రూపాయలను కలెక్టర్ అందజేశారు. గ్రామ సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జయపురంలో గోడౌన్లో నిల్వఉన్న గోధుమ బస్తాలు -
ప్రేమికులకు నాగలికి కట్టిన ఘటనపై ప్రభుత్వం చర్యలు
కొరాపుట్: ప్రేమికులను నాగలికి కట్టి గ్రామంలో ఊరేగించిన ఘటన పై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రంగం లోనికి దిగింది. కొరాపుట్ జిల్లా నారాయణపట్న సమితి బొరిగి గ్రామ పంచాయితీ పెద్దఇటికి గ్రామంలో జరిగిన ఘటనపై నారాయణ పట్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నారాయణ పట్న ఐఐసీ ప్రమెధ్ కుమార్ నాయక్ ఆ గ్రామాన్ని సందర్శించారు. గ్రామ ప్రజలను విచారణ చేశారు. ఈ విచారణలో అందరి ఆమోదంతోనే ప్రేమికులను ఊరేగించామని గిరిజన పెద్దలు ప్రకటించారు. మరో వైపు ప్రేమ జంట కూడా తమ ఇష్ట ప్రకారమే ఈ శిక్షని అంగీకరించామని ప్రకటించారు. బంధుగాం సమితిలో ఒక మంత్రగత్తె ఇచ్చిన సలహా ప్రకారమే ప్రేమికులకు శిక్ష విధించినట్లు గ్రామస్తులంతా ముక్త కంఠంతో సమాధానమిచ్చారు. వారిద్దరూ ఒకే వంశానికి చెందిన వారు కనుక అన్నా చెల్లెళ్లు అవుతారని, దాని వల్ల గ్రామానికి కీడు జరుగుతుందనే విషయం మంత్రగత్తె చెప్పిందని, ఇలా నాగలికి కట్టి ఊరేగిస్తే దోష పరిహారం జరుగుతుందని చెప్పిందని స్థానికులు తెలిపారు. ఈ విషయం పై కొరాపుట్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత స్పందించారు. ఇలాంటి అనాగరిక చర్యలు అంగీకరించబోమన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ వీ.కీర్తి వాసన్ మీడియాతో మాట్లాడారు. ఈ సంఘటన పై ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. -
మానవత్వం మంటగలపొద్దు
రాయగడ: మానవత్వ విలువను మంట గలపవద్దని సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న అన్నారు. జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి సికిరపాయి పంచాయతీ పరిధిలోని కొంజొమాజొడి గ్రామంలో కొద్ది రోజుల కిందట లక సరక అనే యువకుడు అదే గ్రామానికి చెందిన కొడియా సరకను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వరుసకు పిన్ని కావడంతో ఆమెను వివాహం చేసుకోవడం గ్రామ సంప్రదాయాలకు విరుద్ధమని భావించిన గ్రామస్తులు వారిని నాగలికి కట్టి పొలం దున్నించి హింసించారు. దీనిపై ఆదివారం సబ్ కలెక్టర్ జెన్న నేతృత్వంలో కల్యాణసింగుపూర్ బీడీఓ మనీషా దాస్, తహసీల్దార్ రంజన్ కుమార్ సెట్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి అసీమా రావ్, ఏసీఎస్ఓ శుభాంశు భొయ్, కల్యాణసింగుపూర్ ఐఐసీ నీలకంఠ బెహరాతో ఏర్పడిన దర్యాప్తు కమిటీ గ్రామంలో పర్యటించి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామ పెద్దలతో మంతనాలు చేశారు. గ్రామ కట్టుబాట్లను వ్యతిరేకించే ఎవరికై నా ఇలాంటి దండనే ఉంటుందని స్థానికులు ఖరాఖండిగా చెప్పడంతో దర్యాప్తు బృందం అవాకై ్కంది. సబ్ కలెక్టర్ స్పందిస్తూ కట్టుబాట్లను పాటించాలని, కానీ ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఏదైనా తప్పు జరిగితే అందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని వివరించారు. గ్రామస్తులను తాము చైతన్య పరిచామని, తాము గ్రామ కట్టుబాట్లను అనుసరించామే తప్ప ఎవరినీ హింసించలేదని గ్రామస్తులు తెలిపారని సబ్‌కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామన్నారు. కొంధొ కులం సమాజం అధ్యక్షుడు జొగేంద్ర వడక మాట్లాడుతూ గ్రామ కట్టుబాట్లను మీరాడని దండన విధించామని, వెలి వేయలేదని తెలిపారు. ఆచార వ్యవహారాలు ఎవరు అతిక్రమించినా శిక్ష తప్పదన్నారు. చట్టాన్ని మీరి తాము ఏ పనీ చేయలేదని తెలిపారు. ప్రేమికుడు లక సరక మాట్లాడుతూ తమను వెలి వేయలేదని, కక్ష సాధింపు ఏమీ లేదని, గ్రామ కట్టుబాట్ల ప్రకారం శిక్ష విధించారని తెలిపారు. -
పారదేశ్వర దేవాలయ నిర్మాణంపై ప్రత్యేకశ్రద్ధ
కొరాపుట్: పారదేశ్వర దేవాలయ నిర్మాణ కమిటీ సర్వ సభ్య సమావేశం సోమవారం జరిగింది. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని ద్వారకానగర్ సమీపంలో నిర్మితమవుతున్న మందిర ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. మందిర నిర్మాణం కోసం ఇప్పటి వరకు సుమారు రూ. 50 లక్షలు ఖర్చు అయినట్లు కమిటీ సభ్యులు వివరించారు. సుమారు మూడు అడుగుల ఎత్తు ఉండే స్పటిక లింగాన్ని పంజాబ్ నుంచి తెప్పించి ప్రతిష్టించాలని నిర్ణయించారు. శివ లింగం ఖర్చు సుమారు రూ. 30 లక్షలు అవుతుందని అంచనా వేశారు. దేవాలయ మిగతా నిర్మాణాలు పూర్తి చేయడానికి మరో రూ. 50 లక్షలు అవుతుందని కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ నిధులు వివిధ సంఘాలు, ప్రముఖులు, ప్రజల నుంచి చందాల ద్వారా పోగు చేసి సకాలంలో నిర్మాణం పూర్తి చేయాలని సభ్యులు తీర్మానం చేశారు. అలాగే సాయంత్రం నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి తన అనుచరులతో వెళ్లి దేవాలయ నిర్మాణ పరిస్థితిని పరిశీలించారు. -
మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025
ఘోఘరేశ్వరుని దేవస్థానం ఆవరణలో అర్ధరాత్రి బోల్ భం దీక్షకులు భువనేశ్వర్: శివ భక్తులకు శ్రావణ మాసం అత్యంత పవిత్ర ప్రదం. ఈ నెల పొడవునా ప్రతి సోమవారం ఇష్ట ఆరాధ్య దైవం మహా దేవుడు శివునికి పవిత్ర జలంతో అభిషేకించి తరించేందుకు దీక్ష బూనుతారు. తొలి శ్రావణ సోమవారం పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రాలు శివ దీక్ష భక్తులతో కిటకిటలాడాయి. కఠోర నియమ నిష్టలతో ఒక చోటులోని నదీ జలం సేకరించి వేరొక చోట పూజలందుకుంటున్న మహా దేవునికి అభిషేకిస్తారు. నదీ తీరంలో శుచిగా స్నానం ఆచరించి దీక్ష వస్త్ర ధారణతో తీరంలో లాంచనంగా పూజాదులు నిర్వహించి పవిత్ర నదీ జలంతో నింపిన కలశాల్ని కావడికి అమర్చి పాద యాత్ర ప్రారంభిస్తారు. ఈ దీక్షకుల్ని కావడి ధారులు (కౌడియా)గా పేర్కొంటారు. పాద యాత్ర ఆద్యంతాలు దీక్ష నియమ నిబంధనల్ని కఠోరంగా అవలంభిస్తారు. సోమవారం శైవ క్షేత్రం చేరేలా యాత్ర కొనసాగిస్తారు. భోలా శంకరుని కటాక్షం కోసం బోల్ భం నిరంతర శివ నామ నినాదంతో ముందుకు సాగుతారు. బోల్ భం దీక్షకుల ఆగమనం పరిసరాల్ని శివ మయం చేస్తాయి. శైవ క్షేత్రాలు ప్రత్యేకంగా అలంకరించుకుని వీరికి స్వాగతం పలుకుతాయి. దారి పొడవునా కావడిధారి పాదచారులకు ఎటువంటి అసౌకర్యం అవాంతరం కాకుండా పోలీసు, రవాణా తదితర అనుబంధ వర్గాలు అంకిత భావంతో చేయూతనిస్తాయి. పలు స్వచ్చంధ సేవక వర్గాలు దారి పొడవునా దీక్షకు అనుగుణంగా వీరి కోసం ఏర్పాట్లు చేసి ఆదరిస్తారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి శైవ క్షేత్రాలు విద్యుద్దీపాలు, పచ్చని తోరణాలు, సుగంధిత పూల మాలల అలంకరణతో కనులు మిరమిట్లు గొలిపేలా ముస్తాబవుతాయి. ఆయా క్షేత్రాల్లో బోల్ భం దీక్షకులు సులభంగా మహా దేవునికి అభిషేకించేందుకు తాత్కాలిక బారికేడ్ల గుండా వరుస క్రమంలో దర్శన సౌకర్యం వంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించి దేవస్థానం యంత్రాంగం సహకరిస్తారు. ఏకామ్ర క్షేత్రంలో లింగ రాజు, అఠొగొడొ ధవళేశ్వరుని దేవస్థానం, రాజ్‌గంగ్‌పూర్‌లోని ఘోఘరేశ్వర్, ఢెంకనాల్ కపిలేశ్వర్ మరెన్నో ప్రముఖ శైవ క్షేత్రాలు బోల్ భం దీక్షకుల ఆగమనంతో శ్రావణ శోభతో కళకళలాడుతున్నాయి. ఈ సందర్భంగా మహా నది, ఉప నదులు, బ్రాహ్మణి, వైతరణి, కువాఖాయి తదితర పవిత్ర నదుల నుంచి సేకరించిన జలాన్ని కావడి భారంతో నిష్టతో సంకల్పం మేరకు శైవ క్షేత్రం చేరుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో మహా శివునికి అభిషేకిస్తారు. ఈ దీక్షలో ఆబాల గోపాలం అత్యంత అంకిత భక్తి భావంతో పాల్గొంటారు. శివాలయంలో భక్తులు భారీగా గుమిగూడారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది భక్తులు, కౌడిలు బ్రహ్మణి నది, వేదవ్యాస్ శైవ పీఠం నుంచి నీటిని తీసుకువచ్చి ఘోఘరేశ్వర్ శివాలయానికి నీటిని సరఫరా చేశారు. న్యూస్‌రీల్ -
నిరసనల ప్రకంపన
భువనేశ్వర్: విద్యార్థి, యువజనం, మహిళలు, విపక్ష వర్గాల ధర్నాలు, నిరసనలతో బాలాసోర్ ప్రకంపిస్తోంది. స్థానిక ఫకీర్ మోహన్ కళాశాలలో చదువుకుంటున్న యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి భువనేశ్వర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో మృత్యు పోరాటం చేస్తోంది. దీనిపై ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్, కాంగ్రెస్ విద్యార్థి, యువజన, మహిళా వర్గాలు నిరవధికంగా నిరసన ప్రదర్శిస్తున్నాయి. నగరంలో ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసన ఊరేగింపులు, కళాశాల ఆవరణలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఉన్నత విద్యా విభాగం మంత్రి సూర్యవంశీ సూరజ్ దిష్టి బొమ్మలు దహించారు. ఆత్మహత్యాయత్నంపై నిరసనలు తీవ్రమవుతున్నాయి. సోమవారం బిజూ జనతా దళ్, కాంగ్రెస్ నాయకులు బాలాసోర్‌ను సందర్శించారు. బీజేడీ నాయకులు ప్రతాప్ జెనా, బ్యోమకేష్ రాయ్, దేవి త్రిపాఠి, జ్యోతి పాణిగ్రాహి తదితరుల బృందం బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డీఐజీకి వినతి పత్రం సమర్పించారు. -
ఎఫ్ఎం కళాశాల ప్రిన్సిపాల్ అరెస్టు
భువనేశ్వర్: బాలాసోర్ ఫకీరు మోహన్ కళాశాల ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్‌ను అరెస్టు చేశారు. ఈ కళాశాల విద్యార్థిని ఆత్మాహుతి యత్నం సంఘటనలో ఇటీవల సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై పలు వర్గాలు నిర్వహిస్తున్న విచారణ నేపథ్యంలో సోమవారం స్థానిక సహదేవఖుంట ఠాణా పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఈ సంచలనాత్మక సంఘటనలో ఇంతకు ముందు విద్యా శాఖ హెచ్ఓడి సమీర్ సాహును అరెస్టు చేశారు. చీఫ్ సెక్రటరీ సమీక్ష బాలాసోర్ ఫకీర్ మోహన్ కళాశాలలో విద్యార్థిని ఆత్మాహుతి ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. సర్వత్రా ఆందోళన వ్యక్తమై పరిస్థితి ఉద్రిక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో తాజా స్థితిగతుల్ని ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా, శిశు అభివృద్ధి, ఉన్నత విద్య, ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖల ప్రధాన కార్యదర్శులతో చర్చించారు. -
● కాడెద్దులు లేకున్నా..
ఉన్న పొలం పోయింది. కాడెద్దులు దూరమయ్యాయి. అప్పులు బతుకు మీదకు వచ్చాయి. కానీ ఆయనకు తెలిసింది ఒక్కటే. వ్యవసాయం. భూమి ఉన్నా లేకపోయినా, కాడెద్దుల సాయం ఉన్నా లేకున్నా.. ఆయన చేయగలిగింది ఒక్కటే వ్యవసాయం. జయపూర్ పట్టణ సమీపంలో బంకబిజ గ్రామ వద్ద రోడ్డు పక్కన పొలంలో ఎద్దుల సాయం లేకుండా దుక్కి దున్నుతున్న ఇతని పేరు రామ పరిజ. సాగు తప్ప ఇంకేమీ తెలియని ఈ మనిషి సొంత పొలం పోయాక కొంత పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. ట్రాక్టర్ అద్దె కట్టలేక ఇలా దున్నే బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. – కొరాపుట్ -
ప్రేమించుకున్న అన్నాచెల్లెళ్లు.. గ్రామానికే అరిష్టమని..!
ఒడిశా: ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో ప్రేమికులను నాగలికి కట్టి ఊరేగించిన ఘటన సంచలనం రేకెత్తించింది. జిల్లాలోని నారాయణ పట్న సమితి, బొరికి గ్రామ పంచాయతీ పెద్ద ఇటికి గ్రామంలో ఒకే వంశానికి చెందిన ఇద్దరు గిరిజనులు ప్రేమించుకున్నారు. ఈ విషయం రథయాత్ర సమయంలో వెలుగులోకి రావడంతో పెద్దలు కఠిన శిక్ష విధిస్తారనే భయంతో వీరు ఆంధ్రాకు పారిపోయారు. కానీ, వారి ఆచూకీని ఇరు కుటుంబాల వారు పసిగట్టి గ్రామ పెద్దలకు నివేదించారు.ఒకే వంశానికి చెందిన వీరిద్దరూ అన్నాచెల్లెళ్లు అవుతారు. వీరిద్దరూ ప్రేమించుకోవడం గ్రామానికే అరిష్టమని, పంటలు పండవని, పాపశుద్ధి జరగాలని పేర్కొంటూ వీరిని ఆదివారం ఊరికి రప్పించారు. అయితే ప్రేమికులు తాము ఎలాంటి శిక్షనైనా భరిస్తాం గానీ విడిపోయి ఉండలేమని తేల్చి చెప్పారు. దీంతో వారిని గ్రామం నడిబొడ్డున నాగలికి కట్టి ఊరేగించి శుద్ధిజలం చల్లారు. శిక్ష అమలు తర్వాత ఇద్దరూ కలిసి ఉండొచ్చని పెద్దలు నచ్చజెప్పి తీసుకురావడం గమనార్హం. -
నేటి నుంచి ఒడిశాలో రాష్ట్రపతి పర్యటన
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేటి నుంచి ఒడిశాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె సోమవారం భువనేశ్వర్‌కు చేరుకుంటారని రాష్ట్రపతి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. సోమవా రం భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయి మ్స్) ఐదవ స్నాతకోత్సవానికి హాజరవుతారు. రెండో రోజైన జూలై 15న రావెన్షా విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అలాగే రావెన్షా బాలికల ఉన్నత పాఠశాల మూడు భవనాల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు. ఆదికాబి సరళ దాస్ జయంతి వేడుకలకు హాజరవుతారు. -
మొక్కలతో పర్యావరణ పరిరక్షణ
రాయగడ: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో దొహదపడతాయని సీఆర్ఫీఎఫ్ నాలుగో బెటాలియన్ కమాండెంట్ ఎం.ఎల్.నాయుడు గెడల అన్నారు. జిల్లాలోని మునిగుడ సమితి అంబొదల సమీపంలో గల పయిలాపడ గ్రామంలో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఆర్పీఎఫ్ జవాన్లు నిర్వహించారు. రఘుబారి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు 800 మొక్కలను నాటారు. సీవా సంస్థ ఆధ్వర్యంలో.. కొరాపుట్: పర్యావరణ పరిరక్షణలో మరో భారీ కార్యక్రమం జరిగింది. ఆదివారం జయపూర్ సమీపంలోని గగనాపూర్ వద్ద ప్రభుత్వ భూమిలో పర్యవరణం కోసం గత 27 సంవత్సరాలుగా పనిచేస్తున్న సోషల్ ఎన్విరానామెంటల్ ఎడ్యేకేషనల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (సీవా) వన యజ్ఞం చేసింది. అటవీ శాఖ అందించిన వేయి మెక్కలు నాటడానికి శ్రీకారం చుట్టింది. తొలి రోజు భారీ ఎత్తున మొక్కలు నాటారు. గగనాపూర్ శివ మందిర పరిసర ప్రాంతంలో మొక్కలు నాటారు. సీవాకి చెందిన జీవీ రెడ్డి, సుధాకర్ పట్నాయక్, వినాయక్ మహాపాత్రో, ప్రతాప్ పట్నాయక్, కిల్లంశెట్టి మెహన్రావు, తదితరులు పాల్గొన్నారు. జయపురంలో.. జయపురం: ‘ఒక మొక్క అమ్మ పేరున’ కార్యక్రమంలో జయపురం సమితి యు.పి.ఎస్ ప్రాంతీయ సాధనా కేంద్రంలో ఆదివారం వనమహోత్సం వారోత్సవాలు నిర్వహించారు. జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి చందన కుమార్ ఆదేశాల మేరకు సి.ఆర్.సి.ఎస్ విజయలక్ష్మీ ౖస్వైయ్ పర్యవేక్షణలో మొక్కలు నాటారు. అబిజాన్‌లో హనాగుడ ప్రాథమిక పాఠశాల, గొడియ దొబాసాయి ప్రాథమిక పాఠశాల, పంజార హౌస్ కాలనీ పాఠశాల, సాంతరా సాహి పాఠశాల, ఎక్స్ బోర్డు మహమ్మదన్ పాఠశాల, సరస్వతీ బాల మందిరం, జయనగర్ ఆశ్రయం పాఠశాల, జయనగర్ ఉన్నత పాఠశాల, పాయిక వీధి పాఠశాల, సునారి సాహి ప్రభుత్వ యూపీఎస్ పాఠశాల, జగదీష్ చంద్రనాయక్ ఉన్నత పాఠశాల, మునిసిపాలిటీ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు వివిధ రకాల పండ్ల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం ఈ నెల 15వ తేదీ వరకు ఉంటుందని విజయలక్ష్మీ ౖస్వైయ్ తెలిపారు. జయపురంలో.. జయపురం: జయపురం తెలుగు సంస్కృతిక సమితి నిర్వహిస్తున్న జయపురం సిటీ ఉన్నత పాఠశాల ద్వారా ఆదివారం జయపురం సమితి గగణాపూర్ గ్రామ ప్రాంతంలో వన మహోత్సవం నిర్వహించారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ సోషియల్ ఎడ్యుకేషనల్ అండ్ ఎన్విరాన్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (సీవా)సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 26 మంది ఎకో క్లబ్ విద్యార్థులు పాల్గొన్నారు. వారితోపాటు పీఈటీ రీటా సామంత రాయ్, పాఠశాల ఉపాద్యాయులు ధనపతి భొత్ర, సోన, సిటీ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపాల్ సుధాకర పట్నాయక్ పాల్గొన్నారు. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో వివిధ రకాల 1,000 మొక్కలు నాటినట్లు ఎకో క్లబ్ ఇన్చార్జి, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు ప్రతాప్ కుమార్ పట్నాయక్ తెలిపారు. రానున్న ఆదివారం కూడా వనమహోత్సవం నిర్వహిస్తామని, 2,500 మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ఉన్నామని వెల్లడించారు. జయపురం పాఠశాల నుంచి గగణాపూర్ గ్రామానికి ఎకో క్లబ్ విద్యార్థులు సైకిళ్లపై వెళ్లారు. -
గుండాల్ సర్పంచ్ మృతి
జయపురం: జయపురం సబ్ డివిజన్ కుంద్ర సమితిలో కొత్తగా ఏర్పాటు చేసిన గుండాల గ్రామ పంచాయతీ సర్పంచ్ భక్త ఖోశ్ల (40) శనివారం తన స్వగృహంలో మృతి చెందారు. గత రెండేళ్లుగా ఖోశ్ల క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య శశి కలాపి, కుమారుడు ఉన్నారు. 2017లో గుండాల్ పంచాయతీగా ఏర్పడగా ప్రథమ సర్పంచ్‌గా అతడి భార్య శశి కలాపి పనిచేశారు. రెండోసారి జరిగిన ఎన్నికలలో ఖొశ్ల సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బంధువులు సంతాపం తెలియజేశారు. విద్యుదాఘాతంతో ఏనుగు మృతి భువనేశ్వర్: పశ్చిమ ఒడిశా సంబల్పూర్ జిల్లాలో విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందింది. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. రెఢాఖోల్ అటవీ ప్రాంతం నకొటిదెవులో రేంజ్ టికిలిపొడా గ్రామ సమీపంలో ఈ సంఘటన ఆదివారం జరిగింది. అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ కావడంతో భువనేశ్వర్ నుంచి ప్రత్యేక బృందం ఘటనా స్థలానికి బయల్దేరింది. బ్రిటీష్ కాలం నాటి రైల్వేవంతెన తొలగింపు వజ్రపుకొత్తూరు: మారుతున్న కాలం, టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్న భారత రైల్వే కొత్త బాటలో పయనిస్తోంది. పాతవి జ్ఞాపకాలే అయినా ప్రజలకు చేరువయ్యేలా సేవలు అందించాలన్నది లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగా బ్రిటీష్ కాలం నాటి కట్టడాలను తొలగిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం వజ్రపుకొత్తూరు మండలం పూండి రైల్వే స్టేషన్లో భారీ క్రేన్ల సాయంతో పాత కాలినడక వంతెనను తొలగించే పనులు చేపట్టింది. కేవలం 8 గంటల్లోనే వంతెన మొత్తాన్ని విడిభాగాలు చేసి తొలగించింది. కింది భాగంలో 25వేల కిలోవాట్ల విద్యుత్ తీగలు ఉన్నప్పటికీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పనులు పూర్తి చేశారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో చివరి స్టేషన్‌గా ఉన్న పూండికి వాల్తేరు డివిజన్ నుంచి ప్రధాన ఇంజినీర్లు, టెక్నికల్ బృందం వచ్చి తొలగింపు పనులు చేపట్టారు. వంతెన తొలగింపునకు ముందే మూడు నెలలు కిందట సమాంతరంగా కొత్త వంతెన నిర్మించారు. -
విద్యా మందిరంలో గురుపూజోత్సవం
జయపురం: జయపురం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విభాగం వారు ఆదివారం స్థానిక శారదా విహార్ విద్యామందిర ప్రాంగణంలో శ్రీగురు దక్షిణ ఉత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవంలో పశ్చిమ ప్రాంత ఆర్ఎస్ఎస్ సంఘ పరిచాలక్ ప్రొఫెసర్ సనాతన ప్రధాన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జయపురం పట్టణ ఆర్ఎస్ఎస్ పరిచాలక్ డాక్టర్ నిరంజన్ ప్రధాన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సనాతన ప్రధాన్ ప్రసంగిస్తూ.. గురు దక్షిణ ఉత్సవం ప్రాధాన్యతను వివరించారు. ఉపాధ్యాయులు, గురువులు మనలను విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్ది మంచి మనషులుగా సమాజానికి అందిస్తారన్నారు. అటువంటి మహానీయులైన గురువులను పూజించి వారికి గురుదక్షిణ ఇవ్వడం అనాదిగా వస్తున్న సంప్రదాయం అని వివరించారు. గురువులు పూజ్యనీయులని బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర స్వభావులన్నారు. అందుచేత గురువు మనకు విద్య నేర్పినందుకు గురు దక్షిణ ఇవ్వడం సంప్రదాయమన్నారు. ఈ రోజున మన శక్తి, సామర్‌ాధ్యలను బట్టి గురువులకు గురు దక్షిణ సమర్పించే కార్యక్రమాలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహిస్తున్నదని వివరించారు. ఈ సందర్భంగా పలువురు గురువులకు గురుదక్షణలు సమర్పించి వారి ఆశీర్వాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ప్రముఖ ఉపాధ్యాయులు ముకుంద భోయి, సుభ్రత్ కుమార్ పండ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల గృహదీక్ష
