
బీజేడీ యువనేత మృతి
కొరాపుట్: బీజేడీ పార్టీ యువ నాయకుడు వి.సతీష్ (41) అనారోగ్యంతో నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. గతంలో సతీష్ బీజేడీ పార్టీ విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షునిగా, యువజన విభాగాలలో పనిచేశారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇతని మృతిపై రాజ్యసభ ఎంపీ మున్నా ఖాన్, మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి, డాబుగాం ఎమ్మెల్యే మరోహర్ రంధారి, మాజీ ఎమ్మెల్యేలు ప్రకాష్ చంద్ర మజ్జి, సదాశివ ప్రదాని సంతాపం ప్రకటించారు.
నడవలేని వారికి
ఇంటివద్దే పింఛన్ అందజేత
కొరాపుట్: నడవలేని వారికి జయపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బి.సునీత వారింటికే వెళ్లి పెన్షన్ డబ్బులు అందజేశారు. శుక్రవారం 14వ నంబర్ వార్డులో 80 ఏళ్లు దాటిన వృద్దులకు రు.3,500 నగదుని స్వయంగా అందించారు. ప్రతి నెల సక్రమంగా అందుతున్నాయో లేదని వాకబు చేశారు. దళారుల మాట నమ్మ వద్దని, పెన్షన్ డబ్బులలో తక్కువగా ఉంటే తనకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ ప్రాంతంలో ఎవరికై నా పెన్షన్ రాకపోతే ఫిర్యాదు చేయాలన్నారు. వైస్ చైర్మన్ స్వయంగా వచ్చి డబ్బులు అందజేయడంతో వృద్ధులు తమ సాదకబాధ లు ఆమెతో చెప్పుకున్నారు.
‘ఆడపిల్ల పుడితే మొక్క నాటండి’
కొరాపుట్: ఆడపిల్ల జననానికి గుర్తుగా మెక్క లు నాటాలని నబరంగ్‌పూర్ అదనపు కలెక్టర్ తపన్‌కుమార్ కుంటియా పిలుపునిచ్చారు. శుక్రవారం నబరంగ్‌పూర్ జిల్లా డాబుగాం సమితి జునా పానీ గ్రామ పంచాయతీ కేంద్రంలో జరిగిన బేటీ బచావో–బేటీ పడావో, బిజూ కన్య రత్న పథకాల గురించి గిరిజనులతో జరి గిన అవగాహన సదస్సులో ప్రసంగించారు. ఆడ పిల్లల భవిష్యత్ కోసం ప్రభుత్వం అనేక రకాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అధికారుల నుంచి సమాచారం తీసుకోవాలన్నారు. ప్రతి ఆడపిల్ల భవిష్యత్ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని కుంటీయా అన్నా రు. కార్యక్రమంలో భాగంగా 30 మంది ఆడ పిల్లల తల్లులకు బేబీ కిట్‌లు అందజేశారు. ఆ ప్రాంతంలో 30 మంది ఆడ పిల్లల పేర్ల మీద పండ్ల మెక్కలు నాటారు.
పట్టుబడిన కాపర్ దొంగ!
శ్రీకాకుళం క్రైమ్: జిల్లాలో పలుప్రాంతాల్లో నిర్మాణ దశలో ఉన్న బిల్డింగ్‌ల వద్ద లక్షలు విలువ చేసే వైరులోని కాపర్‌ను దొంగిలించిన వ్యక్తి రెండో పట్టణ పోలీసుల అదుపులో ఉన్నాడని విశ్వసనీయ సమాచారం. శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడుకు చెందిన నిందితుడు ముందుగా హైదరాబాద్‌లో ఉండేవాడని.. జల్సాలకు అలవాటు పడి 2017, 2018, 2023లో ఇళ్లల్లో తలుపులు పగులగొట్టి చోరీలకు పాల్పడేవాడని, రెండో పట్టణ పోలీసులకు అప్పట్లో పట్టుబడినట్లు తెలిసింది. విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.
పేకాట శిబిరంపై దాడులు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని జెడ్పీ వెనుక గల కామేశ్వరి కల్యాణ మండపం సమీపంలో జరుగుతున్న పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్సు పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించినట్లు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. సీఐ కృష్ణమూర్తి నేతృత్వంలో దాడులు నిర్వహించగా ఐదుగురు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రూ.46,970 స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో బి.గోవింద, బి.ప్రసాద్, ఎస్.కె.ఆలీ, ఎం.మోహనకృష్ణ, ఎం.రాజశేఖర్ ఉన్నారు. వీరి వద్ద నుంచి ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒ కటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆమె నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని చంపాగల్లివీధిలో నివాసం ఉంటున్న అంధవరపు జయలక్ష్మి (68) అనారోగ్యం కారణంగా మృతి చెందారు. మరణానంతరం ఆమె నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కుమారుడు అంధవరపు సుబుద్ధి, కోడ లు సత్యవతి, జి.లక్ష్మిలు వలసయ్య ద్వారా విషయాన్ని రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరా వుకు తెలియజేశారు. మగటపల్లి కల్యాణ్ నేత్రసేకరణ కేంద్రం టెక్నికల్ ఇన్ చార్జి సుజాత, జగదీష్‌ల ద్వారా జయలక్ష్మి కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేక రణ కేంద్రానికి అందజేశారు. దాత కుటుంబ సభ్యులను రెడ్‌క్రాస్ ప్రతినిధులు అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842 699321నంబరును సంప్రదింవచ్చని కోరారు.

బీజేడీ యువనేత మృతి

బీజేడీ యువనేత మృతి

బీజేడీ యువనేత మృతి