రణస్థలం: డీఎస్సీ–2003 ఫోరం పిలుపు మేరకు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 2003 బ్యాచ్ ఉపాధ్యాయులు గృహ దీక్ష చేపడుతున్నారని ఆపస్ మండల అధ్యక్షుడు జి.చిన్నికృష్ణంనాయుడు, పీఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి బి.చిన్నంనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెమో 57 మేరకు అర్హత కలిగిన అందరికి పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న ఉమ్మడి జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించే శాంతియుత నిరసనకు కుటుంబ సమేతంగా అందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు. దుండగులను కఠినంగా శిక్షించాలి జి.సిగడాం: డి.ఆర్.వలసలో ఈ నెల 12న శనీశ్వరుడి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయం కమిటీ సభ్యులు, గ్రామస్తులు కోరారు. ఆదివారం ఆలయంలో విగ్రహాల పరిస్థితిని పరిశీలించారు. పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని సర్పంచ్ కుమరాపు శ్రీనివాసరావు, ఎంపీటీసీ కుమరాపు రమేష్‌నాయుడు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కుమరాపు రవికుమార్, ఆలయ శిల్పి కుమరాపు రామినాయుడు, కుమరాపు చిన్న శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వ్యక్తి అనుమానాస్పద మృతి సారవకోట : పెద్దలంబ పంచాయతీ కురమన్నపేటకు చెందిన కలుగు నారాయణరావు(39) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సారవకోట మండలం నారాయణపురం నుంచి పాతపట్నం మండలం కొయ్యకొండ వెళ్లే మార్గంలోని మామిడి తోటలో మేకలు, గొర్రెలకాపరులు ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గుర్తించారు. స్థానికులకు సమాచారమివ్వగా వారు సారవకోట పోలీసులకు సమాచారమిచ్చారు. వ్యక్తి మృతిచెంది రెండు, మూడు రోజులు కావడంతో గుర్తుపట్టలేని విధంగా మారింది. కొద్దిసేపటి తర్వాత కురమన్నపేటకు చెందిన నారాయణరావుగా అనుమానించి కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. నారాయణరావుకు భార్య హిమవతి, కుమార్తెలు ఉష, లలిత ఉన్నారు. నారాయణరావు నిత్యం మద్యం సేవించి భార్యతో గొడవపడుతుండేవాడు. దీంతో ఆమె కొన్నాళ్లుగా వేరుగా ఉంటోంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ అనిల్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం తరలించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు సారవకోట: అంగూరు గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అడ్డపనస గ్రామానికి చెందిన వెలమల రామారావు తీవ్ర గాయాల పాలయ్యాడు. చల్లవానిపేట నుంచి వెంకటాపురం వైపు వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చున్న రామారావు గాయపడటంతో 108 వాహనంలో నరసన్నపేట ఆస్పత్రికి తరలించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగి మృతి ● అధికారి వేధింపులే కారణమంటున్న బంధువులు శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం–2లో పనిచేస్తూ ఇటీవల జరిగిన బదిలీల్లో సిలగాంకు బదిలీ అయిన ఉడుకుల రాంబాబు (44) ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఆకస్మిక బదిలీ, ఒత్తిళ్లే ఇందుకు కారణమని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. రాంబాబు ఈ నెల 7 వరకు శ్రీకాకుళం బాలుర వసతి గృహంలోనే పనిచేశారు. వాస్తవంగా బదిలీ అయ్యే అవకాశం లేకపోయినా అక్కడి సంక్షేమాధికారి సిఫారసులు, వేధింపుల వల్ల రాంబాబును బదిలీ చేశారని, బదిలీ వద్దని ఎంత మొరపెట్టుకున్నా కనికరించలేదని బంధువులు చెబుతున్నారు. వసతి గృహ సంక్షేమాధికారి చెప్పిన మాటలు విని వాస్తవిక పరిస్థితులు తెలుసుకోకుండా బీసీ సంక్షేమాధికారిణి అడ్డగోలుగా బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాంబాబు స్వస్థలం విజయనగరం జిల్లా డెంకాడ మండలం పాలెం గ్రామం. భార్య రమాదేవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
బాలియాత్ర నిర్వహణకు కమిటీ
జలుమూరు: రాష్ట్ర పండగగా బాలియాత్ర నిర్వహించేందుకు కలెక్టర్‌కు నివేదిక అందజేయనున్నట్లు యాత్ర కమిటీ ప్రతినిధి డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు తెలిపారు. బాలియాత్ర నిర్వహణకు సంబంధించి ఆదివారం 20 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీముఖలింగం ఆలయ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ కటక్‌లో కార్తీక పౌర్ణమి నుంచి వారం రోజుల పాటు యాత్ర జరగనుందని, శ్రీముఖలింగంలో ఏ తేదీన నిర్వహించాలనే విషయమై వారంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. యాత్ర విజయంవంతం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు భాగస్వామ్యం కావాలని కోరారు. సమావేశంలో సర్పంచ్ టి.సతీష్‌కుమార్, ఎంపీటీసీ కె.హరిప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ టి.బలరాం, వైఎస్సార్ సీపీ నాయకులు, గ్రామ పెద్దలు బి.వి.రమణ, తేజేశ్వరరావు, వేణు, చింతాడ వెంకటరావు, ఉపా ధ్యాయులు, అర్చకులు పాల్గొన్నారు. -
ట్రైన్ నుంచి జారిపడి సీఆర్పీఎఫ్ జవాన్‌కు గాయాలు
రాయగడ: ట్రైను నుంచి ప్రమాదవశాత్తు జారిపడిన ఘటనలో సీఆర్పీఎఫ్ జవాన్ తీవ్రగాయాలకు గురయ్యాడు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో గాయాలు తగిలిన వ్యక్తి శరత్ మాఝిగా పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న రాయగడ సీఆర్పీఎఫ్ బృందం సంఘటనా స్థలంకు చేరుకుని గాయపడిన మాఝిని కల్యాణ సింగుపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రౌర్కలా–జగదల్పూర్ ఎక్స్‌ప్రెస్‌లొ కొరాపుట్ నుంచి బలంగీర్ వైపు ప్రయాణిస్తున్న సమయంలో లెల్లిగుమ్మ రైల్వే స్టేషన్ సమీపంలో జవాన్ అదుపుతప్పి నడుస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో గాయాలకు గురయ్యాడు. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు వెల్లడించారు. అనంతరం అతనికి జిల్లా కేంద్రాస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. -
సింగుపుటిలో ఉచిత వైద్య శిబిరం
రాయగడ: సదరు సమితి సింగుపుటి గ్రామంలో స్థానిక సత్యసాయి బాబా సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ సురేష్ కుమార్, జిల్లా అదనపు ముఖ్యవైద్యాధికారి డాక్టర్ మమత చౌదరి, డాక్టర్ ఎల్ఎన్ సాహు సుమారు 87 మందికి వివిధ వైద్య పరీక్షలను నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కొంతమందికి నేత్ర శస్త్రచికిత్స అవసరం ఉందని గుర్తించారు. వారిని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు తరలించి సమితి ద్వారా ఉచితంగా ఆపరేషన్లను నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. -
గిరిజన సంస్కృతిపై ప్రత్యేక రచనలు
కొరాపుట్: గిరిజన సంస్కృతిపై ప్రత్యేక పరిశోధనాత్మక రచనలను ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. జయపూర్ పట్టణంలో ఎస్ఆర్ మాల్లో జరిగిన కార్యక్రమంలో బీజేపీకి చెందిన కొరాపుట్ జిల్లా కొట్‌పాడ్ ఎమ్మెల్యే రుపుధర్ బోత్ర, నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జిలు వీటిని ఆవిష్కరించి ప్రజల అందుబాటులోకి తెచ్చారు. సీనియర్ గిరిజన పండితుడు, మాజీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రమొదిని హత్తా రచించిన గిరిజన సాంస్కృతిక నేపథ్యం, డాక్టర్ దేవి ప్రసాద్ హత్తా రచించిన గిరిజన ప్రజల పురోగతి పుస్తకాలు విడుదల చేశారు. ఈ పుస్తకాలను కొరాపుట్ జిల్లా గిరిజన సంస్కృతిని సజీవంగా ఉంచుతాయని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు గౌతం సామంత్రాయ్, కవులు, పండితులు పాలొగన్నారు. -
22 కిలోల గంజాయి స్వాధీనం
కొరాపుట్: అక్రమ గంజాయి రవాణా గుట్టురట్టయింది. జయపూర్ ఎకై ్సజ్ పోలీసులు ఆదివారం పాత్రోపుట్ సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో పెట్రోల్ బంక్ సమీపంలో కొందరు అనుమానాస్పదంగా సంచరిస్తూ గమనించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా.. వారి వద్ద ఉన్న బస్తాలో 22 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులు మధ్యప్రదేశ్‌కి చెందిన బోలే గో స్వామి, మకాద్సిగా గుర్తించారు. గంజాయిని సీజ్ చేసి నిందితులను కోర్టులో హాజరు పరచగా జడ్జి వారికి రిమాండ్ విధించంతో జైలుకు తరలించారు. రేంజ్ ఇన్స్పెక్టర్ శశికాంత్ దత్ దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ మావోయిస్టులు అరెస్టు
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి దొరాగుడ పోలీసులు శనివారం సాయంత్రం ముగ్గురు నకిలీ మావోయిస్టులను అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో సమితిలోని కుఫాకోల్ గ్రామానికి చెందిన బినోద్ నాగ్, మాలిగుడ గ్రామానికి చెందిన నరేంద్ర నాగ్‌లతో పాటు మరో మైనర్ బాలుడు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాసీపూర్‌లో నివాసముంటున్న వ్యాపారి శేఖర్ బిసొయికి గుర్తు తెలియని వ్యక్తులు మావోయిస్టులమని బెదరించి లేఖ రాశారు. అనంతరం ఫోన్ ద్వారా మాట్లాడి తమకు రూ.50 లక్షలు ఇవ్వకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు. దీంతో గత్యంతరం లేని వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ వాయిస్ రికార్డు ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. వారు నకిలీ మావోయిస్టులుగా నిర్ధారణ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. -
ముఖలింగేశ్వరుని సన్నిధిలో తమిళనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ
జలుమూరు: ప్రసిద్ధి శైవక్షేత్రం శ్రీముఖలింగంలో మధుకేశ్వరుడిని తమిళనాడు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, మారిటైమ్ బోర్డు చైర్మన్ టి.ఎన్ వెంకటేష్ శనివారం దర్శించుకున్నారు. స్వామివారికి ఏకవార అభిషేకాలు, అర్చనలు, వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ చరిత్రను వివరించారు. ఈదుపురంలో పోలీసు పహారా ఇచ్ఛాపురం రూరల్: ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో వైఎస్సార్సీపీ కార్యకర్త సత్తారు గోపి దారుణ హత్యకు గురైన నేపథ్యంలో ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో రూరల్ ఎస్ఐ ఈ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. జూన్ 17న గ్రామంలో ఇరువర్గాల మధ్య జరిగిన కొట్లాట, రెండు రోజుల క్రితం కూటమి నాయకుడు విడుదల చేసిన వివాదాస్పద వాయిస్ రికార్డు దృష్ట్యా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తగా ఏఎస్ఐ శంకరరావు, ముగ్గురు కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కరువు భత్యం చెల్లించాలి శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీ ఎస్టీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినాన చందనరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సప్పటి మల్లేసు, పంచాది గోవిందరాజులు, సహాధ్యక్షుడు నెమలిపురి విష్ణుమూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2023 జులై నుంచి ఇప్పటివరకు నాలుగు విడతలుగా బకాయిలు పడ్డ డీఏలన్నీ కలిపి 16.38 శాతం చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇసుక వాహనాల అడ్డగింత బూర్జ : ఇసుక వాహనాల రాకపోకలతో దుమ్ము ధూళి చెలరేగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ బూర్జ మండలం చీడివలస గ్రామస్తులు శనివారం పలు లారీలను అడ్డుకున్నారు. కాఖండ్యాం, తమరాం ఇసుక ర్యాంపుల నుంచి రాత్రీపగలు తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్నారని, దీంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక లారీలను అడ్డుకోవడంతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి పంపించారు. జాబ్‌మేళాకు విశేష స్పందన శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. జీఎంఆర్ ఏఈఆర్ఓ ఆధ్వర్యంలో వివిధ ఎయిర్‌పోర్టుల్లో ఫైర్ ఫైటర్స్ పోస్టుల భర్తీకి ఈ డ్రైవ్ నిర్వహించారు. ఇంటర్ ఉత్తీర్ణులైన 18 నుంచి 24 ఏళ్ల యువత జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. 1600 మీటర్ల పరుగు, బరువు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వివరాలు తర్వాత వెల్లడిస్తామని నిర్వాహకులు తెలిపారు. రైస్ మిల్లులో విజిలెన్స్ తనిఖీలు కొత్తూరు: కడుము గ్రామంలో అరసా ట్రేడర్స్ రైస్ మిల్లులో శనివారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ బి.సింహాచలం, ఎస్ఐ టి.రామారావు, సీఎస్‌డీటీ భీమారావులు తనిఖీలు నిర్వహించారు. ఇటీవల 50 కిలోల బరువు గల 700 పీడీఎస్ బియ్యం బస్తాలను పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పి.కోనవలస చెక్‌పోస్టు విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్‌ను విచారణ చేయగా.. కొత్తూరు మండలంలో టీడీపీ నేత, కడుము ఎంపీటీసీకి చెందిన అరసా రైస్ మిల్లు నుంచి బియ్యం తీసుకొస్తున్నట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో జిల్లా విజిలెన్స్ అధికారులు మిల్లులో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వీఆర్వో చిన్న లోకేష్ పాల్గొన్నారు. కాగా, కొత్తూరు, తదితర మండలాల్లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని చిల్లర వర్తకుల ద్వారా కొనుగోలు చేసి పాచిపెంట మీదుగా ఒడిశా రాష్ట్రానికి తరలిస్తున్నట్లు సమాచారం. -
పచ్చని ఉద్దానంలో విధ్వంసం తగదు
వజ్రపుకొత్తూరు రూరల్/మందస : పచ్చని చెట్లతో కోనసీమను తలపిస్తూ జిల్లాకు వరంగా ఉన్న ఉద్దాన ప్రాంతాన్ని కార్గో ఎయిర్ పోర్టు పేరుతో విధ్వంసం చేయడం తగదని వామపక్ష నాయకులు అన్నారు. జీడి, కొబ్బరిపంటలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఉద్దాన రైతులను నిరాశ్రయులను చేయడం ఎంత వరకు సమంజసమో చెప్పాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడును ప్రశ్నించారు. ఉద్దాన ప్రాంత బాధిత గ్రామాల్లో శనివారం రైతులతో కలిసి కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా వామపక్షాల నాయకులు చైతన్య ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్షులు కొమర వాసు, జోగి అప్పారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి భూములను నమ్ముకున్న జీవనోపాధి సాగిస్తున్న ప్రజలను అభివృద్ది పేరుతో పొట్ట కొట్టడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కొంత కాలంగా గ్రామస్తులు ఉద్యమాలు చేస్తున్నా కనీసం పట్టించుకోకుండా సర్వేలు చేపట్టడం దారుణమని మండిపడ్డారు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, విశాఖపట్నం లాంటి నగరాలకు అనుసంధానంగా కార్గో ఎయిర్ పోర్టులు ఉన్నాయని, దేశంలో ఎక్కడా ప్రత్యేక కార్గో ఎయిర్ పోర్టు లేదని గుర్తు చేశారు. పచ్చని ఉద్దానాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం మానుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, కార్గో ఎయిర్ పోర్టు పోరాట కమిటీ నాయకులు కోనారి మోహన్‌రావు, బత్తిని లక్ష్మణ్, పోతనపల్లి కుసుమ, డి.హరికృష్ణ, కె.రమేష్, జోగి కోదండరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న డ్రైవర్ల సమ్మె
జయపురం: తమ డిమాండ్ల సాధనకు డ్రైవర్లు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు బస్సులు, వాహనాలు నిలిపిపోవడంతో ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతర ప్రాంతాల నుంచి ట్రక్కులు రాకపోవడం వలన నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. అలాగే సమ్మెలో ట్యాంకర్ల డ్రైవర్లు కూడా పాల్గొనటం వలన పెట్రోలు, డీజిల్ స్టాక్ తగ్గి కొరత ఏర్పడింది. దీంతో పెట్రోలు బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. ఇదిలా ఉండగా డ్రైవర్ల సమ్మెకు పలు రాజకీయ నేతలు మద్దతు పలుకుతున్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రబినారాయణ నందో సమ్మె చేస్తున్న డ్రైవర్లకు మద్దతుగా వారితో కూర్చున్నారు. అలాగే బొరిగుమ్మలో ఆందోళన జరుపుతున్న డ్రైవర్లకు బొరిగుమ్మ సమితి జర్నలిస్టులు మద్దతు తెలుపుతూ ధర్నాలో కూర్చున్నారు. -
ఇదేనా బాధ్యత..!
ఏదీ భద్రత ఏదీ ప్రమాదాల నివారణ.. నిరంతర నిఘా.. హైవే రోడ్లపై ఇసుక, కంకర, ఊక, ఆయిల్ మరే ఇతర లోడులైనా ఒరిగిపడిపోయినప్పుడు వాటిని తక్షణమే క్లియర్ చేయాల్సిన బాధ్యత కన్సష్నర్లది (రోడ్డు కాంట్రాక్టర్లది). ఒకవేళ వాహనాలు బ్రేక్ డౌన్ అయ్యి ఆగినా, ప్రమాదాలకు గురై ఎక్కువ సేపు నిలిచినా చుట్టూరా రేడియం స్టిక్కర్లు అంటించాలి. ఆ ప్రదేశంలో సూచీ బారికేడ్లు పెట్టాలి. కన్సస్నర్లు బాధ్యత విస్మరిస్తే ఇలాంటి ఒకట్రెండు నిర్లక్ష్యాలను చూసి ఎన్హెచ్ఐ వారు రెండు నోటీసులు జారీ చేస్తారు. అప్పటికీ మించితే వారిని తొలగిస్తారు. పబ్లిక్ ఏం చేయాలి.. రోడ్లపై ఇటువంటి దృశ్యాలు కనిపించినప్పుడు 1033 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. ఎచ్చెర్ల / శ్రీకాకుళం క్రైమ్: రహదారి భద్రత మనందరి బాధ్యత. చక్కటి నినాదం. కానీ భద్రత పాటిస్తున్నదెవరు? అంత బాధ్యతగా మెలుగుతున్నదెవరు. పై వాక్యాలకు నిదర్శనం ఈ చిత్రం. ఎచ్చెర్ల మండలంలోని కొయ్యరాళ్లు జంక్షన్లో సర్వీస్ రోడ్లోకి ఎంటరయ్యే ప్రదేశం ఇది. చూడండి ఎంత ఇసుక రోడ్డు మీద ఒలిగిపోయిందో.. ఈ ఇసుక కారణంగా గురువారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు చాలా మంది వాహనాలు ఇక్కడ అదుపుతప్పి స్కిడ్ అయ్యాయి కూడా. ఇసుకను తరలించే వాహనదారులు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. రహదారి బాధ్యతను పర్యవేక్షించాల్సిన అధికారులు కంట పడలేదో.. పడినా ఫిర్యాదు రాలేదు కదా అని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారో.. వాహనదారులకు మాత్రం చుక్కలు కనబడ్డాయి. ప్రమాదాలకు ఆస్కారమైన.. వాహనాల రాకపోకలు అధికంగా సాగే జాతీయ రహదారిపై నిరంతరం సేవలందించే హైవే పెట్రోల్ సిబ్బంది దృష్టి కూడా ఈ ప్రాంతంపై పడలేదు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10, రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంటూ ప్రమాదాల కట్టడికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని చెప్పే వీరెవరి కంటినీ శుక్రవారం ఉదయం నుంచి ఈ ఇసుక రేణువు తాకలేదు. వాహనాల నుంచి ఇసుక జారిపోతున్నా పట్టించుకోని వైనం జాతీయ రహదారిపై ఎక్కడ పడితే అక్కడే ఇసుక మేటలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్న ఇసుక వాహనాల నిర్వాహకులు ప్రమాదాలకు ఆలవాలంగా మారిన హైవే కటింగ్ పాయింట్లు చిత్రం చెప్పిన కథ -
ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి
భువనేశ్వర్: రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా శాసనసభ నుంచి పార్లమెంటు వరకు సుదీర్ఘ కాలం విజయవంతంగా బాధ్యతలు నిర్వహించిన కేంద్రమంత్రి జుయెల్ ఓరాం ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగనున్నట్లు శనివారం ప్రకటించారు. సంబలపూర్ గంగాధర్ మెహర్ విశ్వవిద్యాలయంలో పాల్గొన్న కార్యక్రమంలో ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఆయన సుందరగడ్ పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర దళిత వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. సంబల్పూర్లో జరిగిన జాబ్‌మేళాలో ఈ ప్రకటన చేశారు. పోటీ నుంచి వైదొలగి యువతకు అవకాశం కల్పించాలనే దృక్పథంతో ఈ యోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వరుసగా 6 సార్లు పార్లమెంటు సభ్యునిగా, 2 సార్లు రాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఈ బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వహించగలిగినట్లు పేర్కొన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరమైనా పార్టీ కార్యకలాపాలు, సంస్థాగత వ్యవహారాల్లో చివరివరకు అంకిత భావంతో సేవలందించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. రాజకీయ వర్గాల్లో ఉలికిపాటు రాష్ట్ర ప్రజాప్రతినిధుల్లో పార్టీలకు అతీతంగా జుయెల్ ఓరాం సీనియర్ గిరిజన రాజకీయ నాయకుడు కావడం విశేషం. తాను ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాలను ఉలికిపాటుకు గురి చేసింది. ప్రస్తుతం ఆయన కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహంచిన 6 పర్యాయాల్లో గిరిజన వ్యవహారాల మంత్రిగా వరుసగా మూడోసారి బాధ్యతలు నిరవధికంగా కొనసాగిస్తున్నారు. ప్రజా ప్రాతినిథ్య రంగంలో జుయెల్ ఓరం 3 దశాబ్ధాలు పైబడి తిరుగులేని నాయకుడిగా కొనసాగుతు పలు మైలురాళ్లని అధిగమించారు. రాష్ట్ర శాసనసభకు 1990, 1998 ఎన్నికల్లో పోటీ చేసి విజేతగా నిలిచారు. అలాగే సుందర్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా 6 సార్లు ఎన్నిక కావడం విశేషం. 1999 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ క్యాబినెట్ మంత్రిగా కొనసాగారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వరుసగా 3 సార్లు బాధ్యతలు నిర్వహించారు. జాతీయ ఉపాధ్యక్షుడిగా ఒక పర్యాయం కొనసాగారు. పలు కీలకమైన సంస్థాగత పదవులు, హోదాల్లో తనదైన ఉనికిని బలంగా చాటుకున్నారు. కేంద్రమంత్రి జుయెల్ ఓరాం -
● నడకయాతన
రాయగడ జిల్లాలోని మునిగుడ సమితి నియమగిరి పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న మునిఖోల్ పంచాయతీ పరిధిలోని 14 గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామాల్లో నివసించేవారు అందరూ డొంగిరియా తెగకు చెందిన ఆదివాసీలే. డొంగిరియా ప్రజల ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం డొంగిరియా కొంధొ డవలప్మెంట్ ఏజెన్సీ (డీకేడీఏ) పేరిట ప్రత్యేక ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. డొంగిరియాలు నివసించే గ్రామాలను అభివృద్ధి చేయడం, మౌలిక సౌకర్యాలు కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. అయితే ప్రతీ ఏడాది రూ.కోట్లలో నిధులు విడుదలవుతున్నా, ఆయా గ్రామాల్లో అభివృద్ధి జాడలు కనిపించడం లేదు. అసలే వర్షాకాలం కావడంతో రహదారులు బురదమయంగా మారాయి. అందువలన ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామాలకు రహదారుల సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరుతున్నారు. – రాయగడ -
నాగలికి ప్రేమికులను కట్టి..
ఒడిశా: ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరిని ఊరు వెలి వేసింది. అంతే కాదు గ్రామ పెద్దలు గ్రామసభలో వారికి దండన విధించారు. ఇద్దరినీ నాగలికి రెండువైపులా కట్టి పొలం దున్నే పనులు చేయించారు. పొలం దున్నే సమయంలో ఇద్దరినీ కర్రలతో కొట్టారు. ఈ అవమానకర ఘటన జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి సికరపాయి సమితి కొంజొమాజొడి గ్రామంలో వారం కిందట జరిగింది. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం నాడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతొ విషయం బయటకు పొక్కింది. వివరాల్లోకి వెళితే... కొంజొమాజొడి గ్రామంలో లకసరక (27) అనే యువకుడు అదే గ్రామంలో కొడియా సరక (32) లు నివసిస్తున్నారు. వరుసకు కొడియా సరక లక సరకకు పిన్ని అవుతుంది. అయితే ఇద్దరి మధ్య గత కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. ఇద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమించకున్నారు. అనంతరం కొద్ది రొజుల క్రితం ఇద్దరూ ఊరు విడిచి బయటకు వెళ్లి వివాహం చేసుకున్నారు. విషయం గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు తెలిసింది. ఇద్దరిని గ్రామానికి రప్పించారు. గ్రామ సభను నిర్వహించారు. గ్రామ కులదేవత వద్ద ఇద్దరికీ స్నానం చేయించారు. గ్రామ కట్టుబాట్లను కాలరాసినందుకు దండన విధించారు. వెదురు కర్రలతొ రూపొందించిన నాగలికి రెండు వైపులా ఇద్దరిని అందరి సమక్షంలో కట్టి ఎద్దులను కొట్టినట్టు కొట్టి పొలం దున్నే పనులను చేయించారు. అనంతరం వారిని ఊరి నుండి వెలివేశారు. విషయం బయటకు పొక్కడంతో గ్రామానికి చేరుకున్న విలేకరులకు కొందరు విషయం చెప్పారు. Odisha: Tribal couple yoked like cattle, beaten & exiled for marrying secretly.In 2025. In India. A young couple tied to a bamboo yoke, forced to plough fields, paraded & humiliated — just for falling in love against “custom.”And then Haryana: Radhika Yadav. 25. National… pic.twitter.com/99Jgd5Zx45— Deepti Sachdeva (@DeeptiSachdeva_) July 11, 2025 -
ఊహాగానాలు
మంత్రి మండలి విస్తరణపై..భువనేశ్వర్: రాష్ట్ర మంత్రి మండలి విస్తరణ శుభ ఘడియల కోసం పలువురు ఆశావాదులు ఉవ్విళ్లూరుతున్నారు. మన్మోహన్ సామల్ మరో మారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి మంత్రి మండలి విస్తరణపై ఉత్కంఠ బిగుసుకుంది. రాష్ట్రంలో తొలి సారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మన్మోహన్ సామల్ కీలక పాత్ర పోషించి అధిష్టానం మన్ననలు పొందారు. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కూడా ఆయన దక్షతని ప్రత్యక్షంగా చాటుకున్నారు. బీజేపీ ఏడాది పాలన కాలంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏడాది పాలనలో ఒడిదొడుకుల్ని సవరిస్తూ ప్రభుత్వంలో, సొంత పార్టీలో లుకలుకల్ని పరిష్కరించిన అనుభవజ్ఞుడిగా మంత్రి మండలి విస్తరణకు వ్యూహాత్మకంగా రూపొందిస్తారనే నమ్మకం సర్వత్రా నెలకొని ఉంది. వాస్తవానికి మోహన్ చరణ్ మాఝి కొలువులో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. పలువురికి బహుళ శాఖలు కేటాయించారు. బాధ్యతల ఒత్తిళ్లతో కొన్ని శాఖల పని తీరు సంతృప్తికరంగా కొనసాగడం లేదు. కీలకమైన శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న వారి నుంచి బహుళ శాఖల బాధ్యతల్ని తొలగించి పాలన దక్షతనకు పదును పెట్టి రాష్ట్ర బహుముఖాభివృద్ధికి నడుం బిగించాల్సిన సమయంలో స్ఫూర్తిదాయకమైన మంత్రి వర్గాన్ని మన్మోహన్ సామల్ ఆవిష్కరిస్తారని సర్వత్రా చర్చ సాగతుంది. మరో వైపు మంత్రులుగా శాఖల కార్యాచరణ, అనబంధ పురోగతి నామ మాత్రంగా కొనసాగుతున్న వారి వైపు దృష్టి సారించే అవకాశం ఉంది. ఏడాది పాలనలో సంతృప్తికరమైన పురోగతి లేని శాఖల్లో అమాత్యుల మార్పు అనివార్యం అనిపిస్తోంది. పాత ముఖాల్ని తొలగించి ప్రభుత్వ ఆశయాల వాస్తవ కార్యాచరణ పట్ల అంకిత భావంతో ఔత్సాహికంగా ముందుకు వస్తున్న వారిలో కొంత మందికి విస్తరణలో చోటు ప్రసాదించేందుకు అనుకూలత నెలకొని ఉంది. బీజేపీ ఏడాది స్వల్ప వ్యవధి పాలనలో ఆరోగ్య, న్యాయ శాఖలు వివాదాస్పదమయ్యాయి. ప్రధానంగా పూరీ శ్రీ జగన్నాథుని రథ యాత్ర నిర్వహణ తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. ఏడాది వ్యవధిలో వరుసగా 2 సార్లు నిర్వహించిన జగన్నాథుని రథ యాత్రలో పలు అపశృతులు చోటు చేసుకున్నాయి. శ్రీ మందిరానికి భద్రత లోపించిది. స్వామి భక్తులకు రక్షణ కొరవడిందనే ఆరోపణలు రాష్ట్రేతర ప్రాంతాలకు వ్యాపించాయి. ఇలాంటి అవమానకర పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుని మంత్రి మండలి సంస్కరణలకు శ్రీకారం చుట్టాల్సి ఉందని విశ్లేషకులు హితవు పలుకుతున్నారు. ఖాళీ స్థానాల భర్తీపై ఉత్సాహం ఉరకలేస్తుండగా ఉద్వాసనకు చేరువలో ఉన్న వారికి గుండె దడ పెరుగుతోంది. ఇటీవల ఏడాది పాలన పూర్తి పురస్కరించుకుని పలు శాఖలు, మంత్రుల పని తీరు, పురోగతి వగైరా సమాచారం ముందస్తుగా సేకరించి విశ్లేషించారు. ఈ విశ్లేషణ ఆధారంగా పలు శాఖల్లో పెను మార్పులు చోటు చేసుకోవడం తథ్యం. మంత్రి వర్గ విస్తరణ, కొత్త వారికి పదవుల కేటాయింపు విషయాల్లో ప్రభావ వంతుల ప్రమేయానికి కళ్లెం పడుతుందని మన్మోహన్ సామల్ సన్నిహిత వర్గాల భోగట్టా. అధికార పార్టీ పరువు, ప్రతిష్టల్ని వీధికి ఈడ్చిన సంఘటనల తెర వెనక ప్రముఖుల చొరవకు అడ్డుకట్ట వేసి వికసిత్ ఒడిశా ఆశయ సాధనకు సానుకూల మంత్రి మండలి ఏర్పాటుకు మార్గం సుగమం చేసే యోచన తుది మెరుగులు దిద్దుకుంటుది. లింగ, కులం, ప్రాంతీయ ప్రాతిపదికన మంత్రి మండలిలో స్థానం కల్పించే సమీకరణాలపై గణాంకాలు కొనసాగుతున్నాయి. ప్రజాదరణ, విద్యాధిక్యత, వ్యూహాత్మక సమన్వయం ప్రామాణికలతో మహిళలు ఇతర వర్గాలకు పట్టం గట్టే అవకాశం ఉంది. అన్ని లోక్ సభ నియోజక వర్గాల నుండి రాష్ట్ర మంత్రి మండలి ప్రాతినిధ్యంపై దష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. సిట్టింగులకు గుండె దడ కొత్తవారిలో ఉత్సాహం బోర్డులు, కార్పొరేషన్లకు నియామకాలు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన పలు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, అకాడమీలు, కమిషన్లు వగైరా సభ్యుల నియామకం నోచుకోలేదు. మంత్రి మండలి విస్తరణతో ఆయా పదవుల్ని భర్తీ చేస్తారని భావిస్తున్నారు. పార్టీ అంతర్గత పోటీ ప్రభావంతో ఈ పదవుల భర్తీలో జాప్యం చోటు చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి యథాతథం రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝి యథాతథంగా కొనసాగుతారని ఇటీవల ఒక సందర్భంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ ప్రకటించారు. ఈ ప్రకటన వీరివురి మధ్య సమన్వయం, సమభావన యోచనల్ని ప్రతిబింబిస్తుంది. రథ యాత్రలో గందరగోళం, భువనేశ్వర్ నగర పాలక సంస్థ అధికారిపై దాడి వంటి సంఘటనల వెనక ప్రభావవంతమైన గ్రూపు నాయకులను పక్కన పెట్టి అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి మంత్రి మండలి విస్తరణ, ప్రభుత్వ రంగ సంస్థల సభ్యుల నియామకంలో ఒక ప్రధాన నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది. మోహన్ చరణ్ మాఝికి ముఖ్యమంత్రిగా పట్టం గట్టడంతో ఆది నుంచి ఒక వర్గం సమస్యాత్మక పరిస్థితుల్ని ప్రేరేపించి అవాంఛనీయ అలజడి రేపుతున్నట్లు సాగుతున్న ప్రచారంపై పార్టీ అధిష్టానం దృష్టిని కేంద్రీకరించింది. -
విద్యార్థులకు వక్తృత్వ పోటీలు
పర్లాకిమిడి: ఒడిశా సాహిత్య అకాడమీ స్వర్ణోత్సవాలు పురస్కరించుకొని స్థానిక మహేంద్రగిరి పురపాలక ఉన్నత పాఠశాలలో ప్రబంధాలు, వక్తృత్వ, కవితాపఠనం, సాహిత్యం, జనలర్ నాలెడ్జిపై జిల్లాస్థాయి పోటీలు శనివారం నిర్వహించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా విశ్రాంత ఉపాధ్యాయులు బినో ద్ చంద్ర జెన్నా, ఉపాంత ప్రహారి పూర్ణచంద్ర మహాపాత్రో, విశ్రాంత హెచ్ఎం శ్వేతా పట్నాయక్, బిచి త్రా నంద బెబర్తా, బినోదిని సైన్సు కళాశాల అధ్యక్షుడు మనోజ్ పట్నాయక్, మహిళా స్నాతక ఉన్నత విద్యాలయం అధ్యాపకులు భారతీ పాణిగ్రాహి, ఒడియా అధ్యాపకురాలు డా.చారుప్రభానాయక్, ఉపాధ్యాయులు శ్యాం సుందర గంతాయత్, శశిభూషన్ పట్నాయిక్ తదితరులు వ్యవహరించారు. -
ఎమ్మెల్యే నియోజక వర్గంలో విపక్ష సభ్యుల ఆందోళన
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ నీలగిరి నియోజక వర్గం ఎమ్మెల్యే సంతోష్ ఖటువా అరెస్టు డిమాండ్‌తో ఆందోళన క్రమంగా ఉద్ధృతం అవుతుంది. బిజూ జనతా దళ్ మహిళా నా యకురాలి పట్ల అసభ్య పదజాలంతో అవమానకర అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణ. సిటింగ్ ఎమ్మెల్యే అరెస్టు నినాదంతో ఆయన సొంత నియోజక వర్గం నీలగిరి ప్రాంతంలో శుక్రవారం ఽనిరసన సభ నిర్వహించారు. పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ ఖటువా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. బిజూ మహిళా జనతా దళ్ అధ్యక్షురాలు స్నేహంగిని చురియా, మాజీ మంత్రి సుదాం మ రాండి, జిల్లా అధ్యక్షులు జ్యోతి ప్రకాష్ పాణి గ్రాహి, ఎమ్మెల్యేలు అశ్విని కుమార్ పాత్రో, సంజీవ్ మల్లిక్, బిజూ యువ జనతాదళ్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బ్యోమకేష్ రాయ్ తదితర ప్రముఖ కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. -
రాష్ట్రపతి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ఈనెల 15న కటక్ నగరంలో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన పురస్కరించుకుని కటక్, భువనేశ్వర్ జంట నగరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా ఆయా ప్రదేశాలను ప్రత్యక్షంగా సందర్శించి క్షేత్రస్థాయిలో భద్రత మరియు ట్రాఫిక్ ఏర్పాట్లను సమీక్షించారు. డీజీపీతో పాటు భువనేశ్వర్, కటక్ జంట నగరాల పోలీస్ కమిషనర్, కటక్ జిల్లా మేజిస్ట్రేట్, కటక్ నగర డీసీపీ, ఇతర సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.బంగ్లాదేశ్ రోహింగ్యాల గుర్తింపు ప్రారంభం కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లాలో రాయిఘర్ సమితిలో బెంగాలీ శరణార్థ గ్రామాల్లో బంగ్లాదేశ్ రోహింగ్యాల గుర్తింపు ప్రారంభమైంది. శుక్రవారం ఆ ప్రాంతంలో 59 మంది చొరబాటుదారులు ఉన్నట్లు ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. వీరు 1971కి ముందు ఈ ప్రాంతానికి వచ్చినట్లు ప్రభుత్వ నివేదికల్లో ఉంది. అందులో పది మందిని రాయిఘర్ పోలీస్ స్టేషన్ పిలిపించారు. వారి ధ్రువీకరణ పత్రాలు పరిశీ లించారు. వీరు చాలా కాలంగా ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నట్లు అధికారులు ధ్రువీకరించారు. కానీ పోలీసులు గుర్తించిన వారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారే కానీ రొహింగ్యాలు కాకపొవడం విశేషం.వృద్ధులకు దుస్తులు పంపిణీ రాయగడ: స్థానిక బ్యూటీపార్లర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తుంబిగుడ వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం చేపట్టారు. సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ మిశ్రో నేతృత్వంలో సంఘం సభ్యు లు వృద్ధాశ్రమంలో ఉంటున్న మహిళలకు చీర లు, పురుషులకు లుంగీ, టవల్లు అందజేశా రు. ప్రతీ ఏడాది ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సంఘం సభ్యులు సంక్షేమ నిధికి విరాళాలు అందిస్తుంటారని, అందులో కొంతభాగంగా ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటామని చెప్పారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి శైలసూత సాహు, ఉపాధ్యక్షురాలు శివానీ పలక తదితరులు పాల్గొన్నారు. భారీగా గంజాయి స్వాధీనం కొరాపుట్: మూడు వేర్వేరు ఘటనల్లో 27 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి పంధాలుంగ్ గ్రామ పంచాయతీ పరిధి జయంతిగిరి, చెటోడిపుట్ గ్రామాల్లో ఎకై ్సజ్ సిబ్బంది శుక్రవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో గంజాయితో పాటు 12 లీటర్ల దేశీ మద్యం పట్టుబడింది. దీంతో సిర్మే ఖొరా, జయరాం పంగి, బల్కి పంగి అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ రథ్ ప్రకటించారు. విప్ప పువ్వు స్వాధీనంరాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి గోరఖ్‌పూర్ గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నాటుసారా తయారీకి వినియోగించే విప్పపువ్వు బస్తాలను ఎకై ్సజ్ శాఖ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గోరఖ్‌పూర్‌లో నివసిస్తున్న జేఎన్ సాహు అనే వ్యక్తికి చెందిన గోదాంలో విప్పపూవును నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఎకై ్సజ్ సిబ్బంది దాడులను నిర్వహించారు. దాడుల్లో ఎంత మొత్తం విప్పపువ్వు స్వాధీనం చేసుకున్నది తెలియజేయలేదు. నిందితుడు సాహును అదుపులోని తీసుకున్నట్లు సమాచారం. -
నకిలీ విదేశీ మద్యం పట్టివేత
జయపురం: కొరాపుట్ జిల్లాలో దేశీయ సారా, కల్తీ విదేశీ మద్యం వరదలై పారుతోంది. కొరాపుట్ జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రజలకు రక్షిత తాగునీరు లభించటం లేదుగాని నాటుసారా, కల్తీ విదేశీ మద్యం లభించని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. అబ్కారీ సిబ్బంది ఎన్ని దాడులు జరిపి ఎంత మందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టుతున్నప్పటికీ అక్రమ మద్యం వ్యాపారం ఆగడం లేదు. ఈ పరిస్థితిలో కొరాపుట్ జిల్లా అబ్కారీ ఉన్నతాధికారి అరుణ కుమార్ పాఢీ సారా ప్రవాహాన్ని అరికట్టాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఉన్నతాధికారి ఆదేశంతో నందపూర్ అబ్కారీ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ రథ్ నేతృత్వంలో జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ అబ్కారీ అధికారి భగవాన్ మహానందియ అతని సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా దాడులు జరుపుతున్నారు. ఇందులో భాగంగా గురువారం నాటు సారా, సొలప కల్లుతో పాటు కల్తీ విదేశీ మద్యం, బీరులను పట్టుకున్నట్లు బొయిపరిగుడ అబ్కారీ అధికారి భగవాన్ మహా నందియ శుక్రవారం వెల్లడించారు. టీమ్ బొయిపరిగుడ సమితి చంద్రగండిగుడ బాలిగాం గ్రామా ల ప్రాంతంలో చట్ట వ్యతిరేకంగా నకిలీ విదేశీ మద్యం అమ్ముతున్నారని సమాచారం అందడంతో వెంటనే తాము చంద్రషుండిగుడ గ్రామానికి వెళ్లి ఆ గ్రామంలో లుకునాథ్ బిశాయి ఇంటిపై దాడి చేయడంతో అమ్మేందుకు ఉంచబడిన 2.160 లీటర్ల నకిలీ విదేశీ మద్యంతో పాటు 6.600 లీటర్ల నకిలీ బీర్‌ను సీజ్ చేసినట్లు వెల్లడించారు. అలాగే ఆ గ్రామంలో బినోద్ బిశాయి ఇంటిపై దాడి జరిపి 30 లీటర్ల సొలప కల్లు, తొమ్మిది లీటర్ల నాటు సారా సీజ్ చేసినట్లు వెల్లడించారు. వాటితో పాటు బలిగాం గ్రామం సుభాష్ డాకువ ఇంట్లో దాచి ఉంచిన 2.340 లీటర్ల నకిలీ విదేశీ మద్యంతో పాటు 25.650 లీటర్ల బీర్లను పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ సంఘటనలలో నలుగురిని అరెస్టు చేసినట్లు అబ్కారీ అధికారి భగవాన్ మహానందియ వెల్లడించారు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. నలుగురి అరెస్టు -
పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన బైకిస్టు
జయపురం: ఛతీస్‌గఢ్ రాష్ట్ర పోలీసు వాహనాన్ని ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైకిస్టుతోపాటు కానిస్టేబుల్ గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి ఛతీస్‌గఢ్ రాష్ట్రం సుకుమ జిల్లా టుంప పోలీసుస్టేషన్ సిబ్బంది కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఇంతలో ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు అరుకులో ఉన్నట్లు తెలుసుకున్నారు. వెంటనే వారు కొరాపుట్ జిల్లాకు వచ్చి సెమిలిగుడ పోలీసుల సహకారంతో నిందితుడుని పట్టుకోగలిగారు. అతడిని బొయిపరిగుడ, మల్కనగిరిల మీదుగా సుకుమకు తీసుమకు గురువారం రాత్రి తీసుకెళ్తున్నారు. రాత్రి పది గంటల సమయంలో బోయిపరిగుడలోని పెట్రోల్ పంపు సమీపంలోని డాబా హోటల్ వద్ద భోజనాలు చేసేందుకు వెళ్తున్న సమయంలో బలిగుడ గ్రామానికి చెందిన ప్రఫుల్ల మడకామి ద్విచక్ర వాహనంపై రామగిరి గ్రామం నుంచి వస్తూ పోలీసు వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ఘటనలో బైకిస్టు ప్రఫుల్ల మడకామి, పోలీసు వాహనం డోర్ పక్కన కూర్చున్న పోలీసు హవల్ధార్ అరేంద్ర యాదవ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలిసిన బొయిపరిగుడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. హవల్దార్ చెవికి పెద్ద గాయమవ్వగా.. ప్రఫుల్ల మడకామికి తలపై బలమైన గాయమైంది. ప్రాథమిక చికిత్స తరువాత ప్రఫుల్లను జయపురం జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. పోలీసు కానిస్టేబుల్ అరెంద్ర యాదవ్ ను ఛత్తీస్గడ్ రాష్ట్రం సుకుమ జిల్లా టుంపకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్, బైకిస్టుకు గాయాలు -
● నాగలికి ప్రేమికులను కట్టి..
రాయగడ: ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరిని ఊరు వెలి వేసింది. అంతే కాదు గ్రామ పెద్దలు గ్రామసభలో వారికి దండన విధించారు. ఇద్దరినీ నాగలికి రెండువైపులా కట్టి పొలం దున్నే పనులు చేయించారు. పొలం దున్నే సమయంలో ఇద్దరినీ కర్రలతో కొట్టారు. ఈ అవమానకర ఘటన జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి సికరపాయి సమితి కొంజొమాజొడి గ్రామంలో వారం కిందట జరిగింది. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం నాడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతొ విషయం బయటకు పొక్కింది. వివరాల్లోకి వెళితే... కొంజొమాజొడి గ్రామంలో లక సరక (27) అనే యువకుడు అదే గ్రామంలో కొడియా సరక (32) లు నివసిస్తున్నారు. వరుసకు కొడియా సరక లక సరకకు పిన్ని అవుతుంది. అయితే ఇద్దరి మధ్య గత కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. ఇద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమించకున్నారు. అనంతరం కొద్ది రొజుల క్రితం ఇద్దరూ ఊరు విడిచి బయటకు వెళ్లి వివాహం చేసుకున్నారు. విషయం గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు తెలిసింది. ఇద్దరిని గ్రామానికి రప్పించారు. గ్రామ సభను నిర్వహించారు. గ్రామ కులదేవత వద్ద ఇద్దరికీ స్నానం చేయించారు. గ్రామ కట్టుబాట్లను కాలరాసినందుకు దండన విధించారు. వెదురు కర్రలతొ రూపొందించిన నాగలికి రెండు వైపులా ఇద్దరిని అందరి సమక్షంలో కట్టి ఎద్దులను కొట్టినట్టు కొట్టి పొలం దున్నే పనులను చేయించారు. అనంతరం వారిని ఊరి నుండి వెలివేశారు. విషయం బయటకు పొక్కడంతో గ్రామానికి చేరుకున్న విలేకరులకు కొందరు విషయం చెప్పారు. -
ఒడిశాను అదానీ నడిపిస్తున్నాడు: రాహుల్
భువనేశ్వర్: ‘రాజ్యాంగాన్ని కాపాడదాం’ నినాదంతో రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక బారముండా మైదానంలో భారీ బహిరంగ సభని ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ఆయనతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతు రాష్ట్రంలో ప్రజా దోపి డీ ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. ఒడిశా ను అదానీ నడిపిస్తున్నాడని ఆరోపించారు. భారతీ య జనతా పార్టీ దేశ వ్యాప్తంగా రాజ్యాంగ విలువల్ని నిలువునా నీరు గార్చుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నీరు, అడవి, భూమి గిరిజనులకే చెందుతాయి. ఇక్కడ గిరిజనులకు వారి భూమి పట్టాలు ఇవ్వడం లేదు. ఇది ప్రజల ప్రభుత్వం కాదు. ఇది కోటీశ్వరు ల ప్రభుత్వం. ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్న ప్రభుత్వం’గా వ్యాఖ్యానించారు. అణగారిన వర్గాలకు అండ గా కాంగ్రెస్ నిలబడుతుందన్నారు. ముందస్తు సంప్రదింపులు లేకుండా గిరిజనులను బలవంతంగా తరలించి భూమి హక్కులను తిరస్కరించడాన్ని తీవ్రంగా ఖండించారు. పెసా అమలు అణగదొక్కి ఈ వర్గపు ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని తెలిపారు. నిజమైన యాజమాన్యాన్ని పునరుద్ధరించడానికి పెసా చట్టం, గిరిజన బిల్లును కాంగ్రెస్ అమలు చేస్తుందని హామీ ఇచ్చింది. ఎన్నికల సమగ్రతను కాపాడటానికి కాంగ్రెస్ నిర్విరామంగా ఉద్యమిస్తుంది. ఎన్నికల సంఘం అధికార భారతీయ జనతా పార్టీ ఏజెంట్‌గా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మహారాష్ట్రలో ఒక కోటి మంది బూ టకపు ఓటర్ల ఆవిష్కరణ దీనికి నిలువెత్తు తార్కాణంగా పేర్కొన్నారు. బీహార్‌లో ఫలితాలను తారుమారు చేయడానికి ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించారు. ఎన్నికలను హైజాక్ చేయడానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రతిఘటిస్తుందని సభాముఖంగా ప్రకటించారు. మహిళలకు కాంగ్రెస్ అండగా నిలబడుతుందన్నా రు. రాష్ట్రంలో మహిళలకు భద్రత పూర్తిగా లోపించిందని, 40 వేల మందికి పైగా మహిళలు అదృశ్యం కావడం దిగ్భ్రాంతికరమైన అంశంగా పేర్కొన్నారు. ఈ దుస్థితి పట్ల రాష్ట్ర ప్రభుత్వం పెదవి కదపకుండా చోద్యం చూస్తుందన్నారు. రాష్ట్రంలో రోజుకు సగటున 15 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నట్లు తాజా విశ్లేషణలు తేల్చడం పట్ల విచారం వ్యక్తం చేశారు. అదానీ కోసం శ్రీ జగన్నాథుని రథం నిలిపి వేశార ని ఆరోపించారు. ఒడిశాను అదానీ నడిపిస్తున్నాడు అని బహిరంగంగా దుయ్యబట్టారు. ఇటీవల ముగిసిన పూరీ శ్రీ జగన్నాథుని పవిత్ర రథయాత్ర సమ యంలో ఆచార, సంప్రదాయ విరుద్ధమైన సంఘటనలు చోటు చేసుకోవడం అపచారంగా పేర్కొన్నా రు. అదానీ కుటుంబానికి అనుకూలంగా రథాలను నిలిపి వేశారని ఆరోపించారు. ఇక్కడి ప్రభుత్వం ప్రజల కంటే కోటీశ్వరులకు సేవ చేస్తోందనేందుకు ఇదో ఉదాహరణగా పేర్కొన్నారు. పేదలు, గిరిజను లు, దళితులు, రైతులు మరియు కార్మికులకు అండ గా నిలిచేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ధైర్య సింహాలుగా అహర్నిశలు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది: మల్లికార్జున్ ఖర్గే అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కొత్తగా సాధించిది ఏమీ లేదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిన ప్రయజనాత్మక ఫలి తాలతో పబ్బం గడుపుకుంటోందని అఖిల భారత కాంగ్రెస్ కమిటి (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగంలో పేర్కొన్నారు. భువనేశ్వర్‌ను రాజధానిగా అప్పటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆవిష్కరించారని, కాంగ్రెస్ ప్రభు త్వం ఒడిశాలో, కేంద్రంలో ఉన్న కాలంలో రాష్ట్రం పారిశ్రామిక, ఆర్థిక, వాణిజ్య, రవాణా, విద్య, ఆరోగ్యం తదితర రంగాల్లో స్థిరపరచిన వ్యవస్థతతో బీజేపీ చెలామణి అవుతోందన్నారు. రాష్ట్రంలో పారాదీప్ పోర్టు, రౌర్కెలా స్టీల్ ప్లాంట్, హిరాకుడ్ జలాశయం, నాల్కో, ఎన్టీపీసీ, మంచేశ్వర్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, చిలికా నావల్ కోచ్లతదితర ప్రము ఖ వ్యవస్థలు కాంగ్రెస్ ఏర్పాటు చేసినవిగా పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఒడిశా ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. గట్టి బందోబస్తు రాహుల్ గాంధీ పర్యటన పురస్కరించుకుని గట్టి బందోస్తు ఏర్పాటు చేశారు. సమగ్రంగా 53 ప్లాటూ న్ల పోలీసు బలగాలతో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలను మోహరించారు. స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బరముండా స్క్వేర్, కాంగ్రెస్ భవన్,మే ఫెయిర్ హోట ల్ వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 4 మంది డీసీపీ హోదా అధికారులు, 10 మంది అదనపు డీసీపీలు, 24 మంది ఏసీపీలు, 34 మంది ఇనస్పెక్టరు ఇంచార్జిలు, 70 మంది ఇతర సీనియర్ పోలీసు సిబ్బందిని మోహరించారు. -
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
జయపురం: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని సత్యసాయి భజన మండలి సభ్యులు అన్నారు. దీనిలో భాగంగా బొరిగుమ్మ సమితి దుర్లగుడలోని షిరిడీ సాయి మందిర ప్రాంగణంలో మొక్కలను శుక్రవారం నాటారు. కార్యక్రమంలో భజన మండలి కన్వీనర్ శరత్ దాస్, ఎస్.సాయి, శివ మహంతి, కృష్ణచంద్ర పండ, బాలమ్మ, అనూరాధ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బొరిగుమ్మ సమితి బెణగాం ప్రాజెక్టు ఉన్నత పాఠశాల పరిసరాల్లో వివిధ రకాల మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీఆర్సీసీ ప్రఫుల్ల కుమార్ నాయిక్, హెచ్ఎం శ్రీకాంత కుమార్ పండ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ లీకై ఇద్దరికి గాయాలు
ఆమదాలవలస: పురపాలక సంఘ పరిధిలోని మెట్టక్కివలస పదో వార్డు వాంబే కాలనీలో గ్యాస్ లీకై ఇద్దరు గాయాల పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వాంబే కాలనీకి చెందిన గుంటుకు సరస్వతి టిఫిన్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఇంట్లో టిఫిన్ తయారు చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎదురు ఇంట్లో నివసిస్తున్న కోలా మాధవరావు ఘటనా స్థలానికి వెళ్లి మంటలు ఆర్పడానికి ప్రయత్నించగా ఆయన కూ డా గాయాల పాలయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ.70 వేల నష్టం జరిగినట్లు సమాచారం. ఎస్సై ఎస్.బాలరాజు సైతం ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. గ్యాస్ సిబ్బంది పరిశీలించి బాధితురాలి తో మాట్లాడారు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
జర్నలిస్టుల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం
జయపురం: జర్నలిస్టుల కోసం జయపురం సబ్‌డివిజన్ కుంద్రా సమితి కేంద్రంలో భవనాన్ని నిర్మించేందుకు నిధులు మంజూరు చేయనున్నట్లు కోట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర ప్రకటించారు. గురువారం సాయంత్రం కుంద్రను సందర్శించిన సందర్భంగా ఆయన్ని జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులు కలిసి సత్కరించారు. జర్నలిస్టు భవనానికి తగిన స్థలం ఎంపిక చేసి కేటాయించాలని ఎమ్మెల్యే రూపు భొత్ర కుంద్ర తహసీల్దార్ బినోద్ చంద్ర నాయిక్‌ను ఆదేశించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ను అమీన్, రెవెన్యూ సూపర్వైజర్లను స్థలం ఎంపిక బాధ్యతలను అప్పగించారు. అనువైన స్థలం గుర్తిస్తామని తహసీల్దార్ శాసనసభ్యుడుకి హామీ ఇచ్చారు. సెప్టెంబర్‌లోగా జర్నలిస్టు భవనానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన కుంద్ర సమితి ప్రాంతంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తనకు తెలియజేయాలని ఆయన జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి తాను కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ ప్రహరాజ్, కార్యదర్శి హరిష్ బెహర, సహాయ కార్యదర్శి సురేంద్ర సాగరియ, సలహాదారు అక్షర కుమార్ పట్నాయక్, న్యాయ సలహాదారు కనూచరణ నాయిక్, జర్నలిస్టులు వీర కిశోర్ శర్మ, బాబుల హరిజన్ ఉన్నారు. -
బోల్‌భం యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు
జయపురం: శ్రావణ మాసంలో పలు ప్రాంతాల నుంచి గుప్తేశ్వర్ శివ క్షేత్రానికి వేలాది మంది బోల్ భం భక్తులు వస్తారు. దీంతో గుప్తేశ్వర్‌లో బోల్‌భం భక్తులకు తగిన సౌకర్యాలు సమకూర్చే విషయమై చర్చిందేందుకు జయపురం సబ్‌కలెక్టర్ కార్యాలయ సభాగృహంలో శుక్రవారం అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. సబ్‌కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం శ్రావణ మాసం ప్రథమ సోమవారం నుంచి బోల్‌భం కావి డి దారులు వేలాది మంది వస్తారని, అందుచేత వారు ఎలా శాంతిగా, సురక్షతంగా బాబా గుప్తేశ్వర్ లో మహాశివుడుని దర్శించుకొనేందుకు చేపట్టవలసిన జాగ్రత్తలపై సమావేశంలో చర్చించారు. అలాగే శివలింగంపై భక్తులు జలాభిషేకం చేసేందుకు తగి న ఏర్పాట్లు చేయాలని సమావేశంలో నిర్ణయించా రు. గుప్తేశ్వర్‌లో నీటి సమస్య తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేయాలని సబ్‌కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే డయేరియా, అతిసార వ్యాధులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. రెండు రోజుల్లో గుప్తేశ్వర్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నరు. గుప్తేశ్వర్‌లో పారి శుద్ధ్య పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని, బోల్‌భం భక్తులు శివలింగాన్ని దర్శించుకొనేందుకు క్యూలైన్లను ఏర్పాటు చేయాలని సబ్‌కలెక్టర్ జయ పురం తహసీల్దార్ స్నిగ్ధ రాణి చౌధురి ఆదేశించారు. సమావేశంలో జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధి కారి పార్ధ కాశ్యప్, బొయిపరిగుడ ఇన్చార్జి బీడీవో శక్తి మహాపాత్రో, దేవదాయ విభాగ అధికారి చిత్తరంజన్ పట్నాయక్, బొయిపరిగుడ పోలీసు అధికా రి రక్ష్మీరంజన్ ప్రధాన్, అగ్నిమాపక విభాగ అధికారి సురేష్ బారిక్,రామగిరి పోలీసు పంటి అధికారి విష్ణు ప్రసాద్ మడకాని, రెవెన్యూ అధికారి హరిహర శతపతి, దిలీప్ ప్రధాన్‌లతో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
గండం గడిచింది!
ఎచ్చెర్ల: నడిసంద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు ప్రాణభయంతో విలవిల్లాడిపోయారు. సాయం కోసం మైరెన్, పోలీసులను ఆశ్రయించినా స్పందన లేకపోవడంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. ఈ సమయంలో మరో బోటు రావడంతో సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటన ఎచ్చెర్ల మండలం కొయ్యాం సముద్ర తీరానికి సుమారు 45 మైళ్ల దూరంలో చోటుచేసుకుంది. బాధిత మత్స్యకారులు, బోటు యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లాకు చెందిన పది మంది మత్స్యకారులు ఈ నెల 9న ఉదయం 5 గంటలకు సముద్రంలో వేటకోసం బయల్దేరారు. ఎచ్చెర్ల మండలంకొయ్యాంకు 45 మైళ్ల దూరంలో ఉండగా బోటు చెక్క పక్కకు ఒరిగిపోవడంతో లోపలికి నీరు ప్రవేశించింది. కొద్దికొద్దిగా బోటు మునిగిపోయే సూచనలు కనిపించాయి. దీంతో బోటులో ఉన్న వారు వారి యాజమాని వాసపల్లి ధనారాజ్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయన మైరెన్ సిబ్బంది, పోలీసులకు, వేరే బోటు నిర్వాహకులకు ఫోన్లు చేసినా ఫలితం లేకపోయింది. ఆ సమయంలో మరో బోటు రావడంతో వారిని సాయం అడిగారు. వారు తొలుత సహకరించకపోవడంతో వలకు అడ్డుగా బోటును నిలబెట్టడంతో సాయం చేసేందుకు అంగీకరించారు. పది మంది మత్స్యకారులు ఆ బోటులోకి వెళ్లిపోయారు. 10వ తేదీ మొత్తం ఆ బోటు లోనే గడిపారు. 11వ తేదీ ఉదయం కొయ్యాం తీరానికి చేరుకున్నారు. అప్పటికే యజమాని వచ్చి ఆటోలో మత్స్యకారులను విశాఖకు తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనలో సుమారు 90 లక్షల విలువైన బోటు మునిగిపోయిందని యజమాని తెలిపారు. చనిపోతే వస్తామన్నారు.. అంతకుముందు బోటు యాజమాని వాసపల్లి ధనరాజ్ మాట్లాడుతూ సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సాయం అందించాలని మైరెన్ సిబ్బందికి తెలియజేశాం. ఎవరూ స్పందించలేదు. అనంతరం ఎచ్చెర్ల పోలీసులకు ఫోన్ చేస్తే ఎవరైనా చనిపోతే అప్పుడు వస్తామని బదులిచ్చారని, సముద్రంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోకపోవడం అన్యాయమని అన్నారు. నడిసంద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు బోటులో నీరు చేరడంతో దిక్కుతోచని పరిస్థితి మైరెన్, పోలీసులకు తెలియజేసినా కానరాని స్పందన మరో బోటు రావడంతో సురక్షితంగా ఒడ్డుకు.. -
ప్రభుత్వ కార్యాలయంలో దొంగలు
కొరాపుట్: శుక్రవారం ఉదయం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్ కోట్ పట్టణంలో ప్రభుత్వ తహసీల్దార్ కార్యాలయంలో దొంగతనం జరిగింది. దొంగలు కార్యాలయంలోకి ప్రవేశించి ట్రెజరీ బీరువా పగలు కొట్టడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. వెళ్లేటప్పుడు సీసీ కెమెరా పుటేజీ ఉన్న డీవీఆర్ తీసుకెళ్లిపోయారు. ఈ కార్యాల యం పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఉండడం గమనార్హం. బైక్ అదుపు తప్పి యువకుడు మృతి కొరాపుట్: బైక్ అదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందాడు. శుక్రవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రం నుంచి కొసాగుమడ వెళ్లే మార్గంలో బెహరా గుడి వద్ద బైక్ అదుపు తప్పి విద్యు త్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కుసిమి గ్రామానికి చెందిన ఖగుపతి పూజారి (25) అక్కడికక్కడే మృతి చెందాడు. అదే బైక్ మీద ఉన్న మరో వ్యక్తి రూపు బొత్ర తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ప్రజలు ఈ సమాచారం పోలీ సులకు అందించారు. వెంటనే బాధితుడిని నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించా రు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శాకంబరిగా.. కొరాపుట్: కన్యకా పరమేశ్వరి అమ్మవారు శుక్రవారం శాకంబరిగా దర్శనమిచ్చారు. శుక్రవా రం జయపూర్ పట్టణంలోని మహారాణీ పేట లో గల వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఏటా ఆషాడ మాసంలో అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూరగాయ లు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే అమ్మవారికి ధాన్యంతో అభిషేకం నిర్వహించారు. బూరగాంలో కలకలం టెక్కలి : బూరగాం గ్రామంలో శుక్రవారం కలకలం రేగింది. ఓ ఇంటికీ నిత్యం కొంతమంది యువతీ యువకులు వస్తూ పోతుంటారని, ఓ మహిళ చీకటి వ్యవహారం నిర్వహిస్తోందంటూ స్థానికులు ఇంటికి ఇరువైపులా తాళాలు వేసి నిర్బంధించారు. సమాచారం తెలుసుకున్న ఏఎస్ఐ కేశవరావు, సిబ్బంది గ్రామానికి చేరుకుని మహిళతో పాటు ఇంట్లో నిర్బంధించిన ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, గ్రామస్తులు నిర్బంధించిన వారంతా తనకు తెలిసినవారేనని ఆ మహిళ చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాశీబుగ్గలో ఎస్పీ గ్రీవెన్స్ కాశీబుగ్గ: కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ప్రజా ఫిర్యాదుల వేదిక నిర్వహించారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సివిల్, కుటుంబ కలహాలు, ఆస్తి, కొట్లాట, మిస్సింగ్, చీటింగ్ తదితర అంశాలపై ఫిర్యాదులు స్వీకరించారు. -
పర్యాటక స్థూపంగా పైలాన్
ఇచ్ఛాపురం రూరల్: ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన పైలాన్‌ను పర్యాటక స్థూపంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా 2017లో లొద్దపుట్టిలో విజయ స్థూపాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం పైలాన్ శిథిలావస్థకు చేరుకోవడంతో శుక్రవారం ఎమ్మెల్సీ నర్తు రామారావు తన సొంత నిధులతో మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న పాదయాత్రకు చిహ్నంగా ఉండే పైలాన్‌ను ప్రతీ వైఎస్సార్సీపీ కార్యకర్త మదిలో చిరస్థాయిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కారంగి త్రినాథ్, ఆశి దాలయ్యరెడ్డి, పిలక సంతు, ఉప్పాడ రాజారెడ్డి, నైనా తేజా, తులసీ, తిప్పన ధనుంజయరెడ్డి పాల్గొన్నారు. -
ఆదిత్యాలయంలో విజిలెన్స్ విచారణ
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రూ.లక్షల్లో అక్రమాలు చేసినట్లుగా అందిన ఫిర్యాదుల మేరకు శుక్రవారం విజిలెన్స్ సిబ్బంది విచారణ చేపట్టారు. విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు ఆదేశాల మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పలువురి నుంచి వాంగ్మూలాలను స్వీకరించారు. దాదాపుగా రూ.2 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు సమాచారం. భక్తుల దర్శనాల ఏర్పాట్లు, సౌకర్యాలు, ఆలయంలో వివిధ రకాల అభివృద్ధి పనుల పేరిట రూ.లక్షల్లో అక్రమంగా చెక్కులను జారీ చేస్తూ.. ఆలయ నిధులను దారుణంగా తినేశారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. రెగ్యులర్ ఉద్యోగులే టార్గెట్‌గా.. విశాఖపట్నంలో గ్రేడ్–2 ఈవోగా రిటైర్డ్ అయిన జగన్మోహనరావుతో పాటు ఆలయ రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్ కావ్యశ్రీల ప్రమేయంతో రెగ్యులర్ ఉద్యోగుల పేరిట అక్రమంగా చెక్కులు జారీ అయ్యాయని గుర్తించారు. ఎర్రయ్య అనే అటెండర్‌కు తెలియకుండా ఆయన పేరుతో రూ.5 లక్షల విలువైన చెక్కులు, మరో రెగ్యులర్ రికార్డు అసిస్టెంట్ శిమ్మ మల్లేశ్వరరావు పేరిట 19 చెక్కులు, అటెండర్ శ్రీనివాసరావు పేరుతో సుమారు 4 చెక్కులు, స్వీపర్ నీలయ్య పేరుతో 2 చెక్కులతో పాటు ఆలయంలో సిమ్మెంట్ పనులు చేసే మేస్త్రి కునుకు రాము అనే వ్యక్తి పేరిట ఏకంగా 9 చెక్కులు, దినసరి పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్న బుజ్జి పేరిట మరో 4 చెక్కుల వరకు జారీ చేసేశారు. ఆయా రెగ్యులర్ ఉద్యోగుల సంతకాలు కూడా ఫోర్జరీవిగా పేర్కొంటున్నారు. దీంతో పాటు ఆలయంలో విద్యుత్‌తో పాటు పలు రకాల పనులను కాంట్రాక్ట్ విధానంలో చేస్తున్న క్లాస్–1 కాంట్రాక్టర్ ఉంగటి పాపారావు వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. మిగిలిన చెక్కులన్నీ ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారుల పేరుతో జారీ చేశారు. వివాదాస్పదంగా వాంగ్మూలాల స్వీకరణ.. విజిలెన్స్ అధికార సిబ్బంది.. తమ జిల్లా కార్యాలయంలో వాంగ్మూలాలను స్వీకరించకుండా ఆలయ కార్యాలయంలో కూర్చుని వాంగ్మూలాలను దగ్గరుండి రాయించడం వివాదాస్పదమయ్యింది. అక్రమాలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను ముందున కూర్చోబెట్టుకుంటే వాస్తవాలను ఎలా చెప్పగలమని కొందరు దినసరి వేతనదారులు ఆక్షేపించారు. ఇప్పటికై నా విజిలెన్స్ ఉన్నతాధికారులు తమదైన శైలిలో విచారించి ఆలయంలో అక్రమాల నిగ్గు తేల్చాలని పలువురు కోరుతున్నారు. -
పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి
రాయగడ: ѧéÅ-Æý‡$¦Ë$ ^èl§ýl$-Ð]l#™ø ´ër$ °Æý‡Óíßæ…^ól ÑÑ«§ýl ´ùsîæÌZÏ ´ëÌŸY…sôæ ÐéÇÌZ ¯]l*™èl-¯ø-™éÞçßæ… ò³Æý‡$VýS$-™èl$…-§ýl-°, ^èl§ýl$-Ð]l#Oò³ {Ôèæ§ýl® MýSË$VýS$-™èl$…§ýl° Hyîl-G… Æý‡Ðól$‹-Ù-^èl…{§ýl ¯éĶæ$MŠS A¯é²Æý‡$. Ý린MýS çÜ…çÜP–† ¿ýæÐ]l-¯]l…ÌZ JyìlÔ> Ýëíßæ™èlÅ AM>-yýlÒ$ B«§ýlÓÆý‡Å…ÌZ Ô¶æ${MýSÐéÆý‡… ѧéÅ-Æý‡$¦ÌS Ð]l$«§ýlÅ ÐéÅçÜ, Ð]lMýS–¢™èlÓ, ´÷Ƈ$${sîæ, iMóS ´ùsîæ-ÌS¯]l$ °Æý‡Ó-íßæ…-^éÆý‡$. M>Æý‡Å-{MýSÐ]l*°MìS Ð]l¬QÅ-A-†-¤V> àf-OÆð‡¯]l ¯éĶæ$MŠS ѧéÅ-Æý‡$¦-ÌS¯]l$-§ólª-Õ…_ Ð]l*sêÏ-yéÆý‡$. ѧéÅ-Æý‡$¦Ë$ A°² Æý‡…V>ÌZÏ Ð]l¬…§ýl$…yéÌS° BM>…„ìS…-^é Æý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> hÌêÏ ´ûÆý‡çÜ…º…-«§éÌS Ô>Q A«¨M>Ç ºçÜ…™èl MýS$Ð]l*ÆŠ‡ {糫§é¯ŒS Ð]l*sêÏ-yýl$-™èl*.. hÌêÏÌZ° 11 çÜÑ$-™èl$ÌS ¯]l$…_ి 88 Ð]l$…¨ ѧéÅ-Æý‡$¦Ë$ ´ùsîæÌZÏ ´ëÌŸY¯é²Æý‡° A¯é²Æý‡$. VðSË$´÷…-¨¯]l ѧéÅ-Æý‡$¦Ë$ ™èlÓÆý‡ÌZ fÇVóS Æ>çÙ‰-Ýë¦Æ‡$$ ´÷sîæÌZÏ ´ëÌŸY…-sêÆý‡° ÑÐ]l-Ç…-^éÆý‡$. hÌêÏ Ñ§éÅÔ>Q A«¨ M>Ç Æý‡Ðól$‹Ù ^èl…{§ýl ¯éçßæMŠS, hÌêÏ çÜ…çÜP–† Ñ¿ê VýS… A«¨M>Ç çÜ$íÜÙèl »oÇ ´ëÌŸY-¯é²Æý‡$. Ñgôæ-™èl-ÌSMýS$ Ð]l¬QÅA-†¤.. Hyîl-G… ¯éĶæ$MŠS ºçßæ$-Ð]l$™èl$Ë$, {ç³Ôèæ…Ýë ç³{™é-ÌS¯]l$ A…§ýl-gôæÔ>Æý‡$. -
‘బీజేపీ ఎమ్మెల్యేను అరెస్టు చేయాలి’
భువనేశ్వర్: రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ, విపక్ష బిజూ జనతా దళ్ మధ్య రోజుకో వివాదం సంచలనం రేపుతోంది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సంతోష్ ఖటువాను వెంటనే అరెస్టు చేయాలని విపక్ష బీజేపీ మహిళా నాయకులు వీధికి ఎక్కారు. నగరంలో నడి రోడ్డు మీద గురువారం భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేని అరెస్టు చేసేందుకు సాక్ష్యాధారాలతో కూడిన ఫిర్యాదుని రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరలక్ యోగేష్ బహదూర్ ఖురానియాకు ఆందోళనకారుల ప్రతినిధి బృందం అందజేసింది. వివాదాస్పద ఎమ్మెల్యే సాక్ష్యాధారాలు తారుమారు చేయకుండా కస్టడీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేవారు. ఎమ్మెల్యే వ్యతిరేకంగా వన్యప్రాణుల (ఏనుగులు) వేట, లైంగిక వేధింపులు వంటి తీవ్రమైన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రతినిధి బృందం డీజీపీని అభ్యర్థించింది. ఆయన వ్యతిరేకంగా పలు పత్రికల్లో ప్రచురిత వార్త కాపీలు, ఆడియో క్లిప్‌లు మరియు తేలిపాల్ గ్రామంలో వన్య ప్రాణుల అక్రమ వేట, దంతాల అక్రమ రవాణా సంబంధిత సాక్ష్యాల్ని డీజీపీకి దాఖలు చేశారు. ఈ నెల 2న ఎమ్మెల్యే ఫామ్‌హౌస్‌లో మీడియాతో జరిగిన సంభాషణలో బిజూ జనతా దళ్ నాయకురాలు డాక్టర్ లేఖశ్రీ సామంత సింఘార్ తనను వేశ్యగా అభివర్ణించి, సెక్స్ రాకెట్ నడిపారని సంతోష్ ఖటువా చేసిన అసభ్యకరమైన, లైంగికపరమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను డీజీపీకి దాఖలు చేసిన ఫిర్యాదులో సవివరంగా వివరించారు. ఈ అభ్యంతరకర చేష్టలతో తీవ్ర మానసిక వేదన మరియు ప్రతిష్టకు హాని కలుగుతుందని ప్రభావిత డాక్టర్ లేఖశ్రీ సామంత సింఘార్ ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరింపులు, ప్రతీకార చర్యల ప్రమాదం దృష్ట్యా డాక్టర్ లేఖశ్రీ సామంత సింఘార్ ఆమెతో కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. -
ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం ఆకస్మిక పర్యటన
కొరాపుట్: ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వరన్ ఫంకువాల్ ఆకస్మికంగా పర్యటించారు. కొత్త వలస–కిరండోల్ మార్గంలో కొరాపుట్–కిరండోల్ (కేకే 2) లో విండో ఎల్జి స్పెషల్ రైలులో ప్రయాణం చేశారు. ఈ మార్గంలో రైల్వే స్థిరీకరణ, రైల్వే స్టేషన్లు పరిశీలించారు. విండో ప్రయాణంలో ట్రాక్స్, మలుపులు, వంతెనలు, గుహల గుండా పర్యవేక్షించారు. ఇటీవల కొండ చరియలు ట్రాక్ మీదకు దూసుకు వచ్చిన జరతి–మాలిగుడ స్టేషన్ల మధ్య ట్రాక్ పరిశీలించారు. కొండ చరియలు పడినప్పుడు తట్టుకునే విధంగా ట్రాక్‌ల సామర్థ్యాన్ని పరీక్షించారు. ఇదే మార్గంలో కొరాపుట్ మీదుగా జగదల్పూర్ మార్గం పరిశీలించారు. తిరిగి కొరాపుట్–రాయగడ మార్గం కేఆర్ లైన్లో పరిస్థితి సమీక్షించారు. కక్కిరి గుమ్మ రైల్వే స్టేషన్, లైలి గుమ్మ–రవులి మధ్య వంతెన, కేఆర్ లైన్ లో 15 గేట్ లెవల్ క్రాసింగ్ పరిశీలించారు. పలు చోట్ల స్టేషన్లు తనిఖీ చేశారు. భారీ వర్షం పడుతున్నప్పటికీ గొడుగులు వేసుకొని ట్రాక్‌ల వద్దకు వెళ్లారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. పర్యటనలో వాల్తేర్ డీఆర్ఎం లళిత్ బోరా, అన్ని విభాగాల సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. -
తగ్గేది లేదు: డ్రైవర్లు
భువనేశ్వర్: అఖిల ఒడిశా రోడ్డు రవాణా డ్రైవర్ల సంఘం స్టీరింగు విరమణ ఆందోళన ఉద్ధృతం చేస్తున్నారు. ప్రభుత్వ స్పందనని బహిరంగంగా ఆందోళనకారుల మధ్య ప్రకటించి లిఖిత హామీ పత్రం విడుదల చేయాలని గట్టిగా పట్టుబట్టారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించేంత వరకు ఏమాత్రం తగ్గకుండా స్టీరింగు విరమణ ఆందోళన నిరవధికంగా కొనసాగుతుందని తెలిపారు. అయితే రాష్ట్రంలో డ్రైవర్ల ఆందోళనపట్ల ఏమాత్రం ఆందోళన చెందాల్సింది లేదని రాష్ట్ర ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్రో పూర్తి అభయం ఇచ్చారు. ఈ రెండు వర్గాల మధ్య సాధారణ ప్రజానీకం, వినియోగదారుల వర్గం తల్లడిల్లుతుంది. ప్రధానంగా డ్రైవర్ల బంద్ ప్రభావంతో రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ వంటి చమురు సంక్షోభం తాండవిస్తుందని సర్వత్రా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రంలో చమురు కొరత లేదని మంత్రి ప్రకటించారు. డ్రైవర్ల ఆందోళన కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ నిల్వ పుష్కలంగా ఉంది. అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. బుధవారం నగరానికి 150 ట్యాంకర్లు, కటక్‌కు 76 ట్యాంకర్లతో పెట్రోల్, డీజిల్ చేరినట్లు మంత్రి వివరించారు. అన్ని నగరాల్లోనూ చమురు అందుబాటులో ఉంది. భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. పెట్రోలియం డీలర్ల సంఘం ప్రతినిధులతో మంత్రి సమావేశం అఖిల ఒడిశా రోడ్డు రవాణా డ్రైవర్ల సంఘం నిరవధిక సమ్మెతో రాష్ట్రంలో పెట్రోలియం సంక్షోభ పరిస్థితి మెల్లగా పుంజుకుంటోంది. ఈ పరిస్థితి నివారణ కోసం విభాగం మంత్రి పెట్రోలు, డీజిలు డీలర్ల సంఘం ప్రతినిథి ప్రముఖులతో మంత్రి గురు వారం సమావేశం అయ్యారు. స్థానిక లోక్ సేవా భవన్లో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో సరఫరా శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అఖిల ఒడిశా డీజిలు. పెట్రోలియం డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి సంజయ్ లాట్ హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా, తాజా నిల్వల పరిస్థితిపై వీరంతా చర్చించారు. రాష్ట్రానికి రోజుకు 36 లక్షల లీటర్ల పెట్రోల్, 85 లక్షల లీటర్ల డీజిల్ అవసరం. సాధారణంగా పెట్రోల్ పంపులలో 4 రెట్లు చమురు నిల్వ చేస్తున్నారు. డ్రైవర్ల ఆందోళన ప్రభావంతో గత 2 రోజులుగా పెట్రోలు, డీజిలు రవాణా స్తంభించిపోయింది. దీంతో సాధారణ నిల్వ క్రమంగా అడుగంటి పోతుందని అఖిల ఒడిశా డీజిలు, పెట్రోలియం సంఘం ప్రధాన కార్యదర్శి సంజయ్ లాట్ వివరించారు. ఇది క్రమంగా చమురు సంక్షోభానికి దారి తీసే ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రస్తుతానికి పెట్రోలు, డీజిలు చమురు కొరత లేదు. గురువారం నాటికి చమురు సరఫరా కాకుంటే సంక్షోభం తలెత్తవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే శుక్ర వారం సాయంత్రం నాటికి పెట్రోల్ పంపుల్లో చమురు నిల్వలు అడుగంటిపోతాయని విశ్లేషించారు. భయపడాల్సింది లేదు: ప్రభుత్వం -
చుక్కల్ని తాకిన కాయగూరల ధరలు
భువనేశ్వర్: రాష్ట్రంలో ప్రముఖ కూరగాయల హోల్ సేల్ అంగడి కటక్ ఛత్రబజార్లో నిత్య అవసర కాయగూరల ధరలు గణనీయంగా పెరిగాయి. వినియోగదారులు సతమతం అవుతున్నారు. గురువారం నాటికి ఈ అంగడిలో పలు కాయగూరల కిలో ధరలు (రూ.) ప్రభుత్వానికి లొంగిపొండి ● మీ కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం ● మావోయిస్టులకు పోలీసు యంత్రాంగం పిలుపు రాయగడ: ఆయుధాలను వీడి మీరంతా ప్రభుత్వానికి లొంగిపోవాలని, కుటుంబ సభ్యులకు అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లాలోని మునిగుడ పోలీస్ స్టేషన్, బస్టాండు తదితర ప్రాంతాల్లో బ్యానర్లను ఏర్పాటు చేసింది. గురువారం నాడు మునిగుడలో కనిపించిన ఈ బ్యానర్లు హల్ చల్ సృష్టించాయి. మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం తరఫున ఉండేందుకు ఇల్లు, ఆర్థిక సాయంతో పాటు పిల్లల భవిష్యత్ కోసం ఆర్థిక సాయం చేస్తామన్నారు. అందువల్ల మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని బ్యానర్లలో పేర్కొన్నారు. అక్రమ అరెస్టులు ఆపాలి శ్రీకాకుళం: సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వారిని అక్రమ అరెస్టులు చేస్తూ పౌరుల జీవనానికి, స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం భంగం కలిగిస్తోందని అంతర్జాతీయ మానవహక్కుల సంఘం స్టేట్ సివిల్ రైట్స్ చైర్మన్ కరణం తిరుపతి నాయుడు గురువారం తెలిపారు. సోషల్ మీడియా అరెస్టులపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారిచేసినా ప్రభుత్వం పాటించట్లేదన్నారు. జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు అరాచకాలు ఎక్కువయ్యాయని, ప్రతిపక్షాలపై తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులను ఆపాలని డిమాండ్ చేశారు. రెండు లారీలు ఢీ రణస్థలం: పతివాడపాలెంలో జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొట్టుకున్నట్లు జె.ఆర్.పురం పోలీసులు తెలిపారు. విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ బలంగా ఢీకొట్టింది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో క్లీనర్, డ్రైవర్లు స్వల్పగాయాలతో బయటపడ్డారని జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీని క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. డిజిగ్నేషన్ మార్చాలని వినతి ఎచ్చెర్ల: తమకు గెస్ట్ ఫ్యాకల్టీ పేరిట డిజిగ్నేషన్ ఇచ్చి అన్యాయం చేశారని, తమ డిజిగ్నేషన్‌ను కాంట్రాక్ట్ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మార్చాలని కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్లు రెడ్డి లక్ష్మణరావు, వై.నారాయణరావు, పి.నవీన్ కోరారు. ఈ మేరకు గురువారం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఐఐఐటీ) డైరెక్టర్ కేవీజీడీ బాలాజీకు వినతిపత్రం అందించారు. 2018కి ముందు, తర్వాత రిక్రూట్మెంట్ అయినవారికి రూ.40 వేలు జీతం ఇస్తున్నామ, తమకు మాత్రం రూ.25 వేలకే పరిమితం చేశారన్నారు. ఈ విషయమై అనేకసార్లు వినతిపత్రం అందించినా ఇప్పటివరకూ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను చాన్సలర్ మధుమూర్తి, రిజిస్ట్రార్ అమరేంద్రల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వారు కోరారు. గిరి ప్రదర్శనకు వెళ్లి వస్తూ.. నరసన్నపేట: మాకివలసలో గ్రామానికి చెందిన రావాడ ఉదయకుమార్ (28) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గురువారం సింహాచలం గిరి ప్రదర్శనకు వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి స్వగ్రామం వస్తుండగా భోగాపురం వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఉదయకుమార్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. విషయం తెలియడంతో తండ్రి రమణయ్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉదయ్‌కుమార్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇంతలోలో మృతి చెందడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు. పీ–4 విధానంపై సమీక్ష శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పీ4 (ప్రభుత్వం–ప్రైవేటు–ప్రజలు– భాగస్వామ్యం) కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పథ్విరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బంగాళాదుంపలు 20 ఉల్లిపాయలు 25 దోసకాయలు 20 పొటల్స్ 30 బెండకాయలు 40 బరబటీలు 30 వంకాయలు 70 క్యారెట్ 30 -
ఎస్పీగా వెళ్లి డీఐజీగా రాక
కొరాపుట్: సదరన్ వెస్ట్రన్ రేంజ్ డీఐజీగా కన్వర్ విశాల్ సింగ్‌ని నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విశాల్ గతంలో కొరాపుట్ ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం స్పెషల్ ఇన్విస్టిగేషన్ వింగ్‌లో డీఐజీగా పని చేస్తున్నారు. మళ్లీ డీఐజీ హోదాలో కొరాపుట్ జిల్లా కేంద్రం రానునున్నారు. ప్రస్తుతం సదరన్ వెస్ట్రన్ రేంజ్ డీఐజీగా ఉన్న అఖిలేశ్వర్ సింగ్ తిరిగి విశాల్ సింగ్ విధులు నిర్వరిస్తున్న ఇన్విస్టిగేషన్ వింగ్ డీఐజీగా వెళ్తారని ప్రభుత్వం ప్రకటించింది. కన్వర్ విశాల్ సింగ్ కొరాపుట్‌లో ఎస్పీగా పనిచేసి తిరిగి అదే కొరాపుట్‌కి డీఐజీగా రావడం గమనార్హం. దాతృత్వం చాటుకున్న శ్రీనివాసరావు కొరాపుట్: సామాజిక సేవకు సరిహద్దులు ఉండవని సామాజిక మాధ్యమాలు ఉంటే చాలని ఈ సంఘటన నిరూపించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో పేదలకు నబరంగ్‌పూర్ జిల్లాలోని చైనా మార్కెట్‌కి చెందిన బీజేపీ మాజీ కౌన్సిలర్ కొత్తకోట శ్రీనివాసరావు వితరణ చేశారు. ఆమదాలవలసలో గత 526 రోజులుగా పేదలకు నిరవధికంగా ఉచిత మధ్యాహ్న భోజన వితరణ జరుగుతోంది. అయితే ఇటీవల భారీ వర్షంలో పేదలు ఆహారం తీసుకుంటున్న చిత్రం వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన శ్రీనివాసరావు చలించారు. వెంటనే నిర్వాహకులతో మాట్లాడి పేదలందరికీ నాణ్యమైన గొడుగులు, ఒక రోజు ఆహారం, స్వీట్లు అందజేయాలని సూచించారు. అవసరమైన ఆర్థిక సాయం పంపించారు. సాయి భక్తుడైన శ్రీను గురు పౌర్ణమి సందర్భంగా 527 రోజు అక్కడి వారందరికీ గోడుగులు, ఆహారం పంపిణీ చేయించారు. ఏసీఎఫ్ భార్యపై హత్య కేసు విచారణ కొనసాగాల్సిందే: హై కోర్టు భువనేశ్వర్: ఏసీఎఫ్ సౌమ్య రంజన్ మహాపాత్రో మరణానికి సంబంధించి అతని భార్య బిద్యా భారతి పండా వ్యతిరేకంగా నమోదైన హత్యారోపణ కేసు విచారణ కొనసాగాల్సిందేనని రాష్ట్ర హై కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి పర్లాకిమిడి ఎస్డీజేఎం న్యాయస్థానం ఆదేశించిన ప్రకారం ఈ కేసు విచారణ కొనసాగించాలని రాష్ట్ర హై కోర్టు స్పష్టం చేసింది. పర్లాకిమిడి ఎస్డీజేఎం న్యాయ స్థానం జారీ చేసిన ఆదేశాల్ని కొట్టివేయాలని నిందిత భార్య బిద్యా భారతి పండా రాష్ట్ర హై కోర్టుని ఆశ్రయించింది. ఆమె అభ్యర్థనని ఉన్నత న్యాయ స్థానం తిరస్కరించి తదుపరి విచారణ నిరాటంకంగా కొనసాగాలని ఆదేశించింది. నిందితురాలికి వ్యతిరేకంగా ఐపీసీ సెక్షన్లు 285, 304–ఎ కింద విచారణ కొనసాగుతుంది. 302, 120బి సెక్షన్లు కింద ప్రత్యేక ఫిర్యాదు ద్వారా లేవనెత్తిన ఆరోపణలపై విచారణను ప్రారంభ దశలో కొట్టివేయాలనే అభ్యర్థన పట్ల ఉన్నత న్యాయ స్థానం ప్రతికూలంగా స్పందించింది. ఈ సెక్షన్ల కింద లేవనెత్తిన ఆరోపణలపై సమగ్ర పరిశీలన విభిన్న వాస్తవ వివాదాలను ధృవీకరించే అవకాశం ఉందని రాష్ట్ర హై కోర్టు అభిప్రాయపడింది. తీవ్రంగా భిన్నమైన కథనాలు, వివాదాస్పద వాస్తవాల ఉనికిని దృష్టిలో ఉంచుకుని ట్రయల్ కోర్టు సాక్ష్యాలను లోతుగా పరిశీలించడం సముచితమని హై కోర్టు పేర్కొంది. హై కోర్టు జారీ చేసిన పరిశీలనల్ని ప్రభావితం చేయకుండా పిటిషనర్ (బిద్యా భారతి) ట్రయల్ కోర్టు ముందు విడుదల కోరడం వంటి అభ్యర్థనల్ని ప్రవేశ పెట్టేందుకు పూర్తి స్వేచ్ఛ కల్పించినట్లు ఉన్నత న్యాయ స్థానం వెసులుబాటు కల్పించింది. దొంగను పట్టించిన ప్రజలు జయపురం: దొంగతనం చేసేందుకు ఒక ఇంటిలో చొరబడిన దొంగను ఆ ప్రాంత ప్రజలు చుట్టు ముట్టి పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. ఈ సంఘటన జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి శాంతినగర్‌లో జరిగింది. బుధవారం రాత్రి ఒక దొంగ బొరిగుమ్మ శాంతినగర్ నివసిస్తున్న బులు పాఢీ ఇంటిలో ప్రహరీ దూకి ఇంటిలో దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇంటి యజమాని భార్య శబ్ధం విని తలుపు తెరిచి చూడగా దుండగుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. ప్రహరీపై ఉన్న మేకులు గుచ్చుకోవడంతో ఒక మూల దాక్కున్నాడు. స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. -
భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి
జయపురం: స్థానిక మహాత్మాగాంధీ రోడ్డులోని డెప్పిగుడ జంక్షన్లో గల సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి పూజలు గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారి నుంచి భక్తులు సాయిబాబా ఆలయానికి తరలివచ్చారు. యజ్ఞ, యాగాలు నిర్వహించారు. కొట్పాడ్లోని సాయిబాబా విగ్రహానికి ఎమ్మెల్యే రూపు భొత్ర పూజలు చేశారు. కొరాపుట్‌లో... కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రాథమిక విద్య, సాంఘిక సంక్షేమ, మైనారిటీ వ్యవహారాల మంత్రి నిత్యానంద గోండొ గురువారం పర్యటించారు. మెయిన్ రోడ్డులోని ఎస్బీఐ ఎదురుగా ఉన్న అలేఖ్ బాబా ఆశ్రమాన్ని సందర్శించారు. మత గురువు అవదూత బ్రహ్మచారి బాబాకి పాద నమస్కారం చేశారు. ఆశ్రమంలో మత పెద్దలకు కానుకలు సమర్పించారు. ఆశ్రమానికి అవసరమైన సహాయ, సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. పక్కనే ఉన్న సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి గురువుగా మారి పిల్లలకు పాఠాలు చెప్పారు. వారితో కలిసి ఆటలాడారు. నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి ఉన్నారు. కొరాపుట్ జిల్లాలోని హరే కృష్ట మందిరాన్ని కొట్‌పాడ్ ఎమ్మెల్యే రుపు భొత్ర సందర్శించారు. గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. నబరంగ్‌పూర్‌లో.. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని చైనా మార్కెట్లో షిర్డీ సాయి మందిరంలో గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఉదయం పాలభిషేకం చేశారు. భక్తులకు ఉచిత అన్నప్రసాద సేవనం జరిగింది. సాయంత్రం చైనా మార్కెట్, పఠాన్ వీధి, గాంధీ జంక్షన్, మెయిన్ రోడ్డు, జగన్నాథ మందిరం మీదుగా స్వామిని ఊరేగించారు. రాత్రి అల్పాహారం పంపిణీ చేశారు. కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాయగడలో.. రాయగడ: పట్టణంలోని షిర్డీ సాయి మందిరాల్లో గురుపౌర్ణమి పూజలు నిర్వహించారు. స్థానిక రైల్వే రిక్రియేషన్ మైదానం ఎదురుగా గల షిర్డీ సాయి బాబా మందిరంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. డైలీ మార్కెట్ సమీపంలో గల హనుమాన్ మందిరం ప్రాంగణంలో గల బాబా మందిరంలో విశేష పూజలు నిర్వహించారు. పర్లాకిమిడిలో... పర్లాకిమిడి: వ్యాస పౌర్ణమి సందర్భంగా స్థానక సరస్వతీ శిశు విద్యామందిర్‌లో విద్యార్థులతో దేవీ మఠం మహాంత రామానంద మహారాజ్ పాల్గొని వ్యాసుని చరిత్ర గురించి తెలియజేశారు. వ్యాస మహార్షిని ఆదిగురువుగా పండితులు అందరూ కోనియాడతారన్నారు. అందువల్ల ఈ రోజు గురుపౌర్ణమి అని కూడా పిలుస్తారన్నారు. రాజవీధిలోని జగన్నాథ మందిరం వెలుపల రథాల వద్ద సరస్వతీ శిశు విద్యామందిర్ విద్యార్థులు హాల్వా ప్రసాదాన్ని యాత్రికులకు పంచి పెట్టారు. శ్రీకృష్ణచంద్రగజపతి కళాశాల యోగా వేదికపై పతంజలి యోగా సమితి గురువు జిల్లా ప్రభారి భిఘ్నేశ్వర్ దాస్‌ను యోగ సమితి శిష్య బృందాన్ని ఘనంగా సత్కరించారు. -
సర్వం సిద్ధం
శుక్రవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025రథాల విడి భాగాల విక్రయానికి.. మత్స్యజీవి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని సంస్కృతి అపురూపం. భగవంతుడు ఆశీనుడైన రథం తాడు తాకిన జన్మ చరితార్థం అవుతుందని విశ్వసిస్తారు. యాత్ర సమయంలో రథం ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో యాత్ర తర్వాత అంత కంటే అధికంగా ప్రాధాన్యత కూడగట్టుకోవడం విశేషం. ఔత్సాహిక భక్తులు రథాల విడి భాగాల్ని కొనుగోలు చేసి నిర్ధారిత ప్రాంగణాల్లో అత్యంత పవిత్రంగా పదిలపరుస్తారు. నిత్యం ఈ విడి భాగాలకు నియమ నిష్టలతో పూజలు నిర్వహిస్తారు. శ్రీ మందిరం పాలక వర్గం (ఎస్జేటీఏ) వార్షిక రథ యాత్రలో వినియోగించిన రథాల విడి భాగాలు విక్రయించేందుకు తాజా ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్ఓపీ) జారీ చేసింది. ఈ నేపథ్యంలో రథాల విడి భాగాల సవరించిన ధరల జాబితాను విడుదల చేసింది. విడి భాగాల్లో రథ చక్రాలకు విశేష ఆదరణ ఉంటుంది. ప్రధానంగా శ్రీ జగన్నాథ స్వామి నంది ఘోష్ రథం చక్రాలపై భక్తులు అధికంగా మక్కువ కనబరుస్తారు. తాజా ఎస్ఓపీ ప్రకారం శ్రీ జగన్నాథుని నందిఘోష్ రథ చక్రం ధర ఒక్కొక్కటి రూ. 3 లక్షలుగా నిర్ధారించారు. బలభద్రుని తాళ ధ్వజం ఒక్కో చక్రం ధర రూ. 2 లక్షలు, సుభద్ర దేవి దర్ప దళనం ఒక్కో చక్రం ధర రూ. 1.5 లక్షలుగా నిర్ణయించారు. రథాలపై విడి భాగాలకు ధరలు నిర్ధారించారు. వాటిలో ఒక్కో ప్రభ ధర రూ. 25,000 కాగా ఇతర విడి భాగాల ధర ఒక్కొక్కటి రూ.15,000గా ప్రకటించారు. మూడు రథాల పూర్తి రథ చక్రాల సెట్‌ను కొనుగోలు చేయడానికి దాదాపు రూ. 6 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. సకాలంలో దాఖలు చేయాలి ఆసక్తి గల రథాల విడి భాగాల కొనుగోలుదారులు ఈ ఏడాది సెప్టెంబర్ నెల 15 లోపు ఆలయ పాలక వర్గానికి (ఎస్జేటీఏ) దరఖాస్తు దాఖలు చేయాలి. దానితో పాటు రూ.1,000 దరఖాస్తు రుసుం చెల్లించాలి. తాజా నిబంధనల మేరకు కొనుగోలు కోసం ఎంపికై న దరఖాస్తుదారులకు సకాలంలో సమాచారం చేరదీస్తారు. ఈ సమాచారం అందిన ఒక వారం లోపు పూర్తి మొత్తాన్ని సూచించిన ఖాతాలో జమ చేయాలి. నిర్ణీత సమయంలోపు ఎంపికై న దరఖాస్తుదారుడు మొత్తాన్ని డిపాజిట్ చేయలేని పరిస్థితుల్లో తదుపరి అర్హత కలిగిన దరఖాస్తుదారుని పరిగణనలోకి తీసుకుని కొనుగోలు అవకాశం కల్పిస్తారు. ఈ వ్యవహారంలో పాదర్శకతకు పెద్ద పీట వేస్తున్నట్లు పాలక వర్గం ప్రకటించింది. సాధారణంగా స్టార్ హోటళ్లు, కార్పొరేటు ఆస్పత్రులు, విమానాశ్రయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పేరొందిన వర్గాలు, మఠాలు, ప్రముఖ దేవస్థానాలు పూరీ శ్రీ జగన్నాథుని రథం విడి భాగాల్ని ఉత్సాహంతో కొనుగోలు చేసి ఆలయ పాలక వర్గం నిబంధనలకు కట్టుబడి ఉంటామని వాంగ్మూలం ముందస్తుగా దాఖలు చేయాల్సి ఉంది. స్వామి వినియోగించిన ప్రతి సామగ్రి, వస్తువు అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ క్రమంలో రథాల విడి భాగాలు కొనుగోలు చేసిన వర్గాలు నిర్ధారిత స్థలంలో అత్యంత పవిత్రంగా పదిలపరచి నిత్యం ధూపదీపారాధన నిర్వహించాల్సి ఉంటుంది. న్యూస్‌రీల్ -
భారీగా గంజాయి స్వాధీనం
పర్లాకిమిడి: జిల్లాలోని మోహనా బ్లాక్ అడవ పోలీసుస్టేషన్ పరిధిలో అంతరాబ గ్రామ పంచాయతీ రేణు గ్రామం వద్ద రోడ్డు పక్కన గంజాయి అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ జ్యోతింద్రనాథ్ పండా తెలియజేశారు. పట్టుబడిన 12 గంజాయి బస్తాలను మోహనా తహసీల్దార్ సమక్షంలో తూకా వేయగా 12.63 క్వింటాళ్లుగా ఉన్నట్లు నిర్ధారించారు. అయితే గంజాయి అక్రమ రవాణాలో నిందితులు పరారైనట్లు తెలియజేశారు. కొరాపుట్: మూడు వేర్వేరు సంఘటనల్లో 27 కేజీల గంజాయిని కొరాపుట్ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి పంధాలుంగ్ గ్రామ పంచాయతీ జయంతి గిరి, చెటోడి పుట్ గ్రామాల్లో ఎకై ్సజ్ సిబ్బంది దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో గంజాయితో పాటు 12 లీటర్ల దేశీ మద్యం పట్టుబడింది. ఈ ఘటనలో సిర్మే ఖొరా, జయరాం పంగి, బల్కి పంగిలను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ రధ్ ప్రకటించారు. దీనం చేసుకున్న గంజాయితో పాటు నిందితులు -
రాష్ట్రపతి పర్యటనకు సన్నద్ధత
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14, 15వ తేదీల్లో రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక లోక్ సేవా భవన్లో ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం సన్నద్ధతని ఆయన సమీక్షించారు. రాష్ట్రపతి ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం న్యూ ఢిల్లీ నుండి స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక వైమానిక దళం విమానంలో చేరుతారు. భువనేశ్వర్, కటక్ జంట నగరాలలో 2 రోజుల పాటు వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ నెల 14 సాయంత్రం స్థానిక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) పంచమ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి హాజరవుతారు. మర్నాడు 15వ తేదీ ఉదయం కటక్ రెవెన్షా విశ్వవిద్యాలయం 13వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. ఆ తర్వాత కటక్ రెవెన్షా బాలికల ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తదుపరి రాష్ట్రపతి కటక్ తులసీ పూర్ బిజూ పట్నాయక్ చక్‌లో ఉన్న సరళ భవన్‌ను సందర్శించి ఆది కవి సరళా దాస్ విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు. సరళ సాహిత్య సంసద్ నిర్వహించే ఆది కవి సరళా దాస్ 600వ జయంతి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో కళింగ రత్న అవార్డు–2024ను ప్రదానం చేస్తారు. జూలై 15వ తేదీ సాయంత్రం న్యూ ఢిల్లీకి తిరిగి పయనం అవుతారు. రాష్ట్రపతిని విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం నుంచి ప్రత్యక్షంగా స్థానిక రాజ్ భవన్ చేరి రాష్ట్రపతి బస చేస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. కార్యక్రమాల వేదిక ప్రాంగణాలు, రోడ్డు ప్రయాణంలో దారి పొడవునా అత్యవసర భద్రత, రక్షణ ఏర్పాట్లు సమీక్షించారు. వేదికకు దారితీసే రోడ్ల తాజా స్థితిగతుల దృష్ట్యా అవసరమైన మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టాలని ఆదేశించారు. రోడ్ల పరిశుభ్రత, వేదిక వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, తగినంత సంఖ్యలో అదనపు జనరేటర్లను ఏర్పాటు చేయడానికి సూచనలు జారీ చేశారు. రాష్ట్రపతి సందర్శన సజావుగా సాగడానికి, వివిధ సన్నాహాలకు అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రముఖ కార్యదర్శి అందరి సహకారాన్ని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి కమిషనర్, ప్రభుత్వ అదనపు ప్రఽముఖ కార్యదర్శి అనూ గర్గ్, హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సత్యబ్రత్ సాహు, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ వైబీ ఖురానియా, సంబంధిత వివిధ విభాగాల కార్యదర్శులు, కేంద్ర రెవెన్యూ కమిషనర్లు, కటక్, ఖుర్దా జిల్లా కలెక్టర్లు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థిని వింత ప్రవర్తన.. నాకు సారా, బీడీ ఇవ్వండి..!
ఒడిశా: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి చంద్రపొడ గ్రామం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు పాఠ్యం బోధిస్తున్న సమయంలో హటాత్తుగా 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనూహ్యంగా, వింతగా ప్రవర్తించింది. నాకు సారా ఇవ్వండి, బీడీ ఇవ్వండి అని పట్టుబట్టింది. తాను ఇక్కడ నుంచి వెళ్లను, నేను వారిని చంపుతాను అని పిచ్చిగా మాట్లాడుతూ వింతగా ప్రవర్తించింది. ఆ సమయంలో రాష్ట్ర విద్యావిభాగ డైరెక్టర్, జిల్లా విద్యాధికారులు పాఠశాలకు వచ్చారు. వింతగా ప్రవర్తిస్తున్న బాలికను చూసిన అధికారులు వెంటనే హాస్పిటల్‌కు తీసుకుళ్లాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆ సమయంలో విషయం తెలిసిన బాలిక సోదరుడు వచ్చి తన చెల్లెను హాస్పిటల్‌కు కాకుండా నేరుగా ఇంటికి తీసుకువెళ్లాడు. బాలిక పరిస్థితిని చూసిన తోటి విద్యార్థులు ఆమెకు దెయ్యమో, భూతమో ఆవహించిందని భయంతో వణికిపోయారు. బాలికను ఆదివాసీ వైద్యుడు దిశారీ వద్దకు తీసుకువెళ్లినట్లు తెలిసింది. మారుమూల ఆదివాసీ గ్రామీణ ప్రజలలో మూఢనమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయని, వారిని చైతన్యవంతులను చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయురాలు రాజలక్ష్మీ మిశ్ర అభిప్రాయపడ్డారు. బాలికకు భూతం పట్టిందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఇటువంటి సంఘటనలకు మానసిక వ్యాధులే కారణమని, హాస్పిటల్లో వైద్యం చేయించటం మంచిదని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. -
రోడ్డు మరమ్మతులు చేపట్టలేదని నిరసన
జయపురం: రోడ్డు మరమ్మతులు చేపట్టకపోవడంతో ఇబ్బందులుపడుతున్నామంటు జనం నిరసనకు దిగారు. జయపురం సబ్‌డివిజన్ బోయిపరిగుడ సమితి దొండాబడి పంచాయతీ నుండి పనసపుట్ గ్రామం మీదుగా జంగోలజోడి గ్రామం వరకు ఉన్న రోడ్డు పంట పొలంలా మారడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రోడ్డుకు మరమ్మతులు లేదా పునఃనిర్మాణం చేయాలని ఆ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా సమితి, జిల్లా అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామస్తులు వినూత్న రీతిలో బుధవారం నిరసనకు దిగారు. పంట పొలంలా ఉన్న రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేవారు. గ్రామస్తులు వివరణ ప్రకారం తమ గ్రామానికి రోడ్డు వేయాలని అధికారులకు విన్నవించుకోగా దొండాబడి నుంచి జంగొలజొడి గ్రామం వరకు 2019లో తారు రోడ్డు వేశారన్నారు. అయితే రోడ్డు నాణ్యత లేక పోవటంతో రెండు నెలలకే శిథిలమై గతుకులుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఈ విషయం సంబంధిత అధికారులకు తెలియజేసినప్పటికీ సమస్యను పరిష్కరించలేదని గ్రామ పెద్ద బిజయ ఖొర ఆరోపించారు. రోడ్డు బాగు చేయకపోవటంతో గ్రామానికి అంబులెన్స్ కూడా రావడం లేదని.. దీంతో అత్యవసర సమయంలో రోగులు, గర్భిణులు, మహిళలు వెళ్లిలేకపోతున్నారన్నారు. అలాగే పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేక పిల్లలు అవస్థలు ఎదుర్కొంటున్నట్టు వాపోయారు. ఇప్పటికై న రోడ్డు పనులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరారు. -
గురువులే సమాజ మార్గదర్శకులు
కొరాపుట్: సమాజానికి గురువులే మార్గదర్శకులని నిఖిల ఉత్కళ ప్రాథమిక ఉపాధ్యాయుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమణి రంజన్ త్రిపాఠి పేర్కొన్నారు. బుధవారం జయపూర్ పట్టణంలో లేబర్ ఆఫీస్ జంక్షన్ వద్ద బీఈఓ కార్యాలయంలో జరిగిన ఉపాధ్యాయుల పదవీ విరమణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రాథమిక విద్య తోనే సమాజానికి పునాదులు పడతాయన్నారు. వెనకబడిన కొరాపుట్ జిల్లాలో పాఠశాలలకు వెళ్లడానికి సరైన మార్గాలు లేనప్పటికీ ఉపాధ్యాయులు విధి నిర్వహణలో వెనకడుగు వేయడం లేదన్నారు. పదవీ విరమణ చేసిన 10 మంది ఉపాధ్యాయులను సత్కరించారు. కొరాపుట్ జిల్లా నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శశి భూషణ్ దాస్, బీఈఓ చందన్ కుమార్ పట్నాయక్, ఉపాధ్యాయుల సంఘం జయపూర్ విభాగ అధ్యక్షురాలు భారతీ హోత్త, తదితరులు పాల్గొన్నారు. -
● పూరీలో బర్డ్‌ఫ్లూ కలకలం
భువనేశ్వర్: పూరీ జిల్లా డెలాంగ్ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. బుధవారం డెలాంగు ప్రాంతంలోని కోళ్లఫారాల వద్ద వందలాది కోళ్లు చనిపోయాయి. ప్రధానంగా అంకులా, గొడిపుట్ మటియాపడా పరిరాల కోళ్ల ఫామ్ హౌస్‌లో కోళ్ల మరణాలు ఎక్కువగా సంభవించాయి. దీంతో కోళ్ళ పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు డెలాంగ్‌లో సుమారు 3 వేల కోళ్లు చనిపోయినట్లు సమాచారం. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించారు. ప్రత్యేక వైద్య ఈ బృందం వివిధ కోళ్ల ఫారాలు సందర్శించి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తోంది. పరిపాలన 3 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం ప్రభావిత ప్రాంతాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తోంది. -
పాముకాటుతో బాలిక మృతి
కవిటి: మండలంలోని పాత శిలగాం పూడివీధికి చెందిన గొనప షన్విత(11) అనే బాలిక పాముకాటుతో మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం అర్ధరాత్రి ఇంట్లో పడుకొని ఉన్న సమయంలో పాము కాటు వేసింది. దీంతో బాలిక ఉదయం లేచిన తర్వాత విపరీతంగా వాంతులు చేసుకుంటూ అపస్మారక స్థితికి వెళ్లడంతో సోంపేట ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యమందించారు. పరిస్థితి విషమించడంతో బాలిక చికిత్స పొందుతూనే మంగళవారం మృతి చెందింది. శిలగాం ఉన్నత పాఠశాలలో బాలిక ఆరో తరగతి చదువుతోంది. రోడ్డు ప్రమాదంలో కార్యదర్శికి గాయాలు మెళియాపుట్టి: మండలంలోని చాపర గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న చింతల అప్పారావు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం సాయంత్రం విధులు ముగించుకుని స్వగ్రామం కొరసవాడకు వెళ్లే క్రమంలో ఒడిశా రామసాగరం గ్రామం వద్ద ఆయన ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయారు. దీంతో అక్కడే ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు 108కు సమాచారం అందించారు. అక్కడి నుంచి ఒడిశా పర్లాఖిమిడి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళం తరలించినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. పాముల సయ్యాట కొత్తూరు: మండల కేంద్రంలోని ఎన్ఎన్ కాలనీలో మంగళవారం రాత్రి పాములు సయ్యాటాడుతూ కనిపించాయి. కాలనీలోని ప్రజలంతా ఆసక్తిగా గమనించారు. అయితే ప్రజలు సంచరిస్తున్న ప్రాంతాల్లో ఇటువంటి ఘటన జరగడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గంజాయితో ఇద్దరు యువకులు అరెస్టు కాశీబుగ్గ : పలాస రైల్వేస్టేషన్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు సుమారు నాలుగు కేజీల గంజాయి తరలిస్తూ కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డారు. తమిళనాడు రాష్ట్రం చైన్నెకు చెందిన రామ్మూర్తి దినేష్కార్తీక్ ఒడిశాలో 4 కేజీల గంజాయి కొనుగోలు చేసి తిరిగి చైన్నె వెళ్లేందుకు పలాస రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న క్రమంలో కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. కటక్‌కు చెందిన చిత్తరాంజన్ దాస్ అనే వ్యక్తి పర్లాకిమిడిలో 2 కేజీల గంజాయిని కొనుగోలు చేసి కటక్ వెళ్లేందుకు పలాస రైల్వే స్టేషన్ వెళ్తున్న క్రమంలో కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డాడు. వీరిద్దరి నుంచి 6 కేజీల గంజాయి, మొబైల్ ఫోన్‌ను స్వాధీనపరచుకున్న పోలీసులు కేసు నమోదుచేసి ఇరువురిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ వెల్లడించారు. బరితెగించిన ఆక్రమణదారులు సంతబొమ్మాళి: మండలంలోని పోతునాయుడుపేట గ్రామంలో ఆక్రమణదారులు బరితెగించారు. సాగునీటి కాలువ, రోడ్డుకు మధ్య ఉన్న సుమారు 30 సెంట్లు స్థలం కబ్జా చేశారు. ఆక్రమించిన స్థలంలో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం వేసిన తాగునీటి బోరును పీకేసి ఆనవాలు లేకుండా చేశారు. దీంతో తాగునీటికి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఆక్రమణదారులను గ్రామస్తులు ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడడంతో భయపడి ఫిర్యాదు కూడా చేయలేదు. దీంతో పాటు రోడ్డుకు అనుకొని ఉన్న బెర్ముతో పాటు సాగునీటి కాలువ గట్టును కూడా ఆక్రమించి మట్టిని వేసి కబ్జా చేశారు. ఆక్రమించిన స్థలంలో విద్యుత్ స్తంభాలు ఉండడంతో అవి కూడా తొలగించమని సంబంధిత కాంట్రాక్టర్‌తో ఆక్రమణదారులు గొడవపడిన సంఘటనలు ఉన్నాయి. ఆక్రమించిన స్థలంలోని 11 సెంట్లును వేరొక వ్యక్తికి ఆక్రమణదారులు అమ్మి తప్పుడు సర్వే నంబర్‌తో రిజిస్టేషన్ చేయించారని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై రెవెన్యూ ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తహసీల్దార్ హేమసుందర్‌ను దీనిపై వివరాలు అడుగగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
నందాహండిలో నిధుల స్వాహా
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా నందాహండి సమితిలో రూ.12 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రతిపక్ష బీజేడి ఆరోపించింది. మంగళవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని గ్లేజ్ హోటల్లో పార్టీ మాజీ ఎంపీ ప్రదిప్ మజ్జి విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో అతి చిన్న సమితి నందాహండిలో మూడేళ్లలో 127 ప్రాజెక్టులకు నిధులు విడుదలయ్యాయని చెప్పారు. పనులు జరగకుండానే జరిగినట్లు రికార్డుల్లో చూపించి నిధులు కై ంకర్యం చేశారని ఆరోపించారు. వాటర్ షెడ్, హార్టికల్చర్, అటవీ, సమితి విభాగంలో సమష్టి కుంభకోణం జరిగిందన్నారు. తక్షణమే విజిలెన్స్ దర్యాప్తు చేపట్టాలని డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేడీ నాయకులు అరుణ్ మిశ్రా, మంజులా మజ్జి, రబీ పట్నాయక్, సరోజ్ పాత్రో, ప్రమోద్ రథ్, నాగేంద్ర పట్నాయక్, ఉత్తం త్రిపాఠి, రాజేష్ త్రిపాఠి, సుమిత్ పూజారి, దయానిధి బిసోయి తదితరులు పాల్గొన్నారు.రెవెన్యూ ఉద్యోగుల నిరసన కొరాపుట్: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కొరాపుట్ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు బుధవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ మినిసీ్త్రరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్రశాఖ పిలుపు మేరకు నిరసనల్లో పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీలోగా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించక పోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. పాత పింఛన్ విధానం పునరుద్ధరించాలని, కొత్త పెన్షన్ విధానం రద్దు చేయాలని, రూ. 20 లక్షల బీమా ఇవ్వాలని, కొత్త ఉద్యోగాలు ఏర్పాటు చేయాలని, ఖాళీలు భర్తీ చేయాలని నినాదాలు చేశారు. జిల్లాలోని 14 సమితులు, నాలుగు మున్సిపాలిటీల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.యువకుడు బలవన్మరణం రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి మునిఖోల్ గ్రామానికి చెందిన ధీరజ్ ఆచార్య (23) మంగళవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధీరజ్ ఆచార్య మునిఖోల్ గ్రామంలోనే తల్లితో కలిసి ఉంటూ చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. అయితే ఏం కష్టం వచ్చిందోగాని మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటిపై కప్పుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది సేపటి తరువాత తన తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి ఽధీరజ్ శవమై వేలాడుతూ కనిపించడంతో కన్నీరుమున్నీరైంది. ఇరుగు పొరుగు వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆచార్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మునిగుడ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఐఐసీ సౌదామిని బెహర తెలిపారు. సారాతో ఇద్దరి అరెస్టు జయపురం: చట్ట వ్యతిరేకంగా నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జయపురం అబ్కారీ అధికారి సుభ్రత్ కిశోర్ హిరన్ బుధవారం తెలిపారు. అరెస్టయిన వారిలో జయపురం సమితి ఉమ్మిరి గ్రామానికి చెందిన కరణ కొటియ, డొంగాగుడ వాసి భీమా నాయిక్గా వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో నిందితులు కరణ, భీమాలు సారాను తరలిస్తుండగా పట్టుబడినట్టు పేర్కొన్నారు. వారిరువురుపై రెండు కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచామన్నారు. -
దళిత, మైనారిటీలపై దాడులు అరికట్టాలి
కొరాపుట్: రాష్ట్రంలో దళిత, మైనారిటీ వర్గాల ప్రజలపై దాడులు అరికట్టాలని సర్వమత సమ్మేళనం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రోను బుధవారం సర్వమతస్తులు కలిశారు. గంజాం జిల్లాలో దళిత యువకులకు శిరో మండనం చేసి వీధుల్లో ఊరేగించారని, మల్కన్‌గిరి జిల్లాలో మతం మారినందుకు క్రైస్తవ మతస్తుల ఇళ్లపై దాడులు చేశారని కలెక్టర్‌కు వివరించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాలరాస్తూ అగ్రకుల మతోన్మాదులు చెలరేగిపోతున్నారని ఆరోపించారు. అనంతరం కలక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర స్వాతంత్య్ర సమరయోధుల కుంటుంబాల సంఘం అధ్యక్షుడు మున్నా త్రిపాఠి, క్రైస్తవ, ముస్లిం, ఆదివాసీ, హరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
పదో తరగతి విద్యార్థిని వింత ప్రవర్తన!
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి చంద్రపొడ గ్రామం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు పాఠ్యం బోధిస్తున్న సమయంలో హటాత్తుగా 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనూహ్యంగా, వింతగా ప్రవర్తించింది. నాకు సారా ఇవ్వండి, బీడీ ఇవ్వండి అని పట్టుబట్టింది. తాను ఇక్కడ నుంచి వెళ్లను, నేను వారిని చంపుతాను అని పిచ్చిగా మాట్లాడుతూ వింతగా ప్రవర్తించింది. ఆ సమయంలో రాష్ట్ర విద్యావిభాగ డైరెక్టర్, జిల్లా విద్యాధికారులు పాఠశాలకు వచ్చారు. వింతగా ప్రవర్తిస్తున్న బాలికను చూసిన అధికారులు వెంటనే హాస్పిటల్‌కు తీసుకుళ్లాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆ సమయంలో విషయం తెలిసిన బాలిక సోదరుడు వచ్చి తన చెల్లెను హాస్పిటల్‌కు కాకుండా నేరుగా ఇంటికి తీసుకువెళ్లాడు. బాలిక పరిస్థితిని చూసిన తోటి విద్యార్థులు ఆమెకు దెయ్యమో, భూతమో ఆవహించిందని భయంతో వణికిపోయారు. బాలికను ఆదివాసీ వైద్యుడు దిశారీ వద్దకు తీసుకువెళ్లినట్లు తెలిసింది. మారుమూల ఆదివాసీ గ్రామీణ ప్రజలలో మూఢనమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయని, వారిని చైతన్యవంతులను చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయురాలు రాజలక్ష్మీ మిశ్ర అభిప్రాయపడ్డారు. బాలికకు భూతం పట్టిందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఇటువంటి సంఘటనలకు మానసిక వ్యాధులే కారణమని, హాస్పిటల్లో వైద్యం చేయించటం మంచిదని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. -
రైల్వే వంతెన మంజూరు చేయాలి
● నందపూర్ సమితి వాసుల డిమాండ్కొరాపుట్: అవసరమున్న చోట రైల్వే వంతెన లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి పాడువా సమీపంలో డర్లిపుట్ వైపు ప్రజలు రైల్వే వంతెన కావాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇటీవల జరిగిన బహుడా రథాయాత్ర రోజున రోడ్డు పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ మీద భక్తులు అధిక సంఖ్యలో కూర్చుని సేద తీరారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే సమయంలో రైళ్లు వస్తే పరిస్థితి ఏమిటని ఈ ప్రాంతీయులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ రోజూ బాలలు ట్రాక్ దాటుకుంటూ పాఠశాలలకు వెళ్తుంటారు. అక్కడ ఉన్న స్థల పరిస్థితి ప్రకారం ఫుట్‌పాత్ వంతెన నిర్మించాలని ప్రజలు ఛిరకాలంగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో రైల్వే అధికారులు సర్వే చేసి వెళ్లారు. కానీ ఇంత వరకు వంతెన మంజూరుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి వంతెన నిర్మాణం చేసి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
గజపతిలో అధికారుల పర్యటన
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో కేంద్ర పౌరసరఫరాలు, క్యాంప్ సంక్షేమ సంచాలకులు సునీల్ సచ్దేవ్, జాతీయ ఆహార భద్రత చట్ట కేంద్రీయ ప్రాజెక్టుల మానిటరింగ్ అధికారి సచిన్ కుమార్, ఆకాంక్ష బ్లాకులు గుమ్మా, ఆర్.ఉదయగిరిలో బుధవారం పర్యటించారు. వారితో సబ్ కలెక్టర్ అనుప్ పండా, అదనపు జిల్లా పౌరసరఫరాల అధికారిని స్నేహాసినీ బెహరా, ఆర్.ఉదయగిరి బీడీఓ. నారీమన్ ఖర్సల్, తాహాసిల్దార్లు వున్నారు. ఆకాంక్ష మండళాలు ఆర్.ఉదయగిరి, గుమ్మా సమితుల్లో కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలను వారు సమీక్షించారు. కేంద్ర పౌరసరఫరాలు, సంక్షేమ శాఖ డైరక్టర్ సునీల్ సచ్దేవ్, సచిన్ కుమార్ తొలుత ఆర్.ఉదయగిరి బ్లాక్ అబార్ సింగి, శవరపల్లి గ్రామపంచాయతీలలో పథకాలను లబ్ధిదారులకు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. గుమ్మా బ్లాక్‌లో రాగిడి, తరబ పంచాయతీల్లో అమలు జరుగుతున్న కేంద్ర పథకాలు రేషన్ డిపోల వద్దకు వెళ్లి పి.డి.ఎస్.బియ్యం నాణ్యతను తనిఖీలు చేశారు. అనంతరం పర్లాకిమిడిలో ఆర్.ఉదయగిరి ప్రాంతీయ నియంత్రణ బజార్ కమిటీ గోడౌన్లో బియ్యం స్టోరేజీ, రేషన్ బియ్యం బస్తాల స్టాక్‌ను తనిఖీలు చేపట్టారు. తర్వాత కలెక్టరేట్‌కు చేరుకుని పాలనాధికారి బిజయకుమార్ దాస్‌తో ఇద్దరు కేంద్ర అధికారులు కలిసి పర్యటన విశేషాలను మాట్లాడారు. గజపతి జిల్లాలో ప్రాథమిక విధ్య, ఆరోగ్యం, పౌరసరఫరాలు, జనవనరులు మౌలిక సమస్యలపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ప్రజలకు అందాల్సిన పీఎం జనమణ యోజనా పథకం, మన్రేగా, స్వచ్ఛభారత్ అభియాన్, ప్యాక్ప్ గుమ్మా, కేంద్ర ఆయుష్మాన్ భారత్ పథకాలు అమలుపై చర్చించారు. తిరిగి ఇద్దరు కేంద్ర అధికారులు భుభనేశ్వర్ పయనమయ్యారు. -
పస్తులు ఉండలేక
అన్నం తినలేక.. ● మధ్యాహ్న భోజనంలో పురుగులు ● ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ● పట్టించుకోని అధికారులు కంచిలి: మండలంలోని కంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వండుతున్న అన్నంలో పురుగులు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ సన్నబియ్యంతో వండిన అన్నంలో కొద్ది రోజులుగా పురుగులు వస్తుండడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కూరగాయల అన్నం, ఉడకబెట్టిన కోడిగుడ్డు, బంగాళ దుంపలు కూర, వేరుశనగ చిక్కిను వడ్డించారు. అయితే కూరగాయల అన్నంలో కొందరు విద్యార్థులకు పురుగులు దర్శనమిచ్చాయి. ఇక్కడ కొద్దిరోజులుగా ఇదేవిధంగా అన్నంలో తెల్లటి పురుగులు వస్తున్నాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. రెండో‘సారీ’ ఇటీవల ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి వెంకటేశ్వర పాణిగ్రాహి బియ్యాన్ని తనిఖీ చేసి, మొదటి బ్యాచ్‌లో సరఫరా చేసిన రెండు ప్యాకెట్ల పాత నిల్వ ఉన్న బియ్యాన్ని వెనక్కి తీసుకెళ్లారు. అయితే రెండో బ్యాచ్‌లో మళ్లీ సరఫరా చేసిన బియ్యంలో కూడా తెలుపు, నలుపు రంగుల్లో పురుగులు వస్తున్నాయని వంట చేస్తున్న ఏజెన్సీ మహిళలు తెలిపారు. దీనిపై పాఠశాల హెచ్ఎంకు సమాచారం ఇవ్వడంతో ఆయన స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఇలా ప్రతిరోజు విద్యార్థులకు పెడుతున్న అన్నంలో పురుగులు వస్తుండడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కూరగాయల అన్నంలో పురుగు బుధవారం పాఠశాల మధ్యాహ్న భోజనం మెనూలో వడ్డించిన కూరగాయల అన్నంలో నల్లటి పురుగులు వచ్చాయి. ఈ మధ్యకాలంలో ప్రతిరోజూ ఇదేవిధంగా పురుగులు వస్తున్నాయి. దీంతో సరిగా అన్నం తినలేకపోతున్నాం. – ఎల్.చందు, ఆరో తరగతి విద్యార్థి ● -
రిజర్వాయర్‌లో పడి వృద్ధుడు మృతి
కొరాపుట్: జోలాపుట్ రిజర్వాయర్‌లో పడి వృద్ధుడు మృతి చెందాడు. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి పాడువా పోలీస్ స్టేషన్ పరిధిలోని జోలాపుట్ రిజర్వాయర్ పరిధి రెంటా గ్రామ సమీపంలో ఉభ్న పర్ష ఘాట్ వద్ద జోడిపుట్ గ్రామానికి చెందిన సామ్ కిలో (60) స్నానానికి దిగి నీటిలో గల్లంతయ్యాడు. ఉదయం స్నానం కోసం వెళ్లిన సామ్ కిలో సాయంత్రం వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. సాయంత్రం సమయంలో రిజర్వాయర్ మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని పోలీసులు ఒడ్డుకు చేర్చారు. పాడువా ఎస్ఐ దీపక్ బారిక్ కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అయ్యో అన్నదాత..!
ఇచ్ఛాపురం రూరల్: ‘ఖరీఫ్ నాటికి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. రైతుల వినతి మేరకు మూలకు చేరిన ఈదుపురం ఎత్తిపోతల పథకాన్ని రూ.9 కోట్లతో పునరుద్ధరిస్తాం’ అని గతేడాది నవంబర్ 1వ తేదీన ఈదుపురం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు ఇవి. ఈ మాటలు చెప్పి నేటికి 8 నెలలు కావస్తున్నా ఎత్తిపోతల పథకం కోసం ఇప్పటివరకు నయా పైసా కూడా విడుదల చేయలేదు. దీంతో సీఎం హామీపై ఆశలు పెట్టుకున్న అన్నదాతకు అవస్థలు తప్పడం లేదు. 1,200 ఎకరాలకు సాగునీరు ఇచ్ఛాపురం మండలం కొఠారీ, పూర్ణాటకం, పత్రిపుట్టుగ, ధర్మపురం గ్రామాలతో పాటు కవిటి మండలంలోని భైరిపురం, వింధ్యగిరి, రాజపురం, లండారిపుట్టుగ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉండే 1200 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే ఏకై క ఎత్తిపోతల పథకం జైకిసాన్ ఎత్తిపోతల పథకం. ఈదుపురం బాహుదా నది పక్కన 2004లో నిర్మించారు. కేవలం వర్షాధారంపై పండించే ఈ ప్రాంత రైతులకు జైకిసాన్ ఎత్తిపోతల పథకం వరంగా మారింది. రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులు సక్రమంగా పంటలను పండించుకునేవారు. అయితే 2009లో కురిసిన భారీ వర్షాలకు బాహుదా నది ఉప్పొంగడంతో ఎత్తిపోతల పథకం నీట మునిగింది. దీంతో యంత్రాలు పాడైపోయాయి. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయడంతో మరో ఐదేళ్ల పాటు రైతులకు సాగునీటి ఇబ్బందులు తీరాయి. 2018 అక్టోబర్‌లో వచ్చిన తిత్లీ తుఫాన్‌కు బాహుదా వరద నీటిలో ఎత్తిపోతల పథకం 15 రోజుల పాటు ఉండిపోవడంతో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు ఎత్తిపోతల పథకానికి సంబంధించి యంత్రాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అప్పటినుంచి ఏడేళ్లుగా 1200 ఎకరాలకు సాగునీరు అందకపోవడంతో అక్కడి రైతులు అవస్థలు పడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీతో ఈ ఏడాది ఖరీఫ్ కష్టాల నుంచి గట్టెక్కుతాం అనుకున్న రైతులకు అడియాసలే మిగిలాయి. రూ.9 కోట్లతో ఎత్తిపోతల పథకానికి పూర్వ వైభవం తెస్తామన్న ఆయన హామీ నీటిమూటగా మిగిలిపోయింది. పత్తా లేకుండా పోయిన సీఎం చంద్రబాబు హామీ మూలకు చేరిన ఈదుపురం ఎత్తిపోతల పథకం మొదలైన ఖరీఫ్ కష్టాలు -
దయితరిదాస్ బాబా కన్నుమూత
కొరాపుట్: ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో వేలాది అలేఖ్ మతస్తుల గురువు దయితరి దాస్ బాబా (80) తుదిశ్వాస విడిచారు. మంగళవారం నబరంగ్‌పూర్ జిల్లా చందాహండి సమితి దండాముండా గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఘరియాబంద్ జిల్లా ఉర్మల్ అటవీ ప్రాంతంలోని ఆశ్రమంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఒడిశాలోని కలహండి, నబరంగ్‌పూర్ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఛత్తీస్‌గఢ్ తరలివెళ్లారు. అటవీ ప్రాంతాల్లో గిరిజనులు వ్యసనాలు వదిలి ఆధ్యాత్మిక భావజాలంలోకి అడుగు పెట్టడానికి బాబా ఎంతగానో కృషి చేశారు. అంతిమ యాత్రకు నబరంగ్‌పూర్ మాజీ ఎంపీ, మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి తదితరులు హాజరయ్యారు. -
పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు
బూర్జ: మండలంలోని పాలవలస జెడ్పీహెచ్ స్కూల్, అల్లెన ప్రాథమికోన్నత పాఠశాలల్లో డీఈవో డాక్టర్ తిరుమల చైతన్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా పాలవలస జెడ్పీ హైస్కూల్ పరిశీలించారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల పనితీరుపై ఎంఈవోలు ఎన్.శ్యామసుందరరావు, బి.ధనుంజయరావులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యాబోధన ఏవిధంగా ఉందో విద్యార్థులకు ప్రశ్నలు అడిగి తెలసుకున్నారు. అల్లెన పాఠశాలలో విద్యార్థులు పాలవలస పాఠశాలలో మెర్జి చేయడంతో తల్లిదండ్రులు పంపించే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. అయితే 100 మంది విద్యార్థులు ఉంటే గానీ యూపీ స్కూల్ కొనసాగించలేమని డీఈవో పేర్కొన్నారు. ఆయనతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. హోంగార్డు కుటుంబానికి చేయూత శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసుశాఖలో హోంగార్డుగా పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు పి.జగన్నాథంకు జిల్లా హోంగార్డుల యూనిట్ ఒక్కరోజు వేతనం రూ.4.09 లక్షలను ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి చేతులమీదుగా అందజేశారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జగన్నాథంకు చెక్ అందించారు. మా భూములు తీసుకోవద్దు నరసన్నపేట: ఎంఎస్ఎంఈవో పార్క్ నిమిత్తం తమ భూములు తీసుకోవడానికి ప్రభుత్వం చూస్తోందని, తమ భూములు తీసుకోవద్దని మండలంలోని జమ్ము గ్రామానికి చెందిన ఎస్సీ రైతులు బమ్మిడి రామారావు, తలసముద్రం రాజారావు, తాడి మొఖలింగంలతో పాటు పలువురు రైతులు రెవెన్యూ అధికారులకు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. 40 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం తమ జీవానాధారానికి భూములను ఇచ్చిందని, ఇప్పుడు ఇండస్ట్రీయల్ పార్క్ పేరిట తాము సాగు చేసి పంటలు పండించుకుంటున్న భూములు తీసుకోవడానికి అధికారులు చూస్తున్నారన్నారు. ప్రభుత్వానికి ఇది ఏమాత్రం తగదని పేర్కొన్నారు. ఆర్ఐ సాయిరాంతో పాటు వీఆర్వో, సర్వేయర్లు వచ్చి సోమవారం కొలతలు వేశారన్నారు. తమ భూముల వైపు అధికారులు రావద్దని కోరారు. ‘ముప్పై ఏళ్లు టీడీపీలో కష్టపడ్డా.. గుర్తింపేదీ..?’ రణస్థలం: తాను ముప్పై ఏళ్లు టీడీపీలో కష్టపడ్డానని అయినా గుర్తింపు ఇవ్వలేదని టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ముక్కు ఆదినారాయణ అన్నారు. మండలంలోని రావాడ పంచాయతీలో తన ఇంటి వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశానని, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేశానని చెప్పారు. ఎచ్చెర్ల నియోజకవర్గ మార్కెట్ చైర్మెన్ ఎస్సీ రిజర్వేషన్ అయిందని, అన్ని అర్హతలుండి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే తనను నామినేట్ చేయకుండా వేరేవాళ్లకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. దీనికి నిరసనగా తాను పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తానని, అలాగే టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని తెలిపారు. విజిలెన్స్ దాడులు రణస్థలం: మండల కేంద్రంలోని రామతీర్థాలు రహదారిలో జే.ఆర్.పురంలో ఉన్న ఎరువుల దుకాణంపై విజిలెన్స్, వ్యవసాయ అధికారులు మంగళవారం దాడులు చేపట్టారు. దీనిలో భాగంగా స్టాక్ రిజిస్టర్‌తో ఎరువుల భౌతిక నిల్వలను పోల్చితే వ్యత్యాసాలు కనిపించాయి. అలాగే అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో ఎరువులను స్వాధీనం చేసుకొని, దుకాణం డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ రామారావు, కానిస్టేబుల్ ఈశ్వర్, మండల వ్యవసాయ ఏవో డి.విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు పలువురు రాజీనామా
కొరాపుట్: కాంగ్రెస్ పార్టీకి చెందిన కుంద్రా సమితి సభ్యులు, సర్పంచ్‌లు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం కొరాపుట్ జిల్లా కుంద్రా సమితికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జయపూర్ పట్టణంలోని సంగం కల్యాణ మండపంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమ సమితి చైర్మన్ రాజేశ్వరి పరజాకి తాము అభివృద్ధి కోణంలో మద్దతు ఇచ్చామన్నారు. ఆమె భర్త సురేంద్ర పరజా, మరో కాంగ్రెస్ నాయకుడు టునా పట్నాయక్‌లు ఎన్నికై న సభ్యులకు విలువ ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయాలు చేస్తున్నారన్నారు. ఇది కాంగ్రెస్ పెద్దలకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తామంతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఐదుగురు సర్పంచ్‌లు, ముగ్గురు సమితి సభ్యులు రాజీనామ చేశారు. కుంద్రాలో సమితి చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోవలసి వస్తుంది. దీనిపై కాంగ్రెస్ నాయకుడు టునా పట్నాయక్ మట్లాడుతూ.. తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి అని అన్నారు. -
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మన్మోహన్ సామల్
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మన్మోహన్ సామల్ మరోమారు ఎన్నిక అయ్యారు. మంగళవారం ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర శాఖ సంస్థాగత ఎన్నికల వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులైన బీజేపీ కేంద్ర నాయకుడు సంజయ్ జైస్వాల్ ప్రకటన చేశారు. ప్రకటన వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, మంత్రి వర్గం, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పండా, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు , సీనియర్ కార్యకర్తలు పార్టీ ప్రధాన కార్యాలయంలో వరుసగా నాలుగోసారి ఎన్నికై న మన్మోహన్ సామల్‌ను సత్కరించారు. రాష్ట్రంలో పార్టీ అత్యున్నత స్థానంలో ఇది ఆయన వరుసగా రెండు, సమగ్రంగా నాల్గో పర్యాయం ఈ హోదాకు ఎన్నిక కావడం విశేషం. గతంలో 1999, 2001లో బిజూ జనతా దళ్ (బీజేడీ)తో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వ సమయంలో ఆయన ఈ పదవికి ఎన్నికయ్యారు. 2023 మార్చిలో మరోసారి రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ఎన్నిక అయ్యారు. ఈ వ్యవధిలో 2024 సార్వత్రి ఎన్నికల్లో పార్టీకి ఘన విజయాన్ని చేజిక్కించిన ఘనత సొంతం చేసుకున్నారు. రాష్ట్రం నుంచి అత్యధికంగా 20 లోక్ సభ స్థానాలను పార్టీ కై వసం చేసుకుంది. 2024 ఎన్నికల్లో ప్రతిపాదిత బీజేడీతో పొత్తును నిరాకరించి ఒంటరిగా పోరాడటానికి కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి తన దక్షత, నైపుణ్యతని చాటుకున్నారు. ఆ తర్వాత జరిగిన తాజా ఎన్నికల్లో మరోసారి రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ఎన్నిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
బురదలో దిగబడిన బస్సు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పోడియా సమితి నీలిగూడ గ్రామం ప్రధాన రహదారిలో మంగళవారం పోడియా నుంచి మల్కన్‌గిరికి వెళ్తున్న బస్సు బురదలో దిగబడింది. రెండు గంటలపాటు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాక్టర్ సాయంతో బస్సును ఒడ్డుకు చేర్చారు. ఈ రహదారి పనులు గత రెండేళ్లుగా చేస్తున్నా పూర్తి కాలేదు. తరచూ ఈ రహదారిలో బైక్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వర్షం పడితే గోతుల్లో నీరుచేరి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి రహదారి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
కిశోర్, విద్యా చట్టాలపై అవగాహన
జయపురం: కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ ఆధ్వర్యంలో జయపురంలోని సరస్వతీ శిశు విద్యామందిర అరవిందనగర్ ప్రాంగణంలో సోమవారం కిశోర్ న్యాయ చట్టం 2015 (శిశు సంరక్షణ, భద్రత చట్టం) బాధ్యతాయుత విద్యా చట్టాలపై చైతన్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రదీకరణ జిల్లా అధ్యక్షులు, జిల్లా జడ్జి ప్రదీప్ కుమార్ మహంతి సూచన మేరకు నిర్వహించిన శిబిరంలో జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ కార్యదర్శి ప్రద్యోమయి సుజాత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె ప్రసంగిస్తూ.. కిశోర్ న్యాయ చట్టం గురించి వివరించారు. అలాగే బాల బాలికలు చదువుకునేందుకు నిర్బంధవిద్యా చట్టాలు కల్పించాయని, అలాగనే నేరాలు చేసే మైనర్ బాల బాలికలకు భద్రత, రక్షణ కల్పించి వారు చదువుకొనేందుకు కావాల్సిన వనరులపై అవగాహన కల్పించారు. పోస్కో ప్రత్యేక న్యాయ స్థానం ప్రభుత్వ న్యాయవాది డాక్టర్ గాయిత్రీ దేవి, శిశు కళ్యాణ కమిటీ కొరాపుట్ అధ్యక్షులు గాయిత్రీ పాత్రో, పీఓఐసీ కొరాపుట్ రిషభ నాయిక్, జయపురం పట్టణ పోలీసు ఏఎస్ఐ సత్యబాది నాయిక్, సరస్వతీ విద్యామందిర్ పారాబెడ అధ్యాపకులు డాక్టర్ రమణీరంజన్ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 9, 10 తరగతుల విద్యార్థులకు విజ్ఞాన ప్రతిభపై పోటీలు నిర్వహించి విజేతలకు జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ కార్యదర్శి ప్రద్యోమయి సుజాత చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. -
హత్య కేసులో నిందితుడు అరెస్టు
కొత్తూరు: మండలంలోని వసప గ్రామానికి చెందిన లుకలాపు మిన్నారావు హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో మంగళవారం హాజరు పరిచినట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు. నిందితుడు శంకరరావు నిర్వహిస్తున్న పాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు మృతుడు మిన్నారావు పకోడి, బజ్జీలు కొనుగోలు చేసేందుకు ప్రతిరోజూ వెళ్తుంటాడు. దీనిలో భాగంగా మృతుడు మిన్నారావు ఈనెల 5వ తేదీ రాత్రి శంకరావు పాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వెళ్లి పకోడి కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇద్దరు మధ్యం వివాదం జరిగింది. మిన్నారావు గతంలో బాకీ డబ్బులు ఇవ్వకపోవడంతో బాకీ విషయంలో ఇద్దరి మధ్య కొట్లాట జరిగింది. కొట్లాటలో మిన్నారావు తలపై సుత్తితో తల వెనుకభాగంలో కొట్టడంతో పాటు చాకుతో పీకను కోసి చంపినట్లు సీఐ ఎండీ అమీర్ అలీ పాల్గొన్నారు -
10 కేజీల గంజాయి స్వాధీనం
నరసన్నపేట: ఒడిశా నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న 10 కేజీల గంజాయిని నరసన్నపేట పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు బసంత మహాపాత్రో, సిద్దాంత స్వైన్లను అరెస్టు చేసినట్లు నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్‌తో కలిసి ఆయన తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఎప్పటిలాగే మడపాం టోల్ గేట్ వద్ద నరసన్నపేట ఎస్ఐ దుర్గాప్రసాద్ తదితరులు మంగళవారం ఉదయం వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు కనిపించడంతో సోదాలు చేయగా వీరి వద్ద గంజాయి గుర్తించామన్నారు. వీరిద్దరూ ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా రంభ పోలీసుస్టేషన్ పరిధిలోని కొండాలి గ్రామం నుంచి అక్రమంగా గంజాయిని బెంగళూరు తరలిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. దీంతో గంజాయిని సీజ్‌చేసి, కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. గంజాయి రవాణాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పరశురాం మజ్జి
కొరాపుట్: భారతీయ జనతా పార్టీలో అత్యున్నత జాతీయ కౌన్సిల్ సభ్యునిగా నబరంగ్‌పూర్ మాజీ ఎంపీ పరశురాం మజ్జి నియమితులయ్యారు. మంగళ వారం అందుకు తగ్గ ఆదేశాలను రాష్ట్ర పార్టీ నాయకత్వం ప్రకటించింది. పరశురాం 2000–09 ల మధ్య రెండు సార్లు నబరంగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. జాతీయ కౌన్సిల్ సభ్యుని హోదా లో పార్టీ జాతీయ అధ్యక్షుని ఏన్నికలలో ఓటు వినియోగించుకునే హక్కు ఉంది. పరశురాంను పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. జిల్లా సివిల్ సప్లై అధికారిగా మానస రంజన్ జయపురం: కొరాపుట్ జిల్లా సివిల్ సప్లై నూతన అధికారిగా మానస రంజన్ మహాపాత్రో నియమితులయ్యారు. ఈయన మంగళవారం జయపురం జిల్లా సివిల్ సప్లై కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మహాపాత్రో ఇంత వరకు జాజ్‌పూర్ జిల్లా సివిల్ సప్లై అధికారిగా పనిచేస్తూ కొరాపుట్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఇప్పటి వరకూ కొరాపుట్ జిల్లా సివిల్ సప్లై అధికారిగా ఉన్న ప్రదీప్ కుమార్ పండ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ప్రదీప్ కుమార్ పండను జాజ్‌పూర్ జిల్లా సివిల్ సప్లై అధికారిగా రాష్ట్ర సివిల్ సప్లై విభాగం నియమించింది. పేకాట శిబిరంపై దాడి పర్లాకిమిడి: గజపతి జిల్లా గుసాని సమితి గురండి పంచాయతీ మధుసూదన్ పూర్ గ్రామంలో గత కొద్ది రోజులుగా జరుపుతున్న పేకాట శిబిరంపై పోలీసులు మంగళవారం సాయంత్రం దాడి చేశారు. ఈ దాడుల్లో రూ.2,44,100లు నగదు స్వాధీనం చేసుకుని 8 మందిని అరెస్టు చేసినట్టు గురండి ఐఐసీ ఓం నారాయణ పాత్రో తెలియజేశారు. -
నిజమందిరానికి చేరిన జగన్నాథుడు
పర్లాకిమిడి: పదిరోజులపాటు గుండిచా రథయాత్రకు బయలుదేరిన జగన్నాథ, సుభద్ర, బలభద్రులు మంగళవారం ఉదయం మూడు రథాలతో నిజ మందిరానికి క్షేమంగా విచ్చేశారు. జిల్లా ఎస్పీ జ్యోతింద్రపండా, సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, తహసీల్దారు, ఐఐసీ ప్రశాంత్ భూపతి, ఇతర భక్తుల సహాయంతో రాజవీధి నుంచి శ్రీమందిరం వరకూ రథాన్ని లాగారు. గురువారం గురుపౌర్ణమి సందర్భంగా శ్రీలక్ష్మీదేవితో కలిసి శ్రీలక్ష్మీనారాయణ అవతారంతో రథాయాత్ర ముగుస్తుంది. ఆఖరిరోజున పెద్ద యాత్ర జరుగనున్నది. -
రాజ్యాంగ పరిరక్షణకే రాహుల్ పర్యటన
కొరాపుట్: రాజ్యాంగ పరిరక్షణ కోసమే రాష్ట్రానికి రాహుల్ గాంధీ వస్తున్నారని కొరాపుట్ డీసీసీ కో ఆర్డినేటర్ శశి భూషణ్ బెహరా పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జయపూర్ మెయిన్ రోడ్డులోని కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 11వ తేదీన భువనేశ్వర్‌లో రాజ్యాంగ పరిరక్షణ సభ జరుగుతుందన్నారు. ఈ సభకి రాహుల్‌తోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తదితరులు వస్తారన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, పేదలకు అందని సంక్షేమ పథకాలు, తదితర అంశాలపై ఈ సభలో నిరసన గళం వినిపిస్తామని శశి భూషణ్ బెహరా పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా పరిశీలకుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజ్ గంగ్ పూర్, ఎమ్మెల్యే పి.ఎస్.రాజన్ హిక్కా, చిత్ర కొండ ఎమ్మెల్యే మంగులు కిలో, జయపూర్ మున్సిపల్ చైర్మన్ నొరి మహంతి, నాయకుటు నిమయ్ సర్కార్, రుపక్ తురుక్, తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా వనమహోత్సవం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఛలాన్‌గూఢ పంచాయతీలోని నర్సరీ వద్ద మంగళవారం వనమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అటవీశాఖ డీఎఫ్‌వో సాయికిరణ డి.ఎన్ నేతృత్వంలో కార్యక్రమం జరగ్గ ముఖ్యఅతిథిగా మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడం మన హక్కు అన్నారు. మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమన్నారు. నాటిన మొక్కలను సక్రమంగా సరంక్షించాలని వక్తలు కోరారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్ చంద్రశభరో, ఛలాన్‌గూఢ సర్పంచ్ అరక్షత నాయక్, ఛలాన్‌గూఢ పాఠశాల విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో 200 మొక్కలు నాటారు. -
రవాణా వ్యవస్థలో ప్రతిష్టంభన
నిజమందిరానికి.. జగన్నాథుడు నిజ మందిరానికి చేరుకున్నాడు. పర్లాకిమిడిలో యాత్ర ముగిసింది. –8లోuబుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025శ్రీమందిరం ఆదాయం లెక్కింపు భువనేశ్వర్: పూరీ జగన్నాథాలయం హుండీలో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన ఆదాయాన్ని పాలకవర్గం సోమవారం లెక్కించారు. ఇందులో నగదు రూ.6,86,982లు, బంగారం 3 గ్రాముల 600 మిల్లీగ్రాములు, వెండి 1 గ్రాము 100 మిల్లీగ్రాములు వచ్చాయని అధికారులు తెలిపారు. భువనేశ్వర్: అఖిల ఒడిశా ట్రక్, బస్సు డ్రైవర్ల మహా సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఆరంభమైంది. ఈ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సేవలను తీవ్రంగా ప్రభావితం చేసింది. రాష్ట్రంలో ప్రైవేట్ బస్సు, ట్రక్ యజమానుల సంఘం ఈ సమ్మెకు సంఘీభావం ప్రకటించింది. అనేక మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. సమ్మె ప్రభావంతో మంగళవారం రవాణా రంగం పూర్తిగా స్తంభించిపోయింది. అవగాహన లేని ప్రయాణికులు పలు చోట్ల బస్ స్టాపుల్లో చిక్కుకున్నారు. బస్సు సేవల పునరుద్ధరణ కోసం నిరీక్షించడంలో నిరుత్సాహానికి గురయ్యారు. సరుకు రవాణా కూడా తీవ్రంగా ప్రభావితమైంది. అఖిల ఒడిశా డ్రైవర్ల మహాసంఘ 6 ప్రధాన డిమాండ్లతో ఆందోళనకు నడుం బిగించింది. వాటిలో డ్రైవర్ల సంక్షేమ బోర్డులో ఆటో డ్రైవర్లను చేర్చడం, 60 ఏళ్లు పైబడిన డ్రైవర్లకు ఫించను భద్రత, ఎక్కడికక్కడ విశ్రాంతి గదులు, మరుగు దొడ్ల సౌకర్యాలు, ప్రతి 100 కిలో మీటర్ల పరిధిలో వాహనాల పార్కింగ్ స్థలాలు, డ్రైవర్ల భద్రతకు హామీపూర్వక చట్టాల అమలు, గనులు, పారిశ్రామిక ప్రాంతాలలో డ్రైవర్లకు ఉద్యోగాలు కల్పించడంలో 70 శాతం రిజర్వేషన్ సౌకర్యం, ఏటా సెప్టెంబర్ 1ని జాతీయ డ్రైవర్ల దినోత్సవంగా ప్రకటన ప్రధాన డిమాండ్లుగా చోటు చేసుకున్నాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా సమ్మె పట్ల స్పందించారు. డ్రైవర్ల సంఘం ప్రతిపాదిత డిమాండ్లను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు సంఘం ప్రతినిథి ప్రముఖుల్ని త్వరలో ఆహ్వానిస్తుందన్నారు. వీరి డిమాండ్లలో కొన్ని న్యాయ సమ్మతమైనవిగా అభిప్రాయం వ్యక్తం చేశారు. చర్చల ద్వారా ప్రతిష్టంభన తొలగించే దిశలో ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ప్రకటించారు. న్యూస్‌రీల్ ఒడిశా డ్రైవర్ మహాసంఘం రాష్ట్రవ్యాప్త సమ్మెడ్రైవర్లు స్టీరింగ్ చోడొ ఆందోళన రాయగడ: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా రాయగడ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్టీరింగ్ చొడో ఆందోళన చేపట్టారు. స్థానిక సాయి ఇంటర్నేషనల్ కూడలిలో డ్రైవర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. డ్రైవర్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, సంక్షేమ బోర్డులో తమ పేర్లు నమోదు చేయాలని, సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. -
చెరువులో మునిగి తల్లీబిడ్డ మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి దౌడాగూఢ గ్రామంలో మంగళవారం ఓ తల్లీబిడ్డ స్నానానికి వెళ్లి నీటిలో మునిగి మృతి చెందారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గురునాథ్ బాగరియా భార్య ప్రియా(24) తన ఐదు నెలల కుమార్త పింకీతో కలిసి మంగళవారం ఉదయం చెరువుకు వెళ్లింది. అయితే బిడ్డకు స్నానం చేయిస్తుండగా ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఉదయం వెళ్లిన వారు మధ్యాహ్నానికి కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామమంతా వెతికారు. చివరకు చెరువు వద్ద ప్రియ చీర కనిపించడంతో వెంటనే మత్తిలి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. వారు వచ్చి చెరువులో మునిగిపోయిన తల్లీబిడ్డను బయటకు తీశారు. తర్వాత మత్తిలి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఐఐసీ ప్రియదర్శిని సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోర్టుమార్టం కోసం మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. -
అద్వితీయంగా అంతిమ ఘట్టం
భువనేశ్వర్: పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష త్రయోదశి తిథి పురస్కరించుకుని శ్రీ జగన్నాథుని రథ యాత్ర అంతిమ ఘట్టం నీలాద్రి విజే మంగళవారం జరిగింది. దీంతో శ్రీ జగన్నాథుని వార్షిక రథ యాత్ర ముగిసింది. సంధ్యా ధూపం తర్వాత రథంపై ఉన్న మూల విరాటులతో ఉత్సవ మూర్తులను వరుస క్రమంలో గొట్టి పొహండి నిర్వహించి సురక్షితంగా శ్రీ మందిరం రత్న వేదికకు చేర్చడంతో నీలాద్రి విజే విజయవంతమై రథ యాత్రకు తెర పడింది. రథ యాత్ర క్రమంలో ఉత్సవ సేవాదులు నిర్వహించారు. రథాలపై మూల విరాటుల పూజలు ముగియడంతో రథాల పైనుంచి విగ్రహాల్ని దించేందుకు చారుమళ్లు ఏర్పాటు చేశారు. వీటి గుండా వరుస క్రమంలో మూల విరాటులతో ఉత్సవ మూర్తుల్ని శ్రీ మందిరం రత్న వేదిక పైకి తరలించారు. బుధ వారం నుంచి శ్రీ మందిరం రత్న వేదికపై భక్తులకు యథాతథంగా ఏడాది పొడవునా చతుర్థా మూర్తుల దర్శనం ప్రాప్తిస్తుంది. మహాలక్ష్మికి స్వామి బుజ్జగింప రథయాత్ర అంతిమ ఘట్టం నీలాద్రి విజే మహోత్సవంలో శ్రీ మహాలక్ష్మి దేవిని జగన్నాథ స్వామి బుజ్జగించే వైనం భక్త జనాన్ని ముచ్చట గొలిపించే అపురూప ఘట్టం. నీలాద్రి విజే సమయంలో సుదర్శనుడు, దేవీ సుభద్ర, బలభద్ర స్వామిని శ్రీ మందిరంలోనికి ఆహ్వానించిన శ్రీ మహా లక్ష్మి ప్రియ నాథుడు శ్రీ జగన్నాథుని ప్రవేశం అడ్డుకుని శ్రీ మందిరం సింహ ద్వారం తలుపులు మూసి వేస్తుంది. తనను విస్మరించి తోబుట్టువులతో యాత్రకు ఏగి విరహ వేదన తాళలేక స్వయంగా దర్శనం కోసం వెళ్లిన నిరుత్సాహ పరచడంతో శ్రీ మహా లక్ష్మి అలక ప్రదర్శించడం ఈ ముచ్చట గొలిపే ఘట్టం జానపద ఇతివృత్తం. దేవేరి అలక తీర్చేందుకు యాత్ర కానుకగా శ్రీ జగన్నాథుడు రసగుల్లాను దేవేరికి సమర్పించడంతో మురిసిపోయి సాదరంగా శ్రీ మందిరం లోనికి ఆహ్వానిస్తుంది. ఇది రథ యాత్రలో చిట్ట చివరి ముచ్చట గొలిపే ఘట్టం. -
దారికాచిన మృత్యువు..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితి కత్తమేట గ్రామం వద్ద మంగళవారం టమటా లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి అటుగా వస్తున్న బైక్‌పై పడింది. బైక్‌పై వస్తున్న కానిస్టేబుల్ కృష్ణ పూజారి, భార్య రుక్మిణి పూజారి ట్రక్కు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో కృష్ణ పూజారి అక్కడికక్కడే మృతి చెందారు. రుక్మిణికి తీవ్రగాయాలయ్యాయి. ఆమె కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు వచ్చి ఇద్దరినీ బయటకు తీశారు. కృష్ణ మృతి చెందినట్లు గుర్తించారు. ఆమెను వెంటనే మత్తాలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి రుక్మిణికి మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అధిక బరువు వల్లే ట్రక్కు పడిపోయినట్లు కేసు నమోదు చేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ట్రక్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి భార్యకు తీవ్ర గాయాలు -
స్కూలుకు తాళం
పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ బ్లాక్ అల్లడ పంచాయతీలో లెంగడాగుడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మంగళవారం గ్రామస్తులు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు తరగతుల్లో 120 మంది చదువుతున్నారు. 2024లో ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అవ్వగా మిగతా ముగ్గురు టీచర్లలో ఒకరిని క్లస్టర్ రిసోర్సు సెంటర్ కోఆర్డినేటరు, మరొకరిని బీఎల్ఓ డ్యూటీకి డీఈఓ మాయధర్ సాహు వేశారు. వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అభ్యసిస్తున్న లెంగడాగుడ ప్రాథమిక పాఠశాలకు ప్రభుత్వ నిధులు మంజూరవుతున్నా ఇప్పటివరకూ హెచ్ఎం పదవిని ప్రభుత్వం భర్తీ చేయలేదు. దీంతో విద్యార్థులు చదువు చెప్పే వారు కరువయ్యారు. ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించేవరకూ ఈ పాఠశాల తెరవడం సాధ్యపడదని జెడ్పీటీసీ మాజీ సభ్యులు సుకాంతి శోబోరో, ఉపాధ్యక్షురాలు కవితా బిడికా, సమితి సభ్యురాలు పార్వతీ శోబోరో విలేకరులకు వివరించారు. -
డ్రైవర్ల సమ్మెతో నిలిచిన ఎరువుల గూడ్స్ రైలు
కొరాపుట్: డ్రైవర్ల సమ్మెతో రైతులకు నష్టం ఏర్పడింది. మంగళవారం ఒడిశా రాష్ట్ర ప్రైవేట్ డ్రైవర్ల సంఘం ఆకస్మిక సమ్మెకి పిలుపునిచ్చింది. దీంతో ఉదయం నుంచే డ్రైవర్లు స్టీరింగులు వదిలి ఆందోళనకు దిగారు. దీంతో ఈ సమ్మె రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. మంగళవారం వేకువ జామున 2,600 టన్నుల యూరియా ప్రత్యేక రైలు లో జయపూర్ స్టేషన్‌కి వచ్చింది. ఈ యూరియా లారీలు, వ్యాన్ల ద్వారా దుకాణాలకు,రైతులకు చేరాలి. కానీ డ్రైవర్ల నిరవధిక సమ్మెతో రైలు ర్యాక్ వద్దకి వాహనాలు రాలేదు. ప్రస్తుతం కొరాపుట్, మల్కన్ గిరి, నబరంగ్‌పూర్ జిల్లాల్లో లక్షలాది ఎకరాలలో మెక్క జొన్న పంట వేశారు. వారికి మెదటి దశ యూరియా తక్షణం అందాలి. కానీ డ్రైవర్ల నిరవధిక సమ్మెతో రైతుల తీవ్ర ఆవేదనకి గురయ్యారు. ఇరు జిల్లాలో డ్రైవర్ల సమ్మె కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో ప్రైవేట్ వాహన డ్రైవర్లు నిరవధిక సమ్మెకి దిగారు. దాంతో బస్సులు, లారీలు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. కొరాపుట్, సిమిలిగుడ, జయపూర్, బొరిగుమ్మ, నబరంగ్‌పూర్ పట్టణాల్లో డ్రైవర్ల ఆందోళన శిబిరాలు నడుస్తున్నాయి. మరో వైపు బుధవారం భారత్ బంద్ నేపథ్యంలో మంగళ వారం ప్రయాణాలు పెట్టుకున్నవారు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఆంధ్రా, తెలంగాణ, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అంతర్రాష్ట్ర బస్సులు కూడా నిలిచి పోయాయి.